వీరి మధ్య చార్వాకుల కాలం నుంచీ ఆసక్తికరమమైన చర్చ జరుగుతూనే ఉంది. 'అద్వితీయ శక్తులున్న భగవంతుడున్నారనే వాళ్ళందరూ ఒక వుదాహరణ తప్పకుండా చూపుతారు. దేవుడే లేకుంటే ఈ భూమి క్రమం తప్పకుండా ఎలా తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది? ఇన్ని గ్రహాలు, నక్షత్ర మండలాలూ దేవుడి నిర్దేశం లేకపోతే ఎలా తమ తమ కక్ష్యల్లో అంత క్రమంగా తిరుగుతాయి?' http://www.charasala.com/blog/?p=116
మొదట్లో మానవ పరిణామ క్రమంలో మనిషికి ప్రక్రుతిలోని సహజ సిద్ధమైన అగ్ని,
వర్షం, స్త్రీ గర్భం దాల్చి శిశువును కనటం లాంటివన్నీ ఎంతో వింతగా సంభ్రమాచ్యారాలు కలిగించేవిగా ఉన్నాయి. తనకు అర్థం కాని ఈ విషయలన్నింటినీ తనకు తెలియని ఎదో శక్తి నడిపిస్తోందనీ. ఆ శక్తే దైవమని నమ్మాడు. ఈ క్రమంలో అగ్ని దేవుడు, వరుణ దేవుడు,ఆది శక్తి జనించారు. భూగొళానికి వెలుగునిచ్చే సూర్యుని, చంద్రుడిని దేవుళ్లన్నాడు. గ్రహణాలకు అచ్చెరువొంది రాహు, కేతులు సూర్య చంద్రులను మింగేంస్తున్నారని అపోహపడ్డాడు. ఇంకా కాలక్రమంలో గ్రామ దేవతలు, ముక్కోటి దేవుళ్ళు వెలిశారు. విజ్ఞాన శాస్త్రవేత్తలు అగ్ని, వర్షం ఇంకా సృష్టి రహస్యాలు కనుక్కుంటున్న ఈ తరుణంలో ఆదిమ మానవుడి ఎన్నో సందేహాలకు , భయాలకు సమాధానం లభించింది. Darwin’s theory of evolution ను God's intelligent design గా మార్చి తమదే పైచేయి అందామనుకున్న మత చాందసులకు ఈ నూతన శాస్త్ర పరిశోధనలు మింగుడు పడటం లేదు.

చంద్రుడిపై మానవుడు కాలు మోపటం అబద్దమని, దాన్ని విశ్వసించవొద్దనీ ఈ చాందసవాదులు చెప్తున్నారు. ‘ఎదీ శూన్యం లోంచి రాదు‘ అని భౌతికవాదులు నమ్ముతారు. అట్లా వస్తే అది మాయా, మహిమా కాదు కనికట్టు అంటారు హేతువాదులు. శాస్త్రవేత్తలు గ్రహాలు,పాలపుంతలను దాటి మన ఊహకు అందని దూరంలో ఉన్న విశ్వ రహస్యాల ఆవిష్కరణకై నిరంతరం శ్రమిస్తున్నారు. మనకు ఒక విషయం తెలియనప్పుడు అది ఎంతో జటిలంగా కనపడుతుంది. ఆది మానవుడి ఊహకు అగ్ని, వర్షం పెద్ద పరీక్షే. ఈ రోజుకీ అంతుపట్టని విషయాలు ఇంకా ఉన్నాయి. ఒక దాని వెంబడి మరొకటిగా అన్ని చిక్కు ముడులూ విడుతున్నాయి.
ప్రశాంతి తను అప్పుడప్పుడూ వెంకయ్య స్వామితో మాట్లాడుతుందని నేను గతంలో రాసినదానిని కొంతమంది పాఠకులు తాము విశ్వసించజాలమని నాకు తెలిపారు. వెశేషమేమంటే ఇలా చెప్పినవారిలో ఆస్తికులు, నాస్తికులిరువురూ ఉన్నారు. దేవుడున్నడా లేడా అనే దానిపై చాలా చర్చ జరిగింది. ఉంటే దానికి నిదర్శన మేది అని హేతువాదుల ప్రశ్న. కంటికి కనిపించేదే సత్యమనీ, శాస్త్ర పరీక్షకు నిలిచేదే వాస్తవమనీ నమ్ముతారు వీరు. గాలి కనిపిస్తొందా - అయినా అది ఉంది కదా, అలాగే దేవుడున్నాడు కాని కనిపించడు అని ఆస్తికుల వాదన. దేవుడిని విశ్వసించేవారికే దేవుడు కనపడతాడు, మిగతా వారికి దేవుడు కనపడడని ఆస్తికుల వాదన. నిప్పు ఆస్తికులనూ , నాస్తికులనూ సమానముగా దహిస్తుంది. అట్లాగే దేవుడూ తను ఉంటే ఆస్తికులు,నాస్తికులిరువిరికీ ఇవ్వాలి దర్శనం అంటారు భౌతికవాదులు. ఈ వాద ప్రతివాదాలు అన్నీ వింటే దైవం వ్యక్తిగతమనీ, వస్తుగతం కాదనీ అవగతమౌతుంది. ఇంకాస్త ముందుకు వెళితే దేవునితో మాటలాడటం Schizophrenia అనే మానసిక స్థితి అని మానసిక శాస్త్రవేత్తల విశ్లేషణ. మానవ మెదడులో ఎన్నో రసాయనాలుంటాయనీ, Dopamine అనే రసాయన లోపం వలన మెదడులోని Neurotransmission వ్యవస్థ సరిగా నియంత్రించ బడక Schizophrenia అనే స్థితికి కారకమౌతుందని Psychiatrists చెపుతారు. కొంతమంది బాబాలు తాము దేవునితో మాట్లాడుతాం అనే భ్రాంతిలో ఉండి, భక్తులనూ నమ్మిస్తారు. భక్తుల నమ్మికే ఈ బాబాలకు కొండంత అండ. విత్తు ముందా, చెట్టు ముందా లాంటి చర్చలకు ముగింపు ఉండదు. నెల్లూరు పయనిస్తున్న మా వాహనం గమ్యస్థానం చేరింది.
కృష్ణ పట్నం
అప్పటికే రామకృష్ణ గారు వారి కార్యాలయం నుంచి ఇంటికి వచ్చియున్నారు. మధ్యాహ్న భొజనమయ్యాక అందరం కృష్ణ పట్నం వెళ్దానుకున్నాము. ఒక Tourist car లో బయలుదేరాము. విశేషమేమంటే చాల కాలంగా నెల్లూరులో ఉంటున్న రామ కృష్ణగారు గాని, అక్కడే పుట్టి పెరిగిన ప్రశాంతిగాని అంతవరకూ కృష్ణ పట్నం చూడనే లేదు. కృష్ణ పట్నం సహజ సిద్ధమైన లోతైన ఓడ రేవు. ఆంధ్ర దేశానికి ఇది కాబొయే మరో విశాఖ పట్నం. నెల్లూరునుంచి సుమారు 25 K.M. ల దూరంలో ఉంది. ఇక్కడనుంచి ఓడ రేవు దాకా Double lane road ఉంది. భవిష్యత్లో ఇది నాలుగు సందుల రహదారి కాబోతుంది. బెళ్ళారి నుంచి ఎగుమతయ్యే ఇనుప ఖనిజానికి ఈ రేవు చాల దగ్గరగా ఉంటుంది. 2007-2008 నుంచి చెన్న పట్నం నుంచి ఇనుప ఖనిజ ఎగుమతులు ఆపివెయనున్నారు కావున కృష్ణ పట్నంకు చాలినంత పనిఉండగలదు. కృష్న పట్నం నుంచి ఓబులవారిపల్లె (గుత్తి -రేణుగుంట స్టేషన్ల మధ్య) దాకా కొత్త రైల్వే లైన్ 114 కి.మీ. వేయటానికి కార్యక్రమాలు ప్రారంభమైనాయి. కడప జిల్లాలోని ఓబులవారిపల్లె నుంచి కొండలు, లోయలు లోంచి పలు Ghat Lines తో Eastern Ghats మీదుగా ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణం గావించ బడుతున్నది. 580 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని Krishnapatnam Rail Road Company Ltd నిర్మాణం గావించబోతున్నది.

Photo:cbrao ఉప్పు సేద్యం
కృష్ణ పట్నం కు వెళ్ళే దారిలో, రహదారి పక్కనే చాలా చేపల, రొయ్యల చెరువులున్నాయి. వీటినుంచి వచ్చే దుర్గంధము ముక్కుపుటాలదిరేలా ఉంది. అంతే కాక ఈ చెరువులు, కాలుష్య కారకులై సమీప గ్రామాల లోని ప్రజలకు తాగే నీరు లేకుండా చేస్తున్నాయి. దారిలో మాకు ఉప్పు మడులు కూడా కనిపించాయి. పొలాలలో గట్లు కట్టి సముద్రపు నీరు ఎండ బెట్టి ఉప్పు సేద్యం చేస్తున్నారిక్కడి రైతులు. ఇంకాస్త ముందు కెళితే మాకు బకింగ్ హాం కాలువ కనిపించింది. బ్రిటిష్ వారి హయాంలో ఇది ఒక వెలుగు వెలిగి ఇప్పటి పాలకుల నిర్లక్ష్యంతో పెద్దగా ఉపయోగించబడకుండా ఉంది.

Photo:cbrao బకింగ్ హాం కెనాల్
1806 లో బకింగ్ హాం కెనాల్ నిర్మాణం ప్రారంభించబడినది. తమిళ నాడు లోని మరక్కాణం నుంచి ఆంధ్ర ప్రదేష్ లోని క్రిష్ణా జిల్లా లోని పెద్దగంజాం దాక ఇది ఉంది. దక్షిణాన చెన్నై నుంచి మరక్కాణం (పాండిచెర్రికి ఉత్తరాన ఉంది)దాకా 163 కి.మీ ఉంది. ఆంధ్ర ప్రదేష్ లో ఈ కాలువ 257 కి.మీ. పొడుగుంది. 1876 మరియు 1878 లో కరువు కోరల్లో చిక్కుకున్న దక్షిణ భారతావనిని ఇది కాపాడింది. 1880 నుంచి 1940 దాక, తక్కువ ఖర్చులో ఇది ప్రజల మరియు సరకుల రవాణా సౌకర్యానికై బాగా ఉపయోగ పడింది. 1947 నుంచి దీన్ని ఉపయోగించటం తగ్గింది.1965 తుఫానుతో కాలువ దెబ్బతినింది. 2004 సునామి సందర్భంలో ఈ కాలువ సముద్రపు నీటికి అడ్డుకట్టై నిలిచి ఎందరో బెస్తవారిని, చాలా గ్రామాలను రక్షించింది. సముద్రానికి 1 కి.మీ. దూరంలో ఈ కాలువ కోస్తా తీరంలో ఉంది. అందమైన ఈ కాలువను కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో పూర్వ వైభవానికి తీసుకు వచ్చే అవకాశం ఉంది.
నెల్లూరు వెళ్తున్నానని హైదరాబాదులోని మిత్రులు మురళీ ధర్ కు చెప్పినప్పుడు కృష్ణ పట్నం గ్రామము నుంచి ఓడరేవుదాకా బకింగ్ హాం కెనాల్లో పడవలో వెళ్ళమని అది సరదాగా ఉంటుందనీ సిఫారసు చేసినారు. అదే విషయాన్ని రామకృష్ణగారికి చెప్పాను. మా కారు కొత్తగా వేసిన తారు దారిపై వెగంగా వెళ్తూ, కాపలా దారు సంజ్ఞతో హటాత్తుగా ఆగింది. కారు ముందు అద్దం లోంచి కృస్ణ పట్నం పొర్ట్ అని పెద్ద Board కనిపించింది. అంటే గ్రామానికి వెళ్ళి పడవలో ఇక్కడకు రావాలిసిన వాళ్ళం తిన్నగా ఇక్కడికే కారులో వచ్చామన్నమాట. Port లో పనులు జరుగుతున్నవి కావున ముందుకు వెళ్ళరాదనీ అక్కడే వెను తిరగాలనీ సూచించాడు. రామకృష్ణ గారికీ ఈ దారి కొత్త కనుక మా driver ఎటు తీసుకు పొతున్నాడో తనూ గమనించలేక పోయారు.








