సోమవారం, జనవరి 29, 2007

తెలుగు భోజనం

వీటిలో చాలా రకాలున్నాయి. నెల్లూరు ,కడప, హైదరాబాదు, గుంటూరు, గోదావరి వగైరా. దేని ప్రత్యేకత దానిదే. నేను గుంటూరు జిల్లాలో పుట్టడం వలన బాల్యం నుంచి అక్కడి వంటకాలు చిర పరిచితం. పండగొచ్చిందంటే ఈ వంటకాలు లేందే పండగ లేనే లేదు. గుంటూరు వంటల ఘుమఘుమల గురించి ఆ జిల్లాలోని సౌపాడు వాస్తవ్యులైన కన్నెగంటి రామారావు గారి మాటల్లో,చదవండి. రామారావు గారి పరిచయం కోసం ఇక్కడ చూడండి.

Food of Gods -- vayam dEvasya bhOjanam
As an ancient philosopher from AP [kanfusiyya S.] said, food is one of the few renewable pleasures of life. [The others being watching missamma for n+1'th time, etc ...]
When this nation celebrates the food-fest aka Thanksgiving day with Turkey, pumpkin pie, candied yams, cranberry sauce, green beans, etc., I can't help think of a thanks giving dinner of my own.
Obviously, this Telugu food fest must fall on Sankranti. This is as close to a food fest as we can get. The crops just would have come home and the villagers would be relaxing, counting the blessings of the land.
I would start my dinner with good khsheeraannam, with mudda pappu. It may look like a dessert, but we eat it before anything else. In fact, it symbolizes the beginning of an auspicious meal.
Next comes pulihOra with gOngoora pacchaDi. Yes, we do eat it with gOngoora pacchaDi in Guntur district. This pulihora must have green chillis, soaked in tamarind sauce for hours, so that even the non-spicy-food eaters will be tempted to taste them.
Next comes, of course, white rice, made from Nellore molagolukulu, no less. Not the pansy-wansy basmati rice to spoil the taste of pure andhra kooralu. Rice, in its purest form, must not contain those spices. These pulaos don't give our kooralu a suitable base.
Next, four kooralu come in a koora gutti. One of them must be vankaaya koora (brinjal koora). Infinite diversity exists in this koora, but I am partial to my mother's preparation made with fresh yoghurt and tender vankaayalu. I also like gutti vankaaya koora, the making of which is an art, mastered only in the households of konaseema, as most of the readers will attest.
The next koora, by popular consent, must be poTla kaaya paalu pOsina koora. For all the poor folks who forgot how it looks and tastes like, I can only say this: Too Bad!!
Next, by the way of kaarams, we must bring in kaakara kaaya vEpuDu. No where in the world they tamed this bitter character to produce such a tasty dish. Just enough bitterness to balance the hot taste of Guntur red chilli powder, and a hint of anakaapalli bellam, what do you say?
Since this is a festival, we will go all out and demand the very best! Yes, I mean, panasapoTTu koora, that food of Gods!! Green jack fruit, cut into small pieces, steamed and cooked to perfection, this is magic, not cooking!!
After completing these four kooralu with fresh neyyi, we can turn to the liquids of the day. Not the generic sambar and rasam!! We start with dappaLam, [with aanapa kaaya] and proceed onto pappu chaaru. By the side, some biyyapu vaDiyaalu should elivate eating to a gastronomic experience.
To finish of the meal, fresh yoghurt, [maahishancha Saraschandra chandrikaa dhavaLam dadhi] and nimma majjiga with ginger and green chillis and curry leaves. Do you want to eat anything more? We have ariselu, paalataaluku for the interested.
There you go. That is my idea of a thanks giving dinner on a cool afternoon in Sowpadu. You are all welcome to join me, but RSVP asap!!

గురువారం, జనవరి 25, 2007

సోమవారం, జనవరి 22, 2007

అడవిలో అర్థరాత్రి -2



డాక్టర్ ప్రవీణ్ E.N.T., Surgeon గా ఒక Corporate hospital లో పని చేస్తున్నారు. రాజీవ్ Nature tours conduct చేసే travel agency నడుపుతున్నారు. ఇద్దరికీ పక్షులంటే ప్రాణం. వీరితో డాక్టర్  గారమ్మాయి దీప్తి కూడా వచ్చింది. ఆమెకూ పక్షులంటే అనురక్తి. నిర్మల్ అటవీప్రాంత క్షెత్ర ముఖ్య అధికారి (D.F.O) వహీద్ గారు. వారి సలహాపై నిర్మల్ అటవీ ప్రాంతంలోని మామడ రక్షిత అడవి వైపు వెళ్ళాయి మా జీపు, డాక్టర్ గారి కారు. ఈ దారి నిన్న వెళ్ళిన దారికి వ్యతిరేక దిశలో ఉంది. మా జీపు నిర్మల్ పట్టణం లోంచి బయటకు అతి తక్కువ వ్యవధిలో రాగలిగింది. కారణం నిర్మల్ చిన్న ఊరవటమే. తెలంగాణలో పట్టణాలు కోస్తా జిల్లాలతో పొలిస్తే చిన్నవిగా అగుపిస్తాయి. ఇప్పుడిపుడే అభివృద్ధి చెందుతున్నాయి.

రహదారి వెంట అలా 20 K.M లు పరిగీత్తిన మా వాహనాలు అక్కడ దారి మళ్ళి, కుడి వైపుగా అడవిలోకి పరుగు తీశాయి. తారు రోడ్ పై వెళ్తున్న వాహనాలు కుడివైపుని చిన్న మట్టి దారి గుండా వెళ్ళి ఒక సరస్సుకు దగ్గరగా ఆగాయి. జీపు దిగి సరస్సు వైపు నడిచాము. సరస్సులో ఎడమవైపు దూరంగా రాతిపై రెండు తీతువు పిట్టలు ( Red - Wattled Lapwing ) కనిపించాయి. ఇవి, ఆడ, మగ పక్షులు ఒక మాదిరిగానే ఉంటాయి. ఆ రెండూ జంట కావచ్చు. నా ఎదురుగా ఉన్న సరస్సు దగ్గరి కెళ్ళాను. సరస్సు కావల కొన్ని River Tern పక్షులు కనిపించాయి. ఇవి సరస్సు చుట్టూ, సరస్సు పై పరిభ్రమిస్తూ, తమ ఆహారమైన చేపలు, చిరు కప్పలకై అన్వేషిస్తూ నా దగ్గరిదాక వచ్చాయి. నా కెమారా తో చాయ చిత్రం తేసే లోపల కెమరా కు అందనంత దూరంగా వెళ్ళిపొయాయి. సరస్సు చుట్టూ తిరిగి ఇంకో పర్యాయం నా వద్దకు వచ్చినా రెండో సారీ వాటి చిత్రం తీయ లేక పోయాను. కెమరా కు అందనంత వేగంగా ఉంది వాటి ఆహార అన్వెషణ.


Grey Heron

కొద్ది దూరంలో, రాళ్ళ పక్కన, నీటిలో కనిపించింది నారాయణ కొంగ (Grey Heron). సరస్సు అంచునే నడుస్తూ నెమలి నార చెట్టు (Holoptelia integrifolia) దగ్గరికి వచ్చాను. ఈ చెట్టుపై Blue tailed Bee eater వయ్యారాలు పోతూ కనిపించింది. మనకు హైదరాబాదు సమీపంలో ఎక్కువగా Green Bee eater కనిపిస్తుంది. Blue tailed Bee eater చూడటం నాకిదే ప్రథమం. అందంగా కనిపించింది.


Holoptelia integrifolia This tree is useful for making ropes.

Blue tailed Bee eater కి ఆశ్రయమిచ్చిన Holoptelia integrifolia చెట్టుని చూడండి. దీనిని నెమలి నార చెట్టు అంటారు. ఈ చెట్టులో మంచి నార ( fibre ) ఉండటం వలన తాళ్ళు పేనటానికి బాగా ఉపయుక్తంగా ఉంటుందీ చెట్టు. ఈ చెట్టు మొదలు చూడండి.


Look at roots – It indicates water level in rainy season.

నేల పై భాగాన కూడా వేళ్ళు ఉన్నాయి కదూ. దానికి కారణం ఊహించగలరా? సరస్సు నీటి ఎత్తు పెరిగినప్పుడు చెట్టుకు వేళ్ళు కనిపించేంత ఎత్తుదాకా నీటి మట్టం ఉంటుంది.

ఆ సమయాన నిర్మల్ అటవీప్రాంత క్షెత్ర ముఖ్య అధికారి (D.F.O.) వహీద్ గారు అక్కడికి వచ్చారు. వారు మాకు అడవి లోని ఎన్నో విశేషాల గురించి చెప్పారు. వారే స్వయంగా మా అందరికీ మార్గదర్శకులు అయ్యారు. అడవిలోని రక రకాల చెట్లను చూపుతూ వాటి గురించి వివరించ సాగారు. మొదటగా వారు మాకు బిల్లుడు (yellow chloroxylon swietenia) చెట్టు గురించి వివరించారు.
Furniture చెయ్యటానికి ఈ చెట్టు కలప వాడతారు. తరువాత మాకు Boswellia Serrata చూపించారు. దాని కాండం పై గీరితే ఎర్రటి స్రావం ద్రవించింది. దీనిని మందులలో వాడతారని చెప్పారు. అప్పటికి మధ్యాహ్నం రెండు గంటలయ్యింది. వంట వారు వారి పనిలో నిమగ్నమయ్యారు. వంట తయారు కావటానికి ఇంకా వ్యవధి ఉన్నందున వహీద్‌గారు మమ్ములను అడవిలోకి తీసుకు వెళ్ళారు.


Termite Mounds

దారిలో మాకు కనిపించాయి చెద పురుగుల పుట్టలు. అవి దాటి ఇంకా ముందుకెళ్ళాము. అడవిలో సరస్సు గట్టుపై నున్న సన్నని కాలి బాటలో నడుస్తున్నాము. దారికిరువైపులా చెట్లను చీల్చుకుంటూ ముందుకు నడుస్తున్నాము.


Golden Laburnum – Seeds are laxative for wild bears. Sri Waheed on extreme left

దారిలో కనిపించింది Golden Laburnum (Casia fistula). ఈ చెట్టు విత్తనాలను ఎలుగుబంట్లు విరోచన కారిగా వాడతాయని వహీద్ గారు మా అందరికీ వివరించారు. ఆ కాలి బాట వెంటే నడుస్తూ tank bund anicut వద్దకు చేరుకున్నాము. ఆ bund దాటి నేను, చౌదరి, గీత ఇంకా ముందుకెళ్లాము. అక్కడ సరస్సు దగ్గరగా కూర్చుని కాసేపు సేదతీరి అక్కడి చెట్లను, పిట్టలను వీక్షించి మరల anicut వద్దకు చేరుకున్నాము. ఎప్పుడో 1904 లో కట్టినట్లుగా అక్కడ ఒక శిలాఫలకం కనిపించింది. దానిపైగల వివరాలపై మకిలి చేరటంతో అందలి అక్షరాల వివరం తెలియరాలేదు. ఈ సరస్సు పేరు తురక చెరువు అని తెలిసిందీ శిలాఫలకం ద్వారా.


Birders in action

Anicut పై పక్షివీక్షకులు ఆశీనులై ఎదురుగా ఉన్న నెమలి నార చెట్టుపై గల పక్షులను వీక్షిస్తూ కనిపించారు. ఆ చెట్టు ఎన్నో రకాల పక్షులకు నివాసమై ఉన్నది. ఆ చెట్టుపై గల Verditer Flycatcher మిత్రులను ఎంతగానో ఆకర్షించింది.

మధ్యహ్నం 3.30 గంటలు కావస్తుంది. ఆకలి వేస్తుండటంతో తిరుగు ప్రయాణమయ్యి, మరల చెట్లను చీల్చుకుంటూ, సరస్సు ఒడ్డున వంటలు చేసే చోటికి చేరుకున్నాము. సన్నని కాలి బాటపై ప్రయా ణంలో నా binoculars caps ను ఏ చెట్టు రెమ్మలో గీచుకుని తమలో దాచుకున్నై. ఇవి సరికొత్తవి. అమెరికా నుంచి వచ్చిన ఈ Celestron Rooftop Prism Binoculars ఈ అడవిలోనే ప్రధమంగా వాడటం, వాటి మూతలు ఇలా పోవటం జరిగాయి. ఏమి చేస్తాము? మరల వెనుదిరిగి ఆనకట్టకు ఒంటరిగా వెళ్ళే సాహసం లేదు. భొజనం తయారవటంతో అందరం పళ్ళాలు తీసుకొని కావలిసినవి వడ్డించుకుని రాళ్ళపై కూర్చుని, సరస్సు అందాన్ని వీక్షిస్తూ భొజనం చేశాము. అప్పటికి సమయం నాలుగు దాటింది. అప్పుడు వహీద్ గారు చెప్పారు. మా అందరికీ రాత్రి బస అడవిలోనే అనీ అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయనీ, అర్థరాత్రి సమయాన అడవిలో జంతువులను చూడటానికి ప్రత్యేక విహారం ఉంటుందనీ. నేనడిగాను.' అడవిలో పులి, చిరుత పులి ఉన్నాయా అని? ‘ దానికి వహీద్ గారు నా ప్రశ్నకు సమాధానం, రాత్రి అడవికి వచ్చినప్పుడు చెపుతామన్నారు. అడవిలో రాత్రి బస విషయం మాకు ముందుగా తెలియదు. మా బట్టలు, మిగత వస్తువులు అన్నీ నిర్మల్ అతిధి గృహంలోనే ఉన్నాయి. మా బట్టలు, sleeping bags వగైరా తెచ్చుకోవటనికి నిర్మల్ వెళ్లాము. నిర్మల్ లో ఆదివారం సాయంత్రం, అత్యవసర వస్తువులైన mosquito coils, toilet tissue paper వగైరాలకు షాపింగ్ లో మాకు వస్తువులు పాక్షికంగానే లభ్యమయ్యాయి. Toilet tissue paper గగన కుసుమమే అయ్యింది. అతిధి గృహానికి చేరి, మా సామాను సర్దుకొని అడవికి రాత్రి బసకై బయలు దేరాము.

అడవికి చేరుతూనే మాకు స్వాగతం పలికాయి search lights. ఆ వెలుతురులో సరస్సు చేరి, అప్పటికే అక్కడ ఏర్పాటు చేయబడిన గుడారము (tent) వద్దకు చేరాము. మా వెనుకే దాక్టర్ గారి కారు వచ్చి చేరింది. ఆ తరువాత వహీద్ గారు వచ్చారు.


Camp fire in forest: Left to right Sweta, D.F.O., Waheed, Sheetal

Tent ముందర camp fire చుట్టూ అందరం చేరి కబుర్లలో పడ్డాము. ఈ తీరిక సమయంలో సభ్యులందరూ వారిని వారు పరిచయం చేసుకున్నారు వహీద్ గారితో. వహీద్ గారు నిర్మల్ data book చూపించి వారు సేకరించిన విషయాలను అందులో చూపెట్టారు. నిర్మల్ అటవీ సంపద, వన్యప్రాణుల, పక్షుల వివరాలు అందులో ఉన్నాయి. అర్జున్ మేము చూసిన పక్షుల వివరాలన్నీ ఒక పుస్తకములో నమోదు చేస్తూ ఉన్నాడు. ఆ వివరాలను అర్జున్ వహీద్ గారికి వివరించటం జరిగింది.


Rajeev inspecting the tent. Shafatulla, Vice-President of BSAP in Olive green military uniform, looks on.

రాజీవ్ తనతో పాటు తెచ్చిన, విదేశాల నుంచి దిగుమతి కాబడ్డ గుడారాన్ని తక్కువ వ్యవధిలో ఎలా ఇల్లు గా మార్చవచ్చో వివరంగా చేసి చూపారు. అలాగే ఒక మంచాన్ని కూడ కూర్చే ప్రయత్నం చేశారు కానీ, తనకూ అభ్యాసం లేకపోవటం తో కొద్ది సేపు ప్రయత్నించి ఆ పై విరమించారు. ఈ tent ను ఆ రాత్రి స్త్రీలకు కేటాయించారు.

ఆ రాత్రి భోజనాలయ్యాక మరలా camp fire చుట్టూ చేరాము. కాసేపు కబుర్లయ్యాక సభ్యులందరినీ రెండు భాగాలుగా చేసాక, మొదటి భాగం వారు వహీద్ గారి నాయకత్వంలో అడవిలో వన్య ప్రాణులను చూడటానికై బయలుదేరి వెళ్ళారు. వారు తమ వెంట శక్తివంతమైన search light తీసుకుని వెళ్ళారు. అడవిలో వన్యప్రాణులు మనము పట్టణంలో zoo లో చూసినంత సులభంగా కనపడవు. కానీ మనం ఏమాత్రం ఊహించని సమయంలో ఏ చిరుతపులో అకస్మాతుగా ఎదురు కావచ్చు. పక్షులను చూడటానికి రాజాజి అభయారణ్యానికి (హరిద్వార్ వద్ద వుంది) వెళ్ళినప్పుడు మాకు అకస్మాతుగా జీపు కెదురుగా చిరుతపులి రోడ్ దాటుతూ కనిపించింది. అదృష్టం అంటారే అది కూడా జతైతేనే మనకు వన్య ప్రాణులు కనిపిస్తాయి. ఈ మొదటి batch వారికి ఎలాంటి జంతువులు అగపడలేదు. రెండవ batch రాజీవ్ ఆధ్వర్యంలో, forest guards తోడు రాగా బయలుదేరింది; తమ అదృష్టాన్ని పరీక్షించు కోటానికై. నేను రెండవ batch లో ఉన్నాను.
- సశేషం

బుధవారం, జనవరి 17, 2007

కొల్లేరు చూద్దాము రండి

AtUppalapadu
Painted Stork Photo by cbrao

అడవిలో అర్థరాత్రి చదివాక మాకు చెపితే మేమూ అడవికి వచ్చే వాళ్ళము కదా అని కొందరన్నారు. అట్లా అన్నవారికీ, మీకూ ఇప్పుడు ఒక మహదవకాశం కొల్లేరు చూడటానికి.

అసలు కొల్లేరు ప్రత్యేకత ఏమిటి?
దక్షిన భారతదేశం లో అతి పెద్ద మంచి నీటి కయ్యే కాకుండా చిత్తడి నేలల ప్రకృతి ఆవాసం ఇది.

కొల్లేరులో ఏమి చూడవచ్చు?
ఈ చలన చిత్రం చూడండి.

http://www.bitingsparrow.com/biosymphony/kolleru.wmv


నాకు కొల్లేరు గురించిన మరింత సమాచారం కావాలి.
ఇక్కడ చూడండి.

http://www.india-tours.com/wildlifeinindia/kolerusanctuary.htm


ఈ యాత్ర ఎప్పుడు?ఎలా? ఎంత ఖర్చవుతుంది?

23 February సాయంత్రం సికందరాబాదు నుంచి గౌతమి లో ప్రయాణం. 25 February 2007 సాయంత్రం ఏలూరు నుంచి గోదావరిలో తిరుగు ప్రయాణం. Birdwatchers Society of Andhra Pradesh వారు ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. రైలు, జీపు, పడవ, వసతి ఖర్చులన్నీ కూడి సుమారు 1500/- రూపాయలు.

నాకు కొల్లేరు చూడాలని ఉంది. ఏమి చెయ్యాలి? ఎవరితో మాట్లాడాలి?

శ్రీ షఫతుల్లా గారిని సంప్రదించండి సెల్ సంఖ్య : 9989635223

త్వర పడండి. కొద్ది సీట్లే ఉన్నాయి.

మంగళవారం, జనవరి 16, 2007

పండగ నాడు కూడా పాత మొగుడేనా?

ఇది ఎక్కువమందికి తెలిసిన తెలుగు సామెత. కాని ఈ సామెత పుట్టు పూర్వోత్తరాలు మనలో ఎంతమందికి తెలుసు? ఈ సామెత వెనకున్న కథే ఇది. కొన్ని వందల సంవత్సరాల క్రితం కంచుకోత్సవం అనే పండగ జరిపే వారు. ఇందులో గ్రామం లోని వారంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొనే వారు. దీనిని మనం రవికల పండుగ అని కూడా పిలవవొచ్చు. కంచుకం అంటే రవిక అని అర్థం. ఆ పండగ నాటి సాయంత్రం గ్రామ స్త్రీ, పురుషులంతా ఒక చొట కలిసే వారు. సాధారణంగా ఇది గుడి ప్రాంగణంలోనో లేక బయటో ఉంటుంది. స్త్రీలంతా రవికలు విడిచి ఒక చోట గుట్టగా పోస్తారు. పురుషులు ఆ గుట్టలోంచి తలా ఒక రవికను గ్రహించి, ఆ రవికను ఎత్తిచూపుతూ, ఎవరిదీ రవిక అని అడుగుతూ ఆ రవిక స్వంత దారు ఎవరో కనుగునే ప్రయత్నం చేస్తారు. ఆ రవిక నాదే అంటూ వచ్చే స్త్రీకి, ఆ రవిక తెచ్చినవాడే, ఆ రాత్రికి రమణుడు. ఒక సారి ఒకతను ఇలానే రవికనెత్తి చూపుతూ ఎవరిదిది అంటూ కేకవేస్తె ఆ రవిక స్వంతదారు ముందుకొచ్చి నాదే అందట. ఆ రవిక తెచ్చిన వాడు దురదృష్టవశాత్తు ఆమె విభుడే అవటంతో ఆమె ' పండగ నాడు కూడా పాత మొగుడేనా ' అని నిట్టూర్చిందట.

ఈ విషయమై మరింత సమాచారం కోసం తాపీ ధర్మారావు గారి 'దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు?' చదవండి.

గురువారం, జనవరి 11, 2007

Bhadra Wildlife Sanctuary

యతిన్ వన్య ప్రాణి ప్రేమికుడు. బెంగళూరు లో ఉంటారు. తను చూసిన భద్ర వన్య ప్రాణ సమ్రక్షణ ఆవాశము (కర్ణాటక) మనకూ చూపిస్తున్నారు ఈ చలన చిత్రంలో. పదండి ఆ అడవిలో విశేషాలు మనమూ చూద్దాం....

మంగళవారం, జనవరి 09, 2007

సంక్రాంతి కానుక

పాపాయి పుట్టింది - పాప పేరు - ఈతెలుగు.ఆర్గ్ (org)


Click on photo to enlarge

తెలుగు బ్లాగరుల సమావేశం జనవరి 7, 2007 న హైదరాబాదు కేంద్రియ విశ్వవిద్యాలయావరణలో జరిగింది. ఎప్పటిలా కాకుండా, డిసెంబర్ మాసపు ప్రతిపాదనలు తెలుసుకొన్న మిత్రులు, దగ్గర, దూరం నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. నూతన సంవత్సరపు తొలి సమావేశం చారిత్రాత్మకంగా నిలిచిపోగలదు.

చావా కిరణ్ తెలుగు బ్లాగు అనే విత్తనం నాటితే, వెంకట రమణ నీళ్లు పోశాడు. మొలిచిన మొక్కకు పాదు చేసి నీరు, వెలుతురు సమృద్ధి గా అందేట్లు చేసింది వీవెన్, నిద్రలో లేపినా తెలుగు అని పలవరించే కిరణ్ (Veetel). వీరు కాక కంప్యూటర్లో తెలుగు అక్షరాల వృద్ధికి పాటు పడిన అక్షర శిల్పులు,బాషా ఇండియా పురస్కార గ్రహీతలు, నూరు బ్లాగుల అందగాడు సుధాకర్,చక్కటి తెలుగు బ్లాగులు మనకు నిత్యం అందిస్తున్న తెలుగు మిత్రులు, ఇంక ఎందరో మహాను భావులు, అందరికీ వందనాలు.

ఈ సందర్భంలో దిసెంబర్ 2004 లో మొదలయిన తెలుగు విజ్ఞాన సర్వస్వం వికిపిడియా నిర్మాణానికి దోహదపడిన మిత్రులగురించి రెండు ముక్కలు చెప్పుకుందాము. వెన్న నాగార్జున ఆధ్వర్యం లో మొదలయిన ఈ విజ్ఞాన సేద్యం చావా కిరణ్, త్రివిక్రం, దాట్ల శ్రీనివాస రాజు, G.S.నవీన్, మాకినేని ప్రదీపు, T.సుజాత,వివిన మూర్తి,చిట్టెల కామేష్,వర్మ దాట్ల,కాజ సుధాకర్ బాబు మొదలగు కృషీవలురు దుక్కి దున్ని తే, వచ్చిన ఫలసాయాన్ని మనకు అందిస్తున్నారు వైజాసత్య, చదువరి. గతంలో ఎంతో చురుకుగా పనిచేసిన, ఇప్పుడు పనిచేస్తున్న వారందరికీ వందనాలు. ఈ నిత్య కృషీవలురు మన తెలుగు వికిపిడియా కు మరింత శోభ తీసుకు వస్తారని ఆశిద్దాం.


Click on photo to enlarge
Members with gifts – Left to right – Trivikram, Sriharsha, Veeven, Chaduvari, cbrao, Venkata Ramana, Chandra Sekhar, Srinivasa Raju and Kashyap

సమావేశం ఆరంభమవుతూనే అందరికీ చదువరి అంద చేశారు నూతన సంవత్సర కాలెండర్లు. ఉచిత పుస్తక ముద్రణ లో మనకు సాయ పడిన మురళీధర్ గారి సౌజన్యంతో. అవి మురళీధర్ గారి travel agency calendars. తరువాత సుధాకర్ అందరికీ అంద చేశారు ఒక అందమైన బంతే కాక visiting card holder ను. బంతులు అందాయి http://www.mugh.net/ వారి సౌజన్యంతో.ఈ బంతులతో exercise చేస్తే మన చేతి వేళ్లు ఉంటాయి మంచి working condition లో.ఇక అందరికీ శీతల పానీ యాలు అందాయి సి.బి.రావు సౌజన్యంతో.


Click on photo to enlarge
Let us go to peacock lake


Click on photo to enlarge
Medium Egrets

హైదరాబాదు కేంద్రియ విశ్వవిద్యాలయావరణలో balancing rocks, peacock lake, lotus lake వగైరా సుందరమైన ప్రదేశాలున్నాయి. తొలి కలయిక తర్వాత అందరం బయలు దేరాము నెమళ్ళ సరస్సు దగ్గరికి. నెమలి కనిపించలేదు కాని సరస్సులో కొన్ని Median Egrets తెల్ల కొంగలు, Bronze-winged Jacana, Little Cormorants నీటి కాకులు కనిపించాయి.


Click on photo to enlarge
Bronze – winged Jacana


Click on photo to enlarge
Little cormorants on the lake

సరస్సుకావల కనిపించిది sports complex దూరంగా.


Click on photo to enlarge
Sports complex –behind the campus of University of Hyderabad

సరస్సు కనిపిస్తూ ఉండే ఎత్తైన కొండ రాయిపై అందరం ఆసీనులమై కబుర్ల లో పడ్డాము. కాశ్యప్ కొత్త నినాదం - 'తెలుగు బ్లాగులు చదవొద్దు,వినండీ’ అని. వివరాలకు చూడండి http://kaburlu.wordpress.com/2007/01/07/13/


Click on photo to enlarge
Left to right 1st row Kashyap, sudhakar
2nd row Chandrasekhar, Chaduvari, Sriharsha, Veeven
3rs row Srinivasa Raju, Venkata ramana, Trivikram

చదువరి అభ్యర్ధనపై సి.బి.రావ్ వివరించారు తెలుగు బ్లాగరుల ఐక్యత వలన కలిగే లాభాలు. మన సభ్యులు ఎవరిని కలిసి తెలుగు బ్లాగులు, వికిపిడీ గురించి చెప్పబోయిన ప్రతిసారీ, వారిని వారు పరిచయం చేసుకునే సందర్భంలో 'identity crisis' వస్తూ ఉంది. మనము సంఘము ఏర్పర్చుకుని ఉంటే ఈ సమస్య రాదు కదా. ఇక సంఘంగా ఏర్పడ్డాక మన ప్రధాన గమ్యాలు ఇవిగో.

1) కంప్యూటర్లో తెలుగు వాడకానికై చేయూత.
2) తెలుగు బ్లాగుల అభివృద్ధికై కృషి.
3) తెలుగు వికిపిడియ గురించి నలుగురికి చెప్పటం, కొత్త సభ్యులకై కృషి, విస్తృత పరచటం.

చీకటి పడబోతుంది, చుట్టూ ఉన్న చెట్ల పొదల్లోంచి పాములు బయటకు వచ్చే వేళవటంతో, సమావేశ స్థలిని అల్పాహారశాల కు మార్చాము. సి.బి.రావు సభ్యులకు సంఘ నియమావళి గురించి వివరించాక కార్యనిర్వాహక సభ్యుల ఎంపిక ప్రక్రియ మొదలయ్యింది. తనను సంఘ అధ్యక్షుడిగా ఉండమన్న అభ్యర్ధనకు సి.బి.రావు జవాబిస్తూ తాను అప్పటికే చాల సంఘాలలో ముఖ్య పదవుల్లో వుండటం వలన, ఇంకేమి పదవులు వద్దనీ, సంఘానికి అవసరమైన పనులు చేయటానికి ఎప్పుడూ ముందుంటానని చెప్పారు. ఆ తదుపరి జరిగిన ఎకగ్రీవ ఎన్నికలలో ఎన్నుకున్న వారి వివరాలివి.

అద్యక్షుడు శిరీష్ కుమార్
ఉపాధ్యక్షుడు త్రివిక్రం
కార్యదర్శి సుధాకర్
కోశాధికారి వెంకట రమణ
కార్యనిర్వాహక సభ్యులు
వీవెన్
సి.బి.రావ్
శ్రీహర్ష
కాష్యప్

కొత్త సంఘమునకు ఈతెలుగు.ఆర్గ్ అనే పేరు సముచితముగా ఉండగలదని,సమావేశానికి హాజరైన వారు అభిప్రాయ పడ్దారు. ఇందులో చేరుటకు అభిలషించు వారు ప్రవేశ పత్రాన్ని నింపి కార్యదర్శికి దరఖాస్తు చేసు కోవాలి. ప్రవేశ రుసుము నిర్ణయింప బడలేదు. Rs.500/- ప్రవేశ రుసుము సముచితంగా ఉండగలదని భవదీయుని అభిప్రాయము. సభ్యుల రచనలతో ఆకర్షణీయమైన పుస్తకమచ్చు వెయ్యవలెననే ప్రణాళిక గలదు. మన సంఘము పేరు మీకు నచ్చగలదని ఆశ. సంఘ నియమావళి తయారు చేసే పని సభ్యులు సి.బి.రావ్ కు అప్పచెప్పారు. పది రోజుల్లో నియమావళి (Bye-laws) తయారు కాగలదని అంచనా. మరి ఇక్కడి మన కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి. etelugu.org తరపున మీ అందరకూ సంక్రాంతి శుభాకాంషలు.

Text & Photos: cbrao

శనివారం, జనవరి 06, 2007

స్పానిష్ మిత్రుడు



ఈ రోజు మీకు ఒక మంచి Spanish photo blog ను పరిచయం చేస్తాను. నాకు ఈ స్పానిష్ బ్లాగు ఎలా తెలిసింది అనే కుతూహలం మీలో ఉండటం సహజం. దాని వెనక ఉన్న చిన్న కథే ఇది. నేను ఈ మధ్య రాసిన అడవిలో అర్థరాత్రి అనే వ్యాసానికి అనూహ్యమైన స్పందన వచ్చిందని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. దాదాపుగా 50 hits per day వచ్చాయి. నిన్న నా mail box చూస్తుంటే Spain blogger Joan González అడవిలో అర్థరాత్రి వ్యాసంపై తను రాసిన వ్యాఖ్య నన్నాకర్షించింది. అతని వ్యాఖ్య 'bonitas fotos salut joan' చూడగానే బెంబేలెత్తిపోయా. మెచ్చుకుంటూ రాశాడా, చిత్రాలు బాగా లేవని రాశాడా, లేక ఇంకేమైనా రాశాడా? అని కుతూహలం కలిగింది. కాని నాకు Spanish language రాదే, ఎలా అని ఆలోచన లో పడ్డాను. అలా మేధొమధనం జరుగుతుండగా ప్రత్యక్షమంది Google. అంతే కాదు నాకు గూగులోపదేశం చేశింది.
స్పానిష్ రాదనీ దిగులు చెందకూ,
పక్షికెవరు ఎగుర నేర్పిరి ,
చేపకెవరు ఈత నేర్పిరి,
మనిషికెవరు మాప్స్ Maps నేర్పిరి,
నేనున్నానని, నీ తోడుంటానని,
అని అన్నదీ నా గూగుల్,
ఇచ్చిందీ అభయహస్తం.

అంటూ Google language tools నాకు ప్రసాదించింది. ఇదుగొ అది - మీ ముందు.
http://translate.google.com/translate_t

ఈ Google launguage tool సహయం తో అతను రాసింది స్పానిష్ నుంచి ఆంగ్లం లోకి అనువదిస్తే ఇలా వచ్చింది.
Original text: Automatically translated text:
bonitas fotos salut joan pretty photos salut Joan

అమ్మయ్య చాయా చిత్రాలు బాగా ఉన్నాయని రాశాడని గ్రహించాక మనసుకు ఊరట కలిగింది. Joan González ఇచ్చిన లింక్ తో అతని బ్లాగుకు వెళ్లాను. ఆశ్చర్యం - అద్భుతమైన చాయా చిత్రాలు కనిపించాయి, ఆ బ్లాగులో. కుతూహలంతో అతని profile చూస్తే ఇలా కనిపించింది.

About Me

Vive y deja vivir

Interests
•Montaña
•Naturaleza
•Viajar

మరలా Google translator సహయంతో వీటి అర్థం తెలుసుకున్నా.

About Me

Vive y deja vivir it lives and it lets live

Interests
•Montaña • Mountain
•Naturaleza • Nature
•Viajar • Viajar


Google translation perfect కాదు. ఒక rough idea మాత్రం మనకు దొరుకుతుంది. Viajar అనే పదానికి గూగుల్ అనువాదం చెయ్యలేక పొయ్యింది. బహుశా ఇది voyager అనే పదం కావచ్చు. Spanish to english dictionary –
http://www.spanishdict.com/AS.cfm?e=Viajar+
సాయంతో (ఇది కూడ google search లో తెలుసుకొన్నా) దీని అర్థం కనుక్కున్నా.

Spanish Word English Word
viajar to travel

గూగుల్ చేసిన సాయంతో కృతజ్ఞతగా పాడుకున్నా 'అంతా గూగుల్ మయం' అని. సరే, ఇక ఆ బ్లాగరి చిరునామా ఇదిగో.
http://j-gonzalez.blogspot.com/

ఇందులోని చక్కటి చిత్రాలు మీరూ చూసి ఆనందించండి. మీకూ నచ్చితే,అతనిని అభినందిస్తూ ఒక జాబు Spanish లో ఎలా రాయాలో ఇప్పుడు మీకు తెలుసు.

సోమవారం, జనవరి 01, 2007

అడవిలో అర్థరాత్రి

డిసెంబర్ 23 2006 న అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ కు ప్రయాణం. ఉదయం 7 గంటలకు సికందరాబాద్ జుబిలీ బస్ స్టేషన్ నుంచి బయలుదేరే బస్ కొరకు నేను స్టేషన్ చేరేసరికే అక్కడ BSAP (Birdwatchers society of Andhra Pradesh) సభ్యులు ఉత్సాహంగా పక్షుల గురించి మాట్లాడుతూ కనిపించారు. తోటి పక్షిమిత్రులకు హాయ్ చెప్పి నేనూ వారితో కబుర్లలో పడ్డాను. పోయిన సంవత్సరం ఇదే సమయంలో మేమంతా డెహరాడూన్ యాత్ర లో ఉన్నాము. ఆ యాత్ర మా మదిలో మరుపురానిదిగా మిగిలి పోయింది. అక్కడి Wildlife Institute of India (WII) లో మా బస, మేము చూసిన రాజాజి నేషనల్ పార్క్, ముస్సొరీ లో మంచు తో ఆడిన ఆటలు, మాకు కనిపించిన అనేక పక్షులు, జంతువులు (చిరుతపులి వగైరా రాజాజీ పార్క్ లో ) మా మదిలో ఇంకా మెదలుతూ ఉండగానే నిర్మల్ కు ప్రయాణం - అక్కడ ఏం చూడబొతున్నమో అనే ఉత్సుకత అందరిలో కనిపించింది.

15 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరిన బస్ దారిలో కామారెడ్డి లో ఆగాక అక్కడి కాంటీన్లో మా ప్రాతఃకాల భోజనము (Breakfast)చేశాము. బస్ అనేక గ్రామాలను, అడవులను దాటుకుంటూ నిర్మల్ కు సుమారు 12.30 గంటల ప్రాంతంలో చేరింది. నిర్మల్ ఊరు చేరక ముందే మాకు రహదారికి ఒక పక్క కోట, మరో పక్క కస్సార్ చెరువు అందలి బొల్లి కోళ్ళు (common Coots) కనిపించాయి. ఇంకా మరికొన్ని పక్షులైతే కనిపించాయి కాని బస్ వెగంగా వెళ్ళటంతో వాటిని గమనించలేక పోయాము. బస్ సారధిని (Driver) ను అభ్యర్దించి నిర్మల్ పట్టణంలో రహదారి పక్కనే ఉన్న అటవీ సంరక్షణాధికారి కార్యలయం ముందే బస్ దిగి , కార్యాలయ ఆవరణలోనే ఉన్న అటవీ అతిధి గృహంలో బస చేశాము. కొద్దిసేపు విశ్రమించి, ఉడిపి హోటల్లో భోజనము కావించి కుంతలా జలపాతము చూడటానికై బయలు దేరాము.

కుంతలా జలపాతము


Come, join our tour to Kumtala falls

కుంతలా నిర్మల్ పట్టణం నుంచి 45 కిలో మీటర్ల దూరములో ఉంది. అదిలాబాద్ రహదారిలో కుడి వైపు తిరిగి సుమారు 4 K.M. దూరం వెళ్తే కుంతలా వస్తూంది. 1974లో దీనిగురించి మొదటిసారిగా విన్నాను. ఇన్నాళ్ళకు దీనిని చూశే అవకాశం కలిగినందుకు ఆనందిస్తూ, కుంతలా వైపు మా ప్రయాణం సాగించాము. నిర్మల్ నుంచి అదిలాబాద్ వైపు వెళ్ళే రహదారిగుండా మా జీపు పయనిస్తుంది. నిర్మల్ దాటు తూనే అడవి మొదలయ్యింది. ఇంకొంచెం ముందు కెళ్ళాక కొండల పై (Ghat road) మలుపులు తిరుగుతూ సాగింది మా ప్రయాణం. ఈ కొండ మార్గంలో మాకు దారి పొడగూతా కోతులు కనిపించాయి. ఒక చోట కారు కింద పడి మరణించిన కోతి కళేబరం కూడా కనిపించింది. వాహనాల కింద పడి ఇలా వన్య ప్రాణులు ప్రాణం కోల్పోవడం, దేశంలోని అనేక జాతీయ వనా ల్లో జరుగుతూనే ఉంది. వాహన చోదకులు వన్య మృగాలు రహదారి దాటుతున్నప్పుడు జాగ్రత్తగా వాహనం నడిపితే వీటిని నివారించవచ్చు. టేకు చెట్ల అడవి గుండా మా ప్రయాణం సాగి కుంతలా చేరుకున్నాము.

Tree growing on a rock


View of forest around Kumtala falls

కారు నిలిపిన స్థలము నుంచి కుంతల వెళ్ళుటకు రెండు రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి) సహజసిద్ధమైన రాళ్ళ గుండా ఎగువ కుంతలా నుంచి దిగువ కుంతలా కు దిగుతూ వెళ్ళటం. రెండు) మానవ నిర్మితమైన మెట్ల ద్వార దిగువ కుంతల వైపు ప్రయాణం. అక్కడి స్థానిక దారిచూపేవాడు (Guide) మమ్ములను మొదట రాళ్ళ ద్వారా కొంత దూరం తీసుకెళ్ళాడు. లాభం) తక్కువ దూరంలో జలపాతం దిగువకు కిందకు వెళ్ళవచ్చు. నష్టం) ఇట్లా దిగటం కష్టం. పడే ప్రమాదం ఉంది. ఎముకలు విరుగకలవు.

Birders at upper Kumtala


Birder's dilemma - Is it Yellow Wagtail or
Grey wagtail?

ఎగువ కుంతలా నుంచి మంచి దృశ్యం -ఎదురుగా పెద్ద కొండలు , కింద లోయ , చిన్న తటాకాలు,చెట్లూ , వినీలాకాశం సుందరంగా కనిపించాయి.

View from upper Kumtala

ఇందాక ఏటవాలుగా కొండ దిగితే, కొండపైకి తక్కువ దారిలో వెళ్ళటానికై ఈ సారి నిట్టనిలువుగా కొండపైకి వెళ్ళటం. కొంత దూరం వెళ్ళాక నేను balance తప్పి పడ్డాను. నా వెనుక గీతా శ్రీనివాసన్ ( Software engineer working in a M.N.C., at Gachibowli, Hyderabad) ఉంది ఆ సమయంలో. నేను పడటానికి కొన్ని కారణాలు. మెడకు Binoculars, భుజానికి Camera bag వెళాడుతున్నాయి. జిగ్-జాగ్ గ కాక నిలువుగా నడిచే ప్రయత్నం. అలా కాకుండా Binoculars Camera Bag లో పెట్టి, ఆ పెట్టెను నా చేతికందినంత పైభాగానికి చేరవేసి, నేను జిగ్-జాగ్ గా పైకి ఎక్కివుంటే ఇలా పడి ఉండెడి వాడిని కాను. ఇలాంటి అనుభవాలే మనకు పాఠాలు నేర్పుతాయి. అంతే కాదు. కొండ మెట్లు ఎక్కే సమయంలో నిటారుగా కాక జిగ్-జాగ్ > గా నడిస్తే అలసట తగ్గువగా ఉంటుంది.

మొత్తానికి పడి లేచి కొండ పైకి వెళ్ళేసరికి అక్కడ కొంత మంది పక్షి ప్రియులు పక్షులను వీక్షిస్తూ కనిపించారు. కుల్కర్ణి మెట్ల దారిగుండా దిగువ జలపాతం దగ్గరికి వెళ్ళి ఉండటంతో ఆయన్ను పిలవటానికి అర్జున్ గైడ్ తో కలిసి కిందకు వెళ్ళటం తో నేను కూడా కిందకు బయలు దేరాను.మిగతా వారు పైనే ఉండి పక్షులను వీక్షిస్తామన్నారు.


Steps to lower Kumtala falls view

మెట్ల కిరువైపులా రక రకాల అడవి చెట్లు నన్ను స్వాగతించాయా అన్నట్లుగా చల్లని, చక్కనైన,పరిశుద్ధమైన గాలి వీచ సాగాయి. మెట్ల రహదారి, సుందరమైన చెట్లతో ఎంతో రమ్యంగా ఉంది. వడి వడిగా మెట్లు దిగి దిగువ జలపాతం వైపు నడిచాను. దూరంగా కుల్కర్ణి, అర్జున్ కనిపించారు. జలపాతం చాయా చిత్రాన్ని తీయటానికై అనువైన ప్రదేశం వైపు వెళ్ళి ఎకధారగా కిందకి ఉరుకుతున్న కుంతలా జలపాతాన్ని నా కెమారా లో బంధించాను.

Scenic Kumtala falls

బాపు సినిమా సీతాకల్యాణం లో గంగావవతరణం లోని గంగ గుర్తుకొచ్చింది కుంతలా ను చూస్తుంటే. పైనుంచి కిందకు స్వేతాంబర ధారియై ఉరుకుతూ ఉంది కుంతలా. జలపాతం దగ్గరికెళ్ళాలని ఆ నీటి తుంపర్లలో సెదతీరాలని ఎంతగానో అనిపించింది. ఈ సమయంలో కుల్కర్ణి, అర్జున్ పైకి వెళ్ళిపోవటంతో మా గుంపులో నేను ఒక్కడినే కొండ కింద మిగిలాను. పైన ఉన్నవారు నా కోసం వేచిఉంటారు అన్న ఆలోచనతో, దూరంగా వున్న కుంతలా కు వీడ్కోలు చెప్పి, కొండ పైకి మెట్ల మీదుగా వడి వడి గా నడవ సాగాను. దిగటంలో ఉన్న హాయి, మెట్లు ఎక్కటంలో లేదని అతి త్వరలోనే ఎక్కువవుతున్న నా ఉచ్చ్వాశ నిస్వాశలు తెలిపాయి. గుండె కొట్టుకునే వేగం ఎక్కువైంది. ఆ అతివేగంలో గుండె ఏమవుతుందో అన్నట్లుగా అనిపించింది. నా వెనుక నలుగురు కాలేజ్ అమ్మాయిలు పైకి ఎక్కలేక వగరుస్తూ అక్కడే మెట్లపై చతికిల పడటంతో నేనూ ఆగిపొయ్యాను. కానీ మనసంతా పైన వున్న నా తోటి పక్షి ప్రియులపైనే ఉంది. గుండె చప్పుడు తక్కువయ్యాక మరలా పైకి ఎక్కసాగాను. కొంత సేపయ్యాక మరలా గుండే చప్పుళ్ళు వినిపించసాగాయి. మరలా విశ్రాంతి తీసుకొని, కొండ పై చేరి సహచర మిత్రులను చేరుకొగలిగాను. అప్పటికి వారు Yellowfronted Pied or Mahratta Woodpecker చూసినట్లుగా చెప్పారు.

అక్కడే ఒక చిన్న టే దుకాణంలో టే తాగుతూ పరిసరాలను పరికిస్తుంటే ఇదుగో ఈ White eyed buzzard కనిపించింది. కుంతలా లో పక్షి వీక్షణ ముగించాక నిర్మల్ వైపు సాగింది మా వాహనం. ప్రధాన రహదారిపై పోచారం జలపాతం దర్శించమని ఉన్న పెద్ద hoarding కనిపించింది. అప్పటికే చీకటిపడటం మొదలయ్యింది - వ్యవధి లేనందున తిన్నగా నిర్మల్ పట్టణం కు బయలు దేరి వెళ్ళాము. ఎట్టకేలకు ఇలా కుంతలా జలపాతం చూడగలిగాను.

రెండవ రోజు: ఉదయం 7 గంటలకు బయలుదేరి అదిలాబాద్ రహదారిగుండా పయనిస్తూ రామన గండి అనే ప్రాంతంలో మా వాహనాన్ని కుడి వైపు మళ్ళించి కొంతదూరం వెళ్ళాక వాహనం దిగి అడవి బాట గుండా నడవ సాగాము. దారిలో పక్షులు వాటి గళాలను వినిపించసాగాయి. చాల సందర్భాలలో పక్షి గొంతు వినిపిస్తోంది కాని పక్షి కానరాదే. మా దుర్భిణిల కు పనిపెట్టి పక్షులకై అన్వేషిస్తుంటే ఒక్కటొక్కటిగా కనపడ సాగాయి.

Rose-Ringed Parakeet

ఇదుగొ ఎడమ వైపు చెట్టుపైగల ఈ చిలకను Roseringed Parakeet ను చూడండి. రామ చిలకను చూసాక 200 గజాలు నడిచాక ఎడమ వైపు చెట్టుపై వున్న పర్సుపు పిట్ట Baya weaver bird గూళ్ళు వేళ్ళాడుతూ కనిపించాయి.

Baya, Weaver Bird's Nests

మా ఎదురుగా సన్నని కాలి బాట ఉంది. పరిసరాలను గమనిస్తూ పక్షుల అరుపులకై చెవులు రిక్కిస్తూ ముందుకు సాగాము. రక రకాల పక్షులను గమనిస్తూ వెళ్తూ వాగు దగ్గరికి చేరుకున్నాము. వాగులో నీళ్ళు లేవు కాని ఇరువైపుల దట్టంగా చెట్లున్నాయి. కుల్కర్ణి ఒక మాట చెప్పారప్పుడు. నీళ్ళున్నా , లేకపోయినా వాగు దగ్గర పక్షుల, జంతువుల సందడి ఉంటుందని. అతని మాట నిజమేనని నిరూపిస్తూ అక్కడ చెట్లపై చాలా పక్షులు కనిపించాయి. వాటిని గమనిస్తూ నోట్స్ రాసుకుంటూ వెనుతిరిగాము. దారిలో ఒక రాతిపై కనిపించిందీ మల్ల గద్ద Pariah Kite. అప్పటికి ఉదయం 10 గంటలు కావస్తుంది. హైదరాబాదు నుంచి డాక్టర్ ప్రవీణ్, రాజీవ్ వస్తున్నట్లుగా సమాచారం అందింది. నిర్మల్ గెస్ట్ హౌసె మేము చేరిన సమయం లో వారి కారు కూడ వచ్చి మా ముందు ఆగింది.

(సశేషం) 

Text and Photos: cbrao