సోమవారం, జూన్ 25, 2007
శనివారం, జూన్ 16, 2007
తానా సంపాదకీయం

శాంతినికేతన్ లో ఒక కుడ్య చిత్రం Photo: cbrao
మనిషికీ మనిషికీ మధ్య బంధం సున్నితమైంది అది రక్తమూ, ప్రేమా,
స్నేహమూ, బంధుత్వమూ దేనితో కూడుకున్నదయినా. ఒక చిన్న మొక్కకి ఎరువు వేసి
నీరు పోసి పందిరి కట్టి పోషించుకున్నట్టే ప్రతి సంబంధాన్నీ జాగ్రత్తగా
కాపాడుకుంటూ పెంపొందించుకోవాలి. అయితే ఆ మొక్క ఎదిగి తీగెలు సాగి పూలు పూచాక
దాని సంరక్షణలోనూ, పోషణలోనూ అలసత్వానికి లోనవుతాము.
అదే నిర్లక్ష్యంతో ఏ బలహీన క్షణంలోనో పరుషంగానో, చులకన చేస్తూనో ఒక
మాట అవతలివారి నాలుకనుండి జారుతుంది. నీ హృదయం గాయపడుతుంది.
అనాలోచితంగా వారు చేసిన ఒక చేష్ట నీకు కష్టాన్ని కలిగిస్తుంది. వారి
ప్రాధాన్యతా క్రమం వలన అవసరానికి వినిపిస్తుందనుకున్న మాటా,
అందుతుందనుకున్న సాయం నీకు అందవు. నీ అహం దెబ్బ తింటుంది. లేదా ఒక
అపార్ధం చోటు చేసుకుంటుంది. ఆ పై ప్రతి మాటా, చేతా కొత్తకోణంలో
కనిపించి వేధించడం మొదలెడతాయి. తప్పు ఖచ్చితంగా అవతలివారిదేనని
ఇద్దరూ బలంగా నమ్ముతారు. వాదాలూ, మౌనాల అనంతరం ఇక మొహం కూడా
చూడాలనిపించదు. అన్ని రోజులుగా పెంచుకున్న, పంచుకున్న బంధం నిశ్శబ్దంగా
తెగిపోతుంది.
అంటే నీ జీవితంలో, నీ ప్రపంచంలో ఒక భాగాన్ని నిరాకరిస్తున్నట్టే. నీలో ఒక
పార్శ్వాన్ని తొలగించుకున్నట్టే. మరొకరి ప్రపంచంలో నువు మరణించినట్టే.
తప్పెవరిదయినా నష్టం ఇద్దరిదీ.
పొరపాటు మానవ సహజం. నీమీద నీకే కోపం వచ్చిన సందర్భాలలో నిన్ను
క్షమించేసుకుంటావు. అర్ధంలేని పట్టింపులు విడిచి నీ ఆత్మీయుల్ని అడక్కుండానే
ఉదార హృదయంతో క్షమించలేవా? క్షమాగుణం మనిషిగా నిన్ను ఉన్నత స్థాయికే
చేరుస్తుంది. లేదా ఒక బంధాన్ని నిలుపుకునేందుకు నీ అహాన్ని కాస్త చంపుకుని
తప్పు నీది కాదని నువ్వనుకున్నా వొప్పుకుని క్షమాపణ అడగలేవా? ఒక
చిరునవ్వూ, ఒక పలకరింపూ, ఒక వెచ్చటి స్పర్శతో వారిని తిరిగి నీ
జీవితంలోకి ఆహ్వానించి నీ ప్రపంచాన్ని పరిపూర్ణం చేసుకోలేవా?
ప్రధాన సంపాదకుడు,
కన్నెగంటి చంద్రశేఖరరావు
----
Source Courtesy: Sri Krishna Rao Maddipati of DTLCgroup
Tana: http://tana.org/
బుధవారం, జూన్ 13, 2007
స్త్రీ,శృంగార స్వేఛ్చా వాది, అభ్యుదయ రచయిత చలం

తెలుగుప్రజల గు౦డెల్లో ఎన్నితరాలు గడిచినా నిగూఢ౦గా నిక్షిప్తమై ఉ౦డే సాహితీ హిమాచల౦ "చల౦".పరిచయ౦ అక్కర్లేని వ్యక్తి ఆయన. తనని తిట్టినా కొట్టినా , కసిరినా, విసిరినా , వేధి౦చినా వెలివేసినా దొ౦గ మర్యాదల్నీ దగాకోరు ఆచారాల్నీ, కాల౦ చెల్లిన కట్టుబాట్లనీ, రె౦డు నీతుల్నీ, చీల్చి చె౦డాడి ఆడవారి కన్నీళ్ళనీ, అస౦తృప్తి మ౦టల్నీ ప్రప౦చ౦ ము౦దు ఆవిష్కరి౦చి , ఆక్రోశి౦చి అనుక్షణ౦ ఆవేశ౦తో, ఆవేదనతో రగిలిపోయిన తెలుగుతల్లి గర్భస౦చిలోనే అడ్డ౦తిరిగిన బిడ్డ, ప్రేమ హృదయాలకు పూసిన బాష్పా పుష్ప౦ , కదిలే కడలికెరట౦ చల౦. స్త్రీకి కూడా శరీర౦ ఉ౦ది. దానికి వ్యాయామ౦ ఇవ్వాలి. మెదడు ఉ౦ది. దానికి జ్ఞాన౦ ఇవ్వాలి. ఆమెకి హృదయ౦ ఉ౦ది. దానికి అనుభవ౦ ఇవ్వాలి అ౦టూ కడదాకా పోరాడిన గుడిపూడి వె౦కటాచల౦ 1894మే 19న వైశాఖ పున్నమినాడు స్త్రీల ఆపద్భా౦ధవుడిలా ఈ లోక౦లోకి అడుగుపెట్టాడు.
- by కార్తిక్ పవన్ గాదె
మిగతా వ్యాస భాగాన్ని వినండి.
Courtesy: శరత్ నాగం
శుక్రవారం, జూన్ 01, 2007
త్వరలో - కార్ల్ మార్క్స్ కు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం

ప్రముఖ హేతువాది, పాత్రికేయుడు అయిన నరిసెట్టి ఇన్నయ్య గారి బ్లాగు నా ప్రపంచం బహుశా మీరు చూసే ఉంటారు.
http://naprapamcham.blogspot.com/
Dr. Innaiah గారికి, Philosophy of Modern Science లో Doctorate డిగ్రీ, వాద ప్రతివాదాల మధ్య 13 సంవత్సరాల తరువాత చేతికి వచ్చింది. అరబిందొ శిష్యుడైన డా.వి.మధుసూధన్ రెడ్డి, ఇన్నయ్య గారి సిద్ధాంత వ్యాసానికి రాతపూర్వకంగా ఆమోదముద్ర వేసి, viva voce లో తిరస్కరించటంతో, ఈ తిరకాసు బయటపడింది. కోర్ట్ అక్షింతలవల్ల, డా.మధుసూధన్ రెడ్డి ఉద్యోగానికి రాజీనామా చేసి అరవిందాశ్రమము చేరవలసి వచ్చింది.
టంగుటూరి ప్రకాశం,వివేకానంద స్వామి, హొమియోపతి వైద్యం పై వీరి వ్యాసాలు పెద్ద సంచలనం సృష్టించాయి. టంగుటూరి ప్రకాశం గారి పై, ఈనాడు లో, 1982 లో రాసిన వ్యాసానికి స్పందిస్తూ వేల కొలది ఉత్తరాలు, సెంటిమెంట్ దెబ్బతిన్న కారణంగా నిరసనలు ప్రదర్శితమయ్యాయి. కాని ఇవేవి వ్యాసంలో పేర్కొన్న అంశాలకు జవాబివ్వకుండా ఆవేశపూరితంగా జరిగాయి.
ఇన్నయ్య గారి గురించి వివరంగా రాయమని, కొంతమంది మిత్రులు ఉత్తరాలు రాస్తున్నారు. వారి గురించి ఒక టపాలో రాయటం కష్టం. వారి గురించిన పూర్తి వివరాలతో ఒక website తయారు చేసాను. అంతర్జాతీయంగా పలువురి ప్రశంసలు పొందిందీ సైట్. Indian Radical Humanism గురించిన సమగ్ర సమాచారానికై, పెక్కు మందికి, ఇది, reference గా ప్రామాణికమైంది. చూడండి.
http://innaiahn.tripod.com/
నా పపంచంలో, ఏక కాలంలో వీరి రచనలు
1) వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు (అముద్రితం)
2) నర హంతకులు
serial గా ప్రచురితమవుతున్నాయి. ఇందులో వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు serial మరో తెలుగు బ్లాగు, తెలుగుమీడియాన్యూస్ లో
http://telugumedianews.blogspot.com
కూడా ప్రచురితమయి, తెలుగు బ్లాగులలో, తొలి syndicated serial అయ్యింది. నరహంతకులు చదివి ఒక పాఠకుడు, తన బ్లాగు లో ఒక ప్రత్యేక టపానే రాయటం జరిగింది.
http://assarabhassarabha.blogspot.com/2007/05/blog-post.html
పాఠకులలో ఈ సీరియల్స్ కు ఆదరణ ఉన్నదని, వచ్చిన ఉత్తరాలు, తెల్పుతున్నాయి. పలువురు ఫోన్లో అభినందనలు తెలిపారు.
మరో కొత్త Sensational serial
కార్ల్ మార్క్స్ కు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం
Production work మొదలయ్యింది; అని, తెలియచేయటానికి సంతోషిస్తున్నాము. త్వరలో విడుదల - మీ అభిమాన కూడళ్లు కూడలి, తేనెగూడు మరియు తెలుగుబ్లాగ్గర్స్ లో.