శుక్రవారం, జూన్ 20, 2008

అంతర్జాల వీక్షణం -1

అంబేద్కర్ ను ఎలా అర్థం చేసుకోవాలి!
http://naprapamcham.blogspot.com/2008/05/blog-post_29.html

బుద్ధ రామాయణం ప్రకారం సీత రాముడి సోదరి. కనుక యీ యిరువురి పెళ్ళి ఆదర్శం కాదు. రాముడు ఏకపత్నీవ్రతుడూ కాదు. వాల్మీకి రామాయణాన్ని బట్టి కూడా రాముడికి చాలామంది భార్యలున్నారు. (అయోధ్యకాండ 8వ సర్గ 12వ శ్లోకం) ఇంకా ఉంపుడుకత్తెలు కూడా వున్నారు. రాముడిని దేవుడిగా చూచేవారు ఈ విషయాలు పరిగణనలోకి తీసుకోవాలని అంబేద్కర్ అన్నారు.
గాంధీజీకి అంటరానివారిపట్ల చిత్తశుద్ధి లేదనడానికి అంబేద్కర్ ఎన్నో ఉదాహరణలు చూపారు. అంబేడ్కర్ తత్వాన్ని అద్దం పట్టి చూపే, ఇన్నయ్యగారి ఈ వ్యాసం చదవతగ్గది.

మార్పు
http://www.eemaata.com/em/issues/200301/219.html

50 ఏళ్ల క్రితం స్త్రీల స్థితిగతులకూ నేటి మహిళకూ ఏమిటి మార్పు అని ప్రశ్నిస్తుందీ కథ? అప్పుడు భార్య వంట చేస్తుంటే, భర్త పడక్కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూ కనిపించే దృశ్యమే, ఈనాడూ గోచరిస్తుంది. ఈ కాలంలో స్త్రీ విద్యావతి ఐనా,ఉద్యోగవంతురాలైనా,అమెరికా లో ఇట్లా, అట్లా అంటూ కబుర్లు చెప్పే పురుషులు ఇంట్లో ఉన్నా, అదే దృశ్యం. మార్పు లేకపోవటమే మార్పా? విప్లవ్ కథ మార్పు అప్పటి, ఇప్పటి, అమెరికా, భారత దేశాల పరిస్థితులను, భర్తల మనస్తత్వాలను తేటతెల్లం చేస్తుంది.

శ్రీవారికి ప్రేమలేఖ
http://nishigandha-poetry.blogspot.com/2008/02/blog-post_13.html

రెండు భిన్న హృదయాలను విచిత్రంగా కలుపుతుంది వివాహం. ఎన్నో సర్దుకుపోవటాలు, అలకలు, మరల తెలుపవా ప్రియా అంటూ నిశ్శబ్ద ప్రేమ గీతాలు వైవాహిక జీవితాన్ని నింపేస్తాయి. పెళ్లైన కొత్తలో ఎవో కారణాలవలన భార్యా భర్తలు దూరంగా ఉండటం జరుగుతుంది. ఈ దూరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకొందుకు ఉపయోగ పడుతుంది. ఒకరి ఉత్తరానికై మరొకరి ఎదురుచూపులు ఉంటాయి. ఉత్తరం రాసే సమయాన, జవాబు అందుకొన్న సమయాన, మనసున మల్లెలు మాలలూగుతాయి.విరహం నిమిషాలను గంటలుగా,రోజులను యుగాలుగా మారుస్తుంది. సంగమం మనసుని మధురమైన ఊహలతో నింపి, నవ వధువును భీత హరిణిలా మార్చి, కళ్లను సిగ్గుతో కిందకు వాల్చేలా చేస్తాయి.ఆ పై ఆషాఢం తెస్తుంది మరో మధురమైన విరహ తాపం.మేఘసందెశం బదులుగా ఇప్పుడు e-mail రెక్కలు కట్టుకుని ప్రియ సఖునకు చేరుస్తుంది, అంతరంగాన్ని. శ్రీవారికి రాసే ప్రేమ లేఖ ఎన్ని మధురిమలను నింపుకుంటుందో తెలుసుకోవాలంటే నిషీగంధ రచన శ్రీవారికి ప్రేమ లేఖ చదివాల్సిందే.

కవితా! ఓ! కవితా!
http://video.google.com/videoplay?docid=-6066875310479125945&hl=en

మీరు శ్రీశ్రీ కవితాభిమానులా? అయితే, వీక్షణం మాసపత్రిక సంపాదకుడు ఆలపించిన ఈ కవితా, ఓ కవితా గేయం విని, ఆ ప్రవాహ వొరవడిని, ఆస్వాదించండి.

నేనూ గొప్ప చిత్రకారిణినే.......
http://meenakshir.blogspot.com/2008/06/blog-post_7456.html

మీ ఇంట్లో టార్టాయిస్ కాయిల్స్ ఉంటే కాస్త వాటిని చూస్తు..చూస్తూ మీ స్కూల్ ఫ్లాష్ బాక్ లో కి వెళ్తే ఎలా వుంటుంది ? ఓరుగల్లు మీనాక్షి మధురంగా రాస్తున్న స్కూల్ కబుర్లు చదివి, అందులోని హాస్యానికి పోరగాళ్లు పడిపోతున్నారంటే నమ్మండి.Spark ఉందీమె రచనలలో.మరి మీరూ మీనాక్షి స్కూల్ కెళ్లొస్తారా?

తెలుగుపాటల అసలు సిసలు పాటలు
http://gorablog.blogspot.com/2008/06/trivia-few-tollywood-songs-copied-from.html

ఛత్రపతి టైటిల్ సాంగ్, పోకిరీ సినిమా లోని దేవ దేవ దేవుడా ఇంకా మంత్ర లోని మహా మహా పాటల ఒరిజనల్ పాటలు వినండి, నకళ్లతో పాటుగా.

లోకలు వార్మింగు
http://chaduvari.blogspot.com/2008/06/blog-post_17.html

గ్లోబల్ వార్మింగ్ తెలుసు కాని ఈ లోకలు వార్మింగు ఏమిటి అనుకుంటున్నారా? అయితే మీరు చదువరి రాసిన ఈ హాస్య వ్యంగ భరిత రచన చదవ వలసినదే. చదువరి హాస్యం కూడా రాస్తారా అని అబ్బురపడేవారికి ఇది చూపండి.

జీవశాస్త్ర విజ్ఞాన సర్వస్వము
http://www.eol.org

భూమిపై గల జీవరాశులగురించి తెలియ చెప్పే ప్రయత్నం ఈ విజ్ఞానసర్వస్వం చేస్తుంది. మీ పిల్లలు స్కూల్ ప్రాజెక్ట్ పని చేసే సమయంలో, ఇది ఎంతో సహాయకారిగా ఉండగలదు. ఈ విజ్ఞాన సర్వస్వం గురించిన మరింత సమాచారానికై ఈ కింద ఇచ్చిన లింక్ లో గల వీడియో చూడగలరు.
http://www.eol.org/screencasts

4 కామెంట్‌లు:

  1. @ఫూర్ణిమ: మీకు నచ్చినందుకు ప్రమోదం. Sir అన్న పదము బరువుగా ఉంది. మోయటానికి భారంగా ఉంది. ఇది మిత్రుల మధ్య దూరాన్ని పెంచేదిలా అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  2. BHASKAR garu.namaste.....
    na blog gurinchi meeru rasina vaakyaalu chadivi Oscar award vachinanta santhosham.....avutundi..
    naaku ee santhoshaanni ichinanduku meeku boledu thanks.
    Orugallu pilla...meenakshi

    రిప్లయితొలగించండి
  3. @ మీనాక్షి: ఇలాగే రాస్తుండు. ఒక రోజు నీ బ్లాగు సమీక్ష కూడా చేస్తా. ఆశిస్సులు.

    రిప్లయితొలగించండి