శనివారం, అక్టోబర్ 25, 2008

విహారి నవ్వుల తోటలో కుందేలు



ఎర్ర రాళ్ల కొండలోంచి వాహన మార్గం

అక్టోబర్ 23, 2008 సమయం సాయంత్రం 5 గంటలు.చీకటి పడకముందే, ఎర్ర రాళ్ల కొండలు చూసివద్దామన్న విహారి సూచనకు తలూపాను.డెన్వర్ లో ఈ ఎర్ర రాళ్ల కొండలు ప్రసిద్ధిగాంచినవి. కొలొరాడో color - ado, అంటే ఎర్రరాళ్ల ప్రాంతమని స్పానిష్ వారు పేరు పెట్టి పిలువసాగటంతో,ఈ రాష్ట్రానికి ఆ పేరు వచ్చింది.



Red Rocks వద్ద ఛాయా చిత్రంలో ఉన్నవారు:cbrao బొమ్మ తీసినవారు:విహారి

డెన్వర్ లోని Red Rocks లోని ప్రత్యేకత ఏమంటే, రెండు కొండల మధ్య ఉన్న ప్రత్యేక ధర్మాన్ని,ధ్వనితరంగశాస్త్రం (acoustics) సహాయంతో, ధ్వనిని పెంచి (ఎలాంటి amplifier, speakers లేకుండా), సంగీత కచ్చేరీలు నిర్వహిస్తారిక్కడ.



ఎర్ర రాళ్లలో ఆరుబయలు రంగమంటపం (Open air theater)

ప్రపంచంలోనే, మరెక్కడా లేని, అరుదైన రంగమంటపమిది. వానాకాలం లో ఇక్కడి ఎర్రరాళ్ల సొగసు, ఇంద్రధనసు రంగులు చూసితీరవలసినదే. ఈ Red Rocks గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు Red Rocks Web Site చూడవచ్చు. అక్కడి ఎర్రరాళ్లను, ఆరుబయటి రంగుమంటపం (Open air theatre) చూసాక, డెన్వర్ కొండల మీదుగా, వంపులు తీరి ఉన్న రహదారిపై ప్రయాణించే సమయంలో అకస్మాత్తుగా మా వాహనం ఆగింది. దానంతట అది ఆగలేదు.



గడ్డి మేస్తూ దుప్పి

ఎదురుగా రెండు దుప్పులు (Deer ) రహదారి పక్కన గడ్డి మేస్తూ కనిపించటంతో, విహారి వాహనాన్ని ఆపటం జరిగింది. రహదారిపై ఏటా అమెరికాలో 2000 పై చిలుకు వన్యప్రాణులు, రహదారి దాటుతూ మరణిస్తున్నాయి. వీటి రక్షణకై పెక్కు చర్యలు తీసుకుంటున్నారు.రహదారికి రెండు పక్కలా కంచె వేసి వీటిని రక్షిస్తున్నారు. రహదారిపై, వన్యప్రాణులు రహదారి దాటే ప్రాంతమని, హెచ్చరించే ప్రకటనలు, దారి పొడుగూతా కనిపిస్తుంటాయి.ఇదివరలో ఈ ఎర్ర రాళ్ల ప్రాంతంలో, జింకలు, గుంపులు గుంపులుగా కనిపించేవని, ఇప్పుడు సంగీత కచ్చేరీల వలన, జనం రావటం ఎక్కువవటం తో వాటి సంచారం తగ్గిందని విహారి ద్వారా తెలుసుకొన్నాను.సూర్యాస్తమయం అవటంతో, వెలుతురు తక్కువగా వుండి, నా కెమరా ఆటో ఫోకస్ కావటానికి కష్టపడసాగింది.అయినా,దుప్పుల చిత్రాలు, కొన్ని తీయగలిగాను.

కొండదారి పై మా ప్రయాణం కొనసాగి, చిన్న చిన్న పట్టణాల మీదుగా పయనిస్తూ,Highlands Ranch లోని Blackbird Circle లోని విహారి ఇంటి ముందర మా వాహనం ఆగింది. విహారి, కుడివైపు ఉన్న పచ్చిక బయలులో, గడ్డి తీరికగా మేస్తున్న కుందేలుపై, నా దృష్టిని సారించటం తో, ఉత్సుకతో వాహనం దిగి ఆ కుందేలును దూరం నుంచి ఛాయా చిత్రాలు తీస్తూ దగ్గరగా వెళ్లసాగాను.ఆశ్చర్యం,కుందేలు నన్ను చూసి బెదరలేదు. చుట్టూ చూశా, ఎక్కడన్నా తాటాకులు దొరుకతవేమోనని.



డెన్వర్ లో ఆకులు రాలే కాలం (Fall - Maple Leaves)

ఆకురాలు కాలమవటంతో,చుట్టూ రాలిన మాపిల్ (Maple leaves) ఆకులు కనిపించాయి.ఆ మాపిల్ ఆకులను సేకరించి,కుందేలుకు దగ్గరగా వచ్చి చప్పుడు చేయసాగాను.ఊహు! ఈ కుందేలు మాపిల్ ఆకుల చప్పుళ్లకు బెదిరేది కాదని తెలిసిపోయింది.భారత దేశం అడవులలో, కుందేళ్లను తాటాకు చప్పుళ్లతో బెదిరించటం అలవాటయిన నాకు, అమెరికాలో ఈ కుందేలు బెదరకపోవటం ఆశ్చర్యం కలిగించింది.ఇహ లాభం లేదని,దగ్గరగా వెళ్లి చేతితో చప్పట్లు చేయబోయి,దగ్గరగా వెళ్తుంటే 'ఆగు ' అన్న మాట వినపడటంతో, ఉలిక్కిపడి చుట్టూరా చూశా, ఏదన్నా దెయ్యం అలా పలుకుతుందేమోనని.



హాలోవిన్ పండుగకు స్వాగతం చెప్తూ చేసిన, గ్రుహం ముందటి అలంకరణ

దెయ్యం నా ఆలోచనలోకి రావటానికి ప్రత్యేక కారణం లేక పోలేదు.ఈ రోజు మధ్యాహ్న సమయం లో, శ్రీమతి ప్రశాంతి నాకు వాళ్ల కౌంటీ లోని, హాలోవిన్ (Halowin) పండగ (దెయ్యాల పండగ) కోసం ప్రత్యేకంగా అలంకరించిన, చాలా గృహాలను చూపటం జరిగింది. ఈ దెయ్యాల పండగ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి. వాటి (హాలోవిన్ దెయ్యాల) తాలుకు ఆలోచనలు నా మనస్సును ప్రభావితం చేసి,ఏ మానవ సంచారం లేని ఆ సమయంలో,ఆ శబ్దమెటునుంచి వస్తున్నది అని తెలుసుకోందుకై, చుట్టూ పరికించి చూశా. ఎవరూ లేరు. మరి శబ్దం ఎక్కడి నుంచి వస్తున్నది? ఆశ్చర్యం, ఆ శబ్దం కుందేలు వైపు నుంచి వచ్చింది.



మాట్లాడే కుందేలు

నమ్మశక్యం గాక, కుందేలు వైపు మరో అడుగు వేశా. కుందేలే ' ఆగు ' అని మరలా హెచ్చరించింది. నేను అమితాశ్చర్యంతో, ఏమిటి నీవు మానవులవలే మాట్లాడుతున్నావు? అదియునూ,ఆంగ్లంలో కాకుండా తెలుగులో ఎట్లా మాట్లాతున్నావని అడిగాను. కుందేలు చెప్పిన సమాధానానికి నేను కుదేలయిపోయా.

కుందేలు అన్నది, తాను అదే ప్రాంతంలో ఉంటానని, విహారి తోటలో, టొమటో ఇంకా ఇతర కాయగూరల మొక్కలు, గడ్డి తింటానికి తరచూ ఇక్కడికి వస్తుంటానని , విహారి సాయంకాలపు బడిలో, కౌంటీలోని పిల్లలలకు తెలుగు బోధిస్తుంటే, తనూ విని వినీ, పిల్లలతో పాటు, తనకూ తెలుగు వచ్చేసిందనీ, అందుకే తను తెలుగులో మాట్లాడగలుగుతున్నానని. (విహారి, భూపతి పంతులువారిగా తెలుగు పాఠాలు చెప్పే విశేషాలు, మీరు, అమెరికాలో తెలుగు వారి పిల్లలకు తెలుగు పాఠాలు అనే వ్యాసంలో తెలుసుకోవచ్చు). అంతే కాదు, పంతులుగారి పిల్లలు కూడా, ఇంట్లో తెలుగే మాట్లాడుతుంటే, తనూ తెలుగులో మాట్లాడటం నేర్చుకున్నానని, కుందేలన్నది.

సరే బాగుంది, నాకు ఇంకో సందేహముంది అన్నా. సరే,డెన్వర్ వచ్చి, ప్రశ్న దాచటమెందుకు, అడగవచ్చు అని కుందేలనటంతో, నేను ఇన్ని చప్పుళ్లు చేస్తున్నా, నీవు బెదరక పోవటం లోని రహస్యం తెలుసుకోవాలనుంది అన్నా. ఇందాక చెప్పాగా, నేను విహారి తోటకు తరచు వచ్చిపోతుంటానని.విహారి తెలుగు పాఠాలతో పాటుగా, విహారి బ్లాగు కబుర్లూ వింటున్నా. మొదట 50, తరువాత 100, అలా అలా విహారి టపాలకు 300 పై చిలుకు Hits రావటం తో, ఆ కబుర్లు వింటూ, హిట్లకీ,చప్పుళ్లకీ తట్టుకునే ధైర్యమొచ్చేసింది. అందుకే, ఇందాక, మీరు అన్ని చప్పుళ్లు చేసినా, భయపడలేదు అన్నది.

కుందేలు ఇన్ని కబుర్లు చెప్తుంటే, ముచ్చటేసి, ఒక్కసారి దాన్ని రెండుచెవులతో ఎత్తి, గాలిలో గిర గిరా తిప్పి నా ఆనందాన్ని వ్యక్తం చెయ్యాలనిపించి, దానికి దగ్గరగా వెళ్లసాగాను. ఆగు, నీ పరిధిని దాటుతున్నావన్న కుందేలు హెచ్చరిక లెక్కచేయకుండా, కుందేలుకు, ఇంకా దగ్గరికి వెళ్ల సాగాను. నేను దగ్గరికి రావటాన్ని గమనించి, కుందేలు రెప్పపాటులో అద్రుశ్యమయ్యింది, ఆశ్చర్యంగా.


ఛాయా చిత్రాలపై కాఫీ, టీ హక్కుదారులు: cbrao

గురువారం, అక్టోబర్ 16, 2008

జ్ఞాపకాలు, ఆలోచనలు, విశేషాలు -9

తెలుగు బ్లాగరుల ప్రత్యేక రైలు

ఏమిటి మహిళలంతా వరుస పెట్టి ఇలా బ్లాగు ప్రయాణాలు చేస్తున్నారు? ముందుగా అనుకున్నారా? మీ వ్యాసం వైవిధ్యంగా ఉండి, తోటి బ్లాగరులతో రైలు లో ప్రయాణం చేయించటం సరదాగా, ఆహ్లాదంగా ఉంది.నేను భారతదేశం వచ్చాక, భూమిక సత్యవతి గారిని కలుపుకొని, తెలుగు బ్లాగరుల ప్రత్యేక విహార యాత్ర చేద్దామా? ఇంతవరకూ ఎవరికీ చెప్పని విషయం, మీకే ప్రత్యేకం. డెట్రాయిట్ నగరంలో, తెలుగు సమావేశాలలో నన్ను కలిసి ఆప్యాయంగా పలకరించారొక మహిళ. నా బ్లాగు తను చదువుతూ ఉంటానని చెప్పి నన్ను ఆశ్చర్య పరిచారు. ఆమె ఎవరో చెప్పగలరా? వారు మీకు తెలుసు.ఆమె పేరు చెప్పెయ్యనా? మీరూ పడతారు ఆశ్చర్యం. ఆమె తెరెసా (Teresa).

-cbrao, Columbus,Ohio.


http://manalomanamaata.blogspot.com/2008/10/blog-post_15.html


అట్లతద్ది


విజయవంతమైన చిత్రం నిన్నే పెళ్లాడుతా లో అట్ల తద్ది గురించిన ప్రస్తావన ఉన్నది.అత్లతద్ది అంటే ఏమిటంటే అన్న ప్రశ్నకు అట్లతద్దే అన్న జవాబొచ్చును. ఈ అట్లతద్ది నోమును నా శ్రీమతిని నోయమనగా, నోము మహత్యముతో నేను యవ్వనవంతుడినవుతే,ఏ కుర్రదాని వెంటో పోయి,తనని ఒగ్గేసే ప్రమాదముందని,భయపడిపోయెను.అత్లతద్ది చెయ్యజాల అంటూ మొండికేయుచున్నది. ఈమె చే ఈ అమోఘ వ్రతము చేయించుటెట్లో తోచకున్నది.
http://laharicom.blogspot.com/2008/10/blog-post_5549.html

పుస్తకాల పురుగు – సౌమ్య

తెలుగు బ్లాగుకు వన్నె, విలువ తెచ్చిన వాటిలో సౌమ్య పుస్తక సమీక్షల బ్లాగు ఒకటి అని నిస్సందేహంగా చెప్తాను.200 టపా మజిలీ సందర్భంగా, హార్దిక అభినందనలు.
-cbraoColumbus,Ohio.

http://vbsowmya.wordpress.com/2008/10/16/287/

పచ్చి చేపలను ఎవరు తింటారు?

ఎన్నో భోజనశాలలు.ఎన్నో పద్ధతులు. అన్నీ అందరికీ తెలియటం కష్టమే మరి.జపనీస్ భోజనశాలలో, చేపకూర కావాలని అడిగితే ఏ రెండు రొట్టెలాంటి పదార్థాల మధ్య, పచ్చి చేప పెట్టి తీసుకువచ్చినా ఆశ్చర్య పడవద్దు. జపనీయులు అలాగే తింటారు మరి.ఒక వస్తువు కావాలని అడిగే ముందట, ఆ వస్తువు వివరణ, అది ఎలా చేస్తారో అడగటం తప్పు కాదనుకుంటా.
చక్కటి ఈ వ్యాసానికి,నిషీగంధ కామెంట్ చదివి మనసారా నవ్వాను.

-cbraoColumbus,Ohio.

http://parnashaala.blogspot.com/2008/10/blog-post_15.html


ప్రపంచ చేతులు తుడుచుకునే దినం
అమెరికాలో కడుక్కోవటం చూడలేదు.అంతా కాగితంతో తుడుచుకోవటమే.నేనంటాను global-handwashing-day కాదు, ప్రపంచం చేతులు తుడుచుకునే దినం అని. cbraoColumbus,Ohio.

http://blog.vihaari.net/2008/10/global-handwashing-day.html


నలభీములు

పురాణకాలంలో నలభీములు, ప్రస్తుతం భోజనశాలలలో మాత్రమే కనిపిస్తారు.ప్రస్తుతం ఇళ్లలో మాత్రం సహదేవులే.ఈ దేవుళ్లకు భార్యామణులే నైవేద్యం పెట్టాల్సుంటుంది. కాదు గీదంటే వంటిల్లు రణ రంగమే.
cbraoColumbus,Ohio.

http://manalomanamaata.blogspot.com/2008/10/blog-post.html


పికాసో చిత్రాలు

పికాసో అన్న కళ నిజం కాదన్న మాట తన కళకు మాత్రమే వర్తిస్తుంది. మన దేశ కళాకారులు బుద్ధుడి జాతక కథలను అద్భుతంగా చిత్రించారు,శిల్పాలపై చెక్కారు.ఇందులో బుద్ధుడి జనన వృత్తాంతం వగైరా ఎన్నో వాస్తవ కథలుంటాయి. పికాసో బొమ్మలలోని క్యూబిజం లో మనకు గోచరించేవి అపరిచిత రూపాలే. అవి పికాసో ఊహలోంచి వచ్చినవే. అవి వాస్తవ జగత్తులో ఎక్కడా గోచరించవు.కాబట్టి పికాసో కళా రూపాలు, వాస్తవానికి దూరంగా ఉంటాయన్న మాటలు సత్య దూరం కాదు.కానీ, కళా జగత్తులో పికాసో చిత్రాలు వెలకట్టలేనివి.-cbraoAtlanta,Georgia,USA.

http://oohalanni-oosulai.blogspot.com/2008/10/blog-post_10.html

జ్ఞాపకాలు, ఆలోచనలు,విశేషాలు -8

ఆనంద భైరవి

@ సుజాత: అయితే మీరు 24 గంటలు సంగీతంలో మునిగి తేలుతున్న, సంగీత బాధితులన్న మాట. మీ బాధను మరచుటకు ఆనంద భైరవి రాగమాలాపించి పాడండి.

ప. నీకే తెలియక పోతేనేనేమి సేయుదురా. లోకాధారుడవై నాలోని ప్రజ్వలించు జాలి (నీ)చ. ఎందెందు జూచిననెందెందు పలికిన-నెందెందు సేవించిననెందెందు పూజించిన-నందందు నీవని తోచుటందుకు నీపాదారవిందమును ధ్యానించిన-దెందుకని త్యాగరాజ సన్నుత (నీ)

ముల్లోకములు నిండిన నీవే, నా లోని బాధను అర్థం చేసుకొనలేకపోతే, ఇంకెవ్వరికి నా మొర వినిపించను? -cbrao

రావు గారు,సంగీతం అంటే ప్రాణం ఇస్తాను గానీ ఇలా ప్రాణాలు మనం ఇవ్వకుండానే, తోడేసే సంగీతాన్ని తట్టుకోవడం ఎలా? ఇంతకీ మీ కారేపాట పాడుతుందో?నేను "నానాటి బతుకు నాటకమూ" పాడుకుంటున్నాను!
- సుజాత

మా కారు రివర్స్ చేసే సమయంలో, ఆలాపిస్తూంది నిశ్శబ్ద సంగీతం. శ్రీమతి రమణ కు, నిశ్శబ్దంగానే కారు వెనక్కుతీయటం, అలవాటు. కాని సికందరాబాద్ లో, ఏ మార్కెట్ స్ట్రీట్ కో వెళ్లినప్పుడు, కారు వెనక్కు తిప్పే సమయంలో, రివర్స్ సంగీతం ఉంటే బాగుంటుందనిపిస్తుంది. మన దేశం లో జనాభా ఎక్కువ, కారుని చూసి కూడా తప్పుకోరు కొంతమంది. అలా కొన్ని సార్లు, నిశ్శబ్దం సశబ్దమయితే బాగుండుననిపిస్తుంది. నేనుండేది పెంట్ హౌస్ లో కాబట్టి, ఈ కారు రివర్స్ సంగీతాలు, నన్ను బాధించవు. మొన్నటి దాక, వచ్చే పోయే విమానాల శబ్దంతో హడావుడిగా వుండే పర్యావరణం, విమానాశ్రయం ఊరు బయటకు మారటంతో, ఆ శబ్దాలు తగ్గాయి. కాని వచ్చే పోయే విమానాలు చూడటం లో, ఉండే సరదా కూడా దూరమయ్యింది. కిందగా ఎగురుతున్న విమానం చూసే సమయంలో నేను, పిల్లలు సమానంగా ఆనందిస్తాము. -cbrao

http://manishi-manasulomaata.blogspot.com/2008/09/blog-post.html

How to spin a post?

పూర్ణిమ టపాలలో కనిపించే spin, TT ఆటలోంచే వచ్చిందా? What a blog serve? Wow!
http://deeptidhaara.blogspot.com/2008/09/blog-post.html


On Bench

బెంచ్ మీద ఉన్న సమయంలో పుస్తకాలు చదువుకునో, కొత్త టెక్నికల్ స్కిల్స్ పెంచుకునో సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవచ్చుగా? దేవుడిని "ఎందుకు బెంచ్ మీద ఉంచావని" ప్రశ్నించడం ఏంటి? బాగా లేదు. –మురళి
@ మురళి గారు, :): D - సీ గాన పెసూనాంబ
@మురళి: బెంచ్ మీద ఉన్న బాధ, మానసిక స్థితి, దేవుడిని తలిచేలా, అలా అనిపించేలా చేస్తుంది. కష్టాలలో ఉన్నప్పుడే కదా, ఎక్కువమందికి దేవుడి అవసరం తెలిసొచ్చేది? అర్థం చేసుకోరూ! (స్వర్ణకమలం -భానుప్రియ స్టైల్ లో) -cbrao

రెండు జెళ్ల సీ గాన పెసూనాంబ
@సీ గాన పెసూనాంబ: ఎక్కడనుంచి వచ్చారు మీరు? బుడుగు పుస్తకం లోంచా? సిసలైన తెలుగు పేరు. వ్యక్తులు ధరించే దుస్తులు, వాటి రంగులు బట్టి, వారి గురించిన ఒక అభిప్రాయం ఏర్పడుతుంది కాని అంతర్జాలం లో ఎదుటివారి దుస్తులు కనపడవు. పేరులో ఏమున్నది పెన్నిధి అని సామెత ఉంది. కాని బ్లాగ్లోకంలో కనిపించేది ఎదుటవారి పెరే కదా. ఈ పేరు బట్టి మీరు ఎన్ని జడలు వేసుకొంటారనే ఊహ, పాఠకుడికి కలుగుతుంది. మీ పేరు, మీ వ్యాఖ్యలు మీరు మంచి బ్లాగరి కాగలవని చెప్తున్నాయి. నాతో మాట్లాడుతున్నట్లుగానే, ఈ టపా కి వ్యాఖ్యలు రాసే చందంలో ఒక టపా రాయండి. ఇంత చాలు, మీరు పెద్ద మధన పడి రాయనవసరం లేదు. ఇలా మాట్లాడినట్లుగా చెప్పే టపాలే భవిష్యత్లో పెద్ద హిట్ అవుతాయి. ప్రారంభించండి. శుభమస్తు.

http://deeptidhaara.blogspot.com/2008/09/blog-post.html

Marriage

Sanjivadev used to say that marriages should be simple, quick and inexpensive. I liked the idea in the card presented by you.

http://maagodavari.blogspot.com/2008/09/blog-post_06.html?ext-ref=comm-sub-email


యాత్రాస్మృతులు

ప్రయాణంలో ఉన్నప్పుడు, ఖాళీ దొరికినప్పుడు, జ్ఞాపకాలు రాయకుంటే అవి మరుగున పడతాయి.రోజులు గడిచాక కొత్తవిషయాలు, పాతవిషయాలను అవతలికి నెట్టేసి, వాటి స్థానంలో కూర్చునే ప్రమాదముంటుంది. కాని, ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకోవాలని శరీరం కోరుతుంది.సమయాభావం, విశ్రాంతి ఈ రెంటినీ సమన్వయం చేసుకుంటూ రాయగలిగితే, మంచి యాత్రాస్మృతులు ఆవిష్కరణ అవుతాయి.

http://venusrikanth.blogspot.com/2008/09/blog-post.html

గురువారం, అక్టోబర్ 09, 2008

అమెరికా కబుర్లు

అమెరికాలో, ఉద్యోగస్తులలో, ఉద్యోగ అభత్రతాభావం ఎక్కువయ్యింది ఈమధ్య; ఇక్కడి ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవటం వలన. సబ్‌ప్రైం సంక్షోభం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ల లో ఎడతెగని యుద్ధాలు ఈ ఆర్థికమాంద్యానికి దోహదపడ్దాయి. 2008 జనవరి నుంచి ఆగస్ట్ దాకా ప్రతి నెలా 75000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సెప్టెంబర్ మాసంలో 159,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. పొయిన సంవత్సరం 2.2 మిలియన్ల నిరుద్యోగులు, ఈ సంవత్సరం 9.5 మిలియన్ల నిరుద్యోగులయ్యారు. సెప్టంబర్ లో 6.1 ఉన్న నిరుద్యోగ శాతం, వచ్చే సంవత్సరం ఆఖరికి 8 శాతం కాగలదని ఆర్థిక నిపుణుల అంచనా. లెహమాన్ సోదరులు, వకోవియా బాంక్ వంటి ఆర్థిక సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షొభంలో పడిపోయి, యాజమాన్యం చేతులు మారుతుంది. కొన్ని ఆర్థిక సంస్థలను ఆదుకోవటానికి ఫెడరల్ ప్రభుత్వం ముందుకొచ్చినప్పటికీ, సబ్‌ప్రైంలో ఇరుక్కున్న పెక్కు ఆర్థిక సంస్థల పరిస్థితి దిక్కు తోచకుండా వుంది. మిలియన్ డాలర్ విలువ గల ఇల్లు, 750,000 డాలర్లకు లభ్యమవుతుంది. గత పాతికేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు.ఆర్థిక మాంద్యం వలన ఇదివరలా ఇంక్రిమెంట్లు, ప్రొమోషన్లు తగ్గిపోయాయి. జీతభత్యాలలో పెరుగుదల 2.8 శాతముంటే, ఆహారం, గాస్ (పెట్రోల్) ధరల పెరుగుదల నిరాశ కలుగ చేస్తుంది. స్టాక్ మార్కెట్ల పరిస్థితి కూడా అంతంత మాత్రం గానే ఉంది.డౌజోన్స్ కర్మాగార సగటు సంవత్సరం మొత్తం మీద మూడవ వంతు విలువ కోల్పోయింది. గత 5 పనిదినాలలో డౌ సుమారుగా 1400 పాయింట్లు కోల్పోవటంతో, ఇక్కడి వాల్ స్ట్రీట్ కళావిహీనంగా ఉంది.

అమెరికాలో ఇల్లు కొనాలంటే ఇదే సరైన తరుణమనిపిస్తుంది. కానీ మీ Social Security పత్రం లోని FICO SCORE ఎంతా బాగున్నా, బాంకు లలో కారు కొనటానికే, అప్పు దొరకటం కష్టంగా ఉంటుంది. కారణం బాంకులలో liquidity సరైనంతగా లేక పోవటమే. స్టాక్ మార్కెట్ల పరిస్థితి మారి, బాంకులు ఇళ్ల అప్పులు మరల ఇవ్వటం మొదలయ్యే దాకా, ఇళ్లు కొనటం అమ్మటమనే లావాదేవీలకు గడ్డు కాలమే. ఇక్కడ కరెన్సీ నోట్ల వెనక IN GOD WE TRUST అనే వాక్యం ముద్రించబడి ఉంటుంది. దేవుడే దిగివచ్చి పరిస్థితి చక్కబెట్టాల్సిన కాలమే ఇది. ఎదైనా అద్భుతం జరిగేదాకా, పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది.

ఇక్కడి వారు, సోమవారం నుంచి శుక్రవారం దాకా కష్టించి పనిచేస్తారు. రోజూ ఇంట్లోంచి ఉదయం 7 గంటలకే తమ తమ కార్యాలయాలకు బయలుదేరుతారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి 6 లేక 7 గంటలవుతుంది.శుక్రవారం రాత్రయితే, రోజులా రాత్రి 9 - 10 గంటల మధ్య నిద్ర పోనవసరం లేదు. మందు ప్రియులయితే స్నేహితులతో కలిసి బయటకు వెళ్లటమో లేక ఇంట్లోనే పార్టీ చేసుకోవటమో చేస్తుంటారు. ఉద్యోగ పరమైన అనిశ్చిత పరిస్థితి, ఉద్యోగులలో నిస్పృహ కలుగచేస్తుంది. బాస్ పై కోపంతో, హడావుడిగా, తిడ్తూ, ఉత్తరం బాస్ కు పంపి, తీరికగా పశ్చాత్తాప పడేవారినీ మనము ఇక్కడ చూడవచ్చు.

మందు ప్రభావంతో ఇలా బాస్ కు ఉత్తరం పంపి, తరువాత అగచాట్లు పడే దురవస్థ నుంచి ఉద్యోగులను తప్పించటానికి గూగుల్ తన వంతుగా, కొత్తగా Mail Goggles అనే సదుపాయాన్ని జీ-మెయిల్ వాడేవారికి కలిపించింది. శుక్ర,శని వారాలు రాత్రులలో ఇలాంటి ఉత్తరాలు బాస్ కు రాస్తే, గూగుల్ పసిగట్టి గణితంలో చిన్న పరీక్ష పెడ్తుంది. మందు ఎక్కువయితే ఈ గణిత పరీక్షలో గెలుపొందకపోతే, ఆ ఉత్తరం బాస్ కు జీ-మైల్ పంపించదు. ఆ తరువాతి రోజు ఉదయం, ఆ ఉత్తరం రాసిన వారు అది చదువుకొని, నాలుక కరుచుకొని, తీసివెయ్యటం జరుగుతుంది. జీ-మైల్ లో ఈ సదుపాయానికై మీరు Settings-Labs కు వెళ్లి అక్కడి Mail Goggles ను enable చేస్తే చాలు. మీ ఉద్యోగం భద్రం. మీరు settings లో ఇప్పటికే తెలుగు enable చేసి ఉంటే ఈ Labs_ Mail Goggles కనిపించవు. జీ-మెయిల్ తెలుగు అనువాదకులు, తెలుగు అనువాదంలో ఈ Labs బొత్తాన్ని settings లో ఉంచలేదెందుకనో.మన e-తెలుగు వారు ఈ తప్పును సరిదిద్దాల్సి ఉన్నది.

-cbrao
Atlanta,Georgia,USA.