శుక్రవారం, డిసెంబర్ 26, 2008

మరో ప్రేమ కథ

మన తెలుగు సినిమాలలో 3 గంటలలో చెప్పే ప్రేమకథ. ప్రేమికుల మధ్య అపార్థాల తర్వాత ఎదో ఒక చిన్న సంఘటన తో నాయకుడిపై నాయకికి ప్రేమ కలగటం, చెట్టాపట్టాలు, నాలుగు పాటలు ఇంకాస్త ముందుకెళ్తే, ఆప్రేమకు తల్లి తండ్రుల అభ్యంతరాలు, చివరకు ఏదో ఒక తమాషా పరిష్కారంతో పెళ్లికి పెద్దల అంగీకారం, కథ కంచికి మనమింటికి. ఇదే కథను కేవలం 3 నిమిషాలలో మనోజ్ఞంగా, ఉత్తేజభరితంగా, చిత్రించిన ఈ లఘుచిత్రాన్ని చూడండి. ఇది చూస్తే, మన దర్శకులకు కొత్త ఊహలొచ్చేస్తాయి. ఈ చిత్రాన్ని మీరూ చూసి ఆనందించండి. మీరు దర్శకులైతే మీదైన పద్ధతిలో మీ కథ, స్క్రీన్ ప్లే రాసేసుకోండి.

3 కామెంట్‌లు:

  1. రావు గారూ ..

    చాలా బాగుందండి.. చాలా సున్నితంగా, మృదు మధురంగా సాగిన కధ దానికి తోడు కధానికని తీసిన స్క్రీన్ ప్లే బహు బాబు

    ఇలాంటివన్నీ ఎక్కడ పడతారండీ తమరు?

    రిప్లయితొలగించండి