శనివారం, మార్చి 28, 2009

విశ్వనాధ: ఆవుల గోపాలకృష్ణమూర్తి

నేపధ్యం
తనపై వస్తున్న విమర్శలకు బదులుగా విశ్వనాధవారు ఇచ్చిన ఉపన్యాసానికి, ప్రముఖ హేతువాది ఆవుల గోపాలకృష్ణమూర్తి గారి స్పందన ఈ రోజు చూద్దాము. రామాయణ కల్పవృక్షం పై విమర్శించిన కొత్త వారి కులముతో విశ్వనాధగారికేమి పని? విమర్శను సహృదయంతో స్వీకరించి అందలి గుణదోషములు కదా చూడవలసినది? తన రచనలపై ప్రశంసలే కాని విమర్శలు కూడదని విశ్వనాధ వారి అభిప్రాయమా? -cbrao

సాహిత్యానికే లోపం

(శ్రీ విశ్వనాథవారి ప్రసంగానికి జవాబుగా శ్రీ ఆవుల గోపాలకృష్ణమూర్తి ఆంధ్ర పత్రిక అక్టోబరు 29వ తేదీ సారస్వతానుబంధంలో వ్రాసిన మరొక వ్యాసమిది)

విజయదశమి ఆంధ్రపత్రిక ప్రత్యేక సంచికలో సాహిత్య విమర్శపట్ల కొన్ని ముఖ్య ప్రసంగాలు కనబడినవి. వక్తలు యామిజాల పద్మనాభస్వామి, విశ్వనాథ సత్యనారాయణగారలు, ఇతర పెద్దలు గలరు.

ఈ మధ్య పండిత కొత్త సత్యనారాయణగారు ..తెలుగు విద్యార్థి. పత్రిక (బందరు)లో కొన్నాళ్ళకుగాను, ప్రస్తుతం భారతిలోను విశ్వనాథ సత్యనారాయణగారి రామాయణ కల్పవృక్ష కావ్య పరామర్శ చేయుచున్నారు. ఆ విమర్శమీద సవ్వాళ్ళు చేశారు. యామిజాలవారు. ప్రతి విమర్శ చేస్తామని పందెం వేశారు. ప్రతి విమర్శ చేయవచ్చు. కొత్త సత్యనారాయణగారి విమర్శలో లోపము గానీ, తప్పుగానీ యున్నచో ఎత్తి చూపవచ్చు. యామిజాలవారికి ఆ హక్కు కలదు. కానీ, పందెం దేనికి?, సవ్వాళ్ళు దేనికి? కారణం! వారి కాగ్రహము వచ్చినది. కొత్త సత్యనారాయణ, విశ్వనాథ సత్యనారాయణగారి మీద విమర్శ చేశాడా అని. ఆగ్రహమెందులకు గలిగినది? విమర్శకుని సహృదయంతో చూడలేక పోవుట చేతనే కలుగుచున్నది. వారి ప్రతి విమర్శ కూడా వచ్చినచో పాఠకలోకము మరికొన్ని విశేషాలను తెలుసుకొనవచ్చును. దానికీ పూర్వ వాదము రావచ్చు. దానివలన సాహిత్య జిజ్ఞాస విస్తరింపదగలదు.

ఎవరి కావ్యమునయితే కొత్త వారు పరామర్శించుచున్నారో, ఆ విశ్వనాథవారు మాట్లాడుచు కొన్ని భావాలను వ్యక్తము చేసినారు. ఆ వాక్యాలివి:

1. ఈ విమర్శ వ్రాస్తున్న ఆయన కులానికి చెందినవారిలో నాకు పెక్కుమంది ప్రాణస్నేహితులున్నారు.

2. భారతి ప్రసిద్ధి, స్థాయి యిదివరకే పోయినది. ఇప్పటి దాని స్థితి వీనినిబట్టి తెలియుచున్నది. ఇకనైనా వీనిని వ్రాయవలదని ఆ రచయితకు, ప్రచురించవలదని ఆ పత్రికవారికి ఈ సభాముఖముగా విజ్ఞప్తి చేయుచున్నాను.

ఇంకా ఇతర వాక్యములు కూడా నున్నవి. ఇతరములనట్లుంచి యీ వాక్యార్థాలేమిటి? విమర్శకుని కుల గోత్రములతో కావ్య నిర్మాతకు అవసరమేమి? విమర్శకునకు కావ్యానికి ఉన్న సంబంధములో కులగోత్ర మీమాంస యెందులకు రావలసి వచ్చినది? ఇది శోచనీయము. సాహిత్యాని కున్నట్లు కలుషితం చేయకుండ నుండుట అవసరము.

అసలు విషయము. కొత్త వారి రచనలు వేసిన కారణముగా భారతి పత్రిక స్థాయి తగ్గినది గాని, లేక అసలు భారతి పత్రిక స్థాయి తగ్గిన దశలో కొత్త వారి రచనల ప్రచురణకు చోటు దొరికినదనిగాని, విశ్వనాథవారు భావించి యుందురు. అందువల్ల కొత్త సత్యనారాయణగారిని భారతి పత్రికలో నిట్టి రచనలు వేయవద్దని సత్యనారాయణగారు సభాముఖముగా విజ్ఞప్తి చేసినారు. ఇది బహుశా అనుశాసనంగా గ్రహించిరేమో! ఏ దెట్లున్న ఈ భావుకతకు ఇట్టి సలహాకు కారణమేమిటి? ఎవరైన ఒకరు బయలుదేరి విశ్వనాథవారు పెద్దవారైనారు! ఇక రచన మానండి! అన్న నెట్లుండును? కాదు అసలు రామాయణ కల్ప వృక్షకావ్య నిర్మాణమే విశ్వనాథవారు చేయకున్న నెంత బాగుండునో యని ఎవరైన అన్నయెట్లుండును? అసమంజసముగా నుండును. మరి విశ్వనాథవారి సలహా?? దాని తాతగా నున్నది.

కాని కావ్య నిర్మాత, విమర్శకుణ్ణి విమర్శ మానుకోమనుటలోని ఔచితి ఏమిటి? కాళిదాస, భారవులు తప్పులు చేయవచ్చు. శ్రీనాథునకు సీస రచన తెలియకపోవచ్చు. తిక్కన కవిత పొడి పొడి మాటలు కావచ్చు. తమ రామాయణ కల్పవృక్ష కావ్యాన్ని అర్థము చేసికొనగలవారరుదు కావచ్చు. (అసలు పుట్టలేదని హైద్రాబాద్ ప్రసంగములో లోగడ విశ్వనాథవారన్నట్లు ప్రచురితమైనది) ఎంతైనా పత్రిక స్థాయిని దూషించి, విమర్శ చేయవలదను సలహా నివ్వడంలో ఇది విమర్శ కాదని గాని, స్థాయిలేని విమర్శయనిగాని విశ్వనాథసత్యనారాయణగారన్నట్లు అర్థమగుచున్నది. మాటలకు అర్థములుండును గదా! అంటే సమకాలికుల కావ్య విమర్శ వలదని గాని, పనికిరాదనిగాని విశ్వనాథ సత్యనారాయణగారు భావిస్తున్నారా? అయితే పెద్దవారిని విమర్శించి కాల్చివేయమంటారా? ఇదేమి ఆక్రందన? ఇంత అక్కసు, విమర్శపట్ల ఎందుకుండాలి? కవికి -- విమర్ళకునకు నుండవలసిన సంబంధమును, కవి ఇట్లేనా నిర్వచించవలసినది? ఇట్టి సన్నివేశముల నూహించియే కాబోలు జయంతి రామయ్యగారు విమర్శకుల చెల్మియే కావ్యకర్తకున్నేరువుగాక వేరె యొక నేరువు గల్గుట చెప్ప నొప్పునె అన్నారు.

కవి సలహాను పాటిస్తే కవియనంతరం విమర్శలు రావలెను గాని కవికాలంలో పొగడ్త మాత్రమే కాని విమర్శ రాకూడదని యర్థమగునేమో.. ఇట్టి కవి విమర్శక సంబంధాలవాంఛనీయములు.

పోతే తను సన్మానంలో విమర్శలకు సమాధానము చెప్పకనే విమర్శకుని నోరు కట్టివేయాలన్న ప్రయత్నం చేయబూనటం హాస్యాస్పదముగాను ఉన్నది. విమర్శయన ఇంత భయము దేనికి?

సజీవ సాహిత్యానికి విమర్శ గీటురాయి. విమర్శలో మంచి చెడ్డల పరామర్శ ఉంటుంది. శబ్ద విమర్శలో వ్యాకరణ ఔచితియేగాక, శబ్ద స్వారస్య పరిశీలన ఉంటుంది. తెనుగులో ఇంకా మంచి విమర్శ గ్రంథాలు రావలసియున్నవి. ఈ ధోరణి పెద్దలే ప్రదర్శించి, నోటికి తాళాల విధానాన్ని ప్రచారము చేయజూచిన అసలు కుంటుపడుతుంది విమర్శ కదా!

విమర్శ చేయటము చాల యవసరము. నిన్న మొన్ననే అమెరికా రాయబారి గాల్ బ్రెత్ అన్నారు: విమర్శ పరిణామానికి ఇంజను వంటిదని; నిజమే. విమర్శ లేక సుత్తి మాత్రమే మిగిలితే నిమ్నోన్నతులు తెలియవు. తెలియవలసిన యవసరమెంతైన నున్నది. అందువల్ల విమర్శ చేయుట తప్పు కాదు. అవసర చర్య. విమర్శ అంతా మనమంగీకరించనవసరము లేదు. కాని మార్గాన్వేషణ కానబడుచున్నది. నూతన పుంతలు దొరుకును.

కాని సమకాలీన కవుల కృతుల విమర్శలో నాత్మాశ్రయ నిబద్ధత యుండి, విమర్శ తిన్న వ్యక్తి లోలో గుంది, వదరుట సహజము. ప్రతి విమర్శ తాము చేయుటకన్నా చేయించుట గూడ సహజమే. కానీయండి! విమర్శ సాగనీయండి! విమర్శకుడు అభిరుచుల తత్పరి. తీర్పులమీద తీర్పులు రానీయండి! విమర్శను ఆవేశాలకు నాక్రందనలకు ఆకరాలు కానివ్వకండి! విజ్ఞతను ప్రదర్శించండి. కేవల విజ్ఞప్తులు మానండి. స్థాయి పడిపోయినచే నా స్థాయిని పెంచండి. మరీ దిగజారనీకండి. కవి విమర్శకుడు సహజీవనము చెయ్యనివ్వండి.

సోమవారం, మార్చి 23, 2009

పాషాణపాకి విశ్వనాధ:శ్రీశ్రీ

నేపధ్యం

విమర్శకులకు తనదైన రీతిలో బదులిచ్చిన విశ్వనాధవారి వేదనకు కొత్తవారి బదులు పాఠకులు చదివిఉన్నారు.విశ్వనాధవారి వేదన సహేతుకమేనా? ఇంతకీ అసలు ఆ వేదనకు హేతువేమిటి? విశ్వనాధవారి రచనలను పాషాణం అన్న శ్రీశ్రీ విశ్వనాధవారి ఉపన్యాసానికి,ఆ రోజు ఘటనలకు ఎలా స్పందించారో ఈ రోజు తెలుసుకొందాము.

“పాషాణపాకి”
-శ్రీశ్రీ

శ్రీ కొత్త వారికీ, శ్రీ విశ్వనాథవారికీ ఈ మధ్య వేడిగా, వాడిగా వాదోపవాదాలు సాగుతున్నాయి. ఆ మధ్యలో సత్యనారాయణగారు నన్ను కూడా ఇరికించి రెండు శ్రీలను మూడు పెట్టి హెచ్చరించారు. కృతజ్ఞుణ్ని వారిలో తొలినుంచీ ద్యోతకమవుతున్న “హింసాత్మకత” ఈనాటికీ మూడు మొగ్గలూ, ఆరు పిందెలుగా వర్థిల్లుతూనే ఉంది. అయితే వారిలో ఇటీవల ఇంకో సద్గుణం కూడా వెల్లి విరుస్తోంది. అదే “విమర్శనా వైమనస్యం” – చంపనైనా చంపండి కానీ విమర్శించకండి నన్ను – అనడం విశ్వనాథవారి కొక్కరికే చేతనవును. అవును వారు (తమ దృష్టిలో) విమర్శాతీతులు!
పాషాణపాక ప్రభూ! అని మొట్టమొదటిసారి విశ్వనాథవారిని జలసూత్రం సంబోధించాడు. చెళ్ళపిళ్ళకంటే గొప్పకవినని ప్రారంభించిన విశ్వనాథవారు ఇప్పుడు వాల్మీకికన్నా మిన్నని చెప్పుకునేదాకా పెరిగారు. ద్రాక్షకంటె వజ్రం గొప్పదని వీరి వాదం! కాని వీరు వజ్రాలని మనముందు పోసిన రాళ్ళ గుట్టల్లో రకరకాల దోషాలు చాలా ఉన్నాయి. ఆమాట అన్నందుకే కొత్తవారిమీద కవిగారి కోపం!
“చిద్గన ప్రాలేయాంశువున్” మీద చిన్న గలాటా లేవదీశారీయన! నకారం గురువో లఘువో – దానికేంగాని, చిద్గగనందాకా వెళ్ళిన సత్యనారాయణగారి నింకా ప్రాలేయాంశువువెలా వెంటబెట్టిందో నాకు బోధపడలేదు. విశ్వనాథవారి పాపాణపాకాని కిదో చిన్న ఉదాహరణ మాత్రమే.
నేనేదో సభలో దిగాలుపడి కూచున్నానట! “వేడుక చూడవచ్చిన వాణ్ణి” Enjoyed every minute of the show, జలగంవారు నాకు తిరుగులేని జవాబు చెప్పారట! ఏమని? భారతం ఒప్పుకుంటే అందులోనే ఉన్న రామాయణాన్ని ఒప్పుకోవలసిందేనట! సెబాష్! భారతంలో వందలకొద్దీ పుక్కిట పురాణాలున్నాయి! అన్నిటినీ ఒప్పుకోవలసిందేనా?
ఇంతకూ విశ్వనాథవారి మనోవేదనకు కారణం నాకు తెలుసు! వారి వయస్సులో పొగడికలకు పొంగిపోవడమూ, తెగడికలకు కుంగిపోవడమూ ఉండదు. తాము చేసింది తప్పు అనే సంగతి తమ అంతరాత్మలోనే మారు మ్రోగినప్పుడు, నిజమైన వేదన కలుగుతుంది. ఇదే విశ్వనాథవారిని వీడకుండా పీడిస్తున్న వేదన.
ఏమైనా విశ్వనాథవారికి నా మీద నవ్యాజానురాగం ఉందని నాకు తెలుసు. నవ్యాజం ఎందుకంటే – ఇదుగో ఇలాంటి పితూరీలు లేవదీస్తూ ఉంటాననే! అల్లసాని పెద్దన్నగారికి తెనాలి రామకృష్ణుని మీద బహుశా ఇలాంటి అనురాగమే ఉండవచ్చు. తొలినుంచీ విశ్వనాథవారిని గొప్ప కవిగా గుర్తించిన వారి జాబితాలో నన్ను నేను సగర్వంగా కలుపుకుంటున్నాను.

శనివారం, మార్చి 21, 2009

విశ్వనాథవారి వేదన: చౌదరిగారి పరామర్శ


నేపధ్యం

తన రచనలపై విమర్శలకు విశ్వనాధవారి స్పందన పాఠకులు చదివి ఉన్నారు. తన రచనలపై చౌదరిగారి విమర్శలలో పస లేదని విశ్వనాధ వారి ప్రసంగ సారాంశం. దీనికి కళా ప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి గారు స్పందిస్తూ వెలువరించిన వ్యాసాన్ని పాఠకులు చూడగలరు. -cbrao

భాషకు ద్రోహం

శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి

(ఆంధ్రపత్రిక అక్టోబరు 22వ తేదీ సారస్వతాను బంధంలో శ్రీ విశ్వనాథవారి ప్రసంగానికి శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి సమాధానంగా వ్రాసిన వ్యాసమిది.)

చెన్నపురి ఆంధ్ర మహాసభవారు కావించిన సన్మాన సభలో రామాయణ కల్పవృక్ష విమర్శలను గూర్చి విశ్వనాథవారి కొన్ని మాటలు చెప్పినట్లు 18-10-61 ఆంధ్రపత్రికలో చదివితిమి.

ఈ ప్రసంగంలో నాకును కొంత సంబంధమున్నది. కావున ఈ నాలుగు ముక్కలు వ్రాయవలసి వచ్చినది.

ఈ రామాయణ విమర్శలు వ్రాస్తున్నవారు పండితులే. ప్రచురిస్తున్నవారు పండితులే. అయితే ఈ విమర్శలు ఎంత వరకూ నిలుస్తాయి. అనీ వారు ఆలోచించలేదు. ఇలా చేయడం భావ్యమా! న్యాయమా! అది భాషా ద్రోహం కాదా! సాహిత్యానికి తీరని అపచారం కాదా! ఈ పని భారతి పత్రిక మర్యాదకు తగునా! అని ఈ తీరుగ విశ్వనాథవారు పెద్ద ఆవేదన చూపినారు. ఈ విమర్శను తెలుగు సాహిత్యమున కత్యావశ్యకమనియు పండితులైనవారు ఈ పనిని ఎన్నడో చేసియుండవలసినదనియు ఇన్నేండ్లుగా ఈ కల్పవృక్ష విమర్శనలో ఉపేక్ష వహించుటచే ఒక విధమగు భాషా ద్రోహమనియు, నేటికైనా ఈ కల్పవృక్షములోని ‘వాస్తవికత’ లోకమునకు తెలియజేయుటచే మీకు ధన్యవాదము లనియు ఉత్కళమునుండి మద్రాసు వరకు ఎందరో అపరిచితులు ఇప్పటికే ఎన్నో ఉత్తరాలు వ్రాసిరి, వ్రాయుచున్నారు. ఇది భాషకు ద్రోహమో! భాషకు శ్రేయమో! చెప్పవలసినది కావ్యకర్త కాదు, ఆ భారము లోకమునకే వదలి తన పని తాను జేసికొనుటయే కావ్యకర్తకు ముఖ్యము.

ఈ ఘట్టములో విశ్వనాథవారు సెలవిచ్చిన అంశములివి-

  1. ఈ విమర్శించువారు తక్కువవారు కాదు, పండితులు.
  2. భాషలో తప్పుల సంగతి పండితులకు తెలియనిది కాదు.
  3. ప్రతిదానికి సమర్థన ఉండితీరుతుంది.
  4. ప్రయోగ నిదర్శనము – వ్యాకరణ సూత్రము లభిస్తుంది.
  5. తప్పులేకుండా బ్రహ్మదేవుడు కూడా వ్రాయలేడు.
  6. నేనూ తప్పులు వ్రాశాను.
  7. కాని, పత్రికలో (భారతిలో) చూపించినవి మాత్రం దోషాలు కావని సంస్కృతంలో ఎ.బి.సి.డీలు వచ్చిన వాడైనా చెప్పగలడు.
  8. అయినా ‘భారతి’ ప్రచురిస్తూ ఉంది.
  9. ‘భారతి’ ప్రసిద్ధి – స్థాయి, ఇదివరకే పోయింది.
  10. ఇప్పటి దాని స్థితి వీనినిబట్టి తెలుస్తున్నది.
  11. ఇకనైనా వీనిని వ్రాయవలదని ఆ రచయితకు, ప్రచురించవలదని పత్రికవారికి ఈ సభాముఖాన విజ్ఞప్తి చేస్తున్నాను.

ఈ వాదనలో – యా వేదనలో అర్థము లేదనవలెను. సంస్కృత సారస్వతములోని అప్పయ్య దీక్షిత – జగన్నాథ పండితుల వాదోపవాదములు గాని, పూండ్ల రామకృష్ణయ్యగారి.... చింతామణి సంచికలు గాని, వేదము, కొక్కొండవారి భాషా చర్చలుగాని, గిడుగువారి ‘తెలుగు’ పత్రికల సంచికలు గాని, కల్లూరి – వజ్ఝలవారి విమర్శనములు గాని, తిరుపతి కవులు, రామకృష్ణకవులు, కొప్పరపు కవులు, వారి అవధాన ఘట్టములు గాని పరిశీలించి యున్నచో – ఈ రామాయణ కల్పవృక్ష విమర్శనము భాషకు అపచారము కలిగించునది కాక, భాషకు కావలసిన ఉపచారమే కలిగించి తీరునని సప్రమాణముగా చెప్పవచ్చును. అక్కడనే, తిరువళ్ళిక్కేణి తెలుగు మహాజన సమాజమువారు జరిపిన సభలో అధ్యక్షులైన ‘జలగము’ వారు ఈ విషయములో చెప్పిన ముక్కలు బంగారు ముక్కలు. మహాకవికి యిట్టి ఆవేదన ఉండరాదని, ఆవేదన పడుట సామాన్యుల లక్షణమని, మహాకవులు సామాన్యులకు అతీతులుగా వుండవలెనని, విమర్శనవము వలన వస్తువు వెల హెచ్చునని, వ్యాపారరీత్యా ఆయనకున్న అనుభవమును ఈ సాహిత్య ప్రక్రియలో సైతము చక్కగా చూపగలిగిరి. ఈ యావేదన విశ్వనాథవారిని ఎంత క్రిందికి లాగవైచినచో పాఠకులు పరిశీలించవలె.

‘నేను పెద్దవాణ్ణి అయ్యాను. బహుశా ఎంతోకాలం జీవించను. నాపై కోపము ఉంటే పిస్తోలుతో కాల్చవచ్చునే! మేడమీద ఒంటరిగా పడుకొని ఉంటాను. చిన్న సల్ఫ్యూరిక్ ఆసిడ్ బుడ్డి విసిరితే చాలునే కోపం తీర్చుకోవడానికి. అలా చేయక ఇలా చేయడం ఎందుకనే నేను అడుగుతున్నా’—

ఈ యడిగినది యీ విమర్శనము వ్రాయువారిని గూర్చియు వానిని ప్రకటించు పత్రికల గూర్చియు -- కాబోలు! ఈ యంశములో యీ మహాకవీశ్వరుల స్వభావమే వెల్లడియగుచున్నది. అభిప్రాయ భేదము ఉన్నంతమాత్రాన ఒకానొక వ్యక్తి మరొక వ్యక్తిని చంపుటయే ముఖ్యమన్న ‘ధర్మమును’ వీరు బోధించునట్లు తేలుచున్నది. గాంధీజీ యుగములో బ్రతికిన మనము ‘గాడ్సే’గాని దుశ్చేష్టులు గమనించిన మనము, ఈ విశ్వనాథవారి యీ భావములను గూర్చి ఏమనుకొనవలెనో వూహించవచ్చును. ఇట్టి .సనాతనధర్మములే వీరి రచనలలో హెచ్చుగా ఉన్నవని సప్రమాణముగా నిరూపించవచ్చును.

ఈ సభలోనే, ‘అయ్యా! మీ గురువర్యులు ద్రాక్షాపాకములో వ్రాయగా, మీరు పాషాణ పాకములో వ్రాయుట అది యొక దోషముగానే భావించుచున్న’మని ముఖాముఖిగా ప్రశ్న వేసిన శ్రీశ్రీకి సమాధానమే రాలేదు. ‘తనకు సంస్కృతము రాకపోయినా వాల్మీకి రామాయణం చదువుతుంటే అర్థమవుతున్నట్టే ఉంటుందనియు, విశ్వనాథమారు వ్రాసిన రామాయణం చదువుతుంటే తనకు తెలుగు బాగా వచ్చినా ఏమీ అర్థం కాదనియు అలా ఎందుకు వ్రాయాలని ఆ సభలోనే శ్రీశ్రీ ప్రశ్నించిరి గదా! ‘ఉన్నమాట ముఖంమీద అనేవాడు ఈ రోజుల్లో దోషి’ అని ఆ సభలోనే సెలవిచ్చిన విశ్వనాథవారు శ్రీశ్రీని గూర్చి ఏమని భావింపవలెను! అక్షరాల శ్రీశ్రీ ప్రభృతులకున్న ఆ భావముతోనే అస్మదాదులము సైతము ఈ కల్పవృక్ష విమర్శనమునకు సిద్ధమైతిమి. అంతేగాని, ఈ ‘మహాత్ములను’ పిస్తోలుతో కాల్చి పొట్టను పెట్టుకొను అపర పరశురాముడైన ‘గాడ్సే’ వంటి సనాతన వంశములో మేము పుట్టలేదు. ‘ధర్మచింత – పాపభీతి’ ఉగ్గుబాలతో నేర్చిన జాతి – మా జాతి.

ఈ ప్రసంగములకు మొగమాటపడి ‘భారతి’ వారు ఇకమీదట ఈ విమర్శనములు చేయకపోవచ్చుగాక.ఇప్పటికే వ్రాతలో 2, 3 వందల పేజీలుగా ఈ విమర్శనము పెరిగినది. ప్రతి పుటలో ప్రతి పద్యములో ప్రతి గద్యములో కావలసినన్ని దోషాలు ఎదురగుచున్నవి. ‘భారతి’ వ్యాసములన్నియు ముగిసిన పిదప ‘ప్రతి విమర్శనము’ చేసేదననియు ఆ సభలో ఒకానొకరు శపథము చేసినట్లు చదివితిమి. ఆ శపథము ప్రకారము ఆయన వ్రాసిన అంశములు సైతము పరిశీలించి ఈ గ్రంథములో సమన్వయింపవలసి యున్నది. ఇక్కడ ఒక్క మనవి.

ఇప్పటికే ..భారతి..లో చూపిన దోషాలు ఒక దోషాలు కావని విశ్వనాథవారు అన్నారు. తెలుగు కవిత్వములో ఏ.బి.సి. నేర్చినవాడయినను సంస్కృతములో ఓనమాలు వచ్చినవాడయినను చప్పున చెప్పగల బండెడు దోషములు ఈ కల్పవృక్షములో దండిగా ఉన్నవని లాక్షణిక ధోరణిలో నిరూపించగలను. విజయవాడలోనో మరొక చోటనో సంస్కృతాంధ్రములలో ప్రసిద్ధులను ఇద్దరను ఎన్నుకొని వారి ఆధ్వర్యములో సభ తీర్చి వాదోపవాదములకు అవకాశమిత్తురేని నేనే వచ్చి స్వప్రమాణములుగ ‘కల్పము’లోని దోషాలను పదులుగాదు, వందలుగాదు, వేలతరబడి సంఖ్యలో నిరూపింపగలను. ఆ దోషాలను ఏ రూపముగ సమర్థింప గలరో, ఆ వ్యాకరణము లేవో, అపూర్వ ప్రయోగము లేవో, వాని విలువ ఎట్టిదో సాంగోపాంగముగ మధ్యవర్తులకే వదలి న్యాయము పరిశీలింపవలసి యుండును.

ఇంకొక్క ముక్క .. కులభేదమన్నదే నాకు లేదని బిడ్డల సాక్షిగా, సరస్వతీ సాక్షిగా చెప్పుచున్నానని సభలో విశ్వనాథవారు ఒట్టు పెట్టుకున్నారు. నేడు ఆ భేదము నాకు లేదని సభలో అన్నంతమాత్రాన ఆయన రచనలలో ‘రికార్డు’ అయిన అంశములు మాయమై పోవునా.. ఎక్కడ ఈ రచనలలో ఈ దోషము కేంద్రీకృతమై ఉన్నదో దానిని సైతము సప్రమాణముగ నిరూపింపగలననియే నా ధైర్యము. ఇట్టి చర్చకు వీలైన సమావేశమునకై నిరీక్షింతును. భారతి వ్యాసములకు ఖండనము వ్రాయువారు, దయచేసి ఆ పత్రికల వైనము రవ్వంత నాకు తెలియజేసిరేని అవి తెప్పించుకొని నా గ్రంథము నేను సాగించుకొందును.


శుక్రవారం, మార్చి 20, 2009

విమర్శలకు విశ్వనాధవారి బదులు

నేపధ్యం

ఇంతవరకు విశ్వనాధ వారి రచనలపై, ఇన్నయ్య, చలసాని ప్రసాద రావు, కళా ప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి, నార్ల వెంకటేశ్వర రావు గార్ల విమర్శలు పాఠకులు చదివియున్నారు. వాటిపై రసవత్తర చర్చలూ చదివియున్నారు. తన రచనలు వైదిక ధర్మ ప్రచారం, చాతుర్వర్ణ వ్యవస్థ సమర్ధన కోసం ఉన్నాయని, అంతే కాక వాటిలో పెక్కు వ్యాకరణ, భాషా ప్రయోగ దోషాలున్నాయనే విమర్శలకు విశ్వనాధ సత్యనారాయణ గారికి బదులిచ్చే అవకాశం, 1961 అక్టోబరు 15 విజయదశమినాడు , చెన్నపురి ఆంధ్ర మహాసభ వారి సన్మాన సభలో లభించింది. విశ్వనాధ వారు తమ పై విమర్శలను తిప్పికొట్టిన వైనాన్ని పాఠకులు చూడగలరు.
-cbrao

మనవి మాట

కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి రామాయణ కల్పవృక్షముపై పండిత శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరిగారి విమర్శలను 1961 భారతి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు సంచికలలో ప్రకటించియున్నాము. ఆ తరువాత శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారికి చెన్నపురి ఆంధ్ర మహాసభవారు సన్మానము జరిపించారు. ఆ సన్మానము 1961 అక్టోబరు 15 విజయదశమినాడు జరిగినది. ఆ సభలో మాట్లాడుతూ వారు భారతి స్థాయి పడిపోయినదన్నారు. ఆ తర్వాత దానిపై జరిగిన చర్చ అంతటినీ ఆంధ్రపత్రిక సారస్వతానుబంధములో ప్రకటించి యున్నాము. రాష్ట్రములోని పలుమంది పండితులు తదితరులు ఆ చర్చలో తమతమ అభిప్రాయములను ప్రకటించియున్నారు. ఒక సందర్భములో చర్చ సరసతను కోల్పోయి గిడసబారిపోయినది. భారతి స్థాయి తగ్గినదో తగ్గలేదో అది వేరు విషయము. కాని, ఈ చర్చలో పాల్గొన్న కొందరి విమర్శకుల రచనలవల్ల వారి వారి స్థాయి ఎట్టిదో మాత్రము వ్యక్తమైనది.

సాహితీరంగంలో కవులు, విమర్శకులు

1961 అక్టోబరు 15వ తేదీన చెన్నపురి ఆంధ్రమహాసభవారు ఏర్పాటుచేసిన సన్మాన సమావేశంలో రామాయణ కల్పవృక్షం గ్రంథకర్త కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి ప్రసంగం వివరాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము.

“నామీద ఒక ప్రఖ్యాత పత్రికలో విమర్శలు వస్తున్నాయి. వీనికి సమాధాన మివ్వగలమని ఇప్పుడు ప్రతి సవాలు జరిగింది. ఈ విమర్శలు రాస్తున్నవారు పండితులే. ప్రచురిస్తున్నవారు పండితులే. అయితే ఈ విమర్శలు ఎంత వరకు సమంజసం. ఎంతవరకు నిలుస్తాయి అని వారు ఆలోచించడంలేదు. విద్వాంసులైన వారే ఇలా ఎందుకు చేస్తున్నారో బోధపడకుండా ఉంది. అసలు ఇలా చేయడం భావ్యమా? న్యాయమా? ఇది భాషాద్రోహం కాదా? సాహిత్యానికి తీరని అపచారం కాదా? ఈ పని భారతి పత్రిక మర్యాదకు తగునా? అనేదే నా బాధ.”

“నేను పెద్దవాణ్ణి అయ్యాను. బహుశ ఎంతోకాలం జీవించను. నాపై కోపం ఉంటే పిస్తోలుతో కాల్చవచ్చునే. మేడమీద ఒంటరిగా పడుకొని ఉంటాను. చిన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ బుడ్డి విసిరితే చాలునే. అలా చేయక ఇలా చేయడం ఎందుకనే నేను అడుగుతున్నా.”

“నాకు భగవత్ సాక్షిగా కులభేదంలేదు. నేను సరస్వతీ పూజ చేసుకున్నాను. ఆ సరస్వతి సాక్షిగా నేను ఇది చెబుతున్నాను. నా బిడ్డల సాక్షిగా చెబుతున్నాను. ఈ విమర్శ రాస్తున్న ఆయన కులానికి చెందినవారిలో నాకు పెక్కుమంది ప్రాణ స్నేహితులున్నారు. నన్ను బి.ఏ. వరకు చదివించింది వారే. నా రామాయణ కల్పవృక్షాన్ని అచ్చు వేయించింది వారే. వ్రాస్తున్నవారు తక్కువవారు అనను. పండితులు, సంస్కృతం చదువుకున్నవారు. భాషలో తప్పుల సంగతి పండితులకు తెలియనిది కాదు. ప్రతి దానికి సమర్థన ఉండి తీరుతుంది. ప్రయోగ నిదర్శన, వ్యాకరణం సూత్రం లభిస్తుంది. తప్పులు లేకుండా బ్రహ్మదేవుడు కూడా వ్రాయలేడు. నేనూ తప్పులు వ్రాశాను. మహాకవులంతా తమ కావ్యాలలో తప్పులు వ్రాశారని చూపే గ్రంథాలు ఉన్నాయి. మహాకవి భారవిలోనూ, మహాకవి పండితుడు కాళిదాసులోనూ తప్పులు ఉన్నాయి. అందుకు సంబంధించిన సిద్ధాంత గ్రంథాలు ఉన్నాయి. తప్పులు రాసినా సమర్థించుకోవడానికి, శతకోటి దరిద్రులకు అనంతకోటి ఉపాయాలన్నట్లు, సంస్కృత భాషలో అనేక అవకాశాలున్నాయి. సమర్థించుకోవచ్చు. నేను తప్పులు వ్రాయలేదని అనను, కాని, పత్రికలో చూపినవి మాత్రం, దోషాలు కావని సంస్కృతంలో ఎ.బి.సి.డి.లు వచ్చిన వాడైనా చెప్పగలడు. అయినా భారతి వీనిని ప్రచురిస్తూ ఉంది. భారతి ప్రసిద్ధి, స్థాయి ఇదివరకే పోయింది. ఇప్పటి దాని స్థితి వీనిని బట్టి తెలుస్తున్నది. ఇకనైనా వీనిని వ్రాయవలదని ఆ రచయితకు, ప్రచురించ వలదని ఆ పత్రిక వారికి ఈ సభాముఖాన విజ్ఞప్తి చేస్తున్నాను. ”

“పోతే నేను వైదిక ధర్మ ప్రచారం కోసం వ్రాస్తున్నాననే విమర్శ ఒకటి ఉంది. ఇది కూడా భావ్యమైన విమర్శకాదు. అయినా విజయవాడలో ఒక మిత్రుడు నన్ను ఈ విషయం నిలబెట్టి అడిగాడు. నా గ్రంథాలు చదివిన మీదట సుహృద్భావంతోనే ఈ ప్రశ్న అడుగుతున్నట్టు చెప్పాడు. దానికి నేను చెప్పాను. అయ్యా షేక్స్ పియర్ నాటకాల్లో మర్చంట్ ఆఫ్ వెనిస్ లో ఒక యూదు పాత్రను ప్రవేశపెట్టి, క్రైస్తవ ప్రచారం చేశాడు. మిల్టన్ వ్రాసిన పారడైజ్ లాస్ట్ నిండా క్రైస్తవమతం మినహా మరొకటి లేదు. అయినా మీరు మెచ్చుకున్నారు. ఇలాంటి ప్రశ్న అడగలేడు. మహామహులంతా తమ దేశాల మతాన్ని, ధర్మాన్నీ ఏదో ఒకవిధంగా ప్రచారం చేశారు. రామకృష్ణ పరమహంస చేసిన దేమిటి? రమణ మహర్షి చేసినదేమిటి? భవాన్సు జర్నల్ చేస్తున్నదేమిటి? వాటిని ఈ ప్రశ్న అడగరే. నన్నే అడుగుతారే. లోకువగా దొరికానని, నేను నా దేశాన్ని, మతాన్ని, సంప్రదాయాన్ని, పరిసరాలను, పుట్టుపూర్వోత్తరాలను, సంస్కృతిని ఎలా మర్చిపోను? వాటిని గురించి వ్రాయక నేను వేనిని గురించి వ్రాయను. అన్ని దేశాలలో అందరు కవులూ ఏది ఎలా చేశారో నేను అలాగే చేశాను. ఇందులో నేను చేసిన తప్పు ఏమిటి? ఉన్నమాట ముఖంమీద అనేవాడు ఈ రోజుల్లో దోషి. సహపంక్తిని భోజనం చేసి, పొగిడి, అవతలకు వెళ్లి వా డొట్టి లంజకొడుకు అని తిట్టేవాడు మంచివాడు. ఇలా ఉంది లోకం. మనస్థితి. ఇక్కడితో వదిలేస్తాను.”

పిమ్మట శ్రీశ్రీ , విశ్వనాథ సత్యనారాయణగారిపట్ల, వ్యక్తిగతంగాగల గౌరవాన్ని తెలుపుకోవటానికి వచ్చానంటూ, రామాయణం అంటే నిజం కథ అని నమ్మకం లేదనీ, మళ్ళీ భారతాన్ని నిజమని విశ్వసిస్తాననీ చెప్పారు. శ్రీ సత్యనారాయణ గారి మీద ముఖ్యంగా ఒక ఫిర్యాదు చేస్తున్నానని చెప్పి, వారి గురువుగారైన స్వర్గీయ శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రులవారు ద్రాక్షాపాకంలో రచనలు సాగించగా, శ్రీ సత్యనారాయణగారు పాషాణపాకంలో వ్రాస్తున్నారు. తమకు సంస్కృతం రాకపోయినా, వాల్మీకి రామాయణం చదువుతుంటే అర్థంమవుతున్నట్టే ఉంటుందని, కాని విశ్వనాథవారు వ్రాసిన రామాయణం చదువుతుంటే తనకు తెలుగు బాగా వచ్చినా, ఏమీ అర్థం కాదనీ, అలా ఎందుకు వ్రాయాలని ప్రశ్నించారు. అయినా వాల్మీకాదులు వందమంది వ్రాస్తే శ్రీ సత్యనారాయణగారొక్కరే రామాయణాన్ని రచించారనీ చెప్పారు.

తమకు జరిగిన సన్మానానికి సమాధానం యిస్తూ శ్రీ సత్యనారాయణగారు యింకా యీ విధంగా చెప్పారు. “తెలుగుదేశం లక్షణం ఈ కాసేపట్లోనే తెలిసింది. ఇంకోటి గూడా తెలిసింది. ఉదయం ఆంధ్రమహాసభ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ శాస్త్రిగారు, ప్రస్తుత అధ్యక్షులు శ్రీ నాయుడుగారు ‘తెలియదు’, ‘తెలియ’దంటూనే అమిత విజ్ఞానం చూపించారు. రాముడు కొందరికి భగవంతుడు, అలాగే కొందరికి ఏసు, కొందరికి అల్లా భగవంతులు. భిన్న మతస్తులకు భిన్న విశ్వాసాలుంటాయి. రాముడు దేవుడు కాడని క్రైస్తవుడంటే బాధలేదు. కానీ, మనలోనే కొందరు ఆ విధంగా అంటే బాధకలుగుతుంది. శ్రీ శ్రీ అంటే నాకు అంత ప్రేమ. ఆయనకు సమాధానం చెప్పను. కాని చెబుతే మాత్రం నష్టం ఏమిటి? భారతం ఎందుకు యదార్థం, రామాయణం ఎందుకు అభూత కల్పన? భారతమూ, కాల్పనికమే అన్నారు పాశ్చాత్యులు. దీనిని తిరువణ్ణామలై వాళ్ళు ఒప్పుకోవచ్చు.” తరువాత భారత యుద్ధం ఏ సంవత్సరం, ఏ రోజున, ఏ లిప్తలో ప్రారంభమైంది, భీష్ముడు ఎప్పుడు కరతల్పగతుడైనదీ, ధర్మరాజు ఎప్పుడు కైలాసానికి పోయిందీ, మొదలైన అంశాలు లెక్కకట్టి చెప్పవచ్చునంటూ, దృష్టాంతపూర్వకంగా వివరించి చెప్పారు.

ఇలాంటి ఋజువులు రామాయణంలో గూడా చూపవచ్చునని అన్నారు.

పాశ్చాత్యులు మన సంప్రదాయసిద్ధమైన విద్యా బోధనకు స్వస్తి చెప్పి, వారి చదువులను, విశ్వాసాలను ప్రవేశపెట్టారు. మన ధర్మాలు శాస్త్రాలు, సంస్కృతం పట్ల విశ్వాసం ముఖ్యం. నేనొకసారి పూనా సమావేశంలో ప్రసంగించినప్పుడు అక్కడి కళాశాలలో లెక్చరర్ గా ఉన్న ఒక ఆంధ్రుడు, ఆంధ్రులది సంకుచిత తత్వమనీ, ప్రపంచ దృక్పథం అవసరమని అన్నాడు. మనం ముందు ఆంధ్రులం తర్వాత భారతీయలం, అటుతర్వాత అంతర్జాతీయులం, పాశ్చాత్య సంస్కృతి ప్రమాణమని ఎక్కడైనా ఎవరైనా వాదానికి పూనుకుంటే పూర్వపక్షం చేయగలనని సవాలు చేస్తున్నాను. ఐతే వీనికి తగిన మధ్యవర్తి ఏడీ? ఇలాంటి ప్రశ్నలు 20-30 శాస్త్రాల సంయోజనం వల్లగాని పరిష్కారం కావు. పుట్టటంలోనే పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి. అట్లాగే విభిన్న రుచులు గూడా, మతం అన్న తరువాత విశ్వాసం ఉండాలి. మతమే అక్కర్లేదంటే చేసేదిలేదు. మన ప్రాచీనులు ‘ద్వ్యణుకం’ ‘త్ర్యణుకం’ చెప్పారు. ‘ఈ అణు సమాగమానికి దోహదకారి అయిన వస్తువునే చైతన్యమన్నారు. ఆ చైతన్యమే భగవంతుడు’ అన్నారు.

సాహితీ మాస పత్రిక భారతి సౌజన్యంతో.

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

మీకు వివాహమయ్యిందా? వివాహం కాకపోతే, గర్ల్ ఫ్రెండ్ ఉందా? మీరు మీ భార్యను లేక గర్ల్ ఫ్రెండ్ ను అర్థం చేసుకోవటానికి ఎంత కాలం పడ్తుందో తెలుసా? భార్య మనసు తెలుసని భ్రమపడే భర్తలు ఈ ప్రశ్నకు సరైన సమాధానం చదివినప్పుడు ఆశ్చర్యపోక మానరు. ఒక పరిస్థితిలో మీ భార్య ఎలా స్పందిస్తుందో మీరు ఊహించగలరా? ఊహించగలిగితే, మా ఆవిడనడిగి చెప్తాను అన్న ఊసు రాకూడదు కదా. ఆడదాని మనసులో ఏముందో ఆ బ్రహ్మకు కూడా అంతుపట్టదని తెలుగులో ఒక సామెత ఉంది.

భార్యా భర్తల మధ్య సరైన అవగాహనలేకపోతే అది ఘర్షణకు దారితీస్తుందని అనుభవంలో మీరు ఈ పాటికి గ్రహించే ఉంటారు. ఒక చిన్న మెచ్చుకోలు, కానుక లేక సందర్భాన్నిపట్టి క్షమాపణ, సన్నివేశాన్ని ఎప్పటిలా సహజమైన స్థితికి తీసుకు రాగలదు. ఈ మధ్య ఒక మిత్రుడు నాకు ఆడవారి మాటల గురించి అంతర్జాలంలో తిరుగుతూ ఉన్న ఒక ఉత్తరాన్ని నాకు పంపాడు. చూడటానికి తమాషాగా ఉన్నా ఆలోచిస్తే, ఇది ఆడవారి మనస్తత్వాన్ని చదివి, అర్థం చేసుకుని రాసిన ఆడవారి మాటల కు అర్థాలు అని మీకు అనిపించగలదు.

సరే, పైన అడిగిన మీ భార్యను లేక గర్ల్ ఫ్రెండ్ ను అర్థం చేసుకోవటానికి ఎంత కాలం పడ్తుందో తెలుసా అనే ప్రశ్నకు సరైన సమాధానం ఒక జీవిత కాలం. మా మిత్రుడు పంపిన ఉత్తరం దిగువన ఇస్తున్నా.

NINE WORDS WOMEN USE


(1) Fine: This is the word women use to end an argument when they are right and you need to shut up.

(2) Five Minutes: If she is getting dressed, this means a half an hour. Five minutes is only five minutes if you have just been given five more minutes to watch the game before helping around the house.

(3) Nothing: This is the calm before the storm. This means something, and you should be on your toes. Arguments that begin with nothing usually end in "fine" (refer back to #1).

(4) Go Ahead: This is a dare, not permission. Do NOT Do It!

(5) Loud Sigh: This is actually a word, but is a non-verbal statement often misunderstood by men. A loud sigh means she thinks you are an idiot and wonders why she is wasting her time standing here and arguing with you about "nothing". (Refer back to #3 for the meaning of nothing.)

(6) That's Okay: This is one of the most dangerous statements a women can make to a man. That's okay means she wants to think long and hard before deciding how and when you will pay for your mistake.

(7) Thanks: A woman is thanking you, do not question, or faint. Just say you're welcome. (I want to add in a clause here - This is true, unless she says 'Thanks a lot' - that is PURE sarcasm and she is not thanking you at all. DO NOT say 'you're welcome' . that will bring on a 'whatever'...).

(8) Whatever: Is a woman's way of saying F--- YOU!

(9) Don't worry about it, I got it: Another dangerous statement, meaning this is something that a woman has told a man to do several times, but is now doing it herself. This will later result in a man asking 'What's wrong?' (For the woman's response refer to #5, 3 & 1).

* Send this to the men you know, to warn them about arguments they can avoid if they remember the terminology.

* Send this to all the women you know to give them a good laugh, cause they know it's true!!!

అంతర్జాలం: నిజమా, కలయా

మనకు మిత్రుల ద్వారా, అపరిచితుల ద్వారా ప్రతి నిత్యం ఎన్నో forwarded mails వస్తూంటాయి. వీటిలో కొన్ని నమ్మాలో, నమ్మకూడదో అనే సందేహంలో పడేస్తుంటాయి మనలను. అంతర్జాలమంతా మీలాగే, మంచి వాళ్లే వుండరు; మాయగాళ్లు, మోసగాళ్లు కూడా వుంటారు. మీకు లాటరీ వచ్చిందనో, లేక ఫలానా Holiday Resort లో మీకు మూడు రాత్రుల ఉచిత బస అనో రక రకాల ప్రలోభాలతో వుత్తరాలు వస్తూంటై. వీటిలో ఏది నిజమో అబద్ధమో ఎలా తెలుసుకోవటం? ఈ కింది ఆంగ్ల వివరణ చూడండి. ఆశ్చర్యంగా ఇది కూడా ఒక forwarded mail. ఇందులో చెప్పిన tracker program నిజమా అనే సందేహం కలుగుతుంది. ఇది సాధ్యం కాదు. ఏమంటారు?

అయినా, ఎవరో చెప్పారని 10 మందికి forward చెయ్యకండి మీకు వచ్చే ఉత్తరాలను. Forward చెయ్యకపోతే మీకు ఏ నష్టము జరగదు. Forward చేస్తే ఎలాంటి లాభమూ ఉండదు. ఇది కేవలం బలహీన మనస్సత్వం కలవారితో బలవంతులు ఆడే ఆట ఇది. మోసపోకండి.
By now, I suspect everyone is familiar with:
www.snopes.com and/or www.truthorfiction.com for determining whether information received via email is just that: true/false or fact/fiction. Both are excellent sites. Below is their advice for us.

Advice from Snopes.com

1) Any time you see an E-Mail that says forward this on to '10' of your friends, sign this petition, or you'll get bad luck, good luck, or whatever, it almost always has an E-Mail tracker program attached that tracks the cookies and E-Mails of those folks you forward to. The host sender is getting a copy each time it gets forwarded and then is able to get lists of 'active' E-Mails addresses to use in SPAM E-Mails, or sell to other spammers.


2) Almost all E-Mails that ask you to add your name and forward on to others are similar to that mass letter years ago that asked people to send business cards to the little kid in Florida who wanted to break the Guinness Book of Records for the most cards.All it was, and all any of this type of E-Mail is, is a way to get names and 'cookie' tracking information for telemarketers and spammers - - to validate active E-Mail accounts for their own profitable purposes.

You can do your friends and family members a GREAT favor by sending this information to them; you will be providing a service to your friends, and will be rewarded by not getting thousands of spam E-Mails in the future!

If you have been sending out (FORWARDING) the above kinds of E-Mail, now you know why you get so much SPAM!

Do yourself a favor and STOP adding your name(s) to those types of listings regardless how inviting they might sound!

You may think you are supporting a GREAT cause, but you are NOT in the long run. Instead, you will be getting tons of junk mail later! Plus, we are helping the spammers get rich! Let's don't make it easy for them!

Also: E-Mail petitions are NOT acceptable to Congress or any other organization. To be acceptable, petitions must have a signed signature and full address of the person signing the petition.