కాగడా శర్మ బ్లాగు మూతపడటం ఈ వేసవిలో చల్లని వార్త. గూగుల్ కు అందిన ఫిర్యాదులవలనే ఈ బ్లాగు అంతర్ధానమయ్యిందన్న వార్తలు వినవస్తున్నై. ధూం బ్లాగు కూడా త్వరలోనే మూతపడే లక్షణాలు కనిపిస్తున్నై. ఏ కారణాలవలనైతేనేమి, అక్షయ తృతీయ సందర్భంలో మహిళాబ్లాగర్లకు బంగారం కొనకుండానే, కొన్నంత ఆనందాన్నివ్వగలదీ వార్త. ఈ బ్లాగులలోని రాతలకు బాధపడని, భయపడని మహిళా బ్లాగర్లు ఎవరైనా వుంటే తెలియపరచండి. వారు దీప్తిధార నుంచి వీరతాడు బహుమతి కి అర్హులుగా ప్రకటిస్తా. ఈ రెండు బ్లాగులు మూతపడిన రోజే పాఠకులకు, ప్రత్యేకంగా మహిళలకు దీపావళి.
బ్లాగులు ఎవరి కోసం? ఎందు కోసం? వ్యాఖ్యలు రాకపోతే ఆ టపా తుస్సుమన్నట్లా? 25 వ్యాఖ్యలు వస్తే హిట్ అయినట్లా?
ఎట్లాంటి టపాలు పాఠకులు ఎక్కువ ఆసక్తితో చదువుతున్నట్లుగా మీ భావన?
1) సాహిత్య విషయాలు
2) సినిమా కబుర్లు
3) హేతువాద చర్చలు, వ్యాసాలు
4) గాసిప్ కబుర్లు (ఉదాహరణ ధూం వగైరా బ్లాగులు)
5) సైన్స్, ఖగోళ శాస్త్రం
6) జ్యోతిష్య శాస్త్ర కబుర్లు
7) ఆరోగ్య విషయాలు
8) అవి -ఇవి -అన్నీ
9) రాజకీయాలు
10) సంగీతం
11) ఛాయాగ్రహణం
12) యాత్రా స్మృతులు
13) వంటలు పిండివంటలు
14) వ్యక్తిగత అనుభవాలు
15) కొత్త పరికరాలు (Cell phone, Camera, Computer etc)
16) ఆత్మ కధలు, జీవితానుభవాలు
17) మనో వైజ్ఞానిక శాస్త్రం
18) చరిత్ర
19) శృంగారం
కొన్ని విషయాలపై రాసే టపాలకు స్పందన తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు శాస్త్ర (Science), సాహిత్య విషయాలపై రాసే టపాలకు, సినిమాలు, సొల్లు కబుర్లకు ఉన్నంత ఆదరణ ఉండక పోవచ్చు. హిట్లు రానంత మాత్రాన వీటి ప్రయోజనం ఉండదా? సామాజిక హితం కోసం హిట్లు రాకపోయినా,నిరుత్సాహపడకుండా ఇలాంటి విషయాలపై రాసే బ్లాగర్లకు జొహార్లు.కొత్త పరికరాలు (Cell phone, Camera, Computer etc) పై తెలుగు బ్లాగులు బహు తక్కువ. వీటి అవసరం కనిపిస్తుంది. మనకు తెలియకుండానే మన జీవితం, పైన పేర్కొన్న అన్ని విషయాలతో ముడిపడి ఉంది. హిట్లు వచ్చినా రాకపోయినా మీకు నచ్చిన విషయాలపై రాస్తూ ఉండండి.
"సినిమా పాటలలో సాహిత్యం ఉంటుందా?" - అని ఒకానొకప్పుడు (మా కాలేజ్ రోజుల్లో) చర్చలు జరుగుతుండేవి. కొందరు ప్రఖ్యాత సినీ గేయకవుల సినీ పాటలు సంపుటాలుగా వెలువడ్డాక సందేహ నివృత్తయి, చర్చ పాతబడిపోయింది. ఇప్పుడు బ్లాగులలో తాజా చర్చ "బ్లాగులలో సాహిత్యముందా?" అని. నా ప్రపంచం బ్లాగులో ప్రచురితమైన సాహితీపరులతో సరసాలు ఇంకా వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు కలిపి తాజాగా సాహితీపరులు పాత్రికేయులతో సరసాలు గా పుస్తక ప్రచురణ అయ్యింది. ఈ పుస్తకంలోని వ్యాసాలు తొలిసారి బ్లాగులో ప్రచురితమయిన తర్వాతే, పుస్తకంగా వెలుగు చూశాయి. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? బ్లాగులలో వస్తున్న రచనలు ఉత్త ' రాలు ' కాదు, పస ఉన్న సరుకని.
గురువారం, ఏప్రిల్ 23, 2009
బుధవారం, ఏప్రిల్ 15, 2009
e-తెలుగు
e-తెలుగు కార్యకర్తలకు రాజకీయ ఉద్దేశాలు, Hidden Agenda ఉన్నట్లుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. e-తెలుగు ఉద్దేశాల పై కూడా పాఠకులకు సరైన అవగాహన లేనందున, వారు సందేహాలకు లోను కాకుండా e-తెలుగు గురించి కొన్ని వివరణలు ఇచ్చే అవసరం కలుగుతుంది. e-తెలుగు అనేది మొదటి నుంచి ఒక తెరిచిన పుస్తకం. ఒక లిఖిత నియమావళి ప్రకారం ఇది పని చేస్తుంది. e-తెలుగు ఉద్దేశాలు స్పష్టంగా నిర్వచించబడి ఉన్నాయి. e-తెలుగు గురించి వివరిస్తూ గతంలో కొన్ని వ్యాసాలు ప్రచురించబడ్డాయి. e-తెలుగు గురించి దాని కార్యకర్తల గురించి తెలుకోవటానికి ఈ కింది వ్యాసాలు మీకు దోహదపడగలవు.
e-తెలుగు ఎలా ఏర్పడింది?
e-తెలుగు ప్రశ్నలు & జవాబులు
తరచూ అడిగే ప్రశ్నలు
అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికై చేసే కృషిలో భాగంగా బ్లాగులను, వికీపీడియాను, వెబ్ పత్రికలను, ఇతర తెలుగు వెబ్‌సైట్లను తెలుగువారికి పరిచయం చేస్తోంది. ఇంతే కాకుండా పెక్కు వెబ్ సైట్లలో అనువాద కార్యక్రమాలను సభ్యుల సహకారంతో నిర్వహిస్తుంది. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అశ్లీల రాతలకు దూరంగా ఉంటుంది, ప్రోత్సహించదు. e-తెలుగు కార్యక్రమాలు మొదటి నుంచీ పారదర్శకంగా ఉంటున్నవి, ఉంటాయి. బ్లాగుల, బ్లాగరుల చర్చా గోష్టులు , యునికోడ్ ప్రచార కార్యక్రమాలు అన్నీ అందరికీ తెలిసేలా నిర్వహించబడతాయి.
తెలుగు బ్లాగరుల మొదటి సమావేశం నుంచి ఈ రోజు దాకా జరిగిన అన్ని బ్లాగరుల సమావేశ నివేదికలు మీరు దీప్తిధార బ్లాగు, e-telugu.org వెబ్సైట్ లో చూడవచ్చును. బ్లాగరుల సమావేశాలన్నీ గతంలో నమోదు చేసి, పైన చెప్పిన ప్రదేశాలలో ప్రచురించటం జరిగింది. ఏవీ రహస్యాలు లేవు. e-తెలుగు లో సభ్యులు కానివారు కూడా ఇవి చూడవచ్చు, చదవవచ్చు. బ్లాగర్ల సాధక బాధకాలు, సాంకేతిక సమస్యలు, ఆకాశరామన్న ఉత్తరాలు, టపాలు వగైరా అన్నీ ఇక్కడ చర్చించబడతాయి, ఆ చర్చల వివరాలు ప్రచురించబడతాయి కూడా. కొందరు బ్లాగర్లు అనుకున్నట్లుగా ఇవి ఆంతరంగిక, రహస్య సమావేశాలు కావు. పలు ఉత్తరాలు, ఫోన్స్ కు సమాధానంగా పై వివరణ ఇస్తున్నాను.
సమావేశ వివరాలు వ్రాయవద్దంటే ఎలా? ఇన్నాళ్ల మన పారదర్శకతకు భంగం వాటిల్లదా, ఇలా చేస్తే?
సోమవారం, ఏప్రిల్ 13, 2009
వాడిగా, వేడిగా తెలుగు బ్లాగర్ల సమావేశం
ఈ వేసవి వేడిగా ఉంది. ఎలెక్షన్ జ్వరం, శేఖర్ కమ్ముల గోదావరి లాంటి చిత్రం (గుర్తుందా! ఈ వేసవి చల్లగా ఉంటుంది అన్న Caption) విడుదల కాకపోవటం కూడా కారణాలు కావచ్చు. వీటికి అదనంగా నిజం పేరుతో బ్లాగులు రాయటానికి వెనుకాడే పిరికిపందల అసభ్య బ్లాగురాతలు తోడయ్యాయి.
12th April 2009: 10 నిమిషాలు ఆలస్యంగా నేను కృష్ణకాంత్ ఉద్యానవనానికి వెళ్లేసరికి అక్కడ శ్రీనివాస్ దాట్ల (blog.harivillu.org), శ్రీనివాసకుమార్ గుళ్లపూడి (http://worthlife.blogspot.com/) ఇంకా సతీష్ కుమార్ యనమండ్ర (http://vedabharathi.blogspot.com/) ఎండవేడినుంచి ఉపశమనానికై ఆంధ్రా గోలీ సోడా నిమ్మరసంతో కలిపి తాగుతూ కనిపించారు. అప్పటికే పార్క్ లోపల చక్రవర్తి (http://bhavadeeyudu.blogspot.com) ఇంకా శ్రీమతి మాలా కుమార్ (http://sahiti-mala.blogspot.com/) మాకోసం వేచియున్నారని తెలియటంతో అందరమూ లోనికి వెళ్లి శ్రీమతి మాల, చక్రవర్తి గార్లను కలుపుకొని, ఎప్పుడూ సమావేశాలు జరిపే పచ్చికబయలు వద్దకు వెళ్లి, కూర్చున్నాము. ఒకరినొకరు పరిచయం చేసుకునే కార్యక్రమంలో ఉన్నప్పుడు, వీవెన్ (http://veeven.wordpress.com), సతీష్ కుమార్ యెర్రంశెట్టి (http://blaagu.com/sateesh/) ఇంకా అరుణ పప్పు (http://arunam.blogspot.com/) వచ్చారు.
అప్పటికి ఒకసారి పరిచయాలయినా, కొత్తగా వచ్చిన వారి కోసం మరలా పరిచయ కార్యక్రమాలు మొదలుపెట్టాము. పరిచయం చక్రవర్తి తో మొదలుపెట్టాము. చక్రవర్తి తనని పరిచయం చేసుకుంటూ తేలిక విషయాలు ఉబుసు (http://ubusu.blogspot.com/) బ్లాగులోను, కొంచెం బరువైనవి తన భవదీయుడు బ్లాగులో రాస్తుంటానని, తన బ్లాగులోని నిందాస్తుతి ఎవరైనా బ్లాగరులను బాధిస్తే క్షమించాలని కోరారు. వీరి శ్రీమతి స్వాతి బ్లాగరి. ఆమె బ్లాగు ఊసులు (http://oosulu.blogspot.com/). ఆమె రాలేదేమన్న మిత్రుల ప్రశ్నలకు తను అడిగానని, తనకు ఈరోజు సమావేశానికొచ్చే మూడ్ లేదని బదులిచ్చారు. ఆ తరువాత సతీష్ కుమార్ యెర్రంశెట్టి తన పరిచయం చేసుకున్నారు. సతీష్ ఈనాడు జర్నలిజ్మ్ స్కూల్ లో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నారు. అసభ్యరాతకారులకు భయపడి, తమ బ్లాగులు మూసేసిన అక్కలు, చెళ్లెళ్ల పట్ల ఆవేదన వ్యక్త పరుస్తూ వారు, ఆడో మగో తెలియని, పేరు చెప్పుకొలేని పిరికిపందల రాతలకు వెరవక తమ బ్లాగులు పునః ప్రారంభించాలంటూ రాసిన వీరి కవిత ఇక్కడ http://blaagu.com/sateesh/2009/04/13/%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%80-%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be%e0%b0%b2-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ae%e0%b1%81/ చూడండి. ఆ తరువాత వీవెన్ తనను పరిచయం చేసుకుటూ తన పేరులోని (వీర వెంకట చౌదరి) చౌదరి తీసివేయగా మిగిలిన పేరును సంక్షింప్తం చేసి వీవెన్ గా లోకానికి పరిచయమవుతున్నానన్నారు. వీవెన్ సాధారణంగా ఉంటూ, అసాధారణమైన లేఖిని, కూడలి సృష్టికర్తగా బ్లాగులోకానికి తెలుసు.శ్రీనివాసకుమార్ గుళ్లపూడి మాట్లాడుతూ నలుగురికీ పనికివచ్చే, ఒక మంచి పనికి ప్రేరణ కలిగించే కథలు తన బ్లాగు "జీవితంలో కొత్త కోణం" లో వ్రాస్తుంటానన్నారు. వీరి బ్లాగులోని తాజా కథనం Homes for the Hungry కథనం ఇక్కడ http://worthlife.blogspot.com/2009/03/blog-post_28.html చదవవచ్చు.
కుడి నుంచి యెడమకు: శ్రీయుతులు సతీష్ కుమార్ యెర్రంశెట్టి, వీవెన్, శ్రీనివాసకుమార్ గుళ్లపూడి, సతీష్ కుమార్ యనమండ్ర, శ్రీనివాస్ దాట్ల , cbrao, అరుణ పప్పు ఇంకా మాలా కుమార్.
ఆ తరువాత పరిచయమయిన వారు సతీష్ కుమార్ యనమండ్ర. వీరు తన బ్లాగు sky-astram.blogspot.com లో సంభ్రమం కలిగించేలా ధూం ఎవరో తనకు తెలుసంటూ, ధూం గురించిన ఆధారాలు తనవద్ద వున్నాయంటూ టపాలు రాసి పాఠకులను అచ్చెరువొందించారు. వీరి సాక్ష్యధారాలు ఇంకా బయటపెట్టలేదు. ఆ తరువాత శ్రీనివాస్ దాట్ల మాట్లాడుతూ తన బ్లాగు హరివిల్లులో రాస్తుంటానని తెలిపారు. Blog home page decoration లో కిటుకులు తెలిసిన శ్రీనివాస్ దాట్ల, ఒక అందమైన eligible bachelor. మీకు తెలిసిన అమ్మాయుంటే చెప్పండి. దాట్ల ముక్కుకు తాడెయ్యాలి. ఆ పై cbrao మాట్లాడుతూ తాను ఎక్కువగా దీప్తిధార (http://deeptidhaara.blogspot.com/) లో రాస్తుంటానని, సమీక్షలు, విమర్శలు పారదర్శి (http://paradarsi.wordpress.com/)లో రాస్తానని చెప్పారు. అరుణ పప్పు మాట్లాడుతూ తాను ఆంధ్రజ్యోతి లోని నవ్య స్త్రీల శీర్షికలు వగైరా నిర్వహిస్తామని చెప్పారు. డిసంబర్, జనవరి మాసాలలో e-telugu.org కార్యక్రమాలలో వీరు చురుకుగా పాల్గొన్నారు. తెలుగు బ్లాగుల గురించి జ్యోతిలో విపులమైన వ్యాసం వ్రాశారు. తెలుగు బ్లాగులకు తమ నవ్యలో విస్త్రుత ప్రచారం కల్గించారు. తెలుగు బ్లాగులకు ఎంతో సేవ చేసిన అరుణ ప్రస్తుతం తానే ధూం అనే పేరుతో రచనలు చేస్తున్నారనే అపవాదు ఎదుర్కుంటున్నారు. శ్రీమతి మాలా కుమార్ మాట్లాడుతూ తన అసలు పేరు కమల అయినా బ్లాగ్లోకానికి మాలగా పరిచమయ్యి, యాత్రా స్మృతులు, వైవాహిక జీవితం, పుస్తకాలు, రచయిత్రులు వగైరా విషయాలపై తన బ్లాగు సాహితి -మాల బ్లాగులో వ్రాస్తుంటానని పరిచయం చేసుకున్నారు. బ్లాగ్లోకంలోని కల్మషం తెలియదు వీరికి.
To be continued .....
తరువాయి భాగంలో
చర్చా కార్యక్రమం
మూతబడిన బ్లాగుల బ్లాగరిల ఆత్మస్థైర్యం పెంచేదెలా?
అసభ్య రాతలు రాసే ధూం, కాగడ శర్మలనేమి చెయ్యాలి?
నేను ధూం ను కానన్న అరుణ.
శనివారం, ఏప్రిల్ 11, 2009
చౌదరిగారికి సవాలు విసిరిన విశ్వనాధవారు
నేపధ్యం
శ్రీశ్రీ అభిప్రాయంలో భారతం వాస్తవం, రామయణం మిధ్య. రామాయణ కథ భారతంలో ఉంటే, భారతం Fact అయితే, రామాయణం Myth ఎలా అవుతుంది? శ్రీమద్ రామాయణ కల్పవృక్షము పాషాణ పాకమేనా? పాషాణాన్ని పగులకొడ్తే వజ్రాలు, మణులు రావా? ఇంతకీ చౌదరి గారి సవాలును విశ్వనాధవారు స్వీకరించి, పండితుల సభ పెట్టడానికి అంగీకరించారా? కొత్తగారి విమర్శలు చదవకుండా వాటికి విశ్వనాధ వారు ఎలా జవాబిచ్చారు? -cbrao
నాది పాషాణపాకమనే వారి బుద్ధిలోనే లోపముంది
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
(కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు విమర్శలకు సమాధానంగా అక్టోబరు 29వ తేదీ ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో వ్రాసిన వ్యాసం)
శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరిగారు నేను ఆంధ్ర మహాసభ చెన్నపురిలో చేసిన ఉపన్యాసమునకు బదులుగా అక్టోబరు 22 ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో ఒక సమాధానం వ్రాశారు. ఎవరో తీసుకొని వచ్చి చూపించారు. నా ఆవేదన, శ్రీ జలగం సుబ్రహ్మణ్యం నాయుడుగారు చెప్పిన మాటలు, శ్రీశ్రీ అన్న పాషాణపాకం ఇవన్నీ ఇట్లా ఉంచుదాం. నేను ‘గాడ్సేకులం’ వాణ్ణి. ఆయన ‘గాంధీకులం’ వాడు. అది కూడా అట్లా ఉంచుదాం. ‘ధర్మచింత’,
‘పాపభీతి’ ఉగ్గుపాలతో పెట్టిన జాతి వారిది. నేను ఆ సభలో త్రికరణ శుద్ధిగా వర్ణాది భేదాలు లేవన్నది వారు నా రామాయణం ప్రకారం ఋజువు చేస్తారట. వారికే ‘ధర్మచింత’, ‘పాపభీతి’ ఉన్నవని వ్రాస్తున్నారు. నేను సభలో అన్న, నాకు వర్ణ ద్వేషం లేకపోవడం అబద్ధం! వీరు ధర్మచింత మొదలైనవి తమకు కలవని వ్రాయడం నిజం! అవి రెండూ వారికి ఉండడానికి వీలులేదని వారి విమర్శ వ్యాసాలే సాక్ష్యం. ఇందులో ఒక భేదం ఉన్నది. వ్యక్తిగతంగా నాకు ఆ గుణాలు లేవన్నాను. ఆ ధర్మబుద్ధి, పాపభీతి వారి జాతి గుణాలు అని చెబుతున్నా డాయన. నన్ను గురించి నేను చెప్పుకోవచ్చు. తన జాతిని గురించి తాను పూచీ పడడం కష్టం. వారి జాతి యేమిటి? భారతీయ జాతియా? ఆంధ్రజాతియా? ఒక జాతికి ప్రధానమైన లక్షణాలు కొన్ని ఉంటవి. జాతి మొత్తము మీద ఆ లక్షణాలు చెప్పవచ్చు తప్ప, జాతిలో పుట్టిన ప్రతివాడికీ ఆ లక్షణాలు ఉండవనడం చాలా కష్టం.
ఇవట్లా ఉంచి, శ్రీ శ్రీ నా కవిత్వాన్ని పాషాణ పాకమన్నాడు. నేను సమాధానం చెప్పలేదని ఆక్షేపణ. శ్రీశ్రీకి ఎందుకు సమాధానం చెప్పలేదో మనవి చేస్తాను. శ్రీశ్రీ ఆ సభలో దిగాలుపడి కూర్చోవలసి వచ్చింది. నేను సమాధానం కూడా చెబుతే ఆయన ఇంకా దిగజారిపోతాడని చెప్పలేదు. శ్రీశ్రీని నేను నలుబది యేండ్ల నుండి యెరుగుదును. ఆయన అంటే నాకొక విధమైన ప్రేమ ఉన్నది. ఓ చౌదరిగారూ! నేను వ్రాస్తే మీరంగీకరించరు. ఒప్పుకోరు. లౌక్యం కోసం వ్రాస్తున్నానని అనుకున్నా అనుకోవచ్చు. యదార్థంగా మీరన్నా కూడా నాకొక విధమైన అనురాగంవంటి భావం ఉన్నది. ముప్ఫై యేళ్ళ క్రిందట – ఇంకా ఎక్కువ ఏండ్ల క్రిందనో మీరూ, నేనూ, శ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారూ కలిసికొన్నాము. ఆనాడు చాలా స్నేహంగా మాట్లాడాము. తరువాత మనము కలిసికొన్నదీ తక్కువే. స్నేహంగా మాట్లాడు కొన్నదీ తక్కువే. మిమ్మల్ని గురించి నాటినుండి నేటివరకూ, ఆ అర్ద్రమైన ప్రభావమే ఉన్నది. అలా అందరికీ ఉంటుంది లోకంలో. అలాగ, మీరు ఇవ్వాళ విమర్శ వ్రాస్తే మీమీద నాకు కోపం రానట్లే, శ్రీ శ్రీ పాపాణం పాకం అన్నా కోపం రాలేదు. సాగదీస్తే శ్రీ శ్రీ కాదు, ఆరు శ్రీలున్నా నిలువడు.
ఆ రోజున శ్రీశ్రీ ఎందుకు దిగాలుపడి ఉన్నాడంటే చెబుతాను. ఆ సన్నివేశం ఆంధ్ర పత్రికా విలేఖరి వ్రాయలేదు. వెయ్యలేదు. అది ఇది. శ్రీ శ్రీ “భారతం (Fact) రామాయణ (Myth)” అన్నాడు. “వాల్మీకులు చాలామంది ఉన్నారు. వాళ్లందరూ వాల్మీకులుకారు. విశ్వనాథ ఒక్కడే వాల్మీకి” అన్నాడు. ఈ సందర్భంలో శ్రీ జలగం సుబ్రహ్మణ్యంనాయుడుగారు – ఆయన సంస్కృతాంధ్రాలలో చక్కని పరిచయం కలవారు సుమండీ. చాలా గడుసువారు కూడాను – ఆయన శ్రీశ్రీని నిగ్గదీశారు. “ఏమండీ! భారతం (Fact) ఏ కదా! రామాయణం (Myth) ఏ కదా? భారతాన్ని ఒప్పుకుంటారు కదా” రామాయణం (Myth) ఏ కదా? ఇల్లా నాలుగుసార్లు శ్రీశ్రీ మాట అనిపించి, సభవంక చూచి, “ఏమండీ! వింటున్నారుకదా!” అని మళ్ళీ శ్రీశ్రీ చేత ఒప్పించి, “అయ్యా! భారతము (Fact) ఐతే భారతంలో రామాయణ కథ చెప్పబడి ఉన్నది. రామాయణం (Myth) అవడం ఎలాగా? భారతంలో ఉన్నదంతా (Fact) అని మీరే అన్నారు కదా! అని బాంబు పేల్చారు. శ్రీశ్రీ డీలాపోయినాడు. తెల్లమొహం వేశాడు. “అయినా (Myth) ఏ” అన్నాడు. నాయుడుగారు “మళ్ళీ అలా మాట్లాడుతారేం?” అన్నాడు.
నాకు స్నేహితుడైన శ్రీశ్రీ సభలో అట్లా కాక వారి పాషాణపాకం అన్నాడని సమాధానం చెప్పి, ఇంకా దిగులుపర్చమంటారా? నాది పాషాణపాకమన్నవాడి ఆంధ్ర సారస్వత విజ్ఞానం పాషాణ ప్రాయమంతే! అని నే ననడం బాగుండదుకదా! ఈ అహంకారాన్ని చూచి ఇతరులు వ్రాసే వ్రాతలు, వాళ్లు మాట్లాడే మాటలు – వాటిపేరు “ధర్మచింత – పాపభీతి” ఎబ్బే.. వారి కనులు అహంకారమేలేదు. అయ్యో బాబూ! అనవసరమైన అహంకారాన్ని మనం చంపుకోలేమే. మాత్సర్యాదులవల్ల పుట్టిన అహంకారాన్ని మనం చంపుకోలేమే? ఎవరో ఒక పనిచేసి, అది గొప్ప పని అనుకుని – చాలామంది గొప్పపని అనడం మూలంగా కూడా, అనుకున్నాడేమో పాపం - వాడు నేను చేసిన పనిలోని గొప్పతనం ఇది ఇదీ అని ఇతరులకు చెబుతే అది గొప్పతనం కాకపోతే కాదను. అంతేకానీ, అది వారి అహంకారమనడమేలా? వారు చెప్పిన గొప్పతనం కాకపోతే వాడు వృద్ధుడు. అహంకారమైనా గొప్పదనమేగా? ఒకడు తన గొప్పతనాన్ని గురించి అహంకార పడడం చూచి అవతలివాడు పడేదానికి పడేదానికి పేరేమిటి? పెద్దలకు తెలియాలి.
మీరు చాలా నెలలబట్టి ఈ వ్యాసాలు వ్రాస్తున్నారు. నే నా ఒక్కవ్యాసం కూడా చదువలేదు. నాకు వర్ణ శాఖాది ద్వేషాలు లేవంటే నమ్మనివారు, ఈ విషయాన్ని నమ్ముతారని నే ననుకోవడం లేదు. నా పాకం పాషాణపాకం అన్న శ్రీశ్రీని అట్లాంటి మరికొందరితో కలిసి అడుగుతున్నాను. అయ్యా! నా గ్రంథాల్ని తమరు ఏవేవి చదివారు? మీరు చదివిన ఒక గ్రంథంలో ఎన్ని పద్యాలు ఉన్నవి? మీకు అర్థంకాకపోవడమేకాదా, పాషాణ పాకమంటే? అందులోవన్నీ అర్థం కాలేదా? కొన్నేకాలేదా? అర్థం ఐనవెక్కువా? కానినెక్కువా? పాషాణపాకమంటే అర్థమేమిటి? పగులగొట్టడానికి వీలులేదనియేకదా? మణులు ఉన్నవి. వజ్రాలు ఉన్నవి. వెలగల రాళ్ళు ఉన్నవి. అవి కాంతిని విరజిమ్ముతూ ఉంటవి. వాటి కాంతిని చూచి ఆనందించాలి తప్ప పగులకొట్టడు. పగులకొట్టి చిన్న చిన్న రాళ్ళుగా వర్తకులమ్ముతారు. ఆ పగులగొట్టే నేర్పు వాళ్లకు తెలుసు. అలాగే మీరన్నట్లు నేను వ్రాసిన వందపద్యాల్లో రెండు మూడు పద్యాలు మీకు పాషాణపాకమనిపిస్తే, వాటి కాంతి మీకు తెలిస్తే ఆనందించండి. తక్కినవి మీ ద్రాక్షాపాకలే, మీ కదళీ పాకాలే వందలాది పద్యాలుంటవి. అవి చూచి ఆనందించండి. మేము మీ గ్రంథాన్ని తిట్టడానికే పుట్టాము. మేము చదువము అని మీరంటే మీకు నమస్కారము.
ఎవరో కొందరు మాత్పర్యగ్రస్తులు ఒక మాటను దేశంమీద పారవేయడం “గతానుగతికోలోక: వలోక: పారమార్థిక:” అన్నట్లుగా తక్కినవాళ్లు దాన్ని పట్టుకొని ప్రాకులాడడం అలవాటైంది. నేను రామాయణంకాని, ఇతర కవిత్వంకాని వందలాది సభల్లో చదివాను. విన్నవాళ్ల్లెవరూ పాషాణపాకమనలేదు. అనలేదు సరికదా ఆనందించారు. ఈ పాషాణపాకం, అనేవాడి బుద్ధిలో ఉంది. హృదయంలో ఉంది. నేను ఆవేదన పొందానని అనుకోవడం శ్రీ జలగం సుబ్రహ్మణ్యం నాయుడుగారు పొరపాటు పడ్డారు. నేను నా జాతి లక్షణం చెప్పుకోలేను కాని, నా వ్యక్తి లక్షణం ఏమంటే “గాఢంగా నేను నా చేత నైనంతలో వూహించడం, త్రికరణ శుద్ధిగా మాట్లాడటం” త్రికరణ శుద్ధిగా మాట్లాడుతుంటే చాలామంది ఆవేదనే అనుకుంటారు. నేను ఆవేదనపడితే శ్రీ చౌదరిగారి విమర్శలకు ఆ విమర్శలు చేసే పత్రికలు, వేయకపోయినా, ఇతర పత్రికలలో సమాధానాలు ఇంతకంటే శరపరంపరలుగా వ్రాసేవాణ్ణి.
వ్రాయడం – మాట్లాడడం రెండు విధాలు. వ్రాయడంలో ఆవేదన ఉన్నదో లేదో తెలుసుకోవడం కష్టం. మాట్లాడడంలోనూ తెలుసుకోవడం కష్టం కానీ, ఇందాక మనవి చేశాను కదూ – వాడు ఆవేదన పడ్డాడాని అనుకోవచ్చు. ధర్మం చెప్పేవాడి మాట ఆవేశంతో చెప్పినట్లు ఉంటుంది. ఆ ఆవేశం ఆవేశమౌనో కాదో మరుక్షణమందు తెలుస్తుంది. అది నిజంగా ఆవేశమైతే తరువాత చాలా సేపు ఉంటుంది. మరుక్షణమందు ఉండని ఆవేశము ధర్మం చెప్పడంలో ఉన్న తీవ్రతకాని ఆవేశం కాదు. ఆ శ్రీ శ్రీ వ్రాసింది పాషాణపాకం. అనగా పగులగొట్టితే ఏమి ఉండదో, అది పాపాణపాకం. నా కవిత్వం పాషాణ పాకమన్నది ఎవడో ఒక టెంకాయ పిచ్చికొండ. కాలం దానికి యోగ్యం కనుక బాగా ఉన్నదన్నమాట.
అదంతా అట్లా ఉంచి శ్రీ చౌదరిగారూ! పండితుల్ని పిలువడం, సభ చేయించడం చాలా పెద్ద ఎత్తు ఎత్తారు! ఇలా పూర్వం శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు వ్రాస్తుండేవారు. ఆ రాశిలో చేరుదామనా? ఈ కల్పవృక్షం మీద విమర్శతో ఒక రాశిలోనికి వచ్చారనుకోండి. పై రాశికి వెళ్ళడం కూడా మంచిదే. అయ్యా “చీద్గగన ప్రాలేయాంశువున్” అని ఉన్నది. ఇక్కడ ‘న’ కారం గురువవుతుందని మీరు వ్రాశారు. అది తప్పని, ఇటువంటివి ఇంకా పాతిక కూడా చూపించారట. తక్కినవన్నీ అట్లా ఉంచి, ఈ నకారం గురువవుతుందా... గురువవుతుంది. ఇది తప్పేను అని మీ యిష్టము వచ్చిన పదిమంది పండితులతో దస్కతులు చేయించి పత్రికలలో వేయించండి. ఆ పదిమంది పండితుల పేర్లు దేశానికి తెలుస్తవికదా! రంగయ్య, పుల్లయ్య పేర్లు పెట్టి వ్రాయించకండి.
అప్పయ్య దీక్షితులు, జగన్నాధ పండితుల వాదం మీరు తెచ్చారు. ఆ ప్రసక్తి ఎందుకు? నక్క ఎక్కడ, దేవలోక మెక్కడ? అముద్రిత గ్రంథ చింతామణి పేరు ఎత్తారు. ఆ విమర్శకీ, మనకూ కొన్ని మైళ్ళ దూరం ఉంది. పెద్ద పేర్లు చెప్పడమెందుకు వూరుకోండి. తక్కినవి చెప్పారు. కొంత బాగా ఉంటే బాగా ఉండవచ్చు. ఇందులో శ్రీ గిడుగు రామమూర్తిగారి పేరు కూడా ఎత్తారు. ఓ అయ్యా! రామమూర్తి పంతులుగారు వ్రాసిన వ్రాతలు కూడా చదివారా యేమి మీరు? అందుకనేనా “చేతురు, కోతురు,” తప్పన్నారట! గడచిన నలుబది యేండ్లుగా ఆంధ్ర భాషా పత్రికలలో జరిగేటటువంటి శబ్ద స్వరూపముల యొక్కయు, అర్థముల యొక్కయు విచారణ లక్షణము మీకు తెలియదని, మీరు చూపించిన దోషాలు మా మిత్రులు చెప్పగా విని నే ననుకొన్నాను. రెండే పద్ధతులు. మీకివన్నీ తప్పులు కావని తెలిస్తేనే వ్రాయాలి. అలా వ్రాస్తే మీకు ధర్మచింతలేదు. పాపభీతి లేదు. తెలియకుండా వ్రాస్తే దాని పేరు పాండిత్యం లేక పోవడం. అదట్లా ఉంచి, మీ ఇష్టం వచ్చిన పండితుల్ని నలుగుర్ని పిలవండి. వారు ప్రసిద్ధులైన పండితులు కావలె సుమండీ. “చీద్గగన ప్రాలేయాంశువున్” తప్పనే పండితులు కాకూడదు. అటువంటి పండితులను మీరు తీసుకవస్తే నేను సభకు రాను. ఇప్పటికివలెనే అప్పుడు కూడా దూరం నుంచే నమస్కారం చేస్తాను. నేను పండితుల్ని తీసుకరాను. పుస్తకాల్ని తీసుక వస్తాను. మీరు తప్పన్నవాటికి ప్రయోగాలు చూపిస్తాను. “భూమిపుండు” ఇందులో అశ్లీలమని వ్రాసినారట. మీరు నలుబది యేండ్లనుండి జరుగుతున్న పత్రికలలోని సారస్వత విమర్శలు చక్కగా అనుసరించామన్నట్లు వ్రాశారే. శ్రీ తిరుపతి వేంకట కవులలో ఇలాంటి అశ్లీలాలున్నవని వారి ప్రతి పక్షులు వ్రాయడం వారు సమాధానాలు వ్రాయడం చదివేవుంటారుకదా? ఇలాంటి అశ్లీలం వ్రాయనివాడుంటాడా? అంతదాకా ఎందుకు? తమరు కూడా ఏదో పుస్తకాలు వ్రాశారని వినికిడి, మీరు ఏవి దోషాలన్నారో అవి మీ గ్రంథాల్లోనే చూపించవచ్చు. మీ సవాలు అట్లా వుంచి ఇది నా సవాలు. ఆ సభ పెట్టించండి. మీ పటం పెట్టి మీ నెత్తినే పొడుచుకున్నట్లవుతుంది. నాకేమీ అభ్యంతరం లేదు.
నేనొక మాట వ్రాస్తున్నాను. వ్రాయబోయేమాటకు నేకు సభకు రానని మాత్రం అర్థం చేసుకోకండి. ఆ సభలో కొంచెం పోలీసు బందోబస్తుతో రావాల్సిన అవసరం నాకు లేకుండా చేయండి. ఇంతదూరం వచ్చింది కనుక మీరు వ్రాసిన వ్యాసాలు తీరికలేక పోయినా, చదువుతాను. మీరు చూపించిన తప్పులు తప్పులు కావని సప్రమాణంగా నిరూపిస్తాను. కాని నా పుస్తకంలో కొన్ని పొరపాట్లు ఉండవచ్చు. వాటిని నేనంగీకరిస్తాను. “రాఘవేశ్వరు గృహముల్” యతి భంగమున్నదని మీరు చూపించారట. నిజమే ఉన్నది. రతీదేవి తప్పన్నారట. అది తప్పనడంలో కూడ కొంత న్యాయమున్నది. బాగా పరిశీలించలేనివాడికి తప్పనిపించవచ్చు. కాని వాచస్పత్యంలో ఈకారాంత స్త్రీలింగం కూడా ఉదహరించబడింది. అయినా ఇవన్నీ సభలో చెప్పవలసిన సమాధానాలు కదా! ఈ రెండైనా ఇప్పుడెందుకు వ్రాస్తున్నానంటే ఆ సభ పెట్టేదీలేదు. జరిగేదీ లేదు. మీరు పిలిచేదీలేదు. వారు వచ్చేదీలేదు. బ్రహ్మశ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారు తమ ప్రత్యర్థులకు ఇటువంటి సవాళ్లు నాలుగైదుసార్లు చేశారు. ఇప్పుడు వారి స్థానంలో నేనున్నాను. వారి ప్రత్యర్థుల స్థానంలో మీరున్నారు. ప్రత్యర్థి స్థానీయులైన తమరు ఈ సవాలు చేయడం క్రొత్త తప్ప వేరే క్రొత్త లేదు. అసలు మీ ఇంటి పేరే క్రొత్తాయె. ఇంతకూ మీ బలమేమంటే ప్రజాస్వామ్యం కావడం. ఇంకా ఉన్నవనుకోండి కొన్ని, అలా ఉంచండి. ముఖ్యంగా ఇంకొకటి కూడా చెప్పాలి. మన దేశంలో చాలామంది పత్రికాధిపతులకు విశ్వనాథ సత్యనారాయణమీద విమర్శ ఏదైనా సరే అచ్చు వేద్దామన్న ఉత్సాహమో, ఉబలాటమో, మాత్సర్యమో లాభచింతో ఉండడం. విశ్వనాథ సత్యనారాయణను ఎవడైనా మెచ్చుకుంటే, దాని పేరు చెక్క భజనలట. తిడితే వారికి బాగుంటుంది. పోనీయండి నష్టమేమి? శ్రీ చౌదరిగారూ! శ్రీ శ్రీ అన్నట్లుగా నా కవిత్వము పాషాణపాకమనీ నేను కూడా అనుకున్నానేమోకాని, వందలాది సభల్లో నేను చదివితే ఆనందించేవాళ్ళని చూచి నేను అనుకోలేకుండా ఉన్నాను. మీరు వ్రాసిన కొన్ని దోషాలనుకున్నా, ఇదే బాధ వచ్చింది. కొంతమంది పండితులు విన్నారు. మా యింటికి వచ్చి విన్నారు. కొందరి ఇండ్లకు వెళ్లి వినిపించాను. సభలలో శ్రద్ధగా కూర్చుని విన్నారు. వారు తప్పనలేదు. అందుచేత తప్పులు కావని ఒక అభిప్రాయం నాకేర్పడ్డదేమో!
ఈ గోలంతా ఎందుకు? “చీద్గగన ప్రాలేయాంశువున్” లో నకారం గురువవుతుంది. ఇది తప్పేను అది! నేను నలుగురి పేర్లు చెబుతాను. ఆ నలుగురిచేత దస్కతులు చేయించి వారి ఉత్తరాలు “భారతి’ పత్రికాధిపతి చేతిలో పెట్టి అని ప్రకటించవలసినదని ప్రార్థన. శ్రీ తుమ్మల సీతారామమూర్తిచౌదరిగారు, శ్రీ వేటూరి శివరామశాస్త్రిగారు, శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు ఈ పాయాలో ఉన్న మీ ఇష్టం వచ్చిన మరో పండితుడు. ఈపని మీరు చేస్తే అయినా సరే, కాకపోయినా సరే మీరు చూపించినవన్నీ తప్పనుకుంటాను. ఇంకొక్కటే మనవి. మీరు వ్రాసిన వ్యాసాలకు తిరిగి సమాధానాలు వ్రాస్తే మీ విమర్శలు ప్రకటించే పత్రికాధిపతులతో మా సమాధానాలు ప్రకటించేదిగా సిఫార్సు చేసి పెట్టండి. మీరు దీనికి కూడా యథేచ్ఛగా మళ్లీ వ్రాస్తే “నమోవాకం వ్రశాన్మహే” “మాటకి మాట తెగలు, నీటికి నాచు తెగులు” మీరు ప్రధానంగా చేయవలసింది. “చిద్గగనాంతమందు” గురువుని చూపించడం. మీరు ధర్మచింత, పాపభీతి కలవారు కనుక గురు దర్ళనం మీకు తప్పకుండా జరుగుతుంది. లఘుదర్శనం కలుగుతుందా? అబ్బే! ఇలాంటి వ్యాసాలు మీరు వ్రాసినా, నేను వ్రాసినా ఇట్లాగే ఉంటవి. మీరు ఆ పండితుల ఉత్తరాలు ప్రకటించిన తరువాత మీరు దోషాలన్నవాటికి మాత్రమే సమాధానాలు వ్రాస్తాను. ఇంక ఒక అక్షరం వ్రాయను.
అందుచేత ఇప్పుడింకొక మాట కూడా చెబుతున్నాను. నా రామాయణం నిలువదేమోనన్న భయం మీకెందుకు? నిలువదు. ఏం నిలువకపోతే? మీరు కవుల జీవితాలు చదివే వుంటారు. ఒక్కొక్కరు పాతిక గ్రంథాలు వ్రాస్తే వాడిని రెండు మూడు గ్రంథాలే నిలువడం చదువుతూనే ఉన్నాంగా, రామాయణం నిలువకపోతుందనుకోండి. వేయి పడగలు నిలుస్తుంది. అది మత గ్రంథం కదూ! ఆ మతానుయాయులతో నిలుస్తుంది. తమవంటి వారి విమర్శలవలె మతానుయాయులతో నిలువవచ్చు.
ఒకటే చివరి మాట. వ్రాసిందే చివరకు గట్టిగా చెబుతున్నాను. ఆక్షేపణలు, ఎత్తిపొడుపులు, గడుసుతనం మాటలు మీరు వ్రాయవద్దు. నేనూ వ్రాయవద్దు. మీరు వ్రాసినా మళ్లీ నేను వ్రాయనని మనవి చేస్తున్నాను. ఆ నలుగురు పండితులచేత పూర్వ నకారగురత్వం నిరూపించండి. అప్పుడే వ్రాస్తా. లేకపోతే ఇన్ని నెలలుకాదు సంవత్సరాలైనా వూరుకుంటా.

గురువారం, ఏప్రిల్ 09, 2009
సీటే మార్గం: డబ్బే లక్ష్యం
ఆకాశం ఎందుకు ఎర్రబడ్డది?
నిజానికి, ప్రస్తుత బ్లాగ్ లోకం లో నెలకొన్న పరిస్థితులలో, ఈ టపా రాయటం ఒక సాహసమనే చెప్పాల్సుంటుంది. గతం లో వారి గురించి రాసిన వారిపై సభ్యత మరచి టపాలు రాశారు, వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆ నలుగురూ వారి లక్ష్యాలను సాధించగలిగారా? వారి లక్ష్యాలు. బ్లాగరులలో అనైక్యత. బ్లాగరుల మధ్య తంపులు పెట్టడం. బ్లాగులోకం లో భీభత్స వాతావరణం సృష్టించటం. బ్లాగులంటేనే విమనస్కత కలిగించటం. సభ్యత కలిగినవారు బ్లాగులోకంలో ఇమడలేక, జరుగుతున్నది చూడలేక కళ్లుమూసుకోవటం. ఎన్నో బ్లాగుల మూతకు వారు కారణభూతమయ్యారు. అవును వాళ్లు విజయం సాధించారు. అయితే ఈ విజయం శాశ్వతం కాదు. సత్యం, ధర్మం జయిస్తుంది. లేకుంటే చరిత్రగతిలో మనము మిగిలి ఉండేవాళ్లము కాదు.
ఇద్దరు బ్లాగర్ల మధ్య ఏర్పడిన అభిప్రాయభేదం బ్లాగులోకంలో ఇంతటి కల్లోలానికి కారణం కాగలదని ఎవరైన ఊహించారా? పాడి కడతామని ప్రగల్భాలు పలికినవారు, ప్రమాదావనం లోని విషయాలు, ఎవరు, ఆ నలుగురికీ ఉప్పందించారో, ఎందుకు బయటపెట్టడం లేదు? ఇంతకీ, ఆ నలుగురూ ఎందరు, అన్న నా సందేహానికి నవ్వినవారు, జాలి పడినవారు, ఈ ముష్కరుల ముసుగు తీయటానికి ఎందుకు అభ్యంతరం చెపుతున్నారు? ఆకాశస్త్రం బ్లాగులో, నిజాల వెళ్లడికి, సాక్ష్యం పెట్టకుండా అడ్డుకున్నదెవరు? ఒక మహిళా బ్లాగరును ఆ నలుగురిలో ఒకరిగా ముద్ర వేయటం ఎంతవరకు సమంజసం?
ముసుగు తీయకపోయినా ఫరవాలేదు. ఈ అసభ్య రాతలు కట్టిపెట్టండి. పాఠకులు విసిగి పోయారు. నిజం ఎప్పటికైనా వెళ్లడవుతుంది . ఈ అసభ్య రాతలు కట్టిపెడితే, ఆ ముసుగునూ మరిచిపోదాం. ఎప్పటిలా అందరూ నిర్భయంగా, నిస్సిగ్గుగా చదువుకునేలా, బ్లాగ్ వాతావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడటానికి, అందరం తలో ఒక చేయి వేద్దాము. అసభ్య రాతలతో కూడిన బ్లాగులు చూడలేక సిగ్గుతో ఎర్రబడిన ఆకాశాన్ని, మనోహర వినీలాకాశం చేద్దాము.
శనివారం, ఏప్రిల్ 04, 2009
ఒక స్నేహితుడిని కోల్పోకుండా వుండటం ఎలా?
ఉదాహరణకు మీ స్నేహితుడికి ఒక బ్లాగు ఉందనుకోండి. ఆయన స్వంత రచనలు, సేకరణలు కలిపి తన బ్లాగులో ప్రచురిస్తూ ఈ కింద విధంగా ' disclaimer ' ఇచ్చారనుకుందాం.
"ఈ బ్లాగులో ఉన్న రచనలన్నీ నా సొంతమన్న భ్రమలో ఉండకండి. కొన్ని సేకరణలు ఉన్నాయి. చదవండి.. ఆనందించండి. ఇష్టం లేకపోతే ముందుకెళ్ళండి...జైహింద్.."
ఇందులో అహంభావం వ్యక్తమవుతున్నా, ఈ అహంభావిత కైఫీయత్ వలన తను ఇతరుల విమర్శలకు, కోపానికి కారణమవుతున్నారన్న విషయం మీ మిత్రుడితో చెప్పవద్దు. చెప్పి స్నేహితుడిని కోల్పోవద్దు.
అలాగే ఒక సేకరణ అంతా మీ మిత్రుడి రచనే అన్న భ్రమలో చదివి, చివరన అది సేకరణ అని తెలిశాక మీకు కోపం రావటం సహజమే అయినా, ఆ ముక్క మొదలే (వ్యాసానికి ముందుమాటలో) రాయచ్చుగా అని మీ మిత్రుడితో అనవద్దు. ఆయనపై అసూయతో ఇలా విసుక్కుంటున్నావని మీ పై అపోహపడవచ్చు. ఎంతో మంది మీ మిత్రుడి గురించి ఎంత చెడ్డగా అనుకున్నా, మీ మిత్రుడి గురించి వారి రచనలలో వెక్కిరించినా, మీ మిత్రుడితో పద్ధతి బాగాలేదని చెప్పవద్దు. ఎవరేమనుకున్నా, మీకు మీ మిత్రుడే ముఖ్యం.

గురువారం, ఏప్రిల్ 02, 2009
సత్యం శివం సుందరం
సత్యం శివం సుందరమేనా, కాదా? సత్యం కంప్యూటర్స్ సంగతేమిటి? అది ఎంత సుందరం? అక్కడ ఏమి జరుగుతుంది? చూడండి
http://satyammatyas.blogspot.com/
http://satyammatyas.blogspot.com/