శుక్రవారం, డిసెంబర్ 18, 2009

పుస్తక ప్రదర్శనశాలలో e - తెలుగు



పుస్తక ప్రియులు ఎదురుచూస్తున్న హైదరాబాద్ బుక్ ఫేర్ ఈ నెల 17వ తారీఖున మంత్రివర్యులు డి.శ్రీధర్ బాబు (గౌరవ ఉన్నత విద్యాశాఖ మరియు ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ), డి.మాణిక్య వరప్రసాద రావు (గౌరవ మాధ్యమిక విద్యాశాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) ప్రారంభించారు. ప్రారంభించే సమయానికి కొన్ని పుస్తకాల దుకాణాలు ప్రదర్శనకు సమాయత్తమవుతున్నాయి. అవి శనివారం కు పూర్తి స్థాయిలో తయారవగలవని అంచనా. ఇప్పటికే ప్రారంభించిన పుస్తకదుకాణాలు అన్నీ చూడటానికి ఒక పర్యాయం వీక్షిస్తే సరిపోదు. రెండు మూడుసార్లు చూస్ర్తే కాని పుస్తక ప్రియులకు తనివి తీరనన్ని పుస్తక దుకాణాలు (200 పై చిలుకు) ఉన్నాయిక్కడ.

పుస్తకాలే కాకుండా ప్రతిరోజు సాయంత్రం వేళ ఇక్కడ పలు కార్యక్రమాలు జరుగగలవు. కొన్ని పుస్తకావిష్కరణలు, ఆసక్తికరమైన ఇష్టాగోష్టు లు మీరు చూడకలరు. వాటివివరాలు మీకు http://hyderabadbookfair.com/ లొ లభించగలవు. ఈ వెబ్సైట్ సృష్టి, నిర్వహణ మన http://etelugu.org/ చేస్తున్నదని చెప్పటానికి సంతసిస్తున్నాను. పోయిన సంవత్సరంవలే ఈ సంవత్సరం కూడా పుస్తక ప్రదర్శనశాలలో మన e -తెలుగు స్టాల్ నిర్వహిస్తున్నది. మన తెలుగు బ్లాగర్లు ఈ స్టాల్ నిర్వహణలో పాల్గొంటున్నారు.



స్టాల్ నిర్వహించిన బ్లాగర్ల పేర్లు, వారి బ్లాగు చిరునామ ప్రముఖంగా కనిపించే విధంగా పెద్ద ప్రకటన పోస్టర్ స్టాల్ లో ఉన్నది. ఇది ప్రతిరోజూ మారుతూ యుండగలదు. ఉదాహరణకు ఈ రోజు స్టాల్ నిర్వహణలో మీరు పాల్గొంటే మీ పేరు, మీ బ్లాగు పేరు అక్కడ ఉంటుంది. మనకు వాలంటీర్లు కావాలి. స్టాల్ నిర్వహణలో ఆసక్తి ఉన్నవారు అధ్యక్షులు పద్మనాభం లేక కార్యదర్శి కశ్యప్ కు తెలుపగలరు. వాలంటీర్లకు పెద్ద పనేమీ ఉండదు. స్టాల్ సందర్శకులకు కంప్యూటర్లో తెలుగు ఎలా రాయాలో చెప్పి, వారి వివరాలు సేకరించాలి. మన e -తెలుగు గురించి కూడా చెప్పాలి. ఆసక్తికలవారిని e -తెలుగు సభ్యులుగా చేర్పించాలి. తెలుగు వికిపీడియా ప్రచారం కూడా మన e - తెలుగు కార్యక్రమాలలో ఒక భాగమే.



ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణ ఏమంటే తెలుగు బ్లాగులపై ఆసక్తి కలిగినవారికి, వారి తెలుగు బ్లాగు,స్టాల్ లోనే,మనమే సృష్టించి వాటి వివరాలు వారికి అందచేస్తాము ఉచితంగా. ఈ సృజన డిజిటల్ ప్రొజెక్టర్ సాయంతో తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నాము.

పలు ఆకర్షణీయమైన పుస్తకశాలలున్నవిక్కడ. వాటి విశేషాలు రేపటి నివేదికలో మీరు చూడగలరు.

17 వ తారీకు స్టాల్ నిర్వహణలో ఈ కింది వారు పాల్గొన్నారు.



ఎడమ నుండి కుడి వైపు శ్రీమతి మాణిక్యాంబ (చక్రవర్తి తల్లి) , కశ్యప్, సతీష్ కుమార్, శ్రీనివాస కుమార్, సి.బి.రావు, చదువరి ఇంకా చక్రవర్తి

Photos by cbrao on cell phone Nokia 5800 XpressMusic

4 కామెంట్‌లు:

  1. చక్కగా వివరించారు. మరునాటి (నిన్నటి) వివరాలు నేను రాయడానికి ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  2. వేర్లలో చీడ ! చివళ్ళకు మందు?
    దీప్తిధారలో హైద్రాబాద్ బూక్ ఫేర్ పై శ్రీ సి.బి.రావుగారి వుత్సాహం చూసి అభినిందించకుండా వుండలేక పోయాను.దీప్తిధారలో శ్రీ సి.బి.రావ్ గారు, బ్లాగ్వీక్షకులకు (Hyderabad book fare) పుస్తక ప్రదర్శన గురించి వివరించాలన్న ప్రయత్నంలో .ఫోటోలతో సహా వారు ప్రచురించిన వ్యాసాలు, వివరణా అభినందనీయం.
    కానీ,.....వేర్లలో చీడ ! చివళ్ళకు మందు? వేస్తున్న చందంలా అనిపించింది ఆ బుక్ ఫేర్ గురించి చదివి.
    రాష్ట్రంలో నట్టడవి గ్రామాన్నుంచి, తెలుగులో చదివే అభిలాషను విద్యార్ధుల్లో పెంచుకుంటూ రావాలి. ముఖ్యంగా స్త్రీలలోనూ,వుపాధ్యాయులలోనూ పఠనాసక్తి పెంపొందాలి. నా www.nutakki.wordpress.com లో యీ సందర్భంగా నే వ్రాసి ప్రచురించిన వేర్లలో చీడ ! చివళ్ళకు మందు? అనే ప్రచురణ చూడండి......అభినందనలతో ..నూతక్కి

    రిప్లయితొలగించండి