సోమవారం, డిసెంబర్ 21, 2009

పుస్తకాలకై ప్రజావాహిని - నాలుగో రోజు



e తెలుగు స్టాల్ సందర్శకులకు e తెలుగు గురించి వివరిస్తున్న రవిచంద్ర


శ్రీనివాస ఉమాశంకర్ సరస్వతుల (బ్లాగు పేరు: అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!! ), స్వాతి ఉమాశంకర్ - ఉమాశంకర్ ఈ రోజు e తెలుగు సభ్యత్వం తీసుకొన్నారు.



PVSS శ్రీహర్ష (బ్లాగు పేరు: కిన్నెరసాని ) , సుజాత (మనసులో మాట ) స్టాల్ సందర్శకులతో



శ్రీ Y కృష్ణమూర్తి (Vice President & India Center Head Virtusa, Hyderabad) కు e తెలుగు గురించి వివరిస్తున్న చక్రవర్తి ( భవదీయుడు) ఇంకా మురళీధర్ నామాల (మురళీ గానం)



స్టాల్ మూసివేసే సమయంలో వచ్చారు బి.వెంకటరమణ (A tv, script writer). అర్చనలహరి అనే పుస్తకం రచించారు. ఇంద్ర సినిమా కు సహ రచయితగా సంభాషణలు వ్రాశారు. వారి మాటలలో పదునుంది. ఎంతైనా మాటల రచయిత గదా, ఆమాత్రం లేకుంటే ఎట్లా? బ్లాగు (తెలుగులో) తెరవాలని ఉత్సాహంతో ఉన్నారు. సాంకేతిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. e తెలుగు గురించి వివరిస్తున్న సతీష్ కుమార్ (సనాతన భారతి)


పుస్తక ప్రదర్శన శాల లో ప్రతి సాయంత్రం ఉండే కార్యక్రమాలలో భాగంగా ఫాషన్ పరేడ్ లో వయ్యరి భామలు పుస్తకాలతో పుస్తకనడక చేశారు. మోడల్స్ చేతుల్లో మీ అభిమాన రచయితల పుస్తకాలు, ఊహకందని విషయం కదా.


ఫాషన్ పరేడ్,పాటలతో సాయం సమయం పుస్తకాల మధ్య పోటెత్తిన జనంతో ఆహ్లాదంగా గడిచింది.


గొడుగు లోపలి వాన ఎలా వుంటుందో వివరిస్తారు శివశంకర్ (ఆరాధన) - మన e తెలుగు స్టాల్ లో తన బ్లాగు ఉంచిన Free domain గురించి వివరించారు. చిత్రంలో నుంచున్న వారిలో మధ్యన ఉన్నారు.

ఇతర విశేషాలు:

కంప్యూటర్ కు తెలుగు నేర్పటం ఎలా అనే విషయంపై నల్లమోతు శ్రీధర్ గారి వ్యాఖ్యానంతో కూడిన వీడియోను డిజిటల్ ప్రొజెక్టర్ సాయంతో మన స్టాల్ లో ప్రదర్శించాము. మన స్టాల్ నుంచి వినిపించే "తెలుగుభాష తియ్యదనం, మా తెలుగు తల్లికి" పాటలు 5000 పై చిలుకు సందర్శకులను మన వద్దకు తెచ్చాయి. CD లు మొత్తం అయిపోయి అడిగిన అందరికీ CD లు ఇవ్వలేని పరిస్థితి. ఇవ్వాళ ఆదివారం కావటం ఈ అనూహ్య స్పందనకు కారణం. సందర్శకులతో మహా సందడిగా ఉంది మన స్టాల్. ఈ రోజు కార్యక్రమాలలో భాగంగా వినోద వేదిక పై పాటలు పాడుతున్న చిన్నారులకు e తెలుగు ఒక పోటీ పెట్టింది - మా తెలుగుతల్లికి పాట తప్పులు లేకుండా పాడాలని. చక్కగా పాడిన ముగ్గురు చిన్నారులకు చక్రవర్తి,, సతీష్ ల ద్వారా e తెలుగు CD లు కానుకగా అందచేశాము.

ఈ రోజు మన స్టాల్ కు విచ్చేసిన వారిలో కస్తూరి మురళీక్రిష్ణ , గీతా చార్య , రవికిరణ్ (పూలవాన) , నువ్వుసెట్టి సోదరులలో ఒకరైన కిషోర్ (నువ్వుశెట్టి బ్రదర్స్) ఉన్నారు. ఇంకా పూర్ణిమ , సౌమ్య, లక్ష్మి (నేను -లక్ష్మి), సుజాత, లక్ష్మి వెదురుమూడి (ముద్దబంతి...తెలుగింటి ముంగిట), విజయశ్రీ (నేను సైతం బ్లాగ్లోకంలో) (ఈ బ్లాగు లింక్ తెలిసిన వారు నాకు తెలియపరచకోరుతాను).

ఇంకా చివరగా బ్లాగర్ అనూరాధ (శ్రీనివాస్ భాగి భార్య) (బ్లాగు: మహాగీతా మ్యుజిక్) వచ్చారు. శ్రీమతి అనూరాధ గూగుల్ ఉద్యోగిని. వీరు సంగీతాభిమానులు.

Photos: cbrao Canon Powershot SD1100IS

ఆదివారం, డిసెంబర్ 20, 2009

పుస్తక ప్రియుల కోసం పాదయాత్ర (మూడవ రోజు)



హైదరాబాదులో పుస్తక ప్రియుల కోసం పాద యాత్రలో కుడి నుంచి ఎడమకు శ్రీయుతులు నటుడు,రచయిత జెన్నీ, పరుచూరి వెంకటేశ్వర రావు, తెలకపల్లి రవి


పుస్తకాల కోసం నడకలో పిల్లల విచిత్ర వేషధారణ


శ్రీయుతులు తెలకపల్లి రవి, చుక్కా రామయ్య


శ్రీమతి కాట్రగడ్డ అరుణ, శ్రీ గాలి ఉదయ్ కుమార్ వికాసధాత్రి.ఆర్గ్ వెబ్ సైట్ నిర్వహిస్తున్నారు. ఉచిత e - తెలుగు పుస్తకాలు లభిస్తాయిక్కడ.


పుస్తకాల కోసం నడకలో పరుగులు తీస్తున్న పుస్తకం.నెట్



ఈ సందర్భంలో TV 9 రవిప్రకాష్ మాట్లాడుతూ "అక్షరాస్యతలో మన రాష్ట్రం 23 వ స్థానం లో ఉంది. మనలను పట్టి పీడిస్తున్న సమస్యలకు మూలం అజ్ఞానం. పుస్తకాలు విజ్ఞానాన్ని ఇస్తాయి. ఆలోచించేవారు,పుస్తకాలు చదివేవారు, ప్రజల సమస్యలకు పరిష్కారం చెప్పాలి" అన్నారు.



ఎడమ నుండి కుడి వైపు: శ్రీయుతులు పరుచూరి శ్రీనివాస్ (పాత పాటల, సినిమాల విజ్ఞాన ఖని, పుస్తకాభిమాని),శిరీష్ కుమార్,మురళీధర్ నామాల



సందర్శకులతో e తెలుగు స్టాల్. ఈ రోజు సుమారు 3000 సందర్శకులు. e తెలుగురూపొందించిన CD లకు తెలుగు భాషాభిమానుల ఆదరణ లభించింది.



ముగ్గురు బ్లాగర్లు ఎడమ నుండి కుడి: శ్రీ శివ చెరువు (బ్లాగు పేరు: నేను గురివింద గింజ), రవిచంద్ర ( బ్లాగు: అంతర్వాహిని), సురేందర్ (బ్లాగు: పుల్లాయన కబుర్లు)



ఎడమ నుండి కుడి: చిరంజీవి భావన,అక్కిరాజు భట్టిప్రోలు, వీవెన్, కొలిచాల సురెష్, పరుచూరి శ్రీనివాస్, నాగమురళి, కశ్యప్



నటుడు, రచయిత జెన్నీ (పోలాప్రగడ జనార్దనరావు) మన స్టాల్ కి వచ్చి కంప్యూటర్లో తెలుగు రాయటం నేర్చుకున్నారు. తాను ప్రభుత్వ ఉద్యోగవటం వలన జెన్నీ పేరుతో నాటకాలు, సినిమాలలో నటించానన్నారు. ఆసక్తికరమైన సంగతేమిటంటే వారి తండ్రిగారు ముద్దుగా వీరిని జెన్నీ (కార్ల్ మార్క్స్ భార్య) అని పిలిచేవారు. జెన్నీ అంత క్రితం పుస్తకాలకై నడక కార్యక్రమంలో పాల్గొని, ఉపన్యసిస్తూ "ఒక ప్రముఖుడు ఒక బహుళ అంతస్తులో లిఫ్ట్ లో పయనిస్తుండగా లిఫ్ట్ చెడిపోయి పై అంతస్తుకూ కింది అంతస్తుకూ మధ్య పదిహేను నిమిషాలు ఆగిపోయింది. లిఫ్ట్ బాగయ్యాక కార్యాలయ నిర్వహణ కార్యాలయానికి వెళ్లి లిఫ్ట్ లో ఇలాంటి అవాంతర సమయాలలో అందులో నిలబడిపోయిన వారి కోసం కొన్ని పుస్తకాలు వుంచాలని సలహా రాసి ఇచ్చి వెళ్లారు. పుస్తకాలంటే ఎంత ప్రేమో ఈ సంఘటన చెప్తుంది" అని చెప్పారు.

ఈ రోజు సందర్శకులు: శ్రీ కె.సురేష్ ( Alchemist నవల తెలుగు లో పరశువేది గా అనువాదించిన రచయిత), రాణి పులొమజా దేవి ( సర్కార్ వగైరా చిత్రాలకు పాటలు వ్రాసారు) మన స్టాల్ ని దర్శించారు.
వరూధిని,పి.ఎస్.లక్ష్మి, అరుణ పప్పు, పూర్ణిమ తమ్మారెడ్డి, చంద్రలత ఇంకా మాలాకుమారి మన e తెలుగు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

మన స్టాల్ లో లాప్టాప్ లో వినిపించిన మా తెలుగుతల్లికి అనే పాటకు విశేష స్పందన లభించింది.

Photos: cbrao Canon Powershot SD1100IS

శనివారం, డిసెంబర్ 19, 2009

పుస్తకాల వరదలు -రెండవ రోజు



కంచం ముందు కూర్చున్నాక ఈ రోజు కంచంలో అన్నం బదులు ఎవరైన పుస్తకాలు వడ్డిస్తే ఎంత బాగుండును అని ఎప్పుడైనా అనుకున్నారా? అకస్మాత్తుగా అల్లాఉద్దీన్ వచ్చి మీ గదంతా పుస్తకాలతో నింపిపోతే? మీకు లాటరీలోలక్ష పుస్తకాలు వస్తే? చుట్టూ పుస్తకాలు - ఏ పుస్తకం చదవాలి ? హైదరాబాదు నెక్లేస్ వీధిలో పుస్తక ప్రదర్శన మేళా కువస్తే అదే పరిస్థితి. ఏ స్టాల్ కు వెళ్లాలి? ఏమి కొనాలి? నేను ప్రతిరోజూ జేబు నిండా పైకంతో వెళ్లి, వచ్చేటప్పుడు రెండుచేతుల నిండా పుస్తకాల సంచులతో ఇంటికి వస్తున్నా. ఇంకా చూడవలసిన దుకాణాలు ఎన్నో మిగిలిపోతున్నాయి.



రాజన్, సతీష్, విజయ శర్మ సందర్శకులతో

సరేమన e తెలుగు స్టాల్ బ్లాగర్ వాలంటీర్లతో, వచ్చే పోయే సందర్శకులతో సందడిగా ఉంది. ఎప్పటివలే సహృదయచక్రవర్తి నిన్న స్టాల్ కు వచ్చే తరుణంలో జిలేబీలు, కారం వస్తువులు తెచ్చి ఆకలితో వున్న వాలంటీర్ల మెప్పు పొందాడు.




ఈ పుస్తక మేళాలో ప్రతిరోజు ఏదో ఒక విశేషం ఉంటుందని నిన్న చెప్పా కదా. ఈ రోజు Speed Math -Tutor పుస్తకావిష్కరణ.మంత్రివర్యులు గల్లా అరుణకుమారి (గౌరవనీయ రహదారి మరియు భవనముల శాఖా మంత్రిణి, ఆంధ్ర ప్రదేష్) చేతుల మీదుగా జరిగింది. వారు మాట్లాడుతూ " పుస్తకాలపట్ల ఆదరణ కరువైన ఈరోజులలో ఇలాంటి పుస్తక ప్రదర్శనలు చదువరులకు పుస్తకాలపై ఆసక్తిని మరలా పెంచుతాయి. మా నాన్న గారు మాకు బాల్యమునుంచీ పుస్తకాలపై ఆసక్తి కలిగేలా పెంచారు. వారు పుస్తకాలను ఎంతగానో ప్రేమించే వారు. చిన్నప్పుడు మాకు బొమ్మలకు బదులుగా మంచి పుస్తకాలను కానుకగా ఇచ్చేవారు. వారు స్వతహాగా రచయిత. మా తండ్రి రాజగోపాలనాయుడుగారు కురుక్షేత్ర, రామానుజ ప్రతిజ్ఞ, వీర శివాజి, బుద్ధం శరణం గచ్ఛామి మొదలగు పుస్తకాలు రచించారు. శివాజికు అతని మామగారు శౌర్యం ఉప్పొందేలా ఉత్తేజకరమైన కథలు చెప్పేవారు. గోర్కీ అమ్మలాంటి కథ ఎంతోహృద్యంగా ఉండి జీవితానికి మంచి ప్రేరణనిస్తుంది. గొప్పవారి ఆత్మ కథలు ఆత్మప్రబోధాన్ని కలుగచేస్తాయి.ప్రకాశంపంతులుగారు బయటకు వెళ్లినప్పుడు ప్రతి రోజు న్యాయవాది తారసపడేవారు. ఆ స్ఫూర్తితో తను కూడా నిత్యజీవితంలో న్యాయవాది కావాలని ఆరాటపడేవారు. కావ్యాలు, పురాణాలు ఎల్లవేళలా ప్రజాదరణ కలిగి ఉంటాయి. మానసిక వికాసానికి దోహదపడే ఈ పుస్తకాల ప్రదర్శన పెద్ద నగరాలకే పరిమితం కాకుండా చిన్న ఊళ్లలోకూడ ఏర్పాటు చెయ్యవలసిన అవసరముంది."



ఎడమవైపు నుండి మనవైపు చూస్తున్న రచయిత గుడిపాటి (తెల్ల చొక్కాలో), కుడి వైపు చివర (తెల్ల చొక్కాలో) రచయిత మురళీ మోహన్ (బ్లాగు: తుర్ఫు ముక్క)

ఈ రోజు నేను సందర్శించిన పుస్తకాల షాపు పాలపిట్ట బుక్స్. ఇక్కడ పలు పుస్తకాలు నన్ను ఆకర్షించాయి. మొదటగా ఆకట్టుకున్నది 2,178 వీక్షణలు, అత్యధిక వ్యాఖ్యలు 57 పొందిన (http://pustakam.net/?p=2432) జ్ఞాపకాన్ని కవిత్వంగా మార్చే రసవిద్య పేరుతో ఎన్.వేణుగోపాల్ పీఠిక గల అఫ్సర్ తాజా కవితల పుస్తకం ఊరి చివర. ఏలే లక్ష్మణ్ ముఖచిత్రరచనతో ఉన్న ఈ పుస్తకం డిసంబర్ 2009 లో వెలువడింది. నన్నాకర్షించిన మరో పుస్తకం ' వాన కురిసిన పగలు ' -తమ్మినేని యదుకుల భూషణ్ కవితలు. మన తెలుగు బ్లాగరు కస్తూరి మురళీకృష్ణ పుస్తకాలు జీవితం -జాతకం (కథలసంకలనం) ఇంకా మైకేల్ జాక్సన్ పుస్తకాలు తీసుకున్నా. ఆంగ్ల సాహితీ కారులను పరిచయం చేసే గుడిపాటి గారి పుస్తకం కిటికీ (ఏలే లక్ష్మణ్ ముఖచిత్ర రచన) ఇంకా పూడూరి రాజా రెడ్డి వ్రాసిన మధుపం తీసుకున్నాను. ఈమధుపానికి ఉపనామం ఒక మగవాడి ఫీలింగ్స్. పూడూరి రాజా రెడ్డి బ్లాగు చిరునామా http://raji-fukuoka.blogspot.com/ . మధుపం పై సమీక్ష కై చూడండి http://pustakam.net/?p=2544
పాలపిట్ట బుక్స్ దుకాణం లో వార్త లో పనిచేసే గుడిపాటి , వసంత గార్ల పరిచయమయ్యింది. సాయంత్రం ఆరు తర్వాత వీరు అక్కడ కనిపించే అవకాశముంది. తెలుగు బ్లాగరు మురళీమోహన్ ఓడిహళ్ల (బ్లాగు తుర్ఫు ముక్క) పుస్తకాలు కూడా ఇక్కడ కనిపించాయి.



ఎడమ నుండి కుడి వైపు విజయ శర్మ,మురళీమోహన్ ఓడిహళ్లి, రాజన్, సి.బి.రావు,శ్రీనివాస కుమార్, సతీష్ కుమార్, ఇంకా కశ్యప్

కార్యదర్శి కశ్యప్ మన e తెలుగు మిత్రుల సహాయంతో ఒక చక్కటి CD ని రూపకల్పన చేయటం జరిగింది. కంప్యూటర్లో తెలుగు వాడేవారికి, తెలుగు బ్లాగర్లకు సైతం తెలియని softwares ఇందులో పొందుపరచటం జరిగింది. స్టాల్ దర్శించే వారికి నామమాత్రపు విరాళానికే దీన్ని అందచేస్తున్నారు. దీనిలోని విషయాలు గురించి చెప్పటానికి ఒకప్రత్యేక వ్యాసం వ్రాయాల్సుంటుంది. తెలుగు బ్లాగర్లు స్టాల్ లో ఈ CD అడిగి తీసుకోండి. పదో లేక ఇరవైరూపాయలు విరాళంగా ఇచ్చి e తెలుగు కోశాధికారిని సంతోషపెట్టండి. అసలే మనకు రాబడి తక్కువ ఖర్చు ఎక్కువకదా. ఈ CD పెక్కు విశేషాలతో ఉపయుక్తంగా యుండగలదు. Inscript tutorial ఉందన్నారు. పాఠకులు ఈ CD వాడి దానిపై తమ అభిప్రాయం వ్రాయగలరు. మీ సూచనలు అమలుపరచటానికి ప్రయత్నం చేస్తాము.



కూర్చున్న వారు ఎడమనుండి : సి.బి.రావు, శ్రీనివాస కుమార్, ఇంకా కశ్యప్
నుంచున్న వారు ఎడమనుండి : మురళీధర్ నామాల, సతీష్ కుమార్, ఇంకా విజయ శర్మ

ఈ రోజు మన స్టాల్ కు పలువురు విచ్చేసి తమ సందేహాలు తీర్చుకున్నారు. కంప్యూటర్ విజ్ఞానం మాస పత్రికసంపాదకులు N.G. తేజ మన స్టాల్ సందర్శించారు. మన సహాయం కోరారు. జనవరి 2010 సంచికతో బాటుగా తెలుగు బ్లాగులపై ఒక ప్రత్యేక CD ఇస్తున్నారు. అంతే కాకుండా తెలుగు బ్లాగులపై 64 పేజీల ప్రత్యేక అనుబంధాన్నికూడా అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి editor@computervignanam.net Cell: 97040 70000

ఇంతవరకూ ప్రదర్శనశాల దర్శించిన ఇద్దరు మహిళా బ్లాగర్లను గుర్తించాను. వారు శ్రీమతి మాణిక్యాంబ (మనకోశాధికారి చక్రవర్తి తల్లి). బ్లాగు: ఓ సగటు భారత నారి ఆలోచనలు..
http://ratnahamsa.blogspot.com/
మరొకరు శ్రీమతి జ్వలిత (విజయ కుమారి) -ఉపాధ్యాయిని, కవయిత్రి.
బ్లాగు పేరు: జ్వలిత
http://jvalitha.blogspot.com/
వీరు ఖమ్మంలో ఉపాధ్యాయిని. ఇంకా ఆవిష్కరణకాని తమ పుస్తకం "సుదీర్ఘ హత్య " - కవిత్వం ప్రతిని నాకు కానుకగా ఇచ్చారు. ఈ కవితలు పలు పత్రికలలో గతంలో ప్రచురించబడ్డవి. "సుదీర్ఘ హత్య " అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో లభ్యమవుతుందిప్పుడు."అసమర్ధులు ఆయుధాలు పట్టుకోరు - మౌన మంత్రాలు మార్గాలు చూపవు - ఊహాగానాలు ఉద్యమాలు నడపలేవు - కాలుతున్నప్పుడు సిద్ధాంతాలుండవు -కడుపైనా...బతుకైనా " - జ్వలిత

పాలపిట్ట పుస్తకాలస్టాల్ లో గుడిపాటి పుస్తకాలపై వారి సంతకమడగటం మరువొద్దు. స్టాల్ నిర్వాహకులనడిగితే అక్కడికి వచ్చే రచయితలను పరిచయం చేస్తారు.రాయాల్సింది చాలా ఉంది. ప్రతి రోజు విశేషాలు చూడండి. నేటికింతే.

Photos: cbrao Canon Powershot SD1100IS

శుక్రవారం, డిసెంబర్ 18, 2009

పుస్తక ప్రదర్శనశాలలో e - తెలుగు



పుస్తక ప్రియులు ఎదురుచూస్తున్న హైదరాబాద్ బుక్ ఫేర్ ఈ నెల 17వ తారీఖున మంత్రివర్యులు డి.శ్రీధర్ బాబు (గౌరవ ఉన్నత విద్యాశాఖ మరియు ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ), డి.మాణిక్య వరప్రసాద రావు (గౌరవ మాధ్యమిక విద్యాశాఖామాత్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) ప్రారంభించారు. ప్రారంభించే సమయానికి కొన్ని పుస్తకాల దుకాణాలు ప్రదర్శనకు సమాయత్తమవుతున్నాయి. అవి శనివారం కు పూర్తి స్థాయిలో తయారవగలవని అంచనా. ఇప్పటికే ప్రారంభించిన పుస్తకదుకాణాలు అన్నీ చూడటానికి ఒక పర్యాయం వీక్షిస్తే సరిపోదు. రెండు మూడుసార్లు చూస్ర్తే కాని పుస్తక ప్రియులకు తనివి తీరనన్ని పుస్తక దుకాణాలు (200 పై చిలుకు) ఉన్నాయిక్కడ.

పుస్తకాలే కాకుండా ప్రతిరోజు సాయంత్రం వేళ ఇక్కడ పలు కార్యక్రమాలు జరుగగలవు. కొన్ని పుస్తకావిష్కరణలు, ఆసక్తికరమైన ఇష్టాగోష్టు లు మీరు చూడకలరు. వాటివివరాలు మీకు http://hyderabadbookfair.com/ లొ లభించగలవు. ఈ వెబ్సైట్ సృష్టి, నిర్వహణ మన http://etelugu.org/ చేస్తున్నదని చెప్పటానికి సంతసిస్తున్నాను. పోయిన సంవత్సరంవలే ఈ సంవత్సరం కూడా పుస్తక ప్రదర్శనశాలలో మన e -తెలుగు స్టాల్ నిర్వహిస్తున్నది. మన తెలుగు బ్లాగర్లు ఈ స్టాల్ నిర్వహణలో పాల్గొంటున్నారు.



స్టాల్ నిర్వహించిన బ్లాగర్ల పేర్లు, వారి బ్లాగు చిరునామ ప్రముఖంగా కనిపించే విధంగా పెద్ద ప్రకటన పోస్టర్ స్టాల్ లో ఉన్నది. ఇది ప్రతిరోజూ మారుతూ యుండగలదు. ఉదాహరణకు ఈ రోజు స్టాల్ నిర్వహణలో మీరు పాల్గొంటే మీ పేరు, మీ బ్లాగు పేరు అక్కడ ఉంటుంది. మనకు వాలంటీర్లు కావాలి. స్టాల్ నిర్వహణలో ఆసక్తి ఉన్నవారు అధ్యక్షులు పద్మనాభం లేక కార్యదర్శి కశ్యప్ కు తెలుపగలరు. వాలంటీర్లకు పెద్ద పనేమీ ఉండదు. స్టాల్ సందర్శకులకు కంప్యూటర్లో తెలుగు ఎలా రాయాలో చెప్పి, వారి వివరాలు సేకరించాలి. మన e -తెలుగు గురించి కూడా చెప్పాలి. ఆసక్తికలవారిని e -తెలుగు సభ్యులుగా చేర్పించాలి. తెలుగు వికిపీడియా ప్రచారం కూడా మన e - తెలుగు కార్యక్రమాలలో ఒక భాగమే.



ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణ ఏమంటే తెలుగు బ్లాగులపై ఆసక్తి కలిగినవారికి, వారి తెలుగు బ్లాగు,స్టాల్ లోనే,మనమే సృష్టించి వాటి వివరాలు వారికి అందచేస్తాము ఉచితంగా. ఈ సృజన డిజిటల్ ప్రొజెక్టర్ సాయంతో తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నాము.

పలు ఆకర్షణీయమైన పుస్తకశాలలున్నవిక్కడ. వాటి విశేషాలు రేపటి నివేదికలో మీరు చూడగలరు.

17 వ తారీకు స్టాల్ నిర్వహణలో ఈ కింది వారు పాల్గొన్నారు.



ఎడమ నుండి కుడి వైపు శ్రీమతి మాణిక్యాంబ (చక్రవర్తి తల్లి) , కశ్యప్, సతీష్ కుమార్, శ్రీనివాస కుమార్, సి.బి.రావు, చదువరి ఇంకా చక్రవర్తి

Photos by cbrao on cell phone Nokia 5800 XpressMusic

మంగళవారం, డిసెంబర్ 08, 2009

e - తెలుగు గురించి ఆదివారం సాక్షి పేపర్లో వ్యాసం



Please click on image to enlarge

విజయవాడలో ఉంటున్న బ్లాగరి, e-తెలుగు అభిమానురాలు అయిన పద్మకళ గారు ఈ వ్యాసం వ్రాసారు.

మంగళవారం, నవంబర్ 03, 2009

Tea Time

మీకిష్టమైన చాయ్ తాగుతారా!

మంగళవారం, అక్టోబర్ 20, 2009

Political History of Andhra Pradesh



Sri Narisetti Innaiah’s new book Political History of Andhra Pradesh was released by Sri Ravipraksh on Sunday 18th October 2009 on TV 9 channel,creating history and a new trend. For the first time we have witnessed a release of a book along with interviews of eminent editors of news papers like M/s A.B.K.Prasad (Ex-editor Eenadu,,Varta,Udayam etc.), Deekshitulu (Ex-editor Andhra Prabha), I.Venkata Rao (Ex-editor Andhra Jyothi and CEO of Maha TV), K.Ramachandramurthy (Ex-editor Varta, Udayam,Andhra Jyothi and CEO of HMTV), Kommineni Srinivas (Journalist of Eenadu, Andhra Jyothi and CEO of NTV) etc. Raviprakash of TV 9 deserves all compliments; for bringing together, all rival news channels to present their views about this book of Innaiah on TV 9. This book is distributed by M/s Akshara, Hyderabad Phone: 040 – 23554096 and available at all leading bookshops. Price Rs. 150/-

If you can’t wait and go all the way to bookshop download the book at the following address free of cost.

http://www.centerforinquiry.net/india/local_resources/political_history_of_andhra_pradesh_-_narisetti_innaiah/

This book is hailed as the most useful reference book for all journalists and people interested to know many fascinating facets of political spectrum of Andhra Pradesh; covering with 100 years of history. Many interesting supplementary tables like hereditary politicians and defectors are appended.

బుధవారం, సెప్టెంబర్ 23, 2009

మనకు తెలియని మన త్రిపురనేని గోపీచంద్


Tripuraneni Gopichand

మనకు ఈ రోజున్న ఆశయాలు, భావాలే 15 సంవత్సరాల తరువాత కూడా ఉంటాయా? ఉండవచ్చు లేదా వాటిలో కొన్ని మార్పులు రావచ్చు. జీవితం లో తారసపడే కొందరు వ్యక్తులు, అనుకోని సంఘటనలు మనపై తీవ్ర ప్రభావాన్ని కలుగచేస్తాయి కొన్నిసార్లు. ఈ పరిణామ క్రమంలో కమ్యూనిస్టులు, పెట్టుబడిదారులుగా, నాస్తికులు ఆస్తికులుగా ఇంకా ఆస్తికులు నాస్తికులుగా మారటం కద్దు. ఒక రచయిత రచనలు సంకలనం గా తీసుకువచ్చే సమయంలో, రచనలతోపాటుగా రచనాకాలం కూడా ఇస్తుంటారు సంపాదకులు. ఇది మంచి సంప్రదాయం. దీనివలన కాలంగడిచే కొద్దీ రచయిత ఆలోచనా విధానంలోని ఎదుగుదల లేక పురోగమనం మనకు గోచరించగలవు. గోపీచంద్ శతజయంతి సందర్భంగా , ఆయన రచనలు తాజాగా 10 సంపుటాలుగా వెలువడ్డాయి. వీటిలో గొపీచంద్ లో వచ్చిన ఆలోచనాధొరణిలోని మార్పులను మనము చూడగలమా? గోపీచంద్ తొలుత ఒక హేతువాది. త్రిపురనేని రామస్వామి రచనలు వీరిని తొలినాళ్లలో ప్రభావితం చేస్తే, జీవితపు తుది అధ్యాయంలో అరవిందుని భజనలొ గడిపారు. M.N.Roy అనుచరుడినుంచి అరవిందు భక్తునిగా రూపాంతరం చెందిన గోపీచంద్ జీవిత విశేషాలను మనకు అందిస్తున్నారు ప్రముఖ హేతువాది ఇన్నయ్య.

-రావు

Tripuraneni Gopichand

గురువారం, సెప్టెంబర్ 03, 2009

మాట తప్పని మన రాజశేఖరుడు

ఆంధ్ర ప్రదేష్ ముఖ్యమంత్రి అకాలమరణం ఎవరూ ఊహించనిది. అరవైయేళ్ల వయసొచ్చాక రాజకీయ విరమణ చేస్తానని అంటుండేవారు. ప్రజల అకాంక్ష వారిని 60 ఏళ్లు దాటాక కూడా క్రియాశీలక రాజకీయాలలో వుండేలా చేసింది. ప్రతిపక్షాలు ఉచిత విద్యుత్ ఇవ్వటం సాధ్యం కాదంటే, సాధ్యమవగలదని నిరూపించి రైతు బాంధవుడిగా నిలిచారు. 60 ఏళ్లకు రాజకీయలనుంచి తప్పుకుంటానన్న్న తన మాటను, ఈ విధంగా నిలుపుకున్నారు.

సోమవారం, జులై 20, 2009

సంపూర్ణ సూర్యగ్రహణం చూద్దాము రండి



Complete Solar Eclipse Photo courtesy: Luc Viatour

2009, జులై 22న మనము ఆకాశంలో ఒక అద్భుతాన్ని చూడబోతున్నాము. ఉత్తరభారత దేశంలోని పాట్న పట్టణానికి 25 కి.మీ. దూరంలో ఉన్న తరెగన గ్రామంలో ఈ అద్భుతాన్ని సూర్యగ్రహణం రూపంలో సంపూర్ణంగా చూడవచ్చు. భారతదేశం లోని మిగతా ప్రాంతాలలొ ఈ సూర్యగ్రహణాన్ని పాక్షికంగా చూడవచ్చు. ఆరు నిమిషాల 39 సెకండ్ల కాలం ఉండే, ఈ శతాబ్దపు సుదీర్ఘ సూర్యగ్రహణం జూన్ 13, 2132 దాకా మరలా జరగదు. గ్రహణ సమయంలో, సూర్య చంద్రుల ఆకర్షణ శక్తి వలన, గ్రహణ కక్ష్య మార్గంలోని దక్షిణ జపాన్ వద్ద కల సముద్రపు అంతర్భాగ రాతిపొరలలో కలిగే మార్పు వలన సునామి వస్తుందని కొందరు హెచ్చరిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు ఇంకా పత్రికలు సూర్యగ్రహణానికి, భూకంపాలకి ఎలాంటి సంబంధం లేదని సునామి హెచ్చరికలను తోసిపుచ్చారు. ఈ సూర్య గ్రహణం భారతీయ కాలం ప్రకారం ఉదయం 5.28 నుండి 7.40 దాకా ఉండగలదు. నాలుగు నిమిషాల సంపూర్ణ సూర్యగ్రహణాన్ని భారతదేశంలో ఉదయం 6.26 నుంచి 6.30 దాక వీక్షించవచ్చు. ఆసియా ఖండం తరువాత, పసిఫిక్ సముద్రం లోని జపాన్ దేశపు ఋయుక్యు దీవులలో సుదీర్ఘమైన (6 నిమిషాల 38.8 సెకనులు) సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది.

ఈ గ్రహణం వలన ఏమిటి ముప్పు? గ్రహణ సమయంలో ఆహారం తీసుకొనవచ్చునా? గర్భిణీ స్త్రీలపై ఎలాంటి ప్రభావం వుంటుంది? జనవిజ్ఞాన వేదిక , మానవ వికాస వేదిక, Center for Inquiry India ఇంకా
PLANETARY SOCIETY, INDIA వారి ఆధ్యర్వంలో హైదరాబాదు లో ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించటానికి ప్రత్యేక సౌకర్యం కలిగిస్తున్నారు. ప్రజలలో ఉన్న మూఢ నమ్మకాలను తొలిగించటానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో డా.క్రిష్ణయ్య (Orthopaedician), డా. టి.వి.క్రిష్ణారావు (E.N.T.Specialist), ఇన్నయ్య (Chairman, C.F.I.I.), టి.వి.రావు (State Convener, జనవిజ్ఞాన వేదిక) మొదలగు ప్రముఖులు పాల్గొంటున్నారు.

ప్రత్యేక ఫిల్టర్ కళ్లజోడుతో గ్రహణాన్ని వీక్షింపవచ్చు. ఈ కార్యక్రమాలు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటలదాకా ఉంటాయి. ఆసక్తి కలవారు నెక్లెస్ వీధి లొని పీపుల్స్ ప్లాజా వద్దకు రావచ్చును. ఆ సమయంలో మీరు ఇంటిలో ఉంటే ప్రత్యేక కళ్లజోడు లేకుండా గ్రహణాన్ని చూడవద్దు. అలాచేస్తే కంటికి తీవ్ర హాని కలగకలదు.

ఈ గ్రహణం గురించి మరింత సమాచారానికై ఇక్కడ నుంచి ప్రత్యేక కరపత్రాన్ని దిగుమతి చేసుకొనవచ్చును.

శుక్రవారం, జులై 03, 2009

కుక్క కుంటితే

అన్న నుంచుంటే మాస్ అన్నట్లు కుక్క కుంటితే వార్త అవుతుందా? తెలుగు బ్లాగులలోనే కాకుండా అంతర్జాలంలో ఎన్నో తెలుగు రచనలు చాలా గుంపులలో తిరుగాడుతూ ఉన్నాయి. వాటిలో కుక్క కుంటితే ఒకటి. అజ్ఞాత రచయిత రాసిన ఈ వ్యంగ రచనను మీరూ చదివి ఆనందించండి.


కుక్క కుంటితే (Fiction)

మనం రోడ్ మీద వెళ్తూ ఉంటాం. ఒక కుక్క పిల్ల కాలు విరిగి కుంటుంతుంటుంది. మనకి టైం ఉంటె ఆగి దానికి ఏమి కావాలొ చూస్తాం, లేదు అంటె అయ్యో పాపం అని జాలి పడి వెళ్ళిపోతాం.

tv-9 రిపోర్టర్ వెళ్తున్నాడు, వెంటనె tV-9 ఆఫిస్ కి ఒక ఫొన్
వెళ్తుంది, వాడు కెమెరామెన్ ని పంపుతాడు.

ఇక మొదలు........

కళ్యాణ్ ఆ కుక్క పరిస్తితి ఎలా ఉంది? ఎప్పటి నుంచి అక్కడ ఉంది?

కుక్క మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంది, ఇప్పుడు కుంటుంతుంది......స్వప్న

ఆక్కడి వాళ్ళు ఏమన్న చెబుతున్నార?...కళ్యాణ్

స్వప్న...ఇక్కడి వాళ్ళు ఇది ఒక కుక్క అని, దాని కాలుకు దెబ్బ తగలటం వల్ల కుంటుతుంది అని చెప్తున్నారు. ఈ వి
ంగ గతం లొ ఆ కుక్క ఈ area లొ ఇలా కుంటలేదని, ఇదె తాము మొదటి సారి చూడటం అని చెప్తున్నారు

కుంటుతున్న కుక్క స్పందన ఎలా ఉంది? .....కళ్యాణ్

కుక్క ప్రస్తుతం కుంటుతుంది స్వప్న. ఈ వి
ంగ కాలు కు దెబ్బ తగలటం కొత్త అనుకుంట, అందుకె కుంటటం రాక ఇబ్బంది పడుతుంది. మాట్లాడించటనికి ప్రయత్నించిన అది సమాధానం చెప్పకుండ, మూలుగుతుంది.....స్వప్న

థాంక్ యు కళ్యాణ్, ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి సమీక్షిస్తు ఉండటానికి మీకు కాల్ చేస్తూ ఉంటాం.
ఇది గాయపడి కుంటుతున్న కుక్క స్థితి మీద మా క్రైం ప్రతినిధి కళ్యాణ్
అందించిన వివరాలు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్..
బ్రేక్ తర్వాత కుక్కలు-కుంటుడు అంశం పై చర్చింటానికి ప్రముఖ Doctor కుక్కుటేశ్వర రావ్ గారు మన Studio కి వస్తున్నారు..


బ్రేక్ తర్వాత..........


రజనికాంత్ : చెప్పండి కుక్కుటేశ్వర్ రావ్ గారు గతం లొ మీరు ఎప్పుడైన ఇలా కుక్కలు కుంటటము
చూశారా? ఒక వేళ చూస్తె ఏ జాతి కుక్కలు కుంటటము చూసి ఉంటారు?

కుక్కుటేశ్వర్ : ఈ విదం గ కుక్కలు కుంటటం ఇది మొదటి సారి కాదు. ఫ్రపంచవ్యాప్తం గ ఎన్నో జాతుల కుక్కలు, ఎన్నో సందర్భాల్లొ ఇలా కుంటినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. కుంటటానికి జాతి తో సంబందం లెదు.

రజనికాంత్: అంటె కుక్కలు కుంటేటప్పుడు వాటికి ఏమన్న బాధ ఉంటుందా? ఉంటె ఎటువంటి బాధ?

కుక్కుటెశ్వర్ : బాధ లొ రకాలు ఉండవండి. కుంటెటప్పుడు general గ దెబ్బ తలిగిన కాలు కి నొప్పి ఉంటుంది అని Dog's Medical Science లొ గట్టి ఆధారాలు ఉన్నాయి.


రజనికాంత్ : తాజా పరిస్థితి చెప్పేందుకు మా క్రైం ప్రతినిధి కళ్యాణ్ టెలి ఫొన్ లొ సిద్దం గ ఉన్నారు...కళ్యాణ్ చెప్పండి..ఆ కుక్క పరిస్థితి ఎలా ఉంది.

కళ్యాణ్ : (చెవిలొ ear piece పెట్టుకుని బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు..)

కళ్యాణ్ చెప్పండి..ఆ కుక్క ఫరిస్థితి ఎలా ఉంది?

రజిని ... కుక్క మూలుగుతుంది, ఇప్పుడె blue cross వాళ్ళు దానిని తీసుకువెళ్ళారు.


కుక్క కాలు కి దెబ్బ తగిలింది, దాని ఇతర శరీర భాగాలు ఎలా ఉన్నయి?...కళ్యాణ్

రజిని, కుక్క కాలు కి మాత్రమే దెబ్బ తగిలింది. కాని ఈ కుక్క తోక వంకర గా ఉంది.

వంకర అంటె ఎలా ఉంది...కళ్యాణ్ (ఇప్పుడు రజిని మొహం లొ expressions ఇంకెక్కడా చూడలేము, శత్రువు టాంకర్ ని ద్వంసం చెయ్యటానికి wait చెస్తున్న soldier face లొ తప్ప)


రజిని వంకర గ అంటిచుకుని ఉంది, నేను ఇప్పటికి దానిని straight చెయ్య
టానికి try చేస్తున్నాను కాని అది చుట్టుకుపొతుంది. బహుశ కాలు కి దెబ్బ తగలటం వల్ల అని నా ఉద్దెశం.

థాంక్ యు కళ్యాణ్....కుక్కుటెశ్వర్ గారు, కాలు కి దెబ్బ తగలటం వల్ల తోక వంకర అయ్యి ఉంటుంది అని మా ప్రతినిధి కళ్యాణ్ చెప్తున్నారు, దీని పై మీ స్పందన ఏంటి?

స్పందన అంటె ఏమి ఉంటుంది రా పుండకార్ వెధవ...కుక్క తోక కాలు కి దెబ్బ తగలటం వల్ల వంకర అయ్యేది ఏంటి ర ధేడ్ దిమాగ్ గ. ఏమి మనిషివి ర నువ్వు, ఇప్పటి వరకు నువ్వు రాసి ఇచిన answers చదివాను, ఇంక నా వల్ల కాదు, నా టి మరిగిపొతూ ఉంటుంది. బంగారం లాంటి మల్లయ్య అనే పేరు మార్చి కుక్కుటెశ్వర్ రావ్ అని మార్చి, షర్ట్, పాంట్ రెంట్ కితెచ్చి నాకు ఇచ్చి డాక్టర్ లాగ act చెయ్యలా? ఇల act చేస్తె నా tea కొట్టు నుంచి ఎదురు గ ఉన్న మీ tV-9 officeకి రొజు 100 tea లు ఆర్డెర్ ఇస్తారా. మనస్సాక్షి ఉందంట్ర వెధవ *్*్*్*.దొంగ నా &%%్**( గాలి న &$%్**.. మీ బతుకులు చెడ....
)

(ఇలా తిడుతు ఉండగానె, tV-9 లోగొ వచ్చి, మెరుగైన సమాజం కొసం చుస్తూనే ఉండండి tV-9 అని voice వినిపించి ads రావటం మొదలవుతాయి..)

గురువారం, జూన్ 25, 2009

మీకు తెలియని మీ సెల్ ఫోన్ రహస్యాలు

1) మీ సెల్ ఫోన్ నిఖార్సైనదేనా (genuine)?
2) మీ సెల్ ఫోన్ కు I.M.E.I. సంఖ్య లేక పోతే జూన్ 30 2009 తర్వాత, భారత దేశంలో అవి అచేతనం చేయబడతాయి.
3) మీ సెల్ ఫోన్ I.M.E.I. సంఖ్య తెలుసుకోవటం ఎలా?
4) మీ కారుని రిమోట్ కంట్రోల్ తో తాళం వేస్తారా? ఆ తాళం పొరపాటున పోతే, మారు తాళాలు (Duplicate Key) దూరంగా ఉన్న చోట ఉంటే, వెంటనే కారు తెరవటం ఎట్లా?
5) మీరు Airtel subscriber . మీరు కాష్మీర్ లోని లదాఖ్ (Ladakh) వెళ్తే , అక్కడ Airetel service లేకపోతే, అత్యవసర పరిస్థితిలో మీ సెల్ ఫోన్ ఎలా ఉపయోగించాలి?
6) మీ నోకియా సెల్ ఫోన్ లో బాటరీ క్షీణ స్థితిలో ఉంది. Recharge సదుపాయం మరో 70 కిలోమీటర్ల దాకా లేదు. మీరు కొన్ని అత్యవసర ఫోన్ కాల్స్ కై నిరీక్షిస్తున్నారు ఆ సమయంలో. గండం గడిచే దెట్లా? టెలిఫోన్ కాల్స్ అందుకునేదెట్లా?
7) మీ సెల్ ఫోన్ పోయింది. దాన్ని అచేతనం చేయటం ఎట్లా?

శుక్రవారం, మే 22, 2009

e-తెలుగు సమావేశం - May '09



ఎడమనుంచి కుడి వైపు: M.నరసింహా రావు, వీవెన్ మరియు సి.బి.రావు.

సాయంత్రం వీవెన్ నుంచి ఫోన్, తానుసమావేశానికి వస్తున్నట్లు. సరే, నేను మా ఇంటివద్ద నిరీక్షిస్తానని చెప్పాను. నిజానికి నాకుతెలిసి వీవెన్ నెలా సమావేశానికి రానిసందర్భం నేను ఎరగను. బయట ఊళ్లకు వెళ్లేపని ఉన్నా, సమావేశ సమయానికిహైదరాబాదులో ఉండేలా కార్యక్రమాన్ని ప్లాను చేసుకొంటారు. వీవెన్ మా ఇంటి కొస్తూనే బయలుదేరి కృష్ణకాంత్ఉద్యానవనానికి నిర్ణీత సమయానికి చేరుకున్నాము. ఎండలు మండే వేళ అది. మేము తప్ప వెరే ఎవరూ ఇంకారాలేదు. బ్లాగరు మిత్రులకోసం నిరీక్షిస్తూ ఉద్యానవనం బయటే ఉన్న సమయంలో, ఒక నడి వయస్సు పెద్దమనిషి మావద్దకు వచ్చి మీరు తెలుగు బ్లాగరులా అని అడిగారు. వారిని మేము ఎన్నడూ చూసి ఎరగము. వారు తమను తాముపరిచయం చేసుకున్నారు. వారి పేరు మల్లిన నరసింహా రావు. గిన్నిస్ రికార్డ్ తెచ్చిపెట్టిన, సికిందరాబాదు లో జరిగినఅన్నమయ్య లక్ష గళార్చన కార్యక్రమంలో పాల్గొనటానికి సామర్లకోట నుంచి వచ్చి, పనిలో పనిగా ఇక్కడి బ్లాగర్లనూకలవాలన్న సంకల్పంతో మమ్ములను కలిసారు. వారి రాకకు మేమూ సంతోషించాము. వారి బ్లాగు నరసింహhttp://kasstuuritilakam.blogspot.com ఇవే కాకుండా వీరికి ఇతర బ్లాగులు కూడా ఉన్నాయి. వాటివివరాలు ఇవిగో.

వేదుల--బాల
భారతీయం - అన్నమయ్య శృంగార సంకీర్తనలు
నరసింహ
సూక్తి ముక్తావళి
అన్నమయ్య పలుకుబడులు - జాతీయములు
శ్రీమదాంధ్రమహాభా...


నరసింహా రావు గారు వృత్తి రీత్యా రసాయనిక యింజనీరు అయినప్పటికీ, ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిమానులు; ప్రత్యేకించి అన్నమాచార్య కీర్తనలంటే ఆరాధన. వీరు బ్లాగులలో సేకరణలున్నప్పటికీ అక్కడక్కడా సొంత రచనలుకూడా తొంగి చూస్తుంటాయి. మచ్చుకు ఇది చూడండి.

ఇందిరమ్మ దొకటి, చెంద్రబాబు దొకటి,

.వె.
ఇందిరమ్మ దొకటి, చెంద్రబాబు దొకటి,
'చిరు'ది కొత్త పార్టి, జే.పి. దొకటి-
అన్ని పార్టిలకును ఆశయమొక్కటే
కోట్లు కూడ బెట్ట - కుర్చి నెక్కి.


వారు మాతో కాసేపు గడిపి, సికిందరాబాదులో కార్యక్రమ వేళ అయ్యిందని మా వద్ద సెలవు తీసుకున్నారు.

ఎండ ఇంకా తగ్గలేదు. బ్లాగరు మిత్రులకోసం నిరీక్షిస్తున్నాము. ఇంతలో వెంకటరమణ (e-తెలుగు కోశాధికారి) వస్తే, సంస్థ ఆర్థిక పరిస్థితి గురించి అడిగాను. లెక్కలు అన్నీ పక్కాగా ఉన్నాయని వాటిని http://wiki.etelugu.org/E-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%82%E0%B0%98_%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81 లో చూడవచ్చని సెలవిచ్చారు. లెక్కలుచూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. 2007 తర్వాత, సభ్యుల నుంచి మరలా సభ్యత్వ రుసుము వసూలుచేయబడలేదు. సభ్యులులలో కొంతమంది తమ ఉద్యోగ వ్యవహారాలలో నిమగ్నమవటం వలన e-తెలుగుకై కాలంవెచ్చించ లేకపోతున్నారు. e తెలుగు కార్యక్రమాలలో ఆసక్తి కలవారు, ఇందులో సభ్యులుగా చేరి తెలుగుకార్యక్రమాలను సమర్ధంగా నిర్వహించ కోరుతాను. -తెలుగులో చేరాలంటే ఏమి చెయ్యాలి? పుట చూడండి.
http://etelugu.org/node/247

సమావేశంపై ఎండ ప్రభావం కనిపించింది. కొద్దిమంది సభ్యులే హాజరయ్యారు.


ఎడమనుంచి కుడి వైపు: శ్రీనివాస్ రాజు దాట్ల, కిషోర్, శ్రీనివాసకుమార్. G, సి.బి.రావు, సతీష్కుమార్.Y మరియు వీవెన్.


సతీష్ కుమార్ యనమండ్ర (http://vedabharathi.blogspot.com): e తెలుగు లక్ష్యాల గురించి సభ్యులకు కూడా వివరంగా తెలిసినట్లులేదు. కొన్ని లక్ష్యాలు స్పష్టంగా లేవు.
cbrao: స్పష్టంగా లేని వాటి గురించి e తెలుగు కు వ్రాయవచ్చును. రానున్న సమావేశాలలో వాటి గురించి చర్చించి, సంఘ లక్ష్యాలు, నియమావళిలో మార్పు తీసుకు రావచ్చు.
సతీష్: తెలుగు భాషా వ్యాప్తికి, కంప్యూటర్లను మినహాయిస్తే, అంతకు మించి ముందుకు పోలేదు e తెలుగు.
శ్రీనివాస్ దాట్ల (http://blog.harivillu.org): కొన్ని వెబ్ సైట్లను e తెలుగు సభ్యులు తెలుగీకరణ చేస్తున్నారు.
వీవెన్: స్థానికీకరణ ఒక్కరు చేస్తే అవదు. ఒక్కరోజులో అవదు అంటూ Firefox,Word Press వగైరాలస్థానికీకరణ ఉదాహరించారు. C-doc వారి తెలుగు ఫాంట్లను అభివృద్ధి చెయ్యవలసిఉంది. అను ఫాంట్ల వారిని, వారిమిగతా ఫాంట్లతో పాటు తెలుగు యునికోడ్ ఫాంట్లను కూడా అభివృద్ధి పరచవలసిఉందని చెప్పాలి.
cbrao: గతంలో కొలిచాల సురేష్ గారు విషయంలో అనువారికి చెప్పియున్నారు. Followup సరిగా ఉన్నట్లులేదు. అను ఫాంట్లలో టైపు చేసిన వ్యాసాలను యునికోడ్లోకి మార్చే విషయంలో పరిశోధన అవసరం.
వీవెన్: దేశికాచారి గారు మూడవ తెలుగు అక్షరాలు తయారు చేస్తున్నారు. లినుక్స్ లో వలే తక్కువ ఖర్చులోఅయ్యేలా పని ముందుకు జరగాలి. Spellcheck విషయమై మరింత పరిశోధన అవసరం ఉంది (ఒక సంవత్సరంక్రితం వీవీన్ Spellcheck పై ప్రదర్శన ఇచ్చిఉన్నారు).
cbrao: e తెలుగు సభ్యులు విషయాలపై శ్రద్ధపెట్టి follow-up చెయ్యవలసిఉంది.
veeven: రావు గారు లేని సమయంలో జరిగిన పుస్తక ప్రదర్శనలో మన కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లటానికిమంచి అవకాశం కలిగింది.

ఘజల్ శ్రీనివాస్ తెలుగు బ్లాగు తయారుచేస్తున్న సతీష్, కంప్యూటర్లో తెలుగు వాడకం గురించి ఇటీవల ఒక స్కూల్ లోతను ఇచ్చిన ప్రదర్శన అనుభవాలు వివరించారు. తరువాత నెల నెలా సమావేశ తీరు తెన్నులపై కొంత చర్చ జరిగింది.
సతీష్ తమ సందేహం వెలిబుచ్చుతూ అడిగారు. సమావేశం ఎవరు నిర్వహిస్తున్నారు? ఇది సమావేశం?
cbrao: ఇది e-తెలుగు నిర్వహిస్తున్న, e తెలుగు సమావేశం. అయితే తెలుగు బ్లాగు గుంపుకు పంపిన సందేశం లోతెలుగు బ్లాగర్ల సమావేశం గా ఎలా వ్రాసారన్న సందేహం రావచ్చు. మిత్రులు ఇంకా అలవాటు పడనందువల్ల, e తెలుగు సమావేశం గా వ్రాస్తే, బ్లాగరులు ఇది తమ సమావేశం కాదని అపార్థం చేసుకునే ప్రమాదముందని అట్లా వ్రాయటం జరిగింది. నెలా నెలా జరిగేవి e తెలుగు సమావేశాలే కాని ఎక్కువగా బ్లాగరులు వస్తారు కావున వాటినిబ్లాగర్ల సమావేశాలుగానే బ్లాగర్లు తలుస్తారు.

సతీష్: అయితే కార్యక్రమాలకు అజెండా ఉండదా?
వీవెన్: ఇవి informal సమావేశాలు. e తెలుగు కార్యక్రమాల అమలులో, బయట వ్యక్తులను, సంస్థలను కలిసినప్పుడుమనలను ప్రభావశీలంగా నిరూపించుకొందుకు మనము ఒక సంఘంగా ఆవిర్భవిస్తే బాగుండగలదన్న ఆలోచనే e తెలుగు పుట్టుక కు నాందయ్యింది. కంప్యూటర్లో తెలుగు వ్యాప్తికై ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థగా e తెలుగు నుపేర్కొంటూ, సంస్థ ఆవిర్భాన్ని గురించి వివరించారు. మొదటగా సమావేశాలు తెలుగు బ్లాగర్ల సమావేశంగాప్రారంభమయి, వికీపీడియన్స్ కలిశాక వికీ + తెలుగు బ్లాగర్ల సంయుక్త సమావేశాలుగా నిర్వహించబడి తదుపరికంప్యూటర్లలో తెలుగు వ్యాప్తి అన్న ఆశయం తోడయి e తెలుగు గా స్థాపించబడి తన కార్యక్రమాలలో తెలుగుస్థానికీకరణ కూడా చేపట్టింది.
శ్రీనివాస్ రాజు దాట్ల : సమావేశాలలో బ్లాగుల గురించి ఎక్కువ చర్చిస్తున్నారు.
cbrao: ఇవి కార్పోరేట్ సమావేశాలు కావు. A.G.M. కాదు. సమావేశంలో అజెండా ప్రకారం కాకుండా, అన్నివిషయాలు మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా e తెలుగు కార్యక్రమాల అమలులో వచ్చే సాధక బాధకాలు, బ్లాగర్లసమస్యలు ఇక్కడ మనసువిప్పి మాట్లాడుకోవచ్చు. ఎలాంటి నియంత్రణలు లేవు.
సతీష్: మహిళా బ్లాగర్లపై దాడి ఫిబ్రవరిలో జరిగితే, దాని గురించిన చర్చ, ఖండన ఏప్రిల్ మాసంలో జరిగింది. విషయం పై చర్చ ఇంత ఆలస్యంగా ఎందుకు జరిగింది?
cbrao: ఫిబ్రవరి సమావేశంలో e తెలుగు సభ్యులు విషయంపై చర్చ వద్దని అభిప్రాయపడ్డారు. సమయంలో నేనుహైదరాబాదులో లేను. నాకు అందిన ఫిర్యాదుల దృష్ట్యా,ఇక్కడకు రాగానే, e తెలుగు సభ్యుడిగా కాకుండా ఒకహృదయమున్న వ్యక్తిలా స్పందించాను. బ్లాగర్ల సమస్యలు నా సమస్యగా భావించాను. అందుకే మహిళా బ్లాగర్లపైదాడి అనే అంశం పై చర్చకు తావివ్వటం జరిగింది. సమావేశాలలో ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలు వెళ్లడించే స్వాతంత్ర్యం ఉంటుంది.

సమావేశానికి
శ్రీనివాసకుమార్ గుళ్లపూడి (http://worthlife.blogspot.com) ఇంకా నువ్వుసెట్టి సోదరులలోని కిషోర్ (http://nuvvusetty.wordpress.com ) కూడా హాజరయ్యారు. తదుపరి సభ్యులు ఉద్యానవనంలోని ఫలాహారశాలలో తేనీరు సేవించటంతో సమావేశం ముగిసింది.

Photos: cbrao

బుధవారం, మే 20, 2009

తెలుగుదేశం ఓటమి

తెలుగుదేశం వారు కె.సి.ఆర్ తో చేతులు కలిపి తెలంగాణాలో స్వంతంగా గెలవగలిగే సీట్లను కోల్పోయారు. కె.సి.ఆర్. పార్టీ ఎన్నికల ఫలితాలు ఘోరం. తాము గతంలో గెలిచిన సీట్లు కూడా కోల్పోయారు. వలసదారులు (సెట్లర్స్) సహజంగానే ఈ రెండు పార్టీల కలయికను హర్షింపరు. వారినుంచి తెలుగుదేశం వ్యతిరేకత ఎదుర్కొంది.

ఇక నగదు బదిలీ పధకం. కార్మికులకంటే రైతుల వద్దకే ఈ సందేశం బాగా వెళ్లింది. ఈ పధకం అమలయితే,వ్యసాయపనులకు కూలీల కొరత పెరుగుతుందని వారు భయపడ్డారు. పని చెయ్యకుండా డబ్బులు పంచటం సొమరితనాన్ని పెంచుతుందని, ఖజానాను ఖాళీ చేస్తుందని మేధావులు అభిప్రాయ పడ్డారు. తెలంగాణా వస్తే, ఆంధ్రా వారు తెలంగాణాలో విదేశీయులవలే మెలగాలన్న ముఖ్యమంత్రి ప్రచారం, సమైక్యవాదులపై తీవ్ర ప్రభావాన్ని కలుగ చేసింది. వారు కాంగ్రెస్ వైపు ఆకర్షింపబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆకర్షణీయమైన జీతభత్యాల పెంపుతో వారిని తమవెంటే వుండేలా చేయగలిగింది కాంగ్రెస్. రైతులకు ఉచిత విద్యుచ్ఛక్తి, ఆరోగ్యశ్రీ, రాజీవ్ గృహయోజన ఇంకా 108 అంబులన్స్ సేవలు వైయసార్ కు ట్రంప్ కార్డుల లా ఎన్నికలలో ఉపయోగపడ్డాయి.

ప్రజారాజ్యం, లోక్ సత్తా పార్టీలు తెలుగుదేశం ఓట్లను చీల్చటం వలన కొన్ని చోట్ల స్వల్ప తేడాతో తెలుగుదేశం ఓటమి చవిచూడటం జరిగింది. జూనియర్ ఎంటియార్, బాలకృష్ణల ప్రచారం వలన జరిగిన తెలుగుదేశ ప్రచార కార్యక్రమాలు ఓట్ల రూపం దాల్చలేదు.

వయోలిన్ కళాకారుడు

మీలో కొంతమందికి గుర్తుండే ఉంటుంది; మిత్రులు ఇన్నయ్య గారి అబ్బాయి రాజు నరిసెట్టి The Washington Post దిన పత్రికలో Managing Editor గా పనిచేస్తున్నట్లు. ఈ మధ్య ఈ పత్రిక వ్యక్తుల సామాజిక ప్రవర్తన, కొన్ని ఘటనలకు వారి ప్రత్యుత్తరం (బదులు) పై ఒక చిన్న ప్రయోగం నిర్వహించింది. ఫలితం చాలా ఆసక్తికరంగా ఉంది. రండి ఆ సంగతేమిటో మీరూ చూడండి. ఒక మిత్రుడి నుంచి అంతర్జాలంలో వచ్చిన ఉత్తరం లోని కథనం ఇది.

A man sat at a metro station in Washington DC and started to play the violin; it was a cold January morning. He played six Bach pieces for about45 minutes. During that time, since it was rush hour, it was calculated that thousand of people went through the station, most of them on their way to work. Three minutes went by and a middle aged man noticed there was musician playing. He slowed his pace and stopped for a few seconds and then hurried up to meet his schedule. A minute later, the violinist received his first dollar tip: a woman threw the money in the till and without stopping continued to walk. A few minutes later, someone leaned against the wall to listen to him, but the man looked at his watch and started to walk again.

Clearly he was late for work The one who paid the most attention was a 3 year old boy. His mother tagged him ! along, hurried but the kid stopped to look at the violinist. Finally the mother pushed hard and the child continued to walk turning his head all the time. This action was repeated by several other children. All the parents, without exception, forced them to move on. In the 45 minutes the musician played, only 6 people stopped and stayed for a while. About 20 gave him money but continued to walk their normal pace. He collected $32. When he finished playing and silence took over, no one noticed it. No one applauded, nor was there any recognition.

No one knew this but the violinist was Joshua Bell, one of the best musicians in the world. He played one of the most intricate pieces ever written with a violin worth 3.5 million dollars.

Two days before his playing in the subway, Joshua Bell sold out at a theater in Boston and the seats average $100. Thi! s is a real story. Joshua Bell playing incognito in the metro station was organized by the Washington Post as part of an social experiment about perception, taste and priorities of people. The outlines were: in a commonplace environment at an inappropriate hour: Do we perceive beauty? Do we stop to appreciate it? Do we recognize the talent in an unexpected context?

One of the possible conclusions from this experience could be:
If we do not have a moment to stop and listen to one of the best musicians in the world playing the best music ever written,

how many other things are we missing?

PS:

As poet John Keats rightly wrote " What is this Life, Full of Care, We have no time to stand and stare

గురువారం, ఏప్రిల్ 23, 2009

బ్లాగు కబుర్లు

కాగడా శర్మ బ్లాగు మూతపడటం ఈ వేసవిలో చల్లని వార్త. గూగుల్ కు అందిన ఫిర్యాదులవలనే ఈ బ్లాగు అంతర్ధానమయ్యిందన్న వార్తలు వినవస్తున్నై. ధూం బ్లాగు కూడా త్వరలోనే మూతపడే లక్షణాలు కనిపిస్తున్నై. ఏ కారణాలవలనైతేనేమి, అక్షయ తృతీయ సందర్భంలో మహిళాబ్లాగర్లకు బంగారం కొనకుండానే, కొన్నంత ఆనందాన్నివ్వగలదీ వార్త. ఈ బ్లాగులలోని రాతలకు బాధపడని, భయపడని మహిళా బ్లాగర్లు ఎవరైనా వుంటే తెలియపరచండి. వారు దీప్తిధార నుంచి వీరతాడు బహుమతి కి అర్హులుగా ప్రకటిస్తా. ఈ రెండు బ్లాగులు మూతపడిన రోజే పాఠకులకు, ప్రత్యేకంగా మహిళలకు దీపావళి.

బ్లాగులు ఎవరి కోసం? ఎందు కోసం? వ్యాఖ్యలు రాకపోతే ఆ టపా తుస్సుమన్నట్లా? 25 వ్యాఖ్యలు వస్తే హిట్ అయినట్లా?

ఎట్లాంటి టపాలు పాఠకులు ఎక్కువ ఆసక్తితో చదువుతున్నట్లుగా మీ భావన?

1) సాహిత్య విషయాలు
2) సినిమా కబుర్లు
3) హేతువాద చర్చలు, వ్యాసాలు
4) గాసిప్ కబుర్లు (ఉదాహరణ ధూం వగైరా బ్లాగులు)
5) సైన్స్, ఖగోళ శాస్త్రం
6) జ్యోతిష్య శాస్త్ర కబుర్లు
7) ఆరోగ్య విషయాలు
8) అవి -ఇవి -అన్నీ
9) రాజకీయాలు
10) సంగీతం
11) ఛాయాగ్రహణం
12) యాత్రా స్మృతులు
13) వంటలు పిండివంటలు
14) వ్యక్తిగత అనుభవాలు
15) కొత్త పరికరాలు (Cell phone, Camera, Computer etc)
16) ఆత్మ కధలు, జీవితానుభవాలు
17) మనో వైజ్ఞానిక శాస్త్రం
18) చరిత్ర
19) శృంగారం

కొన్ని విషయాలపై రాసే టపాలకు స్పందన తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు శాస్త్ర (Science), సాహిత్య విషయాలపై రాసే టపాలకు, సినిమాలు, సొల్లు కబుర్లకు ఉన్నంత ఆదరణ ఉండక పోవచ్చు. హిట్లు రానంత మాత్రాన వీటి ప్రయోజనం ఉండదా? సామాజిక హితం కోసం హిట్లు రాకపోయినా,నిరుత్సాహపడకుండా ఇలాంటి విషయాలపై రాసే బ్లాగర్లకు జొహార్లు.కొత్త పరికరాలు (Cell phone, Camera, Computer etc) పై తెలుగు బ్లాగులు బహు తక్కువ. వీటి అవసరం కనిపిస్తుంది. మనకు తెలియకుండానే మన జీవితం, పైన పేర్కొన్న అన్ని విషయాలతో ముడిపడి ఉంది. హిట్లు వచ్చినా రాకపోయినా మీకు నచ్చిన విషయాలపై రాస్తూ ఉండండి.

"సినిమా పాటలలో సాహిత్యం ఉంటుందా?" - అని ఒకానొకప్పుడు (మా కాలేజ్ రోజుల్లో) చర్చలు జరుగుతుండేవి. కొందరు ప్రఖ్యాత సినీ గేయకవుల సినీ పాటలు సంపుటాలుగా వెలువడ్డాక సందేహ నివృత్తయి, చర్చ పాతబడిపోయింది. ఇప్పుడు బ్లాగులలో తాజా చర్చ "బ్లాగులలో సాహిత్యముందా?" అని. నా ప్రపంచం బ్లాగులో ప్రచురితమైన సాహితీపరులతో సరసాలు ఇంకా వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు కలిపి తాజాగా సాహితీపరులు పాత్రికేయులతో సరసాలు గా పుస్తక ప్రచురణ అయ్యింది. ఈ పుస్తకంలోని వ్యాసాలు తొలిసారి బ్లాగులో ప్రచురితమయిన తర్వాతే, పుస్తకంగా వెలుగు చూశాయి. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? బ్లాగులలో వస్తున్న రచనలు ఉత్త ' రాలు ' కాదు, పస ఉన్న సరుకని.

బుధవారం, ఏప్రిల్ 15, 2009

e-తెలుగు


e-తెలుగు కార్యకర్తలకు రాజకీయ ఉద్దేశాలు, Hidden Agenda ఉన్నట్లుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. e-తెలుగు ఉద్దేశాల పై కూడా పాఠకులకు సరైన అవగాహన లేనందున, వారు సందేహాలకు లోను కాకుండా e-తెలుగు గురించి కొన్ని వివరణలు ఇచ్చే అవసరం కలుగుతుంది. e-తెలుగు అనేది మొదటి నుంచి ఒక తెరిచిన పుస్తకం. ఒక లిఖిత నియమావళి ప్రకారం ఇది పని చేస్తుంది. e-తెలుగు ఉద్దేశాలు స్పష్టంగా నిర్వచించబడి ఉన్నాయి. e-తెలుగు గురించి వివరిస్తూ గతంలో కొన్ని వ్యాసాలు ప్రచురించబడ్డాయి. e-తెలుగు గురించి దాని కార్యకర్తల గురించి తెలుకోవటానికి ఈ కింది వ్యాసాలు మీకు దోహదపడగలవు.

e-తెలుగు ఎలా ఏర్పడింది?
e-తెలుగు ప్రశ్నలు & జవాబులు
తరచూ అడిగే ప్రశ్నలు


అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికై చేసే కృషిలో భాగంగా బ్లాగులను, వికీపీడియాను, వెబ్ పత్రికలను, ఇతర తెలుగు వెబ్‌సైట్లను తెలుగువారికి పరిచయం చేస్తోంది. ఇంతే కాకుండా పెక్కు వెబ్ సైట్లలో అనువాద కార్యక్రమాలను సభ్యుల సహకారంతో నిర్వహిస్తుంది. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అశ్లీల రాతలకు దూరంగా ఉంటుంది, ప్రోత్సహించదు. e-తెలుగు కార్యక్రమాలు మొదటి నుంచీ పారదర్శకంగా ఉంటున్నవి, ఉంటాయి. బ్లాగుల, బ్లాగరుల చర్చా గోష్టులు , యునికోడ్ ప్రచార కార్యక్రమాలు అన్నీ అందరికీ తెలిసేలా నిర్వహించబడతాయి.

తెలుగు బ్లాగరుల మొదటి సమావేశం నుంచి ఈ రోజు దాకా జరిగిన అన్ని బ్లాగరుల సమావేశ నివేదికలు మీరు దీప్తిధార బ్లాగు, e-telugu.org వెబ్సైట్ లో చూడవచ్చును. బ్లాగరుల సమావేశాలన్నీ గతంలో నమోదు చేసి, పైన చెప్పిన ప్రదేశాలలో ప్రచురించటం జరిగింది. ఏవీ రహస్యాలు లేవు. e-తెలుగు లో సభ్యులు కానివారు కూడా ఇవి చూడవచ్చు, చదవవచ్చు. బ్లాగర్ల సాధక బాధకాలు, సాంకేతిక సమస్యలు, ఆకాశరామన్న ఉత్తరాలు, టపాలు వగైరా అన్నీ ఇక్కడ చర్చించబడతాయి, ఆ చర్చల వివరాలు ప్రచురించబడతాయి కూడా. కొందరు బ్లాగర్లు అనుకున్నట్లుగా ఇవి ఆంతరంగిక, రహస్య సమావేశాలు కావు. పలు ఉత్తరాలు, ఫోన్స్ కు సమాధానంగా పై వివరణ ఇస్తున్నాను.

సమావేశ వివరాలు వ్రాయవద్దంటే ఎలా? ఇన్నాళ్ల మన పారదర్శకతకు భంగం వాటిల్లదా, ఇలా చేస్తే?


సోమవారం, ఏప్రిల్ 13, 2009

వాడిగా, వేడిగా తెలుగు బ్లాగర్ల సమావేశం

















ఈ వేసవి వేడిగా ఉంది. ఎలెక్షన్ జ్వరం, శేఖర్ కమ్ముల గోదావరి లాంటి చిత్రం (గుర్తుందా! ఈ వేసవి చల్లగా ఉంటుంది అన్న Caption) విడుదల కాకపోవటం కూడా కారణాలు కావచ్చు. వీటికి అదనంగా నిజం పేరుతో బ్లాగులు రాయటానికి వెనుకాడే పిరికిపందల అసభ్య బ్లాగురాతలు తోడయ్యాయి.

12th April 2009: 10 నిమిషాలు ఆలస్యంగా నేను కృష్ణకాంత్ ఉద్యానవనానికి వెళ్లేసరికి అక్కడ శ్రీనివాస్ దాట్ల (blog.harivillu.org), శ్రీనివాసకుమార్ గుళ్లపూడి (http://worthlife.blogspot.com/) ఇంకా సతీష్ కుమార్ యనమండ్ర (http://vedabharathi.blogspot.com/) ఎండవేడినుంచి ఉపశమనానికై ఆంధ్రా గోలీ సోడా నిమ్మరసంతో కలిపి తాగుతూ కనిపించారు. అప్పటికే పార్క్ లోపల చక్రవర్తి (http://bhavadeeyudu.blogspot.com) ఇంకా శ్రీమతి మాలా కుమార్ (http://sahiti-mala.blogspot.com/) మాకోసం వేచియున్నారని తెలియటంతో అందరమూ లోనికి వెళ్లి శ్రీమతి మాల, చక్రవర్తి గార్లను కలుపుకొని, ఎప్పుడూ సమావేశాలు జరిపే పచ్చికబయలు వద్దకు వెళ్లి, కూర్చున్నాము. ఒకరినొకరు పరిచయం చేసుకునే కార్యక్రమంలో ఉన్నప్పుడు, వీవెన్ (http://veeven.wordpress.com), సతీష్ కుమార్ యెర్రంశెట్టి (http://blaagu.com/sateesh/) ఇంకా అరుణ పప్పు (http://arunam.blogspot.com/) వచ్చారు.

అప్పటికి ఒకసారి పరిచయాలయినా, కొత్తగా వచ్చిన వారి కోసం మరలా పరిచయ కార్యక్రమాలు మొదలుపెట్టాము. పరిచయం చక్రవర్తి తో మొదలుపెట్టాము. చక్రవర్తి తనని పరిచయం చేసుకుంటూ తేలిక విషయాలు ఉబుసు (http://ubusu.blogspot.com/) బ్లాగులోను, కొంచెం బరువైనవి తన భవదీయుడు బ్లాగులో రాస్తుంటానని, తన బ్లాగులోని నిందాస్తుతి ఎవరైనా బ్లాగరులను బాధిస్తే క్షమించాలని కోరారు. వీరి శ్రీమతి స్వాతి బ్లాగరి. ఆమె బ్లాగు ఊసులు (http://oosulu.blogspot.com/). ఆమె రాలేదేమన్న మిత్రుల ప్రశ్నలకు తను అడిగానని, తనకు ఈరోజు సమావేశానికొచ్చే మూడ్ లేదని బదులిచ్చారు. ఆ తరువాత సతీష్ కుమార్ యెర్రంశెట్టి తన పరిచయం చేసుకున్నారు. సతీష్ ఈనాడు జర్నలిజ్మ్ స్కూల్ లో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నారు. అసభ్యరాతకారులకు భయపడి, తమ బ్లాగులు మూసేసిన అక్కలు, చెళ్లెళ్ల పట్ల ఆవేదన వ్యక్త పరుస్తూ వారు, ఆడో మగో తెలియని, పేరు చెప్పుకొలేని పిరికిపందల రాతలకు వెరవక తమ బ్లాగులు పునః ప్రారంభించాలంటూ రాసిన వీరి కవిత ఇక్కడ http://blaagu.com/sateesh/2009/04/13/%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%80-%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be%e0%b0%b2-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ae%e0%b1%81/ చూడండి. ఆ తరువాత వీవెన్ తనను పరిచయం చేసుకుటూ తన పేరులోని (వీర వెంకట చౌదరి) చౌదరి తీసివేయగా మిగిలిన పేరును సంక్షింప్తం చేసి వీవెన్ గా లోకానికి పరిచయమవుతున్నానన్నారు. వీవెన్ సాధారణంగా ఉంటూ, అసాధారణమైన లేఖిని, కూడలి సృష్టికర్తగా బ్లాగులోకానికి తెలుసు.శ్రీనివాసకుమార్ గుళ్లపూడి మాట్లాడుతూ నలుగురికీ పనికివచ్చే, ఒక మంచి పనికి ప్రేరణ కలిగించే కథలు తన బ్లాగు "జీవితంలో కొత్త కోణం" లో వ్రాస్తుంటానన్నారు. వీరి బ్లాగులోని తాజా కథనం Homes for the Hungry కథనం ఇక్కడ http://worthlife.blogspot.com/2009/03/blog-post_28.html చదవవచ్చు.



కుడి నుంచి యెడమకు: శ్రీయుతులు సతీష్ కుమార్ యెర్రంశెట్టి, వీవెన్, శ్రీనివాసకుమార్ గుళ్లపూడి, సతీష్ కుమార్ యనమండ్ర, శ్రీనివాస్ దాట్ల , cbrao, అరుణ పప్పు ఇంకా మాలా కుమార్.

ఆ తరువాత పరిచయమయిన వారు సతీష్ కుమార్ యనమండ్ర. వీరు తన బ్లాగు sky-astram.blogspot.com లో సంభ్రమం కలిగించేలా ధూం ఎవరో తనకు తెలుసంటూ, ధూం గురించిన ఆధారాలు తనవద్ద వున్నాయంటూ టపాలు రాసి పాఠకులను అచ్చెరువొందించారు. వీరి సాక్ష్యధారాలు ఇంకా బయటపెట్టలేదు. ఆ తరువాత శ్రీనివాస్ దాట్ల మాట్లాడుతూ తన బ్లాగు హరివిల్లులో రాస్తుంటానని తెలిపారు. Blog home page decoration లో కిటుకులు తెలిసిన శ్రీనివాస్ దాట్ల, ఒక అందమైన eligible bachelor. మీకు తెలిసిన అమ్మాయుంటే చెప్పండి. దాట్ల ముక్కుకు తాడెయ్యాలి. ఆ పై cbrao మాట్లాడుతూ తాను ఎక్కువగా దీప్తిధార (http://deeptidhaara.blogspot.com/) లో రాస్తుంటానని, సమీక్షలు, విమర్శలు పారదర్శి (http://paradarsi.wordpress.com/)లో రాస్తానని చెప్పారు. అరుణ పప్పు మాట్లాడుతూ తాను ఆంధ్రజ్యోతి లోని నవ్య స్త్రీల శీర్షికలు వగైరా నిర్వహిస్తామని చెప్పారు. డిసంబర్, జనవరి మాసాలలో e-telugu.org కార్యక్రమాలలో వీరు చురుకుగా పాల్గొన్నారు. తెలుగు బ్లాగుల గురించి జ్యోతిలో విపులమైన వ్యాసం వ్రాశారు. తెలుగు బ్లాగులకు తమ నవ్యలో విస్త్రుత ప్రచారం కల్గించారు. తెలుగు బ్లాగులకు ఎంతో సేవ చేసిన అరుణ ప్రస్తుతం తానే ధూం అనే పేరుతో రచనలు చేస్తున్నారనే అపవాదు ఎదుర్కుంటున్నారు. శ్రీమతి మాలా కుమార్ మాట్లాడుతూ తన అసలు పేరు కమల అయినా బ్లాగ్లోకానికి మాలగా పరిచమయ్యి, యాత్రా స్మృతులు, వైవాహిక జీవితం, పుస్తకాలు, రచయిత్రులు వగైరా విషయాలపై తన బ్లాగు సాహితి -మాల బ్లాగులో వ్రాస్తుంటానని పరిచయం చేసుకున్నారు. బ్లాగ్లోకంలోని కల్మషం తెలియదు వీరికి.

To be continued .....

తరువాయి భాగంలో
చర్చా కార్యక్రమం
మూతబడిన బ్లాగుల బ్లాగరిల ఆత్మస్థైర్యం పెంచేదెలా?
అసభ్య రాతలు రాసే ధూం, కాగడ శర్మలనేమి చెయ్యాలి?
నేను ధూం ను కానన్న అరుణ.

శనివారం, ఏప్రిల్ 11, 2009

చౌదరిగారికి సవాలు విసిరిన విశ్వనాధవారు

నేపధ్యం

శ్రీశ్రీ అభిప్రాయంలో భారతం వాస్తవం, రామయణం మిధ్య. రామాయణ కథ భారతంలో ఉంటే, భారతం Fact అయితే, రామాయణం Myth ఎలా అవుతుంది? శ్రీమద్ రామాయణ కల్పవృక్షము పాషాణ పాకమేనా? పాషాణాన్ని పగులకొడ్తే వజ్రాలు, మణులు రావా? ఇంతకీ చౌదరి గారి సవాలును విశ్వనాధవారు స్వీకరించి, పండితుల సభ పెట్టడానికి అంగీకరించారా? కొత్తగారి విమర్శలు చదవకుండా వాటికి విశ్వనాధ వారు ఎలా జవాబిచ్చారు? -cbrao

నాది పాషాణపాకమనే వారి బుద్ధిలోనే లోపముంది

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

(కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు విమర్శలకు సమాధానంగా అక్టోబరు 29వ తేదీ ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో వ్రాసిన వ్యాసం)

శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరిగారు నేను ఆంధ్ర మహాసభ చెన్నపురిలో చేసిన ఉపన్యాసమునకు బదులుగా అక్టోబరు 22 ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో ఒక సమాధానం వ్రాశారు. ఎవరో తీసుకొని వచ్చి చూపించారు. నా ఆవేదన, శ్రీ జలగం సుబ్రహ్మణ్యం నాయుడుగారు చెప్పిన మాటలు, శ్రీశ్రీ అన్న పాషాణపాకం ఇవన్నీ ఇట్లా ఉంచుదాం. నేను ‘గాడ్సేకులం’ వాణ్ణి. ఆయన ‘గాంధీకులం’ వాడు. అది కూడా అట్లా ఉంచుదాం. ‘ధర్మచింత’,

‘పాపభీతి’ ఉగ్గుపాలతో పెట్టిన జాతి వారిది. నేను ఆ సభలో త్రికరణ శుద్ధిగా వర్ణాది భేదాలు లేవన్నది వారు నా రామాయణం ప్రకారం ఋజువు చేస్తారట. వారికే ‘ధర్మచింత’, ‘పాపభీతి’ ఉన్నవని వ్రాస్తున్నారు. నేను సభలో అన్న, నాకు వర్ణ ద్వేషం లేకపోవడం అబద్ధం! వీరు ధర్మచింత మొదలైనవి తమకు కలవని వ్రాయడం నిజం! అవి రెండూ వారికి ఉండడానికి వీలులేదని వారి విమర్శ వ్యాసాలే సాక్ష్యం. ఇందులో ఒక భేదం ఉన్నది. వ్యక్తిగతంగా నాకు ఆ గుణాలు లేవన్నాను. ఆ ధర్మబుద్ధి, పాపభీతి వారి జాతి గుణాలు అని చెబుతున్నా డాయన. నన్ను గురించి నేను చెప్పుకోవచ్చు. తన జాతిని గురించి తాను పూచీ పడడం కష్టం. వారి జాతి యేమిటి? భారతీయ జాతియా? ఆంధ్రజాతియా? ఒక జాతికి ప్రధానమైన లక్షణాలు కొన్ని ఉంటవి. జాతి మొత్తము మీద ఆ లక్షణాలు చెప్పవచ్చు తప్ప, జాతిలో పుట్టిన ప్రతివాడికీ ఆ లక్షణాలు ఉండవనడం చాలా కష్టం.

ఇవట్లా ఉంచి, శ్రీ శ్రీ నా కవిత్వాన్ని పాషాణ పాకమన్నాడు. నేను సమాధానం చెప్పలేదని ఆక్షేపణ. శ్రీశ్రీకి ఎందుకు సమాధానం చెప్పలేదో మనవి చేస్తాను. శ్రీశ్రీ ఆ సభలో దిగాలుపడి కూర్చోవలసి వచ్చింది. నేను సమాధానం కూడా చెబుతే ఆయన ఇంకా దిగజారిపోతాడని చెప్పలేదు. శ్రీశ్రీని నేను నలుబది యేండ్ల నుండి యెరుగుదును. ఆయన అంటే నాకొక విధమైన ప్రేమ ఉన్నది. ఓ చౌదరిగారూ! నేను వ్రాస్తే మీరంగీకరించరు. ఒప్పుకోరు. లౌక్యం కోసం వ్రాస్తున్నానని అనుకున్నా అనుకోవచ్చు. యదార్థంగా మీరన్నా కూడా నాకొక విధమైన అనురాగంవంటి భావం ఉన్నది. ముప్ఫై యేళ్ళ క్రిందట – ఇంకా ఎక్కువ ఏండ్ల క్రిందనో మీరూ, నేనూ, శ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారూ కలిసికొన్నాము. ఆనాడు చాలా స్నేహంగా మాట్లాడాము. తరువాత మనము కలిసికొన్నదీ తక్కువే. స్నేహంగా మాట్లాడు కొన్నదీ తక్కువే. మిమ్మల్ని గురించి నాటినుండి నేటివరకూ, ఆ అర్ద్రమైన ప్రభావమే ఉన్నది. అలా అందరికీ ఉంటుంది లోకంలో. అలాగ, మీరు ఇవ్వాళ విమర్శ వ్రాస్తే మీమీద నాకు కోపం రానట్లే, శ్రీ శ్రీ పాపాణం పాకం అన్నా కోపం రాలేదు. సాగదీస్తే శ్రీ శ్రీ కాదు, ఆరు శ్రీలున్నా నిలువడు.

ఆ రోజున శ్రీశ్రీ ఎందుకు దిగాలుపడి ఉన్నాడంటే చెబుతాను. ఆ సన్నివేశం ఆంధ్ర పత్రికా విలేఖరి వ్రాయలేదు. వెయ్యలేదు. అది ఇది. శ్రీ శ్రీ “భారతం (Fact) రామాయణ (Myth)” అన్నాడు. “వాల్మీకులు చాలామంది ఉన్నారు. వాళ్లందరూ వాల్మీకులుకారు. విశ్వనాథ ఒక్కడే వాల్మీకి” అన్నాడు. ఈ సందర్భంలో శ్రీ జలగం సుబ్రహ్మణ్యంనాయుడుగారు – ఆయన సంస్కృతాంధ్రాలలో చక్కని పరిచయం కలవారు సుమండీ. చాలా గడుసువారు కూడాను – ఆయన శ్రీశ్రీని నిగ్గదీశారు. “ఏమండీ! భారతం (Fact) ఏ కదా! రామాయణం (Myth) ఏ కదా? భారతాన్ని ఒప్పుకుంటారు కదా” రామాయణం (Myth) ఏ కదా? ఇల్లా నాలుగుసార్లు శ్రీశ్రీ మాట అనిపించి, సభవంక చూచి, “ఏమండీ! వింటున్నారుకదా!” అని మళ్ళీ శ్రీశ్రీ చేత ఒప్పించి, “అయ్యా! భారతము (Fact) ఐతే భారతంలో రామాయణ కథ చెప్పబడి ఉన్నది. రామాయణం (Myth) అవడం ఎలాగా? భారతంలో ఉన్నదంతా (Fact) అని మీరే అన్నారు కదా! అని బాంబు పేల్చారు. శ్రీశ్రీ డీలాపోయినాడు. తెల్లమొహం వేశాడు. “అయినా (Myth) ఏ” అన్నాడు. నాయుడుగారు “మళ్ళీ అలా మాట్లాడుతారేం?” అన్నాడు.

నాకు స్నేహితుడైన శ్రీశ్రీ సభలో అట్లా కాక వారి పాషాణపాకం అన్నాడని సమాధానం చెప్పి, ఇంకా దిగులుపర్చమంటారా? నాది పాషాణపాకమన్నవాడి ఆంధ్ర సారస్వత విజ్ఞానం పాషాణ ప్రాయమంతే! అని నే ననడం బాగుండదుకదా! ఈ అహంకారాన్ని చూచి ఇతరులు వ్రాసే వ్రాతలు, వాళ్లు మాట్లాడే మాటలు – వాటిపేరు “ధర్మచింత – పాపభీతి” ఎబ్బే.. వారి కనులు అహంకారమేలేదు. అయ్యో బాబూ! అనవసరమైన అహంకారాన్ని మనం చంపుకోలేమే. మాత్సర్యాదులవల్ల పుట్టిన అహంకారాన్ని మనం చంపుకోలేమే? ఎవరో ఒక పనిచేసి, అది గొప్ప పని అనుకుని – చాలామంది గొప్పపని అనడం మూలంగా కూడా, అనుకున్నాడేమో పాపం - వాడు నేను చేసిన పనిలోని గొప్పతనం ఇది ఇదీ అని ఇతరులకు చెబుతే అది గొప్పతనం కాకపోతే కాదను. అంతేకానీ, అది వారి అహంకారమనడమేలా? వారు చెప్పిన గొప్పతనం కాకపోతే వాడు వృద్ధుడు. అహంకారమైనా గొప్పదనమేగా? ఒకడు తన గొప్పతనాన్ని గురించి అహంకార పడడం చూచి అవతలివాడు పడేదానికి పడేదానికి పేరేమిటి? పెద్దలకు తెలియాలి.

మీరు చాలా నెలలబట్టి ఈ వ్యాసాలు వ్రాస్తున్నారు. నే నా ఒక్కవ్యాసం కూడా చదువలేదు. నాకు వర్ణ శాఖాది ద్వేషాలు లేవంటే నమ్మనివారు, ఈ విషయాన్ని నమ్ముతారని నే ననుకోవడం లేదు. నా పాకం పాషాణపాకం అన్న శ్రీశ్రీని అట్లాంటి మరికొందరితో కలిసి అడుగుతున్నాను. అయ్యా! నా గ్రంథాల్ని తమరు ఏవేవి చదివారు? మీరు చదివిన ఒక గ్రంథంలో ఎన్ని పద్యాలు ఉన్నవి? మీకు అర్థంకాకపోవడమేకాదా, పాషాణ పాకమంటే? అందులోవన్నీ అర్థం కాలేదా? కొన్నేకాలేదా? అర్థం ఐనవెక్కువా? కానినెక్కువా? పాషాణపాకమంటే అర్థమేమిటి? పగులగొట్టడానికి వీలులేదనియేకదా? మణులు ఉన్నవి. వజ్రాలు ఉన్నవి. వెలగల రాళ్ళు ఉన్నవి. అవి కాంతిని విరజిమ్ముతూ ఉంటవి. వాటి కాంతిని చూచి ఆనందించాలి తప్ప పగులకొట్టడు. పగులకొట్టి చిన్న చిన్న రాళ్ళుగా వర్తకులమ్ముతారు. ఆ పగులగొట్టే నేర్పు వాళ్లకు తెలుసు. అలాగే మీరన్నట్లు నేను వ్రాసిన వందపద్యాల్లో రెండు మూడు పద్యాలు మీకు పాషాణపాకమనిపిస్తే, వాటి కాంతి మీకు తెలిస్తే ఆనందించండి. తక్కినవి మీ ద్రాక్షాపాకలే, మీ కదళీ పాకాలే వందలాది పద్యాలుంటవి. అవి చూచి ఆనందించండి. మేము మీ గ్రంథాన్ని తిట్టడానికే పుట్టాము. మేము చదువము అని మీరంటే మీకు నమస్కారము.

ఎవరో కొందరు మాత్పర్యగ్రస్తులు ఒక మాటను దేశంమీద పారవేయడం “గతానుగతికోలోక: వలోక: పారమార్థిక:” అన్నట్లుగా తక్కినవాళ్లు దాన్ని పట్టుకొని ప్రాకులాడడం అలవాటైంది. నేను రామాయణంకాని, ఇతర కవిత్వంకాని వందలాది సభల్లో చదివాను. విన్నవాళ్ల్లెవరూ పాషాణపాకమనలేదు. అనలేదు సరికదా ఆనందించారు. ఈ పాషాణపాకం, అనేవాడి బుద్ధిలో ఉంది. హృదయంలో ఉంది. నేను ఆవేదన పొందానని అనుకోవడం శ్రీ జలగం సుబ్రహ్మణ్యం నాయుడుగారు పొరపాటు పడ్డారు. నేను నా జాతి లక్షణం చెప్పుకోలేను కాని, నా వ్యక్తి లక్షణం ఏమంటే “గాఢంగా నేను నా చేత నైనంతలో వూహించడం, త్రికరణ శుద్ధిగా మాట్లాడటం” త్రికరణ శుద్ధిగా మాట్లాడుతుంటే చాలామంది ఆవేదనే అనుకుంటారు. నేను ఆవేదనపడితే శ్రీ చౌదరిగారి విమర్శలకు ఆ విమర్శలు చేసే పత్రికలు, వేయకపోయినా, ఇతర పత్రికలలో సమాధానాలు ఇంతకంటే శరపరంపరలుగా వ్రాసేవాణ్ణి.

వ్రాయడం – మాట్లాడడం రెండు విధాలు. వ్రాయడంలో ఆవేదన ఉన్నదో లేదో తెలుసుకోవడం కష్టం. మాట్లాడడంలోనూ తెలుసుకోవడం కష్టం కానీ, ఇందాక మనవి చేశాను కదూ – వాడు ఆవేదన పడ్డాడాని అనుకోవచ్చు. ధర్మం చెప్పేవాడి మాట ఆవేశంతో చెప్పినట్లు ఉంటుంది. ఆ ఆవేశం ఆవేశమౌనో కాదో మరుక్షణమందు తెలుస్తుంది. అది నిజంగా ఆవేశమైతే తరువాత చాలా సేపు ఉంటుంది. మరుక్షణమందు ఉండని ఆవేశము ధర్మం చెప్పడంలో ఉన్న తీవ్రతకాని ఆవేశం కాదు. ఆ శ్రీ శ్రీ వ్రాసింది పాషాణపాకం. అనగా పగులగొట్టితే ఏమి ఉండదో, అది పాపాణపాకం. నా కవిత్వం పాషాణ పాకమన్నది ఎవడో ఒక టెంకాయ పిచ్చికొండ. కాలం దానికి యోగ్యం కనుక బాగా ఉన్నదన్నమాట.

అదంతా అట్లా ఉంచి శ్రీ చౌదరిగారూ! పండితుల్ని పిలువడం, సభ చేయించడం చాలా పెద్ద ఎత్తు ఎత్తారు! ఇలా పూర్వం శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు వ్రాస్తుండేవారు. ఆ రాశిలో చేరుదామనా? ఈ కల్పవృక్షం మీద విమర్శతో ఒక రాశిలోనికి వచ్చారనుకోండి. పై రాశికి వెళ్ళడం కూడా మంచిదే. అయ్యా “చీద్గగన ప్రాలేయాంశువున్” అని ఉన్నది. ఇక్కడ ‘న’ కారం గురువవుతుందని మీరు వ్రాశారు. అది తప్పని, ఇటువంటివి ఇంకా పాతిక కూడా చూపించారట. తక్కినవన్నీ అట్లా ఉంచి, ఈ నకారం గురువవుతుందా... గురువవుతుంది. ఇది తప్పేను అని మీ యిష్టము వచ్చిన పదిమంది పండితులతో దస్కతులు చేయించి పత్రికలలో వేయించండి. ఆ పదిమంది పండితుల పేర్లు దేశానికి తెలుస్తవికదా! రంగయ్య, పుల్లయ్య పేర్లు పెట్టి వ్రాయించకండి.

అప్పయ్య దీక్షితులు, జగన్నాధ పండితుల వాదం మీరు తెచ్చారు. ఆ ప్రసక్తి ఎందుకు? నక్క ఎక్కడ, దేవలోక మెక్కడ? అముద్రిత గ్రంథ చింతామణి పేరు ఎత్తారు. ఆ విమర్శకీ, మనకూ కొన్ని మైళ్ళ దూరం ఉంది. పెద్ద పేర్లు చెప్పడమెందుకు వూరుకోండి. తక్కినవి చెప్పారు. కొంత బాగా ఉంటే బాగా ఉండవచ్చు. ఇందులో శ్రీ గిడుగు రామమూర్తిగారి పేరు కూడా ఎత్తారు. ఓ అయ్యా! రామమూర్తి పంతులుగారు వ్రాసిన వ్రాతలు కూడా చదివారా యేమి మీరు? అందుకనేనా “చేతురు, కోతురు,” తప్పన్నారట! గడచిన నలుబది యేండ్లుగా ఆంధ్ర భాషా పత్రికలలో జరిగేటటువంటి శబ్ద స్వరూపముల యొక్కయు, అర్థముల యొక్కయు విచారణ లక్షణము మీకు తెలియదని, మీరు చూపించిన దోషాలు మా మిత్రులు చెప్పగా విని నే ననుకొన్నాను. రెండే పద్ధతులు. మీకివన్నీ తప్పులు కావని తెలిస్తేనే వ్రాయాలి. అలా వ్రాస్తే మీకు ధర్మచింతలేదు. పాపభీతి లేదు. తెలియకుండా వ్రాస్తే దాని పేరు పాండిత్యం లేక పోవడం. అదట్లా ఉంచి, మీ ఇష్టం వచ్చిన పండితుల్ని నలుగుర్ని పిలవండి. వారు ప్రసిద్ధులైన పండితులు కావలె సుమండీ. “చీద్గగన ప్రాలేయాంశువున్” తప్పనే పండితులు కాకూడదు. అటువంటి పండితులను మీరు తీసుకవస్తే నేను సభకు రాను. ఇప్పటికివలెనే అప్పుడు కూడా దూరం నుంచే నమస్కారం చేస్తాను. నేను పండితుల్ని తీసుకరాను. పుస్తకాల్ని తీసుక వస్తాను. మీరు తప్పన్నవాటికి ప్రయోగాలు చూపిస్తాను. “భూమిపుండు” ఇందులో అశ్లీలమని వ్రాసినారట. మీరు నలుబది యేండ్లనుండి జరుగుతున్న పత్రికలలోని సారస్వత విమర్శలు చక్కగా అనుసరించామన్నట్లు వ్రాశారే. శ్రీ తిరుపతి వేంకట కవులలో ఇలాంటి అశ్లీలాలున్నవని వారి ప్రతి పక్షులు వ్రాయడం వారు సమాధానాలు వ్రాయడం చదివేవుంటారుకదా? ఇలాంటి అశ్లీలం వ్రాయనివాడుంటాడా? అంతదాకా ఎందుకు? తమరు కూడా ఏదో పుస్తకాలు వ్రాశారని వినికిడి, మీరు ఏవి దోషాలన్నారో అవి మీ గ్రంథాల్లోనే చూపించవచ్చు. మీ సవాలు అట్లా వుంచి ఇది నా సవాలు. ఆ సభ పెట్టించండి. మీ పటం పెట్టి మీ నెత్తినే పొడుచుకున్నట్లవుతుంది. నాకేమీ అభ్యంతరం లేదు.

నేనొక మాట వ్రాస్తున్నాను. వ్రాయబోయేమాటకు నేకు సభకు రానని మాత్రం అర్థం చేసుకోకండి. ఆ సభలో కొంచెం పోలీసు బందోబస్తుతో రావాల్సిన అవసరం నాకు లేకుండా చేయండి. ఇంతదూరం వచ్చింది కనుక మీరు వ్రాసిన వ్యాసాలు తీరికలేక పోయినా, చదువుతాను. మీరు చూపించిన తప్పులు తప్పులు కావని సప్రమాణంగా నిరూపిస్తాను. కాని నా పుస్తకంలో కొన్ని పొరపాట్లు ఉండవచ్చు. వాటిని నేనంగీకరిస్తాను. “రాఘవేశ్వరు గృహముల్” యతి భంగమున్నదని మీరు చూపించారట. నిజమే ఉన్నది. రతీదేవి తప్పన్నారట. అది తప్పనడంలో కూడ కొంత న్యాయమున్నది. బాగా పరిశీలించలేనివాడికి తప్పనిపించవచ్చు. కాని వాచస్పత్యంలో ఈకారాంత స్త్రీలింగం కూడా ఉదహరించబడింది. అయినా ఇవన్నీ సభలో చెప్పవలసిన సమాధానాలు కదా! ఈ రెండైనా ఇప్పుడెందుకు వ్రాస్తున్నానంటే ఆ సభ పెట్టేదీలేదు. జరిగేదీ లేదు. మీరు పిలిచేదీలేదు. వారు వచ్చేదీలేదు. బ్రహ్మశ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారు తమ ప్రత్యర్థులకు ఇటువంటి సవాళ్లు నాలుగైదుసార్లు చేశారు. ఇప్పుడు వారి స్థానంలో నేనున్నాను. వారి ప్రత్యర్థుల స్థానంలో మీరున్నారు. ప్రత్యర్థి స్థానీయులైన తమరు ఈ సవాలు చేయడం క్రొత్త తప్ప వేరే క్రొత్త లేదు. అసలు మీ ఇంటి పేరే క్రొత్తాయె. ఇంతకూ మీ బలమేమంటే ప్రజాస్వామ్యం కావడం. ఇంకా ఉన్నవనుకోండి కొన్ని, అలా ఉంచండి. ముఖ్యంగా ఇంకొకటి కూడా చెప్పాలి. మన దేశంలో చాలామంది పత్రికాధిపతులకు విశ్వనాథ సత్యనారాయణమీద విమర్శ ఏదైనా సరే అచ్చు వేద్దామన్న ఉత్సాహమో, ఉబలాటమో, మాత్సర్యమో లాభచింతో ఉండడం. విశ్వనాథ సత్యనారాయణను ఎవడైనా మెచ్చుకుంటే, దాని పేరు చెక్క భజనలట. తిడితే వారికి బాగుంటుంది. పోనీయండి నష్టమేమి? శ్రీ చౌదరిగారూ! శ్రీ శ్రీ అన్నట్లుగా నా కవిత్వము పాషాణపాకమనీ నేను కూడా అనుకున్నానేమోకాని, వందలాది సభల్లో నేను చదివితే ఆనందించేవాళ్ళని చూచి నేను అనుకోలేకుండా ఉన్నాను. మీరు వ్రాసిన కొన్ని దోషాలనుకున్నా, ఇదే బాధ వచ్చింది. కొంతమంది పండితులు విన్నారు. మా యింటికి వచ్చి విన్నారు. కొందరి ఇండ్లకు వెళ్లి వినిపించాను. సభలలో శ్రద్ధగా కూర్చుని విన్నారు. వారు తప్పనలేదు. అందుచేత తప్పులు కావని ఒక అభిప్రాయం నాకేర్పడ్డదేమో!

ఈ గోలంతా ఎందుకు? “చీద్గగన ప్రాలేయాంశువున్” లో నకారం గురువవుతుంది. ఇది తప్పేను అది! నేను నలుగురి పేర్లు చెబుతాను. ఆ నలుగురిచేత దస్కతులు చేయించి వారి ఉత్తరాలు “భారతి’ పత్రికాధిపతి చేతిలో పెట్టి అని ప్రకటించవలసినదని ప్రార్థన. శ్రీ తుమ్మల సీతారామమూర్తిచౌదరిగారు, శ్రీ వేటూరి శివరామశాస్త్రిగారు, శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు ఈ పాయాలో ఉన్న మీ ఇష్టం వచ్చిన మరో పండితుడు. ఈపని మీరు చేస్తే అయినా సరే, కాకపోయినా సరే మీరు చూపించినవన్నీ తప్పనుకుంటాను. ఇంకొక్కటే మనవి. మీరు వ్రాసిన వ్యాసాలకు తిరిగి సమాధానాలు వ్రాస్తే మీ విమర్శలు ప్రకటించే పత్రికాధిపతులతో మా సమాధానాలు ప్రకటించేదిగా సిఫార్సు చేసి పెట్టండి. మీరు దీనికి కూడా యథేచ్ఛగా మళ్లీ వ్రాస్తే “నమోవాకం వ్రశాన్మహే” “మాటకి మాట తెగలు, నీటికి నాచు తెగులు” మీరు ప్రధానంగా చేయవలసింది. “చిద్గగనాంతమందు” గురువుని చూపించడం. మీరు ధర్మచింత, పాపభీతి కలవారు కనుక గురు దర్ళనం మీకు తప్పకుండా జరుగుతుంది. లఘుదర్శనం కలుగుతుందా? అబ్బే! ఇలాంటి వ్యాసాలు మీరు వ్రాసినా, నేను వ్రాసినా ఇట్లాగే ఉంటవి. మీరు ఆ పండితుల ఉత్తరాలు ప్రకటించిన తరువాత మీరు దోషాలన్నవాటికి మాత్రమే సమాధానాలు వ్రాస్తాను. ఇంక ఒక అక్షరం వ్రాయను.

అందుచేత ఇప్పుడింకొక మాట కూడా చెబుతున్నాను. నా రామాయణం నిలువదేమోనన్న భయం మీకెందుకు? నిలువదు. ఏం నిలువకపోతే? మీరు కవుల జీవితాలు చదివే వుంటారు. ఒక్కొక్కరు పాతిక గ్రంథాలు వ్రాస్తే వాడిని రెండు మూడు గ్రంథాలే నిలువడం చదువుతూనే ఉన్నాంగా, రామాయణం నిలువకపోతుందనుకోండి. వేయి పడగలు నిలుస్తుంది. అది మత గ్రంథం కదూ! ఆ మతానుయాయులతో నిలుస్తుంది. తమవంటి వారి విమర్శలవలె మతానుయాయులతో నిలువవచ్చు.

ఒకటే చివరి మాట. వ్రాసిందే చివరకు గట్టిగా చెబుతున్నాను. ఆక్షేపణలు, ఎత్తిపొడుపులు, గడుసుతనం మాటలు మీరు వ్రాయవద్దు. నేనూ వ్రాయవద్దు. మీరు వ్రాసినా మళ్లీ నేను వ్రాయనని మనవి చేస్తున్నాను. ఆ నలుగురు పండితులచేత పూర్వ నకారగురత్వం నిరూపించండి. అప్పుడే వ్రాస్తా. లేకపోతే ఇన్ని నెలలుకాదు సంవత్సరాలైనా వూరుకుంటా.