మీ కోడింగ్ లో తరచూ తప్పులు వస్తున్నాయని మీ ప్రాజెక్ట్ మేనేజర్ అంటున్నారా? మనం రోజూ చేసే ప్రొగ్రాంస్ లో బగ్స్ ఎందుకు వస్తాయి? ఈ కోడింగ్ సమస్యలకు కారకులెవరు? వీటినుంచి ఎలా తప్పించుకోవటం? బృంద సభ్యులంతా కలిసి చేసిన ప్రాజెక్ట్ లో బగ్స్ వస్తే దానికి బాధ్యులెవరు?
బగ్స్ లెకుండా ప్రోగ్రాం వ్రాయటం బ్రహ్మ తరమా? భావాల bytes ని అక్షరాల్లోకి మార్చే ప్రోగ్రాం ఎవరు కనిపెట్టారో తెలుసా? సమాధానాలకై దిగువ లంకె లో చూడండి.
హేండ్ బాగ్స్ లో కొత్త ఫాషన్ల గురించి కాదు ఈ వ్యాసం. ఈ చే సంచులు మన ఆరొగ్యం పై ఎలాంటి ప్రభావం కలుగచేస్తాయో తెలిపేదే ఈ వ్యాసం. వ్యాసం చదివాక బాబోయ్ చేతి సంచులు అనిపించక మానదు. అంతర్జాలంలో తిరుగాడుతూ ఉందీ వ్యాసం. మూల రచయిత పేరు తెలియదు.
Have you ever noticed gals who sit their handbags on public toilet floors, then go directly to their dining tables and set it on the table? Happens a lot! It's not always the 'restaurant food' that causes stomach distress. Sometimes 'what you don't know will hurt you'!
Read on...
Mom got so upset when guests came in the door and plopped their handbags down on the counter where she was cooking or setting up food. She always said that handbags are really dirty, because of where they have been. It's something just about every woman carries with them. While we may know what's inside our handbags, do you have any idea what's on the outside? Women carry handbags everywhere; from the office to public toilets to the floor of the car. Most women won't be caught without their handbags, but did you ever stop to think about where your handbag goes during the day.
'I drive a school bus, so my handbag has been on the floor of the bus a lot,' says one woman. 'On the floor of my car, and in toilets.' 'I put my handbag in grocery shopping carts and on the floor of the toilet,' says another woman 'and of course in my home which should be clean.'
We decided to find out if handbags harbor a lot of bacteria. We learned how to test them at Nelson Laboratories in Salt Lake , and then we set out to test the average woman's handbag.
Most women told us they didn't stop to think about what was on the bottom of their handbag. Most said at home they usually set their handbags on top of kitchen tables and counters where food is prepared.
Most of the ladies we talked to told us they wouldn't be surprised if their handbags were at least a little bit dirty. It turns out handbags are so surprisingly dirty, even the microbiologist who tested them was shocked. Microbiologist Amy Karen of Nelson Labs says nearly all of the handbags tested were not only high in bacteria, but high in harmful kinds of bacteria. Pseudomonas can cause eye infections, staphylococcus aurous can cause serious skin infections, and salmonella and e-coli found on the handbags could make people very sick.
In one sampling, four of five handbags tested positive for salmonella, and that's not the worst of it 'There is fecal contamination on the handbags' says Amy. Leather or vinyl handbags tended to be cleaner than cloth handbags, and lifestyle seemed to play a role. People with kids tended to have dirtier handbags than those without, with one exception.
The handbag of one single woman who frequented nightclubs had one of the worst contaminations of all. 'Some type of feces, or possibly vomit' says Amy.
So the moral of this story is that your handbag won't kill you, but it does have the potential to make you very sick if you keep it on places where you eat.
Use hooks to hang your handbag at home and in toilets, and don't put it on your desk, a restaurant table, or on your kitchen counter top.
Experts say you should think of your handbag the same way you would a pair of shoes. 'If you think about putting a pair of shoes onto your countertops, that's the same thing you're doing when you put your handbag on the countertop' Your handbag has gone where individuals before you have sneezed, coughed, spat, urinated, emptied bowels, etc.
Do you really want to bring that home with you? The microbiologists at Nelson also said cleaning a handbag will help. Wash cloth handbags and use leather cleaner to clean the bottom of leather handbags.
THIS IS WORTH SHARING!!! AND MEN PLEASE PASS THIS ON TO YOUR WIVES, GIRLFRIENDS AND DAUGHTERS.
Left to Right: M/S Suri Babu (Creative Links Publications), V A K Ranga Rao, Ravi Kondala Rao, Prof Modali Nagabhushana Sarma, J.Madhusudhana Sarma and Dr. V.V.Rama Rao
ప్రొఫెసర్ మొదలి నాగభూషణ శర్మ రచించిన "తొలినాటి గ్రామఫోన్ గాయకులు" పుస్తకావిష్కరణ మార్చ్ 20, శనివారం , 2010 న హైదరాబాదు నగర కేంద్ర గ్రంధాలయం లో ప్రఖ్యాత సినీగీత విశ్లేషకుడు, విమర్శకుడు, గ్రామఫోన్ రికార్డుల సంగ్రాహకుడైన విఏకె రంగారావు చేశారు. సభకు అధ్యక్షత వహించిన నటుడు, విజయ చిత్రసంపాదకులు, రచయిత ఐన రావి కొండల రావు మాట్లాడుతూ "ఆనాటి వారి సంగీతం, ఈ నవతరానికి పరిచయం చేస్తున్న ఈ సభ అపూర్వమైనది. మా బాల్యంలో గ్రామఫోన్ మాకు కొత్త. మా స్కూల్ కు వెళ్ళే దారిలో, ఒకాయన గ్రామఫోన్ గొట్టం లో లవకుశ పాటలు వింటుంటే, అవి మాకు అబ్బురంగా తోచి, ఆసక్తిగా వినే వాళ్లం. 78 r.p.m. రికార్డులు తో మొదలయి, 45 , 33 1/3 r.p.m. ఆ పై CD లు గా అవి సాంకేతికంగా అభివృద్ధి చెందాయి. 1957 -58 ల లో సినీ ప్రభ లో రికార్డ్ రివ్యూ రంగారావు వ్రాసేవారు. పత్రిక చేతికి రాగానే ముందుగా రంగారావు సమీక్ష చదివేవాడిని. వీరి వద్ద పెద్ద రికార్డుల భాండాగారం ఉంది. ఈ సభకు విచ్చేసిన జె. మధు సూధన శర్మ మరో రికార్డ్ సంగ్రాహకులు. వీరు 50 సవత్సరాల నుంచి రికార్డుల సేకరణలోను, వాటిని భద్రపరచడంలోను, కేటలాగు చేయటంలోనూ నిమగ్నమై ఉన్నారు. పాత పాటలను digitize చేసి శ్రావ్యంగా వినిపిస్తారు. మనతోనే ఉన్న రమేష్ మరో రికార్డ్ సంగ్రాహకులు. ఆ కాలం సంగీతం గురించిన సభను ఏర్పాటు చేసిన ఈ కాలం క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ సూరి బాబు కు నా అభినందనలు." అన్నారు.
Left to right: J.Madhusudhana Sarma and Prof Modali Nagabhushana Sarma
తరువాత పుస్తక రచయిత ఆచార్య మొదలి నాగభూషణ శర్మ మాట్లాడుతూ తెలుగు సినిమా పై శ్రద్ధ, ఆసక్తి గల ప్రచురణ కర్త సూరి బాబు తో తమకు గల అనుబంధం గుర్తు తెచ్చుకొన్నారు." నాటకరంగంపై నాకున్న ఆసక్తి వలన పెక్కు నాటకాల రికార్డులు సేకరించాను. 1880 - 1940 మధ్య కాలంలో సుమారు 50 నాటక సమాజాలుండేవి.ధార్వాడ సమాజం వారు రాజమండ్రి వచ్చి నాటకాలాడేవారు.క్షత్రియ పార్వతీ బాయి శకుంతల పాత్ర నటించేది. ఈమె గురించిన పెక్కు ఆసక్తికరమైన సంగతులున్నాయి. 100 నాటక సమాజాల గురించి వ్రాయటానికి 8 సంవత్సరాలుగా కృషి చేస్తున్నాను. అప్పటి నాటక సమాజాల గురించిన లిఖిత చరిత్ర లేకపోవటంతో విషయ సేకరణ కష్టమైన పనవుతోంది. ఈ రోజు ఆవిష్కరణవుతున్న పుస్తకంలో ఆ నాటి 20 మంది గాయకుల జీవన చిత్రణలున్నాయి" అన్నారు.
V A K Ranga Rao
తరువాత ప్రఖ్యాత సినీగీత విశ్లేషకుడు విఏకె రంగారావు తనదైన ఫక్కీలో శ్రోతలకు హుషారు కలిగించేలా మాట్లాడుతూ సంగీత ప్రపంచానికి సంబంధించిన తమ మనోగతాన్ని అవిష్కరించారు." శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి సాష్టాంగ నమస్కారాలు.నేను చాలా గొప్ప వాడిని. చప్పట్లు కొట్టండి. ఇతరుల గొప్పదనం గుర్తించి, నేను గొప్పవాడిని అయ్యాను. నన్ను సరాగమాల వాడిగా ప్రజలు గుర్తించారు. 48 భాషలు , వాటిలో 15 విదేశి భాషల పరిచయం ఇంకా 400 గొంతులను గుర్తు పట్టగలను. నాలా ఎవరైనా ఉన్నారా?
చితల్కర్ రామచంద్ర, సలీల్ చౌదరి ఇంకా నాగయ్య ప్రభృతులు నా అభిమాన సంగీత దర్శకులు. ఈ పుస్తకంలో ఇచ్చిన CD లోని అన్ని పాటలూ నా వద్ద ఉన్నాయి. యోగి వేమన వదినగా క్షత్రియ పార్వతీ బాయి నటించారు. వేమూరి గగ్గయ్య గారిని సినిమాలో చూశాను కాని రంగస్థలం పై చూడలేదు. అప్పటి నాటక కళాకారిణి క్షత్రియ వెంకటరమణమ్మకు మిత్రులతో విశాఖపట్నంలో సన్మానం చేయించాను. S.S.L.C పాసయ్యాను. ఇంటర్ తప్పాను. అయినా గ్రామఫోన్ రికార్డ్ లు వింటూ, వాటి గురించి తెలుసుకొంటూ ఎంతో జ్ఞాన సంపన్నుడ్నయ్యాను. రామదాసు కీర్తనను, త్యాగరాజు కీర్తనవలె ఎం.ఎస్.సుబ్బలక్ష్మి పాడారు. మేము చిక్కవరం జమీందారులం. మా అమ్మ గారు సరస్వతి దేవి తేలప్రోలు రాజాగారి మూడవ కూతురు.బాల్యం నుంచీ సానివారు పాడే పాటలంటే నాకు ఇష్టం. మా బొబ్బిలిలో వినోదానికి ఏవీ ఉండేవి కావు. నేను, నా ఇద్దరక్కలు గ్రామఫోన్ లో హిందీ, తెలుగు, తమిళ్ పాటలు రోజంతా తరచుగా వింటూ ఉండేవాళ్లం. మా చిన్న తనాన గడ్డిభుక్త సీతారాం (స్వస్థలం మాడుగుల) బాల్యంలోనే వచ్చి,వేణుగోపాలస్వామి ఆలయంలో సానిగాను, బొబ్బిలి రాజావారి ఆస్థానంలో రాజనర్తకిగాను ఉండేవారు.ఆవిడ దాదాపు ప్రతిరోజు ఉదయం పూట రాణీవారి వద్దకు వచ్చి సైరంధ్రీ (మహాభారతం - విరాటపర్వం లోని ద్రౌపది) చేసే పనులు చేసేవారు.మా అమ్మగారి పొడుగాటి జుట్టుకు నూనె పెట్టడానికి, తల స్నానం చేయించటానికి, ఆరబెట్టిన కురులకు సాంబ్రాణీ వేయటానికి కావలసిన మరో మనిషి సాయంలో ఈ సీతారం ఉండేవారు. ఇవి కాక రాణీ గారిని చూడటానికి వచ్చేవారికి కావల్సిన అతిధి మర్యాదలు చేసేవారు. ఆవిడ మా పిల్లలందరినీ దగ్గర కూర్చో పెట్టుకుని ' చేతిలో వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, కస్తూరి తిలకం ' లాంటి పాటలు నేర్పేది. పండగలప్పుడు దేవుణ్ణి ఊరేగింపు తీసుకెళ్లేవారు. ఆ వూరేగింపులో దేవదాసీలు నాట్యం చేసే వారు. ఆవిడ సానివాళ్లు చేసే నాట్యమే కాకుండా మద్రాసు వెళ్లి బెంగళూరు నాగరత్నం వద్ద తంజావూరు నాట్యం నేర్చుకుంది. తిరువీధిలో ఆడిన పాటలు సీతారాం ను పాడమని కోరేవాడిని.నృత్యం లో నా మొదటి గురువు ఆవిడే.
నేను నా సంగీత, నృత్యాలు సానివారి వద్దే నేర్చుకొన్నాను.(నేపధ్యం: ఆ కాలంలో సాంప్రదాయ కళలైన సంగీతం, నృత్యం దేవదాసీలే కాని గృహిణులు, పెళ్లి కాని వారు నేర్చుకునే వారు కాదు. ఇలా నృత్యాలు చేయటం, పాటలు పాడటం, నాటకాలలో పాత్రలు వేయటం అమర్యాదగా భావించే వారు. గౌరవనీయ కుటుంబాలలోని స్త్రీలు వీటి జోలికి పోయే వారు కాదు. నాటకాలలో స్త్రీ పాత్రలను మొగవారే స్త్రీ వేష ధారణలో పోషించే వారు. స్థానం నరసింహా రావు, పారుపల్లి సత్యనారాయణ, ఉప్పలూరి సంజీవరావు ప్రభృతులు స్త్రీ పాత్రలలో ప్రఖ్యాతి చెందారు. రుక్మిణీ దేవి అరండేల్ ఈ లలిత కళలను నేర్చుకొని, వాటిని నేర్పటానికి మద్రాస్ లో కళాక్షేత్ర స్థాపించి ఈ కళలకు గౌరవనీయ కుటుంబాలలో స్థానం కల్పించారు -cbrao). నృత్యం లో నా రెండవ గురువు కళావర్ రింగ్. (నేపధ్యం:అసలు పేరు సరిదె లక్ష్మీ నరసమ్మ. వీరు విజయనగరం లో దేవదాసీగా ఉంటూ మేజువాణి నృత్యాలు చేస్తూ, బీద విద్యార్థులకు సహాయపడేవారు. ఈమె సహాయం అందుకున్నవారిలో ప్రఖ్యాత గాయకుడు ఘంటశాల కూడా ఉన్నారు. ఆవిడ చిన్న పిల్లగా వుండేటపుడు విజయనగరంలో వుండే ఒక వైశ్య శిఖామణి, శృంగార పురుషుని చేతికి కళావర్ మార్కు రింగు వుండేది. ' నా కది కావాలి ' అని మారాం చేస్తే ఆ సంగతి ఆ వైశ్య శిఖామణి తెలుసుకొని ఆవిడను చేరదీశాడు. ఈవిడకు అప్పటినుండి ' కళావర్ రింగ్ ' అని పేరొచ్చింది. ఈవిడ డబ్బు, పేరు, ప్రతిష్ట సంపాదించింది ఆ పేరుతోనే. ' సరిదె లక్ష్మీ నరసమ్మ ' అంటే ఎవరికీ తెలియదు.మొదట మేజువాణీలలో చేసేది.తర్వాత రంగస్థలం పై కార్యక్రమాలిచ్చేది. ఈమె నాట్యకత్తే కాకుండా, హరికధలు కూడా చెప్పే వారు.ఆమె వ్రాసుకున్న పాటే 'రాతిరి నాటక మయినది మొదలుగా రాదు కదా నిదుర ' అన్నది. ఈమె పాడిన ఎనిమిది పాటలు 4 రికార్డులు గా వెలువడ్డాయి. వి.ఏ.కె రంగారావు గారి పుస్తకం ఆలాపనలో ఈమె గురించిన సమాచారం ఉంది. -cbrao). కళావర్ రింగ్ వద్దకు నన్ను ఉమ్మి రామకృష్ణయ్య తీసుకెళ్లి పరిచయం చేశారు.
నాగయ్య గారి త్యాగయ్య లో తమిళ కర్ణాటిక గాయకులను చొప్పల్లి సూర్యనారాయణ వ్యంగంగా అనుకరించి పాడారు. అప్పట్లో 100 రూపాయాలిచ్చారు దానికి. ఆది తాళం సులువైనది.త్యాగరాజు కీర్తనలు దేశాది, మధ్యాది తాళాలలో ఉన్నాయి. అలరులు గురియగ నాడెనదే, అలకల గులుకుల నలమేలుమంగ - కీర్తనను దేశాదిలో పాడాలి. గ్రామఫోన్ రికార్డులు వినటం వలన సంగీతం పై ఆసక్తి, జ్ఞానం కలిగాయి. మహాత్మా గాంధి కి ఇష్టమైన
वैष्णव जन तो तेने किहये, जे पीड परायी जाणे रे पर दुख्खे उपकार करे तोये, मन अिभमान ना आणे रे सकळ लोक मान सहुने वंदे, िनंदा न करे केनी रे वाच काछ मन िनश्चळ राखे, धन धन जननी तेनी रे
వైష్ణవ జనతో తేనె కిహయె, జె పీడ్ పరాయీ జాణె రె ఏ భాషలో ఉందా తెలుసా? నరసింహ్ మెహ్త ఈ ప్రార్థనా గీతాన్ని గుజరాతీ లో వ్రాశారు.
Tino Rossi పాడిన Santa Lucia - 78 rpm అనే పాట నా బాల్యంలో విన్నాను. ఇటలీ దక్షిణ భాగాన ఉండే నాప్పొలి (Naples) ప్రాంతం వారు మాట్లాడే నియోపొలిటన్ భాషలో ఈ పాట ఉంది. ప్రేమ గీతాలకు 500 సంవత్సరాల వయసు కల ఈ భాషను వాడుతున్నారు.
ఈ పుస్తకం తో ఇచ్చిన CD లో ఉన్న "మీరజాల గలడా నా యానతి" వ్రాసినది స్థానం నరసింహారావు. వారే రంగస్థలం పై ఈ పాటను అభినయించే వారు. తెనాలి లోని రామవిలాస సభ లో ఉంటూ నాటకాలాడేవారు. యమ సావిత్రీ సంవాదం, కృష్ణలీలలు వగైరా నాటకాల రికార్డులు సుమారు 60 నా సేకరణలో ఉన్నాయి. నా వద్ద ఉన్న రికార్డ్ లు అన్నీ ప్రచురించాలంటే కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ద్వందార్ధాలతో కూడిన మాటలతో తొలినాళ్లలో రికార్డ్ లు వచ్చేవి. పట్టునో,పట్టదో,పెట్టి చూడలనే లాంటి రెండర్ధాల మాటలతో K.V. రమణమ్మ ప్రభృతుల రికార్డు లు వచ్చేవి. గ్రామఫోన్ కంపనీ వారు అడిగి ఇలాంటి సంభాషణలు వ్రాయించుకునేవారు. ముంబాయి చిత్రం లో ఎ.ఆర్.రెహ్మాన్ అరేబియ సంగీతం తొలిసారి ఉపయోగించాడన్న కొందరు విమర్శకుల అభిప్రాయం సరికాదన్నారు. బాలాంత్రపు రజనీకాంత రావు సంగీత దర్శకత్వంలో, గృహప్రవేశం చిత్రం లో భానుమతి పాడిన కనవొహో కనవొహో అనే పాటలో తొలిసారిగా అరబిక్ సంగీతం వాడటంజరిగింది. అలాగే తెలుగు సంగీతంలో పాశ్చాత్య పోకడలు పోయినది ఎస్. రాజేశ్వర రావు అని, ఇల్లాలు చిత్రంలో ఎస్.వరలక్ష్మి పాడిన " కోయిలొకసారి వచ్చి " (ఈ లింక్ పని చేయనియెడల http://www.oldtelugusongs.com లో ఈ పాట కోసమై అన్వేషించగలరు) పాటలో ఈ విషయం గమనించవచ్చు" అంటూ తమ ప్రసంగాన్ని ముగించారు.
ప్రసంగం తర్వాత, విశిష్ట అతిధులను దుశ్శాలువాలతో సన్మానించారు. ఆ తదుపరి గ్రాంఫోన్ రికార్డు లు తయారు చేసే విధానం, తొలినాటి గాయకుల పాటల పై ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. భారత గ్రామఫోన్ రికార్డు ల మొదటి 100 సంవత్సరాల లో ఎన్నో విశేషాలు చోటుచేసుకున్నాయి. వాటి వివరాలకై ఇక్కడ చూడండి. భారతదేశం లో తొలి గ్రామఫోన్ రికార్డ్ 1906 లో విడుదలయ్యింది. ఆ పాట వినండి ఈ కింది వీడియోలో.
సభ అనంతరం రంగారావుగారు తొలినాటి గ్రామఫోన్ గాయకులు పుస్తక ప్రతులపై , పాఠకుల అభ్యర్ధన మేరకు తమ సంతకాలు (ఆటొగ్రాఫ్) చేసి ఇచ్చారు. వారి ప్రశ్నలకు బదులిచ్చారు.
కార్యక్రమ నిర్వహణలో లాహిరి లాహిరి లాహిరిలో, జీవితమే సఫలము పుస్తకాల రచయిత డా|| వి.వి.రామారావు తమ సహకారాన్నందించారు.
ఇంతకీ ఈ తొలినాటి గ్రాంఫోన్ సంగీతం లో ఏముంది?
ఈ పుస్తకం లో కపిలవాయి రామనాధ శాస్త్రి, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, వేమూరు గగ్గయ్య, పసుపులేటి కన్నాంబ, చిత్తూరు నాగయ్య, స్థానం నరసింహా రావు,ఎస్.రాజేశ్వరరావు, టంగుటూరు సూర్యకుమారి ప్రభృతుల జీవన చిత్రణలు, వారు పాడిన పాటలు CD లోనూ ఉన్నాయి. ఇందులో ఘంటశాల మాస్టారుకు సహాయంచేసిన విజయనగరం గాయకి, నర్తకి ఐన కళావర్ రింగ్ పరిచయం లేక పోవటం వెలితిగా తోస్తుంది. ఐతే చేసిన పరిచయాలు తృప్తికరంగా ఉన్నాయి. CD లో తొలినాటి గాయకుల ప్రసిద్ధ గీతాలకు బదులుగా, అంతగా ప్రశస్తం పొందని గీతాలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు రికార్డ్ స్థాయిలో అమ్ముడు పోయిన "సర్వేశ్వరుండయిన" అనే కపిలవాయి రామనాధ శాస్త్రి పాట CD లో లేదు. మలిముద్రణలో ఈ లోపాలు సరిదిద్దగలరని ఆశిద్దాము. ఆనాటి రంగస్థల కళాకారుల గురించి, ఈనాటి యువతరం తెలుసు కోవటానికి, అప్పటి గ్రామఫోన్ రికార్డ్ లు పై ఆసక్తి పెంచటానికి ఈ పుస్తకం దోహదపడకలదు.
కుప్పించి ఎగసిన కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగంబెల్ల కప్పికొనగ ఉరికిన నోర్వక ఉదరంబునందున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేబట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము దిగువ నమ్మితి నా లావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ
కరికి లంఘించు హరిణంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువుమర్జునా యనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుడే దిక్కు నాకు
కృతజ్ఞతలు: ఈ పుస్తకావిష్కరణ గురించిన సమాచారమిచ్చిన మిత్రులు పరుచూరి శ్రీనివాస్, ఈ వ్యాస రచనకు తోడ్పడిన వి.ఏ.కె రంగారావు పుస్తకం 'ఆలాపన' ఇచ్చిన కొలిచాల సురేష్ ల కు నెనర్లు.
సెటిలర్లతో దోస్తీ గాఢంగా జెయ్యాలే, సహజీవన యాత్రలు చెయ్యాలె, గట్లనే మర్శిపోకుండా ఇటు తెలంగాణ ధూం ధాం గూడ జెయ్యాలె, మన పోరగాళ్ళు ఎవరైన చస్తే వెంటనే ఎక్స్ గ్రేషియా పెంచమనాలే, ఇంకా పూలమాల వేసి మీ మరణం వృధా పోదని పాట కూడా బాడాలే, వీలయితే దస్తీతో కన్లను తుడ్సుకోవాలే (రిచుయల్ ఆఫ్ డిసిప్లీన్ ) -Bharath,Consultant
ఎవరైనా ఎక్కువగా, అతిశయంగా మాట్లాడితే వాడి కేమైనా కొమ్ములు మొలిచాయా? అట్లా మాట్లాడుతాడేంటి? అని మనము అనుకోవటము కద్దు. కొమ్ములు మొలవటం అనేది జరగదు అని మనకు తెలుసు కాబట్టి అట్లా అంటుంటాము. కాని మనిషికి నిజంగా కొమ్ములు మొలిస్తే? నమ్మశక్యంగా లేదా? చైనా లోని ఈ వృద్ధురాలికి నిజంగానే కొమ్ము మొలిచందండోయ్. ఆశ్చర్యం! కానీ నిజం. మీరే చూడండి.
ఇంటర్నెట్ ద్వారా తెలుగుభాష వ్యాప్తి, తెలుగు బ్లాగులకు మరింత ప్రాచుర్యం కల్పించడం కోసం విశేషంగా కృషి చేస్తున్న ప్రముఖ సంస్థ e-తెలుగు. కంప్యూటర్లకు తెలుగు నేర్పించడం ఎలా? యూనికోడ్ తెలుగు ఫాంట్‌తో పైసా ఖర్చు లేకుండా మన ఆలోచనలకు ఇంటర్నెట్‌లో అక్షరరూపం ఇవ్వడం ఎలా? వీటిని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? టైపింగ్ లేఅవుట్ ఏమిటి? ఇత్యాది పలు అంశాలకు సంబంధించిన పరిష్కారాలను స్వచ్ఛందంగా అందజేస్తూ ఇంటర్నెట్‌లో తెలుగు వాడకానికి సంబంధించిన సాంకేతిక సహకారాన్నీ, తోడ్పాటును ఉచితంగా ఇస్తుంది e-తెలుగు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం కేంద్రంగా సేవలందిస్తున్న e-తెలుగు సంస్థ కార్యదర్శి పలివెల కృపాల్ కశ్యప్. ఇటీవల భాషా ఇండియా ఆయన్ని కలుసుకున్నప్పుడు సంస్థ పూర్వాపరాలు, కార్యకలాపాల గురించి ఎన్నో వివరాలందించారు.
e-తెలుగు సంస్థ కార్యదర్శి పలివెల కృపాల్ కశ్యప్ తో భాషా ఇండియా పూర్తి భేటీ కై దిగువ గొలుసులో చూడండి.
2010, మార్చి 7, ఆదివారం నాడు కంప్యూటర్ లో తెలుగు వాడకం పై పాత్రికేయులకు ఒక అవగాహనా సదస్సును e- తెలుగు వారు నిర్వహించారు. తొలుత కార్యదర్శి కశ్యప్ e- తెలుగు సంస్థ చరిత్ర, ఆశయాల గురించి చెప్పారు. యునికోడ్ పుట్టుపూర్వోత్తాలు, దాని ఆవశ్యకత, ఉపయోగాలు గురించి సంస్థ అధ్యక్షులు వీవెన్ వివరించారు. తెలుగు వికీపిడియా ఆవిర్భావం, ఎదుగుదల ఇంకా అందులోని విషయాల గురించి e- తెలుగు పూర్వ అధ్యక్షులు శిరీష్ కుమార్ మాట్లాడారు. ఈ సదస్సులో తెలుగు తరంగాలు అనే తెలుగు బ్లాగును, e -తెలుగు కోశాధికారి చక్రవర్తి ఆధ్వర్యంలో, పాత్రికేయుడు M.నాగేందర్ ప్రారంభించారు.
పాత్రికేయులకు సాంకేతిక విషయాలు తెలుసుకోవటంలో ఆసక్తి లేదో లేక సదస్సు జరిగిన దిల్‌షుక్ నగర్ సమావేశ స్థలి పత్రికా కార్యాలయాలకు దూరంగా వుండటం వలనో 12 మంది పాత్రికేయులు మాత్రమే సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సు ముఖ్యొద్దేశమైన కంప్యూటర్స్ లో తెలుగు వాడటానికి కావల్సిన అవగాహన లో Hands on computer session విద్యుచ్ఛక్తి అంతరాయంతో జరుగలేదు. పాత్రికేయుల సందేహాలు తీర్చే ' ప్రశ్నలు జవాబులు ', ఆహ్వాన పత్రికలో ఉన్న మరికొన్ని అంశాలు సమయాభావంతో నిర్వహించబడలేదు. పాత్రికేయులకు, రచయితలకు ఈ స్థాయిలో తలపెట్టిన సమావేశాలలో తొలిదయిన ఈ సమావేశ నిర్వహణలో లోపాలు కనిపించాయి. ఇలాంటి పాఠ్యాంశాలు అన్యూన్యచర్యా పేతంగా (Interactive) గా వుంటే ఎక్కువ ప్రయోజనకరంగా వుండగలవు. అయితే తదుపరి సమావేశాలలో సరైన సమయ పాలనతో ఈ చిక్కులను అధికమించవచ్చు.
ఈ సదస్సు కొన్ని సత్సంకేతాలను ఇచ్చింది. ప్రస్తుత పత్రికా కార్యాలయాలయలలో కంప్యూటర్ల పై నున్న నిర్లిప్తత నుంచి వాటిని క్రియాశీలకంగా వాడటానికి కావలసిన ఉత్సాహాన్ని పాత్రికేయులకు ఇచ్చింది. కంప్యూటర్లో తెలుగు వాడకం పై సందేహాలకు ఎలా చెయ్యలో, ఎవరిని అడగవచ్చో లాంటి ప్రాధమిక అంశాలు వెలుగులో కొచ్చాయి. దీనికి చాలా ప్రాముఖ్యత వుంది . ఎవరైనా ఎదైనా వ్యాసాన్నో, ఆహ్వాన పత్రికనో పత్రికా కార్యాలయానికి e-mail చేస్తే, ఫోన్ చేసి చెప్తే తప్ప ఇ-మైల్ చూసుకొరు. చూసినా, తదుపరి అభ్యర్ధన -బాస్ సందేశం మొత్తం ఫాక్స్ పంపకూడదా అంటూ. ఇలాంటి పరిస్థితులలో పాత్రికేయులకు ఇలాంటి అవగాహనా సదస్సుల అవసరం ఎంతైనా వుంది. పాత తరం పాత్రికేయుల కంప్యూటర్ ఫోబియా ను ఈ సదస్సులు తొలగించగలవు.
మరో ఆశాజనకమైన విషయమేమంటే, ఈ సదస్సు లో పాల్గొన్న పాత్రికేయులలో కొందరు తెలుగు బ్లాగరులున్నారు. వారు
Senior journalist S. Ramu addressing the gathering
సదస్సులో సీనియర్ పాత్రికేయులు ఎస్.రాము పాత్రికేయులనుద్దేశించి మాట్లాడుతూ " విజయవాడలో కొందరు నేరస్తులు పిల్లలను స్వలింగ సంపర్కం చేసి పట్టుబడినప్పుడు కొందరు రిపోర్టర్లు పిల్లల నోటిలో మైక్ పెట్టి వీళ్లు మిమ్ములను ఏమి చేశారో చెప్పండని గుచ్చి గుచ్చడిగినప్పుడు, పాత్రికేయుల నైజం పై రోత కలిగి అట్లాంటి వాటిని ఖండించటానికి నాకు ఒక బ్లాగు కావాలన్న నిర్ణయానికొచ్చా. e తెలుగు సమావేశాలు 2006 మార్చ్ 12న తొలిగా జరిగాయి. పాత్రికేయ ప్రపంచం లో ఈ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. Reporters sans frontiersఅనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మార్చ్ 12 న నిర్వహించే దినాన్ని Cyber world day against cyber censorship గా పరిగణిస్తారు. అయితే ఈ సెన్సార్షిప్ ఎవరో బయటవాళ్లు చేసే అవసరం కల్పించకుండా , ఎవరికివారే బాధ్యతాయుతంగా వార్తలు ప్రసారం చేస్తే పాత్రికేయుల గౌరవం ఇనుమడిస్తుంది. బ్లాగు వ్రాసే అభ్యాసంలో పాత్రికేయుల తెలుగు భాషా పటిమ పెరుగగలదు.ప్రస్తుతం కార్యాలయాలలో బ్లాగులు చూడగలిగినా వ్యాఖ్య వ్రాసే సౌలభ్యం లేని కట్టడులున్నాయి. మీకు అసంతృప్తి కలిగించిన విషయాలే కాకుండా, మీ సృజనాత్మకతను వ్యక్త పరచే రచనలు మీ బ్లాగులలో చెయ్యవచ్చు. మీ రచనలలో నైతిక విలువలు పాటించండి. తెలంగాణా వాదులను తెలబాన్లు గా చిత్రిస్తూ కొత్త ఉద్వేగాలకు తెరతీయవద్దు. మనం ప్రసారం/ప్రచురణ చేసే విషయంలో ఎవరి గురించైతే వ్రాస్తున్నామో , వారి తరఫు వాదం కూడా మన ప్రసారం/ప్రచురణలో ఉండటం అభిలషణీయం." అన్నారు. చివరగా e తెలుగు వారు ఉత్తమ తెలుగు బ్లాగులకు ప్రోత్సాహిక బహుమతులందివ్వాలన్నారు.
కవి జాన్ హైడ్ కనుమూరి సమయాన్ని సద్వినియోగం చెయ్యటానికై, కంప్యూటర్ నేర్చుకునే సమయంలో వారి అనుభవాలు చెప్పారు. తనవంతుగా పెక్కుమంది కవులకు తాను బ్లాగు సృజించానన్నారు.
e - తెలుగు ఆశయసిద్ధిలో ఈ పాత్రికేయుల అవగాహనా సదస్సు మరో ముందడుగు.
నిఖార్సైన క్యూబన్ చుట్టలకు అగ్ని బీమా సాధ్యమా? చుట్టలను బీమా చేసి, ఆ చుట్టలను కాల్చి తాగితే బీమా డబ్బు వస్తుందా? సమాధానం అవును. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ కధ చదవాల్సిందే మీరు.
Charlotte , North Carolina: A lawyer purchased a box of very rare and expensive cigars, then insured them against, among other things, fire.
Within a month, having smoked his entire stockpile of these great cigars and without yet having made even his first premium payment on the policy the lawyer filed a claim against the insurance company. In his claim, the lawyer stated the cigars were lost "in a series of small fires." The insurance company refused to pay, citing the obvious reason, that the man had consumed the cigars in the normal fashion.
The lawyer sued.. and WON! (Stay with me.) Delivering the ruling, the judge agreed with the insurance companythat the claim was frivolous.The judge stated nevertheless, that the lawyer held a policy from the company, which it had warranted that the cigars were insurable and also guaranteed that it would insure them against fire, without defining what is considered to be unacceptable fire" and was obligated to pay the claim.
Rather than endure lengthy and costly appeal process, the insurance company accepted the ruling and paid $15,000 to the lawyer for his loss of the cigars lost in the "fires".
NOW FOR THE BEST PART..
After the lawyer cashed the check, the insurance company had himarrested on 24 counts of ARSON (Arson is the crime of deliberately and maliciously setting fire to structures or wildland areas).With his own insurance claim and testimony from the previous case being used against him, the lawyer was convicted of intentionally burning his insured property and was sentenced to 24 months in jail and a $24,000 fine.
This is a true story and was the First Place winner in the recent Criminal Lawyers Award Contest.
రెండు మతాలు ఆచారాలు, సంస్కృతులు ల లో మునిగితేలుతూ భాయ్ మనుషులం తర్వాతే మతములం ఈ నేలపై సహజీవన పావురాళ్లం అంటూ సాధికారతతో చెప్పగలిగే యాకూబ్ కొత్త కవితల సంకలనం "ఎడతెగని ప్రయాణం " గా వెలువడింది. కవి యాకూబ్ గురించి గుడిపాటి పరిచయం ఇక్కడ.
మానవతే నా మతం అని చెప్పే యాకూబ్ కవితా సంకలనం "ఎడతెగని ప్రయాణం" ఆవిష్కరణ 2 మార్చి, 2010 న హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. సభకు విచ్చేసిన ఆహూతులకు కవయిత్రి, రచయిత్రి శిలాలోచన స్వాగతం చెప్పారు. ప్రఖ్యాత కవి శివారెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. అధ్యక్షులు మాట్లాడుతూ " 'ప్రవహించే జ్ఞాపకం' (1992) నుంచి 'సరిహద్దు రేఖ' ( 2002) ను దాటి సువిశాల జీవనావరణంలోకి ఈ కవితా సంపుటి 'ఎడతెగని ప్రయాణం' తో ప్రవేశించాడు యాకూబ్. వ్యక్తిగా, కవిగా, సృజనశీలిగా యకూబ్ పరిణామం ఈ మూడు పుస్తకాలద్వారా తెలుస్తుంది." అన్నారు.
చిత్రంలో ఎడమ నుండి కుడి వైపు: శ్రీయుతులు కొండపల్లి ఉత్తం కుమార్, శిఖామణి, వరవరరావు, శివారెడ్డి , రమణ (నీలం చొక్క), యాకూబ్(ఎర్ర చొక్కా), వాడ్రేవు చినవీరభద్రుడు మరియు దర్భశయనం శ్రీనివాసాచార్య
ప్రఖ్యాత కవి వరవరరావు "ఎడతెగని ప్రయాణం " పుస్తకాన్ని ఆవిష్కరించి కృతిని, యకూబ్ జీవన యానంలో నేటి స్థితి, ప్రగతి కి తోడ్పడిన కొండపల్లి ఉత్తం కుమార్,అడ్వొకేట్,ఖమ్మం కు అందచేశారు. ఆవిష్కర్త " కవులు తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించాలి. మానవ సంబంధాలు, మానవీయ విలువల గురించి యాకూబ్ తన కవితలలో వివరిస్తారు.యాకూబ్, క్యా ఖూబ్ ! మానవ సంబంధాలు తగ్గుతున్ననేటి సమాజంలో మనిషిని మనిషిగా ప్రేమించాలంటారు. మనిషి ప్రకృతిలో భాగం ఐతే, ప్రకృతిని ఒక వనరు (source) గా చూస్తున్నాము. చివరకు మనుషులను కూడా ఒక వనరు (Human resources) గా చూస్తున్నాము. కుప్పంలో చదివిన సూఫీ కవిత్వ ప్రభావం యాకూబ్ పై ఉంది. " అంటూ యాకూబ్ రాసిన కొన్ని కవితలను చదివి వినిపించారు.
కృతి స్వీకర్త కొండపల్లి ఉత్తం కుమార్ మాట్లాడుతూ " నాకు కవిత్వంలో పెద్ద ప్రవేశం లేదు. అయినా ఈ పుస్తకాన్ని ఇష్టంగా స్వీకరిస్తున్నా. యాకూబ్, వరవరరావు ల లో ఎల్ల వేళలా చెరగని చిరునవ్వు సామ్యంగా కనిపిస్తుంది." అన్నారు.
ప్రముఖ కవి వాడ్రేవు చినవీరభద్రుడు మాట్లాడుతూ " యాకూబ్ నాకు తెలియనప్పుడు ఈ పుస్తకం గురించి ఎక్కువ చెప్పగలనేమో! మా ఇద్దరి సాన్నిహిత్యం ఎక్కువ మాట్లాడకుండా చేస్తుంది.యాకూబ్ కవితలలోని నిజాయితి మనల్ని ఆకట్టుకుంటుంది. John Stuart Mill కవిత్వం అంటే ఏమిటి? అనే విషయం పై అంటారు "Oratory is heard. Poetry is overheard " అని. కవి సమయాలు తమ ఆలోచనలతో కాటేయటానికి సిద్ధమవుతుంటాయి. " అన్నారు. కన్నీరొక చుక్కున్నచో ... అనే కవిత చదివి వినిపించాక, యాకూబ్ ప్రయాణం ఎడతెగకుండా సాగాలని కోరుకుంటూ తమ ఉపన్యాసం ముగించారు.
ప్రముఖ కవి శిఖామణి మాట్లాడుతూ " ముందుగా యాకూబ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రపంచ సాహిత్యం నాలుగు ద్రవాలపై ఆధారపడి వుంది. అవి రక్తం, వీర్యం, స్వేదం ఇంకా బాష్పం (కన్నీరు). అనేక సామాజిక సంఘటనల చిత్రణే ఈ కవితలు. ఇవి కవితలు కావు జీవితం అంటూ కొన్ని కవితలు చదివి వినిపించారు.
పోలికలు
జొన్నచేలు మంచె కింద తలలూపే కంకులు
పురేడు పిట్టలకోసం అల్లిన వలలాంటి అరిసె
చేపల కోసం వాగులో పన్నిన మావు
పదాలకోసం ఊహల్ని పన్ని కవిసమయంతో పొంచివుండే కవి తరువాత ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య యాకూబ్ కవిత హృదయ దయాద్వయాలు లోంచి చిన్న భాగం వినిపించారు. ఒక స్వప్నకాంత విప్పిన రైకలోంచి పాలుతాపిద్దామని ముడివిప్పి అతడిని పిలిచింది
యకూబ్ ఎడతెగని ప్రయాణం అంటే సుమతీ శతకంలోని అప్పిచ్చువాడు, వైద్యుడు, నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ. అన్న పద్యం గుర్తొస్తుంది. ఏమీలేనితనం నుంచి ఆలోచనలోకి వెళ్లడటమే యాకూబ్ ప్రయాణం. నిరంతరం నిప్పుకణికలా జ్వలించే ఆత్మే ఈ కవితాత్మ. ఈ సంకలనం లోని మొదటి 76 కవితలు ఒక ఎత్తైతే 77 వ కవిత వాటికి సరి జోడు. మొదటి 76 కవితల వేదనకూ సమాధానం 77 కవిత విత్తనం కంటున్న కల లో దొరుకుతుంది. కొన్ని కవితల ప్రారంభాలు విషాధంగా ప్రారంభమయి విషాదంగానే ముగుస్తాయి. ఉదాహరణకు పోలవరం అమ్మా అని పిలుచుకునే సొంత ఊరు, ఎందుకిలా జలం మింగేస్తుంది
మరో కవిత ప్రేమప్రసారం లోని చిన్న భాగాన్ని వినిపించారు కలవంటి, శిలవంటి, కాంతివంటి,కరుణవంటి సుడులుతిరిగే ఊహవంటి, ఉరకలెత్తే ఉద్వేగం వంటి ప్రేమే కవిత్వం
కొన్ని కవితలు వ్యక్తం చేసినంత అవ్యక్తం కూడా చేస్తాయి అంటూ ముగించారు.
"అల్లుకున్న కష్టములలో, అమ్మ వోలె ఓదార్చను" పాట పాడిన గోరటి వెంకన్న
ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న " 1982 నుంచీ యాకూబ్ కవిత్వంతో పరిచయం ఉంది. బాల్యం, అమాయకత్వం అన్నీ ఉన్నై యాకూబ్ లో" అంటూ అల్లుకున్న కష్టములలో, అమ్మ వోలె ఓదార్చను పాట పాడి సభికులను ఆకట్టుకున్నారు.
స్వీయ కవితను వినిపిస్తున్న సుజాత పట్వారి
స్వీయ కవితను వినిపిస్తున్న రేణుకా అయోల
తదుపరి సుజాత పట్వారి, రేణుకా అయోల,జాన్ హైడ్ కనుమూరి మరియు రమణ వారి వారి కవితలు చదివి వినిపించారు.
శ్రీమతి లీల (Social welfare department) యాకూబ్ ని సన్మానించారు, శాలువా కప్పి
చివరగా కవి యాకూబ్ మాట్లాడుతూ తను ఇష్టం గా పాల్గొన్న ద్వారకా హోటల్ కవి సమ్మేళాలు, తను చదివిన నగ్నముని, అజంతా, శ్రీశ్రీ కవితల ను గుర్తుచేసుకొన్నారు. " శ్రమ పడటమే మెలుకువ అని మా నాయన చెప్తుండేవారు.సింగరేణి కాలరీస్ వారి కార్యాలయంలో ఒక చిన్న ఉద్యోగంతో నా ఉద్యోగపర్వం ప్రారంభించాను." అంటూ ప్రేమే కవిత్వం, కవిత్వమే ప్రేమ పాట పాడారు. తన స్కూలు, కాలేజ్, యూనివర్సిటీ సహాధ్యాయులను, తన మిత్రులను సభకు పరిచయం చేశారు. వారి సత్కారాల తదుపరి సభికుల కోరికపై శ్రీ శ్రీ కవిత "పతితులార! భ్రష్టులార! బాధాసర్ప దష్టులార !!! ఏడువకండేడువకండి .." ను పాడి సభను ఉత్తేజింప చేశారు. యాకూబ్ కవే కాదు చక్కటి పాటకాడు కూడా.
కవిత్వానికి ఆదరణలేదంటున్న వారు ఈ సభను చూసితీరాలి. హాలు నిండి, సీట్లు లేక కొంతమంది నిల్చున్నారు కూడా. డా||మిత్రా, నటుడు కాకరాల, కవి సుద్దాల అశోక్ తేజ, రచయిత్రులు మృణాళిని, అబ్బూరి ఛాయాదేవి, వోల్గా, కొండేపూడి నిర్మల,జ్వలిత, సి.వి.కృష్ణారావు(నెల నెలా వెన్నెల) ప్రభృతులు సభకు హాజరయినవారిలో వున్నారు. ఏకాంతానికి భిన్నంగా, సమూహపు అనుభవానికి వుండే కాంతిమయ పరిమళం నిండిన యాకూబ్ కవితలకు ఇప్పుడు అంతర్జాలంలో ఒక ఇల్లుంది. http://layasahityam.com/ లక్ష్మి (శిలాలోలిత) లోని ల, యాకూబ్ లోని య కలిపితే లయ. ఈ లయ పేరు పైనే కవి జాన్ హైడ్ కనుమూరి ఒక బ్లాగ్ సృష్టించారు యాకూబ్ అభిమానులకై . http://layapoetry.blogspot.com/ ఈ web site, blog ల లో యాకూబ్ కవితలు, వ్యాసాలు, శిలాలోలిత రచనలు చూడవచ్చు.
మీరు తారే జమీన్ పర్ చిత్రం బహుశా చూసే వుంటారు. అందులో పిల్లవాడు దర్శీల్, మానసిక వైకల్యం ఉండి కూడా, పుస్తక పేజీలలో నిశ్చలంగా ఉన్న బొమ్మలను, చలనచిత్రాలు గా మార్చిన వైనానికి ప్రజలు జేజేలు కొట్టారు. ఇప్పుడు మార్టిన్ ఫ్రాస్ట్ పుస్తకం తెరవకుండానే చూడగలిగే పుస్తకంలోని తన ఫోర్ ఎడ్జ్ చిత్రాలు ఆవిష్కరిస్తున్నారు. పుస్తకం పేజీలు ఉండే కోణాన్ని బట్టి, మనం చూసే కోణం పైనా ఆధార పడి బహు చిత్రాలు ఏక కాలంలో చూడవచ్చు. ఈ పుస్తకం మీ చేతిలో ఉన్నప్పుడు ఎన్నో చిత్ర విచిత్రాలు చూడగలరు. ఎన్ని మాటలు చెప్పినా, ఈ పుస్తకం చూస్తే కలిగే ఆనుభూతే వేరుగా వుంటుంది. ఈ కింది చలనచిత్రం చూడండి.