శనివారం, ఆగస్టు 21, 2010

బ్లాగులు- వ్యాఖ్యలు -6

  ప్రపంచంలో అతి క్రియాశీలకమైన జ్వాలాముఖి Kīlauea (కిలావే అని ఉచ్చరించాలి)   ముందర ఈ వ్యాస రచయిత.  ఇది కిలావే అగ్నిపర్వతపు ఆదిశక్తి ఐన   పేలే (Pele) దేవత నివాసంగా పరిగణింప బడుతుంది.   కిలావే హవాయ్ ద్వీప సముదాయంలోని హవాయ్ (Big Island) ద్వీపంలో ఉంది. కిలావే  అంటే అర్థం ఎగజిమ్ముతున్న అని.

మీ అందరికీ (నా బ్లాగు నుండి) పది రోజులు సెలవులిస్తున్నా!

ఎప్పుడూ బ్లాగులేనా? -భారతదేశంలో ఆనందంగా గడిపి అమెరికా రండి. ఈ పది రోజులు బ్లాగుకు దూరంగా ఉండి, బ్లాగులవలన జీవితంలో ఏమికోల్పోతున్నామో తెలుసుకోండి. అక్కడ మంచి తెలుగు పత్రికలు, పుస్తకాలు, సంగీత కార్యక్రమాలు ఉంటాయి కదా. మధ్య ప్రదేశ్ లోని ఖజురహో దేవాలయాలను దర్శించండి. అవి ఈ రోజుకూ చెక్కు చెదరక తమ శిల్ప సౌందర్యాన్ని కలిగిఉన్నాయి. మీరు నాస్తికులయినా అక్కడి శిల్పకళను ఆనందిస్తారు. దేవాలయాలలో బూతుబొమ్మలెందుకుంచారో తెలుసుకోండి. ఈ సెలవులలో ఖాళీ దొరికితే బ్లాగులు చదవండి కాని వ్యాఖ్యలు రాసి సమయాన్ని వృధా చేయక బంధు మిత్రులందరినీ ఒక చుట్టు చుట్టి రండి. ఈ సెలవులో బ్లాగు వ్రాసే ప్రయత్నం చేయనే వద్దు. భారతదేశాన్ని, మీ ఊరుని కొత్తకోణం లో చూడండి. ఇక్కడకు వచ్చాక వ్రాయటానికి చాలినన్ని అంశాలు దొరకగలవు.

http://sarath-kaalam.blogspot.com/2010/08/blog-post_9959.html


HDR Photography

మూడు ఛాయాచిత్రాలు తీసే సమయంలో సైకిల్ పై ఉన్న ప్రయాణీకుడి స్థాన చలనం కూడా ఛాయాచిత్రంలో నమోదయితే, ఆ మూడింటిని కలిపినప్పుడు మూడు చిత్రాలుగా నమోదయ్యే ప్రమాదం ఎలా నివారించాలి?

http://swagathaalu.blogspot.com/2010/03/hdr-photography.html


అమెరికా అనుభవాలు – 25

మీ అమెరికా అనుభవాలు 25 భాగాలు ఆసక్తికరంగా మొదటి నుంచి తుది దాక ఏకబిగిన చదివించాయి. కధానుసారంగా మీరు ఎంపిక చేసిన బొమ్మలు చాలా ఆకట్టుకున్నాయి. మీరు చెప్పిన ‘ఇంటూ 45’ ఫోబియా ఇక్కడకు (అమెరికా) వచ్చే తల్లి తండ్రులు ల లో ఎక్కువ మంది లో కనిపిస్తుంది. చివరన మీరు ఉదహరించిన అమెరికా జాతీయ జండా -Made in china చదివి నవ్వకుండా ఉండలేకపోయాను. మీ ట్రావెలాగ్ లో Vancouver (Canada) గురించిన విశేషాలుండవచ్చని ఆశించాను.

http://bhandarusrinivasarao.blogspot.com/2010/07/25.html


Haapy world photography day

మంచి కెమరా కొంటే కొన్న వ్యక్తి ఉత్తమ ఛాయాగ్రాహకుడవడు; కెమరా సొంతదారుడవుతాడు. మంచి చిత్రాలు తీయగలిగితే ఉత్తమ ఛాయాగ్రాహకుడవుతాడు. ఖరీదైన కెమరాల లోంచి ఉత్తమ చిత్రాలు రావు. ఉత్తమ ఛాయగ్రహకుడి చేయి పడితేనే ఏ కెమరాలోంచయినా మంచి చిత్రాలు వచ్చేది. SLR కాకుండా మాములు పాయింట్ అండ్ షూట్ కెమరా తో అద్భుత చిత్రాలు తీసినవారు కూడా వున్నారు. కెమరా కాదు కెమరా వెనుక ఉన్న వ్యక్తి ప్రధానం మంచి చిత్రాలు రావటానికి. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు.

http://ekalingam.blogspot.com/2010/08/haapy-world-photography-day.html


పోతీ డాట్ కాంలో నా చిన్న పుస్తకం
పోతీ తో మీ అనుభవాలు వ్రాయ కోరుతాను.
http://satyasodhana.blogspot.com/2009/06/blog-post.html

చచ్చిన చేపని నీళ్లలో వేస్తే మునుగుతు౦దా? తేలుతు౦దా?

ఒక విషయం శరత్ ఇక్కడ స్పష్టం చెయ్యలేదు. తనకి కావలసినది సరదా సమాధానమా లేక శాస్త్రీయ వివరణా?

http://sarath-kaalam.blogspot.com/2010/08/blog-post_08.html


ఈనాడులో మాలిక, తదితర ఎగ్రిగేటర్ల గురించిన వ్యాసం

రౌడీ గారు: మాలిక గురించి ఈనాడు వ్యాసం లో సదభిప్రాయం వెలిబుచ్చిన సుజాత e -తెలుగు కార్యవర్గ సభ్యులు. సరికొత్త ప్రత్యేక అంశాలతో వస్తున్న మాలిక కు అభినందనలు అంటూ Blog Aggregators’ T.R.P. వ్యాసం వ్రాసిన భవదీయుడు e-తెలుగు కార్యవర్గ సభ్యుడే. కూడలి నిర్వాహకుడు వీవెన్ e -తెలుగు కార్యవర్గ సభ్యులే. తెలుగు భాషాభి వృద్ధికి ఎవరు తోడ్పడినా అభినందనలు, చేయూత అందించటానికి e- తెలుగు ఎప్పుడూ ముందుంటుంది.

మాలిక పొడగిట్టని కూడలి సీనియర్లు ఎవరు? అపోహలతో, దుశ్శంకలతో ఉండవద్దు. పాజిటివ్ గా ఆలోచించండి. శుభమస్తు.
cbrao
Mountain View (CA)

http://malakpetrowdy.blogspot.com/2010/08/blog-post_20.html

3 కామెంట్‌లు:

  1. అన్నా నమస్తే, నేను బ్లాగుబాబ్జిని.
    అదేదో తెలుగుబ్లాగర్ల సమావేశమన్నావు అదెప్పుడు ఎక్కడ ఎలా జెవితే నేనుగూడ వస్తాగా .

    రిప్లయితొలగించండి
  2. @బ్లాగు బాబ్జీ: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడా, హైదరాబాదు లో ప్రతి నెలా రెండవ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు బ్లాగర్ల సమావేశం ఉంటుంది. మిమ్మల్ని గుర్తించటం ఎలా? మీ నిజ నామధేయం తెలుపగలరు.

    రిప్లయితొలగించండి