బుధవారం, డిసెంబర్ 29, 2010

మహాభారతంలో స్త్రీలు-అప్పటి వివాహ రీతులు-3

కుంతి యదువంశపు ఇంతి, పాండురాజు సతి
ప్రొఫెసర్ ఆలపాటి కృష్ణకుమార్

ద్రౌపది స్వయంవరం
కుంతి యాదవరాజు సురకుమార్తె, వసుదేవుని సోదరి, మహాభారతంలో, దైవాంశ సంభూతునిగా వర్ణింపబడిన కృష్ణుడి తండ్రి వసుదేవుడు ఆమె అసలు పేరు ప్రిథ. సురకు మేనత్త కొడుకు  కుంతి భోజుడు ఆమెను పెంచుకున్నాడు. ఆమెకు కుంతి అనే పేరు స్థిరపడింది. ఆమె గొప్ప సౌందర్యవతిగా చిత్రించాడు వ్యాసుడు. ఆమె పిన్నవయసులోనే రుషులు, మునులకు సేవలందించింది. అతి కోపిష్ఠి దుర్వాసముని ఆమె సేవలకు మెచ్చి ఆమెకు ఒక వరం ప్రసాదిస్తాడు. ఆమె తనకిష్టమైన వ్యక్తి (మానవుడైనా, దేవతైనా) పొందుకోరి పిలిచి అతని వలన సంతానం పొందవచ్చు. పాండురాజుతో ఆమె వివాహం జరక్క ముందే ఆమె ఆ వరం పొంది ఉన్నది. ఆమె పాండురాజు భార్య అవుతుంది గానీ, అతనివల్ల సంతానం పొందలేదని దుర్వాసునికి ముందే తెలుసు, అందుకే ఆమెకు ఆవరం యిచ్చాడని కథ చెపుతున్నది. వ్యాసుడు ప్రధాన పాత్రల చిత్రణ అనేక విషయాల మేళవింపుతో చేస్తాడు. ముగ్గురు ప్రధాన పాత్రలకు తల్లిగా కుంతినే వ్యాసుడెందుకు ఎంపిక చేశాడనేది గూడా అర్థం కాని విషయమే. (పేజి. 235-236) కుంతి కృష్ణుని మేనత్త. అన్నదమ్ముల మధ్య యుద్ధంలో కృష్ణుడు కుంతి కుమారుల పక్షం వహిస్తాడు. అలా కథలో కథను చిక్కుముడిగా అల్లటం వ్యాసుని  ప్రత్యేకత.
కుంతి పొందిన వరం ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉన్నట్లుంటుంది. నేటి యువతులు అందగాడిని, సమర్ధవంతుడిని, శక్తి సామర్ధ్యాలుగల వాడిని పెండ్లాడాలని కలలు కంటారు. అలాంటి వివాహం ద్వారా మంచి సంతానాన్ని పొంద గోరతారు గూడా.  ఈ కోరిక అన్ని కాలాల వారికి వర్తిస్తుందన్నట్లు వ్యాసుడు రాసినట్లనిపిస్తుంది.
కుంతి తాను పొందిన వరాన్ని పరీక్షించాలని తెగ ఉబలాట పడిపోతుంది. వరం విషయంలో నమ్మకం లేక కాదు. వయసు, హార్మోన్లు ఆమెను తొందరపెడతాయి. కుంతి సూర్య భగవానుని తన పొందుకు రమ్మని ఆహ్వానిస్తుంది. తీరా సూర్యుడు ప్రత్యక్షమయితే సత్యవతి మాదిరిగా వెనకంజ వేస్తుంది. తాను అవివాహిత, సూర్యుని వలన గర్భం దాలిస్తే ఎలా అని భయపడుతుంది. సత్యవతిని పరాశరుడు మోహించి తన దారికి తెచ్చుకుంటాడు. కుంతి సూర్యుడిని తానుగా ఆహ్వానిస్తుంది. తీరా వచ్చాక వెనకాడుతుంది. (పేజి 236) తన కన్యత్వం పోగొట్టుకోకుండా కొడుకు ఆమె తొడ భాగం నుండి జన్మించే వరం పొందుతుంది. ఇదొక సత్యదూరమైన సంగతి. ఆమె కొడుకుని వదిలి వెళ్ళిపోతే, క్షత్రియ కులానికి చెందని రాధ పసివాడు – కర్ణుడిని పెంచుతుంది. భారతంలో కర్ణుడు కుంతి కుమారులకు శతృవర్గమైన వారితో చేరి చెప్పుకోదగ్గ పాత్ర పోషిస్తాడు.
పాండురాజుని పెండ్లాడాక కుంతి మరి ముగ్గురు కొడుకులను తన వరం మహిమ ద్వారా కంటుంది. యమధర్మరాజు ద్వారా ఆమె సత్యసంధుడైన యుధిష్టిరుని కంటుంది. వాయుదేవుని వలన భీముడు పుడతాడు. భీముడు బహుబలశాలి. అతి ఆవేశపరుడు కూడా. వాయుదేవుడు తరవాత కాలంలో హిందువుల దేవుళ్ళ జాబితాలో నుండి మాయమవుతాడు. స్వర్గవాసి ఇంద్రుని ద్వారా కుంతికి అర్జునుడు పుడతాడు. అర్జునుడు శక్తి శాలి, విశ్వాసపాత్రుడు, అనేక విద్యలలో ఆరితేరినవాడు. భారతమంతా ఈ ముగ్గురి పాండవులు, వారి మారు సోదరులు, నకుల, సహదేవుల కథే. నకుల, సహదేవులు పాండురాజు రెండవ భార్య మాద్రి కొడుకులు. ఈ ఐదుగురు కుమారులు పాండు రాజుకి పుట్టిన వారు కాదు, ఆయన భార్యలకు పుట్టిన వాళ్ళు.
కుంతి తదుపరి చెప్పుకోదగ్గ పాత్ర పోషించలేదు. తన కొడుకుల విషయాలలో జోక్యం చేసుకోలేదు. తన సవతి మాద్రికి సంతానం లేకపోతే ఒక దేవతను రప్పించి ఆమెకు బిడ్డలు కలిగేలా సహాయపడుతుంది. ఈ విషయంగా ఆమెలో ఎలాంటి ఈర్ష్య లేకపోవటం ఆమె సుగుణం. పాండురాజు చనిపోయినప్పుడు కుంతి ఆయన చితి మీద ఆహుతి కావటానికి (సతీసహగమనం) సిద్ధపడుతుంది. మాద్రి కుంతితో ఆ ప్రయత్నం విరమింప చేస్తుంది. కుంతి పాండవులకు మార్గగామి అవుతుంది. అందువలన ఆమె బ్రతకాలి అని మాద్రి నచ్చచెపుతుంది. కుంతికి బదులు మాద్రి తానే సతీ సహగమనం చేస్తుంది. వీర హిందువులు సతీసహగమనం మొఘల్ పరిపాలన వలన రావలసి వచ్చిందని వాదిస్తారు. ఆ పద్ధతి మహాభారత కాలంలోనే ఉన్నట్లు వ్యాసుడు రాశాడు.
అర్జునుడు ద్రౌపదిని స్వయంవరంలో గెలిచి తాను బిక్ష తెచ్చానంటాడు. అన్నదమ్ములైదుగురూ సమానంగా పంచుకోండని తల్లి కుంతి అంటుంది. బహు భర్తలుండటం అనేది ఆ కాలంలోనే మొదలయినట్లు ఉండటమే కాకుండా ఆ పద్ధతి భారతంలో క్లిష్టమైన పాత్ర పోషిస్తుంది. కుంతి తన వివాహానికి ముందు పుట్టిన కర్ణుడిని కలుస్తుంది. కర్ణుడు ఆర్జునికి దీటైన యోధుడే. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని తప్ప మిగతా పాండవుల జోలికి పోవద్దని కుంతి కర్ణుడిని బతిమాలు కుంటుంది.
మాద్రి కన్యాశుల్కం చెల్లించి ఆమెను తెచ్చారు
మహాభారత కాలంలో బహు భార్యల పద్ధతి అమలులో ఉన్నది. భీష్ముడు పాండురాజుకి మరో వివాహం చేయ తలపెట్టాడు. వంశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. ధృతరాష్ట్రునికి మరో భార్యను తేవాలనే ఆలోచన భీష్మునికి ఎందుకు రాలేదో తెలియదు. అంధునికి మరో భార్యను తేవటం కష్టమన్నా అయ్యుండాలి లేక అతనికి 100 మంది కొడుకులు పుడతారని జోస్యం ఉన్నది గనుకనో పాండురాజుకి మరో భార్యను తేవటంలో ఆంతర్యం బోధపడదు. కథకు మరో మలుపునివ్వటానికయి ఉండవచ్చు. భీష్ముడు మాద్రరాజు చెల్లెలిని పాండురాజుకివ్వమని అడుగుతాడు. మాద్రరాజు కన్యాశుల్కం పద్ధతి ఉన్నదని గుర్తు చేస్తాడు. విరివిగా బహుమానాలర్పించి భీష్ముడు మాద్రిని పాండురాజు భార్యగా తీసుకొస్తాడు (పే.239) కన్యాశుల్కం తప్ప మరేదీ మాద్రరాజు అడగడు. సత్యవతి తండ్రి శంతను రాజుని సత్వవతి సంతానాన్ని రాజ్యానికి వారసులుగా చేయాలని నిబంధన పెడతాడు. మాద్రరాజు చెల్లెలి వివాహం ద్వారా ధనం గడించాలనుకున్నట్లున్నాడు. కూతుళ్ళ పెళ్ళి విషయంలో అప్రధానమనుకున్నట్లు తోస్తున్నది. చెల్లెల్ని వదిలించుకోటమే గాకుండా  ఈ పెళ్లి వలన మాద్రిరాజు లాభం కూడా పొందాడు. ఈ కాలంలో పెళ్ళిళ్ళవరస కూడా అలానే ఉంటున్నది.
విదురుడు బహుశ పరిచారిక సంతానం
కనుక రాజులతో సంబంధం కలుపుకోనక్కరలేదు
విదురుడు పరిచారిక కొడుకు. అతని తండ్రి మహాభారతం రచయిత వ్యాసుడే అయినా తల్లి కుటుంబమే పరిగణనలోకి తీసుకున్నారు. కుంతి, మాద్రి కొడుకులకు కురువంశం మీద హక్కు లేకుండా పోయింది. వారు పాండురాజు కొడుకులు కారు, కుంతి, మాద్రి కొడుకులే (హేరీ పోటర్ లాంటి ఈ కథలో పొందిక ఉండాలని అనుకోలేముగదా). భీష్ముడు విదురునికి ఒక సామాన్య కుటుంబం నుండి భార్యను తెచ్చాడు. ఈ నాలుగు వేల పేజీల మహాభారతంలో ఆమె తల్లి-దండ్రుల పేర్లెక్కడా కనిపించవు. వ్యాసుడు విదురునికి ధృతరాష్ట్రుడు, పాండుకు సమాన హోదా కల్పించాలని చెప్పినా ఆనాటి పితృస్వామ్య సమాజ ఆచారాలలో అది సాగలేదు. అప్పటికీ యిప్పటికీ సమాజం పితృస్వామ్య ఆధిక్యత ధోరణిలోనే నడుస్తూండటం చూస్తే ఆనాటి పితృస్వామ్య విలువ అర్ధం అవుతుంది.

ద్రౌపది మహాభారతంలో ఆమెది కీలకమైన పాత్ర /
భారతం కథకు పట్టుకొమ్మ
మహాభారతంలో ద్రౌపది అతి ప్రముఖ పాత్ర వహించిందంటే అతిశయోక్తి కాదు. ద్రుపదరాజు కుమార్తె ఆమె. అతిలోక సుందరి. ఆమెను పాంచాలి అని కూడా అంటారు. పాంచాల దేశపు (పంజాబ్ అయ్యుండచ్చు) రాకుమారి, ఆమెకు కృష్ణ అని మరో పేరున్నది అంటే నల్లనిది అని అర్ధం. ఆమెది మామూలు పుట్టుక కాదు. యజ్ఞపు అగ్ని నుండి జన్మించిందట (పే.369). ఆమె పుట్టుకే ఒక అద్భుతం.
అంబ సోదరీమణుల మాదిరిగానే ద్రౌపది స్వయంవరం ద్వారా తనకు నచ్చిన వరుణ్ణి వివాహమాడుతుంది. అందుకు అతను ఆమె తండ్రి పెట్టిన పరీక్షలో నెగ్గాలి. ద్రుపదరాజు ఒక ప్రత్యేకమైన, అతి బరువైన విల్లు తయారు చేయించాడు. ఒక స్తంభం మీద ఒక వస్తువు పెట్టాడు. ఆ వస్తువు నీడను కింద మడుగులో చూస్తూ విల్లునెత్తి నారి సంధించి ఆ వస్తువును ఛేదించాలి. అర్జునుడి వంటి యోధునికే అది సాధ్యమని ద్రుపదరాజు భావించాడు. ఆ పందెంలో దుర్యోధనుడు, అతని సోదరులు, ఇతర రాకుమారులు ఆ విల్లును ఎత్తలేకపోయారు. నారిని సంధించే దాకా రానేలేదు. కర్ణుడు ఆ పందెంలో గెలవగలిగిన వాడే కాని ద్రౌపది సూద్రుని వివాహమాడనన్నది. అందువలన కర్ణుడు తన ప్రయత్నం విరమించాడు (పేజి 374) అర్జునుడు బ్రాహ్మణుని వేషంలో స్వయంవరానికి హాజరయ్యాడు. భారతదేశంలో కులవ్యవస్థ గట్టిగా పాతుకుపోయిన కాలమది. బ్రాహ్మణుడు క్షత్రియునికంటే అగ్రకులస్థుడు. కనక అతను ద్రౌపదిని గెలుచుకొనవచ్చు. అతను సునాయాసంగా విల్లును సంధించి స్తంభం మీదున్న వస్తువును ఛేదించాడు. ద్రౌపదిని పందెంలో గెలుచుకున్నాడు. అప్పుడు పాండవులు అజ్ఞాతవాసం గడుపుతున్నారు. ద్రౌపదిని వెంటబెట్టుకుని  అర్జునుడు తన తల్లి ,సోదరులున్న చోటుకు పోతుండగా పందెంలో ఓడినవారు చాలా ఈర్ష్య పడ్డారు. బ్రాహ్మణుడేమిటి, వీరుడేమిటి అని అతన్ని చిత్తుగా ఓడించి ద్రౌపదిని ఎత్తుకుపోవచ్చనుకున్నారు. అతని మీద విరుచుకు పడ్డారు. అతను భీముని సాయంతో వారందరిని ఓడించి ఇల్లు చేరుకున్నాడు.
ఇక నుండి కథ చిత్ర విచిత్రంగా మారుతుంది. బ్రాహ్మణులు భిక్షాటన ద్వారా దొరికిన ఆహారాన్ని తల్లి వడ్డనకు తేవటం ఆచారం. అర్జునుడు స్వయంవరం సంగతి ప్రస్తావించకుండా, ఆరోజు భిక్షాటనగా ద్రౌపదిని చూపుతాడు. అనవాయితీ ప్రకారం అన్నదమ్ములందరూ పంచుకోండి అంటుంది కుంతి. అప్పుడు తెచ్చినది వ్యక్తి అనే విషయం అందరికీ అవగతం అవుతుంది. యుధిష్ఠిరుడు అన్నదమ్ముల మధ్య తేడా రాకూడదని, తల్లిమాట తప్పు కాదనీ ద్రౌపది తమ ఐదుగురికీ భార్యగా ఉంటుందంటాడు (పేజి 381).
అప్పటికి బహుభార్యలుండటమే ఆచారంగా ఉన్నది; కాని బహుభర్త లుండటం ఆచారం కాదు. కుంతి తన మాట ఎప్పటికీ అసత్యం కాబోదంటూ ద్రౌపదిని 5మంది సోదరులు పెండ్లాడాలంటుంది. ద్రుపదునికి ఆ సూచన ఆమోదయోగ్యంగా లేదు. కుంతి, యుధిష్ఠిరుడు ద్రౌపదికి నచ్చచెప్పలేకపోతారు. చివరికి వ్యాసమహర్షి మరో అసందర్భపు కథద్వారా ద్రుపదునికి నచ్చచెపుతాడు. శివుడు (మహదేవుడు) ఐదుగురు స్వర్గవాసులను (అర్జునుడి తండ్రి ఇంద్రునితో సహా) భూలోకంలో అన్నదమ్ములుగా జన్మించి ఒకే స్త్రీని పెండ్లాడమని శపిస్తాడట. ఏదో అవమాన భావం వల్ల అతనలా శాపం యిస్తాడు. ఆ మహాదేవుడే ఒక స్త్రీకి ఐదుగురు భర్తలుంటారని వరమిచ్చాడట, కారణం, ఆమె ఐదు పర్యాయాలు తనకు భర్త నివ్వమని ఆయన్ని వేడుకున్నదట. అలా ద్రౌపది ఐదుగురు భర్తలకు భార్య అవుతుంది.
ఆకాలంలో బహుభర్తలుండటం ఆచారం కాదని చెప్పటంలో వ్యాసుడు ఫెమినిస్ట్ దృక్పథం చూపాడా లేక కొన్ని తెగలలో బహుభర్తలుండటం ఆచారంగా ఉన్నదా అనేది తెలియలేదు. భారత పురాణాలలో, ఇతిహాసాలలో ద్రౌపది వివాహం ఒక్కటే ప్రముఖంగా పేర్కొనబడింది.
ద్రౌపది విచిత్ర వివాహమైనా ఆమె తన నేర్పరితనంతో సమయస్ఫూర్తితో ఐదుగురు భర్తలను సంతోష పెట్టగలిగింది. భర్తను ఎలా సంతోష పరచాలన్న విషయంలో కృష్ణుని ఇష్టసతి సత్యభామ ద్రౌపది సలహా కోరింది. అందంగా అలంకరించుకోవటం, కన్నీరు కార్చటం, వశీకరణ మందులు వాడటం అనేవేవీ పనిచేయవని ద్రౌపది అంటూ, భర్తలను ప్రేమగా, గౌరవంగా చూసుకుంటూ, సవతులంటే ఈర్ష్యపడకుండా సహకరిస్తే భర్తలు మిక్కిలి సంతోషంగా ఉంటారని సలహా యిస్తుంది. (రచయిత మగవాడు గనుక భార్య అంటే ఎలా ఉండాలో చెప్పాడు) వ్యాసుడు ద్రౌపదిని సౌందర్యవతిగా, ఎవరిపట్ల ఎలా వ్యవహరించాలో బాగా తెలిసిన వ్యక్తిగా, సహృదయురాలిగా, కక్షసాధించే స్వభావిగా చిత్రిస్తాడు. ఆమె గొప్ప కృష్ణభక్తురాలు. కష్టకాలంలో కృష్ణుడే ఆమెకు అండగా నిలుస్తాడు. ఉదా : కౌరవులు నిండు సభలో ఆమెను వివస్త్రను చేస్తుంటే ఆమె కృష్ణుని వేడుకోగా ఆ అవమానం నుండి కాపాడతాడు. మరో సందర్భంలో దూర్వాసముని వెంట వచ్చినవారందరికీ వడ్డించటానికి తగినంత ఆహారం లేకపోతే, కృష్ణుణ్ణి వేడుకోగా సమస్య నుండి గట్టెక్కిస్తాడు.
ద్రౌపదిని  మేథావిగా చూపుతాడు వ్యాసుడు. జూదంలో యుధిష్ఠరుడు తనను ఓడటంలో ఔచిత్యం లేదంటుంది. అతను ముందే పందెంలో ఓడిపోయి కౌరవులకు బానిసవుతాడు. ఆ తరవాత భార్యను ఓడే హక్కు అతనికి లేదని ఆమె వాదిస్తుంది. తనను కాంక్షించి, బలాత్కారం చేయబోయిన కీచకుడిని తన భర్త భీముడు చంపే విధంగా ప్లాను వేసి సఫలత పొందుతుంది. దుర్యోధనుడు, అతని వాళ్ళు ఆమెను అవమానాలకు గురి చేయగా వారిని సమూలంగా నాశనం చేయాలని పట్టుబడుతుంది. వారితో యుద్ధం చేసి వారి అంతు చూడటమే ఆమె లక్ష్యం.
ఆమె పుట్టుక, ఐదుగురిని వివాహమాడటం, జీవితంలో ఎదురైన సంఘటనలను దీటుగా ఎదుర్కొనటం అన్నీ విలక్షణ విషయాలే, అద్భుతాలే. పతివ్రత స్త్రీకి అనేక శక్తులుంటాయని ద్రౌపది ద్వారా వ్యాసుడు చూడదలచి నట్లున్నది. ద్రౌపదిది విలక్షణమైన పాత్ర. 

(ఇంకా ఉంది)

ఆదివారం, డిసెంబర్ 26, 2010

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన -10వ రోజు

ఈ సంవత్సరం అతి ప్రాచుర్యమైన పుస్తకం ఏదంటే అది "నా ఇష్టం" - దర్శకుడు రాం గోపాల్ వర్మ వ్రాసినది. ప్రచురణ అయిన నెల రోజులలో నాలుగో ముద్రణ జరుగుతున్నది. మొదటి వారంలోనే 10 వేల ప్రతులు అమ్ముడయి తెలుగు పుస్తక ప్రచురణ చరిత్రలో కొత్త పుంతలు తొక్కి, రికార్డ్ స్థాపించింది. -cbrao Photos: cbrao Nikon D90

http://eenadu.net/district/districtshow1.asp?dis=hyderabad#16
పుస్తకం...మస్తిష్కభూషణం
బుక్‌ఫెయిర్‌కు పోటెత్తిన సందర్శకులు... నేడే ఆఖరు రోజు
రాంగోపాల్‌పేట: అక్షర కుసుమాల సువాసనలు ఆ ప్రాంతంలో గుబాళిస్తున్నాయి. ఈ పరిమళాలను నగరవ్యాప్తంగా ఆబాలగోపాలం ఆస్వాదిస్తున్నారు. ఒక మంచి పుస్తకం, మంచి స్నేహితుడితో సమానం.. అది ఆపదలో మనిషికి దిక్సూచిలాంటిది.. అంటూ సందర్శకులు నెక్లెస్‌రోడ్డులోని బుక్‌ఫెయిర్‌కు పోటెత్తారు. వారాంతం అందునా క్రిస్మస్‌ సెలవుదినం కావడంతో పుస్తక ప్రియులు అనూహ్యంగా తరలివచ్చారు. శనివారం సుమారు 70 వేల మంది ప్రదర్శనకు వచ్చినట్లు అంచనా. మొత్తం వేదికపై 64 పుస్తకాలు ఆవిష్కరించడం ద్వారా ఔత్సాహిక రచయితలకు ప్రోత్సాహం లభించనట్లయిందని నిర్వాహకులు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభివర్ణించారు. తన మనుమలతో బుక్‌ఫెయిర్‌ సందర్శనకు వచ్చిన ఆయనను 'న్యూస్‌టుడే' పలకరించింది పుస్తకం హస్తభూషణం అని గతంలో అనేవారు కానీ, అది మస్తికభూషణం అని ఆయన పేర్కొన్నారు. తెలుగు ఆపరేటింగ్‌ సిస్టం ఆవిష్కరణ... కంప్యూటర్‌ చరిత్రలో తొలి తెలుగు ఆపరేటింగ్‌ సిస్టం ఆవిష్కరణ ఈ బుక్‌ఫెయిర్‌లో హైలెట్‌గా చెప్పుకోవచ్చు. తెలుగు భాషపై మక్కువతో పలువురు ఇంజనీర్లు, మేధావులు కలసి 'స్వేచ్ఛ' అనే సంస్థను స్థాపించారు. వీరి ఆధ్వర్యంలో సంప్రదాయ ఆంగ్ల ఆపరేటింగ్‌ సిస్టం సాఫ్ట్‌వేర్‌కు దీటుగా తెలుగులో రూపొందించారు. సంస్థ ప్రతినిధులు సిద్ధార్థ, భువనకృష్ణ శనివారం బుక్‌ఫెయిర్‌లో సందర్శకులకు ఈ వివరాలు వెల్లడించారు.
మీడియాకు స్వేచ్ఛపై సదస్సు... ఇటీవల నీరారాడియా టేపులు సంచలనం సృష్టించిన నేపథ్యంలో 'మీడియా స్వేచ్ఛ' అనే అంశంపై బుక్‌ఫెయిర్‌లో సదస్సు నిర్వహించారు. ప్రముఖ జర్నలిస్టులు-విశ్లేషకులు ఐ.వెంకట్రావు, కొమ్మినేని శ్రీనివాసరావు, తెలకపల్లి రవి, డాక్టర్‌ కె.నాగేశ్వర్‌, దినేష్‌కుమార్‌లు ప్రసంగించారు. మీడియా ఏ పార్టీకీ కొమ్ముకాయకుండా ప్రజాప్రయోజనాలకు పెద్దపీట వేయాలని వారు ఆకాంక్షించారు.
పీకాక్‌ క్లాసిక్స్‌ నుంచి అనువాద రచనలు: గాంధీ ... మాతృభాష పట్ల మనవారు అనుసరిస్తున్న విధానాన్ని ప్రముఖ రచయిత గాంధీ తప్పుబట్టారు. జర్మనీ, ఫ్రాన్స్‌, పొరుగున ఉన్న తమిళనాడు మాదిరిగా తెలుగువారు కూడా భాషాభిమానాన్ని చాటుకోవాలన్నారు. పుస్తక ప్రియులు అమితంగా ఇష్టపడే స్టీఫెన్‌ హ్యాకింగ్‌ రచనను కాలబిలాలూ, పిల్లవిశ్వాలూ పేరుతో ఆయన అనువదించారు. ఐదు సుప్రసిద్ధ ప్లేటో రచనలు, అమెరికా రాజ్యాంగ నిర్మాతల ఫెడరలిస్టు పత్రాలు, కాలంకథ తదితర అనువాద రచనలు సాహితీ ప్రియుల ను ఆకట్టుకుంటున్నాయి. బుక్‌ఫెయిర్‌ ఆదివారంతో ముగియనుంది.
Courtesy: Eenadu Daily
-----------------------------------------------------------------------------------------
డిశంబర్  25 2010

 ఈ తెలుగు స్టాల్ కు ఈ రోజు పలు బ్లాగర్లు విచ్చేశారు.



 చక్రవర్తి, కశ్యప్ కొత్త తరహాలో ఈ తెలుగు ప్రచారం చేశారు (ఛాయా చిత్రం చూడండి). వాలంటీర్లు కడదాకా ఉత్సాహంగా పనిచేశారు. ప్రణవ్, ప్రవీణ్ (లినక్స్), వీవెన్,  రహమనుద్దీన్ షేక్ మొదలగు వారు సందర్శకుల ప్రశ్నలకు ఆసక్తికరంగా జవాబిచ్చారు. 

Bhargava ram explaining to Sri Harshavardhan (Leader fame) about Telugu in computer
Photo courtesy:Yenamandra Satish Kumar

Visitors Gayatri, Deepthi, Sirisha (Virajaji) and Veeven



 ఈ పుస్తక ప్రదర్శన తిరునాళ్లలో పిల్లలకు ఉపయుక్తమైనవి రెండు స్టాళ్లు. 1) My Drona 2) e- బాలక్.  మై ద్రోణా లో పిల్లలకు పనికి వచ్చే పాఠ్యాంశాలు వారి అవసరాన్ని బట్టి ద్రోణా లో చేర్చబడతాయి. పూర్తి వివరాలు వెబ్ సైట్లో లభ్యం. ఇందులో దునియా ఫీచర్స్ ఉన్నాయి. వీడియోలు చూడవచ్చు. పాటలు వినవచ్చు. పాటలు ధ్వనిముద్రణ చెయ్యవచ్చు.హైదరాబాదులో లభ్యం. ఇక్కడివాళ్లే దీన్ని వృద్ధిచేశారు. ఇహ ఈ-బాలక్ అయితే నెల నెలా వచ్చే పత్రిక (సి.డి. రూపంలో). 3 నుంచి 13 సంవత్సరాల పిల్లల దాకా ఉపయుక్తకరమైన విషయాలు, వయస్సు వారీగా ఎంచుకునేట్లు ఉన్నాయి.



ఇక ఆధ్యాత్మిక పుస్తకాలు, సి.డి.లు, డి.వి.డి. లు చాలా స్టాళ్లలో లభ్యమవుతున్నాయి. ది వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ లో  నేను బ్లావెట్‌స్కీ యాత్రానుభవాలు, మాస్టర్ ఈ.కె. జీవిత చరిత్ర కొన్నాను. ఈషా ఫౌండేషన్  వారి స్టాల్ లో సద్గురు జగ్గీ వారి పుస్తకాలు, డి.వి.డి లు లభ్యమవుతున్నాయి. చాలా ఆసక్తికరమైన ప్రచురణలివి.

చేగెవేరా పై ప్రత్యేక స్టాల్ కూడా ఉంది ఈ సంవత్సరం




 మరొక విశేషం. ఒక తెలుగు వాడు వ్రాసిన, 1086 పదాలతో అతి పెద్ద పేరు గల పుస్తకం  హ్యాండీ క్రిస్టల్స్ ప్రదర్శించబడుతుంది. ఇది గిన్నీస్ లో ఎక్కింది.

ఈ రోజు పుస్తక ప్రదర్శనశాల స్టాళ్లలో కాలిడ చోటు లేనంతమంది వచ్చారు. పుస్తకాలకు పెరుగుతున్న ఆదరణకు ఇది సాక్ష్యంగా నిలుస్తుంది.















శుక్రవారం, డిసెంబర్ 24, 2010

హైదరాబాదు పుస్తక ప్రదర్శన -8వ రోజు

ఈ రోజు జరిగిన పిల్లల సాంస్కృతిక, ఇతర పోటీలలో పాల్గొన్న విద్యార్ధులకు చాకలేట్లు పంచుతున్న ఈ తెలుగు వాలంటీర్ భార్గవ రాం



ఈ రోజు Easyway Learn Mathematics -by రాం, Fun with Maths పుస్తకాలను ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆవిష్కరించారు.

కార్యక్రమాలను ఆసక్తితో తిలకిస్తున్న పుస్తక ప్రియురాలైన ఒక చిన్నారి
ఈ రోజు సందర్శకులు బాగానే వచ్చారు పుస్తక ప్రదర్శనకు. kinige.com ఇప్పుడు పని చేస్తుంది. పలు తెలుగు, ఆంగ్ల పుస్తకాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కినిగె సేవలు లభ్యం. ఆది బ్లాగరు చావా కిరణ్ ఈ కినెగె ప్రాజెక్ట్ వెనుకున్న వారిలో ఒకరు. పుస్తక ప్రియులు దర్శించతగ్గదీ వెబ్ సైట్. ఓ లుక్కేయండి.

ఈ తెలుగు స్టాల్ వద్ద కంప్యుటర్లో తెలుగు గురించి ఆసక్తిగా చూస్తున్న సందర్శకులు

స్టాల్ సందర్శకులలో వరవరరావు (విప్లవ కవి) ఉన్నారు. జె.పి.(ప్రాణహిత) సాయంతో తెలుగు బ్లాగు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఈ తెలుగు స్టాల్ లో వాలంటీర్లు భార్గవ రాం, కౌటిల్య, ప్రవీణ్ శర్మ (శ్రీకాకుళం), లినక్స్ ప్రవీణ్ (telugulinux.blogspot.com).స్టాల్ కు వచ్చిన బ్లాగర్లలో కత్తి మహేష్ కుమార్, సతీష్ యెనమండ్ర (ఆకాశంలో -ningi.wordpress.com), నాగ మురళి, ఇంగ్లీష్ సుజాత (గడ్డిపూలు), క్రిష్ణప్రియ (krishna-diary.blogspot.com).ఉన్నారు.


ఈ తెలుగు స్టాల్ లో (కూర్చున్న ఎడమనుండి కుడి వైపు): ప్రవీణ్ శర్మ (శ్రీకాకుళం) , సి.బి.రావు. నుంచున్న వారు: నాగ మురళి

Photo Credits

Hyderabad Book Fair

and

cbrao -Nikon D90

బుధవారం, డిసెంబర్ 22, 2010

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన -6వ రోజు

వ్యక్తిత్వ మార్పుకు దోహదపడేవే పుస్తకాలు.

Telakapalli Ravi

ఈ  రోజు  సాహిత్య ప్రస్థానం సంపాదకుడు తెలకపల్లి రవి పుస్తకం

శ్రీ శ్రీ జయభేరి
జీవితం సాహిత్యం  రాజకీయాలు

పుస్తకావిష్కరణ, కవి శివారెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఈ పుస్తకం ఈ-తెలుగు స్టాల్ ను ఆనుకుని  ఉన్న సాహితీ స్రవంతి వారి స్టాల్ లో  తగ్గింపు ధరకు లభ్యమవుతుంది. రచయిత తెలకపల్లి రవి ఈ రోజు ఈ తెలుగు స్టాల్ ను సందర్శించారు. 

 Karra Ellareddy of Telangana Sahiti Publications

 ఈ-తెలుగు స్టాల్ కు దగ్గరే ఉన్నది తెలంగాణా సాహితీ ప్రచురణల సంస్థ వారి స్టాల్. వీరి వద్ద అనేక తెలంగాణా రచయితల పుస్తకాలు, తెలంగాణా  సర్వస్వం (పేజీలు 1072 రూ.540/-) వగైరా ఉన్నై. ముదిగంటి సుజాతా రెడ్డి కధలు విసుర్రాయి ఇక్కడ లభ్యమవుతుంది.ఇంకా నల్గొండ, కరీంనగర్ జిల్లాల ప్రత్యేక సంచికలు ఉన్నాయి. నిర్వాహకులు కర్ర ఎల్లారెడ్డి గారు తెలంగాణా సాహిత్యం పై మక్కువతో పలు పుస్తక ప్రచురణలు చేశారు. తెలంగాణా మాండలీకపు సొగసులను ఇక్కడ చూడవచ్చు.   

    Telangana Sahiti Publications
Click on Photo to enlarge
ఈ రోజు పనిదినం అవటం వలన సందర్శకులు తక్కువే ఉన్నారు. అయినా ఈ తెలుగు స్టాల్ లో లో వాలంటీర్ల ఉత్సాహానికి కొదవలేదు.ఈ రోజు వాలంటీర్లు శ్రీయుతులు లలితా బాల సుబ్రమణ్యం, శరత్చంద్ర (అంకురం),కౌటిల్య,భార్గవరాం,రాజన్ (నా గోల). ఈ రోజు సందర్శకులలో కె.బి.ఎస్.శర్మ (తెలుగు రధం), బాలు (కోతి కొమ్మచ్చి),మాధవి (మధువనం), లోచని బ్లాగర్లు ఉన్నారు.     

Sitting: Sri Lalita Bala Subramanyam 
Standing Left to right: Sarat Chandra, Kautilya, Bhargavaram

Telakapalli Ravi  Photo: Sarat Chandra
Photos: cbrao -Nikon D90


హైదరాబాద్ పుస్తక ప్రదర్శన -5వ రోజు

పుస్తకం -ఒక మంచి నేస్తం.
Click on Photos to enlarge

తనికెళ్ల భరణి నాటకాలు కొక్కొరొకో,గోగ్రహణం,చల్ చల్ గుర్రం!, జంబూ ద్వీపం,గార్ధభాండం 

ఆంధ్రప్రదేష్ లో  నాటక పరిషత్‌లు అనేవి లేకపోతే నాటకాలకు దీర్ఘ గ్రహణం పట్టి ఉండేది. ఈ పరిషత్ ల పుణ్యమా అని ఆపుడప్పుడైనా మంచి నాటకాలు ఆంధ్ర ప్రేక్షకులు చూసే అవకాశంకలుగుతుంది. ఐతే, పేరుగాంచిన కొన్ని నాటకాలను చదువుదామనే పాఠకులకు , అవి లభ్యం కాక నిరాశే మిగులుతుంది. ఇలాంటి సమయం లో హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఈ రోజు ఒకటి కాదు, మొత్తంగా 5 నాటక పుస్తకాలు ఆవిష్కారణ అయ్యాయంటే పుస్తక ప్రియులకు, నాటాకాభిమానులకు పండగే మరి. గతంలో పలు మార్లు ప్రదర్శించబడి, విమర్శకుల ప్రశంసలందుకున్న తనికెళ్ల భరణి నాటకాలు కొక్కొరొకో,గోగ్రహణం,చల్ చల్ గుర్రం!, జంబూ ద్వీపం,గార్ధభాండం లను నటుడు,రచయిత రాళ్లపల్లి ఆవిష్కరించారు.తనికెళ్ల భరణి చక్కటి నటుడు, రచయిత, నాటక ప్రయోక్త ఇంకా ఉత్తమాభిరుచితో సినిమాలు (సిరా వగైరా) కూడా తీశారు.



ఈ పుష్తకావిష్కరణ సభలో తనికెళ్ల భరణి. బెంగళూరు పద్మ, సి.వి.ఎల్.నరసింహారావు, దర్శకుడు వంశీ, రాళ్లపల్లి, నటుడు అవసరాల శ్రీనివాస్ (అష్టాచెమ్మా ఫేం), నటుడు, రచయిత జెన్నీ   ప్రసంగాలు చేశారు. జెన్నీ మాట్లాడుతూ ఒకసారి నెహ్రూ పార్లమెంట్ భవనం లో లిఫ్ట్ లో వెళ్తున్నప్పూడు  అకస్మాత్తుగా లిఫ్ట్ ఆగిపోతే, అక్కడి సాంకేతిజ్ఞులు పరుగున వెళ్లి మరమ్మత్తు చేసినా 15 నిమిషాలు పడ్తుంది. ఎవరి ఉద్యోగం ఊడుతుందో, ఎవరు చివాట్లు తినవలసి వస్తుందో అని అందరు భయపడుతున్న సమయంలో నెహ్రూ ఒక చీటి అక్కడి వారి కిచ్చి వెళ్లాడు. ఆ చీటిలో ఏముందో తెలుసా? లిఫ్ట్ లో పుస్తకాలుంచండి అని, అత్యవసర సమయంలో చదువుకోటానికి తోడుంటాయని. నాటకాల గురించిన   పలు ఆసక్తికరమైన విషయాలు ఈ ప్రసంగాలలో వినవచ్చు.  మీరూ విని ఆనందించగలరు.



Tanikella Bharani 5 Plays Inauguration at Book Exhibition 2010

ఈ రోజు ఈ-తెలుగు స్టాల్ లో తెలుగు భాషా ప్రేమికులు ఉత్సాహంగా పనిచేశారు. ఇవ్వాల్టి వాలంటీర్లు. శ్రీయుతులు  1) తాడేపల్లి లలితా బాల సుబ్రమణ్యం 2)శరత్ చంద్ర 3) ప్రణవ్ 4) భార్గవ్ రాం 5) కౌటిల్య 6) శ్రీనివాస్ (పడమటి గోదావరి రాగం). సందర్శకులలో భాను, అరుణ పప్పు ఉన్నారు. అరుణ మన స్టాల్ నుండి కరపత్రాలు తీసుకుని కినిగె స్టాల్ లో కూర్చుని ఈ-తెలుగు ప్రచారం చేశారు. నవతరంగం సారధులలో ఒకరైన అరిపిరాల సత్య ప్రసాద్, దర్శకుడు వంశి,అవసరాల శ్రీనివాస్ (నటుడు) ఇంకా జనార్దన మహర్షి (కవి, సినీ రచయిత, చెంగల్వ పూదండ చిత్ర దర్శకుడు)  లను మన స్టాల్ కు తీసుకొచ్చారు. చిత్ర సమీక్షలు నిర్మొహమాటంగా వెలువరిస్తున్న  నవతరంగం కు అభినందనలు.   
Photos, Audio & Video: cbrao
Nikon D90, Nokia 5800 (audio)

ఆదివారం, డిసెంబర్ 19, 2010

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన -3వ రోజు


జీతం కోసం ఆంగ్ల భాష
జీవితం కోసం అమ్మ భాష
తెలుగు బాట -తెలుగు కై నడుద్దాము. 

మాతృభాష తెలుగు పై ఎంత మమకారం ఉన్నా,ఉద్యోగం,పరిశోధన,
వ్యాపారాల కోసం  ఆంగ్ల భాష నేర్వటం తప్పనిసరవుతుంది. అయితే ఎవరైనా ఏ పుస్తకమైనా మాతృభాషలో చదివి ఆనందించినంతగా పరాయి భాషలో చదివి ఆనందించలేరు.మనకు గాయమయితే, ఓర్వలేని బాధ కలిగితే అమ్మా అనే అంటాం కాని మదర్ అని అనము. మాతృభాష మన గుండెలలోంచి తన్నుకు వస్తుంది. మీ పిల్లలకు తెలుగు నేర్పండి. సిలికానాంధ్రా వారి మా బడి లో మీ పిల్లలు తెలుగు సులభంగా ఆడుతూ, పాడుతూ నేర్వగలరు. మీ పిల్లలకు తెలుగు నేర్పటంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను  http://etelugu.org/ వారి దృష్టికి తీసుకురావచ్చు. మీ పిల్లలకు మాతృభాష కమ్మదనాన్ని దూరం కానివ్వకండి.  
    
Click on images to enlarge
 
తెలుగు సాహిత్యానికి సంబంధించి   3 విశిష్ట పత్రికలున్నాయి. ఇవి మనకు పత్రీకలమ్మే దుకాణాలలో కనపడవు.ఏవో కొన్ని పెద్ద పుస్తకాల దుకాణాలలో తప్పించి ఇవి మరెక్కడా కనపడవు కనుక వీటిని గురించి తెలుగు పాఠకులకు తెలియదనే చెప్పాలి. తెలిసినా ఇవి సులభంగా లభ్యం కావు. ఈ పుస్తక ప్రదర్శనలో ఈ పత్రికలకు వార్షిక చందాదారులయితే ఈ పత్రిక తిన్నగా మీ ఇంటికే వస్తుంది.మంచి పత్రికలను చదవండి, ప్రోత్సాహించండి. చందాదారులయి మనము వాటిని బతికించుకుందాము. ఇది మీ ఉత్తమ అభిరుచిని తేటతెల్లం చేస్తుంది. ఈ వ్యాసాలలో ఇంతవరకూ ప్రస్తావించని పత్రిక -సాహిత్య ప్రస్థానం కూడా ఈ మూడు పత్రికలలో ఒకటి. వీటి వివరాలు 1) మిసిమి -చింతనాత్మక సారస్వతం -సంస్థాపక సంపాదకులు రవీంద్రనాధ్ ఆలపాటి. రెసిడెంట్ ఎడిటర్: వల్లభనేని అశ్వినీ కుమార్ 2) పాల పిట్ట -సంపాదకుడు: గుడిపాటి 3) సాహిత్య ప్రస్థానం -సంపాదకుడు: తెలకపల్లి రవి 

    
 Click on images to enlarge - Narla chiranjeevi and Devulapalli Krishna Sastry

  ఈ-తెలుగు స్టాల్ ను ఆనుకుని సాహితీ స్రవంతి వారి స్టాల్ ఉంది. ఇది తప్పక దర్శించ తగ్గ స్టాల్. హైదరాబాదు బుక్ ఫెయిర్ వారు ఇంకా సాహితీ స్రవంతి వారు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న  స్టాల్ ఇది. మరెక్కడా లభ్యం కాని,ఎందరో రచయితల అపురూప చిత్రాలు ఈ స్టాల్ లో మనము చూడవచ్చు.నేను ఈ స్టాల్ ను దర్శించినప్పుడు సాహితీ ప్రస్థానం సహ సంపాదకుడు  వొరప్రసాద్ అక్కడే ఉన్నారు. మన తెలుగు బ్లాగుల గురించిన వ్యాసం ప్రజా శక్తి దిన పత్రిక  ప్రచురణార్థం పంపమని కోరారు. ఆసక్తిగల బ్లాగరులు ఈ విషయమై వ్యాసం వారికి పంపవచ్చును.



ఈ చిత్రంలో, సాహితీ స్రవంతి స్టాల్ నిర్విహిస్తూ  కనిపిస్తున్న  తంగిరాల చక్రవర్తి కవి, కధా రచయిత ఇంకా పలు కవితా సంకలనాల సంపాదకుడు కూడా. వారి తండ్రి గారు తంగిరాల కృష్ణ ప్రసాద్ (నాటక ప్రయోక్త) స్మృతి గా తంగిరాల రంగస్థ పురస్కారాన్ని ప్రతి సంవత్సవరం నాటక రంగం లో సేవ చేస్తున్న ప్రయోక్తలు, రచయితలు,నటులకు ఇచ్చి నాటక రంగాన్ని ప్రోత్సాహిస్తున్నారు. సాహిత్య ప్రస్థానం మాస పత్రిక కు చందా ఇక్కడ కట్టవచ్చు. ఆ పత్రిక పాత సంచికలు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి.


శనివారం కావటం తో ఈ రోజు  ఈ-తెలుగు స్టాల్ కు బ్లాగరుల సందర్శనం ఎక్కువగానే ఉంది. శ్రీయుతులు పప్పు నాగరాజారావు, అక్కిరాజు భట్టిప్రోలు (మూడు బీర్లు తర్వాత),కత్తి మహేష్ కుమార్,  కోడిహళ్లి మురళీ మోహన్ (తురుపు ముక్క) ,తెలుగు సుజాత (మనసులో మాట), పూర్ణిమ (ఊహలన్నీ ఊసులై), స్వాతి (కల్హారా),సుభాషిణి పోరెడ్డి (మట్టి మనసు)  మొదలగు బ్లాగర్లు  ఈ-తెలుగు స్టాల్ కు వచ్చిన వారిలో ఉన్నారు.  

 Left to right sitting: Sri Katti Mahesh Kumar, Smt Satyavathi, Veeven
 Left to right standing: Srinivasa Raju, Rahamanuddin Shaik,Kautilya

కొస మెరుపు: వీవెన్ నాయనమ్మ శ్రీమతి సత్యవతి గారు ప్రదర్శన తుది దాకా  మాతో స్టాల్ లో గడపటం విశేషం. తెలుగు పుస్తకాలు చదువుతానని వారు నాతో అన్నారు.    
Photos: cbrao -Nikon D90

శనివారం, డిసెంబర్ 18, 2010

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన -2వ రోజు

Misimi Monthly  Stall

దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం
మనుషులనేవారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం
మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడు
దేవుడు కనబడలేదని మనిషి నాస్తికుడైనాడు  
-ఆచార్య ఆత్రేయ
మన ఈ-తెలుగు స్టాల్ కు వచ్చే కొందరు సందర్శకులు కంప్యూటర్లో తెలుగు వ్రాయటం, చదవటం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంటే, ఇంత చిన్న విషయం వీరికి 2010 సంవత్సరంలో కూడా తెలియదంటే ఆశ్చర్యం కలుగదా మరి. ఇలాంటి వ్యక్తులు మన స్టాల్ దర్శించినప్పుడు నాకు పైన ఉదహరించిన పాట గుర్తుకొచ్చింది. అందరికీ కంప్యూటర్లో తెలుగు చదవటం, వ్రాయటం వస్తే అప్పుడు ఈ-తెలుగు వాలంటీర్లు నిరుద్యోగులవుతారా?  


Sri K.B.S.Sarma -http://teluguradham.blogspot.com/
పుస్తక ప్రదర్శన లో సాధారణంగా ప్రతిరోజు సాయంత్రం ఎదో ఒక సాహిత్య కార్యక్రమం ఉంటుంది. సమన్యయం  లోపించటంతో ఈరోజు ఎలాంటి సభ లేక పుస్తకావిష్కరణ జరుగ లేదు. సాహిత్య సభలు జరపటంలో, విజయవాడ పుస్తక ప్రదర్శన సంఘం వారు చురుగ్గా ఉంటారని మన ఈ-తెలుగు స్టాల్ కు వచ్చిన బ్లాగర్ తెలుగు రధం కె.బి.ఎస్.శర్మ గారన్నారు. "కాలాన్ని నా రథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాను. నా మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాను." అనేది వీరి నినాదం. ప్రఖ్యాత సాహితీవేత్తల శతజయంతులొచ్చినప్పుడు వీరి బ్లాగ్ లో ఆ మహనీయులపై ప్రత్యేక వ్యాసాలు వెలువరిస్తున్నారు. సంగీత, సాహిత్య విషయాలపై సాంస్కృతిక కార్యక్రమాలు  నిర్వహించటంలో కూడా వీరికి ఆసక్తి ఉంది.  వీరు వాలంటీర్ గా ఉండి ఈ-తెలుగు కార్యక్రమాలలో పాల్గొనటం ఆనందదాయకం.  


Sri S.Kameswara Sarma -Poet

ఈ రోజు మన స్టాల్ కు వచ్చిన సందర్శకులలో ఒకరు, ఆసు కవి, ప్రాస కవి సాతవిల్లి కామేశ్వర శర్మ. వీరు సూక్తి ప్రాసలు, గిలిగింతల కవితలు, జన శృతులు అనే ప్రాస కవితా సంకలనాన్ని రచించి, ప్రచురించారు. వీరికి బ్లాగు లేదు. వీరి కవితలలో మచ్చుకు ఇవి చూడండి.   

నిశిరాత్రి ముహూర్తపు పెళ్ళిళ్ళు
జాతకబలం పెట్టేరు పెద్దోళ్ళు
నిద్రావస్థ పడేరు వచ్చినోళ్ళు
సగమే ఉన్నారు నచ్చినోళ్ళు  
అతిగారాబం పిల్లలు
అప్పుడప్పుడు వేలం వెర్రులు
అదుపులో ఉంటే దివ్వెలు
లేకుంటే అయ్యేరు శుంఠలు
మితిమీరిన సంపాదన పోటి
దొంగలెక్కలు కోటికి కోటి
ఎవరికోసం ఈ భేటి
మానవసేవకిస్తే దైవంసాటి




Palapitta Books

నిన్నటి  పుస్తక ప్రదర్శన వ్యాసంలో పాలపిట్ట మాస పత్రిక గురించి వ్రాశాను. కాలాభావం వలన నిన్న పాలపిట్ట స్టాల్ లో కాలిడలేదు.నేడు కొంచెం వ్యవధి చిక్కడంతో పాలపిట్ట వ్యవస్థాపకులు గుడిపాటి గారితో ముచ్చటించే అవకాశం కలిగింది. వీరు వార్త దిన పత్రిక లో ప్రత్యేక సంచిక సంపాదకులు. సాహితీ విలువలతో నిండిన,పలు చక్కటి పుస్తకాల సంపాదకుడు, ప్రచురణ కర్త కూడా. 


Musuru-Mudiganti Sujata Reddy


 ఈ స్టాల్ లో నేను ముదిగంటి సుజాతా రెడ్డి ఆత్మకధ -ముసురు కొన్నాను. ఈ పుస్తకం ధర రూ.250/- ఐనా పాలపిట్ట స్టాల్ లో మాత్రం  ప్రత్యేక తగ్గింపు ధర రూ.150/- కే అమ్ముతున్నారు. సుజాతా రెడ్డి పలు సాహిత్య విమర్శ గ్రంధాలు,నవలలు, కధలు,సాహిత్య చరిత్రలు, యాత్రాస్మృతులు,వ్యాసాల రచయిత్రి మాత్రమే కాకుండా  ఇంకా పలు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. వీరి పుస్తకం ఆంధ్రుల సంస్కృతి -సాహిత్య చరిత్ర (తెలుగు అకాడమీ వారి ప్రచురణ), బి.ఏ. తెలుగు సాహిత్య విద్యార్ధులకు పాఠ్యపుస్తకం.వీరు తెలంగాణా సాయుధ పోరాటాన్ని, స్వాతంత్యోత్తర ఆంధ్రదేశ జీవనాన్ని ప్రత్యష్యంగా చూసి ఉన్నారు. కాల్పనిక సాహిత్యంలో ఎన్ని ఎత్తు పల్లాలుంటవో ఆత్మ కధ లో కూడా  అంతటి వైవిధ్యముంటుంది. అక్కడక్కడా కొన్ని పేజీలు తిరగేస్తే ఆసక్తికరంగా అనిపించింది.ఈ పుస్తకం గురించి వివరంగా మరో మారు వ్రాస్తాను.   
ఈ రోజు నేను సందర్శించిన మరో స్టాల్ -Publications Division, Government of India. ఇక్కడ నేను కొన్న పుస్తకాలు 1) ఫిడేల్ నాయుడు గారు -పాలగుమ్మి విశ్వనాధం రూ.18/- ఇది వైలిన్ వాద్య నిపుణులు ద్వారం వెంకటస్వామి నాయుడి గారి జీవిత చరిత్ర . 2) రాణి రుద్రమదేవి -పింగళి పార్వతీ ప్రసాద్  రూ.11/- ఓరుగల్లు వీర నారి రాణీ రుద్రమదేవి జీవిత చరిత్ర. ఇక్కడ ఆసక్తికరమైన పలు పుస్తకాలు అందుబాటు ధరలో లభిస్తున్నాయి. మేఘాలయపై ప్రత్యేక సంచిక -యోజన రూ.20/- కూడా ఇక్కడే కొన్నాను.   
నేటికింతే. సెలవు.
Photos: cbrao -Nikon D90

శుక్రవారం, డిసెంబర్ 17, 2010

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన -1వ రోజు


ఈ-తెలుగు స్టాల్ వద్ద సందర్శకుల సందడి 

ఎప్పటివలే ఈ సంవత్సరం కూడా మన ఈ-తెలుగు స్టాల్ ప్రారంభమయ్యింది. 


స్టాల్ లో కొత్త వాలంటీర్లు: ఎడమ నుంచి కుడి వైపుకు: ప్రణవ్ అయినవోలు , రహ్మానుద్దీన్ షేక్,మరియు భార్గవ రాం.
కొత్త బ్లాగర్లు ఉత్సాహంగా కార్యకర్తలుగా పనిచేయటానికి ముందుకొచ్చారు. సందర్శకులకు వారి కంప్యూటర్లో తెలుగు ఎలా రాయవచ్చో,చూడవచ్చో గురించి తెలియ చెప్పారు. తొలి రోజు వచ్చిన దర్శకులలో 5మంది కంప్యూటర్లో తెలుగు వ్రాయ వీలవుతుందని తమకు తెలియదని చెప్పారు. కొంతమంది తమకంప్యూటర్లో కొన్ని వెబ్ సైట్లు తెలుగులో సరిగా కనపడటంలేదని చెప్పారు. తెలుగుకై నడక కార్యక్రమానికి పరిమిత నిధులు ఖర్చయి పోవటం ఈ తెలుగు కార్యక్రమాలపై ప్రభావం చూపింది. ఈ సంవత్సరం సందర్శకులకు తెలుగు సాఫ్ట్వేర్ల సి.డి. లను, ఈ-తెలుగు నిర్వాహకులు ఇవ్వలేకపోతున్నారు. ఈ-తెలుగు సభ్యులు తమ వార్షిక చందాల బకాయిలు చెల్లించి సంస్థను గట్టెంకించాలి. తెలుగు భాషాభిమానులు  ఈ-తెలుగు లో సభ్యత్వం తీసుకొని ఈ-తెలుగు కార్యక్రమాలకు తమ వంతు సహకారాన్నివ్వాలి. 

ఈ-తెలుగు స్టాల్ లో నుంచున్న వారు -ఎడమ నుండి కుడి వైపు: కట్టా విజయ్ , చావా కిరణ్, ప్రణవ్,భార్గవ రాం,రహ్మానుద్దీన్ షేక్. కూర్చున్న వారు ఎడమ నుండి కుడి వైపు: వీవెన్, సి.బి.రావు

ఈ-తెలుగు సభ్యుల కృషి వలన నేడు లేఖిని,కూడలి, జల్లెడ, తెలుగు బ్లాగులు, తెలుగు వికీపిడియా,పలు వెబ్ సైట్ల స్థానికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సంవత్సరం "మీ కంప్యూటర్ కు తెలుగు నేర్పించడం ఎలా?" అనే అంశం పై ఈ-తెలుగు వారు పత్రిక విలేఖరులకు, రచయితలకు సదస్సులు విజయవంతంగా నిర్వహించారు.   

హైదరాబాదు పుస్తక ప్రదర్శన ఆసక్తికరంగా ఉంది. ఈ సంవత్సరం చాలా విశేషాలున్నాయి. మిసిమి సాహిత్య మాసపత్రిక వారు తొలి సారి ఒక స్టాల్ (Arts and Letters) నిర్వహిస్తున్నారు. మిసిమి  సంచికలు ఇక్కడ లభ్యమవుతున్నాయి.ఈ స్టాల్ లో మూడు పుస్తకాలు కొన్నాను. 1) వల్లభనేని అశ్వినీకుమార్ వ్యాసాలు -అంతర్వీక్షణం 2) సజీవ సాంప్రదాయంగా వేమన -స.వెం.రమేష్ 3) పురాణ ప్రలాపం -హరిమోహన్ ఝా (రెండవ ముద్రణ). వీటి పరిచయం వీలువెంబడి చేస్తాను. ఏవో కొన్ని పుస్తక దుకాణాల్లో తప్పించి మరెక్కడా కనపడని పాలపిట్ట మాస పత్రిక తాజా సంచిక (పాత సంచికలు కూడా)   పాలపిట్ట స్టాల్ లో లభ్యమవుతుంది.  సాహిత్యాభిమానులు తప్పక కొనవలసినవీ  మిసిమి మరియు పాలపిట్ట. 
Raga Ragini Trust Book Stall

అవధూత దత్తపీఠాధిపతి  శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఆధ్యాత్మిక విషయాలపై  పలు ప్రసంగాలు చేశారు. వీరు  సంగీత పరిజ్ఞానము కలవారు కూడా.  వీరి  ఆధ్వర్యం లో వెలువరించిన  Live in Hawaii -Music for Meditation and Healing అనే c.d. ఒకటి రాగ రాగిణి ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న దుకాణం లో కొన్నాను. స్వామి వారి సంగీత కచ్చేరి నేను గతంలో సికందరాబాదులో చూసి ఉన్నాను.  ఆ రోజు వారి సంగీతం  దివ్యానుభూతి కలిగించింది. ఈ సి.డి ఇంకా వినలేదు. దీనిపై మరో మారు వ్రాస్తాను. ప్రారంభమయిన కొద్ది గంటలకే ప్రదర్శన ముగిసింది. చూడవలసిన స్టాల్ లు ఇంకా చాలా ఉన్నాయి. పుస్తక ప్రియులు మరల మరల వస్తేనే కాని తృప్తి లభించదీ ప్రదర్శనలో. 


తెలుగు బ్లాగరుల కినిగే స్టాల్ సందర్శన 

ఈ తెలుగు స్టాల్ కాకుండా తెలుగు బ్లాగర్లు నిర్వహిస్తున్న కినిగె స్టాల్ ప్రత్యేక విశేషం. ప్రపంచంలో తొలిసారిగా, ప్రపంచంలో మీరెక్కడున్నా తెలుగు పుస్తకాలు మీకు అద్దెకు లభ్యమవుతాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ నెల 21 న ఈ వెబ్ సైట్ ప్రారంభమవుతుంది. వివరాలకై ఈ దిగువ ఇచ్చిన వెబ్ సైట్ లో చూడండి.
http://kinige.com/
లేదా
http://kinige.com/teblog/  
కినిగే గురించిన విషయాలు ఎప్పటికప్పుడు తాజీకరింపబడగలవు.

నేటికింతే. త్వరలో పునర్దర్శనం.


తాజా కలం: ఈ-తెలుగు స్టాల్ లో పనిచేయుటకు ఉత్సాహవంతులైన వాలంటీర్లు కావలయును. తెలుగు భాషా సేవే కాకుండా ఎందరో రచయితలు, సినీ ప్రముఖులకు స్వయంగా ఈ-తెలుగు కార్యక్రమాల గురించి వివరించే అవకాశం కూడా ఉంది.

చిత్రం లో ఎడమనుంచి కుడి వైపుకు సతీష్ కుమార్ యెనమండ్ర, చిత్ర కవి భాస్కరభట్ల రవి కుమార్ (నేనింతే- కృష్ణానగరే మామా) ఇంకా కశ్యప్ -2009 ఈ-తెలుగు స్టాల్ లో.