బుధవారం, డిసెంబర్ 28, 2011

బ్లాగులు- వ్యాఖ్యలు -13

  The Flight of birds in Kaziranga, Assam.  Photo: cbrao

దీప్తిధారలో బ్లాగులు- వ్యాఖ్యలు -12 ను మార్చ్ 30, 2011 న ప్రచురించాను.  వీటిని కొనసాగించటంలో, పలు కారణాల వలన  అలక్ష్యం జరిగింది.  ఈ శీర్షిక ను పునః ప్రారంభించే  అవకాశం కలిగినందుకు ప్రమోదం.   

నార్త్ కరోలినా లో ఉగాది సంబరాలు


"ఉగాది పచ్చడి సేవించడం తో మొదలు పెట్టి, " -ఉగాది మజా ఉగాది పచ్చడితోనే కదా ప్రారంభమయ్యేది.
"అల్పాహారం అధికంగా తింటున్న అప్పనం మెంబర్లు, " ఏమి వెరైటీ    హాస్యమండి బాబోయ్!
ఒక్క ఉగాది కవితా శ్రవణం తప్ప అంతా సజావుగానే ఉంది. అక్కడి తెలుగు వారిని కలిపిన తాతా వారికి అభినందనలు.



http://vulimiri.blogspot.com/2011/04/blog-post_14.html

ఉత్తుత్తమ కథలు

ఇండియా వచ్చి వెళ్లారా? మీరెలాంటి కధలు రావాలని కోరుకున్నారో లేక మీకు నచ్చిన కధల గురించిన వివరాలెంచేతో మీరివ్వలేదు. ఆ వివరాలతో ఈ వ్యాసానికి భాగం -2 వ్రాస్తే, ఈ వ్యాసానికి ముగింపు ఉంటుంది. అందాక ఇది అసంపూర్ణమే. వీలైతే, మీకు నచ్చిన వైవిధ్యమైన కధలతో ఒక సంపుటాన్ని ప్రచురించండి.


http://anilroyal.wordpress.com/2011/04/20/%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AE-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81/



నీటిపై చూపిన అద్భుత లేజర్ ప్రదర్శన....వీడియో

అద్భుతం.


http://meeandarikosam.blogspot.com/2011/04/blog-post_23.html



నా వాషింగ్టన్ డి.సి ట్రిప్ లో జరిగిన సంఘటన

"ఫోన్ దగ్గరకు వెళ్ళి ఒక క్వార్టర్ వేసి మా కజిన్ ఫోన్ నంబర్ డయల్ చెసాను. ‘ ప్లీజ్ చెక్ ద నంబర్ ’ అని కాయిన్ బయటకు వచ్చేసింది. "
"ఇక ఆలస్యం చేయక మా కజిన్ కి కలెక్ట్ కాల్ చేసి నా పేరు చెప్పాను. లక్కీ గా కజిన్ ఫోన్ తీసాడు."
ఫోన్ చేసిన మొదటిసారి ‘ ప్లీజ్ చెక్ ద నంబర్ ’ అని వస్తే,  కలెక్ట్ కాల్ లో ఎలా కనెక్ట్  అయ్యింది? అదే నంబర్ కదా చేసింది?  


http://muktalekha.blogspot.com/2011/04/blog-post.html


నామిని – నెంబర్ వన్ పుడింగి : పడుతూ లేస్తూ ఉన్న ఏనుగు కత


పుడింగ్ అంటే అన్నీ తెలిసినవాడు, అన్నీ వచ్చినవాడు, శక్తిమంతుడు అనే అర్థం తోస్తుంది. తనంత గొప్పోడు లేడనే నామినీ విశ్వాసమే  తనను  తాను  పుడింగ్ అనుకునేలా చేసిందేమో!  ఈ పుస్తక ముఖచిత్రం నామిని  ఆత్మస్థైర్యానికి  ప్రతిబింబం.

పుస్తక పరిచయం నిర్మొహమాటంగా, నిజాయితీగా ఉంది. జంపాల సమీక్షలు ఆసక్తిగా చదివిస్తాయి.


http://pustakam.net/?p=7097



ఇండియాలో ఓ చక్కటి ఆశ్రమాన్ని సూచిద్దురూ


You may consider attending Krishnamurti Foundation India's annual gatherings: In early winter every year, the Foundation holds a gathering at any one of its centres. The gathering is open to all, and its programme includes lectures, discussions and video screenings. Announcements about the gathering are made through the KFI Bulletin, the Vasanta Vihar Newsletter and the Mailing List.
Chennai centre (Head quarters) has got a guest house located amidst nature.So are other centres of India located in peaceful surroundings.
More info about Indian centres at
http://www.j-krishnamurti.org/kfiPage.html
http://www.j-krishnamurti.org/KRetreat.html
http://www.kfionline.org/studycentres/index.asp

In USA

http://www.peppertreeretreat.com/


http://sarath-kaalam.blogspot.com/2011/05/blog-post_18.html



సినిమాలు : మనవీ - వాళ్లవీ

తొలి సమీక్షలా అనిపించలేదు. బాగుంది.  మరిన్ని పుస్తకాలు పరిచయం చెయ్యండి. ఈ పుస్తకం ఇచ్చిన ప్రొత్సాహంతో సౌమ్య నుంచి ఇంకొన్ని అనువాదాలు ఆశించవచ్చా?


http://krishna-diary.blogspot.com/2011/06/blog-post_11.html

బ్లాగరులో పొరపాటున డిలీట్ చేసిన post తిరిగి పొందడం

కష్టమైన పనిని సులభం చేసారే!  మాజిక్ లా ఉంది కాని జిమ్మిక్ కాదు. మరిన్ని మాజిక్ ల కొసం ఎదురు చూస్తూ...


http://namanasucheppindi.blogspot.com/2011/06/post.html

ఆదివారం, డిసెంబర్ 25, 2011

హైదరాబాదు పుస్తక ప్రదర్శన 2011 -1



ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరమూ హైదరాబాదు పుస్తక ప్రదర్శన ఘనంగా ప్రారంభమయ్యింది. తొలిరోజుల ప్రదర్శన గురించి  నేను వ్రాద్దామనుకున్నా, ముందే నిర్ణయించబడిన  Bird Watchers Society of Andhra Pradesh  వారి అస్సాం వన్యమృగ జాతీయ ఉద్యానవనాల  పర్యటన లో పాల్గొన ఉండవలసి రావటంతో, వ్రాయలేకపోయాను. శనివారం 24 డిశంబర్ రోజున ప్రదర్శనకు వెళ్ళే వీలయ్యింది. ఈ రోజు ప్రదర్శన శాలలో విశేషాలు  చెప్తాను.

నేను ప్రదర్శన శాల చేరే సరికి మధ్యాహ్నం 2 గంటలయ్యింది. అప్పటికే పుస్తకాల దుకాణాలలో సందర్శకులు నిండి ఉన్నారు.  ప్రదర్శన విజయవంతమయ్యిందనటానికి ఇది ఒక దాఖలా. ప్రతివారి చేతిలో కనీసం రెండో, మూడో పుస్తకాలు కనిపించాయి. ఎప్పటివలే మన  e-telugu.org వారి అంగడి ప్రవేశద్వారం పక్కనే కనిపించింది. హైదరాబాదు పుస్తక ప్రదర్శన  ఈసారి చాలా ఆహ్లాదకరంగా  కనిపించింది. ఆకుపచ్చని కార్పెట్ పరచడం వల్ల దుమ్ము లేవకుండా శుభ్రంగా ఉంది.




లేఖిని మహిళా రచయిత్రులంతా కలిసి (డి.కామేశ్వరి, అబ్బూరి  ఛాయాదేవి, వారణాసి నాగలక్ష్మి, మంథా భానుమతి,KB లక్ష్మి ,ఇంద్రగంటి జానకీ బాల,తురగా జానకీ రాణి,వాసా ప్రభావతి,శైలజా మిత్ర,శ్రీవల్లి రాధిక,పొత్తూరి విజయలక్ష్మి ,ఉంగుటూరి శ్రీలక్ష్మి) పుస్తక ప్రదర్శన లో తమ రచనలని (నవలలూ,కథా సంపుటాలూ) దుకాణం సంఖ్య:156 మరియు157 లో అమ్మకం  కోసం పెట్టారు (గణేష్ అనే పంపిణీదారుడు ద్వారా). సామాన్యంగా పుస్తకాల దుకాణాలలో ప్రదర్శన  ఒకే మోస్తరుగా గా ఉండి, ప్రాచుర్యమైన రచయితల  పుస్తకాలు మాత్రమే కనిపించేలా ఉంటాయి. 



ఇక్కడ లేఖిని రచయిత్రుల పుస్తకాలు బాగా కనిపించేలా పెట్టారు. రచయిత్రుల పుస్తకాలు విశాలాంధ్ర,నవోదయ ,ప్రజాశక్తి వంటి అంగళ్ళ లోనే కాకుండా లేఖిని పుస్తకాల దుకాణం  సంఖ్య:157 లో సులభంగా  లభిస్తున్నాయి.  
            
Click on photos to enlarge


ఉపన్యసిస్తున్న వారు-నాళేశ్వరం శంకరం ఇంకా ---, మొదలి నాగభూషణ శర్మ, శివారెడ్డి, శశికాంత్ శాతకర్ణి మరియు మహజబీన్

ఈ రోజు ప్రదర్శన శాలలో శశికాంత్ శాతకర్ణి వ్రాసిన  జ్వాలాపాతం (కవితలు) పుస్తకావిష్కరణ జరిగింది.  శశికాంత్ ప్రఖ్యాత రచయిత అవత్స సోమసుందర్ కుమారుడు.  మరో పుస్తకావిష్కరణలో ప్రజాశక్తి ప్రచురణల వారి ఆరు పుస్తకాల (కందుకూరి వీరేశలింగం- హాస్య సంజీవని, శ్రీ శ్రీ జయభేరి -తెలకపల్లి రవి, ప్లాస్టిక్ మనీ, నేటి సామ్రాజ్యవాదం, అమెరికా ప్రజల  చరిత్ర, ప్రాచీన ప్రపంచ చరిత్ర)   ఆవిష్కరణ జరిగింది.  చరిత్రకారుడు వకుళా భరణం రామకృష్ణ మాట్లాడుతూ   అమెరికా   చరిత్ర  తాను కళాశాలలో అప్పటికి లభ్యమయ్యే రచనల సహాయంతో చెప్పేవాడినని,  ఈ పుస్తకం అమెరికా ప్రజల  చరిత్ర  తనకు అప్పుడు లభ్యమయిఉంటే, తను వేరే దృక్పధంలో పిల్లలకు పాఠాలు చెప్పి ఉండేవాడినన్నారు. అమెరికా వలసవాద దోపిడీని ఈ పుస్తకం వివరించింది.  ఈ కార్యక్రమంలో రచయిత తెలకపల్లి రవి, ఆలి రాఫత్,  ప్రొ||సి.సుబ్బారావు, కవి శివారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.



పోయిన సంవత్సరం ప్రారంభించిన  kinige.com అప్పుడు మొగ్గలా ఉంటే ఇపుడు చెట్టయ్యింది. తెలుగు, ఆంగ్ల భాషలలో ఇప్పుడు పలు ఆసక్తికర  e- పుస్తకాలు లభ్యమవుతున్నాయి. దుకాణ వీక్షకుల అవగాహనకై  e-books గురించిన  దృశ్యమాలిక  ను ప్రదర్శించారు. ఆసక్తికరమైన Quiz నిర్వహించి కినిగె  బహుమతులనిచ్చారు. ప్రదర్శనశాలలో ఎక్కడ పుస్తకాలు కొన్నా ఆ రశీదు చూపెట్టినవారికి కూడా కినిగె పుస్తక బహుమతులిచ్చారు. e-books గురించిన పలు ప్రశ్నలకు కినిగె ప్రతినిధి రహమాన్ ఓపికగా, వివరంగా  జవాబిచ్చారు. కినిగె నిర్దేశకులు చావా కిరణ్ , అనిల్ అట్లూరి సందర్శకులకు కినిగె పని తీరు గురించి వివరించారు. e-books వలన ప్రపంచం లో ఎక్కడున్నా, మన అభిమాన పుస్తకాలు మన వెన్నంటే ఉంటాయి. తెలుగులో e-books పంపిణీకి ఆద్యులైన కినిగే కు అభినందనలు. కినిగె నిర్దేశకుడు  చావా కిరణ్ తొలి తెలుగు బ్లాగర్ కూడా అవటం మరో విశేషం.  

   మీరు Coffee Table Books  ప్రియులా? అయితే ఈ ప్రదర్శన మీకు పండగే. ఖరీదైన ఎన్నో కాఫీ బల్ల పుస్తకాలు  సరసమైన ధరకే లభ్యమవుతున్నాయి. 50 నుంచి  60%  దాకా తగ్గింపు ధరలో లభ్యమవుతున్నాయి. నేను చాలా పుస్తకాలు కొన్నాను. నేను కొన్న Coffee Table Books పుస్తకాలివి.
1)  An Indian Wildlife Photographers Diary: Sunlight & shadows -M.Y.Ghorpade 2) The Periyar Inheritance -Bittu Sehgal & Anish Andheria 3) A Celebration of Birds -Robert Dougall 4) Tales From The River: Brahmaputra -Tibet, India and Bangladesh -Tiziana & Gianni Baldizzone  బ్రహ్మపుత్ర నది కధ ఖరీదు రూ.2500/- ఐతే నేను 50% తగ్గింపులో రూ.1250/- కు కొన్నాను. 


పైన ఉదహరించిన మిగతా పుస్తకాలు  M.R.Book Centre, Hyderabad అంగడి లో కొన్నాను. ఇక్కడ కూడా మంచి మినహాయింపు  ధరలో పుస్తకాలు లభ్యం అవుతున్నాయి.  ఇవి కాక చాలా తెలుగు పుస్తకాలు కూడా కొన్నాను. జేబులో 100 రూపాయలుండగా ఇహ ఈ రోజుకి కొనటం ఆపాను. ఈ పుస్తక దాహం ఎన్నటికీ తీరనిది.



నేను ఈరోజు సందర్శించిన మరో దుకాణం  Stall No: 207.  Asian Educational Services. ఇక్కడ చాలా పురాతనమైన (100 నుంచి 700 సంవత్సరాల పాతవి కూడా)  పుస్తకాల పునర్ముద్రణలు చక్కటి అట్టతో లభ్యమవుతున్నాయి. కొన్ని ఉదాహరణలు దిగువన ఇస్తున్నాను.  
1) IBN Batuta: Travels in Asia and Africa  1325 to 1354
2) The Travels of Marcopolo: The Venetian  - John Masefield
3) Dawn in India: British Purpose and Indian Aspiration
4) A History of British India
5) The ABC of Indian Art
ఇక్కడ మతము, బౌద్ధ,  చరిత్ర, ఇస్లాము, సముద్ర యాత్రలు, ప్రయాణాలు -ఆవిష్కరణలు,గోవా,   పోర్చ్ గీస్ ఆసియా,  శ్రీలంక, విజయనగర సామ్రాజ్యం  వగైరా అంశాలపై పలు ప్రామాణిక పుస్తకాలున్నాయి.  మరిన్ని వివరాలకు వారి వెబ్సైట్ దర్శించవచ్చు.



Asian Educational Service పక్క స్టాల్ లో తమిళ్ సినిమా లపై  కాఫీబల్ల పుస్తకాలు లభ్యమవుతున్నాయి. ఇచ్చటనే Galatta Express అనే సినీ వారపత్రిక లభ్యం.  త్వరలో దీని హైదరాబాదు కూర్పు  కూడా లభ్యమవగలదని స్టాల్ నిర్వాహకులు చెప్పారు. ఈ మధ్య వెబ్సైట్లకు  సెన్సార్సింగ్ కావాలంటున్న   కపిల్ సిబాల్ భావాలను నిరసిస్తూ, www.swecha.org అనే సంస్థ వారు Freedom of Expression కావాలంటూ కరపత్రాలు పంచారు.  

ఎడమనుంచి కుడి వైపు: క్రాంతి కుమార్, దాట్ల శ్రీనివాసరాజు, కూర్చొన్న వారు:పవిత్రన్, కౌటిల్య, వీవెన్, నుంచొన్నవారు: నాగమురళి ఇంకా శంకర్
తెలుగు కు ఆధునిక హోదా అనే కొత్త ధ్యేయంతో  e-telugu కృషి చేస్తూ ఉంది.  ప్రముఖ ఐంద్ర జాలికుడు, హితవాది(Counsellor)  పట్టాభిరాం ఈ స్టాల్ ను దర్శించారు. ఇ-తెలుగు అంగడిని పలువురు కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ రోజు కార్యకర్తలు 1) కశ్యప్ 2) చక్రవర్తి 3) వీవెన్ 4) బ్రహ్మం కందుకూరి (http://kandukuri.wordpress.com) 5) క్రాంతికుమార్ (కలల బాటసారి కవితా పధం) 5) పవిత్రన్ 6) దాట్ల శ్రీనివాసరాజు (హరివిల్లు)   7) కౌటిల్య (విశ్వనాధుని కౌటిల్యుడు) 8) నాగమురళి ( మురళీగానం) 9) శంకర్ (అంచేత నే చెప్పొచ్చేదేమంటే).  స్టాల్ సందర్శుకుల సందేహాలను  ఇ-తెలుగు కార్యకర్తలు    నివృత్తి చేశారు.

కీ||శే స్టీవ్ జాబ్స్ విగ్రహావిష్కరణ

Picture courtesy: Wikipedia

ఆపిల్ కంప్యూటర్స్ అధినేత స్వర్గీయ స్టీవ్ జాబ్స్  విగ్రహావిష్కరణ ఇటీవలనే హంగరీ దేశపు, బుడాపెస్ట్  సైన్స్ పార్క్ లో జరిగింది. కంప్యూటర్ రంగం లో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికిన స్టీవ్ జాబ్స్ కు ఇది సరైన నివాళి.   స్టీవ్ జాబ్స్ చిత్రమాలికను ఇక్కడ చూడవచ్చు.


శుక్రవారం, డిసెంబర్ 09, 2011

భారత వికీ సమావేశం 2011

వికి సమావేశం భారత్ 2011: భాగం -5 

వికీ సాయంత్రపు పార్టీ లో పాల్గొన్న కొందరు తెలుగు బ్లాగర్లు  

ఈ సమావేశంలో ఎన్నో ఆసక్తికరమైన ఉపన్యాసాలు, చర్చలు జరిగాయి. నవంబర్ 18,19,20 భారత వికీపీడియన్‌లకు, ఇవి పర్వదినాలు. ఎంతగానో ఎదురుచూసిన ఈరోజులు రానేవచ్చేశాయి. ఈనాటి వరకు, ఎవరికి వారుగా వికీపీడియాకు ఎన్నోకూర్పులు చేసిన ఎందరో వికీపీడియన్లు ఒకరికొకరు కలిసుకోగలిగే, మాట్లాడగలిగే అవకాశం వచ్చింది. వందలకొద్ది వికీపీడియన్లు అందరూ భారతదేశ ఆర్ధికరాజధాని ముంబైలో కలుసుకున్నారు. అందరూ నిస్వార్దంగా, సేవే పరమోద్దేశంగా పనిచేస్తున్న కార్యకర్తలే. వాళ్ళుచేస్తున్న శ్రమకు ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా రాదు. అయినా అలుపెరుగకుండా కష్టపడుతున్నవాళ్ళే. పోనీ ఊసుపోక చేస్తున్నారా అంటే, అదీకాదు. అందరూ ఊపిరిసలపలేనంత పనుల్లో ఉన్నవాళ్ళే. వీరిలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఉన్నారు. రోజులో పట్టుమని 4 గంటలు సమయం నిద్రకి కేటాయించ లేనివాళ్ళూ ఉన్నారు. 10 నెలల్లో 10000 కూర్పులు చేసిన రాజశేఖర్‌గారి శ్రమను, దేనితో విలువకట్టగలం? ప్రొద్దున లేచిన దగ్గరనుండి, నిద్రపోయేవరకు రోగులకు సేవచేస్తూ, వీటికి ఎలా కూర్పులు చేయగలుగుతున్నారు? ఎంతో ధృడసంకల్పం ఉంటేకానీ అది సాధ్యం కాదు కదా! మరి రూపాయికూడా రాని ఈ పనిని వీళ్ళందరూ ఎందుకుచేస్తున్నారా అనుకుంటున్నారా?   మిగతా వ్యాసం ఇక్కడ చదవండి.

గురువారం, డిసెంబర్ 08, 2011

గైడ్ సినిమా తెర వెనుక కధ


 బాక్స్ ఆఫీస్ వద్ద విజయ దుందుభి మోగించిన గైడ్ చిత్రం పెక్కు విశేషాలను కలిగి ఉంది. ఈ చిత్రం లో నాయికగా నటించమని వహీదారెహమాన్ ను దేవానందే కాకుండా సత్యజిత్ రే కూడా అడగటం జరిగిందని కొందరు చెప్తారు. అయితే ఈ చిత్రం చిత్రీకరణ హక్కులను దేవానంద్ రచయిత ఆర్కె నారాయణ్ నుంచి ముందు పొందటం జరిగింది. ఈ చిత్రానికి అంకురార్పణే ఒక కధ. దేవ్, హం దొనో చిత్రం 1962 బెర్లిన్ చలనచిత్రోత్సవానికి, భారత దేశ అధికారిక చిత్రంగా ఎంపికయ్యింది. అక్కడే దేవానంద్ అమెరికా దర్శకుడు టాడ్ డేనియల్ (మాతృ దేశం పోలండ్ ) ను కలవటం జరిగింది. టాడ్, పెర్ల్ ఎస్ బక్ (నోబుల్ సాహిత్య గ్రహీత) ఆహ్వానం పై అమెరికా వెళ్లి వారితో వ్యాపార ఒప్పందం చేసుకొని గైడ్ చిత్రం లో నటించటానికి అంగీకరించాడు. గైడ్ చిత్రానికి ముగ్గురు దర్శకులు. మిగతా విశేషాలు ఇక్కడ చదవండి.

అస్లి-నక్లీ చిత్రం లోని ఒక మధురగీతం

ఈ మధ్యనే ప్రఖ్యాత నటుడు దేవానంద్ మరణించటం జరిగినా, అభిమానుల హృదయాలలో దేవ్ జీవించే ఉన్నాడు. దేవ్ పై ఎన్నో వ్యాసాలు వెలువడ్డాయి. దేవ్ ఉత్తమ చిత్రాలు, దేవ్ ఉత్తమ గీతాలు అంటూ కొన్ని చిట్టాలు కూడా వచ్చాయి. ఆశ్చర్యకరంగా నాకు ఎంతో నచ్చిన, అస్లి-నక్లీ (Asli -Naqli) చిత్రం లోని , తేరా మేరా ప్యార్ అమర్, ఫిర్ క్యోం లగ్తా హై డర్ పాట ఏ చిట్టా లో లేదు. ఈ పాట గతం లో మీరు చూడనట్లయితే ఇప్పుడు చూడండి. మీ గుండెల్లో కలకాలం నిలిచే పాట ఇది. సాధన అందమైన అభినయం, శంకర్ జైకిషన్ సంగీతం, శైలేంద్ర సాహిత్యం , లతా మంగేశ్కర్ శ్రావ్యమైన గొంతులో. ఈ చిత్రం 1962 లో విడుదలయ్యింది. సులభంగా మీరు పాడుగొనగలిగే పాట. చూస్తూ, మీరూ గొంతు కలపండి.