బుధవారం, డిసెంబర్ 28, 2011

బ్లాగులు- వ్యాఖ్యలు -13

  The Flight of birds in Kaziranga, Assam.  Photo: cbrao

దీప్తిధారలో బ్లాగులు- వ్యాఖ్యలు -12 ను మార్చ్ 30, 2011 న ప్రచురించాను.  వీటిని కొనసాగించటంలో, పలు కారణాల వలన  అలక్ష్యం జరిగింది.  ఈ శీర్షిక ను పునః ప్రారంభించే  అవకాశం కలిగినందుకు ప్రమోదం.   

నార్త్ కరోలినా లో ఉగాది సంబరాలు


"ఉగాది పచ్చడి సేవించడం తో మొదలు పెట్టి, " -ఉగాది మజా ఉగాది పచ్చడితోనే కదా ప్రారంభమయ్యేది.
"అల్పాహారం అధికంగా తింటున్న అప్పనం మెంబర్లు, " ఏమి వెరైటీ    హాస్యమండి బాబోయ్!
ఒక్క ఉగాది కవితా శ్రవణం తప్ప అంతా సజావుగానే ఉంది. అక్కడి తెలుగు వారిని కలిపిన తాతా వారికి అభినందనలు.



http://vulimiri.blogspot.com/2011/04/blog-post_14.html

ఉత్తుత్తమ కథలు

ఇండియా వచ్చి వెళ్లారా? మీరెలాంటి కధలు రావాలని కోరుకున్నారో లేక మీకు నచ్చిన కధల గురించిన వివరాలెంచేతో మీరివ్వలేదు. ఆ వివరాలతో ఈ వ్యాసానికి భాగం -2 వ్రాస్తే, ఈ వ్యాసానికి ముగింపు ఉంటుంది. అందాక ఇది అసంపూర్ణమే. వీలైతే, మీకు నచ్చిన వైవిధ్యమైన కధలతో ఒక సంపుటాన్ని ప్రచురించండి.


http://anilroyal.wordpress.com/2011/04/20/%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AE-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81/



నీటిపై చూపిన అద్భుత లేజర్ ప్రదర్శన....వీడియో

అద్భుతం.


http://meeandarikosam.blogspot.com/2011/04/blog-post_23.html



నా వాషింగ్టన్ డి.సి ట్రిప్ లో జరిగిన సంఘటన

"ఫోన్ దగ్గరకు వెళ్ళి ఒక క్వార్టర్ వేసి మా కజిన్ ఫోన్ నంబర్ డయల్ చెసాను. ‘ ప్లీజ్ చెక్ ద నంబర్ ’ అని కాయిన్ బయటకు వచ్చేసింది. "
"ఇక ఆలస్యం చేయక మా కజిన్ కి కలెక్ట్ కాల్ చేసి నా పేరు చెప్పాను. లక్కీ గా కజిన్ ఫోన్ తీసాడు."
ఫోన్ చేసిన మొదటిసారి ‘ ప్లీజ్ చెక్ ద నంబర్ ’ అని వస్తే,  కలెక్ట్ కాల్ లో ఎలా కనెక్ట్  అయ్యింది? అదే నంబర్ కదా చేసింది?  


http://muktalekha.blogspot.com/2011/04/blog-post.html


నామిని – నెంబర్ వన్ పుడింగి : పడుతూ లేస్తూ ఉన్న ఏనుగు కత


పుడింగ్ అంటే అన్నీ తెలిసినవాడు, అన్నీ వచ్చినవాడు, శక్తిమంతుడు అనే అర్థం తోస్తుంది. తనంత గొప్పోడు లేడనే నామినీ విశ్వాసమే  తనను  తాను  పుడింగ్ అనుకునేలా చేసిందేమో!  ఈ పుస్తక ముఖచిత్రం నామిని  ఆత్మస్థైర్యానికి  ప్రతిబింబం.

పుస్తక పరిచయం నిర్మొహమాటంగా, నిజాయితీగా ఉంది. జంపాల సమీక్షలు ఆసక్తిగా చదివిస్తాయి.


http://pustakam.net/?p=7097



ఇండియాలో ఓ చక్కటి ఆశ్రమాన్ని సూచిద్దురూ


You may consider attending Krishnamurti Foundation India's annual gatherings: In early winter every year, the Foundation holds a gathering at any one of its centres. The gathering is open to all, and its programme includes lectures, discussions and video screenings. Announcements about the gathering are made through the KFI Bulletin, the Vasanta Vihar Newsletter and the Mailing List.
Chennai centre (Head quarters) has got a guest house located amidst nature.So are other centres of India located in peaceful surroundings.
More info about Indian centres at
http://www.j-krishnamurti.org/kfiPage.html
http://www.j-krishnamurti.org/KRetreat.html
http://www.kfionline.org/studycentres/index.asp

In USA

http://www.peppertreeretreat.com/


http://sarath-kaalam.blogspot.com/2011/05/blog-post_18.html



సినిమాలు : మనవీ - వాళ్లవీ

తొలి సమీక్షలా అనిపించలేదు. బాగుంది.  మరిన్ని పుస్తకాలు పరిచయం చెయ్యండి. ఈ పుస్తకం ఇచ్చిన ప్రొత్సాహంతో సౌమ్య నుంచి ఇంకొన్ని అనువాదాలు ఆశించవచ్చా?


http://krishna-diary.blogspot.com/2011/06/blog-post_11.html

బ్లాగరులో పొరపాటున డిలీట్ చేసిన post తిరిగి పొందడం

కష్టమైన పనిని సులభం చేసారే!  మాజిక్ లా ఉంది కాని జిమ్మిక్ కాదు. మరిన్ని మాజిక్ ల కొసం ఎదురు చూస్తూ...


http://namanasucheppindi.blogspot.com/2011/06/post.html

ఆదివారం, డిసెంబర్ 25, 2011

హైదరాబాదు పుస్తక ప్రదర్శన 2011 -1



ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరమూ హైదరాబాదు పుస్తక ప్రదర్శన ఘనంగా ప్రారంభమయ్యింది. తొలిరోజుల ప్రదర్శన గురించి  నేను వ్రాద్దామనుకున్నా, ముందే నిర్ణయించబడిన  Bird Watchers Society of Andhra Pradesh  వారి అస్సాం వన్యమృగ జాతీయ ఉద్యానవనాల  పర్యటన లో పాల్గొన ఉండవలసి రావటంతో, వ్రాయలేకపోయాను. శనివారం 24 డిశంబర్ రోజున ప్రదర్శనకు వెళ్ళే వీలయ్యింది. ఈ రోజు ప్రదర్శన శాలలో విశేషాలు  చెప్తాను.

నేను ప్రదర్శన శాల చేరే సరికి మధ్యాహ్నం 2 గంటలయ్యింది. అప్పటికే పుస్తకాల దుకాణాలలో సందర్శకులు నిండి ఉన్నారు.  ప్రదర్శన విజయవంతమయ్యిందనటానికి ఇది ఒక దాఖలా. ప్రతివారి చేతిలో కనీసం రెండో, మూడో పుస్తకాలు కనిపించాయి. ఎప్పటివలే మన  e-telugu.org వారి అంగడి ప్రవేశద్వారం పక్కనే కనిపించింది. హైదరాబాదు పుస్తక ప్రదర్శన  ఈసారి చాలా ఆహ్లాదకరంగా  కనిపించింది. ఆకుపచ్చని కార్పెట్ పరచడం వల్ల దుమ్ము లేవకుండా శుభ్రంగా ఉంది.




లేఖిని మహిళా రచయిత్రులంతా కలిసి (డి.కామేశ్వరి, అబ్బూరి  ఛాయాదేవి, వారణాసి నాగలక్ష్మి, మంథా భానుమతి,KB లక్ష్మి ,ఇంద్రగంటి జానకీ బాల,తురగా జానకీ రాణి,వాసా ప్రభావతి,శైలజా మిత్ర,శ్రీవల్లి రాధిక,పొత్తూరి విజయలక్ష్మి ,ఉంగుటూరి శ్రీలక్ష్మి) పుస్తక ప్రదర్శన లో తమ రచనలని (నవలలూ,కథా సంపుటాలూ) దుకాణం సంఖ్య:156 మరియు157 లో అమ్మకం  కోసం పెట్టారు (గణేష్ అనే పంపిణీదారుడు ద్వారా). సామాన్యంగా పుస్తకాల దుకాణాలలో ప్రదర్శన  ఒకే మోస్తరుగా గా ఉండి, ప్రాచుర్యమైన రచయితల  పుస్తకాలు మాత్రమే కనిపించేలా ఉంటాయి. 



ఇక్కడ లేఖిని రచయిత్రుల పుస్తకాలు బాగా కనిపించేలా పెట్టారు. రచయిత్రుల పుస్తకాలు విశాలాంధ్ర,నవోదయ ,ప్రజాశక్తి వంటి అంగళ్ళ లోనే కాకుండా లేఖిని పుస్తకాల దుకాణం  సంఖ్య:157 లో సులభంగా  లభిస్తున్నాయి.  
            
Click on photos to enlarge


ఉపన్యసిస్తున్న వారు-నాళేశ్వరం శంకరం ఇంకా ---, మొదలి నాగభూషణ శర్మ, శివారెడ్డి, శశికాంత్ శాతకర్ణి మరియు మహజబీన్

ఈ రోజు ప్రదర్శన శాలలో శశికాంత్ శాతకర్ణి వ్రాసిన  జ్వాలాపాతం (కవితలు) పుస్తకావిష్కరణ జరిగింది.  శశికాంత్ ప్రఖ్యాత రచయిత అవత్స సోమసుందర్ కుమారుడు.  మరో పుస్తకావిష్కరణలో ప్రజాశక్తి ప్రచురణల వారి ఆరు పుస్తకాల (కందుకూరి వీరేశలింగం- హాస్య సంజీవని, శ్రీ శ్రీ జయభేరి -తెలకపల్లి రవి, ప్లాస్టిక్ మనీ, నేటి సామ్రాజ్యవాదం, అమెరికా ప్రజల  చరిత్ర, ప్రాచీన ప్రపంచ చరిత్ర)   ఆవిష్కరణ జరిగింది.  చరిత్రకారుడు వకుళా భరణం రామకృష్ణ మాట్లాడుతూ   అమెరికా   చరిత్ర  తాను కళాశాలలో అప్పటికి లభ్యమయ్యే రచనల సహాయంతో చెప్పేవాడినని,  ఈ పుస్తకం అమెరికా ప్రజల  చరిత్ర  తనకు అప్పుడు లభ్యమయిఉంటే, తను వేరే దృక్పధంలో పిల్లలకు పాఠాలు చెప్పి ఉండేవాడినన్నారు. అమెరికా వలసవాద దోపిడీని ఈ పుస్తకం వివరించింది.  ఈ కార్యక్రమంలో రచయిత తెలకపల్లి రవి, ఆలి రాఫత్,  ప్రొ||సి.సుబ్బారావు, కవి శివారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.



పోయిన సంవత్సరం ప్రారంభించిన  kinige.com అప్పుడు మొగ్గలా ఉంటే ఇపుడు చెట్టయ్యింది. తెలుగు, ఆంగ్ల భాషలలో ఇప్పుడు పలు ఆసక్తికర  e- పుస్తకాలు లభ్యమవుతున్నాయి. దుకాణ వీక్షకుల అవగాహనకై  e-books గురించిన  దృశ్యమాలిక  ను ప్రదర్శించారు. ఆసక్తికరమైన Quiz నిర్వహించి కినిగె  బహుమతులనిచ్చారు. ప్రదర్శనశాలలో ఎక్కడ పుస్తకాలు కొన్నా ఆ రశీదు చూపెట్టినవారికి కూడా కినిగె పుస్తక బహుమతులిచ్చారు. e-books గురించిన పలు ప్రశ్నలకు కినిగె ప్రతినిధి రహమాన్ ఓపికగా, వివరంగా  జవాబిచ్చారు. కినిగె నిర్దేశకులు చావా కిరణ్ , అనిల్ అట్లూరి సందర్శకులకు కినిగె పని తీరు గురించి వివరించారు. e-books వలన ప్రపంచం లో ఎక్కడున్నా, మన అభిమాన పుస్తకాలు మన వెన్నంటే ఉంటాయి. తెలుగులో e-books పంపిణీకి ఆద్యులైన కినిగే కు అభినందనలు. కినిగె నిర్దేశకుడు  చావా కిరణ్ తొలి తెలుగు బ్లాగర్ కూడా అవటం మరో విశేషం.  

   మీరు Coffee Table Books  ప్రియులా? అయితే ఈ ప్రదర్శన మీకు పండగే. ఖరీదైన ఎన్నో కాఫీ బల్ల పుస్తకాలు  సరసమైన ధరకే లభ్యమవుతున్నాయి. 50 నుంచి  60%  దాకా తగ్గింపు ధరలో లభ్యమవుతున్నాయి. నేను చాలా పుస్తకాలు కొన్నాను. నేను కొన్న Coffee Table Books పుస్తకాలివి.
1)  An Indian Wildlife Photographers Diary: Sunlight & shadows -M.Y.Ghorpade 2) The Periyar Inheritance -Bittu Sehgal & Anish Andheria 3) A Celebration of Birds -Robert Dougall 4) Tales From The River: Brahmaputra -Tibet, India and Bangladesh -Tiziana & Gianni Baldizzone  బ్రహ్మపుత్ర నది కధ ఖరీదు రూ.2500/- ఐతే నేను 50% తగ్గింపులో రూ.1250/- కు కొన్నాను. 


పైన ఉదహరించిన మిగతా పుస్తకాలు  M.R.Book Centre, Hyderabad అంగడి లో కొన్నాను. ఇక్కడ కూడా మంచి మినహాయింపు  ధరలో పుస్తకాలు లభ్యం అవుతున్నాయి.  ఇవి కాక చాలా తెలుగు పుస్తకాలు కూడా కొన్నాను. జేబులో 100 రూపాయలుండగా ఇహ ఈ రోజుకి కొనటం ఆపాను. ఈ పుస్తక దాహం ఎన్నటికీ తీరనిది.



నేను ఈరోజు సందర్శించిన మరో దుకాణం  Stall No: 207.  Asian Educational Services. ఇక్కడ చాలా పురాతనమైన (100 నుంచి 700 సంవత్సరాల పాతవి కూడా)  పుస్తకాల పునర్ముద్రణలు చక్కటి అట్టతో లభ్యమవుతున్నాయి. కొన్ని ఉదాహరణలు దిగువన ఇస్తున్నాను.  
1) IBN Batuta: Travels in Asia and Africa  1325 to 1354
2) The Travels of Marcopolo: The Venetian  - John Masefield
3) Dawn in India: British Purpose and Indian Aspiration
4) A History of British India
5) The ABC of Indian Art
ఇక్కడ మతము, బౌద్ధ,  చరిత్ర, ఇస్లాము, సముద్ర యాత్రలు, ప్రయాణాలు -ఆవిష్కరణలు,గోవా,   పోర్చ్ గీస్ ఆసియా,  శ్రీలంక, విజయనగర సామ్రాజ్యం  వగైరా అంశాలపై పలు ప్రామాణిక పుస్తకాలున్నాయి.  మరిన్ని వివరాలకు వారి వెబ్సైట్ దర్శించవచ్చు.



Asian Educational Service పక్క స్టాల్ లో తమిళ్ సినిమా లపై  కాఫీబల్ల పుస్తకాలు లభ్యమవుతున్నాయి. ఇచ్చటనే Galatta Express అనే సినీ వారపత్రిక లభ్యం.  త్వరలో దీని హైదరాబాదు కూర్పు  కూడా లభ్యమవగలదని స్టాల్ నిర్వాహకులు చెప్పారు. ఈ మధ్య వెబ్సైట్లకు  సెన్సార్సింగ్ కావాలంటున్న   కపిల్ సిబాల్ భావాలను నిరసిస్తూ, www.swecha.org అనే సంస్థ వారు Freedom of Expression కావాలంటూ కరపత్రాలు పంచారు.  

ఎడమనుంచి కుడి వైపు: క్రాంతి కుమార్, దాట్ల శ్రీనివాసరాజు, కూర్చొన్న వారు:పవిత్రన్, కౌటిల్య, వీవెన్, నుంచొన్నవారు: నాగమురళి ఇంకా శంకర్
తెలుగు కు ఆధునిక హోదా అనే కొత్త ధ్యేయంతో  e-telugu కృషి చేస్తూ ఉంది.  ప్రముఖ ఐంద్ర జాలికుడు, హితవాది(Counsellor)  పట్టాభిరాం ఈ స్టాల్ ను దర్శించారు. ఇ-తెలుగు అంగడిని పలువురు కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ రోజు కార్యకర్తలు 1) కశ్యప్ 2) చక్రవర్తి 3) వీవెన్ 4) బ్రహ్మం కందుకూరి (http://kandukuri.wordpress.com) 5) క్రాంతికుమార్ (కలల బాటసారి కవితా పధం) 5) పవిత్రన్ 6) దాట్ల శ్రీనివాసరాజు (హరివిల్లు)   7) కౌటిల్య (విశ్వనాధుని కౌటిల్యుడు) 8) నాగమురళి ( మురళీగానం) 9) శంకర్ (అంచేత నే చెప్పొచ్చేదేమంటే).  స్టాల్ సందర్శుకుల సందేహాలను  ఇ-తెలుగు కార్యకర్తలు    నివృత్తి చేశారు.

కీ||శే స్టీవ్ జాబ్స్ విగ్రహావిష్కరణ

Picture courtesy: Wikipedia

ఆపిల్ కంప్యూటర్స్ అధినేత స్వర్గీయ స్టీవ్ జాబ్స్  విగ్రహావిష్కరణ ఇటీవలనే హంగరీ దేశపు, బుడాపెస్ట్  సైన్స్ పార్క్ లో జరిగింది. కంప్యూటర్ రంగం లో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికిన స్టీవ్ జాబ్స్ కు ఇది సరైన నివాళి.   స్టీవ్ జాబ్స్ చిత్రమాలికను ఇక్కడ చూడవచ్చు.


శుక్రవారం, డిసెంబర్ 09, 2011

భారత వికీ సమావేశం 2011

వికి సమావేశం భారత్ 2011: భాగం -5 

వికీ సాయంత్రపు పార్టీ లో పాల్గొన్న కొందరు తెలుగు బ్లాగర్లు  

ఈ సమావేశంలో ఎన్నో ఆసక్తికరమైన ఉపన్యాసాలు, చర్చలు జరిగాయి. నవంబర్ 18,19,20 భారత వికీపీడియన్‌లకు, ఇవి పర్వదినాలు. ఎంతగానో ఎదురుచూసిన ఈరోజులు రానేవచ్చేశాయి. ఈనాటి వరకు, ఎవరికి వారుగా వికీపీడియాకు ఎన్నోకూర్పులు చేసిన ఎందరో వికీపీడియన్లు ఒకరికొకరు కలిసుకోగలిగే, మాట్లాడగలిగే అవకాశం వచ్చింది. వందలకొద్ది వికీపీడియన్లు అందరూ భారతదేశ ఆర్ధికరాజధాని ముంబైలో కలుసుకున్నారు. అందరూ నిస్వార్దంగా, సేవే పరమోద్దేశంగా పనిచేస్తున్న కార్యకర్తలే. వాళ్ళుచేస్తున్న శ్రమకు ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా రాదు. అయినా అలుపెరుగకుండా కష్టపడుతున్నవాళ్ళే. పోనీ ఊసుపోక చేస్తున్నారా అంటే, అదీకాదు. అందరూ ఊపిరిసలపలేనంత పనుల్లో ఉన్నవాళ్ళే. వీరిలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఉన్నారు. రోజులో పట్టుమని 4 గంటలు సమయం నిద్రకి కేటాయించ లేనివాళ్ళూ ఉన్నారు. 10 నెలల్లో 10000 కూర్పులు చేసిన రాజశేఖర్‌గారి శ్రమను, దేనితో విలువకట్టగలం? ప్రొద్దున లేచిన దగ్గరనుండి, నిద్రపోయేవరకు రోగులకు సేవచేస్తూ, వీటికి ఎలా కూర్పులు చేయగలుగుతున్నారు? ఎంతో ధృడసంకల్పం ఉంటేకానీ అది సాధ్యం కాదు కదా! మరి రూపాయికూడా రాని ఈ పనిని వీళ్ళందరూ ఎందుకుచేస్తున్నారా అనుకుంటున్నారా?   మిగతా వ్యాసం ఇక్కడ చదవండి.

గురువారం, డిసెంబర్ 08, 2011

గైడ్ సినిమా తెర వెనుక కధ


 బాక్స్ ఆఫీస్ వద్ద విజయ దుందుభి మోగించిన గైడ్ చిత్రం పెక్కు విశేషాలను కలిగి ఉంది. ఈ చిత్రం లో నాయికగా నటించమని వహీదారెహమాన్ ను దేవానందే కాకుండా సత్యజిత్ రే కూడా అడగటం జరిగిందని కొందరు చెప్తారు. అయితే ఈ చిత్రం చిత్రీకరణ హక్కులను దేవానంద్ రచయిత ఆర్కె నారాయణ్ నుంచి ముందు పొందటం జరిగింది. ఈ చిత్రానికి అంకురార్పణే ఒక కధ. దేవ్, హం దొనో చిత్రం 1962 బెర్లిన్ చలనచిత్రోత్సవానికి, భారత దేశ అధికారిక చిత్రంగా ఎంపికయ్యింది. అక్కడే దేవానంద్ అమెరికా దర్శకుడు టాడ్ డేనియల్ (మాతృ దేశం పోలండ్ ) ను కలవటం జరిగింది. టాడ్, పెర్ల్ ఎస్ బక్ (నోబుల్ సాహిత్య గ్రహీత) ఆహ్వానం పై అమెరికా వెళ్లి వారితో వ్యాపార ఒప్పందం చేసుకొని గైడ్ చిత్రం లో నటించటానికి అంగీకరించాడు. గైడ్ చిత్రానికి ముగ్గురు దర్శకులు. మిగతా విశేషాలు ఇక్కడ చదవండి.

అస్లి-నక్లీ చిత్రం లోని ఒక మధురగీతం

ఈ మధ్యనే ప్రఖ్యాత నటుడు దేవానంద్ మరణించటం జరిగినా, అభిమానుల హృదయాలలో దేవ్ జీవించే ఉన్నాడు. దేవ్ పై ఎన్నో వ్యాసాలు వెలువడ్డాయి. దేవ్ ఉత్తమ చిత్రాలు, దేవ్ ఉత్తమ గీతాలు అంటూ కొన్ని చిట్టాలు కూడా వచ్చాయి. ఆశ్చర్యకరంగా నాకు ఎంతో నచ్చిన, అస్లి-నక్లీ (Asli -Naqli) చిత్రం లోని , తేరా మేరా ప్యార్ అమర్, ఫిర్ క్యోం లగ్తా హై డర్ పాట ఏ చిట్టా లో లేదు. ఈ పాట గతం లో మీరు చూడనట్లయితే ఇప్పుడు చూడండి. మీ గుండెల్లో కలకాలం నిలిచే పాట ఇది. సాధన అందమైన అభినయం, శంకర్ జైకిషన్ సంగీతం, శైలేంద్ర సాహిత్యం , లతా మంగేశ్కర్ శ్రావ్యమైన గొంతులో. ఈ చిత్రం 1962 లో విడుదలయ్యింది. సులభంగా మీరు పాడుగొనగలిగే పాట. చూస్తూ, మీరూ గొంతు కలపండి. 

శనివారం, నవంబర్ 26, 2011

వికి-2011 సమావేశంలో తెలుగు ప్రతినిధి ఉపన్యాసం

 "Imagine a world in which every single person on the planet is given free access to the sum of all human knowledge. That’s our commitment." -Jimmy Wales, Founder of Wikipedia.

 వికి సమావేశం భారత్ 2011: భాగం -4

Convocation Hall, University of Mumbai
నవంబర్ 18, 2011 న వికి భారత్ సమావేశం ముంబాయి విశ్వవిద్యాలయంలో వికీపిడియా స్థాపకుడైన జిమ్మీ వేల్స్ (Chairman Emeritus, Wikimedia Foundation (October 2006–present)) ప్రారంభ ఉపన్యాసంతో   మొదలయ్యింది. తరువాత వివిధ విషయాలపై ఉపన్యాసాలు, చర్చలు జరిగాయి. ఏక కాలం లో విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ మంటపం,  గోష్టి  గదులలో  ఈ కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 4 గంటలకు  వివిధ భాషా ప్రతినిధులు వికీ లో వారి వారి భాషలలో వికీ వ్యాసాల యొక్క ప్రస్తుత    స్థితి  గతుల పై, అభివృద్ధి  తీరుతెన్నుల పై  ఉపన్యసించారు. వివిధ భాషా వక్తల  ప్రసంగాలను షిజు అలెక్స్, వికి మీడియా, ఢిల్లి తరఫున  పర్యవేక్షించారు. తెలుగు భాష వికి స్థితి పై సి.బి.రావు (భవదీయుడు) ఉపన్యసించారు. ఈ ఉపన్యాస పాఠాన్ని దిగువ ఇస్తున్నాను.  



cbrao talking about Status of Telugu Wikipedia. Standing next is Shiju Alex of Wikimedia foundation, Delhi.

 Status of Telugu Wikipedia

History:
Telugu is the language spoken by the highest number of speakers after Hindi in India. There are around 80 million speakers speaking in Telugu, which is called the Italian of the East for it’s sweet melodious rendering. All words in Telugu end with a vowel sound.
Venna Nagarjuna, is a creator of Padma software for transliteration. When Wilisamson, one of the managers of Wikipedia proposed that they will create Telugu wikipedia if  Nagarjuna is interested in promoting and improving it, Nagarjuna accepted the challenge. Thus born Telugu wikipedia on 9th December 2003. Nagarjuna apart from starting Telugu wiki also created the logo for it.

Telugu wiki evolved gradually over the years. Rao Vemuri, Vaka Kiran of Silicon Valley, Katta Murthy of Michigan and Chava Kiran from Hyderabad laid the the foundation for Telugu wiki articles. Latter Viza Satya from Minnesota. USA, Pradeep from Bengaluru, Chaduvari and Veeven from Hyderabad improved it to the next stage. At present many new people have joined Telugu wiki and made it rich with several informative and interesting articles.

Current status: It is constantly evolving with technical help of Veeven, Kolichala Suresh, I.Padma and Nallamothu Sridhar. Telugu wiki is vibrant with frequent visitors mostly referred by google.com and independent visitors. We have around 23 lakhs 8 thousand 3 page views per month as on October 2011 I.e 53 page views for every minute. There are around 49,722 articles with yearly growth of 7%. Telugu wiki has got 22166 registered users who contribute and give suggestions. We are having 32 editors who are active and 16 managers.

Telugu Wikipedia at a glance October 2011  
















Promotion of Telugu in electronics and media: Telugu is clearly seen in I phones where as there are some teething problems in Android based phones, which we are trying to rectify using Naveena software. Telugu is widely used in blogs and some of these bloggers are wikipedians too.

Telugu wiki projects: We are having Wiki Books, Wiki source and Wiktionary (Dictionary of articles on words) and Wiki quote. In wiki source we have 7158 articles of literary value.

Wiki community:
Wikipedia is being promoted by e-Telugu organization in Andhra Pradesh. It is conducting workshops for enthusiasts to teach techniques of writing for wikipedia. It is also conducting one day marathons for wikipedians to do more edits and updates to wiki articles. E-telugu proposes to conduct many more workshops in 2012 for further propagation of Wikipedia. I am glad to inform you that I am the vice president of the organization e-telugu. I thank Arjuna Rao Chavala, president, wikimedia India chapter for helping us in conducting Wiki workshops in Andhra Pradesh. Articles about Telugu wikipedia are published in Telugu media, which is attracting new talent to Telugu Wiki and this process will continue in future to attract more talented persons. We are making use of electronic media also such as TV for promoting blogs and Wikipedia in Telugu. This will help for the growth of Wikipedia in future.

Photos & Text: cbrao


(సశేషం)

శుక్రవారం, నవంబర్ 25, 2011

Run Android apps on Windows



 స్మార్ట్ ఫోన్ల కోసం ప్రస్తుతం మార్కెట్లో చాలా ఆండ్రాయిడ్  ఆప్లికేషన్స్ లభ్యమవుతున్నాయి. అయితే ముందుగా వీటిని విండోస్ లో పరీక్షించి, నచ్చితేనే, మన ఫోన్లలోకి దిగుమతి చేసుకోవటం అభిలషణీయం. విండోస్ లో ఎలా పరిక్షించాలో తెలిపే వ్యాసం ఇక్కడ  చూడండి.

గురువారం, నవంబర్ 24, 2011

ఈనాడులో వికీపీడియా సదస్సు విశేషాలు

వికి సమావేశం భారత్ 2011: భాగం -3

ముంబాయి విశ్వవిద్యాలయంలో జరిగిన మొదటి రోజు వికి సమావేశ విశేషాలు. 




19-11-2011  ఈనాడు, మహారాష్ట్ర సౌజన్యంతో.

(సశేషం)

బుధవారం, నవంబర్ 23, 2011

వికీ మీడియా సదస్సులో తెలుగు ప్రతినిధులు

వికి సమావేశం భారత్ 2011: భాగం -2

వికీ సమావేశానికి  హైదరాబాదు, బెంగలూరు, ముంబయి, ఆస్ట్రేలియా  వగైరా ప్రాంతాలు, దేశం నుంచి తెలుగు ప్రతినిధులు వచ్చారు. వీరిలో శ్రీయుతులు అర్జునరావు చావల (President, Wikimedia Chapter, Bengaluru), రహ్మానుద్దీన్ షేక్ (Hyderabad - Software engineer)  తప్ప  మిగతావారంతా ముంబాయిలో పరిచయం అయ్యిన వారే. వీరంతా (కొద్దిమందిని మినహాయించి)  వికిపీడియా కు క్రమంగా వ్రాస్తూ, edits చేస్తూ ఉన్నవారే. వీరిని కలవటం ప్రమోదం.

ఈ సదస్సులో నాకు పరిచయమైన తెలుగువారు.
హైదరాబాదు నుంచి
1) జగదీష్ (మాతృ భాష కన్నడ అయినా తెలుగు చక్కగా మాట్లాడతారు - Faculty, Business Management)
2) గవర్రాజు రామమోహన్ రాజు
3) సోమశేఖర్ (Student of film direction)
4) అఖిల్ కరణం (Student of film making, freelance writer and web designer)  

ముంబాయ్ నుంచి
5) అక్షయ్ కోడూరి (Student of B.Arch)

బెంగలూరు నుంచి
6)నవీన్ పి
7)రాధాకృష్ణ అరవపల్లి

ఆస్ట్రేలియా  నుంచి
8) రణధీర్ రెడ్డి  (Oracle Apps consultant)  

సాక్షి దిన పత్రికలో వికీ సదస్సు గురించిన వార్త కింద చూడవచ్చు.
 
Click on image to enlarge



ఛాయాచిత్రంలో ఎడమనుండి కుడి వైపు: శ్రీయుతులు రణధీర్ రెడ్డి, సి.బి.రావు, రహ్మానుద్దీన్ షేక్,అర్జునరావు చావల ఇంకా జగదీష్

20 11 2011 సాక్షి దినపత్రిక, మహారాష్ట్ర  కూర్పు  సౌజన్యంతో  


(సశేషం)

వికి సమావేశం భారత్ 2011: భాగం -1

భారతదేశ నేపధ్యంలో, వికీపీడియా, వికిమీడియా ల ఆధ్వర్యంలో, అఖిల భారత వికీ సమావేశాలు మొదటిసారి, ముంబాయి నగరంలో 18 నవంబర్ నుంచి 20 నవంబర్ దాక ప్రతిష్టాత్మికంగా జరిగాయి . ఇహ ఇవి ప్రతి సంవత్సరమూ జరిగేలా ప్రణాళికలు వేస్తున్నారు. భారతదేశ, విదేశ వికీ కార్యకర్తల మధ్య సమన్వయం కోసం, వికీ నిర్వహణ లో, వికీ వ్యాసాల సంపాదకత్వ పద్ధతులు వగైరాల పై పలు చర్చా కార్యక్రమాలు జరిగాయి. పలు దేశాల ప్రతినిధులు ఈ సమావేశాలలో పాల్గొన్నప్పటికీ, భారతదేశ విషయాలపై, ఆంగ్ల, భారతీయ భాషల పై సమీక్షకు వికీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వికీమీడియా ఛాప్టర్ (ఇండియా) భాగస్వామ్యంతో, ముంబాయి వికీపీడియన్లు నిర్వహించిన ఈ సమావేశం, భవిష్యత్ సమావేశాలకు మార్గదర్శకంగా నిలిచేలా, విజయవంతంగా జరిగింది. 

ఈ సమావేశాలకు పలు ఇతర భాషా వికీ ప్రతినిధులతో పాటు, తెలుగు వికీలు కూడా హైదరాబాదు, బెంగలూరు, ముంబాయి వగైరా ప్రదేశాల నుంచి వచ్చారు. ఈ సమావేశ విశేషాలను వివరించే ఈ వ్యాసం, హిందీ, మలయాళ, మరాఠి వగైరా భాషా ప్రతినిధులు వారి విజయాలను వెళ్లడించినప్పటికీ, తెలుగు దృక్పధం ఎక్కువగా గోచరించేలా వుంటుంది. 

మొదటగా ఈ సమావేశాల గురించి, 19 నవంబరు సాక్షి దినపత్రిక లో వచ్చిన వార్త దిగువ చదవవొచ్చు. 

Click on image to enlarge

 19-11-2011  సాక్షి దిన పత్రిక సౌజన్యంతో

(సశేషం)

మంగళవారం, అక్టోబర్ 25, 2011

అబ్రకదబ్ర! శూన్యంలోంచి సృష్టి

శూన్యం నుంచి ఏదీ రాదు. కాని ఈ కింది వీడియో చూడండి. ఈ ఇంద్రజాలకుడి హస్తలాఘవం గమనించండి. శూన్యం నుంచి ఎలా పేక ముక్కలు సృష్టిస్తున్నాడో! గమ్మత్తుగా లేదూ!

మంగళవారం, ఆగస్టు 30, 2011

స్టాక్ మార్కెట్ల లో ఆటు పోట్లు

స్టాక్ మార్కెట్లు అతిగా అమ్ముడు పోయిన స్థితి నుంచి మెరుగుపర్చుకొందుకై, వచ్చిన ప్రస్తుత రాలీ నిలుస్తుందా? నిలుస్తే ఎన్నాళ్లు? నిఫ్టీ 5225 తాకితే వచ్చే తీవ్ర ప్రతిఘటన వల్ల మార్కెట్లు దక్షిణ పధంగా 4800 కు దిగువగా పయనించవచ్చని నిపుణుల అంచనా. స్టాక్ మార్కెట్లు 2008 లో లాగా మరో సారి పడే అవకాశం ఉందా? మార్కెట్ విశ్లేషకులు అవుననే అంటున్నారు. యూరప్, అమెరికా ల నిరంతరం పెరుగుతున్న అప్పులు, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగానికి, వినిమయ వస్తువుల గిరాకీ తగ్గటానికి కారణభూతమవగలదని అంచనా. BSE Sensex 14000 కు సమీప భవిష్యత్ లోనే రాగలదని అంచనా వేస్తున్నారు. బ్లూ చిప్స్ కొనుగోలుకు ఇది ఒక మంచి తరుణ మవగలదు. ఈ ఆర్థిక మాంద్యం 6 నుంచి -12 నెలల దాకా ఉండవచ్చంటున్నారు. పాశ్చాత్యా దేశాల ఆర్థిక పరిస్థితిలో అభివృద్ధి లేకున్నా, డాలర్ పడి పోయినా, బాంకులు దివాళా ఎత్తినా, BSE Sensex 2008 స్థాయికి 8000 వరకు పడవచ్చని మరో విశ్లేషణ. భారత దేశ పారిశ్రామికాభివృద్ధి మెరుగు పడినా, విదేశీ మదుపుదారులు, భారత మార్కెట్ల నుండి నిష్క్రమించటం వలన ఇలాంటి పరిస్థితి ఉత్పన్న మవగలదు. స్టాక్ మార్కెట్ల తీరు తెన్నుల పై సాంకేతిక విశ్లేషణకై ఈ వీడియో చూడండి. మదుపరుదారులు జాగరూకతో వ్యవహరించవలసి ఉంటుంది. మీ పెట్టుబడుల విషయం పై నిపుణుల సలహా తీసుకోండి.

గురువారం, ఆగస్టు 18, 2011

పుస్తక పరిచయం: అమెరికా ఇల్లాలి ముచ్చట్లు

వ్రాసినవారు: వెనిగళ్ళ కోమల


శ్యామలాదేవి దశిక రచన అమెరికా ఇల్లాలి ముచ్చట్లు బాపు అర్థవంతమైన, ముచ్చటైన బొమ్మ ముఖచిత్రంగా, రచయిత్రి  శ్రీమతి చెరుకూరి రమాదేవి ప్రశంసాపూర్వక వ్యాఖ్యానంతో చూడ ముచ్చటగా తయారయింది. ఇందులో ఎన్నో వూసులు 21 భాగాలుగా గుదిగుచ్చి, 13 కథలు జోడించి, బోల్డ్ ప్రింటుతో చూడగానే చదవాలనిపించేటట్లు ప్రచురించారీపుస్తకాన్ని.

పురాణం ఇల్లాలి ముచ్చట్లు తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు శ్యామలాదేవి. కథా వస్తువు 30, 40 ఏళ్ళనాడు అమెరికా వచ్చిన స్త్రీల అనుభవాలు, వారి జీవన శైలి. చక్కని వాడుక భాషలో, సందర్భానుసారంగా సామెతలు జొప్పిస్తూ, హాస్యరసోపేతంగా ఉన్న వాస్తవాలను చక్కగా చిత్రించారు. సంభాషణలో భార్య, భర్తల మధ్య ఉన్నట్లున్నా భర్త తెరవెనుకే ఉన్నారు.గొప్ప చదువులు చదివి, అమెరికాలో ఉద్యోగాలు సంపాదించి, తక్కువ చదువులు వున్న మధ్య తరగతి అమ్మాయిలను వివాహమాడి వారితో అమెరికాలో మనుగడ సాగించిన వ్యక్తులే ఇందులో పాత్రధారులు. 30, 40 ఏళ్లనాడు శ్యామలాదేవి టీనేజరుగా భర్త రామకృష్ణగారితో జీవితం పంచుకోవటానికి అమెరికాలో అడుగు పెట్టారు. తాను విన్నవీ, కన్నవీ, అనుభవించినవీ, సాధించినవీ ఇందులో అక్షరబద్ధం చేశారు.

పల్లెటూరి పెళ్ళాలుగా వచ్చినా అవకాశాలు అందిపుచ్చుకుని, చదువులు సాగించి, ఉద్యోగాలు చేసి, పిల్లలను ఎవరి ఆసరా లేకుండా పెంచుకొన్న మట్టి బొమ్మలు, బంగారు బొమ్మల్లాగా జీవితంలో రాణించిన ఆడవారి ముచ్చట్లే యివన్నీ. భర్తలు ఉద్యోగాలకు అంకితం అవటం వలన ఇంటి బాధ్యతతో, ఉద్యోగాలతో, పిల్లల ఆలనా, పాలనా, ఆటా, పాటా, చదువూ సంధ్యా, వారి పెళ్ళిళ్ళు అన్నిటిలో అందెవేసిన చేయయిన ఆనాటి తెలుగు అమ్మాయిలు రాణించిన తీరు, అలాంటి వారంటే రచయిత్రికి గౌరవభావం ఉండటం ఇందులో చూస్తాం.

ఇక ముచ్చట్ల కొద్దాం.
పుట్టినరోజు కానుకగా, భర్త చక్కని హ్యాండ్ బ్యాగ్ కొనిస్తే మురిసిపోయి, తన వస్తువులు – అలంకరణ సామగ్రీ అందులో అమర్చుకోవచ్చని తలపోసిన ఇల్లాలికి అనతి కాలంలోనే దాని ఉపయోగం మరోరకంగా ఉండి బస్తా బరువు మోస్తున్నట్లు అయింది. ప్రయాణంలో భర్త యిచ్చిన రూట్ మ్యాప్ కట్టలు, సిగరెట్లు, పర్సు వగైరా, చిన్న పిల్లలకు ప్రయాణం విసుగు పుట్టకుండా ఉండాలి గనుక వారి బిస్కట్లు, కేండీలు, బొమ్మలు పుస్తకాలు అన్నీ ఆ బ్యాగ్ లోనే ఇమడాలి. దూరదేశాల ప్రయాణమైతే పాస్ పోర్టులు, డాలరు బిళ్ళలూ, సమస్తం అందులోనే. మధ్య మధ్య ‘బాగ్ జాగ్రత్త’ అని భర్త హెచ్చరికలతో ప్రశాంతత కరువై బస్తా మోస్తున్న ఫీలింగే.

మగవాళ్ళ మతిమరుపు చూస్తూంటే కోపం జాలి రెండూ కలుగుతాయి. భర్త ఫోనులో మాట్లాడుతూ చేయి అడ్డంపెట్టి “వాడి పేరేమిటి? దానికి పిల్లలెంతమంది? మా చెల్లెలు మొగుడి పేరేంటి?” అని అడుగుతుంటే అన్నీ తామే గుర్తుపెట్టుకోవాలన్నమాట అని విసుక్కున్న సందర్భాలు అనేకం. బ్రహ్మదేవుడు మగవారిని సృష్టించేటప్పుడు జ్ఞాపకశక్తి ఇమడ్చడం మర్చిపోతే సరస్వతీ దేవి గుర్తు చేసిందిట. ఇక మగవారి జ్ఞాపకశక్తిని కూడా అడవాళ్ళ ముఖానే రాసి ఆ మగాళ్ళను పెళ్ళి చేసుకుని మీ తిప్పలు మీరు పడండన్నాడట. ఉద్యోగాలకే అంకితమై ఇంటి విషయాలు పట్టించుకోని మగమహారాజులూ ఉన్నారు. అన్ని కుస్తీలు భార్యలే పట్టాలి. తమ పిల్లల పేర్లూ, వయసులు, చదివే క్లాసులు అడిగితే తడుముకునే వాళ్ళు లేకపోలేదు. ప్రతి దానికి మరచిపోయాను అని తప్పించుకుంటారు.

తెలుగు భాషనూ, సంస్కృతినీ, సంప్రదాయాలనూ ఉద్ధరిస్తామంటూ సంఘాలు పెట్టి స్టేజ్ ఎక్కి ఇంగ్లీషులో ఉపన్యాసాలు దంచుతారు. పైగా పిల్లలకు బొత్తిగా తెలుగు రావట్లేదని చింతిస్తారు. ‘మీరొక్క చేయివేస్తే చాలునోయ్’ అంటూ ఆడవారిని ఉబ్బేసినా, చివరికి పనిభారమంతా వాళ్ళ మీదే పడుతుంది. ఈ మగాళ్ళకు టిఫిన్లు చేసి అందించటం, పిల్లల్ని సముదాయించటం, వారితో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రాక్టీసు చేయించటంతో ఉక్కిరిబిక్కిరి అవుతారు ఆడవాళ్ళు. ఆడపనీ, మొగపనీ అనీ తేడాలేకుండా ఇన్ని బాధ్యతలు  నిర్వహించే  ఈ ఆడవారు ‘ఆల్ ఇన్ వన్’ లే గాక ఆ సమాజంలో ఇముడుతూ కూడా తెలుగు తనానికి సంస్కృతికి ప్రతీకలు. అమెరికాలో తెలుగుతనం, సంస్కృతి, సంప్రదాయాలు పచ్చగా కొనసాగటం వారి వల్లనే అంటారు రచయిత్రి.

మగవారికి ఇన్ని చురకలు పుష్కలంగా వడ్డించిన రచయిత్రి వారికి చెందవలసిన క్రెడిట్, గౌరవం, మర్యాదా, మన్ననా ఎంతో సౌహార్ద్రంగా ‘క్రీమ్ ఆఫ్ ది క్రాప్’లో అందచేశారు. మగవారు ఉన్నత విద్యనభ్యసించి, పెద్ద ఉద్యోగాలు చేస్తూ మారు మూల ప్రదేశాలలో సాధారణ చదువులు చదివిన అమ్మాయిలను పెండ్లి చేసుకుని (కారణాలు ఏమైనా) అమెరికా తీసుకువచ్చారు. ప్రపంచాన్ని చూపించారు. చదువుకోవటానికీ, ఉద్యోగాలు చేయటానికీ, మంచి భార్యగా, గృహిణిగా, తల్లిగా రాణించటానికి ఉన్న అవకాశాలన్నీ అందిపుచ్చుకోనిచ్చారు. సమర్థవంతులు స్వశక్తితో బాధ్యతలు నిర్వహించగలిగేలా చేశారు. అలాంటి మగవాళ్ళందరికీ వందనాలంటారు రచయిత్రి.

తెలుగు టి.వి. ముచ్చట్లు చెపుతూ మనల్ని కడుపుబ్బ నవ్విస్తారు. తెలుగు రాని యాంకర్లు ‘వెరీగుడ్డండీ, ఓకేనాండీ, ఓలుక్కేద్దామండీ’ అంటూ బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడామనుకుంటుంటే మనకి టి.వి. కట్టేయాలనిపిస్తుంది. వంటల కార్యక్రమంలో యాంకరు స్వీటు తయారీలో చివరిగా ‘ఎలకల పొడి’ కలిపితే మంచి ఫ్లేవరు ఉంటుందంటుంటే ఫ్లేవరు సంగతి దేవుడెరుగు, అది తింటే ఠపీమని చావటం ఖాయం అంటారు రచయిత్రి. భక్తి కార్యక్రమం ఉదయాన్నే నిర్వహిస్తారు. ఆ టైములో గృహిణికి గుక్క తిప్పుకోకునే తీరికే ఉండదు – ఇక ఆ కార్యక్రమం చూసేదెలా?తెలుగు సంఘాల పేరుతో జరిగే అవకతవకలు, దుబారాలు రచయిత్రి దృష్టినుండితప్పించుకోలేదు. న్యూజెర్సీలో కళాసమితి వారి కృషిని కొనియాడారు సంధ్య కేరక్టరు ద్వారా.

అమెరికాలో పిల్లల చదువుల ముచ్చట్లు చెపుతూ ఆమె చిన్ననాటి బడి, పంతులుగారు, చదువు – గుణింతాలు, ఎక్కాలూ బృందగానంతో వల్లించటం, తప్పు చేస్తే కేన్ దెబ్బలూ, గోడ కుర్చీలూ, కోదండాలు గుర్తుచేసుకుంటారు. వర్షం కురిస్తే బడికి పోనక్కరలేదు. కాగితం పడవలాట, చింతపిక్కలాట, వామనగుంటలాట ఆడుకోవటం మురిపెంగా తలుచుకుంటారు. ఆ జ్ఞాపకాలు ‘పారిజాత పరిమళం’ లాగా మదిని సృజిస్తుందంటారు. అమెరికాలో మంచి బడులున్నా, శ్రద్ధగా బోధించే టీచర్లున్నా, కార్లలో స్కూలుకి దించి, తీసుకువచ్చే తల్లిదండ్రులున్నా బడి అన్నా, టీచరన్నా ఇష్టం లేదంటూ బ్యాగ్ విసిరేసి వీరంగం ఆడే పిల్లల్ని చూసి, అలాంటివారిని తమ ఊళ్ళో బడికి పంపిస్తే చదువు బాగా వస్తుందని చమత్కరిస్తారు.

అమెరికాలో మనవల్ని పెంచటానికి ఈ రోజుల్లో  అమ్మ, నాయనమ్మలూ, తాతయ్యలూ ఇండియా నుండి దిగటం పరిపాటి అయింది. కాని ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులను చెరొకసారి రమ్మంటున్నారట, అటు ఖర్చు, ఇటు టైము కలిసివస్తుందని అలా చేస్తున్నారట.

‘జంటగా ఎన్నో ఏళ్ళుగా మోస్తున్న బరువు బాధ్యతల్ని అప్పుడప్పుడే దించుకుంటూ, స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటున్న తరుణంలో హఠాత్తుగా జీవిత భాగస్వామిని కోల్పోయిన ఆత్మీయులకు అంకితం’ అంటూ అన్నపూర్ణ, శేఖర్ ల కథ ‘ప్రేమానురాగం’లో రచయిత్రి స్పందించిన తీరు కంటతడి పెట్టిస్తుంది.

ఇక చివరగా ‘ఇండియా అంతా అమెరికా మయం’ అంటూ ఇండియా విజిట్ కి వచ్చినప్పటి తమ అనుభవాలు నెమరువేస్తారు. బంధువుల యిళ్ళకు వెళితే అక్కడి సీను అలవోకగా వర్ణిస్తారు. ఒక దంపతులు అమెరికాలోని పిల్లలతో ‘ఛాట్’ చేస్తూ బిజీగా ఉండి తరువాత వీరిని పట్టించుకుంటారు. ఇంకొక దంపతులు ఫోనులో అమెరికాలో ఉన్నవారితో మాట్లాడుతూ బిజీ, మరో యింట్లో అమెరికా నుండి పిల్లలు వస్తున్నారని ఏర్పాట్లు పెళ్ళి సందడిని మరిపిస్తారు. మరో వృద్ధదంపతులను పలకరిద్దామని వెళితే వారు అమెరికాలో తమ మనవడి ఉద్యోగ విజయాలూ, అతనికి ఇండియా రూపాయల్లో లెక్కగట్టి వచ్చే జీతం గురించి ఏకరువు పెడతారు. అలా ఎవరింటికెళ్ళినా అంతా అమెరికా మయంగా ఉంటుంది. ఆఖరికి టైలర్ వద్ద బట్టలు కుట్టమని వెడితే, ‘నాదంతా ఎన్.ఆర్.ఐ. బిజినెస్ వారంలో కుట్టమంటే తీరుబడిలేదు. ఇప్పుడిచ్చి వెళ్ళండి. మరో ట్రిప్పులో కలెక్ట్ చేసుకోండి’ అన్నాడట. రచయిత్రి తల్లి దగ్గర పనిచేసే ఆదెమ్మ కూడా అమెరికా జపమే చేస్తుంది. తనతో అమెరికా తీసుకెళితే నాలుగిళ్ళలో పనిచేసి సంపాయించుకుని ఇండియా వచ్చి కంప్యూటర్ బాబు లు   లాగా మంచి యిల్లు కొనుక్కుంటానమ్మా అంటుంది.

ఇవన్నీ మచ్చుకి ముచ్చట్లే. అసలు ‘అమెరికా ఇల్లాలి ముచ్చట్లు’ చదివితే మీకే తెలుస్తుంది – ఎంత ఆనందం కలుగుతుందో, ఎన్ని విషయాలు నేర్చుకున్నామా అని. శ్యామలాదేవి కలం నుండి మరెన్నో చక్కటి రచనలు జాలువారాలని అకాంక్షిస్తున్నాను. 

ప్రచురణ – వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
తొలి ప్రచురణ: 2010
1/8 డెమి ఆకారం, పేజీలు:139
ధర: $ 20  రూ.100/-
అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో లభించును.