'గీతాంజలి'
, 'గీతా సారం' పుస్తకాల రచయిత గీతాంజలి మూర్తి గారు ఆంధ్రా పారిస్ గా
పిలువబడే తెనాలి పట్టణం తో తమకు గల అనుబంధాన్ని వివరిస్తున్నారు. వారి
మాటలలో ఈ వ్యాసాన్ని చదువగలరు. -సి.బి.రావు.
తెనాలి తల్లితో నాకున్నది 'కన్నతల్లి పేగుబంధం' వంటిదే
అంటే అతిశయోక్తి కాదు. స్వతంత్ర భారతావనిలో 1947 లోతెనాలిలోనే జన్మించి
కళా/ సాహిత్య సౌరభాలను ఆఘ్రాణిస్తూ ఈ నేలతో, ఈ గాలితో, ఈ నీటితో
పెనవేసుకున్న నా ఈ జీవన నౌకాయానం, ఒక సుమధుర స్వప్నం వంటిది. ఈ స్వప్నం
సాకారమవగా, నా స్మృతి పేటికలో దొంతర్లుగా చేరి తెనాలిలో నేను పెనవేసుకున్న
అనుబంధాల మందారమాలను గురించి కొన్ని మాటలలో ఇమడ్చాటానికి ప్రయాత్నిస్తాను.
చిన్ననాట, మిషన్ స్కూల్ లో 'క్రీస్తు జననం' నాటికలో, గొర్రెలకాపరి పాత్రలో,
తరువాత తాలుకా హై-స్కూల్ లో 'వెంకన్న కాపురం' నాటికలో, చిన్న పాత్రలో
నటించి 'బాల రామాయణం' బహుమతి పొందటం నాలో ఉన్న నటునికి ప్రాణం పోసింది.
శ్రీ రామ నవమి, దసరా పండుగల సమయం లో తెనాలి శోభను, తెనాలి విశ్వరూపాన్ని
చూసి ఆనందించిన వారి జీవితం ధన్యం.తెనాలి ని 'రెండవ భద్రాద్రి' అని
ఎందుకు అన్నారో ఆనాటి శ్రీ రామనవమి ఉత్సవాలు చూసిన వారికి తెలుస్తుంది.
శివరాత్రికి సంగం జాగర్లమూడి నడచి వెళ్లి చెరుకుగడలు తింటూ రాత్రంతా
జాగారం చేసి పొందిన ఆనందం, కొద్ది మాటలలోనే ఎలా చెప్పటం ? కొండను అద్డం
లో చూపినట్లు ఉంటుంది కదా !
ముఖ్యంగా, అప్పుడు నిర్వహించిన ఆధ్యాత్మికోపన్యాసములు, కూచిపూడి
నాట్యాలు, తెల్లవార్లూ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పద్య నాటకాలూ -
ఓహ్ ! ఒకటేమిటి ? ఎప్పుడూ తెనాలి - ఉత్సవ శోభతో వెలిగి పోయేది. ముఖ్యంగా
శ్రీ శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి గీతోపన్యాసాలు, వాటికి హాజరైన
క్రిక్కిరిసిన జనంతో కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణం నిండిపోగా బయట బోస్
రోడ్డు మీద కూడా జనం నిలబడి వినడం తెనాలి తో నాఆధ్యాత్మిక అనుబంధాన్ని
మరింత దృఢపరచిన సందర్భం. నాలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించటం లో ఈ
కార్యక్రమాల ప్రభావం ఎంతో ఉంది. మా మిత్రమండలి సమావేశాలు, చినరావూరు పార్కు
లోనూ, అప్పుడే ప్రారంభించిన వైకుంఠపురం శ్రీ వేంకటేశ్వరుని ఆలయ
ప్రాంగణంలోనూ, గంటలతరబడి జరిగి మమ్మల్ని అలరించేవి.
తెనాలి నేల, నీరు,
గాలి ఎంత గొప్పవో !! ప్రఖ్యాత రచయితలైన కొడవడిగంటి, చలం, త్రిపురనేని,
చక్రపాణి, జి.వి కృష్ణారావు; బొల్లిముంత శివరామ కృష్ణ, శారద, మరియు
వందలమంది కళాకారులు నడచి తెనాలి వాసులను ఉత్తేజపరచిన ఈ నేలపై నేను కూడా
ఆత్మీయానుబంధంతో నడవగలగటం నా ఆదృష్టం. అందుకే, నేను హైదరాబాద్ లో
ఉంటున్నా, ఇప్పటికీ ఇక్కడ వీచే సాహిత్య, కళా సౌరభాలను తెనాలి వచ్చి పోతూ
ఆస్వాదిస్తున్నాను. ఈ క్రమంలోనే, నేను అనువదించిన 'గీతాంజలి' ని, 'గీతా సారం' సంకలన గ్రంధాన్నీ' తెనాలి లోనే ఆవిష్కరించి, పంచిపెట్టటం జరిగింది. ఇలా తెనాలి తో నా అనుబంధాన్ని కొనసాగిస్తూ ఎంతో సంతోషాన్ని పొందుతున్నాను. ఇటువంటి "తెనాలి తల్లికి, వందనం" ! తెనాలి వాసులకు 'అభివందనం' !!.
గీతాంజలి మూర్తి
23.8.2012
మంగళవారం, ఆగస్టు 28, 2012
బుధవారం, ఆగస్టు 22, 2012
మౌంటైన్ వ్యూ కబుర్లు -3
T.V. Technology in USA
Pause Live TV
12th august 2012 నాడు ఒలింపిక్ ఆటల ముగింపు ఉత్సవాలు NBC ఛానల్ లో Live చూస్తూఉన్నా. శ్రీమతి రమణ పావ్ భాజి తయార్ అని వంటింట్లోంచి కేక వేయటంతో టి.వి. కి వ్యవధానం (Pause) బొత్తం నొక్కి, వంటింట్లోకి వెళ్ళి పావ్ భాజి తెచ్చుకొని వచ్చి, ఇందాక టి.వి. ఆపిన దగ్గరి నుంచి చూడటం మొదలెట్టాను. అమెరికా లో డిష్ టి.వి లో Live TV ని పాజ్ లో పెట్టి, పని ముగించుకొని వచ్చి, ఎక్కడ ఆపామో అక్కడనుంచి టి.వి చూసే సౌకర్యం ఉంది. మనకు ఎవరన్నా ఫోన్ చేసినా టి.వి ని పాజ్ చేసి, నింపాదిగా ఫోన్ మాట్లాడి, టి.వి కార్యక్రమాన్ని అంతరాయం లేకుండా చూసి ఆనందించవచ్చును. భారతదేశం లో ఈ సౌకర్యం నేను ఎప్పుడూ వాడలేదు. మీరెవరైనా ఈ సదుపాయం వాడుతున్నారా? టి.వి. లో జాన్ లెనన్ Imagine పాట వస్తుంది. ఊహించండి, దేశాలు, సరిహద్దులు లేని, విశ్వశాంతి నెలకొన్న ప్రపంచం ఎంత బాగుంటుందో!
Digital Video Recorder
ఇక్కడ మా ఇంట్లో డిష్ టి.వి. సాటిలైట్ తో సంధానమైనది ఉన్నది. ఒక ప్రోగ్రాం చూస్తూ మరో ప్రోగ్రాం Digital Video Recorder లో సంగ్రహింప (Record) వచ్చు. అంతే కాదు Digital Video Recorder లో సంగ్రహింపబడిన ఏ కార్యక్రమమైనా చూస్తూ టి.వి. లోని మరో కార్యక్రమాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం వలన మంచి ఆసక్తికరమైన ప్రొగ్రాం ఏదైన వచ్చే సమయంలో బయటకు వెళ్ళాల్సి వస్తే, ఆ కార్యక్రమాలను రికార్డ్ చెయ్యమని Digital Video Recorder కు మనము ఆదేశం ఇవ్వవచ్చు. ఉదాహరణగా రోజూ చిన్నారి పెళ్ళి కూతురు సీరియల్ చూసే అలవాటు మనకు ఉందనుకోండి. ఒకసారి Schedule చేసి ప్రతి రోజూ రికార్డ్ చెయ్యమని ఒకేసారి ఆజ్ఞ ఇస్తే చాలు. హచ్ కుక్కపిల్లలా ఆ ప్రొగ్రాం ఎప్పుడొచ్చినా స్వయంచాలితంగా అది తన పని తను చేసుకుపోతుంది.
Video on Demand
ఇంతే కాదు టి.వి లో మనకు కావల్సిన కార్యక్రమం కొరకు అన్వేషణ కూడా జరపవచ్చు. ఇంకా Video on Demand పద్ధతిలో పలు కార్యక్రమాలు మనం కొరినవిధంగా చూసే ఏర్పాటు ఉందిందులో. ఉదాహరణకు Olympic Games Opening Ceremony సమయంలో మనము వేరే ఊళ్ళో ఉన్నా, ఆ ప్రొగ్రాం కొరకు అన్వేషిస్తే వచ్చే లింక్ సాయంతో ఆ ప్రోగ్రాం మనము చూడవచ్చు. Video on Demand లో కొన్ని ప్రోగ్రాంలు చెల్లింపు పద్ధతిపై చూడవచ్చు. ఉదాహరణకు Dish TV లో మీరు విద్యా బాలన్ నటించిన "The Dirty Picture' చిత్రాన్ని 5 డాలర్ల చెల్లింపుతో చూడవచ్చును.
భారతదేశం లో నిర్మితమయ్యే కార్యక్రమాలున్న ఈ టి.వి., జెమిని, మా టి.వి., టి.వి.5, టి.వి. 9, సోనీ, ఆప్ కా కలర్స్ (భారత దేశంలో కలర్స్) కార్యక్రమాలు మాములుగా ప్రసారమయితే, ఆంగ్ల ప్రోగ్రాంలు, దాదాపుగా అన్నీ HD లో ప్రసారమవుతాయి. ఎంత పెద్ద టి.వి తెరపై నన్నా ఇవి ఎంతో శ్రవణ, దృశ్య నాణ్యతతో ప్రసారమవుతాయి.ఒలింపిక్ ఆటలు వంటి ప్రసారాలు ప్రత్యక్ష ప్రసారాలవుతాయిక్కడ.
ఆగస్ట్ 16 మధ్యాహ్న సమయాన టి.వి లో ఏదో ప్రొగ్రాం చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా టి.వి.లో ప్రసారాలు ఆగిపోయాయి. ఎందుకు ఆగాయో అంతుపట్టలేదు. 2నిమిషాలు శల్యపరీక్ష తరువాత తెలిసినదేమంటే విద్యుచ్ఛక్తి కి అంతరాయం కలిగిందని. 2 నిమిషాలు ఎందుకంటే, కరంట్ పోతుందనే విషయం ఊహకు అందని అంశం ఇక్కడ. మన హైదరాబాదులో భూకంపం వస్తే ఇళ్ళలోవారు ఎలా బయటకు వస్తారో, అలాగా, మా ఇరుగు పొరుగు బయటకు వచ్చి మీ ఇంట్లో Power ఉందా అని అడగ సాగారు. అమెరికా వచ్చాక మా పక్కింటివారిని చూడటం అదే ప్రధమం. వారు జపనీయులని తెలిసింది. ఈ సమయంలో గాలి స్థంభించినట్లుగా అనుభూతి చెందాము. ఎయిర్ కండిషనర్ పనిచేయదు. Cooking Stove పని చెయ్యలేదు. 40 నిమిషాల తర్వాత కరంట్ వచ్చింది. అందరి కళ్ళలో కాంతి కనిపించింది. ఇందాక చూస్తూ ఆగిపోయిన టి.వి ప్రోగ్రాం చూడాలని టి.వి. బొత్తం నొక్కాను. డిష్ టి.వి. ఉపగ్రహ సంకీతనం (Signal) అందకపోవటంతో, టి.వి. ఆ సిగ్నల్ అందుకోవటానికి ఏదో ప్రొగ్రాం స్వయంచాలితమై 5 నిమిషాల తర్వాత సంకీతనం అందుకుని టి.వి. మరలా పని చేయసాగింది.
టి.వి లో కార్యక్రమాలను మనకు అనువైన వేళలో చూడటానికి Dish Network HDTV Digital Video Recorder Satellite Receiver లో ప్రోగ్రాం చేసుకొని నాకు వీలయిన సమయంలో వాటిని చూసి ఆనందించేవాడిని. అలాగా Globe Trekker, బడే అచ్ఛె లగ్తె హై, చిన్నారి పెళ్ళికూతురు వగైరా కార్యక్రమాలను DVR లో సంగ్రహించేవాడిని. కార్యక్రమం చూశాక ఆ ప్రోగ్రాం DVR నుంచి తొలగించటం ఒక అలవాటుగా మారింది. ఆ సాయంత్రం చిన్నారి పెళ్ళికూతురు చూశాక ఆ తల (చిన్నారి పెళ్ళికూతురు) కింద ఉన్న అన్ని కార్యక్రమాలను ఎంచుకొని Delete బొత్తం నొక్కాను. ఏమయ్యిందో ఏమో మరి చిన్నారి పెళ్ళికూతురు తో పాటుగా, నేను, ఇంకా మా ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులు ఎన్నో నెలలుగా Record చేసిపెట్టుకున్న కార్యక్రమాలు మొత్తం, తుడిచిపెట్టినట్లుగా, అన్నీ తొలగించబడ్డాయి.
ఆ మరుసటి రోజు టి.వి గదిలోకి వెళ్తే ఎప్పుడూ వినోదాన్నందించే DVR ఎలాంటి కార్యక్రమాలు తనలో ఇముడ్చుకొని లేకుండా శూన్యంగా కనిపించింది. మనసు భారమయ్యింది. DVR కు కూడా Backup ఉంటే బాగుణ్ను అనిపించింది.

మంగళవారం, ఆగస్టు 14, 2012
వీక్షణం: Bay Area Telugu Writers Forum
మౌంటైన్ వ్యూ కబుర్లు -2
ఉత్తర అమెరికాలో సాహితీ చైతన్యం
ఉత్తర అమెరికాలో సాహితీ సమావేశాలు డెట్రాయిట్, డాలస్, హూస్టన్ నగరాలలో ఉత్సాహంగా, తరచుగా జరుగుతుంటాయి. అయితే ఇక్కడి బే ఏరియాలో (Silicon Valley) సాహితీ వాతావరణం స్తబ్దుగా ఉంటుంది ఏడాదిలో ఎక్కువ భాగం; ఎప్పుడో అడపా తడపా శ్రీయుతులు గొర్తి శాయి బ్రహ్మానందం,కిరణ్‌ప్రభ ప్రభృతులు నిర్వహించే కాలిఫొర్నియా తెలుగు సదస్సులు తప్పిస్తే. 2008 నుంచి ఇక్కడ తెలుగు బ్లాగర్ల, రచయితల సమావేశాలు నేను కొన్ని నిర్వహించినప్పటికి, డాలస్ లో లాగా తరచూ సాహితీ సమావేశాలు జరిపే సంస్కృతి ఇంకా అలవాటు కాలేదు ఇక్కడ. అయితే బే ఏరియా లో పేర్గాంచిన రచయితలు, కవులు ఇంకా సంపాదకులు ఉన్నారు. కౌముది, సృజనరంజని వెబ్ మాసపత్రికలు ఈ ప్రాంతము నుంచే వెలువడుతున్నాయి. మరి లోపం ఎక్కడుందో ఒక పట్టాన బోధపడదు.
తానా, ఆటా వగైరా సంస్థలు తొలితరం తెలుగు వారితో స్థాపించబడ్డాయి. ఇవి కుల జాడ్యం, ప్రాంతీయ భేదాలు వగైరాలతో మరిన్ని చీలికలయ్యాయి. పాత తరం వారినే తప్ప నేటి తరం తెలుగు యువతను ఈ సంస్థలు ఆకర్షింపలేకపోతున్నాయి. ఇక్కడే పుట్టి పెరుగుతున్న తెలుగు పిల్లలు అమెరికన్ సంస్కృతిలో మమేకం అవటం ముఖ్య కారణంగా అనిపిస్తుంది. మన తెలుగు బాష, సంస్కృతి కి వారసులైన వీరు తెలుగు నేర్చుకొనకపోతే తరువాతి తరంలో తెలుగు సంస్కృతి ఇక్కడ కరువయ్యే ప్రమాదముంది. ఈ చారిత్రక అవసరాన్ని గుర్తించి సిలికాన్ అంధ్రావారు మన బడి అంటూ తెలుగు అధ్యయన తరగతులు ప్రారంభించినప్పటికి, తెలుగు చదవటం రాని తెలుగు అమెరికన్ పిల్లలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు అమెరికాలో. తెలుగు పిల్లలకు తెలుగు నేర్పటానికి మరిన్ని సంస్థలు, వ్యక్తులు ముందుకు రావాలి.
ఇలాంటి చారిత్రక సమయంలో డా|| గీతా మాధవి తెలుగు వికాసం అనే వేదిక స్థాపించి స్థానిక పిల్లలకు తెలుగు, సంగీతం నేర్పుతున్నారు. ఆగస్ట్ 12 ఆదివారం, భారత స్వాతంత్ర్య వేడుకలను సన్నీవేల్ లోని షిర్డీ శాయి దేవాలయంలో తమ శిష్యులతో కలిసి డా|| గీత నిర్వహించారు. ఈ సందర్భంగా వీక్షణం అనే మరో వేదిక ఆవిష్కరించబడ్డది. ఇంకా కవనం అనే బాలల e-book కూడా ఆవిష్కరించబడ్డది. "వీక్షణం" సాహిత్యకారులను ఒక చోట చేర్చి సదస్సులు నిర్వహించడం, రచనల ప్రచురణలు, ఆవిష్కరణలు మొదలైన వాటి ద్వారా బే ఏరియాలో సాహిత్యానికి కొత్త గవాక్షాల్ని తెరుస్తుంది. విద్యార్థుల సృజనాత్మక శక్తిని బాలల పత్రిక "కవనం" ద్వారా వెలికి తెస్తుంది. వీక్షణం ద్వారా కొన్ని సాహితీ సభలు నిర్వహించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.వీక్షణం కార్యక్రమాలలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు తెలుగు వికాసం ను లేక భవదీయుడును సంప్రదించవచ్చు.
Click on photo to view the album of the event.

![]() |
Telugu Vikasam, Mountain View, CA, Independence Day Celebrations 2012 |
గురువారం, ఆగస్టు 09, 2012
బ్లాగులు- వ్యాఖ్యలు -16
హైదరాబాదులోని చార్మినార్ నుంచి బాద్‌శాహి అసుర్‌ఖానా వెళ్ళే Heritage Walk లో గుల్జార్ హౌస్ దగ్గరి Sher-E-Batil-Ki-Kaman వద్ద కల సింహపు శిల్పం. Photo: cbrao
అట్లాస్ ష్రగ్‌డ్ పుస్తకం తెప్పించుకొని భుజాలు ఎగిరేసాను
"ప్రపంచ ఆర్ధిక స్థితి గురించి ఈమధ్య బాగా పరిశీలిస్తున్నాను. " - గ్రీసు ఎప్పుడు ఐ పి పెడుతుందోనని స్టాక్ మార్కెట్లు వణుకుతున్నాయి. గ్రీసు దేశ దివాలాకోరుతనానికి కారణాలేమిటి?
http://sarath-kaalam.blogspot.com/2011/10/blog-post.html
స్టీవ్ జాబ్స్.. భారతదేశం.. యాపిల్
ఆపిల్ అధినేత స్టీవ్ జాబ్స్ గురించి అనేక కొత్త విషయాలు తెలిసాయి. ఆసక్తికరంగా ఈ వ్యాసాన్ని అందించినందుకు అభినందనలు.
http://kanthisena.blogspot.com/2011/10/blog-post.html
వాక్యకోవిదుడు హనుమంతుడు
ఈ పుస్తక పరిచయం వలన, హనుమంతుడి నడవడిక తెలుసుకోవడం ద్వారా, మాట తీరు, వ్యక్తిత్వ వికాసం పెంచుకోవచ్చనే ఉషశ్రీ గారి పరిశీలనతో ఏకీభవించకుండా ఉండలేము. సమీక్ష ఏకబిగిన ఆసక్తిగా చదివించింది.
http://pustakam.net/?p=8534
తుమ్మపూడి – సంజీవ దేవ్ స్వీయ చరిత్ర
Afterword: సంజీవదేవ్ వ్రాసిన పుస్తకాల వివరాలు, వర్ణచిత్రాలు, ఛాయాచిత్రాలు, తన చిత్రాల పై సంజీవదేవ్ విశ్లేషణ ఇంకా ఇతరులు సంజీవదేవ్ పై వ్రాసిన వ్యాసాలు ఈ దిగువ గొలుసులో చూడవచ్చు.
http://sanjivadev.tripod.com/
http://pustakam.net/?p=8520
సామల సదాశివ ముచ్చట్లు – “మలయ మారుతాలు”
సదాశివుని సంగీతం ముచ్చట్లు ఆసక్తికరంగా చెప్పారు. సంగీత ప్రియులకు ఈ పుస్తకం చదువుతుంటేనే, నేపధ్యంలో, చక్కని సంగీతం వీనులకింపుగా వినిపిస్తుంది. సదాశివ వ్రాసిన సంగీత శిఖరాలు,మిర్జా గాలిబ్ (జీవితము, రచనలు) పుస్తకాలు కూడా పాఠకులను ఆకట్టుకుంటాయి. డాక్టర్ సామల సదాశివ పై వారాల ఆనంద్ తీసిన లఘు చిత్రాన్ని ఈ దిగువ గొలుసుద్వారా చూడవచ్చు.
http://www.maganti.org/videofiles/sahityam/yadi/yadi.html
http://pustakam.net/?p=8825
ఈ రోజు పొద్దున్నే బాగోతం ఇదయ్యా......మాగంటి.ఆర్గ్ సైటు మూసే ఉంచుతా!!!
మొన్నే శ్రీరామరాజ్యం చిత్రం చూసాను. ఎవడో గొట్టం అన్న మాటలకు శ్రీరాముడు సీతమ్మవారిని అడవులకు పంపాడు. ఎవడో కొణంగి తెలిసో తెలియకో ఒకే ఫైల్ ను పదే పదే నొక్కితే మాగంట్.ఆర్గ్ సైట్ ను మూసెయ్యటమా? తగదు. మరలా తెరవాలని కోరుతాను.
http://janatenugu.blogspot.com/2011/11/blog-post_2139.html
కర్ణాటక తీర్థ యాత్ర -1
సచిత్రంగా కళ్ళకు కట్టినట్టుగా వ్రాశారు మీ యాత్రను. నేను కూడా మీతో ఈ యాత్రలో సూక్ష్మరూపంలో పాల్గొంటూ, ఆనందిస్తాను. పదండి ముందుకు.
http://sarasabharati-vuyyuru.com/2011/12/28/%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5-%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-1/
Durgesh Nandini – Bankim Chandra Chatterjee
For those interested in reading Durgesh Nandini in Telugu, here is good news. It was translated by late Dandamudi Mahidhar garu into Telugu and was first published in the year 1966. The reprint was made in October 2011 by Sahiti Publications of Vijayawada. The cost of the book is Rs. 70/- This book also contains translation of the novel Sitaram by Bankimchandra which is tranlated by D.Venkatramayya garu. The reader thus gets two novels of Bankim for Rs.70/- The quality of printing and the cover page are good. It is now available with leading book sellers of Andhra Pradesh.
http://vbsowmya.wordpress.com/2008/07/27/durgesh-nandini-bankim-chandra-chatterjee/
CHANGE...
చుక్కల్లేని పగటి ఆకాశం
కాదు కాదు చుక్కలు కనపడని ఆకాశం
కనపడతాయి చుక్కలు పొద్దు వాలంగానే
రేపు మూసిన పిడికిలి
నేడు తెరిసిన పిడికిలి
మూసిన పిడికిలి లో ఏముందో
ఈరోజే తెలిస్తే కాదా జీవితం
ఆసక్తి రహితం
కాలం ఆగితే
ప్రపంచగమనం ఆగితే
ఉండిపోతే నేనలాగే
కామా మనం బాల వృద్ధులం
http://jabilisirineni.blogspot.com/2011/07/change.html
బుధవారం, ఆగస్టు 08, 2012
మౌంటైన్ వ్యూ కబుర్లు
2012 మే మాసంలో అంధ్రలో ఎండలు, మండుటెండలు ఇంకా వడగాల్పులు. ఆ వేడిని తప్పించుకోవటానికి ఎయిర్ కూలర్ లేక ఎ.సి. ఉన్న గదిలో ఎక్కువసేపు ఉండటానికి ఇష్టపడతాం.అదే ఇల్లంతా ఎ.సి. ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అసలు ఊరంతా ఎ.సి.ఐతే! మరీ దురాశగా ఉంది కదూ! ఊహకందని ప్రతిపాదన కదా?
కాని మౌంటైన్ వ్యూ (Mountain View, Silicon Valley, California) కు వొచ్చాక ఆ ఊహ నిజమైంది. ఇక్కడ ఇల్లే కాదు ఊరు ఊరంతా ఎ.సి.లాగా ఉంది ఇక్కడ వాతావరణం. ఎంతో హాయిగా ఉంది. అయితే జూన్ నెల వచ్చాక ఇక్కడ వాతావరణం లో మార్పు కనిపిస్తోంది. నిన్న, ఇవ్వాళ ఆశ్చర్యకరంగా ఇంట్లో గాలి పంఖా (fan) వాడుతున్నాము. బహుశా ఇంకొన్ని రోజులు ఫాన్ అవసరం ఉండవచ్చు. ఆ తర్వాత వచ్చే సంవత్సరం దాక పంఖా కు విశ్రాంతే.
మా పెరటి ఆపిల్ చెట్టు
మేము వచ్చేసరికి ఆపిల్ చెట్టు పూలు పూసి, పిందెలతో ఉంది. ఏ కారణం వలనో గత పర్యాయం ఇక్కడకు వచ్చినప్పుడు కాసినంత కాపు ఇప్పుడు లేదు. 2010 లో అయితే శ్రీమతి రమణ పచ్చి ఆపిల్ కాయలతో ఎంచక్కా ఆవకాయే పెట్టింది. చిన్న పరిణామంలోని ఆకుపచ్చ ఆపిల్ కాయలు కొంత వగరుగా, పుల్లగా ఉండి ఆపిల్ ఆవకాయకు కావల్సిన రుచినిచ్చాయి.
తెలుగు వారి సమావేశాలు
వారాంతం వొస్తే ఇక్కడ కోలాహలమే. మన ఆంధ్రప్రదేష్ లో ఐతే బంధు మిత్రులను తరచుగా వివాహలలో కలుస్తుంటాము. ఎన్ని వివాహాలంటే, పెళ్లికి వెళ్లాలంటే విసుగేశంత. ఇక్కడ వివాహాలు అరుదుగా తప్ప బంధు మిత్రుల లో జరగవు. ఆ లోటు తీర్చటానికా అన్నట్లు ఇక్కడ పుట్టిన రోజు పండగ, సీమంతం (Baby shower), దసరా, దీపావళి, సంక్రాంతి మరియు ఉగాది పండుగ సమయాలలో సామాజిక సమావేశాలు తరచుగా జరుగుతుంటాయి. పండగ సమయాలలో ఇక్కడి తెలుగు సాంస్కృతిక సంఘాలవారు పార్క్ లలో సమావేశాలు జరుపుతారు. ఇంకా తానా, ఆటా, నాటా, నాట్స్ వగైరా సంఘాలవారు ప్రతి సంవత్సరము తెలుగు సభలను జరుపుతుంటారు. అమెరికా తెలుగువారు కుల ప్రాతిపదకపై విడిపోయి ఇలా భిన్న సంఘాలు పెట్టుకోవటం బాధాకరం. తమాషా విషయమేమంటే ఈ పుట్టిన రోజులు వగైరా వేడుకలు అన్నీ వారాంతం లోనే ఎక్కువగా జరుగుతాయి. వారం రోజులలో ఇక్కడివారు తమ తమ ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం దృష్ట్యా ఇది అనివార్యం.
మౌంటైన్ వ్యూ పార్క్ లో తెలుగు మిత్రుల సమావేశం
ఇక్కడికి వచ్చిన మొదటి వారాంతం లో కవయిత్రి గీతా మాధవి ఇక్కడి తెలుగు వారితో Mountain View, Rengstorff Park లో ఒక సమావేశం ఏర్పరిచారు. ఇక్కడి తెలుగు వారితో పరిచయం కలిగింది. ఆటలు, పాటలు, కబుర్లు, మధ్యాహ్న విందు భోజనం (Potluck lunch) ల తో సరదాగా గడిచింది.మరిన్ని సమావేశ ఛాయాచిత్రాలు ఈ దిగువ ఇచ్చిన గొలుసులలో చూడవచ్చు.
https://plus.google.com/photos/114125420321576521677/albums/5750046785761708305?authkey=CM38tumN58qv5wE
https://plus.google.com/photos/115779731434350218592/albums/5750317393696013697?authkey=CJTjvfX_-paCxwE
డా|| గీతా మాధవి తెలుగు వికాసం ను స్థాపించి తెలుగు భాష, సంగీత తరగతుల ద్వారా అమెరికా విద్యార్థులకు భాషా, కళా సేవ చేస్తున్నారు. తన వెబ్ సైట్ లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
http://www.teluguvikasam.com/
కార్యక్రమం చివరలో శ్రీమతి గీత విద్యార్ధులు తాము నేర్చుకున్న పాటలను ఆహుతులకు వినిపించి శ్రవణానందం కలుగచేశారు.