దీప్తి ధార: కలుసుకుందాం -తెలుసుకుందాం- కలిసి భోంచేద్దాం:
హేతువాదులు, మానవవాదులు, నాస్తికులు ఇంకా కులరహిత సమాజం కోసం కృషి జరిపేవారు ఇటీవలనే తమ కుటుంబాల తో కలిసి ఒక సమావేశం లో పాల్గొన్నారు. ఆ సమావేశ విశేషాలు చూడండి.
సోమవారం, అక్టోబర్ 28, 2013
కలుసుకుందాం -తెలుసుకుందాం- కలిసి భోంచేద్దాం
Participants in the family meet of rationalists: Smt Lakshmi Nageswar, Shariff Gora (Standing),
Dr Om Prakash and Srinivas Jodavula
మానవ వికాస వేదిక వారి కుటుంబ సమావేశం "కలుసుకుందాం -తెలుసుకుందాం- కలిసి భోంచేద్దాం" అక్టోబర్ 20, 2013 ఆదివారం శ్రీమతి లక్ష్మి నాగేశ్వర్ గారి జూబిలీ హిల్స్, హైదరాబాదు నివాసం లో జరిగింది. ఈ సమావేశం లో సుమారు 40 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. వీరిలో హేతువాదులు, నాస్తికులు ఇంకా కులరహిత సమాజం కోసం కృషిచేసే కార్యకర్తలున్నారు. ఈ కార్యకర్తలు, ఇలాంటి విశ్వాసాలు ఉన్న వ్యక్తులు మన సమాజం లో తక్కువ. అమెరికా లో ప్రజాదరణ పొందిన "You are not alone" కార్యక్రమంతో, ఈ కార్యక్రమం పోలి ఉంటుంది. హేతువాదులు, నాస్తికులు ఇంకా కులరహిత వివాహం చేసుకున్నవారిలో ఈ కార్యక్రమం ఆత్మస్థైరాన్నిస్తుంది. నేనొక్కడినే ఇలా ఆలొచించటంలేదు - నాకు తోడుగా ఎందరో ఇలానే ఆలోచిస్తున్నారన్న భావన మరింత ఉత్సాహంగా ఈ భావజాలం లో కొనసాగటానికి కావల్సిన శక్తినిస్తుంది.
A section of the participants: First row Right to left: cbrao, Nelson Rushdie and family members
నిజానికి నేడు సమాజం లో అవాంఛిత కులవ్యామోహం పెక్కు సమస్యలను, అసమానతలను, అంటరానితనాన్ని సృష్టిస్తుంది. కాలేజీలలో కులాల పేరున విహారయాత్రలు విద్యార్థులలో విభజనకు కారణభూతమవుతున్నాయి. రాజకీయాలు కూడా కులప్రాతిపదికిన జరుగుతున్నాయి. కాలం చెల్లిన ఈ కులవ్యామోహానికి అడ్డుకట్ట వేయవలసిన సమయం ఆసన్నమైంది. శ్రీమతి లక్ష్మి నాగేశ్వర్ గారి గారి భర్త శ్రీ వి.నాగేశ్వర్ గోరా గారి శిష్యుడు ఇంకా లవణం మిత్రుడు. ఆయన నాస్తికుడు, హేతువాది ఇంకా మానవవాది. భార్యా భర్తలిరువురూ కులనిర్మూలన సంఘం లో కింద నుంచి పై స్థాయి వరకు పెక్కు పదవులు లో పనిచేశారు. నాగేశ్వర్ గారి మరణం తర్వాత కూడా శ్రీమతి లక్ష్మి కులనిర్మూలన సంఘ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. వర్ణాంతర వివాహ వేదిక స్థాపించి పెక్కు కులాంతర వివాహాలు జరిపించారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారి సమాచారం సేకరించి AP Casteless Couples Directory ను, లవణం సహకారంతో ప్రచురించారు. ఈ పుస్తక పరిచయం దిగువ అంతర్జాల గొలుసులో చూడవచ్చు.
కుల నిర్మూలన ఆవశ్యకతను వివరిస్తూ కీ||శే డి.జి.రామారావు "కులరహిత సమాజం" అనే పుస్తకాన్ని వ్రాసారు. ఈ పుస్తక పరిచయం దిగువ అంతర్జాల గొలుసులో చూడవచ్చు.
కులరహిత సమాజం, AP Casteless Couples Directory పుస్తకాలు చదవగోరే వారు contact@vikasadhatri.org కు జాబు వ్రాస్తే download Link పంపిస్తారు.
AP Casteless Couples Directory పుస్తకాన్ని ఈ కింది గొలుసు నుంచి కూడా దిగుమతి చేసుకొనవచ్చు.
కులరహిత సమాజం కోసం శ్రమించి, కృషి చేసిన వారిలో పెరియార్ రామస్వామి నాయకర్ ప్రముఖంగా ఉంటారు. వీరి జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘పెరియార్ రామస్వామి నాయకర్’ సినిమాను ఈ దిగువ గొలుసులో చూడవచ్చును.
ఈ రోజు కార్యక్రమంలో స్త్రీలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొని తమ జీవిత అనుభవాలను క్లుప్తంగా చెప్పారు. ఇంతమంది కులరహిత వివాహం చేసున్నవారిని, హేతువాదులను, నాస్తికులను ఒకే చోట చూడటం ప్రమోదం.
Nelson Rushdie -Idi Nijama?
పరిచయాలు, భోజనాలు అయ్యాక, సమావేశానికి వచ్చిన రచయిత, చిత్రకారుడు, సంఘసేవకుడు ఐన నెల్సన్ రష్డీ తాను రచించిన "ఇది నిజమా?" (ప్రధమ భాగం) పుస్తకాన్ని సభికులకు ఉచితంగా అందచేసారు. ఇది బైబుల్ పై వివరణాత్మక విమర్శనా గ్రంధం. ఈ పుస్తకం పై సమీక్ష దిగువ గొలుసులో చదవండి.
జన విజ్ఞాన వేదిక, రాష్ట్ర కార్యనిర్వాహక సమన్వయకర్త ఐన టి.వి.రావు ప్రశ్న ఎందుకు అనే విషయం పై వివరించారు. ప్రశ్న వల్ల ఆలోచన, హేతువాద దృక్పధం అలవడగలవని విపులంగా వివరించారు. పిల్లలలో ప్రశ్నించే తత్వాన్ని ప్రొత్సాహించాలన్నారు. ఆ తర్వాత నెల్సన్ రష్డీ (http://nelsonrushdie.blogspot.in/p/contact.html) మాట్లాడుతూ జీవితాన్ని నాలుగు ఘట్టాలుగా విభజించిస్తే అవి ఎలా ఉంటాయో చమత్కారంగా చెప్పారు. వారి చమత్కారం దిగువున చదవండి.
బాల్యంలో చిగురు
కౌమార్యంలో వగరు
యవ్వనంలో పొగరు
వృద్ధాప్యంలో సుగరు
టి.వి.రావు ప్రశ్నించే తత్వం పై ఆసక్తికర క్విజ్ కార్యక్రమం నిర్వహించారు. మొదట ఒక కలం చూపించి దానిపై ప్రశ్నలడగమన్నారు. తరువాత దేవుడు అనే అంశం పై ప్రశ్నలడగమన్నారు. ఆ బాల గోపాలం ఉత్సాహంగా ప్రశ్నలు సంధించారు. 1 దేవుడి చిరునామా ఏమిటి? 2 దేవుడి లింగమేమిటి? 3 దేవుడు రోజూ షేవ్ చేసుకుంటాడా? 4 దేవుడి కులమేది? 5 దేవుడు ఏ రంగులో ఉంటాడు? 6 దేవుడికి ఎన్ని భాషలొచ్చు? 7 సృష్టి ముందా? లేక దేవుడు ముందా? ఇలాంటి ప్రశ్నలు 60 పైనే అడిగారు. బి.బి.షా కార్యక్రమ సమన్వయకర్తగా ఉండి ఎక్కువ ప్రశ్నలడిగిన కుమారి స్ఫూర్తిని విజేతగా ప్రకటించారు. స్ఫూర్తి తనకు బహుమతిగా వచ్చిన రూ.100/- ను మానవ వికాస వేదిక 28, 29 డిసంబర్ 2013 న, బాటసింగారం, హైదరాబాదు లో నిర్వహించే 4వ రాష్ట్ర మహాసభ నిధి కి విరాళంగా ఇచ్చింది.
తరువాత టి.వి.రావు సభికులకు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి "మానవ పరిణామంలో మతము-సైన్స్" అనే Audio Cd ని పరిచయం చేశారు. దీనిని సెప్టెంబర్ మాసంలో రోహిణీప్రసాద్ గారి వర్ధంతిసందర్భంలో ఆవిష్కరించారు.
పిల్లలు పెరిగే విధానాన్ని బట్టే హేతువాదాన్ని తగుశాతం లో గ్రహిస్తారు. పిల్లలను స్వేచ్ఛగా పెరగనిచ్చి, యుక్తవయస్సు వచ్చాక దేవుని గురించిన అభిప్రాయాలు సొంతంగా (తల్లి తండ్రుల ప్రభావం లేకుండా) ఏర్పర్చుకునేలా పెంచాలి, అని, కె.వి.రాజు (మానవ వికాస వేదిక) పిల్లల పెంపకం పై సూచనలిచ్చారు.
ఈ కార్యక్రమంలో షరీఫ్ గోరా, విక్రం, గుత్తా, సి.బి.రావు, జోడావుల శ్రీనివాస్, డా|| ఓం ప్రకాష్, హనుమంతరావు ప్రభృతుల కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
శుక్రవారం, సెప్టెంబర్ 06, 2013
Art Appreciation

విశ్వ విద్యాలయ విద్యాసంస్థలన్నింటిలోనూ చిత్ర రసాస్వాదన (Art appreciation) పాఠ్య క్రమాలను ప్రవేశపెట్టాలని, చిత్రరచనను నేర్పడం మాత్రమే కాకుండా చిత్రాన్ని ఆనందించటం నేర్పాలని "చిత్రం ఆనందించాలంటే" అన్న వ్యాసంలో సంజీవదేవ్ రాశారు. ఇవేళ హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో Comparitive Aesthetics ప్రవేశపెట్టబడటంతో వారి కల నిజమైందని చెప్పవచ్చును. -వెలిచాల కొండలరావు, డా|| ముదిగొండ వీరభద్రయ్య.
సంజీవదేవ్ గురించిన మరిన్ని విశేషాలకై https://www.facebook.com/Sanjivadev అనే facebook page ను Like చెయ్యగలరు.
శుక్రవారం, ఆగస్టు 30, 2013
డా|| సంజీవదేవ్ ఫౌండేషన్ - చిత్రకారుడు S.V. రామారావు
Smt.Sulochana Devi garlanding Padma Shri S V Ramarao. On stage standing L to R are 1) Dr.Mahendra Dev 2) Dr. P.Dakshina Murthy 3) Prof Y.Lakshmi Prasad 4) Padma Shri S V Ramarao 5) Sulochana Devi 6) Y.V.Rao
సంజీవదేవ్ జీవించి ఉండగానే ప్రారంభించబడిన డా|| సంజీవదేవ్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ఒక విసిష్ఠ వ్యక్తిని సన్మానిస్తుంది. ఈ ప్రతిభా పురస్కాలు అందుకున్న వారిలో తత్వవేత్తలు, మనోవైజ్ఞానికులు, మానవతావాదులు, శిల్పకారులు, చిత్రకారులు ఇంకా సంగీతజ్ఞులున్నారు.
Click on photos to enlarge

V.Venkataratnam welcoming the chief guests and audience to Sanjivadev Foundation 6th award function. On stage sitting L to R 1) Dr.Mahendra Dev 2) Padma Shri S V Ramarao 3) Dr. P.Dakshina Murthy 4) Prof Y.Lakshmi Prasad 5) Sulochana Devi
ఈ పురస్కారాలు అందుకున్న ప్రముఖులలో డా||కొత్త సచ్చిదానందమూర్తి, ప్రొఫెసర్ కొనేరు రామకృష్ణారావు, బాలాంత్రపు రజనీకాంతారావు, ఆవుల సాంబశివరావు, S.V. రామారావు ఉన్నారు.
Padma Shri S V Ramarao receiving Sanjivadev foundation award from Smt Sulochana Devi.
కొంతకాలంగా ఈ పురస్కార ప్రదానాలు జరగటంలేదు. సంజీవదేవ్ మిత్రులంతా కలుసుకోవటానికి ఈ సభలు చక్కటి వేదికగా ఉండేవి. జనవరి 16, 2005 న తెనాలిలో జరిగిన ప్రతిభా పురస్కార సభలో ప్రముఖ చిత్రకారుడు S.V. రామారావు కు పురస్కార ప్రదానం జరిగింది. ఆ నాటి సభ చిత్రాలు ఇప్పుడు మీముందుచ్చ గలుగుతున్నందుకు ప్రమోదం.
Padma Shri S V Ramarao with the portrait of Dr.Sanjivadev.
గురువారం, ఆగస్టు 08, 2013
సంజీవదేవ్ జీవనరాగం -సాక్షి సమీక్ష
బుధవారం, ఆగస్టు 07, 2013
రసరేఖల ఇంద్రధనస్సు
సోమవారం, ఆగస్టు 05, 2013
Sanjivadev: facebook page
రచయిత, కవి, కళా విమర్శకుడు, చిత్రకారుడు, తాత్వికుడు ఇంకా జీవనశిల్పి ఐన సంజీవదేవ్ శతజయంతి సందర్భంగా వారి జ్ఞాపకాలు, రచనలు గురించిన ఊసులు పంచుకుందుకై ఒక ప్రత్యేక facebook page ప్రారంభించాను. ఆ గొలుసు దిగువ ఇస్తున్నా.
https://www.facebook.com/
Sanjivadev పేజీలోవున్న ' LIKE ' పై ' క్లిక్ ' చేయండి. ఇంకా నచ్చితే ' SHARE ' కూడా చేసుకోండి!
మీరంతా ఆ ముఖపుస్తక పుట చూసి ఇష్టపడతారని (Like) , సంజీవదేవ్ గురించిన విశేషాలు తెలుసుకుని ఆనందించగలరని ఆశ.
శనివారం, ఆగస్టు 03, 2013
సంజీవదేవ్ శతజయంతి సభ - HMTV
సంజీవదేవ్ శతజయంతి సందర్భంగా జూలై 21, 2013 న హైదరాబాదులో జరిగిన శతజయంతి సభ విశేషాలను HMTV ప్రసారం చేసింది. ఇందులో సంజీవదేవ్ జీవనరాగం (రచన -రావెల సాంబశివరావు) పుస్తకావిష్కరణ, జయప్రకాష్ నారాయణ, ఏ.బి.కె ప్రసాద్, వాడ్రేవు చిన వీరభధ్రుడు, బి.నర్సింగ రావు, సి.వేదవతి, శ్రీరమణ, ఇంకా దర్భాశయనం శ్రీనివాసాచార్యల ఉపన్యాసాలు వినవచ్చును.
మంగళవారం, జులై 30, 2013
టి.వి.10 లో సంజీవదేవ్ పై ప్రత్యేక కార్యక్రమం
'సంజీవదేవ్' జీవితమే ఓ కళ..
రసదృష్టితో సాహిత్యాన్ని, అపురూప చిత్రాలను సృజించారు ఆయన.రచనా వ్యాసంగంలో కొనసాగుతూనే చిత్రకళనూ జీవితంలోకి ఆహ్వానించారాయన. ఆయనలోని సాంస్కృతిక, సాహిత్య స్రవంతి ఎన్నో పాయలుగా ప్రవహించింది. గాఢమైన సౌందర్య తృష్ణ, రసదృష్టి ఆయన రచనలలో, చిత్రాల్లో కనిపిస్తుంది. ఆయనే 'సంజీవదేవ్' సంజీవ్ దేవ్ శత జయంతోత్సవాల సందర్భంగా.. ఆయనను ఒకసారి స్మరించుకుందాం..
మనిషికి - ప్రకృతికి, మనిషికి - సమాజానికి మధ్య గల సంబంధాన్ని సంజీవ్ దేవ్ రచనలు తెలుపుతాయి. అవి కళాత్మకంగా ఉంటాయి. ఇవి శాస్త్రీయ దృక్పథంతో ఉంటాయి. సంజీవ్ దేవ్ గారి కవిత్వం ఆలోచింపచేస్తుంది. భావానికి, రూపానికి చక్కని సమన్వయం వలన కవితా ప్రయోజనం చేకూరుతుంది. ఆయన క్రీడోకరించకున్న జీవితపు విలువలకు ఆత్మ సౌందర్యమే ఆధారం. గడ్డి పూవునలంకరించిన మంచు బిందువు, మెడని మృదువుగా ముద్దాడిన చల్లగాలి. వర్షపు చినుకులో నిండిన అపారమైన ప్రేమ.. ఇవన్నీ ఎందర్ని ఆకట్టుకుంటాయి? అంతటి సౌందర్య పిపాస, రసదృష్టి ఉన్నవారు అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తికి తన భావుకతను వ్యక్తీకరించే ప్రతిభ కూడా ఉంటే అరుదైన సన్నివేశాలు అపురూప కళాఖండాలు తయారవుతాయి. అలాంటి సౌందర్య ప్రేమికుడు సంజీవ్ దేవ్.
సంజీవ్ దేవ్ 1914 సంవత్సరంలో గుంటూరు జిల్లా తుమ్మపూడిలో జన్మించారు. అనుభవాలను, అనుభూతులను అక్షరీకరించడం తెలిసిన ప్రజ్ఞాశీలి ఆయన. మేజికల్ థింకింగ్ లో హెర్మన్ హెస్ తోనూ, ఫ్రీ థింకింగ్ లో జిడ్డు కృష్ణమూర్తి గారితోనూ, కళోపాసనలో ఆనందకుమార స్వామితో ఏ మాత్రం తీసిపోడు. సంజీవ్ దేవ్ స్వేచ్ఛా చింతకుడు. ఆచారాలకు, మూఢ నమ్మకాలకు అతీతుడు. తండ్రికి సైతం ఉత్తర క్రియలు జరుపని ఆచార విరోధి. విలక్షణ శైలి, తార్కిక వాక్య నిర్మాణం తో రచనలు చేశారు. చిత్ర కళా రంగంలోనూ, రచనా రంగంలోనూ, లేఖా రచనా పరంగానూ, ఆయన ఎందరికో స్ఫూర్తిప్రధాత. 'బయో సింఫనీ' దేవ్ గారి ఆంగ్ల అద్బుత సృష్టి. అది ఏడు అధ్యాయాల ఆంగ్ల గ్రంథం. ఇందులో జీవితాన్ని అద్భుతంగా విశ్లేషించారు. తన దృష్టిలో మనిషి అంటే ఏమిటో చర్చించారు. మానవ మేథస్సుకు ముద్రవేస్తూ మానవవాదం విలువ ఇస్తుంది. అదే విధంగా రమణీయతకు సైకోమానవవాదవం విలువ ఇస్తుంది. మానవ మేథస్సుపై ముద్రవేస్తూ మానవజీవితం రమణీయతను విస్మరించని ధోరణిలో సాగిపోవాలని అంటుంటారు 'సంజీవ దేవ్'అంచెలంచెలుగా జీవిత అనుభవాలను రాసిన సంజీవదేవ్ 'గతంలోకి','స్మృతిబింబాలు', 'తెగిన జ్ఞాపకాలు' పేరుతో రచనలు వెలువరించారు. రచనల్లో కొత్తరకమైన తెలుగుదనాన్ని చూపారు. వాక్య నిర్మాణం, పదప్రయోగాలలో వినూత్నతను చూపారు.
సంజీవదేవ్ పై రూపొందించిన ప్రత్యేక చలనచిత్రాన్ని చూడండి.
Courtesy: 10 TV
సోమవారం, జులై 29, 2013
తుఫానులో కొంగ -సంజీవదేవ్
సంజీవదేవ్ కవితలు "తెల్ల మబ్బులు"' గా పుస్తక రూపంలో 1975 లో వెలువడ్డాయి. ఆ తరువాత వ్రాసిన కవితలు పుస్తక రూపం లో రాలేదు. సంజీవదేవ్ అముద్రిత కవితలు కొన్ని ఈ మధ్యనే నా దృష్టికొచ్చాయి. వాటిలో "తుఫానులో కొంగ" ఒకటి. చదివి ఆనందించగలరు.
తుఫానులో కొంగ
నిశీధపు
నిబిడ తిమిరంలో
వర్షధారల
వలయాన్ని చీల్చుక
ఎగిరిపోయింది
నల్ల తుఫానులో
తెల్లకొంగ
పొగడ చెట్టు గూటినుండి
ఎగిరిపోయింది
తెల్లకొంగ
అంతాలను దాటుతూ
అనంతాల వైపుకు
ఎగిరిపోయిన
తెల్లకొంగ
నల్ల తుఫాను
అంతరించినా
గూటికిరాలేదు తిరిగి
తెలతెల్లగా
తెల్లవారినా !
-డా||సంజీవదేవ్
శనివారం, జులై 27, 2013
రంగాగారి – రేచుకుక్కలు
1955లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రలో కమ్యూనిస్టులు విజయరాజకుమార్, వీరాచారిలను ఉద్దేశించి వాడిన పదం అది. ఆచార్య ఎన్.జి. రంగా కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తూ ఐక్య కాంగ్రెసు పక్షాన ప్రచారం చేశారు. రంగాకు విపరీత మద్దతుతో చాలా బహిరంగ సభలు జరిగేవి. అప్పుడు రంగా పక్షాన ఎన్. విజయరాజకుమార్, ఎన్. వీరాచారి ప్రచారం చేసేవారు. వారి సభలకు బాగా ఆకర్షణ వుండేది. అర్థరాత్రి వరకు జనం బహిరంగ సభలలో వారి ప్రసంగాల కోసం వేచి వుండి వినేవారు.
సిద్ధాంతపరంగా కమ్యూనిస్టులను బాగా ఎదుర్కొన్న ఖ్యాతి ఎన్. విజరాజకుమార్ కు దక్కింది. ఆయన అప్పటికే సిడ్నీ, బీట్రిస్ వెబ్ దంపతులు రాసిన ‘సోవియట్ కమ్యూనిజం’ అనే బృహత్గద్రంథాన్ని అధ్యయనం చేశారు. అది ప్రామాణిక రచన కావటం వల్ల విజయరాజకుమార్ దానిపై ఆధారపడి అనర్గళంగా ఉపన్యాసాలు చేసేవారు. కనీసం మూడుగంటలయినా ఉపన్యాసం ఒక్కొక్క ఉపన్యాసం సాగేది. ఉద్రిక్తత ప్రబలి వుండేది. నువ్వా నేనా అన్నట్లు ఎన్నికలు జరిగేవి. ఆంధ్రా అంతా ఎర్రబారిందని, కమ్యూనిస్టులు అధికారంలోకి రావటం ఖాయమని అనుకున్నారు. ఆ నేపథ్యంలో విజయరాజకుమార్, వీరాచారి ప్రచారం చేస్తే, కమ్యూనిస్టులు వారిని రంగా రేచుకుక్కలని తిట్టేవారు. ఒకేవేదిక మీదకు రమ్మని కమ్యూనిస్టులను వారు సవాలు చేస్తుండేవారు. మొత్తం మీద వారి సభలు విజయవంతంగా సాగేవి. వాటితోబాటు సుంకర సత్యనారాయణ, పసుపులేటి కోటేశ్వరరావు, కె. రోశయ్య మొదలైనవారు కూడా రంగా అనుకూల ప్రచారంలో వుండేవారు. ఏతావాతా ఫలితాలు చూస్తే కమ్యూనిస్టులు నేలకరిచారు. విజయరాజకుమార్ కు విపరీతమైన ఖ్యాతి వచ్చింది.
ఎవరీ విజయరాజకుమార్ (1927-83)
చేబ్రోలు పంచాయతీలోని పాతరెడ్డిపాలెంలో (గుంటూరు జిల్లా) 1927లో రాజయ్య – అంతోనమ్మ దంపతులకు కలిగిన ప్రథమ సంతానం థామస్. అయితే రోమన్ కాథలిక్ చర్చి నుండి బయట పడి పేరు మార్చుకుని హైస్కూలు స్థాయిలోనే విజయరాజకుమార్ గా వెలుగులోకి వచ్చారు. జీవితంలో హైస్కూలు చదువు పూర్తి చేయకుండానే రాజకీయ రంగంలో ప్రవేశించిన వ్యక్తి విజయరాజకుమార్. కనీసం మెట్రిక్యులేషన్ పూర్తిచేద్దామని టంగుటూరి సూర్యకుమారితోపాటు ఆనాడు అమలులో ఉన్న సీనియర్ కేంబ్రిడ్జ్ చదువు సాగించి, అదీ తుదివరకు సాగనివ్వకుండానే విరమించారు. తెనాలి, కొల్లిపర మొదలైన ప్రాంతాలలో అసంపూర్తి చదువులలోనే సుభాస్ చంద్రబోసు స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీకి ఆకర్షితులయ్యారు. అందులో చేరి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్రలో మద్దూరి అన్నపూర్ణయ్య ఆ పార్టీకి నాయకుడు. సుభాస్ చంద్రబోసు అదృశ్యం కాగా (1940లో) ఆంధ్రలో ఆ పార్టీవారు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించేవారు. అందులో ఉపన్యాసకుడుగా, గాయకుడుగా కార్యకర్తగా విజయరాజకుమార్ పనిచేశాడు. చేబ్రోలులో పార్టీ రాజకీయ పాఠశాలలు జరిగేవి. బాపట్ల నుండి వి.ఎల్.సుందరరావు, చేబ్రోలులో టీచర్ మురహరిరావు కూడా ఆ పాఠశాలలలోపనిచేసేవారు. కలకత్తా నుండి సుభాస్ చంద్రబోస్ అన్న కొడుకు శరత్ చంద్రబోసు వచ్చి ఉపన్యాసాలిస్తుంటే, వేదిక మీద విజయరాజకుమార్ దానిని తెలుగులోకి అనువదించేవారు. ఇదంతా 1951 వరకు జరిగిన కార్యక్రమం.
అప్పటికే విజయరాజకుమార్ తండ్రి రాజయ్య రంగా శిష్యులుగా వున్నారు. ఆయన కుమారుడు విజరాజకుమార్.ని ప్రోత్సహించి రంగావర్గంలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ ముఠాలుగా చీలి రంగా, ప్రకాశం బయటపడి వేరే పార్టీలు పెట్టారు. కృషికార్ లోక్ పార్టీ రంగా స్థాపించగా వారి తొలి రాజకీయ పాఠశాల కృష్ణాజిల్లా చర్లపల్లిలో జరిగింది. విజయరాజకుమార్ అక్కడ పార్టీ సమావేశాల్లో పాల్గొంటుండేవారు. అందర్నీ ఆకర్షించారు. క్రమేణా ఆర్గనైజింగా కార్యదర్శిగా రంగా పక్షాన రాష్ట్ర ప్రజల నుద్దేశించి రచనలు ప్రారంభించారు. అప్పటికే ‘విప్లవాధ్యక్షుడు’ అనే పేరిట సుభాస్ చంద్రబోస్ జీవిత చరిత్రను రాసి ప్రచురించారు. దేశికవితా ప్రచురణలవారు దానిని ప్రచారంలోకి తీసుకువచ్చారు.
ఆచార్య రంగా రాసిన ‘రివల్యూషనరీ పెసెన్ట్స్’ అనే పుస్తకాన్ని ‘విప్లవ రైతాంగం’ పేరిట తెనిగించారు. ఆ విధంగా ఉపన్యాసాలు రచనలు సాగిస్తూ గుంటూరులో కుటుంబం పెట్టి గడుపుతుండగా గౌతు లచ్చన్న రంగా అనుచరుడుగా గీత సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. కల్లు గీసుకునే గీత కార్మికులకు నిషేధం వుండరాదని వారి జీవనవృత్తి కొనసాగాలని ఆయన నినదించారు. రంగా ప్రధమ శిష్యులలో లచ్చన్న ఒకరు. ప్రభుత్వ నిషేధానికి నిరసనగా సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్ళమని పిలుపునిచ్చారు. ఆ పిలుపు నందుకొని విజయరాజకుమార్, వీరాచారి సత్యగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు. అప్పటికే విజయరాజకుమార్ గుంటూరులో ఎ.సి. కాలేజి ఎదురుగా యూనివర్సల్ బుక్ షాప్ పెట్టారు. ఎల్.వి.ఆర్. అండ్ సన్స్ క్లబ్ ఆవరణలో వుండేది. ఆయన అరెస్టు కావటంతో పుస్తకాల షాపు కుటుంబానికి అప్పచెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆరు మాసాలు శిక్ష అనుభవించారు. ఆ తరువాత గవర్నర్ త్రివేది నిషేధాన్ని ఎత్తివేయడంతో సత్యాగ్రహుల్ని విడుదల చేశారు. తిరిగి వచ్చిన తరువాత విజయరాజకుమార్ మళ్ళీ పార్టీ యాత్రను సాగించారు. చిన్న చిన్న పుస్తకాలు ప్రచురించారు. కుటుంబ భారాన్ని మోస్తూనే 1956లో పెళ్ళి చేసుకున్నారు. అయితే ఈలోపు కొద్ది కాలం అనంతపురం జిల్లా పుట్టపర్తి వెళ్ళి వచ్చి సాయిబాబా భక్తుడయ్యాడు. కానీ అది ఆట్టే కాలం వుండలేదు. ఆంధ్రపత్రిక విలేఖరిగా తెనాలిలో వున్న జె.వెంకటప్పయ్య శాస్త్రిగారి పెద్ద కుమార్తె కన్యాకుమారిని పెళ్ళి చేసుకున్నారు. గుంటూరులో సరస్వతీ మహల్ లో ఆ పెళ్ళి కార్యక్రమాన్ని సెక్యులర్ పద్ధతిలో ఆవుల గోపాలకృష్ణమూర్తి నిర్వహించారు. ఆచార్య రంగా, కొత్త రఘురామయ్య (కేంద్రమంత్రి) మొదలైనవారెందరో ఆ కార్యక్రమానికి విచ్చేశారు.
వారికి ఇద్దరు అబ్బాయిలు కలిగారు. ఈలోగా పూదోట శౌరయ్యతో పుగాకు వ్యాపారం ప్రారంభించారు. అది సాగక నిలిపేశారు. రాజకీయ కార్యకలాపాలు మాత్రం నిరంతరం కొనసాగించారు. ఎన్నికల కార్యక్రమాలలో 1956-57లో బాగా పాల్గొన్నారు. రాజకీయ రంగంలో మార్పులు రాగా స్వతంత్ర పార్టీ ఆవిర్భవించింది. రాజగోపాలాచారి, ఎమ్.ఆర్. మసాని, ఆచార్య రంగా, బెజవాడ రామచంద్రా రెడ్డి మొదలైనవారెందరో పార్టీ స్థాపకులుగా ఉన్నారు. నెహ్రూ సహకార వ్యవసాయ విధానంతో రైతులను నిర్వీర్యులుగా చేయదలిచారని ప్రచారం చేశారు. విజయరాజకుమార్ ఆవిషయాలను అనేక కరపత్రాలుగా చిన్న పుస్తకాలుగా రాసి ప్రచురించారు.
లోగడ 1950 ప్రాంతాలలో ఆంధ్రలో వినోబాభావే భూదానోద్యమాన్ని సాగించారు. దానిని రంగా పక్షం వ్యతిరేకించింది. ఆయన ధోరణి రైతులకు అనుకూలం కాదన్నది. విజయరాజకుమార్ ఆయన్ను ఒక సభలో తారసిల్లి త్యాగం అనేది గడ్డం పొడవును బట్టా, తినే ఆహారాన్ని బట్టా నిర్ణయించేది ? అని ఎద్దేవ చేశారు. స్వతంత్ర పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా విజరాజకుమార్ ప్రచారం చేశారు.
ఒకానొక సందర్భంలో విజయనగరానికి తాతా దేవకీనందన్ మున్సిపల్ ఛైర్మన్ గా వుండేవారు. ఆయన ఆహ్వానంపై ఆవుల గోపాలకృష్ణమూర్తి, విజయరాజకుమార్ వెళ్ళారు. బహిరంగ సభ ప్రారంభం కానుండగా విజయరాజకుమార్ తన పైపంచ కోసం వెతుకుతున్నారు. అప్పుడు గోపాలకృష్ణమూర్తి చమత్కరిస్తూ పైపంచ లేకపోతే ఉపన్యాసం పెగలదా? అని చమత్కరించారు. వేదికమీద ఉన్నవారు గొల్లుమన్నారు.
సంజీవరెడ్డి పై పోరాటం
విజయరాజకుమార్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయానికి స్థానిక సంస్థల పక్షాన సెనేట్ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. అప్పట్లో గోవిందరాజుల నాయుడు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ముఖ్యమంత్రి సంజీవరెడ్డిని పిలిచి గౌరవ పట్టాను సమర్పించారు. అలా గౌరవ డిగ్రీ ఇవ్వాలంటే సెనేట్ ఆమోదం వుండాలి. అది జరగనందుకు విజయ రాజకుమార్ అభ్యంతర పెట్టారు. కోర్టులో దావా వేశారు. కోర్టు కేసు తేలేవరకు సంజీవరెడ్డిని డాక్టర్ అని పిలవవద్దని ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. విజయరాజ కుమార్ కేసును నెల్లూరులో వేయగా ఆవుల గోపాలకృష్ణమూర్తి వాదించారు. వాయిదాలు పడుతూ వచ్చిన ఆ కేసు ఆసక్తికరంగా సాగినా చివరకు జడ్జీకి ధైర్యం చాలక కేసును తిరుపతి మార్చుకోమని తప్పుకున్నారు. విజయరాజకుమార్ కాపరాన్ని సంగారెడ్డికి మార్చారు. తెలంగాణా స్వతంత్ర పార్టీ పక్షాన పనిచేశారు. సంగారెడ్డిలో భూములు కొని వ్యవసాయం చేశారు. కానీ అది సాగలేదు. కనుక వాటిని అమ్మేసి ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. అది కూడా అంతంత మాత్రంగానే సాగింది.
ఆచార్య రంగా కాంగ్రెస్ లో తిరిగి చేరినప్పుడు విజయరాజకుమార్ మాత్రం ప్రతిపక్షంలోనే వుండేవారు. సంగారెడ్డిలో ఏమంత చురుకుగా రాజకీయం సాగలేదు. తన రచనలు అడపతడప సాగిస్తూ ‘కడలిమీద కోంటికి’ (Kon-tiki రచయిత Heyerdahl) అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. భారత ప్రధాని చరణ్ సింగ్ స్థాపించిన లోక్ దళ్ పార్టీలో చేరారు. రైతుల పక్షాన ఆయన పోరాటాలను సమర్థించారు. ఆయన రాసిన Economic Nightmare of India ను తెలుగులోకి అనువదించారు. ఆయన మరణానంతరం తెలుగు అకాడమీ ముద్రించింది. సంగారెడ్డిలో వుండగా బెంగుళూరు నుండి గణిత నిపుణురాలు శకుంతలాదేవి (22.4.2013న మరణించారు) వచ్చి మెదక్ నుండి లోక్ సభకు ఇండిపెండెంట్ గా పోటీ చేసారు. ఆమె సహకారం కోరిందని విజయరాజకుమార్ ప్రచారం చేశారు. డిపాజిట్ రాలేదనుకోండి. అది వేరే విషయం. విజయరాజకుమార్ కు హోమియోపతి వైద్యం పై మూఢనమ్మకం వుండేది. ఇతరులకు చికిత్స చేయటమే కాక తాను స్వయంగా వాడుకునేవారు. తనకు కిడ్నీస్ విఫలం కాగా హోమియో పతి ఏమీ కాపాడలేకపోయింది. ఉస్మానియా ఆసుపత్రిలో చేరి అక్కడ చనిపోయారు.ఈనాటికీ కమ్యూనిస్టు వ్యతిరేకిగా ఉపన్యాసకుడుగా ఆయన్ను కొద్దిమంది తలుచుకుంటారు. బహుశ ఉపన్యాసాల రికార్డు వుంటే బాగుండేది.
మంగళవారం, జులై 02, 2013
మాటకందని పాట
సుందర మధురగీతం "మాటకందని పాటగా" మన ముందు నిలిచింది. ఈ పాట మల్లెలతీరంలో సిరిమల్లెపూవు చిత్రం లోనిది. ఈ చిత్రం ఈ నెల 4 న అమెరికాలో, 6న భారతదేశంలో విడుదల కానుంది.
మాటకందని పాటగా మనమిద్దరము కలిసాముగా
మల్లె పువ్వుల దారిలో ఒక శ్వాసై అడుగేసాముగా
సుమాలు విరిసి సరసులొన ... పరాగమేమనమే
సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే
మాటకందని పాటగా మనమిద్దరము కలిసాముగా
బుధవారం, జూన్ 19, 2013
తధాగతుని ఆశిస్సులతో ఆంధ్ర నగరి పుస్తకావిష్కరణ

జూన్ నెల 16వ తేది, 2013 సాయంత్రం హుస్సైన్ సాగర్ నదిబొడ్డున జిబ్రాల్టర్ రాయిపై పై నెలకొన్న, మానవాళి కి పరిపూర్ణ సత్యాన్ని విప్పిచెప్పిన గొప్ప మానవతావాది బుద్ధుడి పాదాలచెంత, పెక్కు ఆసియా దేశాలకు నాగరికత, విజ్ఞానాన్ని పంచిన, కృష్ణా నది ఒడ్డున జ్ఞాన కుసుమాలతో విరాజల్లిన అమరావతి కథ "ఆంధ్రనగరి" ఆవిష్కరణ జరిగింది.
ఈ గ్రంధ రచయిత సాయి పాపినేని కి పురాతత్వశాస్త్రం పై మిక్కిలి ఆసక్తి. 25సంవత్సరాల క్రితం అమరావతిని మొదటిసారి సందర్శించినప్పుడు పొడసూపిన అనేక ప్రశ్నలకు సమాధానాలకై తనే అన్వేషకుడిగా మారి శోధించి సాధించిన జ్ఞాన ఫలం ఈ ఆంధ్రనగరి. అమరావతి కథను ఒక చారిత్రాత్మిక నవలగా ఆవిష్కరించారు.
ప్రస్తుతం నేను గతంలోకి, ఆంధ్రనగరి చరిత్ర పుటలలో మునిగిపోయా. తేలగానే ఈ పుస్తక విశేషాలు సవివరంగా, సచిత్రంగా చెప్తాను. అందాకా సెలవు.
శనివారం, మే 25, 2013
ఇద్దరు అమ్మాయిలతో
ఈ మధ్య వచ్చిన సినిమా సంగీతంలో ఈ చిత్రం లోని వయొలిన్ పాట మొదటి శ్రవణం లోనే మనలను ఆకట్టుకుంటుంది. ఈ పాట పాడినది డేవిడ్, అనిత. పాటకు సాహిత్యకర్త - విశ్వ. సంగీతం - దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటకు ఇద్దరు అబ్బాయిలు ఉత్సాహంగా, ఉల్లాసంగా నర్తించారు. వారు శశాంక్ ఇంకా శాయిక్రిష్. ఇంత జోష్ గా నర్తించిన ఇద్దరబ్బాయిలను అభినందిద్దాము. మీ కోసం పాట సాహిత్యం, యుట్యూబ్ గొలుసు దిగువున ఇస్తున్నా. విని, చూసి ఆనందించండి.
Girl.. Just Let me be your man..
I wanna hold your hand..
And take you to you fantasy..
Eyes.. When i look at into your eyes..
You make me realize..
Oh baby you're the only one for me..
Kaatamanam vaseekara.. premaathura
Moraggara manohara
Chathura nidhura chora katudhara
Girl gundello chotistha
Premanche choopistha
Nee lokam motham nenavutha
Come vennello thodavutha
Varsham lo needavutha
Neekosam nenu theeyani paatavutha
Everyday every night every warm every right
Neethone nadavali antunde manasu
Sumarajaneekara soma thripura
Madhura manohara naama
Naa vente nuvvunte naa sarvam nee vente
Ne anna anakunna neekantha thelusu
Aaa.. Sumarakaravara bheema abhaya
Athura parakrama shyamaa
Raave gulaabi maalika
Vayasa vaccchesa neede yee baalika
Girl gundello chotistha
Premanche choopistha
Nee lokam motham nenavutha
Come vennello thodavutha
Varsham lo needavutha
Neekosam nenu theeyani paatavutha
Every word every thought every mood every plot
Neethone saagali antunde vayasu
Pragadata shree gunasheela vinatha
Kathana kuthoohala vyaya
Addamla nee manasu premandam thelipindi
Kanuvinde chesindi oorinche sogasu
Mruduvachanamrutha lola rasika
Chiru darahasyavi bramha
Preme nishalo oogisa
Kudire vayase bagundi varasa
Girl.. You're like a crystal moon..
Such a refreshing tune..
You got me singing every verse..
Come.. In to my galaxy..
Come fly away with me..
And love is like the universe!
Lyrics: http://lyrics-tolly.blogspot.in/ సౌజన్యంతో.
గురువారం, ఫిబ్రవరి 28, 2013
మరణానంతరం జీవించటం ఎట్లా?
సమాధులు, డాలి సిటి, సాన్ ఫ్రాన్సిస్కో చిత్రం: సి.బి.రావు
రచయిత/బ్లాగర్ కు మృత్యువుంటుందా? సమాధానంగా అవును/కాదు అని చెప్పాల్సుంటుంది. బ్లాగర్ చనిపోతే అతని బ్లాగులేమవుతాయి? ట్విట్టర్ ఖాతా ఏమవుతుంది? ఫేస్ బుక్ ఖాతా నిద్ర పోవలసిందేనా? బ్లాగర్ చనిపోయిన విషయం అతని ఫేస్ బుక్ మిత్రులకెలా తెలుస్తుంది? ఒక రచయిత తన జీవిత కాలంలో కొన్ని విషయాలు దాచిపెట్టి తన మరణాంతరం మాత్రమే ప్రజలకు చెప్పాలంటే, ఏమి చెయ్యాలి? డిజిటల్ యుగంలో ఇవి రచయితలముందున్న పెను సవాళ్ళు.
అయోధ్యలో బాబ్రి మసీదు విధ్వంసం ఎలా జరిగింది? దానికి బాధ్యులెవరు? ఇలాంటి సున్నితమైన విషయాలను తను జీవించి ఉండగా స్వర్గీయ పి.వి.నరసింహారావు చెప్పలేదు. అయితే తన మరణాంతరం వెలువరించిన అయోధ్య డిసంబర్ 6, 1992 పుస్తకం ద్వారా చెప్పే ప్రయత్నం చేసారు. అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ స్వీయ చరిత్ర, ట్వైన్ కోరికపై తన మరణాంతరం 100 సంవత్సరాల తర్వాత ప్రచురించబడింది.
మృత్యువును ఎవరూ ముందుగా ఊహించలేరు, కాన్సర్ రోగులు తప్ప. మన కళ్ళముందే అహ్మెడాబాద్, ముంబాయి, పూనె,బెంగళూరు, కొత్త డిళ్లి ఇంకా హైదరాబాదు నగరాలలో విధ్వంసకారుల చే పేల్చబడిన బాంబుల వలన జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మనము చూశాము. ఎప్పుడు ఎవరు ఎలా పోతారో చెప్పలేము. ఆరొగ్య కారణాల వలన ఐతే ఏమి, టెర్రరిస్ట్ కార్యక్రమాలవలన ఐతే నేమి మృత్యువును ఎవరూ ఊహించలేరు.
రచయిత తన రచనల ద్వారా చిరంజీవై ఉంటాడు. మరణానతరం నేత్ర దానం, శరీర దానం వలన కూడా మనిషి జీవిస్తాడు. తన వారసులకు, ఇష్టమైన వారికీ వీలునామా వ్రాసి తన ఇష్ట ప్రకారం ఆస్తి పంచవచ్చు. ఇహ మిగిలింది తన e-mail, బ్లాగ్, ట్విట్టర్, ఫేస్ బుక్ తదితరాలు. వీటిని కొనసాగించటం ఎట్లా? దీనికీ ఉపాయం ఉంది. ఫేస్ బుక్ లో If I Die మరియు DeadSocial లాంటి అప్లికేషన్స్ లభ్యమవుతున్నాయి.
వీటి ఖాతాదారులు తమ మరణాంతరము ఉపయోగించుకునేలా పెక్కు సౌకర్యాలు కల్పించారు. ఈ అప్లికేషన్స్ బ్లాగరు మరణ వార్తను Facebook, Twitter & Linkedin ఖాతాలలో తెలియ చేస్తాయి. బ్లాగర్ తుది సందేశం లేక అతను చెప్పాలనుకున్న విషయాలను నిర్ణీత సమయాలలో అందచేస్తాయి. ఎవరు ఇంతవరకు చూడని దృశ్య, శ్రవణాలను తమ పాఠకులకు అందచేస్తాయి. ఫేస్బుక్ లో ఖాతా లేని వారికి కూడా ప్రత్యేక సందేశాలు అందించే సదుపాయం కూడా ఉంది. బ్లాగరు తన సంతానానికి, భార్యకు కూడా వ్యక్తిగత సందేశాలు పంపవచ్చును. భార్యకు వ్రాసే ఉత్తరంలో ఆస్తిపాస్తుల వివరాలు, జీవిత భీమా పాలసీ, బాంక్ లాకర్ ఇంకా వీలునామా వగైరా వివరాలు తెలుపవచ్చును. మనమలు, మునిమనమలకు ప్రతి సంవత్సరము వారి పుట్టిన రోజున తన సందేశాన్ని పంపవచ్చు; వారికి యుక్త వయస్సు వచ్చేదాకా. తన రచనలను, తన మరణానంతరం ప్రచురించాలనుకుంటే, కంప్యూటర్లో, ఒక ఫోల్డర్ లో, వాటిని భద్రపరచి, దాని రహస్య సంకేతపదం (పాస్వర్డ్) తన ట్రస్టీల కిచ్చి ఎప్పుడు వాటిని ప్రచురించాలో సూచింపవచ్చు.
ఈ సదుపాయం చెడుగా ఉపయోగించకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. బ్లాగరు మరణాన్ని తన మిత్రులు ధృవీకరించాక మాత్రమే ఈ అప్లికేషన్స్ తమ సేవా కార్యక్రమాలు మొదలు పెడ్తాయి. బ్లాగర్ తన తదనంతరం ఎవరికి ఎలాంటి సందేశాలు పంపాల్సింది నిర్ణయిస్తాడు. తన ట్రస్టీల ద్వారా బ్లాగు వగైరా ఖాతాలను తొలగించాలనుకుంటే ఆ పని కూడా సాధ్యమవుతిందిప్పుడు.
ఇవి కూడా చూడండి. Legacy Locker, Futuris.tk, Deathswitch, AssetLock. వీటిలో మీకు అనువైన ఖాతాను ఎంచుకొనవచ్చు.
రచయిత/బ్లాగర్ కు మృత్యువుంటుందా? సమాధానంగా అవును/కాదు అని చెప్పాల్సుంటుంది. బ్లాగర్ చనిపోతే అతని బ్లాగులేమవుతాయి? ట్విట్టర్ ఖాతా ఏమవుతుంది? ఫేస్ బుక్ ఖాతా నిద్ర పోవలసిందేనా? బ్లాగర్ చనిపోయిన విషయం అతని ఫేస్ బుక్ మిత్రులకెలా తెలుస్తుంది? ఒక రచయిత తన జీవిత కాలంలో కొన్ని విషయాలు దాచిపెట్టి తన మరణాంతరం మాత్రమే ప్రజలకు చెప్పాలంటే, ఏమి చెయ్యాలి? డిజిటల్ యుగంలో ఇవి రచయితలముందున్న పెను సవాళ్ళు.
అయోధ్యలో బాబ్రి మసీదు విధ్వంసం ఎలా జరిగింది? దానికి బాధ్యులెవరు? ఇలాంటి సున్నితమైన విషయాలను తను జీవించి ఉండగా స్వర్గీయ పి.వి.నరసింహారావు చెప్పలేదు. అయితే తన మరణాంతరం వెలువరించిన అయోధ్య డిసంబర్ 6, 1992 పుస్తకం ద్వారా చెప్పే ప్రయత్నం చేసారు. అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ స్వీయ చరిత్ర, ట్వైన్ కోరికపై తన మరణాంతరం 100 సంవత్సరాల తర్వాత ప్రచురించబడింది.
మృత్యువును ఎవరూ ముందుగా ఊహించలేరు, కాన్సర్ రోగులు తప్ప. మన కళ్ళముందే అహ్మెడాబాద్, ముంబాయి, పూనె,బెంగళూరు, కొత్త డిళ్లి ఇంకా హైదరాబాదు నగరాలలో విధ్వంసకారుల చే పేల్చబడిన బాంబుల వలన జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మనము చూశాము. ఎప్పుడు ఎవరు ఎలా పోతారో చెప్పలేము. ఆరొగ్య కారణాల వలన ఐతే ఏమి, టెర్రరిస్ట్ కార్యక్రమాలవలన ఐతే నేమి మృత్యువును ఎవరూ ఊహించలేరు.
రచయిత తన రచనల ద్వారా చిరంజీవై ఉంటాడు. మరణానతరం నేత్ర దానం, శరీర దానం వలన కూడా మనిషి జీవిస్తాడు. తన వారసులకు, ఇష్టమైన వారికీ వీలునామా వ్రాసి తన ఇష్ట ప్రకారం ఆస్తి పంచవచ్చు. ఇహ మిగిలింది తన e-mail, బ్లాగ్, ట్విట్టర్, ఫేస్ బుక్ తదితరాలు. వీటిని కొనసాగించటం ఎట్లా? దీనికీ ఉపాయం ఉంది. ఫేస్ బుక్ లో If I Die మరియు DeadSocial లాంటి అప్లికేషన్స్ లభ్యమవుతున్నాయి.
వీటి ఖాతాదారులు తమ మరణాంతరము ఉపయోగించుకునేలా పెక్కు సౌకర్యాలు కల్పించారు. ఈ అప్లికేషన్స్ బ్లాగరు మరణ వార్తను Facebook, Twitter & Linkedin ఖాతాలలో తెలియ చేస్తాయి. బ్లాగర్ తుది సందేశం లేక అతను చెప్పాలనుకున్న విషయాలను నిర్ణీత సమయాలలో అందచేస్తాయి. ఎవరు ఇంతవరకు చూడని దృశ్య, శ్రవణాలను తమ పాఠకులకు అందచేస్తాయి. ఫేస్బుక్ లో ఖాతా లేని వారికి కూడా ప్రత్యేక సందేశాలు అందించే సదుపాయం కూడా ఉంది. బ్లాగరు తన సంతానానికి, భార్యకు కూడా వ్యక్తిగత సందేశాలు పంపవచ్చును. భార్యకు వ్రాసే ఉత్తరంలో ఆస్తిపాస్తుల వివరాలు, జీవిత భీమా పాలసీ, బాంక్ లాకర్ ఇంకా వీలునామా వగైరా వివరాలు తెలుపవచ్చును. మనమలు, మునిమనమలకు ప్రతి సంవత్సరము వారి పుట్టిన రోజున తన సందేశాన్ని పంపవచ్చు; వారికి యుక్త వయస్సు వచ్చేదాకా. తన రచనలను, తన మరణానంతరం ప్రచురించాలనుకుంటే, కంప్యూటర్లో, ఒక ఫోల్డర్ లో, వాటిని భద్రపరచి, దాని రహస్య సంకేతపదం (పాస్వర్డ్) తన ట్రస్టీల కిచ్చి ఎప్పుడు వాటిని ప్రచురించాలో సూచింపవచ్చు.
ఈ సదుపాయం చెడుగా ఉపయోగించకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. బ్లాగరు మరణాన్ని తన మిత్రులు ధృవీకరించాక మాత్రమే ఈ అప్లికేషన్స్ తమ సేవా కార్యక్రమాలు మొదలు పెడ్తాయి. బ్లాగర్ తన తదనంతరం ఎవరికి ఎలాంటి సందేశాలు పంపాల్సింది నిర్ణయిస్తాడు. తన ట్రస్టీల ద్వారా బ్లాగు వగైరా ఖాతాలను తొలగించాలనుకుంటే ఆ పని కూడా సాధ్యమవుతిందిప్పుడు.
ఇవి కూడా చూడండి. Legacy Locker, Futuris.tk, Deathswitch, AssetLock. వీటిలో మీకు అనువైన ఖాతాను ఎంచుకొనవచ్చు.
గురువారం, జనవరి 31, 2013
ఆమె ఎవరు?
దెయ్యాలున్నయ్యా లేవా? ఆడదెయ్యం, మొగదెయ్యం ఇంకా కొరివి దెయ్యాలున్నాయా? ఆడదెయ్యం ఎప్పుడూ తెల్ల చీరలో మాత్రమే కనిపిస్తుందెందుకని? స్కూల్ విద్యార్ధులను ఎక్కువగా బాధించే సమస్య ఇది. అభివృద్ధి చెందిన దేశమైన ఉత్తర అమెరికాలో కూడా దెయ్యాలున్నాయని నమ్మే వారు అన్ని పట్టణాలలో ఉన్నారు. శాండియాగో, సవన్నా లాంటి పట్టణాలలో సాయం వేళలలో ప్రత్యేక పర్యటన కార్యక్రమాలున్నాయి, వీటి అన్వేషణకై. అసంతృప్తులైన వ్యక్తులే కొరికలు తీరక దెయ్యాలుగా వస్తారని నమ్మకం. నిన్న మొన్నటి దాక మనల్ని కనిపెట్టుకున్న మన ఆత్మీయులు, మరణం తరువాత కూడా మన బాగోగులు చూస్తారనే నమ్మకంలోంచే దెయ్యాలున్నాయన్న నమ్మకానికి రెక్కలొచ్చాయి.
ఇంతకీ దెయ్యాలున్నాయని మీరు నమ్ముతారా? అసలు వాస్తవమేమిటి? ఇక్కడ చూడండి.
బుధవారం, జనవరి 30, 2013
గాంధీజీ చివరి క్షణాలు
వెనిగళ్ళ వెంకటరత్నం
January 30, 2013
గాంధీజీ హత్య జరిగి 65 సంవత్సరాలు గడుస్తున్నా ఆయన జ్ఞాపకాలు భారతీయుల మనస్సులలో చెరగని ముద్రే వేశాయి. మహాత్ముడ్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామని పలువురి మేధావులు మధనపడుతున్నారు. గాంధీజీ శారీరకంగా ఏమంత బలవంతుడు కాడు. 20వ శతాబ్దాన్ని ప్రభావితం చేసిన వ్యక్తిగా చరిత్రపుటల్లో, సెల్యూలాయిడ్‌లో బంధించినా, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ‘అహింస- సత్యాగ్రహం’ ఆయుధాలుగా ఢీకొని భారతదేశ స్వాతంత్య్ర సముపార్జనకు ఎనలేని కృషిచేసిన ధీశాలి. దక్షిణాఫ్రికాలో మామూలు కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, నల్లజాతీయుల హక్కులకోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ‘అహింస- సత్యాగ్రహం’ ఆయుధాలుగా తొలిసారి అక్కడే ప్రయోగించాడు. ఒక రాజకీయాల్లోనే కాదు - దైనందిన జీవితంలో భాగమైన ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహారపు అలవాటు, ఆర్థిక విధానాల మీద తనదైన ముద్ర వేశాడు.
1948 జనవరి30న బిర్లా భవన్‌లో రోజువారి కార్యక్రమంలో భాగమైన సాయంత్రపు ప్రార్థనా సమావేశానికి తన మేనకోడళ్ళైన ‘అభ-మనుల’ను చేతి ఊతంగా చేసుకొని గుమికూడిన వారికి నమస్కారం చేస్తూ అడుగులేస్తుండగా గుంపులో నుంచి ఒక ఆగంతకుడు మనుని కిందకు త్రోసివేసి, తన పిష్టల్‌తో మూడు గుండ్లు గాంధీపై కాల్చగా- ఒక్కసారిగా ‘హేరామ్’ అంటూ గాంధీ నేలకొరిగి వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుశ్చర్యపట్ల అక్కడివారు నిశ్చేష్ఠులయ్యారు. వెంటనే లార్డ్‌మౌంట్ బాటన్, నెహ్రూ, పటేల్‌లు గూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అంతకుముందు కొద్ది రోజుల క్రితమే జనవరి 20న ప్రార్థనా సమావేశంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి బాంబు పేల్చాడు. గాంధీజీ వ్యతిరేకించినా, పటేల్ ఆదేశాల మేరకు అక్కడున్న జనసమూహాన్ని పోలీసులు సోదాచేశారు. అయినా నేరస్థుడ్ని గుర్తించలేకపోయారు. తనకు ప్రాణాపాయం ఉందని తెలిసినా పోలీసు భద్రత పెంచే విషయంలో గాంధీజీ పటేల్‌ను వ్యతిరేకించాడు.
1947 డిసెంబరులో ఒకరికి రాసిన లేఖలో తనకు మరణఘడియలు సమీపిస్తు న్నట్లు గాంధీజీ వ్యక్తం చేశాడు- దేవుని సేవలో మరణించాలని కోరుకున్నాడు. ‘రాముడే నా మార్గాన్ని నిర్దేశిస్తాడు. ఆయన ఆడించినట్లల్లా ఆడటమే నా పని. నా జీవితం ఆయన చేతుల్లో మాత్రమే ఉంది. ఈతరుణంలో నేనెంతో ప్రశాంతం గాఉన్నాను’. నెహ్రూ-పటేల్‌లను నెమ్మది పరచ డానికి మాత్రమే అదనపు పోలీసు భద్రతకు ఒప్పుకున్నట్లు తన స్నేహితుడు బిర్లాతో అన్నాడు. మృత్యువంటే తనకెలాంటి భయం లేదని చెప్పకనే చెప్పాడు.
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో అహింస మీద నమ్మకమున్నది నేనొక్కడ్నే కావొచ్చు. అహింసతో పోరాడేశక్తి ఇమ్మని భగవంతుడ్ని వేడుకుంటున్నాను. నా భద్రతకోసం ఏర్పాటు చేసిన పోలీసులు, మిలటరీ నన్ను కాపాడలేవు- రాముడు ఒక్కడే నాకు రక్షకుడు’ అన్నాడు.ఇంతటి ప్రాణభీతి ఉన్నా ప్రశాంతతో తన లక్ష్యం కోసం పని చేయసాగాడు. కాంగ్రెస్‌కి పథ నిర్దేశం, నెహ్రూ- పటేల్‌ల మధ్య అఘాథాన్ని పూడ్చ టమే తనముందున్న లక్ష్యాలుగా పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని గాంధీజీ- మౌంట్ బాటన్‌తో జరిపిన చిట్ట చివరి సమావేశంలో అన్నట్లు ఆ తరువాత బాటన్ తెలిపాడు. 30 జనవరిన పటేల్‌తో అతి ముఖ్యమైన విషయాలపై సుదీర్ఘ చర్చల కారణంగా ప్రార్థనా సమావేశానికి రావటం ఆలశ్యం అయింది.
అక్కడి భీతావాహ దృశ్యాన్ని చూసిన మౌంట్ బాటన్ సహాయకుడు- మరణంలో గూడా గాంధీజీ మోములో ఎంతో తేజస్సు ఉట్టిపడుతోంది. తను ధరించే గుండ్రటి కళ్ళద్దాలు తొలగించారు. అనేక ఏళ్ళుగా ఇవి గాంధీజి శరీరంలో అంతర్భాగంగా ఉన్నాయి. అగరొత్తుల పరిమళం, మహిళల రోదనలు వినవస్తున్నాయి. అతి బలహీనమైన గాంధీ పార్ధివదేహం నిద్రిస్తున్నట్టుగా గోచరిస్తోంది. అక్కడ ఎంతో మంది మౌనసాక్షులుగా నిలబడి ఉన్నారు. ఇలాంటి భీకర దృశ్యాన్ని నేనెన్నడూ చూడలేదు. అక్కడ నిలబడి ఉన్నానేగాని, గాంధీ లేని భారతదేశాన్ని ఊహించుకోవటమే భయంగా ఉంది. ఈ ఘటన నన్ను కలచివేసింది. గాంధీజీ ఏ విలువల కోసం పోరాడాడో ఆ విజయం ముందు తుపాకి గుళ్ళు తలవంచినట్లుగా భావిస్తున్నాను’ అని వాపోయాడు.
గాంధీజీ కార్యదర్శి ప్యారిలాల్‌కి తను మరణించినపుడు ఏం చెయాలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. తన పార్ధివదేహాన్ని ముందుతరాల వారి కోసం భద్రపరచడంగాని, పూజలు చెయ్యటంగాని వద్దు అన్నాడు. తన కోరికప్రకారం మర్నాడే హిందూ మతాచారాలకు అనుగుణంగా దహన సంస్కారాలు జరిగాయి. పెద్దసంఖ్యలో అధికారులు, అనధికారులు, పేద బిక్కి అందరూ దృఢసంకల్పుడూ, అకుంఠిత దేశభక్తుడు అయిన పూజ్య బాపూజీకి నివాళులు అర్పించారు. అదే రోజు రాత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన సంతాప సందేశాన్ని రేడియో ద్వారా వినిపించారు. తనకి రాజకీయ గురువూ, తనని అమితంగా అభిమానించే జాతిపితకు ఘనమైన నివాళులు అర్పించాడు. ‘మన జీవితాల్లోంచి ఉషస్సు అదృశ్యమైపోయింది. దేశంలో ప్రసరించిన కాంతి సామాన్యమైందికాదు.
ఆ కాంతి అద్యతన వర్తమానంకన్నా ఉన్నతా దర్శాలను ప్రతిబింబించింది. జీవితాన్ని, నిత్య సత్యాన్ని ప్రస్ఫుటింపజేసింది. తప్పిదాల నుంచి రుజుమార్గం వైపు నడిపించింది. ప్రాచీనమైన ఈ దేశాన్ని స్వేచ్ఛాపథం వైపు పయనింపజేసింది. గాంధీజీ మరణంతో మనకు జీవిత ఔన్నత్యం, జీవన సత్యం ద్యోతకమవుతున్నాయి. ఆయన ప్రవచించిన ఉత్తమాదర్శాలను అనుసరిస్తే భారతదేశం ఉత్తమ మార్గంలో పురోగమిస్తుంది’.దేశ విభజన గాంధీజీని ఎంతో బాధకు గురిచేసింది. భారత దేశంలోని ముస్లింలు పాకిస్థాన్ పోవడానికి, అక్కడి హిందువులు మన దేశంలోకి వచ్చే ప్రహసనంలో- హిందూ ముస్లింలు అతిక్రూరంగా ఒకర్నొకరు చంపుకోవడం గాంధీజీని కలిసివేసింది. ఇటు బెంగాల్, అటు పంజాబ్‌లలో శవాలు గుట్టలుగుట్టలుగా పడివున్నాయి. అలా చనిపోయినవారి సంఖ్య లక్షలలో ఉంది. రక్తం ఏరులై పారింది. విభజనకు గాంధీజీ మొదట్నుంచి వ్యతిరేకమే. ముస్లిం- హిందూనేతలు పరస్పరం విశ్వాసం కోల్పోయారు. అప్పటి రాజకీయ పరిస్థితులు ప్రకారం బ్రిటిష్ వారు చేయగలిగింది ఏమీ లేదు- విభజించి, దేశాన్ని వీడిపోవటం తప్ప. అది చారిత్రక తప్పిదమే. దేశ విభజన రాజకీయ నిర్ణయాలకు దూరంగా, కాంగ్రెస్ క్రియాశీల రాజకీయాలకు 1945 లోనే గాంధీజీ దూరంగా జరిగారు.
తను కలలుగన్న స్వరాజ్యం అంటే- ఆంగ్లేయుల నుండి లభించే రాజకీయ స్వరాజ్యం కాదు. స్వీయపాలనలో అన్ని మతస్థులవారూ కలిసిమెలిసి సామరస్యంగా జీవించగలగాలి. అప్పుడే స్వరాజ్యానికి సార్థకత.ఈ మతకల్లోలనుంచి భారత దేశం బయటపడాలంటే- కాంగ్రెస్‌లో గుణాత్మకమైన మార్పు రావాలి. ఆ దిశగా కాంగ్రెస్‌కి కొత్త రాజ్యాంగ రచన తయారుచేయాలని భావించారు. 1946లోనే ఈ ఆలోచన మొగ్గ తొడిగింది. చివరి రోజుల్లో ఆయన ప్రతి ఘడియ దీనికోసం తీవ్రంగా ఆలోచించారు. తన ఆలోచల్ని 1948 జనవరి 29న తయారు చేసిన ముసాయిదాని గాంధీ ఆఖరి ప్రకటనగా పేర్కొన్నారు. దాని ప్రకారం- కాంగ్రెస్ - అధికారం కోసం పనిచేసే పార్టీ కాగూడదు. ప్రజాసంక్షేమం కోసం గ్రామస్థాయిలో కార్మిక- కర్షకులకోసం పనిచేస్తూ వ్యవసాయం, చేతివృత్తులను బ్రతికించు కోవాలి. అప్పుడే వారు స్వయం సమృద్ధి సాధించగలరు. ఓటుహక్కు వినియోగించే విధంగా వారిని విద్యాధికులుగా చెయ్యాలి. వీరందరూ విధిగా ‘ఖాదీ’ ధరించాలి. క్రమంగా కాంగ్రెస్ గాంధీజీ ఆశయాలకు దూరంగా జరిగిపోయింది. చివరిగా 1947లో ఎ.కె. ఆజాద్‌తో ‘నేను ఎంతో ధైర్యంగా ప్రచారంచేసిన అహింస ఈనాడు పరీక్షా సమయాన్ని ఎదు ర్కొంటోంది. పరస్పరం చంపుకోవడంచూస్తూంటే- ‘అహింస’ ఎప్పుడో చనిపోయిం’దని ఆవేదన చెందాడు. జీవితాంతం సత్యాగ్రహం, అహింస సిద్ధాంతాలతో పెనవేసుకొన్న గాంధీ జీవితం ఉన్మత్తుడైన హిందూ యువకుని పిస్టల్ బులెట్‌తో పరిసమాప్తం కావటం అత్యంత విషాదకరం.
సూర్య దినపత్రిక సౌజన్యంతో