సోమవారం, డిసెంబర్ 21, 2009
పుస్తకాలకై ప్రజావాహిని - నాలుగో రోజు
e తెలుగు స్టాల్ సందర్శకులకు e తెలుగు గురించి వివరిస్తున్న రవిచంద్ర
శ్రీనివాస ఉమాశంకర్ సరస్వతుల (బ్లాగు పేరు: అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!! ), స్వాతి ఉమాశంకర్ - ఉమాశంకర్ ఈ రోజు e తెలుగు సభ్యత్వం తీసుకొన్నారు.
PVSS శ్రీహర్ష (బ్లాగు పేరు: కిన్నెరసాని ) , సుజాత (మనసులో మాట ) స్టాల్ సందర్శకులతో
శ్రీ Y కృష్ణమూర్తి (Vice President & India Center Head Virtusa, Hyderabad) కు e తెలుగు గురించి వివరిస్తున్న చక్రవర్తి ( భవదీయుడు) ఇంకా మురళీధర్ నామాల (మురళీ గానం)
స్టాల్ మూసివేసే సమయంలో వచ్చారు బి.వెంకటరమణ (A tv, script writer). అర్చనలహరి అనే పుస్తకం రచించారు. ఇంద్ర సినిమా కు సహ రచయితగా సంభాషణలు వ్రాశారు. వారి మాటలలో పదునుంది. ఎంతైనా మాటల రచయిత గదా, ఆమాత్రం లేకుంటే ఎట్లా? బ్లాగు (తెలుగులో) తెరవాలని ఉత్సాహంతో ఉన్నారు. సాంకేతిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. e తెలుగు గురించి వివరిస్తున్న సతీష్ కుమార్ (సనాతన భారతి)
పుస్తక ప్రదర్శన శాల లో ప్రతి సాయంత్రం ఉండే కార్యక్రమాలలో భాగంగా ఫాషన్ పరేడ్ లో వయ్యరి భామలు పుస్తకాలతో పుస్తకనడక చేశారు. మోడల్స్ చేతుల్లో మీ అభిమాన రచయితల పుస్తకాలు, ఊహకందని విషయం కదా.
ఫాషన్ పరేడ్,పాటలతో సాయం సమయం పుస్తకాల మధ్య పోటెత్తిన జనంతో ఆహ్లాదంగా గడిచింది.
గొడుగు లోపలి వాన ఎలా వుంటుందో వివరిస్తారు శివశంకర్ (ఆరాధన) - మన e తెలుగు స్టాల్ లో తన బ్లాగు ఉంచిన Free domain గురించి వివరించారు. చిత్రంలో నుంచున్న వారిలో మధ్యన ఉన్నారు.
ఇతర విశేషాలు:
కంప్యూటర్ కు తెలుగు నేర్పటం ఎలా అనే విషయంపై నల్లమోతు శ్రీధర్ గారి వ్యాఖ్యానంతో కూడిన వీడియోను డిజిటల్ ప్రొజెక్టర్ సాయంతో మన స్టాల్ లో ప్రదర్శించాము. మన స్టాల్ నుంచి వినిపించే "తెలుగుభాష తియ్యదనం, మా తెలుగు తల్లికి" పాటలు 5000 పై చిలుకు సందర్శకులను మన వద్దకు తెచ్చాయి. CD లు మొత్తం అయిపోయి అడిగిన అందరికీ CD లు ఇవ్వలేని పరిస్థితి. ఇవ్వాళ ఆదివారం కావటం ఈ అనూహ్య స్పందనకు కారణం. సందర్శకులతో మహా సందడిగా ఉంది మన స్టాల్. ఈ రోజు కార్యక్రమాలలో భాగంగా వినోద వేదిక పై పాటలు పాడుతున్న చిన్నారులకు e తెలుగు ఒక పోటీ పెట్టింది - మా తెలుగుతల్లికి పాట తప్పులు లేకుండా పాడాలని. చక్కగా పాడిన ముగ్గురు చిన్నారులకు చక్రవర్తి,, సతీష్ ల ద్వారా e తెలుగు CD లు కానుకగా అందచేశాము.
ఈ రోజు మన స్టాల్ కు విచ్చేసిన వారిలో కస్తూరి మురళీక్రిష్ణ , గీతా చార్య , రవికిరణ్ (పూలవాన) , నువ్వుసెట్టి సోదరులలో ఒకరైన కిషోర్ (నువ్వుశెట్టి బ్రదర్స్) ఉన్నారు. ఇంకా పూర్ణిమ , సౌమ్య, లక్ష్మి (నేను -లక్ష్మి), సుజాత, లక్ష్మి వెదురుమూడి (ముద్దబంతి...తెలుగింటి ముంగిట), విజయశ్రీ (నేను సైతం బ్లాగ్లోకంలో) (ఈ బ్లాగు లింక్ తెలిసిన వారు నాకు తెలియపరచకోరుతాను).
ఇంకా చివరగా బ్లాగర్ అనూరాధ (శ్రీనివాస్ భాగి భార్య) (బ్లాగు: మహాగీతా మ్యుజిక్) వచ్చారు. శ్రీమతి అనూరాధ గూగుల్ ఉద్యోగిని. వీరు సంగీతాభిమానులు.
Photos: cbrao Canon Powershot SD1100IS
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 కామెంట్‌లు:
సర్
మీరు ప్రచురించిన మొదటి ఫొటో లొ మెరూన్ వైట్ కలర్ చుడిదార్ అమ్మాయిని నేనె నా పేరు భారతి నా చెల్లెలు విజయశ్రీ తను అమెరికా లో వుంటుంది నేను హైదరాబాదు ఇద్దరం కలిసి నేను సైతం బ్లాగు లోకంలో అనే బ్లాగు రాస్తున్నాము చదివి మీ అభిప్రాయాలు తెలియచెయంది అందరిని కలిసినందుకు ఆనందంగ వుంది www.vijayasribharathi.blogspot.com
ఈ ఫాషన్ పెరేడ్ ఏమిట పుస్తకాలు చదవమని పిల్లినడకలు నడుస్తూ వీళ్లు చెప్తే కానీ గ్రహించలేమా? ఇంతకీ వాళ్ల చేతిలో పుస్తకాలేమిటో వాళ్లకు తెలుసా అని? బుక్ ఫేర్ లో కూడా ఇలాంటివి తప్పదా?
ఈ క్రింది పోస్టునో సారి చూడండి. ఎక్కడ ఎలా వీలయితే అక్కడ అలా ఉపయోగించుకోవచ్చు.
http://kasstuuritilakam.blogspot.com/2009/09/blog-post_4654.html
Actually I thought fashion parade with books is a cool idea
ఫ్యాషన్ పరేడ్ పేరుతో ఆడ మోడల్స్ ‘పిల్లి నడక’లు వాణిజ్య ఉత్పత్తులకు మాత్రమే పరిమితమని ఇన్నాళ్ళూ భావించాను. ఈ జాడ్యం ఇప్పుడు పుస్తకాలకు కూడా పాకిందంటే చాలా విచారంగా అనిపిస్తోంది!
‘వయ్యారి భామలు... పుస్తక నడకలు’... బావుందండీ. ‘మోడల్స్ చేతుల్లో అభిమాన రచయితల పుస్తకాలు ’- ఊహక్కూడా అందని విషయమే...నిజంగా!
ఇన్నాళ్ళూ ఈ ఫ్యాషన్ పరేడ్ లు లేక పుస్తక ప్రపంచం ఎంత చిన్నబోయిందో కదా!
కొత్తపాళీగారూ,
పశ్చిమ సంస్కృతికి ఇటువంటి ఆలోచనలు కూల్ గానే కనపడొచ్చు! ఇన్నోవేటివ్ గానే ఉండొచ్చు! కానీ మరి మేమున్నది ఆంధ్ర దేశంలోకదండీ!ఇంత "హాట్" అయిడియాను జీర్ణించుకోలేకపొతున్నాం
రాంప్ షోలు, కాట్ వాక్ లు ఒక వస్తువును వ్యాపార రీతిలో మార్కెట్ చేసుకోడానికి తప్ప వాటివల్ల వేరే ప్రయోజనం ఏముంది? చివరకు సమాజ హితాలైన పుస్తకాలకు కూడా హొయలొలుకుతూ నడిచే భామల చేతిలో పడి "మార్కెట్"అయ్యే పరిస్థితి వచ్చిందే అన్నదే నా బాధ!
"పుస్తకం అమ్ముడు పోతే చాలు" అనుకునే పబ్లిషర్లు దీన్ని సమర్ధిస్తారేమో గానీ పుస్తక ప్రియులు మాత్రం కాదు.
happy new year
కామెంట్‌ను పోస్ట్ చేయండి