శుక్రవారం, నవంబర్ 12, 2010

C.N.N. ఉత్తమ పురుషుడు నారాయణన్ కృష్ణన్


నారాయణన్ భారత దేశం లో, ఒక ఐదు నక్షత్రాల హోటల్లో పనిచేస్తున్నపుడు, అతని పనితనానికి గుర్తింపుగా స్విట్జర్లాండ్ లో పెద్ద హోటల్లో ఛెప్ గా ఉద్యోగం వచ్చిన సందర్భంలో స్వగ్రామమైన మధురైను సందర్శించాడు. అక్కడి కాలిబాటలపై నివసించే ఆర్తుల దీనావాస్థ అతన్ని ఎంతగానో కదిలించింది. స్విట్జర్లాండ్ వెళ్లినా, ఆకలితో తన మలాన్ని తనే తినే మధురై లోని మతిభ్రమించిన క్షుద్బాధితుడి దీనమైన మొహం గుర్తుకొచ్చి, అక్కడ పనిచేయలేక భారత్ వచ్చేశాడు. ఈ దీనుల కోసం తనే ఒక ట్రస్ట్ స్థాపించి , వారికి ముప్పూటలా , సెలవు లేకుండా , సంవత్సరం పొడుగునా ఆహారం అందించ సాగాడు. మధురై నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో తన సేవా కార్యక్రమాలు అలుపెరగక 2002 సంవత్సరం నుంచి కొనసాగిస్తున్నాడు. మధురైలో వంట గదిలో మిగతా పనివాళ్లతో కలిసి నిద్రిస్తూ, ఎలాంటి జీత భత్యాలు లేకుండా ఎనిమిదేళ్లుగా శ్రమిస్తున్నాడు.

ఈ పనులకై తను ఆదా చేసి దాచుకున్న రూ.1,15,000/- ట్రస్ట్ కు ఇచ్చాడు. రోజువారీ ఖర్చులకు రూ. 15042/- ఖర్చువుతున్నాయి. దాతలు ఇచ్చే విరాళాలు నెలకు 22 రోజులకు సరిపోతే, తనకు తాతనుంచి సంక్రమించిన ఇంటి ఆదాయం నుంచి రూ.4048/- ఖర్చు చేస్తున్నాడు. ఇంతవరకు 12 లక్షల భోజనాలు ఆర్తులకందివ్వగా తాను బతకటానికై తల్లి తండ్రుల సహాయం పై ఆధారపడ్డాడు. C.N.N. వారు ఇతనిని మానవులకు సహాయపడే అత్యుత్తమ వ్యక్తులలో ఒకరిగా గుర్తించారు. ఈ గుర్తింపుతో నారాయణ్కు $25,000 బహుమతి లభింస్తుంది. అంతే కాదు మీరు ఒక నిమిషం సమయం వెచ్చించి అతనికి ఓటు వేసినట్లయితే మరొక $100,000 అదనపు బహుమతి లభించగలదు. ఓటు వేసి నారాయణన్ చేస్తున్న మంచి పనికి సహాయపడండి.
మరింత సమాచారానికై ఇక్కడ చూడవచ్చు. నారాయణన్ కృష్ణన్ గురించిన వీడియో కింద చూడ గలరు.



మీ ఓటు ఇక్కడ వేయండి. త్వరపడండి. ఈ వోటు సౌకర్యం నవంబర్ 18 ఉదయం 6 గంటలకు (అమెరికా తూర్పు సమయం) ముగుస్తుంది. తప్పక వోటు వేస్తారు కదూ!

1 కామెంట్‌:

Shiva Bandaru చెప్పారు...

వోటేసాను

కామెంట్‌ను పోస్ట్ చేయండి