ఆదివారం, నవంబర్ 01, 2015

వేదిక -సాహిత్యంతో మనం: అక్టోబర్ '15 సమావేశం

అక్టోబర్ 11, 2015 న కుకట్‌పల్లి, హైదరాబాదులో వేదిక -సాహిత్యంతో మనం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అచ్యుత రామయ్య యాళ్ళ  కథ  "మూడో మనిషి"  మీద చర్చ ఆ తరువాత వేమూరి సత్యం గారు తనకు నచ్చిన ఆంగ్ల  నవల The Unlikely Pilgrimage of Harold Fry- Rachel Joyce ను  పరిచయం చేశారు.

“ఆమె నవ్వు”  అనే కథల సంపుటిని అచ్యుత రామయ్య వెలువరించారు. హైదరాబాదులోని కాలుష్య నియంత్రణ మండలిలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న అచ్యుతరామయ్య గొప్ప ప్రగతిశీల దృక్పథమున్న కథకుడు. “రామాయణ విషవృక్షం” (రంగనాయకమ్మ), “ (Your Erroneous Zones)” ( Dr. Wayne W. Dyer) అనే  పుస్తకాలు తనను ప్రభావితం చేశాయి.

"మూడో మనిషి" కథలో మూడు కనిపించే పాత్రలు ఇంకా ఒక ఒక అదృశ్య వ్యక్తి కలిపి మొత్తం నాలుగు పాత్రలు మాత్రమే. శివ, జనార్దన్ కాఫీ హౌస్ లో కూర్చుని శివ సమస్య గురించి మాట్లాడుకోవటంతో కథ మొదలవుతుంది. శివ ప్రేమించి పెళ్ళిచేసుకున్న జాహ్నవితో శివకు పొసగటంలేదు. రాత్రి పడక సమయంలో ఒక అదృశ్య వ్యక్తి వచ్చి వారివురి మధ్యా పరుండటంతో సమస్య మొదలవుతుంది. జనార్దన్ అది శివ యొక్క భ్రమగా తలిచి, ఆ రాత్రికి వారి పడక గది దృశ్యాలను కెమెరా తో చిత్రీకరించమంటాడు. ఆశ్చర్యంగా కెమెరా లోని చలన చిత్రంలో ఆ అదృశ్య వ్యక్తి శివకు, జనార్దన్ కూ గోచరమవుతాడు. శివకు, జాహ్నవికి మధ్య సంసారంలొ చిచ్చుపెట్టిన ఆ మూడవ అదృశ్య వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నకు  జవాబు పాఠకుల ఊహకే వదిలేస్తాడు రచయిత.

"మూడో మనిషి" కథ లో మంచి టెక్నిక్ ఉందని భవదీయుడి అభిప్రాయం. చదివి మీ అభిప్రాయం తెలియచేయండి.

పూర్తి కథ కింద ఇచ్చిన గొలుసులో చూడవచ్చు.


Sitting From your left.
Smt Krishna Kumari, Koganti Jamuna Rani, Paripurnamma (Mother of Dasari Amarendra), Jayalakashmi R, Choopu Katyayani, Mani Vadlamani, Sireesha (Eldest sister of Amarendra and she runs Aalambana for kids, the non profit organization), Vasireddy Narayana Rao (brother of Vasireddy Sitadevi), Swapna Srinivas.

Standing
Hemachandra Balantrapu, Ponnada Vijaya Kumar, Satyam Vemuri, Yalla Atchyutharamiah (Author of muDo manishi which was discussed in this meeting) Kasi Nagendra Prasad, Chandrasekhar Azad, Kiran Kumar, Dasari Amarendra, C Bhaskar Rao.

వేమూరి సత్యం గారు సభికుల సౌకర్యం కోసం తొలుత "మూడో మనిషి" కథ శ్రావ్యంగా చదివి వినిపించారు.
ఆ పై, చర్చలో పాల్గొంటూ పి.చంద్రశేఖర్ ఆజాద్ ఈ కథ అసంబద్ధంగా ఉంది. చెప్పాల్సిన విషయం సూటీగా చెప్పటంలో రచయిత విఫలమయ్యారన్నారు. సి.బి.రావు మాట్లాడుతూ జనార్దన్ కూడా శివ కళ్ళజోడు లోంచే చూడటం వలన తనకూ మూడవ వ్యక్తి గోచరించాడన్నారు. మరొక సభికుడు మాట్లాడుతూ ఈ కథ తొలి పుటలోనే సమాప్తమయ్యిందన్నారు. చెప్పుకోవటానికి శివ జాహ్నవిలది ప్రేమ వివాహమైనా ఒకరి ఆర్థిక పరిస్థితి మరొకరు బేరీజు వేసుకొన్న తరువాతే వారి ప్రేమ పెళ్ళి కి దారితీసింది. ఈ పెళ్ళి లో బలమైన ఆర్థిక పరిస్థితి  మంచి పునాదిగా ఉండి, అదే వారి మధ్య బలహీనమైన ప్రేమకు కారణభూతమయ్యింది. డబ్బుపై యావే వారి మధ్య మూడవ వ్యక్తి రూపంలో శివకు కనిపిస్తాడు. మరొక శ్రోత మాట్లాడుతూ జనార్దన్ కు కూడా చిత్రం లో మూడవ వ్యక్తి కనిపించటం కథలో బలహీనత అని అభిప్రాయ పడ్డారు.



Left to right M/S Vemuri Satyam, Achyuta Ramayya and Chandra Sekhar Azad.

చర్చ ఆసక్తికరంగా జరగటానికి కారణం చర్చకు ఎంచుకున్న కథ కొన్ని విషయాలు చెప్పి, మరి కొన్ని చెప్పకా పాఠకులను కొంత అయోమయంలో పడేయటమే. చివరగా రచయిత అచ్యుత రామయ్య యాళ్ళ  మాట్లాడుతూ  తన కథపై చర్చించిన వేదికకు ధన్యవాదాలు తెలుపుతూ పఠికుల అభిప్రాయాలు విన్నాక తాను చెప్పదలుచుకున్నది పాఠకుడికి అందచేయకపోవటం  రచయితగా తన వైఫల్యమన్నారు. భవిష్యత్లో తన కథలను ప్రచురించక ముందే వేదిక లో చదివి శ్రోతల అభిప్రాయాలు విని, ఆ పై కథలో మార్పులు చేసాకే ప్రచురిస్తామన్నారు. ఇది శుభపరిణామం. మరిన్ని మంచి కథలకు వేదిక, వేదిక కాగలదని ఆశించవచ్చు.

4 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

nenu katha chadavaledu. Kaani, charcha, snehapurvakam ga nijayithi ga saginatlu kanipisthondi.

Deepthi dhara, deepthimantham ga undi.

Abinandanalu, dhanyavadalu.

Unknown చెప్పారు...

Spice andhra ఒక్క గొప్ప online తెలుగు న్యూస్ పొర్తల్ ఇక్కడ మీరు కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవచ్చ.

bhumika చెప్పారు...

meeru cheppina naa radio interview link dorakaledu bhaskar rao garu.

cbrao చెప్పారు...

@Bhumika: భూమిక పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి గారితో ముఖాముఖి
http://deeptidhaara.blogspot.in/2011/06/blog-post.html

కామెంట్‌ను పోస్ట్ చేయండి