శనివారం, అక్టోబర్ 07, 2006

పర్యావరణ సమతుల్యం : పక్షులు


Photo by cbrao

ప్రకృతిని, అందులోని జీవజాలాన్ని రక్షించడం ఎలా, ఏం చెయ్యాలి ? అంటే, వాటి జోలికెళ్ళక పోవటమే సరైన చర్య అంటే కొంత ఆశ్చర్యం కలుగక మానదు. వాస్తవం ఏమంటే, మనిషి తన స్వార్థానికై, అడవులను, కలప మరియు ఖనిజాలకై ఆక్రమించటంతో ప్రకృతి సమతుల్యం దెబ్బతిని వృక్ష, జంతుజాలాల మనుగడకు తీరని విఘాతం కలుగుతుంది.


Jerdons Courser

ఉదాహరణకు కలివికోడి పక్షిసంగతి మాట్లాడు కొందాం. T.C. Jerdon అనే British Surgeon కడపజిల్లాలో కనుగొన్న ఈ పక్షి, ఈ మధ్య వార్తల లోకి వొచ్చింది . కనుమరుగైందనుకున్న కలివికోడిని, భరత్ భూషణి అనే పక్షి శాస్త్రజ్ఞుడు 86 ఏళ్ళ తరువాత మళ్ళ కనుక్కొవడం జరిగింది. బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీ , Bird watchers Society of A.P. మరియు Department of Forest వారి కృషితో శ్రీలంకా మల్లేశ్వరం అభయారణ్యం ఏర్పడింది. అక్టోబరు 2005న తెలుగు గంగ కాలువపనులు ఈ అభయారణ్యం గుండా జరుపటానికి జరుగుతున్న ప్రయత్నాలు, భరత్ భూషణ్ గుర్తించి , సంబంధిత అటవీఅధికారులను సకాలంలో హెచ్చరించంటతో, కాలువనిర్మాణపనులను అటవీఅధికారులు ఆపివేసి, కలివికోడి ఆవాసాన్ని రక్షించారు. BNHS, BSAP, WWF ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చించి, కాలువ గతిని మార్చేప్రయత్నంలో కృతకృత్యులైనారు. మన రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు పక్షికేంద్రాన్ని దర్శిస్తే మనకు అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. BSAP సభ్యుడు మృత్యుంజయ రావు ఈ కేంద్రం అభివృద్ధికి చాలా కృషిచేసినారు. పక్షులను గ్రామస్తులు ఉపయోగ కరమైనవిగా గుర్తించటం వెనుక వీరి కృషి ఉంది. తొలుత పక్షులు రెట్టలు వేసి, చెరువు నీటిని పాడుచెయ్యడం వలన ఆ నీరు త్రాగడానికి పనికి రాకుండా పోయింది. స్నానం చేస్తే ఒళ్ళు దురదలు. గ్రామస్తులు కోపంతో, పక్షులకు ఆశ్రయమిస్తున్న చెరువులోని కొన్ని చెట్లను కొట్టివేసారు. దీనితో వలస పక్షులకు ఆవాసం కరువైంది. సంబంధిత అధికారులను కలసి, పక్షి కేంద్రం ఏర్పాటు అవసరాన్ని వివరించాక, ఇక్కడ పక్షి కేంద్రం స్థాపించారు. కాపలాదారునికూడా నియమించటం జరిగింది. పక్షులు వేసిన రెట్టలతో , సారవంతమైన నీరు , నేడు వ్యవసాయానికి ఉపయోగించి ఎక్కువ దిగుబడి పొందగలుగుతున్నారు రైతులు. సంబంధిత అధికారులు గ్రామస్తుల దైనందిక అవసరాలకు నీటి పంపిణి చెయ్యటంతో, పక్షుల మరియు గ్రామీణుల మధ్య ఘర్షణ తొలిగింది. ఇప్పుడు ఒకరికి ఒకరు మిత్రులైనారు.
ఒక ప్రదేశం యొక్క పరిసరాల స్వచ్ఛతను అక్కడి గాలి, నీరు మరియు అక్కడి జీవజాల పరిస్థితులను చూసి తెలుసుకోవచ్చు. కొంత కాలం క్రితం రసాయనాల రాకతో కలుషితమైన హుస్సేన్ సాగర్లో, చేపలు చనిపోవటం గమనించటం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంవారు సాగరజలాలను శుద్థి చేసే ఆలోచనలో ఉన్నారు. ఇది మెచ్చుకోదగ్గ పరిణామం.

కొల్లేరు సరస్సులో మితిమీరిన ఆక్రమణల వలన, సరస్సు వైశాల్యం కుంచించుకుపోయి, 2005లో ఏలూరు తదితర ప్రాంతాలలో వరదలు వచ్చి, పంటపొలాలకు తీవ్రనష్టం కలిగింది. వలస పక్షులు సరైన వసతి, ఆహారం లేక ఈ సరస్సు నుంచి వేరే ప్రాంతాలను ఎంచుకొంటున్న తరుణంలో కొల్లేరు పునరుద్ధరుణ పనులు, ప్రకృతి సమతుల్యానికి ఎంతో ప్రాణమై నిలుస్తాయి. ప్రకృతిని ప్రేమించండి. పర్యావరణాన్ని కాలుష్యం భారినుండి కాపాడండి. ప్రకృతి పచ్చగా ఉన్నంతకాలం, మానవుడి మనుగడకి ఢోకాలేదు.
మీవంతు కృషిగా Bird watchers society of Andhra Pradesh, World Wildlife Fund వంటి సంస్థలలో సభ్యులుగా చేరి, ప్రకృతి సమతుల్య పరిరక్షణలో చేయూత నివ్వండి.
- - 25th July 2006 న ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం, ఉదయ తరంగిణి కార్యక్రమంలో ప్రసారమయ్యింది.

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీరు కాస్త తీరిక చేసుకుని పక్షుల గురించి, పక్షి పరిశీలనా శాస్త్రం గురించి వికీపీడియాలో రాయగలరేమో చూడండి, రావుగారు. వికీకి అదొక అలంకారం అవుతుంది.

అన్నట్టు వికీలో కలివికోడి గురించిన వ్యాసం ఉంది.

Naga చెప్పారు...

Bird watchers society గురించి మరో విషయం. మా ఇంటికి ప్రతిరోజూ వందకు తక్కువగా కాకుండా పక్షులు ఆతిధ్యం స్వీకరిస్తుంటాయి. ఇంటి దగ్గరే నివసించి కాపురం చేసేవి ఎక్కువ...

cbrao చెప్పారు...

చదువరి - నెల్లురు, నేలపట్టు పక్షి సంరక్షణా కెంద్రం వెళ్తున్నా. వచ్చాక వికి లో రాయాలి.

నాగరాజా - మీ ఇంటికి వచ్చే పక్షుల ఛాయా చిత్రాల బ్లాగు మీరు చెస్తే బాగు.

Ann Arbor లో కూద ఇలా పక్షులు వచ్చే ప్రదెశాలున్నాయా?

అజ్ఞాత చెప్పారు...

రావు గారూ, తప్పకుండా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి