ఈ సారి సమావేశం విశాలమైన University of Hyderabad Campus లో జరిగింది. పచ్చటి చెట్లు, చిన్న చిన్న నీటి కాసారాలతో, రమణీయ ప్రకృతిలో ఓలలాడుతుందీ ప్రాంగణం.  ఈ సమావేశం విజయవంతంగా జరిగింది. ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో హాజరయ్యారు. కొత్తగా వచ్చిన మిత్రులు. 1) P.Bhargava Ram వీరు కశ్యప్ సోదరులు. కలం పేరు 'నలుగురిలో నారాయణా.  వీరి రచనలు telugupeople.com లో కనిపిస్తాయి. ఈ భార్గవ రాముడు  University of Hyderabad లో M.A. -Drama, performing arts Course చదివే విద్యార్థి. కశ్యప్ 'గుంపులో గోవిందం' అనే పేరుతో రచనలు చేస్తారు.  ఈ సమావేశానికి వచ్చిన మరో కొత్త మిత్రుడు రొహిణీ కుమార్.  చావా కిరణ్, వెంకట రమణ, సుధాకర్  ఇంకా ఈ రొహిణీ కుమార్ అంతా గచ్చిబౌలి (Hyderabad) లోని ఒక M.N.C లో software development లో ఉన్నారు. రొహిణి కు ఇంకా ఎలాంటి బ్లాగు లేదు. బ్లాగులంటే ఇష్టం ఉంది.  
  సమావేశపు విశేషాలు కోసం ఇక్కడ చూడండి:
http://telugu.wordpress.com/2006/11/13/hyd-meet-nov2006/  
మీ కోసం సమావేశ చాయా చిత్రాలు కొన్ని జత పరుస్తున్నా. మీ అభిరుచి ప్రకారం రాబోయే సభా కార్యక్రమ నివేదికలలో Photos ఉంచాలా వద్దా అనే నిర్ణయం జరుగుతుంది. 

From left to right Veeven (Standing), Bhargava ram, cbrao, Venkata Ramana, Trivikram and  Sudhakar.

From left to right Chava Kiran, Srinivasa Raju and Sri Harsha.

From left to right Kasyap, Veeven, Trivikram and  Sudhakar.

From left to right Front row 1 Srinivasa Raju and Kasyap
                         Row2 cbrao
                         Row 3 Chaduvari and Veeven
                         Row 4 Venkata Ramana, Trivikram, 
                         SriHarsha,Chava Kiran,Sudhakar and 
                         Rohini Kumar
 
8 కామెంట్‌లు:
ఈ టపా రాసినందుకు చాలా కృతజ్ఞతలు. ఫొటోలు నా లాంటి వారికి కనీసం చూసి, చదివి తరించే భాగ్యాన్ని కల్పిస్తాయి. కానీ సభ్యులెవరికైనా గోప్యతా సమస్యలుంటే ఫొటోలు పెట్టిన టపాకు పాస్‌వర్డ్ పెట్టి కేవలం తెలుగు బ్లాగు సభ్యులకు దాన్ని అందజేయవచ్చు. ఇంకా సభ్యుల పేర్లను వీలైనంతవరకు ఆంగ్లములో రాయకుండ ఉంటే మంచింది.
ఆలస్యమైతేనేమి, వివరాలతో నేను మిస్సయిన రాసారు.
నివేదికలో ఫొటోలు ఉంచాలి. కానీ నివేదికని తొందరగా వెలువరించాలనేది నా అభిప్రాయం.
నాకు అన్ని చిత్రాలు పిక్సలేట్ అయ్యినట్లు కనిపిస్తున్నాయండి. ఏమైనా సాగ దీసారా?
చాలా కృతజ్ఞతలు.సభ్యుల పేర్లను వీలైనంతవరకు తెలుగులో ఉంటే మంచింది.నివేదికలో ఫొటోలు ఉంచాలి కానీ నివేదికని తొందరగా వెలువరించాలనే అభిప్రాయంతొ నేనూ ఏకీభావం తెలియ చెస్తున్నా.
చాల సంతోషం కలిగింది. ఇలా ఫోటో లతో టపాలు ఇస్తే మిగతావాళ్ళకి స్పూర్తి కలిగి ప్రతి సమావేషంలో పాల్గొనేవాళ్ళ సంఖ్య పెరగొచ్చు అని నా ఆభిప్రాయం.
సుధాకర్ - అవునండీ Photos file size reduction లో ఎక్కువ Compression వలన Pixelation వస్తుంది. ఇందులో లాభం ఎమిటంటే Page download fast గా ఉంటుంది. తక్కువ Compression లో స్పష్టత ఉంటుంది కాని Download ఎక్కువ కాలం పట్తుంది.
ఫొటొలు తో ఈ టపాను అందించినందుకు ధన్యవాదలు.అందరిని ఇలా కలిసినందుకు చాలా ఆనందంగ వుంది.తరువాతి సమావేసాలకి ఇంకా ఎక్కువ మంది రావాలని ఆశిస్తున్నాను.
మీరు flickr.com లో పెడితే అసలు ఈ పిక్సలేట్ అనే సమస్యే లేకుండా అతి తక్కువ సైజులో చిత్రాలు వస్తాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి