
గౌతమి స్నాన ఘట్టం, రాజమహెంద్రవరం Photo: cbrao
ఎవరి పేరును వారు గూగుల్ లో అన్వేషించి ఫలితాలు చూసుకోవటం ఎక్కువైందని గూగుల్ సర్వే ఫలితాలు చెప్తున్నై. ఎదుటవారిని అర్థం చేసుకోవటం కంటే మనలను మనం అర్థం చేసుకోవటం ఎక్కువ కష్టమైనా, అభిలషణీయమైనది. ఆశ్చర్యమేమంటే మనలో లోపాలు ఎదుటవారు గుర్తించక ముందే, మనం గమనించలేక పోవటం. నిజమైన స్నేహితుడే, నీ హితాన్ని కోరి, నీలోని లోపాలను నీకు చెపుతాడు.
నా బ్లాగు దీప్తిధార మొదలు పెట్టింది 26th July 2006 న. మొదలు పెట్టి ఒకటి రెండు పారాలు రాసి, వదిలేసా. కారణం తెలుగు టైప్ చెయ్యటం కుదరక. కొన్ని నెలల తరువాత, తెలుగు ను లేఖిని లో టైప్ చెయ్యటం నేర్చుకుని, కష్టం మీద ఆ వ్యాసం పూర్తి చేశా. నా మొదటి టపా రేడియో మిర్చి. ఇది చాలా హాట్ గురూ. ఇందులో రడియో కు నాకు ఉన్న అనుబంధం, ఆ రోజుల్లో రచయితలతో నా పరిచయాలు, సమావేశాల గురించీ రాయటం జరిగింది. ఆ తరువాత చాన్నళ్లకు 15th Sept 2006 న మిత్రులు శ్రీ ఐ. మురళీధర్ కు ధర్మనిధి పురస్కార ప్రధాన సందర్భంలో, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పై రాసిన వ్యాసంతో, పునః ప్రారంభించి, అడపా దడపా బ్లాగులో నా రచనలు ప్రకటిస్తూ వున్నాను.
నా వ్యాస రచనలు పరిశోధనతో కూడినవి,రాసి లో దీర్ఘమవటం వలన, బ్లాగు ప్రారంభించి సంవత్సరం దాటినా ఇంతవరకూ ప్రచురించినవి కేవలం 88 మాత్రమే. ఇందులో కొన్ని రచనలు బహు ప్రజాదరణ పొందినవైతే మరి కొన్ని సాహిత్య విషయాలపై రాసినవి పాఠకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఏ విషయాలపై రాస్తే పాఠకులనుంచి స్పందన ఎక్కువొస్తుందో తెలిసినప్పటికీ, అలాంటి కథనాలు చాలా మంది ఇస్తున్నందున, వాటి జొలికి పోక, భిన్నమైన అంశాలతో, నాదైన శైలి లో రాస్తున్నాను.
స్వోత్కర్ష:
నేను ప్రారంభించిన కొన్ని వ్యాసాలు trendsetters గా వుండి, ఇతరులు ఆ అంశాలపై రాసే సందర్భం లో అదే మూసను అనుసరించటం జరిగింది.ఉదాహరణగా నెల నెలా జరిగే తెలుగు బ్లాగ్మిత్రుల సమావేశ నివేదికలు.సాహితీవనం శీర్షికపై ప్రారంభించిన సాహిత్యం గురించిన ప్రశ్నలు మరికొంతమందికి ప్రెరణ కలిగించి వారిని అలాంటి Quiz టపాలు రాసేలా చేసాయి. తెలుగు టైప్ చెయ్యటం రాక ముందు తెలుగు బ్లాగులను ఆంగ్లంలో Biosymphony (
http://groups.yahoo.com/group/biosymphony) లో పరిచయం చేస్తూ వ్యాసాలు రాస్తే, తెలుగు రాయటం నేర్చాక తెలుగు బ్లాగులను తెలుగులో సమీక్ష చెయ్యటం మొదలు పెట్టాను. ఈ సమీక్షలు Biosymphony లోను, పారదర్శి (
http://paradarsi.wordpress.com) లోను ప్రకటించడం జరిగింది.ఆ తరువాత ఇద్దరో,ముగ్గురో బ్లాగ్సమీక్షలు రాయటం మొదలెట్టి అర్థాంతరంగా ఆపేశారు.తెలుగు బ్లాగులపై, బ్లాగ్మిత్రులు, సమీక్షలు రాయటం అవసరం అని నేను భావిస్తూ, వారిని మరలా రాయవలసినదిగా కోరుతాను. తమ బ్లాగు పారడీల ద్వార, పాఠకులను నవ్వించి, కవ్వించిన చదువరి కొన్ని బ్లాగులను ఎంచుకుని సమీక్షిస్తే భవ్యంగా వుండగలదని, భవదీయుని తలంపు.
2007 కొన్నిజ్ఞాపకాలు
శోధనకు ప్రజాదరణ తగ్గిందా?
ఈ సమీక్షలు రాసే సమయం లో, శోధన సుధాకర్ బ్లాగు సమీక్షకై సుధాకర్ కు కొన్ని ప్రశ్నలు పంపితే, తాను వాటికి తెలుగులో సమాధానాలు రాసి నా యాహూ చిరునామాకు పంపంటం జరిగింది. యాహూ లో తెలుగు ఒక ముక్క అర్థం కాక, ఆంగ్లం లో సమాధానం పంపమని కోరాను. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలలో కొంత కాలహరణం జరిగింది. నా బాధ పడలేక సుధాకర్ తన జవాబులను (తెలుగులో) ఏదో బ్లాగులో పెట్టి ఆ చిరునామా నాకు పంపటం జరిగింది. నేను వీలు చూసుకుని, నా సమీక్ష మొదలు పెడదామని, ఆ బ్లాగును సందర్శిస్తే అక్కడ క్రితం వుంచిన సమాచారం కనపడలేదు. ఇహ మళ్లీ ఉత్తరాలు రాసే తీరిక లేక నెల్లూరు పై వ్యాసాలు మొదలెట్టాను. పాఠకులకు అవి నచ్చాయన్నది వెరే విషయం.శోధన అలా సమీక్షకు చిక్కకుండా మిగిలిపోయింది. తెలుగులో బహుళ ప్రజాదరణ పొందిన ఈ బ్లాగుకు ఈ మధ్య ప్రజాదరణ తగ్గినట్లుగా, నాకు నచ్చిన 10 బ్లాగులలో శోధన లేకపోవటం కొంత ఆశ్చర్యాన్ని కలుగ చేసింది. చూడండి
http://veeven.wordpress.com/2007/08/17/top10-telugu-blogs/ జ్యోతక్క బ్లాగుకు వస్తున్న ప్రజాదరణ చూసి అసూయ పడే వాళ్లున్నారని తెలిసింది ఆకాశరామన్న బ్లాగు ద్వారా. పొద్దు కు రాసిన వ్యాసంలో, తన రచనకు source of information తెలుపక పోతే వచ్చే ఇబ్బందులేమిటో జ్యోతక్కకు, మనకూ తెలిసింది. గృహిణి ఐన జ్యోతక్క తెలుగు బ్లాగులకు చేస్తున్న సేవ వెలకట్టలేనిది.బ్లాగర్లకు సూచనలందిస్తూ, తెలుగు బ్లాగుల కోసం, ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించే జ్యోతి అభినందనీయురాలు. చూడండి
http://jyothivalaboju.blogspot.com తెలుగు జాతీయవాది
తెలుగువారికి ఒక ప్రత్యేక దేశం కావాలన్న వితండవాదం తో మనకు పరిచయమైన అంబానాథ్ గుర్తున్నారా? తల్లుల పై రాసిన వీరి వ్యాసం విశేష స్పందన పొంది 53 పైగా పాఠకుల ఉత్తరాలను పొంది ఒక కొత్త చరిత్ర సృష్టించింది.తన బ్లాగు కేవలం ఆహ్వానితులకు మాత్రమే అని ఒక కొత్త వరవడి ప్రవేశపెట్టారు వీరు. దీనివలన తన బ్లాగులో ఏమి ప్రచురితమవుతున్నయో అనే విషయం కూడలి కి కూడా తెలియదు. అన్వేషణ యంత్రాలకూ తెలియదు. ఇలా close ended blog అవటం వలన మన పాఠకులు దాని గురించి చర్చించే అవకాశం లేదు. ఈ బ్లాగు మీరు చదవాలంటే అంబానాథ్ కు జాబు రాయండి ఆహ్వానం కొరకు.
ambanath at gmail.com
అంబానాథ్ బ్లాగు చిరునామా
http://www.telugujaatheeyavaadi2.blogspot.com/ కొత్త నీరు
ఈ మధ్య పాఠకుల ఆదరణ పొందిన కొన్ని బ్లాగులలో కొత్తపాళి బ్లాగు మొదటగా చెప్పుకోవాలి. వీరి కొత్తపాళి, విన్నవి కన్నవి బ్లాగులను పాఠకులు ఇష్టంగా చదువు తున్నారు. ఈ మధ్యన వెల్చేరు నారాయణ రావు గారు హైదరాబాదు వచ్చినప్పుడు, వారు ఎన్నో విషయాలు ముచ్చటించటం జరిగింది. శ్రీకృష్ణదేవరాయ విరచిత ' ఆముక్త మాల్యద ' లాంటి ప్రబంధాలు చదివే వారు తక్కువయ్యారని, విచారం వ్యక్త పరిచారు. మీరు చదివారా? ఆముక్త మాల్యద ను తెలుగు పాఠకులకు కొత్తపాళీ పరిచయం చేస్తున్నారు తమ బ్లాగు ద్వారా. చూడండి
http://telpoettrans.blogspot.com/2006/11/amukta-malyada-story-begins-thus-sri.html కంప్యూటర్ సమస్యలపై సాంకేతిక సహాయం అందించే కొత్త బ్లాగు కంప్యూటరెరాస్, కొద్దికాలం లో ఎక్కువ టపాలు ప్రచురించి, 10000 పై చిలుకు పాఠకుల ఆదరణ పొందింది.
http://computereras.blogspot.com మీరు చూశారా? మా హ్యాపీ డేస్.........వీడియో. విజయవంతమైన హ్యాపీ డేస్ సినిమా తో ప్రేరణ చెంది నిర్మించిన వీడియో ఇది. చక్కటి సాంకేతిక విలువలతో ఉన్నదీ వీడియో.
http://gemsofhindupur.blogspot.com/2007/12/blog-post.htmlతెలుగు సినిమా పై పట్టువోని కార్యదీక్షతతో రాస్తున్న ఔత్సాహిక యువ బ్లాగరు వెంకట్. సినిమా ప్రేమికుల అభిమానం బాగా పొందాయి వెంకట్ రచనలు. 24 ఫ్రేంస్ బ్లాగే కాక నవతరం అనే వెబ్ సైట్ ప్రారంభించి విశ్లేషణాత్మకం గా సినిమా వార్తలు అందిస్తున్నారు. అతని ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిద్దాం.చూడండి.
www.24fps.co.inwww.navatarangam.com తెలుగు వారికి పనికి వచ్చే ఎంతో సమాచారం తో కూడిన వంశీ వెబ్ సైట్ మీకు పరిచయమే. ఇందులో కొత్త సొగసులద్దటానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నై.అతిధి రచయితలతో వ్యాసాలు రాయించి ప్రకటిస్తున్నారిక్కడ. ఇందుకోసం ఎందరో రచయితలకు నిరంతరం ఎన్నో వుత్తరాలు రాస్తూ, శ్రమించి విజయులయ్యారు వంశీ. చూడండి
http://maganti.org/vyasavaliindex.htmlకొత్త బ్లాగరు పొద్దెరగడట. విశాఖనుంచి ఒక బ్లాగరు ఉదయం సాయంత్రం బ్లాగులు రాస్తూ, తను నిద్రింపక, మనలను నిద్రపోనీకుండా రాస్తున్నాడు. కొద్దికాలంలో ఎక్కువ టపాలు రాసి ఒక కొత్త record సృష్టించే ప్రయత్నంలో వున్నారీయన. పాఠకుల ఆదరణ లభించింది. పర్యావరణ స్పృహ కూడా వుంది. మంచి అంశాలతో చర్చలకు మనలను ఆహ్వానిస్తున్నాడు. చూడండి
http://pichukalu.blogspot.comhttp://visakhateeraana.blogspot.comhttp://charchaavedika.blogspot.com/ ఇంకా ఎన్నో కొత్త మంచి బ్లాగులు ఈ సంవత్సరం మనం చూశాం. స్థలాభావం వలన మరి కొన్ని మంచి బ్లాగుల గురించి రాయలేక పోతున్నా.అలా రాయలేక పోతున్నందుకు బ్లాగు మిత్రులను మన్నించ వలసినదిగా మనవి. ఈ సంవత్సరంలో బ్లాగుల సంఖ్య పెరిగింది. టపాలు పెరిగాయి.ప్రచురితమైనవన్నీ గతంలో చదివినా, ఇప్పుడు సాధ్యపడటం లేదు.బ్లాగులో టపాలకు వర్గీకరణ అవసరం ఎక్కువైంది. కూడలి లో ఇప్పుడున్న వర్గీకరణలకు తోడుగా అదనంగా ఏమి వుంటే బాగుండగలదని మీ అభిప్రాయం?
మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంషలు.