గురువారం, నవంబర్ 08, 2007

బ్లాగరు కష్టాలు


సంధ్యా సమయం, కురుగోడు (బళ్లారి తాలూకా/జిల్లా,కర్ణాటక) -Photo:cbrao

దీపావళి శుభాకాంషలు

పండగలలో ఇంత చైతన్యవంతమైన మరో పండగ లేదు. ఇది ఇంత ఆకర్షణీయమైనది కనుక, హిందువులే కాక అన్యమతస్థులు కూడా దీన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పండగను ఆనందించండి శుభప్రదంగా, సురక్షితం గా. టపాసులు కాల్చే సమయాన నూలు దుస్తులు ధరించండి.పిల్లలను మీ పర్యవేక్షణలో దీపావళి వేడుకలలో పాల్గొనేలా చూడండి.

ఈ దీపావళి కి నేను కర్ణాటక లోని కురుగోడు వెళ్తున్నాను. అక్కడి సింధనూరు,బెళ్లారి, కురుగోడు ఇంకా అసంఖ్యాకమైన ఊళ్లకు తెలుగు వారు వెళ్లి, అక్కడి పొలాలు కొని, వ్యవసాయం చేస్తున్నారు. అలా వెళ్లిన వాళ్లలో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల వారు ఎక్కువ. మన తెలుగు వారి వ్యవసాయ పద్ధతులు చూసి, అక్కడి స్థానికులు కూడా వ్యవసాయం పై ఆసక్తి కనపరుస్తున్నారు. కురుగోడు నుంచి అనిగొందె వెళ్లే దారిలోనే మన తెలుగు హీరో శ్రీకాంత్ ఊరు గంగావతి(కొప్పాల్ జిల్లా)కూడా ఉంది.

శ్రీశ్రీ అంటాడు పీత కష్టాలు పీతవని. నేనంటాను,కష్టాలు పీతకేనా, బ్లాగర్లకు లేవా అని. బ్లాగరు కష్టాలు బ్లాగరువి. ఈ సంవత్సరం ఎన్నో అనుకున్న, అనుకోని పర్యటనలో నాకు. పర్యటన అయ్యాక దాని గురించి రాద్దామనుకునేసరికి, మరో ప్రయాణం.మొదటగా ఆరంభం పాపికొండలు, ఆ తదుపరి చెన్నై, బెంగళూరు, కూర్గ్,నంది కొండలు, మారేడుమిల్లి,గుంటూరు,కోటప్పకొండ,తెనాలి,రాజమండ్రి, మరల మారేడుమిల్లి,ఒంగోలు,కావూరు వగైరా. ఈ సంవత్సరపు జాబితా ఇంకా పూర్తి కాలేదు. చాలా ఊళ్లకు రాసిన travelogues అసంపూర్తిగానే వున్నాయి. నాకూ ఒక ghost writer లభ్యమైతే ఎంత బాగో!ఊరినించి వచ్చాక ప్రఖ్యాత రచయిత సోదరులను అడగాలి నాకూ ఒక ghost writer కావాలని.Travelogues మాత్రమే కాక ఇతర విషయాలపై రాసిన వ్యాసాలు కూడా ఈ యాత్రల వలన అసంపూర్తిగా మిగిలి, మమ్ములను ఎప్పుడు పూర్తి చేస్తావు అని అడుగుతుంటాయి నిద్రలో.

ఈ సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో ఇంటిదగ్గర కొంత కుదురుగా ఉండబట్టి, సాహితీవనం 1 నుంచి 12 భాగాలు రాయగలిగాను. సాహితీవనం 12 భాగానికి ఇంకా జవాబులు రాయనే లేదు. మధ్యలో కంప్యూటర్ కు, నాకు అనారోగ్యం. ఉత్తరాలు పోస్ట్ చెయ్యటమంటే నాకు కొంత బద్ధకం. అయినా, సాహితీవన ప్రశ్నల విజేతలయిన సౌమ్య, కారణి నారాయణరావు గార్లకు సంజీవదేవ్ జీవితం, రచనలు పై పుస్తకాన్ని పోస్ట్ చెయ్యగలిగాను. విజేత పరుచూరి శ్రీనివాస్ గారు సంజీవదేవ్ పుస్తకం తన వద్ద వున్నందున,తనకు బదులుగా తరువాతి ఉత్తమ జవాబులిచ్చిన వారికి పంపమని సూచించారు.వారి కోరిక మేరకు ఉత్తమ సమాధానాలిచ్చిన నారాయణరావు గారిని ఎంపిక చెయ్యటం జరిగింది. తదుపరి విజేతలు. ఇస్మాయిల్ చిరునామా కోసం రాసాను; కామెంట్ ఆయన శ్రీ కృష్ణదేవరాయలు బ్లాగు లో. చూసినట్లు లేదు. జవాబు లేదు.వీరి e-mail తెలిసినవారు నాకు తెలియపర్చగలరు. సిరి -వీరి e-mail చిరునామ తెలిసిన వారు నాకు రాయగలరు. వీరికి, నేనుసైతం కు రసమయి మాసపత్రికలు పంపవలసి ఉన్నది.

మనమంతా పండగను సురక్షితంగా జరుపుకొందాం. నేను హైదరాబాదు తిరిగివచ్చాక మరల ముచ్చటించుకొందాం.

2 కామెంట్‌లు:

సత్యసాయి కొవ్వలి Satyasai చెప్పారు...

అయ్యా, నావికూడా ఇలాంటి కష్టాలే. చాలా విషయాలమీద బ్లాగులు మదిలో ఉన్నాయి- వ్రాతలోకి తేవాలి.

అజ్ఞాత చెప్పారు...

రావు గారు, మీకు సమ్మతి అయితె నెను మీ Ghost Writer ఉద్యొగం కు ధాఖలు చెసుకుందమనుకుంటున్నాను, నెను తెలుగు పాడిత్యం నెర్చు కున్నట్టు ఉంటుంది, మీకు సహపడినట్టు ఉంటుంది.మీ అభిప్రాయం తెలుప గలరు

ఇట్లు మీ శ్రెయొభిలాషి -- సురెష్

కామెంట్‌ను పోస్ట్ చేయండి