మంగళవారం, జనవరి 22, 2008

బ్లాగ్వీక్షణం


Butterfly at Maredumilli forest Photo:cbrao

ఒకప్పుడు కూడలి లో లో వచ్చే కొత్త టపాలు కొద్దిగా వుండేవి. కాలక్షెపం కోసం బ్లాగుల Archives కి వెళ్లి పాత మథురాలను ఆస్వాదించే వాళ్లం. అందులో కొన్ని అణిముత్యాల్లంటి టపాలు చూసి, అరె ఇవి మనం మిస్ అయ్యామే, అనిపించేంత, చక్కగా ఉండేవా టపాలు. telugublog@googlegroups.com వారి సహకారంతో ఇప్పుడు చాలామంది, తెలుగులో బ్లాగులు మొదలెట్టి, టపాల రాసి, బాగా పెంచారు. ఈ టపాల ఉధృతంలో, పెక్కుమందికి, ఇన్ని టపాలు చదవటానికి, వ్యవధి వుండటం లేదు. ఇహ బ్లాగుల archives లోకి వెళ్లే మార్గమేది? ఇన్ని టపాలలో, ఏది చదవతగ్గదో, పాఠకుడు ఎలా నిర్ణయించుకొంటాడు? కొత్త బ్లాగరులు తమ టపాలకు కామెంట్లు రావటం లేదనే వ్యధను వెలిబుస్తూ కొన్ని టపాలు రాయటం జరిగింది. ఈ సమస్యనెలా అధిగమించాలో వివరిస్తూ కొన్ని టపాలొచ్చాయి. వీటిలో చెప్పుకో తగ్గ వాటిలో, ఒక టపా మీ ముందుంచుతున్నా.

తెలుగు బ్లాగులు/టపాలకు చదువరులను/వీ(ప్రే)క్షకులను/పాఠకులను మరియు వ్యాఖ్యలు/అభిప్రాయాలను పెంచటం ఎలా – 2
http://teluguvadini.blogspot.com/2008/01/2.html
ఇందులో, బ్లాగరులకు పనికివచ్చే పెక్కు tools గురించి వివరణ వుంది. మీ టపాలకు కామెంట్స్ రావటం లేదని వ్యధ చెందక, ఇందులోని సూత్రాలు పాటించండి. తెలుగువాడిని blog page load అయ్యేలోపు, speaker on చేసి మీ కిష్టమైన పాట వింటూ నిరీక్షించండి. తప్పకుండా page open అవ్వుతుంది.మీ సహనమే మీకు రక్ష. ఈ తెలుగు వాడెవరో నాకు తెలియదు. మీకు తెలిస్తే ఒక ఉత్తరం ముక్క రాయండి. నలుగురికీ పనికివచ్చే, వ్యాసం రాసిన తెలుగువాడికి వేస్తున్నా ఒక వీరతాడు.

ఇక బ్లాగరులు తమ archives లోని, ముఖ్యమైన టపాలను పరిచయం చేస్తూ ఒక వ్యాసం రాస్తే,పాఠకులకు ఎంపిక సులువు అవుతుంది.ఈ విషయం లో సౌమ్య ను అభినందించాలి. తన 2007 పుస్తకాల రీకాప్ చూడండి.
http://vbsowmya.wordpress.com/2008/01/17/2007-%e0%b0%aa%e0%b1%81%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%95%e0%b0%be%e0%b0%b2-%e0%b0%b0%e0%b1%80%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b1%8d/
నేను సౌమ్య బ్లాగు సమీక్షించే (http://paradarsi.wordpress.com/2007/07/18/sowmya-writes-blog-review/) నాటికే (Aug 29, 2006) తన బ్లాగులో చాలా టపాలు వున్నై.ఇప్పుడు చాలా వచ్చి చేరాయి. సౌమ్య, ఇప్పటి దాకా వచ్చిన, తన టపాలలో విశిష్టమైన వాటిని ఎంపిక చేసి,వాటిని పరిచయం చేస్తూ ఇంకో వ్యాసం రాస్తే, పాఠకులకు ఉపయుక్తంగా వుండగలదు. ఎక్కువ archives వున్న మిగతా బ్లాగరులు కూడా తమ best posts ను పరిచయం చేస్తూ, లింక్స్ ఇస్తూ వ్యాసం రాస్తే, పాఠకులు ఆ పాత మధురాలను ఆస్వాదించగలుగుతారు.

ఈ మధ్య కాలంలో నా దృష్టికి వచ్చిన కొన్ని టపాలు గురించి క్లుప్తంగా ముచ్చటించుకొందాము. ఎన్నో మంచి టపాలలోంచి,ఇవి కేవలం మచ్చు తునకలే.

పెళ్ళి కాని పిల్ల, బ్రహ్మచారి మనసు గుల్ల
http://tetageeti.blogspot.com/2007/12/13.html
ఇందులో పెళ్లికాని ప్రసాదుల అవస్థలు, పెళ్లికై వారుపడే ఆరాటాలు,వారి కార్యాలయంలో వున్న ఏకైక పెళ్లికాని అమ్మాయికి వున్న competition గురించి హాస్యంగా వివరించటం జరిగింది.

ఈ సంఘం
http://eesangham.blogspot.com/

ఇందులో మదనపల్లె వార్తలు మాత్రమే కాక, వెరే ప్రాంతాలవారి గురించిన, ఉపయుక్తమైన వార్తలు, కథనాలు వున్నై.


ప్రేమ ఎంత మధురం....!!!
http://karyampudi.blogspot.com/2008/01/blog-post.html
ఇది ఒక కథ. ముగింపు చదివాక ఆశ్చర్యంతో నోరుతెరుస్తారు. ఇది 2002 లో ఈ-మాటలో అచ్చయ్యింది.

ఇది నాస్తికత్వమెలా ఔతుంది?
http://musingsinc.wordpress.com/2007/09/21/humanism-the-religion/
ఈ వ్యాసంలో రచయిత్రి చెప్పిన 'మానవసేవే మాధవ సేవ ' అన్న విషయం మెచ్చుకోతగ్గది. "ఏదో ఓ దాన్ని వాళ్ళు విశ్వసిస్తారు కదా…ఆ సిద్ధాంతమే దైవం మరి!" అన్న సౌమ్య వాదనలో పూర్ణత్వం లేదు. 2018 లో ఈ వ్యాసం గురించి సౌమ్యను అడగండి. కాలం ఈమె అభిప్రాయాలను ఎలా మారుస్తుందో, గమనించండి. సిద్ధాంతాలే దేవుళ్లయితే కార్ల్ మార్క్స్, ఏంగెల్స్ కూడా దేవుళ్లేగా? వాళ్లకు గుడులు కట్టించవద్దా?నలుగురినీ ఆలొచనలో పడవేసిందీ చిన్న వ్యాసం.


Postmen in the Mountains – చైనా
http://sadulovesmovies.blogspot.com/2008/01/postmen-in-mountains.html

తండ్రీ కొడుకుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా వుంటాయి? ఒకరినొకరు అర్థం చేసుకొగలుగుతున్నారా? ఈ విషయం పై తెలుగు లో బొమ్మరిల్లు చిత్రం బాగా చూపగలిగింది. చైనా లో తీసిన ఈ Postmen in the Mountains ఇదే ఇతివృత్తం పై మనొహరంగా, చక్కటి ప్రకృతి దృశ్యాల మధ్య తండ్రి పై కొడుకున్న భయం, ప్రేమగా ఎలా మారిందన్న విషయాన్ని వివరించటంలో సఫలమయ్యింది.


వికటకవి: షరతుల పెళ్ళికొడుకులు – I
http://sreenyvas.wordpress.com/2008/01/17/%e0%b0%b7%e0%b0%b0%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%86%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3%e0%b0%bf%e0%b0%95%e0%b1%8a%e0%b0%a1%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-i/


షరతుల పెళ్ళికొడుకులు – II
http://sreenyvas.wordpress.com/2008/01/18/%e0%b0%b7%e0%b0%b0%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%86%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3%e0%b0%bf%e0%b0%95%e0%b1%8a%e0%b0%a1%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-ii/
ఏమి పెళ్లికొడుకలండి వీళ్లు! భార్యల కోసం వీరిచ్చిన ప్రకటనలు మిమ్ములను నవ్విచటం ఖాయం.

మా ఆవిడ చాలా మంచిది… Video
http://naamanasu.wordpress.com/2008/01/12/%e0%b0%ae%e0%b0%be-%e0%b0%86%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a1-%e0%b0%9a%e0%b0%be%e0%b0%b2%e0%b0%be-%e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a6%e0%b0%bf/
కొత్తగా పెళ్లయినవాళ్ల అవస్థలను చూసితీరాలి. Production values బాగున్నై. ఈ Video చూస్తూ, సరదాగా నవ్వండి.

తెలుగు ఇష్టం
http://ramya-ramyam.blogspot.com/2008/01/blog-post_21.html
మరి ఏదిష్టం అంటే... తెలుగు వారున్న ప్రాంతమంతా,
ఎవరు ఇష్టం అంటే. .. ప్రపంచం లోని మనసున్న మనుషులంతా
అంటూ మనల్ను ఆకట్టుకుంటుంది రమ్య. అంతే కాదు రామచక్కని సీతకి, అరచేత గోరింట ... అంటూ మనలను మంత్రముఖ్దుల్ని చేసే, పాట కూడా వింటూ, ఈ టపా చదవటం. మంచి అనుభూతి.

నా క్రికెట్ వ్యసనం..!!
http://trajarao.wordpress.com/2008/01/20/%e0%b0%a8%e0%b0%be-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%b8%e0%b0%a8%e0%b0%82/
గల్లీ క్రికెట్ వచ్చాక, క్రికెట్ పై యువకులకు ఆసక్తి పెరిగింది.క్రికెట్ మీద ఎన్ని జోకులున్నా, ప్రజాదరణ తగ్గలేదు.తాడిమేటి రాజారావు, తన racy కథనంతో, తన క్రికెట్ అనుభవాల్ని, ఆసక్తికరంగా మనముందుంచటం, మీరు చూస్తారు.

నేటి కింతే. సెలవా మరి.

6 కామెంట్‌లు:

karthik చెప్పారు...

really very handy blog thanQ very much for posting and sharing with us.

తెలుగు'వాడి'ని చెప్పారు...

cbrao గారు : ముందుగా, మీరు క్రమం తప్పకుండా ఇలా మీకు నచ్చిన టపాలను నలుగురికీ అందిస్తూ చేస్తున్న ప్రయత్నం వేలవిధాల ప్రశంశనీయం...హృదయపూర్వక అభినందనలు. ఇకపోతే నా తెలుగువాడిని లో ఒక టపాకు ఇక్కడ లంకె ఉన్నందుకు కృతజ్ఞతలు....ముఖ్యమైన విషయానికి వస్తే మన వికటకవి గారి దయ వలన నా బ్లాగులోని సరంజామాను చాలా వరకు తొలగించి ఇప్పుడు Page చాల్ వేగంగా Load అయ్యేటట్లు చేశాను :-) ఇక మన బ్లాగులలో Archives లో ఉన్న టపాలన్నీ అతి సులభంగా పాఠకులకు ఎలా చూపవచ్చు అనే దాని మీద ఒక టపా వ్రాస్తున్నాను ... ఈ వారాంతంలోపు దానిని ప్రచురించటానికి ప్రయత్నం చేస్తున్నాను.

తెలుగు'వాడి'ని చెప్పారు...

cbrao గారు : "మా ఆవిడ చాలా మంచిది" లంకె అంటే href విలువ తప్పుగా ఉన్నది .. వీలుంటే మార్చండి ... మీరిచ్చిన అసలు లంకె(http://naamanasu.wordpress.com/2008/01/12/%e0%b0%ae%e0%b0%be-%e0%b0%86%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a1-%e0%b0%9a%e0%b0%be%e0%b0%b2%e0%b0%be-%e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a6%e0%b0%bf) correct గానే ఉన్నది.

cbrao చెప్పారు...

@తెలుగు'వాడి'ని -"మా ఆవిడ చాలా మంచిది" లంకె href విలువ సరి చేసాను.మీ బ్లాగు పేజి త్వరగా లోడ్ అయ్యేలా చేసినందుకు ఆనందం.బ్లాగులలో Archives లో ఉన్న టపాలన్నీ, అతి సులభంగా, పాఠకులకు ఎలా చూపవచ్చు అనే దాని మీద మీ టపా కై ఎదురు చూస్తాము.
@కార్తీక్ -ఈ బ్లాగు రాసినది, త్వరగా, ఎంపిక చేసిన టపాల లోకి వెళ్లటం కోసం.మీకు నచ్చగల టపాలకు ఇది shortcut. మీ టపా ఈ జాబితా లోకి వచ్చేలా కృషి చెయ్యండి. Good luck.

అజ్ఞాత చెప్పారు...

రావు గారు,

ధన్యవాదాలు. మీకు నచ్చినందుకే కాక మరో నలుగురికి పరిచయం చేసినందుకు.

ramya చెప్పారు...

cbrao గారు : మీకు నచ్చిందుకు సంతోషం,ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి