శనివారం, మార్చి 29, 2008

అంధ చిత్రకారుడు బ్రాంబ్లిట్

యు ట్యూబ్ వారు 2007 సంవత్సరపు, ప్రేక్షకులు ఎంపిక చేసిన, ఉత్తమ వీడియోల గురించిన,ప్రకటన చేశారు. వీటిలో Texas country reporter రూపొందించిన Blind Painter అనే లఘు చిత్రం నన్ను ఆకట్టు కుంది. ఇది Inspirational category లో ప్రధమ స్థానాన్ని పొందింది. ఈ చిత్రం వీడియో లింక్ కింద ఇచ్చాను. కనులున్న వారికే, రూపం, రంగులను సమన్వయించి చిత్రం గీయటం కష్టమయితే, ఒక అంధ చిత్రకారుడు చక్కటి రూపం, రంగులతో చిత్రాలు రూపొందించటం మనలను ఉత్తీజపరుస్తుంది. ఈ వీడియోను ఇప్పటి దాకా చూసిన వారి సంఖ్య: 19,45,257



వివిధ కాటగిరుల లో ఎంపిక అయిన వారి వివరాలకై చూడండి.

http://www.youtube.com/ytawards07

శనివారం, మార్చి 22, 2008

ప్రపంచం మీ ముంగిట

యాదృచ్ఛికంగా, ఈ ఉత్తమ యాత్రా చిత్రాల వీడియో చూడటం జరిగింది. భ్రమణ కాంక్ష వున్న చదువరులకు, ఇది కనుల విందు కాగలదు. చూసి ఆనందించండి.


video by OneOfaKindSelf

మంగళవారం, మార్చి 18, 2008

తెలుగులో డిగ్ -2




తెలుగు లో డిగ్ పై ఇది నా మూడో జాబు. నిన్న రాజు సైకం, నేడు జల్లెడ జాలయ్య ల లో చైతన్యం వచ్చింది. జల్లెడ లో అనూహ్యమైన మార్పులు, శరవేగంగా వస్తున్నై. జల్లెడ లో కూడ డిగ్ లాంటి feature వచ్చేసింది. కొన్ని functions బేటాలో వుంటే, కొన్ని పనిచెయ్యటం మొదలెట్టాయి.

మొదటగా ఓట్ల జల్లెడ. మీకు నచ్చిన టపాలపై, కొన్ని బ్లాగులలో ఇస్తున్నట్లుగా Star rating ఇచ్చే సౌకర్యం, ఇప్పుడు జల్లెడ లో వుంది. దీనిగురించి వివరణకై చూడండి
http://blog.jalleda.com/?p=33

http://jalleda.com/vote/

ఈ పేజీ లో మీకు నచ్చినవాటికి, మీ కిష్టమైన స్టార్ రేటింగ్ ఇవ్వవచ్చు.

ఇంతే కాదు;ఇప్పుడు జల్లెడ లో ప్రదర్శింపబడుతున్న వాటినే కాకుండా,మీరు ఎంపిక చేసిన బ్లాగరు యొక్క, ఎంపిక చేసిన పాత టపాకు కూడా, మీరు రేటింగ్ ఇవ్వవచ్చు. ఇందుకోసం మీరు authorposts అనే feature వాడవచ్చు.ఇది ఎలా పని చేస్తుందో చూద్దాము. ముందుగా తెరవండి.
http://jalleda.com/vote/
ఇందులో మీకు నచ్చిన బ్లాగర్ పేరు మీద క్లిక్ చేస్తే, ఆ బ్లాగర్ రాసిన టపాలన్నీ ప్రదర్శించే పేజ్ వస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన టపాకు, మీరు ఇవ్వదలచిన * రేటింగ్ ఇవ్వండి.

ఎవరికి వారు రేటింగ్ ఇస్తూ పోతుంటే ఆ విషయం, అదేనండీ ఏ పోస్ట్ కు ఎన్ని స్టార్స్ వచ్చాయో, దాని ద్వారా ఏది ఎక్కువ ప్రజాదరణ పొందిందో, మీ కెలా తెలుస్తుంది అనుకుంటున్నారా? దీనికీ వుపాయం వుంది. పోస్ట్ లను స్టార్ రేటింగ్ ప్రకారం ప్రదర్శించమని ఒక చిన్న ఆజ్ఞ ఇవ్వండి ఇలా.
http://jalleda.com/vote/?order=0
ఇప్పుడు టపాలు మీకు star rating ప్రకారం కనిపిస్తాయి. ఎక్కువ stars గలవి పైన, తక్కువ స్టార్స్ గలవి కిందా వుంటాయి. ఈ పేజ్ మీరిచ్చే star rating పై ఆధారపడి, నిరంతరం మారుతూనే వుంటుంది.ఒక పోస్ట్ కు Five stars వస్తే, ఇంకో పోస్ట్ కు కూడా అన్నే స్టార్స్ వస్తే, తాజాగా 5stars వచ్చినవి పేజ్ పైన వస్తాయని నా ఊహ. ఇది బేటా కాబట్టి అలాగా వుండాలని అభిలాష. అంతే కాక ఇది నెలల వారీగా archives maintain చెయ్యాలని కోరుకుంటా. మీ సూచనలు కూడా పరిగణన లోకి తీసుకొంటామని జాలయ్య గారు చెపుతున్నారు. మీరు కోరుకునే అంశాలు మీరు సూచించవచ్చు. ముద్ర పై నా టపా చూసిన వెంటనే స్పందించిన, జల్లెడ జాలయ్యగారికి నా అభినందనలు.

ఇప్పుడు మనకు జల్లెడ లో కూడా డిగ్ (లాంటిది) వచ్చింది. మిగతా బ్లాగ్ అగ్రిగేటర్లు కూడా, తమదైన పద్ధతిలో ఈ డిగ్ ను వారి వారి సైట్ల లో ప్రవేశ పెట్టే సమయం ఆసన్నమైంది. మరి కొన్నాళ్లకు ఈ మాట, పొద్దు లాంటి పత్రికలు కూడా డిగ్ లాంటి ఎదైనా కొత్త function ప్రవేశ పెడ్తే ఆశ్చర్య పడొద్దు. ఎందుకంటే బ్లాగులలో జరిగే మార్పులు, వారినీ ప్రభావితం చేస్తాయి కాబట్టి.

సోమవారం, మార్చి 17, 2008

తెలుగులో డిగ్



ఈ విషయం పై గతంలో ఒక జాబు (http://deeptidhaara.blogspot.com/2007/03/blog-post_6672.html) రాసాను. దురదృష్టవశాత్తు సంవత్సర కాలం గడిచినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది.

తెలుగులో గత సంవత్సరం తో పోలిస్తే, ఇప్పుడు బ్లాగులు, టపాలు ఎక్కువయ్యాయని , అన్నీ చదవటం కష్టం గా వుందని పాఠకులు feel అవుతున్న, ఈ రోజుల్లో Dig అవసరం ఇప్పుడు మరింతగా వుంది. పాఠకులు, ఎంపిక చేసిన టపాలను డిగ్ చెయ్యటం వలన, అసంఖ్యాకంగా వస్తున్న టపాల లోంచి, మంచివి చదివే అవకాశం, పాఠకులకు లభిస్తుంది. గత సంవత్సరంగా డిగ్ లో ఎవరు ఎంత progress చూపించారో చూద్దాము.

ముందుగా చంద్రశేఖర్ డిగ్
http://digg.telugusoftware.org
ప్రస్తుత పరిస్తితి: పనిచెయ్యటం లేదు.
ఆ తరువాత ప్రవీణ్ గార్లపాటి డిగ్
http://employees.org/~praveeng/mydigg/
ప్రస్తుత పరిస్తితి: పనిచెయ్యటం లేదు.

కూడలి లో ఎప్పుడో రావలసిన ఈ feature ఇంకా రానే లేదు. కారణం వీవెన్ కే ఎరుక. ఎన్నో కొత్త features తో ముందు కొచ్చిన జల్లెడ ఈ విషయంలో వెనకబడే వుంది. జాలయ్య గారు, ఎందుకు కొత్త features పెట్టడం లో జాప్యం చేస్తున్నారో, కారణం తెలియదు. డిగ్ కాదు కదా కనీసం టపాకు star rating ఇచ్చే సౌకర్యం ఏ blog aggregator లో కూడా, లేదిప్పటికి.

ఇలాంటి పరిస్తితి లో కనిపిస్తుంది ఒక ఆశా కిరణం. అదే ముద్ర.
http://tenugublog.com/mudra/

కొద్దిగా మార్పులు దిద్దితే, ఇది జనామోగ్యం పొందే సూచనలున్నాయి. దీని పనితీరు చూద్దామా.ఇందులోని టపాలు ఎవరైన చదవొచ్చు కాని డిగ్ చెయ్యాలంటే ఇందులో సభ్యత్వం వుండాలి. సభ్యత్వం ఉచితం. మీ పేరు, పాస్ వర్డ్ ల తో సభ్యత్వం నమోదు చేసుకోవాలి. మన సభ్యత్వం ఆమోదించబడినట్లుగా మనకు e-mail మౠదౠర నుంచి వస్తుంది. మౠదౠర యొక్క అర్థమేమిటో రాజు సైకం కే ఎరుక. Login అయ్యాక authentication response time ఎక్కువగా వుంది. Login successful అయితే web page top left లో స్వాగతం, cbrao! అని చూపిస్తుంది. ఆ తరువాత నేను కొత్త టపా తెలియచేయండి అనే బటన్ నొక్కి, కొత్త టపా వివరాలిచ్చి submit చేస్తే అది ఎందుచేతనో ప్రచురింపబడిన టపాలు కు బదులుగా, రాబోవు టపాలు లో నమోదయ్యింది. Submit అయ్యాక నమోదు కావటానికి response time ఎక్కువే. ఈ రాబోవు టపాలు అనే feature ఎలా, ఎప్పుడు, ఎవరు వాడతారో తెలియదు.

నేను నమోదు చేసిన టపా పేరు మిస్టర్ మేధావి - నిజంగా మేధావేనా....! ఈ టపా మీకు రాబోవు టపాలు లో కనిపిస్తుంది. ఇది ప్రచురింపబడిన టపాలు లోకి ఎలా మార్చాలో సహయము లేదు. టపాలు ప్రచురించిన పేజీలో bury అనే feature మనకు ఆసక్తికరంగా లేని టపాలను, మాయం అయ్యేలా చేస్తుంది. దీనికి మీరు చెయ్యవలసిందల్ల,మీకు అక్కరలేని టపా పక్కన గల bury పై mouse తో క్లిక్ చెయ్యటమే. ఇంకా ఉత్తమ సభ్యులు అనే ఆసక్తి కరమైన విషయం వుందిక్కడ. దీని పనితీరు, ఎలా వాడాలనేది వివరించలేదు. అంతే కాక ఖర్మ అనే feature కూడా వుంది. వీటన్నింటికీ వివరణలతో help page అవసరం వుంది.

కొద్దిపాటి మార్పులతో, Website వేగం పెంచి,తగినంత ప్రాచుర్యం కలిపిస్తే, పోటీ లేని ముద్ర, పాఠకుల అభిమానం పొందగలదు. పాఠకులు తక్కువ సమయంలో, ఎక్కువ ఉత్తమ టపాలు చదవగలిగేలా చెయ్యటమే,ముద్ర యొక్క బలం. ఆదరించండి, లాభం పొందండి.