శనివారం, మే 31, 2008

మనోహర చైనా సాంప్రదాయ నృత్యం



మీరు తెలుగులో విజయవంతమైన చిత్రం గమ్యం చూశారా? అందులో కమలినీ ముఖర్జీ చేసిన నాట్యం చూసి తెలుగు ప్రేక్షకులు అబ్బుర పోయారు. చిన్న సినిమా, వ్యాపారపరంగా అఖండ విజయం సాధించి, దర్శకుడు రాధాకృష్ణ (క్రిష్) కు ఖ్యాతి తెచ్చింది. ఈ నాట్యానికి ప్రేరణ ఒక చైనీస్ డాన్స్ అని, దర్శకుడు ఒక ఇంటర్వ్యూ లో చెప్పటం జరిగింది.

ఈ నృత్యం, బధిరులైన, చైనీస్ నాట్యకత్తెలు, సంగీతానికి లయబద్ధంగా మనోహరంగా చేస్తారంటే నమ్మశక్యం కాదు. ఈ నృత్య వీడియో తప్పనిసరిగా చూడవలసినది.

శుక్రవారం, మే 30, 2008

సయోనారా



జపనీస్ మహిళల సంగ విజయం

జపాన్ లో ఉద్యోగస్తులు "workaholics" మాత్రమే కాక, రాత్రి పొద్దుపోయాక తాగి తూల్తూ ఇంటికి రావటం ఇక ఆగనుంది. నిర్లష్యం చేయబడి, విసుగు చెందిన భార్యలు తిరగబడ్తున్నారు. దీనికి వారిని ప్రోత్సహిస్తున్నది జపాన్ లో వచ్చిన కొత్త చట్టం. విడాకులు తీసుకున్న భార్య, భర్త పెన్షన్ లో యాభై శాతం దాక పొందటానికి కొత్త చట్టం వీలు కల్పిస్తున్నది.

ఇప్పుడు జపాన్ లో నడుస్తున్న పోకడ ఏమంటే, భర్తలు భార్యలతో వాదనలకు దిగటం లేదు. పొరబాటున దిగినా, వాగ్వివాదం లో ఓడిపోతున్నారు. వారంటున్నారు ' మేము వివాదలలోకి దిగము. దిగినా ఓడి పోతాము. ఇవ్వాళ్లైనా, రెపైనా.' మీకు ఒక విషయం విశదమయ్యిందని భావన. అదేమంటే, వీరంతా కావాలని ఓడిపోతున్నారు -భార్య సంతృప్తి కోసం. అంతే కాదు, దశాబ్దాలుగా, Take it for granted గా తీసుకున్న భార్యల మాట వినటమే కాక, వారితో ప్రియం గా సంభాషించటం, ఇంటిని శుభ్రం చెయ్యటం,చెత్త బయట వేయటం ఇంకా వంట చేయటం కూడా నేర్చుకుని, చేస్తున్నారు.

అక్కడి విద్యావంతులైన స్త్రీలు 29 సంవత్సరాలు వయస్సు వచ్చినా, పెళ్లి చేసుకోకుండా, తమ స్వాతంత్రాన్ని కోల్పోక, జీవితాన్ని ఆనందిస్తున్నట్లుగా భావిస్తున్నారు. పెళ్లి చేసుకుని పిల్లలు, వంట పెంటా జంఝాటం లో పడటాన్ని, వారు ఇష్టపడటం లేదు.

రిటైర్మెంట్ కు దగ్గర పడుతున్న ఉద్యోగులు, భార్య కు కొత్తగా I love you ఎలా చెప్పాలో నేర్చుకొంటున్నారు. వారికి కోడిగుడ్డు పొరటు, బాణి లోని నూడిల్స్ పై వేడి నీరు పొయ్యటం తప్ప, మరేది రాని పురుష అహంకారులు. పిల్లలను వారు ప్రేమిస్తే, పిల్లలు వారిని చూసుకుంటారు కదా అలాగే, భార్యలూ వారికి అడుగులకు మడుగు లొత్తుతారనుకొన్న వారి అంచనాలు తలకిందులవుతున్నాయి. ఈ వేసవి నుంచి అమలు లోకి వచ్చిన కొత్త చట్టం వచ్చాక, విడాకులకు దరఖాస్తు చేసే వారి సంఖ్య ఆరు శాతం పైనే పెరిగింది.

60ఏళ్ల గృహిణులకు తమ పుట్టిన రోజు సందర్భంగా పూల బొకేలు అందుతున్నవీ రోజులలో. భార్యకు I love you చెప్పటమే వారి సంస్కృతి లో లేని విషయమయినప్పుడు, భర్తలు తాగి, ధైర్యంగా చెప్పగలుగుతున్నారు ' I love you.' విడాకులకు భయపడుతున్న భర్తలు, భార్యా బాధితుల సంఘం లో సభ్యులుగా చేరి," మీ సంసారం కాపాడు కోవటం ఎట్లా? “ అనే జెన్ పాఠ్యాంశాలను వల్లె వేస్తున్నారు. జపానీస్ మహిళలకు మంచి రోజులొచ్చాయ్.

నమ్మశక్యం కాని ఈ నిజాన్ని,కింద గల వీడియోలో చూడండి. ఎలా వుంది జపనీస్ మహిళల శక్తి?

గురువారం, మే 29, 2008

పురాణ ప్రలాపం


Purana Pralapam by Harimohan Jha

ప్రొఫెసర్.హరిమోహన్ ఝా, ప్రసిద్ధిగాంచిన రచన, ఖట్టర్ కాకా కు, ఇది తెలుగు అనువాదం. చదువుతుంటే అనువాద రచనలా అనిపించదు. ప్రొఫెసర్.జె.లక్ష్మిరెడ్డ్ది గారి సరళమైన స్వెచ్ఛానువాదం ఇది.వేదాలు మొదలు గీత వరకు, రామాయణం నుండి భారతం వరకు, ఆయుర్వేదం నుండి గ్రహణాలు, జ్యోతిష్యం వంటి ప్రజాబాహుళ్య అంశాలు చర్చనీయాంశాలుగా స్వేకరించారు. ప్రతి అంశాన్ని చీల్చి చండాడు తున్నప్పుడు మూల గ్రంధాలనుండి ఆధారాలు చూపి, విమర్శకులు, భక్తులు మాట్లాడకుండా చేయగలిగారు. అవశ్య పఠనీయమైనది.

ఈ గ్రంధం పై, నరిసెట్టి ఇన్నయ్య గారి సమీక్ష ఇక్కడ చూడండి.

http://naprapamcham.blogspot.com/2008/05/blog-post_23.html

ఈ పుస్తకం ఈ నెలలోనే విడుదలయ్యింది. అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభ్యమవుతుంది. ఇ-పుస్తకం ఉచితం. ఇక్కడ చదవవొచ్చు లేదా దిగుమతి చేసుకోవచ్చు.

ఈ పుస్తకం చదివి, మీ అమూల్య అభిప్రాయాలు, తెలియచేయండి.

బుధవారం, మే 28, 2008

అమెరికా విదేశీ విధానం


యుద్ధం వద్దు: శాంతి ప్రదర్శన చిత్రం సౌజన్యం: రూటర్స్/కార్లోస్ బార్రియా


అమెరికా foreign policy ఎన్ని రంగులు మారిందో తెలుసా? ఆసక్తికరమైన ఈ తండ్రీ కొడుకుల సంవాదం చదవండి.

A Child's Guide to United States Foreign Policy


Q: Daddy, why did we have to attack Iraq?

A: Because they had weapons of mass destruction honey.

Q: But the inspectors didn't find any weapons of mass destruction.

A: That's because the Iraqis were hiding them.

Q: And that's why we invaded Iraq?

A: Yep. Invasions always work better than inspections.

Q: But after we invaded them, we STILL didn't find any weapons of mass destruction, did we?

A: That's because the weapons are so well hidden. Don't worry, we'll find something, probably right before the 2008 election.

Q: Why did Iraq want all those weapons of mass destruction?

A: To use them in a war, silly.

Q: I'm confused. If they had all those weapons that they planned to use in a war, then why didn't they use any of those weapons when we went to war with them?

A: Well, obviously they didn't want anyone to know they had those weapons, so they chose to die by the thousands rather than defend themselves.

Q: That doesn't make sense Daddy. Why would they choose to die if they had all those big weapons to fight us back with?

A: It's a different culture. It's not supposed to make sense.

Q: I don't know about you, but I don't think they had any of those weapons our government said they did.

A: Well, you know, it doesn't matter whether or not they had those weapons. We had another good reason to invade them anyway.

Q: And what was that?

A: Even if Iraq didn't have weapons of mass destruction, Saddam Hussein was a cruel dictator, which is another good reason to invade another country.

Q: Why? What does a cruel dictator do that makes it OK to invade his country?

A: Well, for one thing, he tortured his own people.

Q: Kind of like what they do in China?

A: Don't go comparing China to Iraq. China is a good economic competitor, where millions of people work for slave wages in sweatshops to make U.S. corporations richer.

Q: So if a country lets its people be exploited for American corporate gain, it's a good country, even if that country tortures people?

A: Right.

Q: Why were people in Iraq being tortured?

A: For political crimes, mostly, like criticizing the government. People who criticized the government in Iraq were sent to prison and tortured.

Q: Isn't that exactly what happens in China?

A: I told you, China is different.

Q: What's the difference between China and Iraq?

A: Well, for one thing, Iraq was ruled by the Ba'ath party, while China is Communist.

Q: Didn't you once tell me Communists were bad?

A: No, just Cuban Communists are bad.

Q: How are the Cuban Communists bad?

A: Well, for one thing, people who criticize the government in Cuba are sent to prison and tortured.

Q: Like in Iraq?

A: Exactly.

Q: And like in China, too?

A: I told you, China's a good economic competitor. Cuba, on the other hand, is not.

Q: How come Cuba isn't a good economic competitor?

A: Well, you see, back in the early 1960s, our government passed some laws that made it illegal for Americans to trade or do any business with Cuba until they stopped being communists and started being capitalists like us.

Q: But if we got rid of those laws, opened up trade with Cuba, and started doing business with them, wouldn't that help the Cubans become capitalists?

A: Don't be a smart-ass.

Q: I didn't think I was being one.

A: Well, anyway, they also don't have freedom of religion in Cuba.

Q: Kind of like China and the Falun Gong movement?

A: I told you, stop saying bad things about China. Anyway, Saddam Hussein came to power through a military coup, so he's not really a legitimate leader anyway.

Q: What's a military coup?

A: That's when a military general takes over the government of a country by force, instead of holding free elections like we do in the United States.

Q: Didn't the ruler of Pakistan come to power by a military coup?

A: You mean General Pervez Musharraf? Uh, yeah, he did, but Pakistan is our friend.

Q: Why is Pakistan our friend if their leader is illegitimate?

A: I never said Pervez Musharraf was illegitimate.

Q: Didn't you just say a military general who comes to power by forcibly overthrowing the legitimate government of a nation is an illegitimate leader?

A: Only Saddam Hussein. Pervez Musharraf is our friend, because he helped us invade Afghanistan.

Q: Why did we invade Afghanistan?

A: Because of what they did to us on September 11th.

Q: What did Afghanistan do to us on September 11th?

A: Well, on September 11th, nineteen men, fifteen of them Saudi Arabians, hijacked four airplanes and flew three of them into buildings, killing over 3,000 Americans.

Q: So how did Afghanistan figure into all that?

A: Afghanistan was where those bad men trained, under the oppressive rule of the Taliban.

Q: Aren't the Taliban those bad radical Islamics who chopped off people's heads and hands?

A: Yes, that's exactly who they were. Not only did they chop off people's heads and hands, but they oppressed women, too.

Q: Didn't the Bush administration give the Taliban 43 million dollars back in May of 2001?

A: Yes, but that money was a reward because they did such a good job fighting drugs.

Q: Fighting drugs?

A: Yes, the Taliban were very helpful in stopping people from growing opium poppies.

Q: How did they do such a good job?

A: Simple. If people were caught growing opium poppies, the Taliban would have their hands and heads cut off.

Q: So, when the Taliban cut off people's heads and hands for growing flowers, that was OK, but not if they cut people's heads and hands off for other reasons?

A: Yes. It's OK with us if radical Islamic fundamentalists cut off people's hands for growing flowers, but it's cruel if they cut off people's hands for stealing bread.

Q: Don't they also cut off people's hands and heads in Saudi Arabia?

A: That's different. Afghanistan was ruled by a tyrannical patriarchy that oppressed women and forced them to wear burqas whenever they were in public, with death by stoning as the penalty for women who did not comply.

Q: Don't Saudi women have to wear burqas in public, too?

A: No, Saudi women merely wear a traditional Islamic body covering.

Q: What's the difference?

A: The traditional Islamic covering worn by Saudi women is a modest yet fashionable garment that covers all of a woman's body except for her eyes and fingers. The burqa, on the other hand, is an evil tool of patriarchal oppression that covers all of a woman's body except for her eyes and fingers.

Q: It sounds like the same thing with a different name.

A: Now, don't go comparing Afghanistan and Saudi Arabia. The Saudis are our friends.

Q: But I thought you said 15 of the 19 hijackers on September 11th were from Saudi Arabia.

A: Yes, but they trained in Afghanistan.

Q: Who trained them?

A: A very bad man named Osama bin Laden.

Q: Was he from Afghanistan?

A: Uh, no, he was from Saudi Arabia too. But he was a bad man, a very bad man.

Q: I seem to recall he was our friend once.

A: Only when we helped him and the mujahadeen repel the Soviet invasion of Afghanistan back in the 1980s.

Q: Who are the Soviets? Was that the Evil Communist Empire Ronald Reagan talked about?

A: There are no more Soviets. The Soviet Union broke up in 1990 or thereabouts, and now they have elections and capitalism like us. We call them Russians now.

Q: So the Soviets ? I mean, the Russians ? are now our friends?

A: Well, not really. You see, they were our friends for many years after they stopped being Soviets, but then they decided not to support our invasion of Iraq, so we're mad at them now. We're also mad at the French and the Germans because they didn't help us invade Iraq either.

Q: So the French and Germans are evil, too?

A: Not exactly evil, but just bad enough that we had to rename French fries and French toast to Freedom Fries and Freedom Toast.

Q: Do we always rename foods whenever another country doesn't do what we want them to do?

A: No, we just do that to our friends. Our enemies, we invade.

Q: But wasn't Iraq one of our friends back in the 1980s?

A: Well, yeah. For a while.

Q: Was Saddam Hussein ruler of Iraq back then?

A: Yes, but at the time he was fighting against Iran, which made him our friend, temporarily.

Q: Why did that make him our friend?

A: Because at that time, Iran was our enemy.

Q: Isn't that when he gassed the Kurds?

A: Yeah, but since he was fighting against Iran at the time, we looked the other way, to show him we were his friend.

Q: So anyone who fights against one of our enemies automatically becomes our friend?

A: Most of the time, yes.

Q: And anyone who fights against one of our friends is automatically an enemy?

A: Sometimes that's true, too. However, if American corporations can profit by selling weapons to both sides at the same time, all the better.

Q: Why?

A: Because war is good for the economy, which means war is good for America Also, since God is on America's side, anyone who opposes war is a godless un-American Communist. Do you understand now why we attacked Iraq?

Q: I think so. We attacked them because God wanted us to, right?

A: Yes.

Q: But how did we know God wanted us to attack Iraq?

A: Well, you see, God personally speaks to George W. Bush and tells him what to do.

Q: So basically, what you're saying is that we attacked Iraq because George W. Bush hears voices in his head?

A: Yes! You finally understand how the world works. Now close your eyes, make yourself comfortable, and go to sleep. Good night.


Source of article: Internet

మంగళవారం, మే 27, 2008

బ్లాగ్వీక్షణం -10


మన చేరా అభినందన సంచిక

మ్ర్యాఁవ్...!!
http://yarnar.blogspot.com/2008/05/blog-post.html?showComment=1211663340000#c5194104901504150554

పిల్లికి చదువు నేర్పితే, మ్ర్యాఁవ్...!! అని అంటుందని సెలవిస్తున్నారు రానారె. రాయలసీమ యాసలో సాగిన ఈ చిన్ననాటి ముచ్చట్లు చదువుతుంటే, జున్ను తిన్నట్లే వుంటుంది, తెలుగు భాషా ప్రియులకు. ఈ కథనానికి మచ్చుగా చూడండి."మా రాతిమిద్దెలో తేళ్లూ జెర్రులూ జాస్తి. ఇంటి సుట్టూరా రాతి పారిగోడ, యింటి ముందర కొండరాతి తెట్టె వుంటాది కాబట్టి అడపాదడపా పాములు కూడా కనబడతావుంటాయ్." ఈ ' కొండరాతి తెట్టె ' కు అర్థం చెప్పటానికి ప్రయత్నం చెయ్యండి.

హిమాలాయాలలో ట్రెక్కు - ట్రావెలాగుడు ౧
http://praveengarlapati.blogspot.com/2008/05/blog-post_25.html

హిమాలయాలు -హిమ కు ఆలయాలు.మంచు పర్వతాలు, పార్వతీ పరమేశ్వర నిలయాలు.ఇవి సుమనొహరాలు. హిమగిరి సొగసులు వర్ణించే సాహసం చేస్తున్నది ప్రవీణ్. ప్రతి సంవత్సరము, Youth Hostels Association of India వారు ఈ పర్వతాలలో ట్రెక్కింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఉత్సాహ వంతులు, ఈ ట్రెక్ లో చాలా తక్కువ ఖర్చులో, ఎక్కువ సంతోషాన్ని పొందగలరు. కులూ-మనాలి లోని ఈ పర్వత, సాహస ట్రెక్, ట్రావెలాగ్ ఆసక్తికరంగా సాగుతుంది. మీరూ చదవండి.

నేను లోక్‌సత్తాకు వోటెందుకేస్తానంటే..
http://chaduvari.blogspot.com/2008/05/blog-post_25.html

కూరగాయల మార్కెట్లో అన్నీ సచ్చు వంకాయలే వున్నప్పుడు, వంకాయలు ఎలా కొనడం? ఉన్న వాటిల్లో మంచివి ఏరుకొని కొంటాము. You opt for lesser evil, while voting in elections. అంతా అవినీతిమయం గా వున్న రోజులలో, జయప్రకాషే దిక్కంటున్నారు, చదువరి. లోక్‌సత్తాకు ఒక సారి ఛాన్స్ ఇచ్చి చూద్దామా?


తెలుగు రచయితల సంఘం ఏర్పాటు-రచయితలు గైర్ హాజరు!
http://kasturimuralikrishna.wordpress.com/2008/05/22/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%b0%e0%b0%9a%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%82%e0%b0%98%e0%b0%82-%e0%b0%8f%e0%b0%b0%e0%b1%8d%e0%b0%aa%e0%b0%be/

మీ పుస్తకావిష్కరణ సభకు 300 మందిని ఆహ్వానిస్తే, కెవలం ముగ్గురే (భార్య, తల్లి, చెల్లెలు) సభకు హాజరయితే, గుండె చెరువవదా? కథలకు కాలం చెల్లిందా? నవలలకు పూర్వవైభవం ఎట్లా తీసుకు రావాలి? కథలను కంచికి బదులు, శ్రీకాకుళం కారామాస్టారింటి వైపు ఎట్లా తీసుకు వెళ్లేది? తెలుగు రచయితలపై ప్రచురణకర్తల శీతకన్నుకు కారణం ఏమిటి? రచయితలు వారి రచనలు వారే ప్రచురించుకొంటే, పసలేని రచయితలని అర్థమా? ఈ చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కస్తూరి మురళీ కృష్ణ.

ఆకాశ వీధిలో ' ఆకుపచ్చ కన్నీరు '
http://thotaramudu.blogspot.com/2008/05/blog-post.html


“ఇలాంటి చాన్సు మళ్ళీ దొరకదని ఆ air hostess పైలెట్ వైపు తిరిగి గట్టిగా "ఉస్కో" అని అరిచింది......రన్వే మీద కూడా పోనివ్వకుండా డైరెక్టుగా గాల్లోకి ఫ్లైటు లేపాడు పైలెట్.....

గాల్లో ఉన్నాము...” ఇది DSG తోటరాముడి brand హాస్యం. అదేనండి రెండు రెళ్ళు ఆరు లోని తాజా హాస్య రసం. ఇది తాగి కడుపుబ్బ నవ్వుకోండి.

మాతృభూమి!
http://sangharshana.blogspot.com/2008/05/blog-post_08.html

మాతృభూమి చిత్ర సమీక్ష ఇది. గుండె చిక్కబట్టుకుని చదవవలసిన సమీక్ష.
ఈ సినెమా కధ ఒక ఊహ నించి పుట్టింది. మనీష్ ఝా ఈ కధను రచించి, సినీమా దర్శకత్వం వహించారు. వర కట్న దురాచారం దేశం లో మహిళల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో మనకు తెలుసు. ఇప్పటికీ ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే అబార్షన్ చేయించడం, ఆడ పిల్ల పుడితే రక రకాల హేయమైన పద్ధతుల లో ఆ పసిగుడ్డును చంపటం.. జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆడ సంతానాన్ని చంపటం.. ఇదే రేట్ లో కొనసాగితే.. కొన్నాళ్ళకి దేశం లో ఆడవాళ్ళే కరువుతారు. అటువంటప్పుడు సామాజికంగా ఎటువంటి పరిస్తితులు ఎదురవుతాయో అని ఊహించి తీసిన చిత్రం ఇది. గడ్డిపూలు సుజాత సమీక్ష. మిమ్ములను ఆలోచింపచేస్తుంది.


ఆ వ్యర్థాలు సేకరించింది డాక్టర్‌ రెడ్గీస్‌ నుంచే...,మరో వ్యర్థ బాగోతం - ఈసారి 'అరబిందో'
http://pichukalu.blogspot.com/2008/05/blog-post_24.html

హైదరాబాదు వాసులకు బాగా తెలిసిన విషయం. ఏ అర్థరాత్రో నిద్ర నుంచి మెలకువ వచ్చి,బయటకు వస్తే, భయంకరమైన విషవాయువులు. జనం గాఢ నిద్రలో మునిగి వుండగా, చడీ,చప్పుడు కాకుండా పారిశ్రామిక వేత్తలు ఈ విష వాయువులను గాలిలోకి వదులుతుంటారు. కాలుష్య నివారణ మండలికి ఫిర్యాదు చేస్తే, ఏవో నామ మాత్రపు దాడులు నిర్వహిస్తారు. వారం రోజులకు కథ మళ్లీ మొదలవుతుంది. అసలు ఈ కాలుష్యం ఎక్కడుంది? Pollution Control Board లోనా? ఈ కాలుష్యం నివారించేదెట్లా? పర్యావరణ సమస్య పై రాజేంద్ర కుమార్ ఎడతెగని కథనాలలో, మరో కథనం.

The Best Argument

ఈ అత్యుత్తమ వాగ్వివాదంలోని, ముద్దులొలికే మాటలు విని,ఆ చిన్న పాప మాటే సరైనదంటారు. ఈ వీడియో చూడండి.

ఆంధ్రజ్యోతి పై దాడి




ఈ దాడి video ను ఇక్కడ చూడండి.

http://www.musitv.com/index1.html

అసమ్మతిని తెలియచేయటానికి హింస ఒకటే మార్గమా? అహింసాయుత పద్ధతులు లేవా?

సోమవారం, మే 26, 2008

అమెరికాలో భారతీయ తల్లి తండ్రులు


Mother & Child Location: Bocaraton, Miami, Florida.

"ఆ మధ్యన ఈ మాటలో అనుకూంటా ఒకతను ఒక మంచి కథ రాశాడు ... అమెరికా వచ్చి కూతురి పిల్లని బేబీ సిట్ చేసినందుకుగాను చెల్లింపుల కోసం ఒక తండ్రి , కూతురు-అల్లుళ్ళ మీద దావా వేస్తాడు." -కొత్తపాళి

ఈ వ్యాసం పూర్వా పరాలు చదవని వారు, ఇక్కడ చూడండి.

http://deeptidhaara.blogspot.com/2008/05/8.html

ఈ లింక్ లో మొదటి టపా పై వివరణ చూసి,కామెంట్స్ చదివి, మళ్లా ఇక్కడకు రాగలరు.

ఆసక్తికరమైన కథ. ఈ కథకు లింక్ తెలిసినవారు, పంపితే ఉపయోగకరంగా ఉండగలదు. భారతీయ తల్లితండ్రులు అమెరికా లో తమ పిల్లల వద్ద glorified ఆయాలుగాను, baby sitters గా, వంట చేసే వారుగా, పని వారిగా మారటం ఒక చేదు నిజం. అంతే కాదు, నాలుగు గోడలమధ్య బందీలు. అయితే అడవ చాకిరీ చేస్తుంది పిల్లల వద్ద కాబట్టి, మింగా లేకా కక్కా లేక ఉంటున్నారు.

పిల్లల్ని పెంచటం లో ఉద్యోగస్తురాళ్లైన తల్లుల, భిన్న అనుభవాలున్నాయి. మెము పిల్లల్ని కంటాము. మీరు (తల్లి తండ్రులు) భారత్ లో పిల్లల్ని పెంచండి అని కొందరంటారు.కాని అప్పటికి తల్లి తండ్రులకు ఆరోగ్య,వయస్సు పరిస్థితుల దృష్ట్యా పిల్లలని పెంచటం శక్తికి మించిన భారం అవుతుంది. అయినా కూతురు/కొడుకు పై ప్రేమతో మనవడిని తెచ్చుకుని, ఇండియా లో పెంచుతారు. మనవడిని మూడేళ్లు పెంచాక కోడలు ఒక శుభవార్త చెపుతుంది;తాను తల్లిని కాబోతున్నానని; క్రితం లానే ఈ పిల్ల/పిల్లవాడిని మీరే ఇండియా లో పెంచాలని. హతాశులైన తల్లితండ్రులు వారి వయస్సు/అనారోగ్య దృష్ట్యా - 'మా వల్లకాదు. మేము పెంచ లేమంటే'; ఉద్యోగస్తురాలైన కోడలికి abortion తప్ప వెరే గత్యంతరం లేక పోతుంది.

ఒక తండ్రి కథ: విడాకుల తో భార్య దూరమయ్యింది. పిల్లలను పెంచటం ఎలా? ఒక నానీని ఏర్పాటు చేసుకొన్నాడు. అలా రెండేళ్లు, మూడేళ్లు గడిచాయి. కాని ఎంతకాలం ఇలా? కాలమే దీనికి పరిష్కారం చెప్పింది. పిల్లల తండ్రి, నానీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకున్నారు.పిల్లలకు తల్లి, అతనికి భార్య ఇద్దరూ దొరికారు, ఒకే దెబ్బకి. శుభం. కాని అన్ని కథలూ ఒకేలా ఉండవు.

ఇక నానీ ని పెట్టుకోవటం లో కూడా ప్రతి ఒక్కరికి వారి వారి అనుభవాలుంటాయి. ఒక ఉద్యోగస్తురాలైన తల్లి అనుభవం. ఆమె జీతం 60K. కాని ఇందులో పన్నులు సుమారుగా 33.33% దాకా ఉంటాయ్. పన్నులు పోను నెల జీతం $3333/- ఇది DIG (Double income group) కథ. అంటే భార్యా భర్తలిద్దరూ, ఉద్యోగస్తులైన స్థితి. పాప ను చూసుకోవటానికి ఒక గుజరాతీ నానీని పెట్టుకున్నారు.ఈ నాని కుటుంబ సబ్యులు కూడా అమెరికా లో స్థిరపడినవారే. నాని కొడుకు ఆమెను baby sitting కొరకు ఒప్పుకున్న ఇంటిలో, ఉదయం 9 గంటలకు వదిలి మరల సాయంత్రం 6 గంటలకు వచ్చి తీసుకువెళ్లేట్టు,ఏర్పాటు. నాని నెల జీతం $1400/- నాని ఇన్సురన్స్ వగైరాలు ఆమె కుటుంబ సభ్యులే చూసుకుంటారు. ఇక్కడ పాప తల్లి బాదరబందీ, చీకూ చింతా లేకుండా హాయిగా వుద్యోగం చెయ్యగలుగుతుంది.నాని happy. అంతా happy. కొన్ని ప్రాంతాలలో, ఎక్కువ కూడా charge చెయ్యవచ్చు. అయినా ఈ ఏర్పాటు పనిచేసే తల్లులకు అచరణీయమైన, ఆమోదయోగ్యమైన పరిష్కారం. ఇది చట్టపరంగా ఆమోదించబడినదా, కాదా అనే విచారణ ఇక్కడ చెయ్యటం లేదు. నాని సేవలను exploit చేస్తున్నట్లు అవుపించదు. గుజరాతీ కుటుంబ సభ్యులంతా, అమెరికాలో స్థిర పడ్డారు (Green card holders) కాబట్టి, వారు ఎక్కడైనా ఉద్యోగం చెయ్యవచ్చని,ఊహాగానం.

ఇహపోతే, ఉద్యోగస్తురాళ్లలో కొందరు, Citizenship, మరికొందరు Green Cards కలిగి వున్నారు. ఈ తల్లులు, వారి పిల్లల సంరక్షణకై, Au Pair services వాడుకోవచ్చు. ఈ ఆపైర్ లు, వివిధ దేశాలనుంచి, ప్రభుత్వ సాధికారిక అనుమతితో, J-1 Exchange Visitor visa పై అమెరికా వచ్చిన వారు. వీరిని ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల ద్వారా, మన ఇంటిలో పిల్లల సంరక్షణకు వినియోగించుకోవచ్చు. వీరు వారానికి 45 గంటలు పని చేస్తూ,మన ఇంటిలోనే వుంటూ, మన పిల్లల బాగోగులు చూసుకొంటారు. వీరి వయస్సు 18 నుంచి 26 దాక వుంటుంది. ఆ పైర్ గా స్త్రీ పురుషులలో, ఎవరినైనా ఎంచుకునే సౌకర్యం మనకుంటుంది. వీరి పూర్వా పరాలు, పరీక్షింపబడినవి కనుక, మన పిల్లలను నిశ్చింతగా వారిపై వదిలి వెళ్లవచ్చు.వారు పిల్లలను స్కూల్ లో దిగవిడిచి, మరల స్కూల్ అయ్యాక పికప్ చేసుకుంటారు. పిల్లలకు కావలసిన ఆహారాన్ని, వారే ఇంట్లో వండి, పిల్లలకు తినిపిస్తారు. పిల్లల ఇతర అవసరాలూ చూస్తారు. వీరికి అయ్యే ఖర్చు, సుమారు $1400/-p.m.

కొంచెం ఖర్చుతో, ఎక్కువ శారీరక, మానసిక ప్రశాంతి, తల్లులకు దొరుకుతున్నపుడు, నాని, Au Pair ఖర్చులు, భరించ సాధ్యమైనవి (affordable) కావున, అతి ఆదాకు పోయి, తల్లులు రాత్రులు నిద్ర చెడగొట్టుకోవటం, పగలు ఉసూరుమంటూ కార్యాలయాలకు వెళ్లటం అవసరమా అని?

ఆలోచించండి.

మరిన్ని వివరాలకు చూడండి

http://www.aupairusa.org/

http://www.aupairusa.org/faqs/au-pair-usa.html

http://www.aupaircare.com/host-families/program-costs

ఆదివారం, మే 25, 2008

బ్లాగ్వీక్షణం -9


చెట్లపై నడక, తలకోన అడవులలో చిత్రం సౌజన్యం: భూమిక సత్యవతి

ఆకుపచ్చ లోయల్లో, ఆనందపు హేలల్లో
http://maagodavari.blogspot.com/2008_01_01_archive.html

రచయిత్రులతో కాంపులు నిర్వహించటం లో అనుభవం గడించిన భూమిక సత్యవతి గారి ట్రావెలాగ్ ఇది. ఇది చదువుతున్నంత సేపు, పాఠకులు కూడా ప్రళయ కావేరి లో బోటు ప్రయాణం చేసిన అనుభూతి, మామండూర్ అడవులలో పెదవాగులో స్నానం చేసినట్లూ, తలకోన అడవిలో తరుల మీద నడిచినట్లు (canopy walk) మరువలేని అనుభవం, పొందుతారు. ఇంకా అడవిలో, పంతం సుజాత ‘ముంగిట్లో మువ్వలశబ్ధం’ నవల ఆవిష్కరణ, వెన్నెల్లో విహారం వగైరా వగైరా అనుభూతులు ప్రయాణం ముగిసాక కూడా, చాన్నాళ్లు వెంటాడే తీపి జ్ఞాపకాలు.

గ్లాసులో మొలకలు
http://everydaysuruchi.blogspot.com/2008/05/blog-post_14.html

అమెరికా లో అపార్ట్‌మెంట్ లో కూరగాయలు, దుంపకూరలు పండించడం సాధ్యమా? జ్ఞాన ప్రసూన గారు తమ అనుభవాలు వివరిస్తున్నారు.

బ్లాగుతా తీయగా చల్లగా
http://kranthigayam.blogspot.com/2008/05/blog-post.html

క్రాంతికి పెళ్లయ్యాక వచ్చిన కొత్త కష్టాలేమిటి? అవి ఎలా deal చేస్తుందో, ఈ టపా లో చదవండి. మీరు తనతో ఎకీభవిస్తారా?

వచ్చే సారి కూడా దేవుడిపాలనే - వై.ఎస్.ఆర్
http://telugulekha.blogspot.com/2008/05/blog-post_15.html

రాష్ట్రం లో కొత్తదేవుడి పరిపాలనగురించి వివరిస్తున్నారు చక్స్. వ్యంగ రచన.

ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల... : ........................
http://ekantham.blogspot.com/2008/05/blog-post_16.html

ఎందుకనో

బ్లాగ్వీక్షణం లో పరిచయం చేస్తున్న మొదట కవిత ఇది. అంత గొప్ప కవితా అంటే కాదనే సమాధానం వస్తుంది. మరెందుకు పరిచయం చెయ్యటం? ఈ బ్లాగరి ప్రకృతి తో తాదాత్మ్యం చెందగల భావకుడు. తన గుండె లోని విచారాన్ని, ఈ కవిత లో వ్యక్తపరుస్తున్నారు, దీపు.

వార్తాపత్రిక నిత్యావసర వస్తువా!
http://anilroyal.wordpress.com/2008/05/07/%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be%e0%b0%aa%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b5%e0%b0%b8%e0%b0%b0-%e0%b0%b5/

ఒక దినపత్రికను పాఠకుడు ఏమి ఆశించి కొంటాడు? రెండు రుపాయలకు కిలో పేపర్ ఇస్తే సాక్షి కొంటాడా? పాఠకుడు ఆశించేది తక్కువ ధర ఐతే ఆంధ్రభూమి దిన పత్రిక రూపాయిన్నరకే అమ్ముతున్నారు.అయినా దాని circulation అంతంత మాత్రమే. అందరూ రెండు రూపాయలకే పేపర్ అమ్మాలని సాక్షి ఉద్యమం. ఆ సిద్ధాంతం ప్రకారం సాక్షి కూడా రూపాయిన్నరకే అమ్మాలని ఆంధ్రభూమి వాళ్లు వాదించవచ్చుగా? ధరతో నిమిత్తం లేకుండా నిజాయితీ వార్తలిచ్చే పత్రికే, పాఠకుడి ప్రాధాన్యం. సమకాలీన సంగతులపై తెలుగోడు అబ్రకదబ్ర విశ్లేషణ.

ప్రయాణం
http://snehama.blogspot.com/2008/05/blog-post_06.html

ఎవరన్నారు, కవితలకు పాఠకులు లేరని? ప్రయాణమంటే ఎవరికిష్టముండదు? అందులో, ఊహల పల్లకి లో, చుక్కల దారిలో మెత్తని ప్రయాణం.నక్షత్రాలెక్కడుతూ, గెలుపే లేని ఆట ఆడుతూ, అలుపే లేని ఆనందమయితే,తారకే నిన్ను వచ్చి చేరదా? ఇది ప్రయాణ గీతం కాదు, ప్రణయ గీతమని,శృంగార గీతమని విశ్లేషిస్తున్నారు, పాఠకులు. గెలుపే లేని ఆట కు అర్థం తెలుసుకోవాలంటే, కామెంట్స్ చదవ వలసినదే. అయితే, కవిత రాసే సమయంలో,అది రాధిక ఊహకు అందని విషయం.ఈ చిన్న కవితకు ఈ రోజు దాకా వచ్చిన కామెంట్స్ సంఖ్య 18. మీరూ ప్రయాణానికి సిద్ధం కండి.

శనివారం, మే 24, 2008

సెల్ వైరాగ్యం -3


Sexy Future Mobile


మధ్యాహ్న భొజనమయ్యాక కొంచం కునుకు తీయటం అలవాటు. 10 నిమిషాలు పడుకున్నానో లేదో, ఎదో కొంపలు మునిగినట్లుగా, ఫోన్ మోగింది. ఈ టైం లో ఎవరు చేస్తున్నారబ్బా అనుకుంటూ ఫోన్ ఎత్తా. షరా మాములే. రావుగారేనా మాట్లాడుతుంది? ఆ, అవును, రావునే మాట్లాడుతున్నా. 'నేను సామ్యూల్ ను. ఆల్రైట్ బాంక్ నుంచి మాట్లాడుతున్నా. మా కస్టమర్ డిపార్ట్మెంట్ వాళ్లు, మీ యొక్క అకౌంట్ నిర్వహించిన తీరు చూసి,ముచ్చెరువై, మీకు బాంక్ క్రెడిట్ కార్డ్ ఇవ్వాలని ఏగ్రీవంగా తీర్మానించారేశారు కావున, మీకు ఈ సాయంత్రం కొరియర్ లో వచ్చే కార్డ్ అందుకోగలరు.' అని ఫోన్ పెట్టేశాడు. వీడి దుంపతెగ. నేను కార్డ్ కావాలని అడగకుండా పంపుతాడేమిటి అని వాడి మీద పీకల్దాకా కోపమొచ్చేసింది. మా ఫ్రెండ్ సుబ్బారావు క్రెడిట్కార్డ్ తో ఎలా అప్పులపాలయ్యోడో ఆఫీస్ లో అంతా కథలు కథలు గా చెప్పుకుంటుంటే విన్నా. చస్తే, క్రెడిట్ కార్డ్ తీసుకోగూడదని తీర్మానించేసుకున్నా. అట్లాంటిది, నాకే వీడు కార్డ్ పంపుతాడు, నన్నడగకుండా.

ఆ మర్నాడే కార్డ్ తీసుకుని ఆల్రైట్ బాంక్ కు వెళ్లా. కౌంటర్ లో అబ్బాయినడిగితే, మేనేజర్ను కలవాలన్నాడు. కలుస్తానంటే, కూర్చోమన్నాడు. ఐదు నిమిషాల తర్వాత పిలుపొచ్చింది, మేనేజర్ నుంచి. రూం లోకి వెళ్తూనే చల్లగా అనిపించింది. మేనేజర్ కూర్చోమన్నాడు.ఆఫీస్ బాయ్ చల్లటి నీళ్లు తెచ్చాడు, తాగటానికి. నా కోపం చల్లారింది. వచ్చిన విషయం చెప్పా. 'ఏమి ఫరవాలేదు. మీకు అవసరమైనప్పుడు వాడుకోండి. Card renewal fee లేదు, అంతా ఉచితం అని, ఇవ్వాళ మీరు ఎదైనా వస్తువు కొంటే, గడువు లోపల పైకం చెల్లిస్తే వడ్డీ కూడా లేదు సార్.మీకంతా లాభమే.' అని సాగనంపాడు. నేను కూడా వాడితే కదా, మనము దీని ఊబిలో పడేది, లేకుంటే లేదు అని సమాధాన పరచుకొన్నా. ఆ పై ఈ క్రెడిట్ కార్డ్ తో నా కష్టాలన్నీ రాయాలంటే, అది క్రెడిట్ కార్డ్ వైరాగ్యం అంత పెద్ద వ్యాసం అవుతుంది కావున, దాని జోలికి ఇప్పుడు పోవటం లేదు.

సెల్ కొన్నాక ఒక విషయం అర్థమయ్యింది. నేను సెల్ కొనటం ఈ కంపనీల వాళ్లకి పండగయ్యింది, నాకు కాదు. ఎందుకంటే, నాకు వచ్చిన ఫోన్స్‌లో మిత్రుల ఫోన్స్ తక్కువ, కంపనీలవి ఎక్కువ కనుక.ఆ రోజు మధ్యాహ్నం, భోజనం లో నాకు నచ్చిన గుత్తి వంకాయకూర,మునక్కాయ పులుసు, ముద్దపప్పు ల తో మా ఆవిడ నాకు అరచేతిలోనే స్వర్గం చూపే సరికి, గుర్రెట్టి నిదురిస్తున్న సమయం లో సెల్ మోగింది. మధ్యాహ్నం ఎవడురా, నిద్ర పోనీకుండా ఫోన్ చేస్తాడు అని విసుక్కుంటూ, ఫోన్ ఎత్తా. 'గుడ్ ఆఫ్టర్‌నూన్, రావుగారు కావాలి’ ''మాట్లాడుతున్నా” ' నేను సంజన, బాంక్ ఆఫ్ కెనడా నుంచి మాట్లాడుతున్నా. మీకు మా బాంక్ వారు నాలుగు లక్షల రూపాయలు అప్పు మంజూరు చేశారు. నో గ్యారంటీ. కొన్ని కాగితాల మీద సంతకం పెట్టి, 18 బ్లాంక్ చెక్స్ ఇస్తే చాలు. మా బాంక్ ఎక్జిక్యూటివ్ ను మీ ఇంటికి ఎప్పుడు పంపమంటారు? ‘అని గడ గడ చెప్పేస్తే - నాకు తిక్క రేగింది. నేను అప్పు అడగ లేదు, అవసరం లేదు. ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తారని అడగబోయి,అవతలున్నది అమ్మాయని గుర్తొచ్చి,' నా ఫోన్ నంబర్ మీకు ఎలా తెలిసింది? నాకు లోన్ ఇవ్వాలని మీకు అనిపించటానికి, నా గురించి మీ కేమి తెలుసు?' అని అడిగా. దానికి బదులుగా సంజన ఓ చిర్నవ్వు నవ్వి, ‘అవన్నీ మా P.R.O. శాఖ చూసుకుంటుంది , నా పని మీ లాంటి విలువైన ఖాతాదారు లకు ఫోన్ చెయ్యటమే ' అని విసుగు లేకుండా, మరలా నవ్వుతూ చెప్పింది. 'మీ బాంక్ ఎంత వడ్డీ వసూలు చేస్తారు? మిగతా వివరాలేమిటి?' అని అడిగా. ‘19% p.a., Loan processing charges, premature closing penalty వగైరాల గురించి చెప్పింది.' ‘అది సరేనమ్మా, ఇలా ముక్కూ, ముహం తెలియని వాళ్లకిలా అప్పులిస్తే, వాళ్లు ఎగవెస్తే ఎట్లా? ‘అన్నా, అమాయకంగా, నేనో సత్య హరిశ్చంద్రుడిలా. దానికి మా వద్ద ప్రత్యేక శిక్షణ పొందిన, వుద్యోగులతో కూడిన, Loan Recovery Cell వుంది.అప్పు ఎగ్గొట్టే వాళ్ల పని, వాళ్లు చూసుకుంటారులెండి ' అంది నన్ను ఓదారుస్తున్నట్లుగా. సరే, నాకు అవసరమైతే ఫోన్ చేస్తా, అని ఫోన్ పెట్టేశా. తర్వాత, బాంక్ అప్పారావు చెప్పాడు, ఈ ప్రైవేట్ బాంక్లు వాళ్లు , loan recovery కి ఎన్ని చిత్ర, విచిత్ర,దుర్మార్గమైన పనులు చేస్తారో చెప్పేసరికి,సంభ్రమంతో,నోరు తెరిచా. సంజన విజయవంతంగా నా మధ్యాహ్న నిద్ర, భంగం గావించగలిగింది. ఇప్పటికీ నాకు అంతు బట్టని విషయం, నా మిత్రులకే ఇంకా సరీగా తెలియని నా సెల్ ఫోన్ నంబర్, నా credit worthiness ఈ ఫోన్ చేసే వాళ్లకు ఎలా తెలుస్తున్నాయని. నన్ను మాటి మాటికీ విసుగించే, ఈ ఫోన్స్ నుంచి రక్షించేందుకు, ఏదన్నా వ్రతముందేమో తెలపాలని, జ్యోతక్కకు వెంటనే వుత్తరం రాశా. (To be contd)

శుక్రవారం, మే 23, 2008

మానవతావాది అవుల గోపాలకృష్ణమూర్తి


Avula Gopala krishna Moorti


అవుల గోపాలకృష్ణమూర్తి గారి పై ఇన్నయ్య గారి వ్యాసం గతంలో ' నా ప్రపంచం ' లో ప్రచురించబడింది.

http://naprapamcham.blogspot.com/2008/04/17-agk.html

AGK పై మరో దృక్కోణం లో , నూతన విషయాలతో కూడిన ఇన్నయ్య గారి మరో వ్యాసం, ఈ రోజు ఆంధ్రజ్యోతి లో ప్రచురించబడింది. చూడండి

http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2008/may/23edit4

బుధవారం, మే 21, 2008

అనుభూతులు



Dr.నవీన, ఆంగ్ల కవితల పుస్తకం, Feelings, తాజాగా వెలువడింది. ఈమె పిల్లల మానసికశాస్త్ర నిపుణురాలుగా,అమెరికా లో పనిచేస్తున్నారు. ఇవి ఆమె teenager గా వున్న సమయంలో రాసుకున్న కవితలు. ఆ వయస్సులో అమ్మాయిలకు,తమ కలల రాకుమారుడి గురించిన ఆలొచనలు రావటం సహజం. ఒక సంఘటనకు స్పందించే గుణం కూడా ఎక్కువే. తమ తల్లి తండ్రులంత గొప్పవారు లేరని, తమ సోదరుడు ధీరోదాత్తుడని విశ్వసిస్తారు. ఈ కవితా సంపుటి లో నవీన యొక్క, భిన్నమైన ఆలోచనలు, ఆశలు, అనుభూతులు,అనురాగం, అనుతాపం,సంతోషం, దుఃఖం అన్నీ కనిపిస్తాయి.యవ్వనపు తొలి ఛాయలో ఉండే కుర్రకారందరికీ కలిగే సహజమైన ఆలొచనలే ఇవి. కొన్ని మిమ్ములను కదిలిస్తాయి.


ఈ పుస్తకం లోని Feelings అనే కవితకు, తెలుగు స్వేచ్ఛాను వాదం (అనువాదం: cbrao) చదవండి.

సంభ్రమంగా,నిశ్శబ్దంగా కూర్చున్నా;
నా ఎదురుగా ఉత్సాహ భరిత, ప్రశాంత సాగరం,
చల్లటి గాలులు శరీరాన్ని తాకుతుంటే,
సముద్రపు నీరు నా పాదాలను కడుగుతోంది
కోమలంగా, అతి సున్నితంగా

దాని బలం నాకు తెలుసు
వుంటుంది ఎట్లా, తెలియకుండా?
నిన్ననేగా నా ప్రియ నేస్తాన్ని కబళించింది
ఉప్పొంగే అలలు తమ కౌగిలిలో నన్ను సుతారంగా ఉంచుతుంటే
ఎంత లాలిత్యం,స్వఛ్ఛం అయినా, నాకు తెలుసు అవి నిర్దయలు


Maipadu Beach, Nellore Photo: cbrao

నీళ్లలోని రాళ్లను,ఒడ్డుపైని బండ రాళ్లను కఠినంగా
ఖణీల్మని కొట్టుతూ,వాటిని అరగదీస్తూ, గాయపడి, బాధతో
వెళ్తుంది వెనక్కు, ప్రశాంత సముద్రం

అయినా అంతుతెలియని అగాధపు లోతుల్లోంచి
వస్తుంది వెనక్కు, నీలాంబరాన్ని తన కౌగిలిలో బంధించాలని
గాల్లోకి ఎగురుతూ, ప్రతి సారీ కొత్త శక్తితో, ప్రళయ కావెరిలా
ఎగిసే అగ్ని జ్వాలలా,అలుపెరగని అల
మరల మరల వస్తుంది, రాతిని ఢీ కొట్టి, మూలుగుతూ,
గుబులుగా, వెనక్కు వెళ్లటానికి.

ఈ కవితా సంపుటి లో That Special Someone, Feelings, Lost and Lonely, Gone Forever, Oh Daddy (About Innaiah Narisetti) ,He was But a Tiny Tot (About brother Raju Narisetti),Contentment, For A Dear Friend వగైరా కవితలున్నాయి.


Painted Stork at Pulicat Lake, Sullurpet Photo: cbrao

పుస్తకం చక్కటి ఆర్ట్ కాగితంపై, సౌందర్యంగా, ముద్రించబడింది.మనోహరమైన page design తో బాటుగా, ప్రతి పేజీ లో Nature Photographs కళారాధకులకు, కనువిందు కావించి, మంచి అనుభూతి మిగల్చగలదు.

మే 21,Dr.నవీన పుట్టిన రోజు. ఈ Feelings పుస్తకం, ఆమెకు పుట్టిన రోజు కానుకగా ఇస్తున్నారు, ఆమె తల్లి తండ్రులు. నవీన 100 పుట్టిన రోజులు జరుపుకొని, పిల్లల మానసిక స్వస్థత కు ఎన్నో, సేవలందించాలని కోరుకుందాము.

కొస మెరుపు: ఈ పుస్తకం లోని ఛాయాచిత్రాలు భవదీయుడు, లదాఖ్,కూర్గ్, పులికాట్ సరస్సు,మామందూర్,శాంతినికేతన్ వగైరా ప్రదేశాలలో తీసినవి.

ఈ అందమైన పుస్తకాన్ని మీరూ చదివి, చూసి ఆనందించండి. కింద ఇచ్చిన లింక్ లోంచి ఉచితంగా download చేసుకోండి.

Feelings_poems
Feelings_poems.pdf
Hosted by eSnips

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై లోక్‌సత్తా విశ్లేషణ



ఈనాడు దినపత్రికలో అసత్యాలు ప్రచురించితే,కేవలం రామోజీరావు విశ్వసనీయత మాత్రమే దెబ్బతింటుంది.ఆంధ్రజ్యోతి దినపత్రికలో అసత్యాలు ప్రచురించితే,కేవలం వేమూరి రాధాకృష్ణ విశ్వసనీయత మాత్రమే దెబ్బతింటుంది.సాక్షిలో అసత్యాలు ప్రచురించితే,దానిపై ప్రజల్లో కలిగే వ్యతిరేకత,తక్షణమే కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర్ రెడ్డి కి వ్యతిరేకంగా పరిణమిస్తుంది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై లోక్‌సత్తా విశ్లేషణకై చూడండి.


http://www.loksatta.org/englishsite/docs/2008/lstimes0515.pdf

మంగళవారం, మే 20, 2008

వయసు పదహారు



జీవితంలో మనము ఆపలేనిది: వయస్సు

జీవితాంతం నీకు తోడుండేది:నువ్వే

పెరిగే వయస్సు గురించి,దాని వెనుక వున్న మనస్తత్వం గురించి మనకు వివరిస్తున్నారు, హాస్యం లో గ్రామీ గ్రహీత జార్జ్ కార్లిన్. ఇది చదవకపోతే, మీ గురించిన కొన్ని విషయాలు, మీకు ఎప్పటికీ తెలియకుండా వుండి పోతాయి.
George Carlin is a Grammy-winning American stand-up comedian, actor and author.
He is especially noted for his political and black humor and his observations on language, psychology and religion along with many taboo subjects.

George Carlin on aging!
(Absolutely Brilliant)
IF YOU DON'T READ THIS TO THE VERY END, YOU HAVE LOST A DAY IN YOUR LIFE.. AND WHEN YOU HAVE FINISHED, DO AS I AM DOING.

George Carlin's Views on Aging
Do you realize that the only time in our lives when we like to get old is when we're kids? If you're less than 10 years old, you're so excited about aging that you think in fractions.

'How old are you?' 'I'm four and a half!' You're never thirty-six and a half. You're four and a half, going on five! That's the key

You get into your teens, now they can't hold you back. You jump to the next number, or even a few ahead.

'How old are you?' 'I'm gonna be 16!' You could be 13, but hey, you're gonna be 16! And then the greatest day of your life ! You become 21. Even the words sound like a ceremony. YOU BECOME 21. YESSSS!!!

But then you turn 30. Oooohh, what happened there? Makes you sound like bad milk! He TURNED; we had to throw him out. There's no fun now, you're Just a sour-dumpling. What's wrong? What's changed?

You BECOME 21, you TURN 30, then you're PUSHING 40. Whoa! Put on the brakes, it's all slipping away. Before you know it, you REACH 50 and your dreams are gone.

But wait!!! You MAKE it to 60. You didn't think you would!

So you BECOME 21, TURN 30, PUSH 40, REACH 50 and MAKE it to 60.

You've built up so much speed that you HIT 70! After that it's a day-by-day thing; you HIT Wednesday!

You get into your 80's and every day is a complete cycle; you HIT lunch; you TURN 4:30; you REACH bedtime. And it doesn't end there. Into the 90s, you start going backwards; 'I Was JUST 92.'

Then a strange thing happens. If you make it over 100, you become a little kid again. 'I'm 100 and a half!'

May you all make it to a healthy 100 and a half!!

HOW TO STAY YOUNG
1. Throw out nonessential numbers. This includes age, weight and height. Let the doctors worry about them. That is why you pay 'them.'

2. Keep only cheerful friends. The grouches pull you down.

3. Keep learning. Learn more about the computer, crafts, gardening, whatever. Never let the brain idle. 'An idle mind is the devil's workshop.' And the devil's name is Alzheimer's.

4. Enjoy the simple things.

5. Laugh often, long and loud. Laugh until you gasp for breath.

6. The tears happen. Endure, grieve, and move on. The only person, who is with us our entire life, is ourselves. Be ALIVE while you are alive.

7. Surround yourself with what you love , whether it's family, pets, keepsakes, music, plants, hobbies, whatever. Your home is your refuge.

8. Cherish your health: If it is good, preserve it. If it is unstable, improve it. If it is beyond what you can improve, get help.

9. Don't take guilt trips. Take a trip to the mall, even to the next county; to a foreign country but NOT to where the guilt is.

10. Tell the people you love that you love them, at every opportunity.

AND ALWAYS REMEMBER :
Life is not measured by the number of breaths we take, but by the moments that take our breath away .

And if you don't send this to at least 8 people - who cares? But do share this with someone. We all need to live life to its fullest each day!!



HAVE A WONDERFUL LIFE…………….

GOD BLESS YOU!

శనివారం, మే 17, 2008

బ్లాగ్వీక్షణం -8


తల్లీ బిడ్డ

అసహాయతా హాస్యాలు
http://onamaalu.wordpress.com/2008/04/15/asahayatahasyalu/

పిల్లల్ని పెంచటం లో వుండే కష్టాలను,ఆ తల్లి చేసే త్యాగాలను మరో మారు గుర్తుచేస్తున్నారు లలిత.G. అమెరికా లో వుద్యోగం చేసే తల్లులు, ఒక అయాను వుంచుకోవటానికి ఎందుకు వెనకాడతారో!

ప్రపంచమే ఒక పచ్చని పూలతోట
http://pichukalu.blogspot.com/2008/05/blog-post.html

అమ్మో ఎండలు! ఈ సంవత్సరం వున్నన్ని ఎండలు గతంలో ఎప్పుడూ లేవు అని ప్రతి సంవత్సరమూ అనుకోవటం ఆనవాయితీ అయ్యింది. ఈ Global warming తగ్గటానికి ఏమి చెయ్యాలి? బత్తీబంద్ చెయ్యాలి అంటున్నారు విశాఖతీరాన్నుంచి రాజేంద్ర కుమార్ దేవరపల్లి. నేనింకో ఊసు చెప్తున్నా. వినుకోండి.Incandescent light bulb స్థానం లో Fluorescent bulb ఎంతొ విద్యుత్‌ను ఆదా చేస్తుంది. Power shortage సమస్యకు పరిష్కారంగా, తక్కువ విద్యుత్ ఖర్చుతో, ఎక్కువ కాంతి తో గృహాన్ని నింపవచ్చు.Fluorescent bulb వాడకాన్ని ప్రోత్సాహించండి. ఏమంటారు?


ఒ భగ్న హృదయం ....... ఒ బీరు క్యాను
http://kotthachiguru.blogspot.com/2008/04/blog-post_26.html

ఆడ పేరుతో బ్లాగులు రాసేవారు నిజంగా ఆడవారేనా? లేక వెరేనా? బ్లాగు చదివి ఆ అమ్మాయి అంటే పడిచచ్చి,డ్రీం సాంగ్ వేసుకునే సమయానికి, ఆమెకు రెండు రోజుల క్రితమే పెళ్లయిందని తెలిస్తే,ఏం జరుగుతుంది? ఒ భగ్న హృదయం ....... ఒ బీరు క్యాను. M.Bhanu Prasad రచన ఇది.


మలేషియా లో మన పరిస్థితి - Silent Ethnic-Cleansing
http://madhubaabu.blogspot.com/2008/05/silent-ethnic-cleansing.html

మలేషియా లో భారతీయులపై జరుగుతున్న అకృత్యాలు మనము పేపర్ లో చదువుతూనే వున్నాము. ఉద్యోగ ప్రకటనలో HR Consultant ఉద్యోగానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు, భారతీయులు తప్ప అన్న ఈ ప్రకటన చూడండి.మలేషియా లోని తాజా పరిస్థితులు వివరిస్తున్నారు మధు బాబు గడ్డిపాటి.

మా తాతలు పండించుకుని తిన్నారు!
http://hridayam.wordpress.com/2008/02/06/memories2/

వ్యవసాయం గిట్టుబాటు ఎందుకు కావటం లేదు? రైతుల ఆత్మహత్యలకు కారణ మేమిటి? గ్రామాలలో భావినీరు లోతుకు పోవటానికి కారణ మేమిటి? రైతు సమస్యలకు పరిష్కార మేమిటి? అన్నీ ప్రశ్నలే. సమాధానాలు ఎండమావులేనా? గుండెచప్పుడు దిలీప్, వాళ్ల తాత గారి సమయం లోని వ్యవసాయ పరిస్థితులను, నేటి పరిస్థితులతో బేరీజు వేస్తున్నారు.


మా వారి 'అమ్మ ' కథ
http://manishi-manasulomaata.blogspot.com/2008/05/blog-post_14.html

పుట్టింటి నుంచి అత్తింటి కొచ్చినప్పుడు గుండె గుబులుగా ఉండటం సహజం. అమ్మా నాన్నలకు, స్నెహితులకు దూరంగా, ఉండటం, కష్టం గానే వుంటుంది.అత్తే, అమ్మలాంటి స్నెహితురాలయితే? అంతకంటే అదృష్టం ఏముంటుంది? సుజాత శ్రీనివాస్ (మనసులో మాట) తమ అత్తగారి గురించి వివరిస్తున్నారీ టపాలో. మీకూ అలాంటి అత్తగారుంటే ఎంత బాగుంటుందో అని వాపోవడం ఖాయం.

అమెరికాలో.... అష్టకష్టాలు
http://joruga-husharuga.blogspot.com/2008/05/blog-post_15.html

అమెరికా వెళ్లిన కొత్తలో, కొత్త కొలమానాలైన మైళ్లు, గాలన్లు, డైములు, నికిళ్లు, పౌండ్లు కొంత గజిబిజి కలిగించటం సహజమే. రచయిత దైవానిక కష్టాలకు ఆకాశరామన్న, కొత్తపాళి ఇచ్చిన సులభ మార్గదర్శక సూత్రాలు చూడండి.

గురువారం, మే 15, 2008

వారణాసి నాగలక్ష్మి కథలు



వారణాశి నాగలక్ష్మిగారు పలు బహుమతులు గెలుచుకున్న కథల రచయిత్రి.మానవ సంబంధాలపై చక్కటి కథలు రాశారు. ఆలంబన అనే కథల సంపుటి, వాన చినుకులు అనే లలిత గీతమాలిక వెలువరించారు. వాన చినుకులు పుస్తకానికి ముఖ చిత్రాన్ని తనే స్వయంగా చిత్రించారు. డా.భార్గవీరావుగారితో కలిసి సంయుక్తంగా,ఊర్వశి అనే కూచిపూడి నృత్య రూపకాన్ని రాశారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ లో రసాయన శాస్త్రంలో M.Phil చేశారు. హైదరాబాదు నివాసి.

ఆసరా
http://www.siliconandhra.org/monthly/2005/oct05/index.html

విద్యుత్ పోయినప్పుడు UPS Files ను ఎలా రక్షిస్తుందో, అలాగే, బలహీన మనసుతో వున్న అమ్మాయిని, ప్రేమతో అక్కున చేర్చుకుంటే ఆత్మహత్యలు నివారించవచ్చు. గతం తలుచుకుని బాధపడేకంటే,ముందు చూపుతో భవిష్యత్ లోకి దర్శనం చేస్తే,చిక్కుముడులు విడివడవా? ఆనందమయ జీవితం సొంతం కాదా? సంజీవదేవ్ చెప్పినట్లు ఆశావాదం జీవితమైతే, నిరాశావాదం మృత్యు సమానం.కారా మాస్టారు మెప్పు పొందిన, “ఆసరా” కథ మీ ముందు.


అమృతాన్ని సాధించు
http://www.koumudi.net/Monthly/2007/april/april_2007_kathakoumudi_1.pdf

సంసారంలో పనులన్నీ ఇద్దరూ సమానంగా చెయ్యలేరు. కానీ, దుఖం, సుఖం సమానంగా పంచుకోగలరు, చెరిసగం అనే భావం వుంటే . “సంసారం, సంసారం ! ప్రేమ సుధాపూరం,నవజీవన సారం, సంసారం! ”. ఎంత ప్రేమ వివాహమైనా, భార్యా భర్తల మధ్య ఆ పొరపచ్చాలు,కన్నీటి పొరలు, అవగాహనా రాహిత్య నీహరికలూ సహజమే.సంసార సాగరంలో,ఆ సముద్రాన్ని మధించి,అపోహల విషాన్ని త్యజించి, అమృతాన్ని వెలికి తియ్యాలి. అప్పుడు, ఇల్లే, కాదా స్వర్గసీమ? కౌముది ఉగాది కథల పోటీలో, ప్రథమ బహుమతి పొందింది ఈ కథ.


మేఘన
ఈ కథగురించి cbrao గారి పరిచయం ఇక్కడ.

http://deeptidhaara.blogspot.com/2008/05/blog-post_06.html


కథ కోసం కారా మాస్టారు
ఈ కథగురించి కొత్తాపాళి గారి పరిచయం ఇక్కడ.
http://kottapali.blogspot.com/2008/05/blog-post_11.html

బుధవారం, మే 14, 2008

బ్లాగ్వీక్షణం -7


కార్టూన్: బ్నిం (బమిడిపల్లి నరసింహ మూర్తి)

ప్రేమ, నిరాశ, జీవితం మీద నిరాసక్తి
http://moortystelugublog.blogspot.com/2008/01/blog-post.html

చలం రచనలతో పరిచయమున్నవారు సౌరిస్, నర్తకి, రమణస్థాన్ అన్న పేర్లు వినే వుంటారు కాని అంతకు మించిన వివరాలు ఎక్కువ తెలియక పోవచ్చు. చలం తో ప్రత్యక్ష పరిచయం కల నారాయణమూర్తి గారు చలం తో తన అనుభవాలు,రమణస్థాన్ లో తను గమనించినవి, మనకు వివరిస్తున్నారు, ఈ టపాలో, ఆసక్తికరమైన కథనం తో.

స్వీట్ మెమోరీస్..
http://arunam.blogspot.com/2008/05/blog-post_13.html

మీరు పెళ్లి చూపులు చూసిన అమ్మాయి,కుదురుతుందనుకున్న సంబంధం, ఎవో కారణాలతో తప్పిపోతే,ఎప్పుడో అకస్మాత్తుగా కనిపిస్తే,ఆ సమయం లో పక్కనే, మీ శ్రీమతి వుంటే ఆమెను ఎలా పరిచయం చేస్తారు? మాజీ ముఖ్య మంత్రి ఎస్సెం కృష్ణ, బి.సరోజాదేవి ఒకప్పుడు పెళ్లి చేసుకుందామనుకుని, ఎవో కారణాలతో విడిపొయిన విషయం వార్తలలోకి వస్తే, వారెందుకు ఉద్వేగానికి లోనయ్యారు? రమ్యమైన అరుణ పప్పు కథనం ఇది.

బొమ్మరిల్లు
http://oosulu.blogspot.com/2008/04/blog-post_20.html

మీ రెప్పుడన్నా, ఇప్పుడు టి.వి లలో వస్తున్న, ప్రేక్షకులు పాల్గొనే కార్యక్రమాలలో పాల్గొన్నారా? అందులో అనుభవం ఎలావుంటుందో తెలుసుకోవాలంటే,బొమ్మరిల్లు షూటింగ్ లో పాల్గొన్న స్వాతి అనుభవం తెలుసుకోవాలిసిందే.

ETV సుమన్ సుత్తికి, ఊదుడు బాబా వొత్తి
http://telugaksharam.blogspot.com/2008/05/etv.html

"మీ బ్లాగు కు మీరే సుమన్, ప్రభాకర్" అన్న ప్రసిద్ధ నానుడి కి ఆద్యులైన, ETV సుమన్ కు ప్రభాకర్ కు వున్న అవినాభావ సంబంధమేమిటి? ఇది జన్మ జన్మల సంబంధమని చెప్తున్నారు బూదరాజు అశ్విన్. ఎలా అంటే ఈ టపా చదివి తెలుసుకోండి.

"బరువు” బాధ్యతలు
http://manishi-manasulomaata.blogspot.com/2008/05/blog-post_12.html

మన భారతీయులు తెగ తినేయటం వలనే అమెరికాలో నిత్యావసర వస్తువులకు కట కట ఏర్పడిందని బుష్ అయ్యవారు సెలవిచ్చారు మొన్న. పులి మీద పుట్రలా స్వామి రాందేవ్ గారు గారు కూడా బుష్ అయ్యవారు చెప్పినది ఒప్పేనని కితాబిచ్చారు. దానికి నిదర్శనం రోజు రోజుకీ పెరుగుతున్న, భారతీయుల పొట్టలే నట. ఈ అతి బరువు తక్షణం తగ్గించుకోవాలని ఉచిత సలహా కూడా పడేశారు. ఈ బరువు తగ్గటంలో,సుజాత (మనసులో మాట) గారి అనుభవాలు పంచుకుంటే మీకూ లాభం; ఎలాగంటారా, మూడు కిలొల బరువు తగ్గుతారు, అవి చదివితే, అని ఆమె శాపం.

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి......
http://joruga-husharuga.blogspot.com/2008/02/blog-post.html

కోరికలే గుర్రాలయితే? కలలు కంటే కోరినవి నెరవేరుతయా? కథలు రాసి కోట్లు సంపాదించడం ఎట్లా? దైవానిక కథా ప్రయోగం, నలుగురూ మెచ్చినది మీరూ చదవండి.

ఎద లోతుల్లో ఒక మాటుంది…
http://blog.harivillu.org/2008/02/09/manasulo-maata-01/

ఎదలోతుల్లోని మాట చెప్పటం ఎలా? చెప్పాలనుకున్నది గొంతుదాకా వచ్చి ఆపైన చెప్పలేక పోతే, గుండె గాయమవదా? శ్రీనివాసరాజు దాట్ల గుండెల్లోని కవిత, గుండె దాటి బయటకొస్తే, గుండె చెరువవదా?

మంగళవారం, మే 13, 2008

నేల పై ఒక నక్షత్రం

















రచయిత: తెలియదు.బహుశా విహారి తమ్ముడయుండ వచ్చని అంచనా. అంతర్జాలంలో తిరుగుతూ నా వద్దకు వచ్చిన ఈ టపా, మీకూ ఆసక్తికరంగా వుండగలదని తలచి, మీ ముందుంచుతున్నా.

సోమవారం, మే 12, 2008

ఛాయాచిత్రానికి వ్యాఖ్య




ఈ రోజే గచ్చిబౌలీ లోని, ఓ M.N.C. యొక్క నూతన భవనావిష్కరణ జరిగింది, ధూం ధాం గా. ఆ కోలాహలం ఛాయాచిత్రంలో కనిపిస్తుంది కదూ. ఈ చిత్రం పై ఐదేళ్ల ఆకాష్ కామెంట్.

"అమ్మ, రెండు బూరలనే (balloons) పట్టుకుంది. ఇంకా నయం, పది పట్టుకుంటే,గాల్లోకి ఎగిరిపోయేది."

శనివారం, మే 10, 2008

బ్లాగ్వీక్షణం -6



నవతరంగంలో ఒక పాతకెరటం
http://canopusconsulting.com/salabanjhikalu/?p=58

రొటీన్ సినిమాలు చూసి విసిగెత్తారా? మై డిన్నర్ విత్ ఏంద్రె (1981) చిత్రం లో, కేవలం మూడే పాత్రలతో, ఒకే సెట్ లో, రెస్టారంట్ లో ఇద్దరు మిత్రులు, డిన్నర్ టేబుల్ దగ్గర కలిసి, భోజనం ప్రారంభించటం తో మొదలయ్యే కథ,అనేక సంభాషణలతో కొనసాగుతూ, ఎన్నో రసవంతరమైన అంశాలపై చర్చ జరుగుతూ,భోజనం అయ్యాక, మిత్రులు, ఎవరిదారిని వారు వెళ్లటం తో కథ ముగుస్తుంది. చూడతగ్గ సినిమా. నాగరాజు గారి వివరణాత్మక సమీక్ష.

నాలో సగం – కధ
http://jaahnavi.blogspot.com/2008/05/blog-post.html

భార్యా భర్తలలో ఒకరి గురించి మరొకరికి ఎంత తెలుసు? ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటే ఆ సంసారం పూల రధం కాదా? రతీ మన్మధులు అక్కడ రాజ్యమేలరా? కొత్త రచయిత్రి జాహ్నవి కథ మిమ్ములను అలరిస్తుంది.

రచయితలూ-విమర్శకులూ -పాఠకులూ!
http://kasturimuralikrishna.wordpress.com/2008/05/09/%e0%b0%b0%e0%b0%9a%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4%e0%b0%b2%e0%b1%82-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b6%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%82-%e0%b0%aa%e0%b0%be%e0%b0%a0%e0%b0%95/

రచయిత తన రచన ఎవరి కోసం, ఎందుకు, ఎలా రాయాలి? పాఠకుడికి అర్థం కాదేమోనన్న శంకతో, తన స్థాయికి దిగువుగా రాయాలా? జనరంజకంగా వుండేందుకు, పలువురిని ఆకర్షించేలా రాయాలా? రచయిత స్థాయికి పాఠకుడు ఎదగాలా?


కథల అత్తయ్యగారు
http://tethulika.wordpress.com/2008/05/09/%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2%e0%b0%85%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%af%e0%b1%8d%e0%b0%af%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b1%81/

మాలతి గారి అత్తయ్య గారు, సినీనటి భానుమతి అత్తయ్యగారి లాంటి వారు కారు. ఎంతో వాత్సల్యంతో కథలు చెప్పటమే కాదు,ఆప్యాయంగా జడలో కదంబమాలా పెడ్తారు. తమాషా ఏమంటే ఈ అత్తయ్య గారు, మాలతి గారు ఎలాంటి బంధువులు కారు. అయినా లలితాంబ గారికి మాలతిగారంటే ఎంతో అనురాగం.ఆ కాలంలో ప్రేమలు అలా వుండేవి.జననాంతర సౌహృదాని అంటే ఇదేనా?

మా ఊరి శివారులో జరుగుతున్న యుద్ధం – 1 & 2
http://hridayam.wordpress.com/2008/05/07/sponge-iron-1/

కాలుష్యాకారక పరిశ్రమలు చక్కటి పర్యావరణానికీ తీవ్రమైన హాని కలుగ చేస్తాయి. రాబోయే, కాలుష్యాన్ని ఎదుర్కుంటున్న ఒక గ్రామ ప్రజల సంఘర్షణే ఈ కథనం. ఇది జరుగుతున్న కథ. సశేషం.


జీవిత పరమార్ధం
http://sangharshana.blogspot.com/2008/04/blog-post_21.html

జననం, విద్యాభ్యాసం, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు,వాళ్ల చదువు,పెళ్లిళ్లు,మనవలు,మనవరాళ్లు,అమెరికా లో మనమల బేబి సిట్టింగ్ ఆ పై అనారొగ్యం, ఆ తదుపరి మరణం.ఇదేనా జీవితం? జీవిత పరమార్ధమేమిటి?

నేను చదివిన మంచి పుస్తకం-మళ్ళీ నాలుగే!
http://kasturimuralikrishna.wordpress.com/2008/04/30/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%9a%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%81%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%95%e0%b0%82/

యజ్ఞం ఇది చాలా ప్రాచుర్యం పొందిన కాళీపట్నం రామారావు గారి కథ.రామారావు గారు 1924 నుంచీ కథలు రాస్తున్నారు. రచయిత అభిప్రాయాలు కాలానుగుణంగా మారుతుండటం సహజ పరిణామమే. కాలం ఎలాంటి మార్పులు రచయితపై తెచ్చిందీ, ఎవరి ప్రభావం రామారావు మాస్టారు గారి పై పడిందీ వివరిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.


వీడ్కోలు
http://naagodava.blogspot.com/2008/02/blog-post.html

ఓ,పయనమయే ప్రియతమా -మరలా ఎప్పుడు నిన్ను చూసేది? నా గుండెల నిండా నువ్వున్నావే; నీవు లేని నేను, నేనుగా ఉండగలనా? వచనంలో వున్న విరహ గీతిక.

సెల్ వైరాగ్యం -2


సెల్ ఫోన్ చిట్కాలు చిత్రం: కంప్యూటర్ ఎరా సౌజన్యంతో

ఆ మరుసటి రోజు సాయంత్రం నేను, నా శ్రీమతి వారు చెప్పిన టైం కి ఠంచన్ గా వెళ్లాం. మాకు దొరికిన స్వాగతానికి మురిసి, ముక్కచెక్కలయ్యా.ఇదంతా సెల్ తెచ్చిన అదృష్టం అని మురిశా.హాలిడే క్లబ్ వారు మమ్ములను సాదరంగా తోడ్కొని పోయి, అతిశీతలగదిలో కూర్చోపెట్టి, చల్లని పానీయాలిచ్చి మర్యాదలు చేసి వారి కంపనీ గొప్పలు గురించి, చెప్పింది చెప్పకుండా, అరగంట ఎకరువు పెట్టారు.ప్రపంచమంతా వారికి శాఖలున్నై. అందులో సభ్యత్వం తీసుకోమనీ, తీసుకుంటే మమ్మల్ని తెలివైన వారిగా ప్రపంచం గుర్తిస్తుందనీ,సభ్యత్వం ఆ రోజు చాలా చవకలో వస్తుందనీ, మరో వారంలో రెట్టిపవుతుందనీ, మమ్మలని సభ్యత్వం తీసుకోమని వత్తిడి చెయ్యసాగారు. సిమ్లా లో వుండటానికై మాకు నాలుగు రోజుల ఉచిత ఆహ్వానం కూడ ఇచ్చేశారు. మాకు ఆలొచించటానికి కూడా, వారు టైం ఇవ్వటానికి సిద్ధంగా లేకపోతే, వారు ఇస్తామంటున్న విందుభోజనం కూడా వద్దనుకుని ఇంటికి వచ్చేశాము.

కొత్త బిచ్చ గాడు పొద్దెరగడన్నట్లుగా, సెల్ ఎదురుగా కూర్చుని ఎవరూ ఫోన్ చేయరేమిటి అని చూస్తుంటే ఫోన్ మోగింది. ఉత్సాహంగా హెల్లో అన్నా. అవతల ఇంకో అమ్మాయి గొంతు తనను; తను పరిచయం చేసుకున్నది. ఎంత మంచిదో అని సంతోషించా. ఎదో కార్ ఫైనాన్స్ కంపనీ అంట, కార్ లోన్ ఇస్తాము, మీకు ఏ కారు కావాలి అని అంది;వరాలిచ్చే దేవత లా. కారా! నా కెందుకు తల్లీ, నాకు నిక్షేపం లాంటి స్కూటర్ వుంది; ఎక్కడికెళ్లాలన్నా దాని మీద వెళతా. కారు అవసరం లేదన్నా. అయ్యో, ఎన్నాళ్లు ఇలా స్కూటర్ తో అవస్థలు పడతారు, కారయితే, ఎండా, వాన బాధలుండవుగా అంది,నన్ను తెలివిగా ముగ్గులోకి దించుతూ. సరెనమ్మా, మీ కంపనీ వారు వడ్డీ ఎంత తీసుకొంటారేమిటి అన్నా. అబ్బే ఎంతండీ, ధర్మ వడ్డీ 10% flat అంతేనండీ అంది. సంతోషంతో వుక్కిరిబిక్కిరయ్యి బాంక్ అప్పారావు దగ్గరికి పరిగెత్తా. ఏమిటయ్య మీ బాంకు గొప్పా? ఫలాన ఫైనాన్స్ వారు ధర్మవడ్డీకే ఇస్తున్నారని, ఆ అమ్మాయి చెప్పినదంతా చెప్పా. అప్పారావు కాగితం కలం తీసుకుని 10% ఫ్లాట్ అంటే, సంవత్సరానికి ఎంత వడ్డీయో లెక్క వేసి చెప్పేసరికి, కళ్లు బైర్లుగమ్మాయి.


ఆ మర్నాడు సెల్ విషయం మరిచి, పేపర్ తిరగెస్తుంటే సెల్ మోగింది. మరలా అమ్మాయి గొంతే. ఎదో బంగారం షాపు పేరు చెప్పింది. అక్షరతృతీయంట.మంచిరోజంట. ఆ రోజు, మజూరీ లేదు, తరుగు లేదు, డయమండ్స్ పై 2.5% ప్రత్యేక తగ్గింపనీ, మా కోసం నిరీక్షిస్తామనీ చెప్పింది.అమ్మయ్య బ్రతికిపోయాను. ఈ ఫోనే కనుక మా ఆవిడ తీసుంటే బుక్ అయిపోయేవాడినని, కనబడ్డ రాయికల్లా మొక్కా.


ఆ సాయంత్రం ఫోన్ మోగింది. తమాషాగా ఈ సారి మొగ గొంతు.సెల్పతినన్న గర్వంతో హెల్లౌ అన్నా. నేను చలపతిని.కోల్కత్తా నుంచి మాట్లాడుతా.PCO నుంచి మాట్లాడుతున్న. కాయిన్స్ అయిపోయాయి. నన్ను అర్జెంట్గా ఫోన్ చెయ్యమని అర్థింపు.సరే పాతమిత్రుడు కదాని నా సెల్ లోంచి మాట్లాడితే, అరగంట వాడి బాధలేకరవు పెట్టాడు.ఎంత ఫోన్ బిల్ అవుతుందో అని మనసులో వున్నా, వాడి బాధ చెప్తుంటే, నా బిల్ గురించి చెప్పటం మానవత్వం కాదనిపించింది.


చలపతితో మాట్లాడాక సాయం వాహ్యాళి కై పార్క్ కెళ్లా. రాంగానే ఫోన్ మోగింది. ఈ సారి ఫోన్ సోడాటెల్ కంపనీ నుంచి. ఫోన్ లో పరిమితికి మించి వాడకం జరిగిందనీ,కంపనీ కి వచ్చి సెక్యూరిటి డిపాజిట్ కట్టాలనీ లేకపోతే ఫోన్ డీయాక్టివేటవుతుందనీ హెచ్చరిక వినిపించింది. ఇదేమిటి! post paid bill option వున్నప్పుడు పరిమితి అయిందంటాడేమిటి? (పోస్ట్ పైడ్ కు పరిమితులుంటాయని ముందస్తుగా చెప్పాలి.) ఫోన్ కంపనీ వాళ్లు నాకు చెప్పలేదే అనుకున్నా. అసలు నేను అంతగా ఫోన్ వాడనేలేదుగా, అనుకున్నా. ఫోన్ కంపనీకి ఫోన్ చేసి డబాయించా. వారు నా బిల్ అప్పుడే 1275 రూపాయలు అయ్యిందని చెప్పారు. అంత బిల్ ఎట్లా అవుతుంది? నేనసలు అన్ని కాల్స్ చెయ్యలేదుగా అనుకుని మధనపడుతున్న సమయం లో, శ్రీమతి వస్తే జరిగింది చెప్పా. నువ్వేమన్న ఫోన్స్ చేసావా అని అడిగా. లేదండీ, మా తమ్ముడొస్తే వాడేదో అమెరికా ఫ్రెండ్ కు ఫోన్ చేస్తానంటే సెల్ ఇచ్చానండీ; అంతే, అని చావు కబురు చల్లగా చెప్పింది.


ఆ మర్నాడు స్నేహితుడి ఇంటి కెళ్లా, ఎదో పనిపై. సుందర్ తో ఆ కబుర్లు, ఈ కబుర్లు అయ్యాక, అక్కడే భోజనం చెయ్యమని బలవంతపెడితే, ఉండవోయ్, మీ సిస్టర్ కు ఓ మారు ఫోన్ చేసి చెప్తా అని స్టైల్ గా సెల్ తీసి డయల్ చేస్తే, ' మీ అక్కౌంట్ తాత్కాలికంగా ఆపివేయబడినది.డిపాజిట్ చెల్లించి మరల ఎక్కౌంట్ పునః ప్రారంభించగలరు ' అని సందేశం వస్తే బిత్తర పోవటం నా వంతయ్యింది.సరే వీడి సంగతి భోజనం అయ్యాక పడ్తా అనుకొని, భొజనం గావించి, సోడాటెల్ కార్యాలయానికి వెళ్లి, వారెందుకు ముందస్తుగా చెప్పలేదని దబాయించా. మేము చెప్పడ మేమిటి, అన్నీ చదివే గదా కదా మీరు అగ్రీమెంట్ పై సంతకం పెట్టారు, అని వాళ్లు నన్ను ఉల్టా డబాయించేసరికి పరేషాన్ అయిపోయా. చెప్పొద్దూ, అప్పుడు గుర్తొచ్చింది, కనెక్షన్ ఇవ్వటానికి ముందు, 8 పేజీల అగ్రీమెంట్ పై సంతకం పెట్టించుకున్న విషయం గుర్తుకొచ్చింది. మామూలుగా ఐతే ఇలాంటి ఒప్పందాలు చదువుతా. ఐతే, ఆ ఒప్పందం, చిన్న అక్షరాలతో వుండటంతో, అది చదివేసరికి నీరసం రావటం ఖాయమని,గుడ్డిగా చదవకుండానే సంతకం పెట్టేసి, ఇప్పుడిట్లా దొరికిపోయా. వారు చెప్పినట్లే డిపాజిట్ కట్టి, చావు తప్పి, కన్ను లొట్ట పోయిన వాడిలా ఇంటికి చేరా. (To be continued)

చదువులా? చావులా?



తమ పిల్లలు,అయితే డాక్టర్ లేకపోతే ఇంజనీర్ కావాలని, తల్లి తండ్రులు పెట్టే హింస, కొంత మంది విధ్యార్థుల పాలిట శాపమై,వారికేమాత్రం అభిరుచి లేని ఎంసెట్ వగైరా పరీక్షల చిత్రహింస లో, రాంక్ రాదేమో నన్న భయతో, ఆత్మహత్యలకు పురికొల్పుతుంది. ఉదయం నుంచి రాత్రి నిద్ర పోయే దాకా, రక రకాల క్లాసులు, పరీక్షలు పెట్టి, విద్యార్థులకు, మానసిక విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. ఆటలే లేకుండా, రాంకే ధ్యేయం వున్న ఈ శిక్షణ, పిల్లలను, ఎంతొ ఆందోళనకు గురి చేస్తున్న సమయంలో, స్వాగతించతగ్గది నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి పుస్తకం చదువులా? చావులా?

ఈ పుస్తకం పై చక్కటి సమీక్ష చూడండిక్కడ.

http://www.navatha.com/chdavadaga.asp

శుక్రవారం, మే 09, 2008

కొత్త దేవుడు



ఓ సంగీతాభిమాని దృష్టిలో
'♫ If music is a religion, then Rahman is God!'

వావ్! అయితే రహమాన్ మహా మెగా మ్యూజిక్ డైరెక్టర్.

టూరింగ్ టాకీస్

డేరా సినిమా లో Mike Dubbing

నా బాల్యంలో నాగిన్ చిత్రం మా ఊరు (పొన్నూరు, గుంటూరు జిల్లా) డేరా సినిమా హాల్ (Cinema theater made of tent, which is temporary in nature and is called as a touring talkies) లో చూసిన జ్ఞాపకం.ఇందులో వైజయంతి మాల, ప్రదీప్ కుమార్ నాయికా నాయకులు. కానయితే అసలు ఈ సినిమాలో నిజమైన హీరో, హేమంత్ కుమార్ సంగీతమే. లత పాట మన్ డొలే మెరా తన్ డొలే పాట అప్పటికి, ఇప్పటికీ హిట్ సాంగే. అందులో పాములోడు (snake charmer) వాడే సంగీత వాద్యం been ను వాయించింది ఎవరో తెలుసా? సంగీత దర్శక ద్వయం కల్యాణ్జీ ఆనంద్జీ ల లోని కల్యాణ్జీ. నాగిన్ సంగీతానికి ఒక రోజు, ఒక పాము, డేరా హాలు లోకి వచ్చి కలకలం సృష్టించిందట.
అందులోని పాము సంగీతం, ఎంత ప్రాచుర్యం చెందిందంటే, ఈనాటికీ పాములవాళ్ళు, పాములను వశం చేసుకోవటానికి, అదే సంగీతాన్ని వాయిస్తారు.మన్ డొలే మెరా తన్ డొలే పాట ఇక్కడ చూడండి.



అప్పట్లో ఎక్కువమందికి హిందీ భాష తెలిసేది కాదు. డబ్బింగ్ (ఒక భాష నుంచి మరొక భాష లోకి అనువాదం చేసే ప్రక్రియ) ఇంకా శైశవ దశలోనే ఉంది. మరి కథ మన తెలుగు ప్రేక్షకులకు ఎలా అర్థమవ్వాలి? ఇందుకోసం ఒక అనువాదకుడు మైక్ డబ్బాని (a combination of microphone, amplifier and speaker) పట్టుకుని, సంభాషణలను తెలుగులో తర్జుమా చేసి చెపుతుంటే, అవి విని, కథ , మాటలు ప్రేక్షకులు follow అయ్యేవారు.

డేరా హాలులో హిందీయే కాక తెలుగు, తమిళ చిత్రాలు కూడా ప్రదర్శించేవారు. ఆ సినిమాలు చూడాలనే ఉబలాటానికి, ఇంట్లో వారు, కళ్ళెం వేసే వారు. మా పక్కింటి జీజీ బాయి, సీతారాం ల కు నేనంటే ఎంతో ఇష్టం. వారితో బాటుగా,నన్నూ,కొన్ని సినిమాలకు, తీసుకుని వెళ్ళే వారు. టూరింగ్ టాకీస్ లో,సోఫా, కుర్చి, బెంచి ఇంకా నేల క్లాసు లుండేవి. స్త్రీ, పురుషులకు, వేరు వేరుగా, సీట్లు ఉండేవి. చక్రపాణి మరియు నాగిరెడ్డి కలిసి నిర్మించిన చంద్రహారం, ఎ.వి.ఎం. వారి జీవితం డేరా హాలు లోనే చూశాను. డడడా డడడా డడాండడం పాట జీవితం చిత్రం లోనిదే. చంద్రలేఖ లో పెద్ద పెద్ద drums పై పలు కళాకారులు మనొహరంగా నాట్యం చేయడం ఇంకా గుర్తుంది. డేరా హాలులో నేను చూసిన చంద్రహారం చిత్రంలో,పింగళి నాగేంద్ర రావు రచన, ఘంటసాల పాడిన 'ఇది నా చెలి ' పాట వినండి.

http://www.musicindiaonline.com/p/x/S4X_tAdXp9.As1NMvHdW/?done_detect


అప్పటి డబ్బింగ్ కి ఇప్పటికి, హస్తి మసికాంతరమంత తేడా ఉంది. గాంధీ సినిమా అనువాదాన్ని హిందీ లో ఎంత చక్కగా తీసారంటే, పాత్రలు, నిజంగా హిందీ లోనే మాట్లాడుతున్నాయా, అనిపించేంతగా. ఇప్పుడు సినిమా, సాంకేతికంగా, ఎన్నో రెట్లు పెరిగింది. అతి పెద్ద వెండి తెరపై, Imax theatre లో సినిమా చూస్తున్నా, టూరింగ్ టాకీస్ జ్ఞాపకాలు, ఈనాటికీ తాజాగానే ఉన్నై. అవి బాల్యపు,మధుర స్మృతులు కదా మరి.

ఈ వ్యాసం గతంలో,Telugu Literary and Cultural Association,New York వారి అంతర్జాల పత్రిక, జులై 2007 సంచికలో (http://www.tlca.com/index-july-2007.html) Mike Dubbing అనే పేరుతో,ప్రచురించబడింది. సంపాదకులకు కృతజ్ఞతలతో, దీప్తిధారలో పునః ప్రచురణ.

సెల్ వైరాగ్యం -1


Cartoon courtesy: kimandjason.com

పేపర్లో రంగు రంగుల ప్రకటన. నొకియా వారి సరి కొత్త సెల్, కొత్త ఫీచర్స్ తో, తక్కువ ధరలో. పోయిన సంవత్సరం ఇలాంటి సెల్ ఇరవై వేలకి అమ్ముడు పోతే, ఇప్పుడు పది వేలకే.కళ్లు వద్దన్నా మరల మరలా పేజ్ లోని, ఆ ప్రకటన వైపే పోసాగాయి. మిత్రులంతా ఏమి రావుగారు, ఎప్పుడు సెల్ కొంటారు? ఇప్పుడు అది విలాస వస్తువు కాదండీ, నిత్యావసర వస్తువని బెదర కొట్తుంటే, ఎమో సెల్ లేని జీవితం, జీవితమే కాదనిపించిన బలహీన క్షణాన, ఛార్మీ కూడా చెపుతుంది మంచి షాపని Large D కి వెళ్లి ధైర్యంగా, మంచి సెల్ చూపండి అన్నా.

వెంటనే అరడజను సెల్ ఫోన్లు కౌంటర్ పై ప్రత్యక్షమయ్యాయి. అన్నీ ఒక దాన్ని మించి మరొకటున్నాయి.అబ్బ ఎన్నెన్ని ఫీచర్లో. ఈ ఫీచర్లన్నీ ఎప్పుడు ఎలా నేర్చుకోవాలో ఏమిటో అనుకున్నా. అంతలోనే, సెల్ కొనేసుకుంటే ఆ ఫీచర్లన్నీ ఎంతసేపు; అన్నీ ఇంట్లో కూచుని అభ్యాసం చెయ్యవచ్చు కదాని, రంగు రంగుల నొకియా కేవలం పది వేలకే అమ్ముతుంటే కొనకుండా ప్రవరాఖ్యుని కైనా సాధ్యమా అనుకుని, నాకు నేను భుజం తట్టుకుని, ఆ అది చూపండి అన్నా. కౌంటర్లో అమ్మాయి కి మాటలు బాగా వచ్చు. మంచిది సెలక్ట్ చేసుకున్నారండీ. అది కొంటే మీకు రెండు స్కిన్స్ ఉచితం అంది. సిన్సా అన్నా. కాదండీ ఆ సెల్ కొంటే ఈ రెండు రంగుల తొడుగులు ఉచితం. మీకు మాచ్ అయ్యేలా వున్న కవర్ సెల్ కు కు వేసుకోవచ్చు అంది. మా ఆవిడేనా ఎప్పుడూ మాచింగ్ వేసుకునేది -నేను ఇప్పుడు మాచింగ్ కవర్లేసుకోవచ్చనే వుత్సాహంతో - అమ్మాయ్, ఆ సెల్ పాక్ చెయ్యి అన్నా. కౌంటర్ అమ్మాయి, సార్ అది కొంటే మీకు ఒక టీషర్ట్ కూడా వుచితం అంటే నేను అమితానందభరితుడునై, ఆ సెల్ కు ఆ అమ్మాయి చెప్పిన ధర, మారుమాట్లాడకుండా, చెల్లించివేసా.

ఇంటికి వచ్చాక అధ్యాపక పుస్తకం (Instructions Manual) చదువుతూ ఇవన్నీ ఎంతలో నేర్చుకోను అనుకున్నా. ఆ ఫీచర్లన్నీ చదువుతుంటే అవన్నీ వాడటానికి ఈ జీవితకాలం సరిపోవునా అనిపించసాగింది. కొన్నయితే, అసలు ఈ ఫీచర్ తో నాకు పనేమిటి అనిపించింది. అలా లెక్కేసుకుంటే,పనికి వచ్చేవాటి కంటే అందులో మనకు పనికి రాని, జీవితంలో వుపయోగించని ఫీచర్లే ఎక్కువ వున్నట్లుగా తోచసాగింది. అరే! ఇదేమిటి, షాపు లో ఆ అమ్మాయి చెపుతుంటే ఇన్ని ఫీచర్లతో జన్మ ధన్యం కదా అని అప్పుడు అనిపించింది అని మనసులో మధన మొదలయ్యింది. సరి, మనం ఫీచర్ వాడుకోకపోతే, దానికి నోకియా వాడేమి చేస్తాడు. వాడితే వాడుకో లేకుంటే లేదు అని మనస్సు సర్ది చెప్పుకున్నా.

సరే ఇహ connection తీసుకోవాలని Sodatel కంపనీకెళ్లా.వారు నా బాంక్ statement , ఇంటి కాగితాలు, నా ఛాయాచిత్రం వగైరా తీసుకున్నాక,verification అవ్వాలి;అయ్యాక కనెక్షన్ ఇస్తామన్నారు. వాళ్ల ఏజెంట్ వచ్చి ఇల్లు స్వంతమా కాదా అని ధృవీకరించుకుని రిపోర్ట్ పంపాక నా కనెక్షన్ యాక్టివేట్ చేశారు. అమ్మయ్య! ఎట్టకేలకు సెల్ సొంతదారుడినయ్యా. ఈ విషయం మితృలకు ఎలా తెలుస్తుంది? ఒక ఆదివారం సాయంత్రం అందరినీ ఇంటికి తేనీరుకు పిలిచి, నేను ఇప్పుడు సెల్పతి (సెల్ + పతి) నయ్యానని స్నేహితుల హర్షధ్వనుల మధ్య ప్రకటించా. అందరూ అభినందనలు తెలుపుతుంటే గర్వంతో వుప్పొంగిపోయా.

సెల్పతి అయ్యా కాని ఒక్క ఫోన్ కూడా రావటం లేదేమిటి అని ఆలొచనలో పడ్డా. ఎందుకా దిగులు, మీ స్నేహితులకు మీ నంబర్ ఇచ్చారు కదా! వారే అవసరమైనప్పుడు చేస్తారు లెండి. అదే పనిగా ఫోన్ ఎదురుగా కూర్చుంటే ఏమిటి ప్రయోజనం. ఫోన్ ను స్టాండ్ (మిత్రుడు కొండపల్లి వెళ్తుంటే సెల్ వుంచటానికి ప్రత్యేక కొయ్య స్టాండ్, అందమైనది తెప్పించా.) పై పెట్టి మీ మిగతా పనులు కానిమ్మనమన్న శ్రీమతి సలహాపై, సెల్ స్టాండ్ లో పెట్టి లేవ బోతుండగా వచ్చింది ఫోన్. అమ్మయ్య, సెల్ కొన్న కష్టం వృధా పోలేదు. ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడని, వుత్సాహంగా ఫోన్ తీసుకుని, ఠీవిగా ఆకుపచ్చ బటన్ నొక్కి, రాజసం వుట్టిపడుతూ, హెల్లొ అన్నా. అవతలినుంచి అమ్మాయి గొంతు -అపరిచిత నాకు ఎందుకు ఫోన్ చేస్తుంది? అని సందేహం! రావుగారు కావాలండీ అన్నదా అమ్మాయి. 'మాట్లాడుతున్నా’; 'మా కంపనీ వారు కొంతమంది అదృష్టవంతుల పేర్లు లాటరీలో తీసారండి. మీరు లాటరీ లో సెలక్ట్ అయ్యారు.మీరు మీ శ్రీమతి తో కలిసి మా క్లబ్ కు పలాన రోజు, పలాన టైం కొస్తే, మా ప్రతినిధులు మీకు మా హాలిడే హోంస్ గురించి వివరిస్తారండీ.అంతే కాదు మీకు ఏడు రోజులూ ఉచిత వసతి సౌకర్యం ఇస్తారు; మా మూడు నక్షత్రాల హాలిడే హోంస్ లో. మీరు తప్పక రావాలి.' ఇదీ ఆ ఫోన్ సారాంశం. ఫోన్ కొంటం తోటే అదృష్టవంతుడినయినందుకు నన్ను నేనే అభినందించుకున్నా. (To be continued)

బుధవారం, మే 07, 2008

పుస్తక సమీక్షలు

సి.బి.రావు! తెలుగులో బ్లాగుసమీక్షలు రాయడం మొదలుపెట్టిందాయన. బ్లాగరుల సమావేశాలకు పెద్ద. తెలుగులో సశేష బ్లాగులు అశేషంగా రచించి, ఇంకా రచిస్తూ వస్తున్న సీరియల్ బ్లాగరి. ఆయన రాసే సచిత్ర సమావేశ నివేదికలు చదవడం కోసం తెలుగు బ్లాగరులు దీప్తిధార (రావుగారి బ్లాగు) వద్ద కాపు వేసి ఉంటారు. ఇప్పటికి ఎన్నో బ్లాగులను సమీక్షించిన సి.బి.రావుగారు ఈ వ్యాసంలో పుస్తకసమీక్షల గురించి వివరిస్తున్నారు. రావుగారు ఆంధ్రప్రదేశ్ పక్షివీక్షకుల సంస్థ (A.P. Birdwatchers’ Society) కార్యదర్శి కూడా.


————–

దాదాపు అన్ని పత్రికల్లోనూ పుస్తక సమీక్షలు వస్తూ ఉంటాయి. ఒక కొత్త పుస్తకం మార్కెట్లోకి విడుదలైనప్పుడు ఆ పుస్తకంలోని విషయంపై ఆసక్తి, అభిరుచితో బాటు, దాని యొక్క మంచి-చెడులను బేరీజు వెయ్యగల సామర్థ్యమున్నవాళ్ళు ఆ పుస్తకాలపై సమీక్షలు రాస్తారు. కొందరు బ్లాగరులు సైతం తాము చదివిన పుస్తకాలపై తమ తమ బ్లాగుల్లో క్లుప్తంగానో, వివరంగానో తమ అభిప్రాయాలు రాస్తూ ఉంటారు.

ఐతే అవన్నీ పుస్తక సమీక్షలేనా? అసలు వేటిని పుస్తక సమీక్షలనవచ్చు? తమకు బాగా నచ్చిన/అసలు నచ్చని పుస్తకాలపై అందుకు గల కారణాలను సైతం వివరిస్తూ పత్రికల్లో సవివరమైన సమీక్షలు తామూ రాయవచ్చా? అని చదివేవాళ్ళకు సందేహాలొస్తూ ఉంటాయి. ఆ సందేహాలను తీర్చడంతోబాటు మంచి సమీక్షలెలా ఉండాలో తెలిపే ప్రయత్నమే ఈ చిరువ్యాసం.

ప్రచురణ కర్తలు లేక రచయితలు,తమ పుస్తకాలను సమీక్ష నిమిత్తం, 2 ప్రతులను పత్రికా సంపాదకులకు పంపిస్తారు. ఒక పుస్తక పాఠ్యాంశం, ఉదాహరణకు పక్షుల వలసపై ఉందను కోండి. సంపాదకులు అలాంటి పుస్తకాలను, పక్షి శాస్త్రజ్ఞులకో,కనీసం ఆ subject తెలిసినవారికో సమీక్షకు పంపుతారు. కొన్ని సార్లు అభిప్రాయాలు అడుగుతారు. ఒక subject పై authority కానవసరము లేదు, కనీస పరిచయము ఉంటే బాగుంటుందని సంపాదకుల అభిప్రాయం.


Bookshelf Photo: cbrao

అలాగే నవలలను ఇతర రచయితలకు ఇచ్చి సమీక్ష చేయమంటారు. కథా శైలి, కథనం, భాష,కథాంశం కున్న ప్రాధాన్యత, ముగింపు ఇవన్నీ కథను ప్రభావితం చేస్తాయి. పుస్తక ముద్రణ, కాగితపు నాణ్యత, పుస్తక ధర, అచ్చు తప్పులు, ముఖ చిత్ర అలంకరణ వగైరాలు సమీక్షకుడు పరిగణలోకి తీసుకుంటాడు. సమీక్షకుడు తన సమీక్షలో కథా సారాంశాన్ని, క్లుప్తంగా ఇస్తూ, సాధ్యమైనంత వరకూ ముగింపు చెప్పక, పాఠకుడికి పుస్తకం చదవటానికి కావాలిసిన ఆసక్తిని చంపకండా, అందులోని విశేషాలు, బాగోగులు విశ్లేషణాత్మకంగా వివరిస్తాడు. అంతేకాక, కథలోని ఒకటో రెండో పారాగ్రాఫులను తన సమీక్షలో ఉటంకిస్తాడు. దీని ద్వారా పాఠకుడికి రచయిత శైలి తెలియపరచాలని సమీక్షకుడి అభిప్రాయం. కొన్ని పర్యాయాలు, పుస్తక ముఖ చిత్రాన్ని రంగులలో, తన సమీక్షలో భాగంగా ఇస్తాడు సమీక్షకుడు. దీనివలన పుస్తకం కొనకుండానే పాఠకుడు పుస్తకాన్ని అనుభూతి చెందే అవకాశం లభిస్తుంది.

సంజీవదేవ్ పారదర్శి అనే కలం పేరుతో సమీక్షలు చేసేవారు.ఆయన మానసిక శాస్త్రవేత్త కాదు,వైజ్ఞానికుడు కాదు,linguist కాదు, వైద్యుడు కాదు. దేవ్ ఈ అంశాలున్న పుస్తకాలనే కాకుండా పలు ఇతర అంశాలున్న గ్రంధాలను, బహుముఖ ప్రజ్ఞాశాలురపై వ్యాసాలు రాశారు. అవి రసరేఖలు, కాంతిమయి వగైరా వ్యాస సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. Specialist కాకుండా generalist లు కూడా సమీక్ష చెయ్యవచ్చు అనేదానికి సంజీవదేవ్ ఒక మంచి ఉదాహరణ అవుతారు.

సమీక్షలో, కేవలం కథా సారాంశం సంక్షిప్తంగా ఇస్తే, అప్పుడు అవుతుందది సంక్షిప్త కథ. మరి, మీరు పలు బ్లాగులలో చదువుతున్నవి, సమీక్షలా లేక పరిచయాలా అన్న విషయం, ఈ సరికి విజ్ఞులయిన పాఠకులకు, అవగతమయ్యే వుంటుంది. వ్యక్తిగత అభిప్రాయాలకు బలమివ్వక, రచయితపై అభిమానం ప్రదర్శించకుండా, నిష్పాక్షికంగా, తటస్థం గా రాసినప్పుడు సమీక్షలకు, సమీక్షకుడికి విలువ పెరుగుతుంది.

పొద్దు అంతర్జాల పత్రిక లో,వ్యాసాలు వర్గానికి చెందిన ఈ రచన 2007, June 11, Monday నాడు తొలిసారి ప్రచురించబడింది. పొద్దు సంపాదకులకు కృతజ్ఞతలతో, దీప్తిధారలో పునః ప్రచురణ.

మంగళవారం, మే 06, 2008

మేఘన



కౌగిలిలో ఛాయాచిత్రం: cbrao

సెలవులలో, పిల్లలకు ఏమి కావాలి? బొమ్మలు,పుస్తకాలు, అందుబాటులో టి.వి. వుంటే సరిపోతుందా? ఇన్ని వున్నా వారెందుకు విసుగ్గా, తోచనట్లుగా ఎందుకుంటారు? ఎక్కడుంది లోపం? ఏమి చేస్తే పిల్లల బోర్ తగ్గి ఉత్సాహంగా వుంటారో, తెలుసా మీకు?

వారణాసి నాగలక్ష్మి (హైదరాబాద్) గారి కథ మేఘన లో దొరుకుతాయి సమాధానాలు మీకు. ఈ కథ కౌముది అక్టోబర్ 2007 సంచికలో ప్రచురితమయ్యింది. మేఘన కథ ఇక్కడ చదవండి.

http://www.yuyam.com/out.php?id=10047

బ్లాగ్వీక్షణం -5


కోటప్పకొండ (గుంటూర్ జిల్లా) లో శిల్పాలు ఛాయా చిత్రం:cbrao

నీరో చక్రవర్తి కూడ తెల్లబోతాడేమో!
http://hridayam.wordpress.com/2008/03/25/rain-ads/

అకాలవర్షం కురిస్తే ఆ ఘనత ఎవరిది? రాజశేఖరరెడ్డి లేక బుష్? ఈ Global Warming కు కారణమెవరు?

మార్పు మూలాల శోధన : ది టిపింగ్ పాయింట్
http://chaduvu.wordpress.com/2008/03/29/tippingpoint/

కొన్ని వస్తువులు లేదా కొన్ని నూతన ఆలొచనలు ఎలాగా ఇంత ప్రజాదరణ పొందగలుగుతున్నాయి? ప్రజలు ఇంతగా ప్రభావితం కావటం వైరస్ వృద్ధి చెందినంత వేగంగా జరుగుతుందని టిప్పింగ్ పాయింట్ అనే పుస్తకం లో మాల్కం గ్లాడ్వెల్ సోదాహరణం గా వివరించారు.కొందరు వ్యక్తులు సమాజాన్ని ఇంతలా ఎలా ప్రభావితం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవ వలసిందే. పుస్తకం చదివే వీలు లేక పోతే, ఈ సమీక్ష చదివి, ఆ తదుపరి అసలు పుస్తకాన్ని చదవండి.


ద్వైతం
http://lifeasaprism.blogspot.com/2007/11/blog-post_15.html
తాగడం తప్పా? మాంసాహారం తినడం తప్పా? ఏది తప్పు? ఏది ఒప్పు? ఎవరు నిర్ణయిస్తారు? ఏది ద్వైతం? ఏది కాదు? రచయిత తను చెప్పదలుచుకున్న విషయాన్ని సరిగా వ్యక్తం చెయ్యగలిగారా? మీరే చెప్పండి.

వి౦డోస్ ఎక్స్ పీ లో కరప్ట్ అయిన ఫైల్స్ సరి చేయడ౦
http://nsaicharan.blogspot.com/2008/04/blog-post_20.html

మనము వాడే Windows XP software కొన్ని సార్లు corrupt అవటం జరుగుతుంది.ఇలా జరిగిన ప్రతి సారి, ఫార్మాట్ చెయ్యటం practical solution కాలేదు. మరేమి చెయ్యాలి? పాడయిన ఫైళ్లను బాగు చేసే విధానముంటే బాగుంటుంది కదా! అవును. మీ corrupted files ను repair చెయ్యవచ్చు. ఎలాగో, ఈ టపాలో చదవండి.

నా రహస్య ఎజెండా
http://kranthigayam.blogspot.com/2007/10/blog-post.html

ఇది బెంగళూరు క్రాంతి రహస్య అజెండా. ఇంతకీ ఆమె రహస్యా అజెండా ఏమిటి? క్రాంతి తను అనుకొన్న గమ్యాన్ని చేరుకున్నదా? ఈ కథనం మిమ్ములను కడుపుబ్బ నవ్వించటం ఖాయం. దానికి 29 మంది పాఠకుల వుత్తరాలే సాక్ష్యం.

జార్జ్ 'ఎవరెస్ట్'
http://maramaraalu.blogspot.com/2008/01/blog-post_18.html

ప్రపంచంలోని అత్యున్నత శిఖరమైన మౌంట్ ఎవరస్ట్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

తెలుగు బ్లాగర్లకు ఓ తీపి వార్త.
http://anupamatelugu.blogspot.com/2008/03/blog-post_05.html

ఇప్పుడు ఆంగ్ల ఫోనటిక్ స్క్రిప్ట్ పై కాకుండా, మైక్రోసాఫ్ట్ వారి ఇన్ స్క్రిప్ట్ లోనే తెలుగులో వేగంగా టైప్ చెయ్యండి; అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ సహాయంతో.

శనివారం, మే 03, 2008

హైదరాబాదులో ట్రాఫికర్


సంజీవరెడ్డి నగర్ కూడలి ఛాయా చిత్రం: cbrao

ఈ టైటిల్ కొంచం గందరగోళంగా వుందా, హైదరాబాదులో Traffic లాగా? అవునండీ! ఇక్కడి ట్రాఫిక్ ఎంతో ఫికర్ (దిగులు,ఆదుర్దా) కలుగ చేస్తుంది.ఎప్పుడు, ఎక్కడ ట్రాఫిక్ జాం అవుతుందో చెప్పలేము. ఇవ్వళ 2-way వున్న మార్గం రేపు 1-way అయితే ఆశ్చర్య పోవద్దు. మార్పు చాలా సహజం. కొన్ని మార్పులు మొదటలో కొంత తికమక కలిగించినా, తరువాత బాగుగా వుందనిపించిన సందర్భాలు కూడా వున్నై. ఉదాహరణకు అమీర్‌పేట, మైత్రీవనం కూడళ్లలో నిన్నటి దాకా వున్న ట్రాఫిక్ జామ్స్ ఇప్పుడు లేవు, ఆశ్చర్యకరంగా. ఆ వత్తిడంతా సంజీవరెడ్డి నగర్ కూడలి పై పడిందిప్పుడు.

నిమ్స్ హాస్పిటల్ (పంజగుట్టా) నుంచి ఎదురు రోడ్ లో, రాజ్‌భవన్ రోడ్ కు వెళ్తే, యశొదా హాస్పిటల్ నుంచి, వాహనం లో రోడ్ దాటాలంటే,రాజీవ్ గాంధి విగ్రహం దాకా వచ్చి, U turn తీసుకుని రాజ్‌భవన్ రోడ్ లోని మాల్స్ కు, బాంక్ లకు వెళ్లాలి. దీనివలన వాహనదారులకు 2 లేక 3 కిలోమీటర్ల దూరం ఎక్కువవుతుంది. పంజగుట్ట కూడలి నుంచి రాజీవ్ గాంధి విగ్రహానికి వచ్చినవారు అక్కడి కూడలి లో కుడి వైపు తిరిగి రాజ్ భవన్ వెళ్లే సౌకర్యం తొలగించారు. దీనివలన వాహనదారులు గ్రీన్ లాండ్స్ దాకా వచ్చి, అక్కడి కత్రియ హోటల్ వద్ద, U turn తీసుకుని వెనుకకు ప్రయాణం చెయ్యాలి. ఈ రెండూ అవాంఛనీయాలే. దీనివలన వాహనదారులకు కాలహరణ, అధిక పెట్రోల్ వ్యయం అవుతున్నై. రోజూ తిరిగే, వేల వాహనాలకు, ఇలాగా చుట్టూ తిరగటం వలన ఎంతో విలువైన పెట్రోల్ వృధా అవుతుంది.

మన దేశం లో నిరుద్యోగం ఎక్కువ. చాలినంత మానవ ఉత్పాదక శక్తి వుంది. యశోదా, రాజీవ్ గాంధి కూడళ్లలో ఇద్దరు ట్రాఫిక్ పోలీస్ లను పెట్టి,కుడి మలుపు అనుమతించటంతో, ఈ చుట్టు తిరుగుడు, అనవసర పెట్రోల్ వ్యయం నివారించవచ్చు. ప్రస్తుత స్థితిలో, దేశానికి అయ్యే అమూల్యమైన విదేశీమారక నగదు (Foreign exchange) ఖర్చు కంటే, ఈ ట్రాఫిక్ పోలీస్ జీతాలకు అయ్యే ఖర్చు బహు స్వల్పం. అధికారులు ఈ విధంగా ప్రజలకూ, దేశానికి లాభం కలిగించవచ్చు.

గురువారం, మే 01, 2008

పోలీస్ కానిస్టేబుళ్ల భర్తీ


చిత్రం: onlybombay.blogspot.com సౌజన్యంతో

ఈ constables recruitment లో recruitment అనే పదానికి to fry, roast అనే అర్థం వుందని తెలుసా మీకు? చూడండి

http://tinyurl.com/5g9zvy

అందుకే కాబోలు వీరి ప్రవేశ పరీక్షల భాగంగా,పరుగు పందాలు మండు టెండలో పెడ్తున్నారు. వారు ఎండలకు మల మలా మాడుతున్నారు. కొందరైతే, ఎండలకు తట్టుకొలేక ప్రాణాలే విడుస్తున్నారు.

నిరుద్యోగులపై ఇంత మృత్యు పరిహాసం అవసరమా? ఈ పరుగు పందాలు ఉదయం తొమ్మిది గంటలకు ముందు ఎందుకని నిర్వహించలేకపోతున్నారు,అధికారులు? ఏదైనా కారణం వలన ఆలస్యం ఐతే, సాయంత్రం ఎండ తగ్గాక పెట్టవచ్చుకదా, ఈ పరుగుల పరీక్షలు. ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు ఇదొక జీవనమరణ సమస్య. పాత తప్పిదాలనుంచి, అధికారులు ఎప్పుడు నేర్చుకుంటారు? ప్రాణం విలువ ఎప్పుడు గుర్తిస్తారు?