బుధవారం, జులై 09, 2008

కొత్త పార్టీ అధినేత చిరుకి ప్రేమలేఖ






చిరు కొత్త పార్టీ గురించిన ఊహాగానాలు, ఆశించేవి ఎక్కువయ్యాయి. అంతా కొత్తవారినే పార్టీ లో చేర్చుకుని, రాజకీయ రంగును సమూలంగా మారుస్తాడేమో అనుకున్న వారికి, చిరు పార్టీలోకి, ఇతర పార్టీల నాయకులు చేరటం, కొంత ఆశాభంగం కలిగిచ్చింది. అయితే, పాతవారిని కూడా తన నూతన భావజాలంతో ప్రభావితం చేసి, ప్రజలాసిస్తున్నట్లుగా, పాత రాజకీయాలకు భిన్నంగా చిరు మార్పు తెస్తాడా? ఎన్నో ప్రశ్నలు. వీటికి ఇప్పుడే విశ్లేషణనివ్వటం కష్టమే. కొద్దికాలం వేచియుండాల్సిందే.



కొత్తపార్టీ అధినేత చిరు కు ఇన్నయ్య గారి లేఖ చూడండి.


















Read this document on Scribd: Chiru Party

14 కామెంట్‌లు:

  1. ఇన్నయ్యగారు మరీనూ. పాపం ఒక పక్క వాళ్ళు వాస్తు ప్రకారం పార్టీ కార్యాలయం కట్టుకుంటూ, మూఢం వెళ్ళాక పార్టీ ప్రకటిస్తాం అని చెబుతుంటే, వాళ్ళను పట్టుకుని ఇవన్ని మారుస్తారా? శాస్త్రీయ దృక్పథం పెంపోందిస్తారా అని అడుగుతారేంటండి బాబు

    రిప్లయితొలగించండి
  2. ఆంజనేయస్వామి భక్తుడిని పట్టుకుని ఇలాంటి ప్రశ్నలా! పైగా మొన్నీమధ్యనే దిష్టి పోవాలని ఏదో హోమమో, యజ్ఞమో కూడా చేయించినట్లున్నాడు చిరంజీవి. అవన్నీ తెలిసి కూడా ఇంకా అంతాశేంటో ఇన్నయ్యగారికి :-)

    రిప్లయితొలగించండి
  3. @ చైతన్య :):):):):)
    @ అబ్రకదబ్ర : కొంత మంది అంతే ...... :-)

    రిప్లయితొలగించండి
  4. నరేంద్ర భాస్కర్ S.P.
    ఇన్నయ్య గారికీ మీకూ నా నమస్కారములు ప్రొఫెసర్ ఇన్నయ్య గారు
    ఒక విషయం తెలుసుకోవాలి దేవుడు లేడు అనేది ఎలా ఒక నమ్మకమో (మీలాటి ఙానులకు) , దేవుడు ఉన్నాడు అనేది కూడా ఒక నమ్మకం (మాలాటి అఙానులకు ), ఈ రెంటిలో ఏదీ నిరూపించలేకపొవడమే మనిషికి ఉన్న గొప్ప టైం పాస్. అన్నట్టు కమ్యూనిస్టులక్కూడా దేవుడున్నాడండోయ్ మా దేవుని స్థానం లో వారికి ఒక సుత్తి, కొడవలి నక్షత్రం ఉంటాయి

    రిప్లయితొలగించండి
  5. ఇంతకుముంక్కడో రాశాను ఇవే మాటలు. కొన్ని మతాలకు వందలాది దేవుళ్లుంటారు, కొన్నింటికి ఒకరిద్దరే ఉంటారు, మరి కొన్నింటికి ఒకే ఒక్క దేవుడు, నాస్తికులకు ఏ దేవుడూ లేడు. ఆ రకంగా నాస్తికత్వం దేవుడు లేని మతం. ఈ సంగతి ఆస్తికులు గుర్తిస్తే ఇతర మతస్తుల్లాగా నాస్తికులతోనూ సర్దుకుపోవచ్చు. దేవుడి విషయంలో ఎవరి నమ్మకాలు వాళ్లకే పరిమితం చేసుకుంటే ఏ గొడవా లేదు. దేవుడిని వ్యవస్థీకృతం చెయ్యాలని ప్రయత్నించటంతోనే సమస్యలు మొదలయ్యాయి.

    రిప్లయితొలగించండి
  6. Hi
    We have partially released enewss beta and is still in testing.
    We appreciate, if you can signup and submit your blog feed at
    http://www.enewss.com/alpha/

    This is a social networking platform for Indian bloggers

    Thanks
    Sri
    From eNewss

    రిప్లయితొలగించండి
  7. ఇన్నయ్య గారు లేఖలో అధిక భాగం ఆశాస్త్రీయ విధానాలమీదే దృష్టి పెట్టారు. నా మట్టుకు నాకు ఇప్పుడది అంత ముఖ్య విషయం కాదు.

    నాకయితే చిరంజీవి పార్టీ చేయాల్సిన ప్రాధామ్యాలు
    1) అవినీతి అంతం
    2) అవినీతి అంతం
    3) అవినీతి అంతం

    --ప్రసాద్
    http://blog.charasala.com

    రిప్లయితొలగించండి
  8. సిని రంగంలో అవినీతి తారా స్ఠాయికి చేరింది ‘చిరు’, వారి బామ్మరది అల్లు కూటమితోనే..నల్లడబ్బు లో మునిగిపోయారు..
    సినిమా టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ దగ్గరనుండి, అన్ని రంగాలను అధోగతి పాలు చేశారు వీల్లు.
    వ్యక్తిగతంగా ఆదర్శాలు మృగ్యం. కులాంతర వివాహాన్ని సహిం చ లేకపోయారు.
    బ్లడ్ బాంక్ లో కూడా నిజాయితీలేదు..వీరి నుండి కొత్త వ్యవస్త్ ఆశించడం అంటే ..హాస్యాస్పదమే.. సాక్షి

    రిప్లయితొలగించండి
  9. వ్యక్తిగతంగా ఆదర్శంగా లేని మనిషి నుండి సమాజం మంచి యలా ఆశిస్తుంది?? ఒక కూతురి వివాహం నిశ్ఛితార్ధం తర్వాత, పెటాకులు చేశాడు.... మరో కూతురి వివాహం -- అష్ట కష్టాలూ పెట్టాడు... తమ్ముడు పెళ్ళాన్ని వెళ్ళగొట్టాడు.. యిక బావ మరిది అయితే, సినీ వ్యాపారాన్ని భ్రష్టు పట్టించాడు.. సొంతంగా అభిప్రాయాలు లేవు..నిర్ణయాలు లేవు..కుప్పిగంతుల నటన తప్ప... అంతా బ్లాక్ మనీ.. నల్లడబ్బు..రక్త వ్యాపారం.. బ్లడ్ బ్యాంక్ పెడితేనే ..మహాపురుషుడయితే... లక్షలాదిమందికి ప్రాణ దానం చేస్తున్న ‘సత్యం’ రామలింగ రాజు ప్రధాన మంత్రి కావాలిగదా?? విజయవాడ పార్లమెంటు సీటుఅభ్యర్ధికి మద్దతు తెలిపినా..గత యన్నికల్లో ..ఓడిపోయిన సంగతి..మరచారా?? బలాన్ని, అతిగా ఊహించుకోకుంటే మంచిది..భంగపడతారు. సాక్షి

    రిప్లయితొలగించండి
  10. ఇన్నయ్య గారు, మీరీ లేఖ చిరంజీవి కాకుండా నాగబాబుకో, లేక, అరవిందు కో రాసి ఉండాలి. ఎందుకంటే పార్టీ సంగతులేవీ చిరంజీవికి తెలియదు. ఏ పేరు పెడతారో, గుర్తు ఏమిటో,ఎప్పుడు ప్రకటిస్తారు, ఎవర్ని చేర్చుకోవాలి..ఇత్యాది విషయాలన్నీ చిరుకెలా తెలుస్తాయి, మీరు మరీ గాని!

    ఆయన వ్యక్తిగతంగా, మానసికంగా బలహీనుడు. చాలా ఎమోషనల్. ధైర్యంగా మాట్లాడే శక్తి కూడా లేదు. సొంత నిర్నయాలు తీసుకోలేడు. ఆదర్శవాది కాదు. ఇంత పెద్ద స్టార్ ఇమేజ్ లేకుంటే ఆయన ఒక సాదా సీదా మనిషి. మనలో కొంత మందిలో ఉన్న తెగువ, చొరవ కూడా ఆయనకు లేవు. ఒకే ఒక్క అర్హత ఆయన సినీ రంగపు కింగు కావడం!

    పై లక్షణాలన్నీ రాజకీయాలకు అవసరం లేదని ఎవరైనా ఇతర ఉదాహరణలు చూపిస్తే ఓకె!

    చిరు మౌనాన్ని చాలా పత్రికలు కూడా 'ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం ' గా అభివర్ణిస్తున్నాయి గానీ, నిజానికి అక్కడ ఆయన మాట్లాడ్డానికేం లేదక్కడ. మాట్లాడాలంటే అరవిందో, మిత్రానో స్క్రిప్టు రెడీ చెయ్యాలా వద్దా?

    మన ఖర్మ కాలి, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడంటే రాష్ట్రం అరాచకాల పాలవడం ఖాయం. చిరు అభిమానులకు మామూలు గానే పట్టపగ్గాలుండవు. ఇహ అప్పటి సంగతి చెప్పేదేముంది? పోలీసులు కూడా వీళ్లకు బలికాక తప్పదు.

    ఇకపోతే, ప్రజల్లో మూఢ విశ్వాసాలను పోగొట్టడం, శాస్త్రీయ ధోరణులను ప్రోత్సహించడం ...ఇవన్నీ ఏ రాజకీయపార్టీ అయినా సరే చేయదు. రాజ్యాంగంలో ఉన్నవాటినన్నింటినీ అమలు చేయడం సాధ్యమా! అసలే మన దేశ ప్ర్జలకు మనోభావాలెక్కువాయెను! ఈ పనులు హేతువాదులు, స్వచ్చంద సంఘాలు నెత్తినేసుకోవాలి. ట్రాజెడీ ఏమిటంటే వారు ఆ పనులు స్వయంగా చేయలేరు, ఇంకొకరు చేయలేదని వాళ్ల బాధ్యతల్ని గుర్తు చేస్తుంటారు.

    చిరంజీవి ముఖ్యమంత్రి కాకుండా ఉంటేనే రాష్ట్రానికి, ప్రజలకు, చిరంజీవికి కూడా మంచిది.

    రిప్లయితొలగించండి
  11. @ స్పందించి ఉత్తరాలు రాసిన పాఠక దేవుళ్లకు ధన్యవాదాలు. మీ ఉత్తరాలు ఇన్నయ్య గారి దృష్టికి తీసుకు వెళ్లటం జరిగింది. తన ఉత్తరం కొత్త పార్టీ కి మాత్రమే నని, చిరంజీవికి కాదని వారు వివరణ ఇచ్చారు. దీని అర్థమేమిటో కొంచం ఆలొచించాక బోధ పడింది. బహుశా తన ఉత్తరం కొత్త పార్టీని నడిపే వారిని ఉద్దేశించి రాసినట్లుంది. పార్టీ అంటే జెండా మాత్రమే కాదనీ, పార్టీ నడిపే మనుషులని, మీకు తెలుసు.

    రిప్లయితొలగించండి
  12. ఏదో పుస్తకంలో చదివాను...
    అస్సలు knowledge గానీ, తెలివితేటలు గానీ అవసరం లేని రంగం రాజకీయం. అస్సలు సామర్థ్యం అవసరం లేని రంగం జ్యోతిష్యం :)

    అది నిజమైతే కొత్తపార్టీకి ఏ డోకా లేనట్టే...

    రిప్లయితొలగించండి
  13. ఆయనెవరో పీఠాధిపతి ఆగస్టులో పార్టీ పెడితే ఇంతేసంగతులు అని చెప్పాడట.. ఇప్పుడేం చేస్తారో మరి!!

    సుజాత: "చిరంజీవి ముఖ్యమంత్రి కాకుండా ఉంటేనే రాష్ట్రానికి, ప్రజలకు, చిరంజీవికి కూడా మంచిది." - రాష్ట్రానికి మంచిదేమోగానీ, చిరంజీవిక్కాదు. ప్రతిపక్షంలో కూర్చుని హీరోయిజమ్ చూపించాలంటే చాలా శక్తియుక్తులు, స్వంత తెలివితేటలు కావాలి కదా!

    రిప్లయితొలగించండి