బుధవారం, సెప్టెంబర్ 24, 2008
ఈ జన్మ లో మరో జన్మ
మంగళవారం, సెప్టెంబర్ 09, 2008
మీ కళ్లను సమ్రక్షించుకోండిలా
మనలో ఎక్కువమంది కంప్యూటర్ పై ఎక్కువ గంటలు గడుపుతారు. కళ్లు ఎంతో stress కు గురవుతాయి. వీటిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకొందాము.
During a recent visit to an optician, one of my friends was told of an exercise for the eyes by a specialist doctor that he termed as 20-20-20." It is apt for all of us, who spend long hours at our desks, looking at the computer screen.
I Thought I'd share it with you. 20-20-20
Step I :-
After every 20 minutes of looking into the computer screen, turn your head and try to look at any object placed at least 20 feet away. This changes the focal length of your eyes, a must-do for the tired eyes.
Step II :-
Try and blink your eyes for 20 times in succession, to moisten them.
Step III :-
Time permitting of course, one should walk 20 paces after every 20 minutes of sitting in one particular posture. Helps blood circulation for the entire body.
Circulate among your friends if you care for them and their eyes. They say that your eyes r mirror of your soul, so do take care of them, they are priceless... ...
Otherwise our eye would be like this.....
Source of info: Internet
ఆదివారం, సెప్టెంబర్ 07, 2008
విరామచిహ్నం శక్తివంతమైనది
విజయవంతుడైన పురుషుడు వెనుక ఒక స్త్రీ వుంటే, విజయవంతమైన స్త్రీ వెనుక ఎవరున్నారు?
Click to enlarge the image
Source of pix: Internet
శనివారం, సెప్టెంబర్ 06, 2008
జ్ఞాపకాలు, ఆలోచనలు,విశేషాలు -7
నవకిషోర్ చంద్ర చిత్రలేఖనం ఛాయా చిత్రం:cbrao
ఆత్మకథ ఎలా రాయాలి?
ఎవరికైనా ఆత్మకథ రాయటం కత్తిమీద సామే. ఆత్మ కథంటే, మనతో పాటుగా, మన జీవితం లోకి ప్రత్యక్షంగా, పరోక్షంగా వచ్చిన వారి గురించి, ఆత్మకథలో రాసే సమయంలో, పెక్కు సమస్యలెదురవచ్చు. జీవించి ఉన్న వ్యక్తుల మనో భావాలు గాయపడకుండా, చనిపోయినవారి కీర్తి ప్రతిష్టలు దెబ్బతినకుండా రాయాల్సుంటుంది. ఇంతదాక దాచి పెట్టిన కొన్ని నిజాలు రాస్తే, కొందరికి ఖేదం, మరికొందరికి కోపమూ రావచ్చు. ఆత్మకథ కర్త, గతంలో లో చేసిన కొన్ని చర్యలు (ఉదాహరణకు తన boy friend) గురించి భర్తకు చెప్పిఉండని సందర్భంలో, నిజాయీతీ తో, ఇప్పుడు వెల్లడిస్తే, భర్తతో పొరపొచ్చం వచ్చే ప్రమాదం. తను చేసిన కొన్ని పనులు, తన ప్రతిష్టకు భంగం కలిగించవచ్చు. అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ, నొప్పింపక, తానొవ్వక రాయాల్సుంటుంది. ఆత్మకథలలో, గాంధిజీ ఆత్మకథ ఎంతో విశిష్టమైనది. తండ్రి చనిపొయిన సమయంలో, తను, భార్యతో శృంగారంలో ఉన్న సంగతి, ఎంతో నిజాయితిగా వెళ్లడిస్తారు. యుక్తవయస్సు లో తను చేసిన వివిధ ప్రయోగాలను తేటతెల్లం చేస్తారు. తమ ఆత్మకథ రాసే ముందు, ప్రతి ఒక్కరికీ, గాంధీజీ ఆత్మకథ పఠించ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
http://mandahaasam.blogspot.com/2008/08/blog-post_29.html
ప్రజా రాజ్యం
తిరుపతి సభలో జనప్రభంజనాన్ని చూస్తే, ప్రజలు మార్పు కోరుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ ప్రజలు అభిమానులా, లేక సామాన్య ప్రజానీకమా అన్నది ప్రజారాజ్యం భవితను తేల్చగలదు.
http://krishnadevarayalu.blogspot.com/2008/08/blog-post.html
10000 వ పర్ణశాల పాఠకుడు అదృష్టవంతుడా?
10000 సందర్శనలలో నా సంఖ్య తక్కువే. కూడలి లో, నా కాలేజీ కథ అనే టపా చూసి ఇదేదో కాలేజీ కుర్రాడి ప్రతాపమనుకుని, అప్పటి పని ఒత్తిడిలో పర్ణశాల బ్లాగు దాటవేశాను. ఎన్ని మంచి వ్యాసాలు మిస్ అయ్యానో. శాన్ హొసే (కాలిఫోర్నియా) లో తీరిక సమయంలో వీటిని చదవాలి. 10000 వ పర్ణశాల పాఠకుడు (అదృష్టవంతుడు కానే కాదు బాబోయ్) ఎవరు? అతని I.P., ఊరు, పేరు ఏమిటి? దీప్తిధార 10000 వ పాఠకుడికి బహుమతిగా మా అమ్మాయి తులసినిచ్చి వివాహం చేశా. మహేశుడేమి బహుమతి ఇవ్వబోతున్నాడో?
http://parnashaala.blogspot.com/2008/09/10000.html?ext-ref=comm-sub-email
జీవన వైచిత్రి
అదృశ్య శక్తి అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. నిరూపణ లేనిదే science దీన్ని అంగీకరించదు. జీవితం లో కొన్ని సంఘటనలు అలా దేని ప్రమేయం లేకుండా జరుగుతుంటాయి. బోస్టన్ లో ఒక అమెరికన్, ఒక తెలుగు అమ్మాయి ప్రేమలో పడితే అది ఆకర్షణ అనో లేక వారి psychic vibrations కలిసాయనో అనుకోవాలి. దేవుడు, దయ్యం ప్రసక్తి ఇక్కడ అనవసరం. దెయ్యాలను రాంగోపాల్ వర్మ సినిమాలలో చూస్తాము. దానర్ధం దెయ్యాలున్నాయనా? సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు. దీనర్ధం కొన్ని నియమాలతో ఈ విశ్వం నడుస్తుందని, అది ప్రకృతి సహజమని. Darwin's theory of evolution చదివితే, మతాధికారులు చెప్పేవి శాస్త్ర నిరూపణకు నిలబడవని తెలుస్తుంది. ప్రకృతే దేవుడంటే అది ఒక నమ్మకం గా మారుతుంది.
"సైన్సు ని నేను నమ్మినా, రోజుకొక సిద్దాంతం పుట్టుకొచ్చే ఈ రోజుల్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్ధం కాదు.” -ఉమాశంకర్
సైన్సు నిరంతరం తనను తాను సరిదిద్దుకుంటూ, ఆవిష్కరించుకుంటూ, ముందుకు పయనించే పథం లో కొత్త సిద్ధాంతాలు పుట్టడం, ఒక సహజమైన విధానం. అది శాస్త్రీయం. అతీతాలను నిరూపించటం సాధ్యం కాదు కనుక శాస్త్రం దానిని నిర్ధారించలేదు.