సోమవారం, నవంబర్ 10, 2008

జ్ఞాపకాలు, ఆలోచనలు, విశేషాలు -12



చికాగో కూడలిలో ముచ్చట కొలిపే మొక్కలు -చిత్రం: సి.బి.రావు

కొత్త బంగారు లోకం

నేననీ నీవనీ.. వేరుగా లేమనీ.. చెప్పినా వినరా ఒకరైనా...!! నేను నీ నీడనీ.. నువ్వు నా నిజమనీ.. ఒప్పుకోగాలరా ఎపుడైనా..!!!
సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన, ఈ అందమైన పాట పాడినది శ్వేతా పండిట్. CD కవరుపై పొరబాటుగా స్వేతా ప్రసాద్ అని అచ్చయ్యింది. చిత్రంలో ఈ పాట చిత్రీకరణ బాగుంది. నాయిక స్వేతా ప్రసాద్ చక్కటి నటి అని మీరు ఒప్పుకొంటారు.ఈ పాట వీడియోను ఇక్కడ చూడవచ్చు.




http://madhuravaani.blogspot.com/2008/11/blog-post_09.html

ముంబాయి

ముంబాయి నాకు నచ్చటానికి ఒక ముఖ్య కారణం పక్షి ప్రేమికులకు మక్కా లాంటి ఊరది. Bombay Natural History Society ఉన్నదీ ఊళ్లోనే. కడప జిల్లా లంక మల్లీశ్వరం అడవులలో అంతరించిపోతున్న Jerdons Courser రక్షణకై, ఈ సొసైటీ వారు ఆంధ్ర ప్రదేష్ ప్రభుత్వం తో పలు చర్చలు జరిపి, అడవి గుండా వెళ్లే తెలుగ గంగ గతిని మార్చి, ప్రపంచంలోనే అరుదైన, మన తెలుగు పక్షి (ఈ పక్షి ఆంధ్ర ప్రదేష్ లో తప్ప మరెక్కడా లేదు - 108 సంవత్సరాల తరువాత BNHS శాస్త్రజ్ఞుడు భరతభూషణ్ కనుగొన్నారు దీన్ని) కి పునర్జీవమిచ్చారు. ఈ సొసైటీ వారు ప్రతి ఆదివారం birdwatching trips వేస్తుంటారు. చక్కటి గ్రంధాలయం, జంతు ప్రదర్శన శాల నడుపుతున్నారు. ఈ సారి మీ ఊరు వచ్చినప్పుడు ఈ సొసైటీ ని మరలా దర్శించాలి.

ఇంకో కారణం. తెలుగువారికి నచ్చే హిందీ సినిమాలు. చక్కటి పాటల సాహిత్యంతో, మధురమైన సంగీతం తో, ఉన్నత సాంకేతిక విలువలతో తయారయ్యే ఇక్కడి సినిమాలు. లత, ఆష, రఫి ముకేష్, కిషోర్ కుమార్ వంటి ప్రతిభావంతమైన గాయకులు, శంకర్ జైకిషన్, O.P. నయ్యర్ లాంటి ఎందరో సంగీత దర్శకులు తమ పాటలతో ఎందరినో రంజింప చేశారు.

నచ్చనిది. ఉత్తరాది వారిని, దక్షిణాది వారినీ పరాయి వారినిగా చూసే ఇక్కడి రాజకీయవాదుల సిద్ధాంతం. మహారాష్ట్ర లో తయారయే వస్తువులు భారతదేశమంతా వాడబట్టే , ముంబాయి వాణిజ్య రాజధాని అయ్యిందన్న విషయాన్ని, ఇక్కడి రాజకీయవాదులు విస్మరిస్తున్నారు.

http://satyasodhana.blogspot.com/2008/11/blog-post_05.html


సంసారం సంసారం ప్రేమ సుధాపూరం


పెళ్లి కెందుకు తొందర? వయస్సు 23 ఏళ్లేగా! ఒక మూడేళ్లాగితే సరి, పెళ్లి గురించి ఆలోచించవచ్చు. నీకు నచ్చిన అమ్మాయి దొరక్కపోదు.నిశ్చింతగా ఉండు. జీవితందూరదర్శన్ కాదు, నవరంగ్ అని అనుభవం మీద చెప్తావు. శుభం.

http://ballasudheer.blogspot.com/2008/11/blog-post_08.html


కాలం విలువ

మీరు ఒక పట్టుచీరల డిజైనర్ అయ్యుండి, తెలుగు బ్లాగు నడుపుతున్నందుకు, మీ అభిరుచికి అభినందనలు. మీ కాటగరీ లో బ్లాగరులలో, మీరే ప్రధములు.

http://nandayarrachowdu.blogspot.com/2008/09/blog-post_275.html



స్ఫూర్తిధాయకం


మీ వీరగాధ చదువుతూ ఆ నొప్పినీ, సున్నితమైన హాస్యాన్ని అనుభవించాను. నొప్పిని నొప్పిగా మాత్రమేకాక, హస్యం మేళయించటం తో, మీ కథనం కొత్తపుంతలు తొక్కింది. ఈ కథతో మీరు పాఠకులకు బాగా దగ్గరయ్యారు. మీ ఆరోగ్య స్థితి గురించి, పెళ్లికాక ముందు, మీ హీరో ఏమనుకున్నారు? మీరే తన నాయకి అని హీరో ఎలా తలిచారు? ఎంతైనా, ఆయన ధీరోదాత్తుడే.

http://sangharshana.blogspot.com/2008/11/2.html



Software Jobs: Fake Experience


దొంగ సర్తిఫికేట్స్ తో వైద్యం చేస్తే ప్రాణం పోయే ప్రమాదముంది. Fake experience తో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేస్తే, ప్రొగ్రాంలో బగ్స్ వస్తాయి. వాటిని rectify చేసి, debug చెయ్యవచ్చు. కాని పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. పెద్ద కంపనీలకు, దరఖస్తుదారులలో కొందరు fake experience పెడ్తున్నారని తెలిసీ, వాళ్లని కంపనీ అవసరార్ధం ఉద్యోగాలలో నియమించి, అవసరం తీరాక దొంగ సర్తిఫికేట్స్ పెట్టారంటూ ఉద్యోగంలోంచి తీసివేస్తున్నారు. Global economy బాగా లేక భారత్ లోని కంపనీలకు కొత్తగా వచ్చే software projects తగ్గటమే దీనికి కారణం.

అన్ని భాషలకు, ఉచ్ఛారణ ఆధారిత ఆధునిక లిపి.

@doc.joj:మీరు కనుగొన్న ఈ లిపి గురించిన వ్యాసమేదన్నా ఉంటే దాని లింక్ పంపగలరు. లేక, మీ లిపి గురించి ఒక వ్యాసం రాయగలరు. మీరు తెలుగును ఇంగ్లీష్ అక్షరాలతో , లెఖిని ఉపయోగించి, తేట తెలుగులో రాయవచ్చు. చూడండి. http://lekhini.org/

http://deeptidhaara.blogspot.com/2008/07/blog-post_15.html

1 కామెంట్‌: