మంగళవారం, జులై 15, 2008

సాంకేతిక నిపుణల దొంగ ఉద్యోగ దరఖాస్తు పత్రాలు

jobapplication


Tata Consultancy Service(TCS), వారు తమ ఉద్యోగులలో 20 మందిని దొంగ సర్తిఫికేట్ చూపించి ఉద్యోగం పొందారన్న అభియోగం తో తీసివేసింది.  గతంలో Infosys, Satyam , Wipro కూడా  false resumes పై ఇలాంటి చర్యే తీసుకున్నారు. విప్రొ ఇలా దొంగ రెస్యూంస్ పెట్టి ఉద్యోగం సంపాదించే వారి data base తయారు చేసి మిగతా కంపనీలకు ఆ సమాచారాన్ని అందచేస్తుంది.

ఇప్పుడు క్రమ శిక్షణ ఎదుర్కొంటున్న ఉద్యోగులు, వ్రాత పరీక్ష, సామూహిక చర్చ, సాంకేతిక నిపుణుల ప్రశ్నల బాణాలు, HR Dept ల శల్య పరీక్షకు  తట్టుకుని, ఎంపికైన వారే. ఇలా ఉద్యోగం పోయిన వారు కోర్ట్ కు వెళ్లే అవకాశం ఉందా? తప్పెవరిది?   
ఈ విషయం పైన చర్చలు చూడండి. మీరేవంటారు?

http://www.siliconindia.com/shownews/43754/2

13 కామెంట్‌లు:

Naveen Garla చెప్పారు...

20 మందేనా? దొరకని దొంగలు ఇంకా వందల్లో ఉన్నారు (ఒక్క TCSలో మాత్రమే). నా తెలిసిన వాళ్ళే ముప్పయ్యో, నలభయ్యో మంది దొంగ సర్టిఫికెట్లు పెట్టి చేరిపోయారు. నా చిన్ననాటి స్నేహితుడు ఒకతనైతే ఇలాంటి వాటికి ఏకంగా ఆఫీసే తెరిచాడు. ఏ కంపెనీదైనా సరే శాలరీ పత్రాలు, ఈ-మెయిల్ ఐడీలు లాంటివి సృష్టించగలడు. షాకింగ్ న్యూసేంటటే...కొందరు TCS బ్యాంగ్రౌండ్ వెరిఫికేషన్ జనాలతో ఇతనికి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి బ్యాంగ్రౌండ్ వెరిఫికేషన్లో కూడా దొంగలు దొరికే అవకాశం లేదు. ఇదో చిన్న మాఫియా లాంటిది. నాకు తెలిసిన ఒక అతను రెండేళ్ళు దొంగ ఎక్పీరియన్సు పెట్టి యాభై వేల జీతానికి చేరాడు. SAP అంటే ఏమిటో...ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నల గురించి నెల రోజులు కష్టపడ్డాడంట అంతే. నెల రోజులు ముక్కితే SAP ఉద్యోగాలు రాలుతాయన్న మాట. ఇంత ఈజీగా పని ఐపోతూంటే డిగ్రీలు వగైరా చేసి కష్టపడటం ఎందుకు? రెండేళ్ళు బేవార్స్‌గా తిరిగి జల్సా చేసి...లక్షల జీతానికి MNCలో చేరిపోవచ్చు కదా? ఏమంటారు.
ఏ ఉద్యోగం దొరక్క నిస్పృహలో, తప్పనిసరి పరిస్థుతులలో నిరుద్యోగులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. దీని మీద ఒక పెద్దా టపా వ్రాయాల్సిందే...

సుజాత వేల్పూరి చెప్పారు...

నవీన్ గారు,
అవును, మీరే ఈ టపా రాయాలి, ఎందుకంటే మీ దగ్గర కొంత డేటా ఉంది కాబట్టి.

మేధ చెప్పారు...

ఒక్క TCSలో ఏముంది, Infosysలో కూడా బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ తో లింక్స్ ఉన్నావాళ్ళు చాలా మంది ఉన్నారు... నవీన్ గారన్నట్లు ఇదంతా ఒక పెద్ద మాఫియా లాంటిది... బెంగళూరు లాంటి చోట్ల walk-in జరిగినప్పుడు, వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏ డొమైన్లో, ఎంత experience కావాలో అడిగి వాళ్ళముందే ఒక పెద్ద ఫైల్ తెరిచి, వాళ్ళకి కావలసింది ఇస్తారు...!
ఒకసారి ఇలానే డాట్ నెట్(లేక ఇంకోటో).. దాని లేటెస్ట్ వర్షన్ మార్కెట్లో రిలీజ్ అయి ఒక నెల అయ్యింది.. మనవాళ్ళు అఖండులు కదా, దానిమీద 3యేళ్ళు exp పెట్టి వెళ్ళారు.. వాళ్ళని HR నానామాటలు అని పంపించేశారు, అది వేరే సంగతి... ఇలాంటి సంఘటనలు కోకొల్లలు...
అయినా మనదేశం ఏముంది, ఇక్కడ నుండి US(MS కోసం) వెళ్ళినవాళ్ళు అందరూ చేసేది అదే కదా... ఇంజనీరింగ్ చేరిన సంవత్సరం నుండి exp పెట్టి అక్కడ జాబ్ లో జాయిన్ అయిపోతారు..!!! ఇవన్నీ వ్రాయడం మొదలుపెడితే ఒక పెద్ద గ్రంధం అవుతుంది...!

మేధ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Rajendra Devarapalli చెప్పారు...

రావు గారు చాలా కీలమైన విషయాన్ని చర్చకు పెట్టారు.దొంగ సర్టిఫికెట్లు అన్నది ఒక ఇంకా పూర్తిగ వ్యవస్తీకౄతం కాని ఒక వైట్కాలర్ క్రైం సిండికేట్.దశాబ్దాల తరబడి వివిధ రూపాలలో దీని కార్యకలాపాలు సాగుతుంటాయి.కొన్ని విశ్వవిద్యాలయాలు,కొన్ని సాంకేతిక కళాశాలలు,వాటిలోని కొందరు ఉద్యోగులు,మరి కొన్ని చోట్ల యాజమాన్యాలే ఈ నేరానికి సూత్రధారులు.

భారతరాజ్యాంగ రచనా కాలములోనే యస్సీయస్టీ వర్గాలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టినా,ఆ తరువాత సుమారు రెండు దశాబ్దాల తర్వాత,జగజ్జీవనరాం చొరవతో ఇందిరాగాంధీ కొద్దోగొప్పో ఆ రిజర్వేషన్లను అమలు చేయబూనుకున్నాక యస్సీయస్టీల ముసుకులో ఇతరకులాల వారు చొరబడ్డంతో ఒక నీచ సాంప్రదాయానికి తెరలేచింది.
ఇప్పటికీ ఆనాటి యోధాగ్రేసరులు అక్కడక్కడా కొనసాగుతున్నారు.
ప్రభుత్వరంగసంస్థలు ఎక్కువగా ఉన్న విశాఖపట్నంలో ఇవ్వాళ్తకీ మీకు వందల సంఖ్యలో సదరు దొంగసర్టిఫికెట్ బాపతు వందల్లో కనిపిస్తారు.ఇటీవలి కాలంలో ఐ.టి.కంపీనీలు విరివిగా వస్తున్న నేపధ్యంలొ ఏదో ఒక రిక్రూటింగ్ ఏజన్సీని పట్టుకోవటం ఢెబ్బై వేలనుంచి మూడు లక్షల వరకూ చెల్లించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ తీసుకోవటం.ఏ సత్యంఒ హెయస్ బీసి లాంటి వాటికొ గెలమెయ్యటం.ఇదీ వరుస వైజాగులో.ఈ మధ్య ఇలాంటి రిక్రూతింగ్ ఏజన్సీ ఆహోY ఒహోయ్ అని పేరున్న దాన్ని బ్లాక్ లిస్త్ చెయ్యటం జరిగాయి.ఎవరో అన్నట్లు ఇది జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్ బెర్గ్

cbrao చెప్పారు...

ఖర్చు తగ్గించుకునే ఉద్దేశంలో -TCS ఇప్పుడు నూతనంగా recruit చేసుకునే వాళ్లలో 60% freshers ను తీసుకుంటుంది. అదే అనుభవజ్ఞులయితే, ఖర్చెక్కువకదా.

అజ్ఞాత చెప్పారు...

aunu. US lo MS chesina vallu b.tech aipoyina daggara nundi enti inka ekkuve petti veltaru experience. kani anta petti velte client kuda bane expect chestadu kada. aina kuda tattukoni nilabadgalugutaru. India lo kuda general ga doubt rademo okavela veellu cheppina pani sarigga cheste. mana daggara vishayam lenappude kada ilantivanni bayatapadedi. ila fake pettina valle udyogalu techukuntunte, mari nijam experience vallaki enduku ravatledu. adi kuda alochinchali mari :). vellina prati daggara experiece adugutaru. mari makai evvaru udyogalu ivvakapote experience ekkada nundi vastundi. So naku indulo tappem kanapadatledu. vellam, udyogam sarigga chesama, jeetam techukunnama. ide important.

అజ్ఞాత చెప్పారు...

The problem of false resumes and forged documents will only increase and not decrease in time as the number of universities, colleges, and institutes increases. The approach to address the problem is in the hands of the IT companies. Working with the governments and educational institutions, they can develop a secure online system. In the first instance they may develop a list of accredited institutions, departments, degrees, and grant-year and give them Internet identities and sub-identities. Each institution places the names of degree, diploma, and certificate holders in databases linked to those identities. Such a system eliminates paper based documents. When a person identifies self and authorizes an employing company to view his or her academic record, they can go into the (secure and pre-validated) online database and view just that person’s record. In fact, this concept can be extended to any document that could otherwise be forged. Imagine traveling internationally with no documents (not even an e-passport) but with your biometrics on you.

అజ్ఞాత చెప్పారు...

ayyaa, ajnaathagaaru raasina roman telugu choosthunte, neenu 50 ellagaa prayathnisthunna MODIFIED MODERNISED PHONETICISED ADAPTED FOR ALL LAMGUAGES ROMAN LIPI yokka upayogam evarikii pattinchukovadam avasaram ledaaa? naa manuvadu 7 tharagathi lo roman, thelugu, devnagari 3 moodu lipilatho kashtta paduthoonte jaali kalagadaa ee educationists doralaku????

అజ్ఞాత చెప్పారు...

ika donga certificatelu donga resumelu ku vasthe idi pedda samsya kaadu idi manalo kondariki unna vakra budhi, mafia nu maanpagaligeraa? donga notlu? donga MBBS tho 25 endlu CAS gaa elaa chesedoo mari doriki poyadu kadaa? mari computers tho alaa pani cheyadam antha thelikaa? daaniki parishkaaramu, valalu vesi pattukovadam kudaradaa? 7th class ward boy RMP tho medical chesthuu MBBS kante ekkuva sampaadistham ledaa?? mari Engineers donga BE lanu trap cheya leraaa? inthati NERDS unna meere asahaayulaithe mari elaagandi?

cbrao చెప్పారు...

@doc.joj: దొంగ సర్తిఫికేట్స్ తో వైద్యం చేస్తే ప్రాణం పోయే ప్రమాదముంది. Fake experience తో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేస్తే, ప్రొగ్రాంలో బగ్స్ వస్తాయి. వాటిని rectify చేసి, debug చెయ్యవచ్చు. కాని పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. పెద్ద కంపనీలకు, దరఖస్తుదారులలో కొందరు fake experience పెడ్తున్నారని తెలిసీ, వాళ్లని కంపనీ అవసరార్ధం ఉద్యోగాలలో నియమించి, అవసరం తీరాక దొంగ సర్తిఫికేట్స్ పెట్టారంటూ ఉద్యోగంలోంచి తీసివేస్తున్నారు. Global economy బాగా లేక భారత్ లోని కంపనీలకు కొత్తగా వచ్చే software projects తగ్గటమే దీనికి కారణం.

అన్ని భాషలకు, ఉచ్ఛారణ ఆధారిత ఆధునిక లిపి.

మీరు కనుగొన్న ఈ లిపి గురించిన వ్యాసమేదన్నా ఉంటే దాని లింక్ పంపగలరు. లేక, మీ లిపి గురించి ఒక వ్యాసం రాయగలరు. మీరు తెలుగును ఇంగ్లీష్ అక్షరాలతో , లెఖిని ఉపయోగించి, తేట తెలుగులో రాయవచ్చు. చూడండి. http://lekhini.org/

Unknown చెప్పారు...

yeah its a great blog on fake resumes,i think its not good to get the job by cheating companies,keep blogging.for best online Microstrategy training MicroStrategy Online Training
it is the best provider of business intelligence,learn and be in professional field.

svrtechnologies చెప్పారు...

Whatever we gathered information from the blogs, we should implement that in practically then only we can understand that exact thing clearly, microstrategy training videos but it’s no need to do it, because you have explained the concepts very well. It was crystal clear, keep sharing..

కామెంట్‌ను పోస్ట్ చేయండి