సోమవారం, ఫిబ్రవరి 09, 2009

స్పందన -6



Mount Diablo,North California Photo: cbrao


బ్లాగులలో అసభ్య రాతలు

"అప్పుడు హైందవం బుద్ధుడిని వ్యతిరేకించలేదు. అతడిని ఒక అవతారం చేసింది. తనలో కలుపుకుంది. దేశంలో బౌద్ధం అంతరించింది." -బౌద్ధ మతవ్యాప్తిని అరికట్టడానికిది హిందువుల ప్రయోగాత్మక వ్యూహం. అది ఫలించింది. బౌద్ధం భారత దేశం లో క్షీణించి హిందువులు లేని దేశాలలో ప్రకాశించింది.

"కాబట్టి, మనము కూడా, నచ్చని బ్లాగులను వదిలి, నచ్చని వ్యాఖ్యలని విస్మరిస్తూ, మనకు నచ్చిన రీతిలో బ్లాగు ప్రపంచాన్ని ముందుకు తీసుకుంటూ పోదాం." -మంచి మాటలు.

http://kasturimuralikrishna.wordpress.com/2009/02/06/open-letter/


Credit Card

While reimbursing the amount to merchants credit card companies deduct 1.85% towards their charges.This will eat away the profit margin of retail merchants. In the case of electronics, computer goods, because of competition the profit margins on sale of goods is low and hence they can't afford further erosion of profit. For this reason, electronic goods merchants charge additional 2% if you offer payment through Credit card or Debit card.

Use of cash is advised in such cases.

http://sangharshana.blogspot.com/2009/02/blog-post_06.html


వేయిపడగలు

ఇంతకూ ఈ విలువైన (400 రూపాయలు) పుస్తకం ఇచ్చే సందేశమేమిటో వివరించి ఉండవలసినది.

http://newjings.blogspot.com/2009/02/2.html


పర్ణశాల పై సమీక్ష

పర్ణశాల ఎలా వివాదాస్పద బ్లాగు అయ్యింది? అందులో ప్రతిపాదించిన మింగుడు పడని సిద్ధాంతాలేమిటి? ఒక ఉదాహరణ గా కాష్మీరాన్ని పాకిస్తాన్ కు ఇచ్చివేసి సుఖంగా వుందాం అనే సిద్ధాంతం. Parody బ్లాగుకు కత్తి ఏ విధంగా ప్రేరణ అయ్యారు? కత్తి భావజాలంతో బ్లాగరులు ఎందుకు విభేదిస్తున్నారు? శంఖారావం బ్లాగులో చెప్పినట్లుగా బ్లాగులలో ముసలానికి కత్తి మహేష్ కుమారే కారణమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ సమీక్షలో లేశ మంత కూడా గోచరమవటంలేదు.

http://computerera.co.in/blog/?p=1349


ఈ-తెలుగు లక్ష్యాలు

మీరు వీవెన్ వ్రాసిన e-తెలుగు ఎలా ఏర్పడింది? అన్న వ్యాసం కింది గొలుసులో చూడండి.
http://veeven.wordpress.com/2009/02/01/who-etelugu-started/ ఇది చదివితే మీ ప్రశ్నలకు సమాధానాలు లభ్యమవగలవు. మీరు e - తెలుగు సభ్యులు కావాలంటే, ముసుగులోంచి బయటకు రావాలని ప్రధమ నియమం. ముసుగు వీడి మీ పరిచయం చేసుకుంటే సంతోషిస్తాను. అలా పరిచయం చేసుకోవటం మీకు సమ్మతం కాకపోతే, మీరు e-తెలుగు సభ్యులు కాజాలరు. సభ్యుల ప్రవేశ రుసుము Rs.300/- సంవత్సర చందా Rs.200/-

http://dhoommachara.blogspot.com/2009/02/blog-post_07.html


పర్ణశాల పై సమీక్ష: వ్యాఖ్యలు లో ప్రశ్నలు ఎవరినుద్దేశించినవి?

'కంప్యూటర్ ఎరా' లో వచ్చిన బ్లాగు సమీక్ష పై, నా వ్యాఖ్య లోని ప్రశ్నలు, పర్ణశాల లో చర్చించిన సిద్ధాంతాలు, ఆచరణయోగ్యం కాదనో, లేక అవి సాధ్యం కాదనో చెప్పటానికో, అవి రాయలేదు. ఆ ప్రశ్నలు సమీక్షకులకు. ఆ ప్రశ్నలపై కూడా సమీక్షలో కొంత కేంద్రీకరిస్తే సమీక్ష సమగ్రంగా ఉండగలదని చెప్పటానికే. అందులో ఇచ్చిన ఉదాహరణలు కూడా సమీక్షకుల అవగాహనకు రాసినవే కాని పర్ణశాలకు ఎవో ఉద్దేశాలు ఆపాదించటానికి కాదు. వాస్తవంలో పర్ణశాల లో చర్చించిన విషయాలు ఎన్నో గంభీరమైనవి, విస్తృతమైనవి. అంతలోతుగా సమీక్ష ఉండాలని చెప్పటానికే ఉదాహరణగా ఇచ్చిన కల్లోల కాష్మీరం నా కొద్దు.

నా వ్యాఖ్య ఎవరికోసం, ఎందుకోసం రాయబడిందో అనే విషయం లో సందేహ నివారణకు అందులో లేవనెత్తిన ఒక ప్రశ్నకు నేనే బదులిచ్చి, ఈ ఉత్తరాన్ని ముగిస్తాను. "శంఖారావం బ్లాగులో చెప్పినట్లుగా బ్లాగులలో ముసలానికి కత్తి మహేష్ కుమారే కారణమా? " -నా జవాబు: ఇది హాస్యాస్పదమైన ఆరోపణ. నా వ్యాఖ్యలో లేవనెత్తిన ప్రశ్నలను చర్చిస్తూ, సమీక్ష సమగ్రంగా ఉండటానికై ఏమైతే రాయాల్సుంటుందో, అవి ఉదహరించి ఉండవలసినదని నేను అభిప్రాయపడ్డాను.

పర్ణశాల వంటి గంభీర బ్లాగు పై సమీక్షలను peer -review చేసి ఆ పత్రికా సంపాదకుడు ప్రచురించి వుంటే ఈ అపార్ధం కలిగేది కాదు.

http://parnashaala.blogspot.com/2009/02/blog-post_08.html


సారస్వత మేరువు శ్రీ ఆవంత్స సోమసుందర్

సోమసుందర్ గారి గురించిన ఉపయుక్తమైన సమాచారం, విశ్లేషణ బాగున్నాయి. ఇందులో బొమ్మలు కనిపించటం లేదు. వాటిని మరలా ఎగుమతి చెయ్యగలరు.

http://sahitheeyanam.blogspot.com/2008/10/blog-post_10.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి