శుక్రవారం, ఫిబ్రవరి 13, 2009

విదేశీ శక్తుల కుట్ర

తెలుగు ప్రచారోద్యమానికై e తెలుగు వారు ఒక ఊరేగింపు ప్రశాంతంగా జరుపుతుంటే, బయటనుంచి ఒక ముష్కరుల మూక ఊరేగింపులో చేరిపోయి, పోలీసులపై రాళ్లు రువ్వితే ఏమవుతుంది? ఈ ముష్కరుల మూక ఎవరిది? వారి సిద్ధాంతాలేమిటి? వారి లక్ష్యాలేమిటి? వారి కుట్రలేమిటి?

దబ్బకాయ కుట్ర

బ్లాగడం ఆపను. కానీ... అన్న పర్ణశాల బ్లాగులోని టపాకు రాసిన వ్యాఖ్యలలో ఒక అజ్ఞాత ఒక గొప్ప కుట్ర సిద్ధాంతాన్ని బట్టబయలు చేశారు. తెలుగు ప్యూపుల్, ఆవకాయ, దబ్బకాయ సైట్లలో పేరు కోసం ప్రయత్నించి విఫలులైన వారు అక్కడి కలుషితవాతావరణాన్నే బ్లాగ్లోకానికి ఎగుమతి చేశారన్న సిద్ధాంతమది. ఇక్కడ బ్లాగ్లోకంలో పేరు తెచ్చుకోవటంలో విఫలమయి, పేరున్న బ్లాగరులను వివిధ పద్ధతులలో భయ భ్రాంతులను చేసి, వారిని మానసికంగా హింసించి, పైశాచిక ఆనందం పొందటంలో కృతకృత్యులయ్యారు. మహిళా బ్లాగరులపై అశ్లీలమైన రాతలతోను, ప్రచలిత పురుష బ్లాగులపై వ్యతిరేకంగా దొంగ పేర్లతో వ్యంగ రాతలు రాసి తమ ఆగడాలు మొదలెట్టారు. ఒక కుటుంబంగా ఉన్న బ్లాగరుల మధ్యనే తగాదాలు సృష్టించటంలో కూడా విజయం సాధించారు.

"ఈ తెలుగు అని ఒక గ్రూపు ఏర్పాటు చేసి ఏదో సాధిస్తున్నామని చెప్పుకునే వాళ్ళంతా వాళ్ళ అసలు ఎజెండా ఏంటో కూడా తెలియక సతమతమయ్యారు. ఈ గ్రూపు లో పెద్దలు ఎలా ఉన్నారంటే మనలో పుట్టి పెరిగి ఎమ్మెల్యే నో ఎంపీ నో ఆయిన ఒక రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తారు. మనమేం చెప్పినా వాళ్ళు వినరు. అంతా వాళ్ళిష్టమొచ్చినట్టే చేస్తారు. కొంతమంది అనుమానం ఏంటంటే వీళ్ళూ ఈ సంఘం ద్వారా ప్రభుత్వాన్ని బతిమాలో బెదిరించో డబ్బులు దండుకోవడమే కాకుండా ఇళ్ల స్థలాలు కూడా కొట్టేయ్యాలని ప్లాన్ చేస్తున్నారని."
-ఈ తెలుగు పై ఎన్ని అపోహలో. ఈ అపోహలు తొలగించటానికి వీవెన్ రెండు టపాలు రాశారు.

e-తెలుగు ఎలా ఏర్పడింది?


e-తెలుగు ప్రశ్నలు & జవాబులు


అవి సరిగా చదవక వీళ్లు తమ సందేహాలు లోకానికి వెళ్లడించి, ఈ తెలుగు పై తమ వంతు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్ల స్థలాలకై ఈ తెలుగు నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్న వీరి అభియోగం హాస్యాస్పదం. ఈ తెలుగు అనేది ఒక సంఘం. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఈ సొసైటీ నడుస్తుంది.

కొత్తగా వస్తున్న అవాంఛనీయ ధోరణి. దీప్తిధార మరి కొన్ని ఇతరుల బ్లాగులలో కొత్త పాళి, సుజాత, మరికొంతమంది పేర్లతో దొంగ ఉత్తరాలు రాసి తుంపులు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తే పలు పేర్ల తో వ్యంగ విమర్శలు, బెదిరింపు ఉత్తరాలు రాయటం అనే కొత్త సంస్కృతి కూడా బయలుదేరింది. బ్లాగరులు ఈ Impersonator ను జాగ్రత్తగా గమనిస్తుండాలి.

తెలుగు భాషా - సంస్కృతీ ధ్వంసమునకై కుట్ర

ఈ సిద్ధాంతమును హరిసేవకుడు దుర్గేశ్వరుని మిత్రుడు ప్రతిపాదించినది. హరిసేవ బ్లాగులోని e-తెలుగు కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల..మా తల్లీ కన్నీరుపెడుతోందో.... అనే టపాలో ఈ సిద్ధాంతాన్ని చూడవచ్చు. e తెలుగు వారి కృషివలన నేడు పెక్కుమంది కంప్యూటర్లో తెలుగు వాడటం నేర్చుకుంటున్నారు. తెలుగు బ్లాగుల గురించి ప్రజలు పత్రికలలో చదివి, e తెలుగు వారి సహాయంతో కూడలి, లేఖిని గురించి తెలుసుకొని పెక్కుమంది తాము మరుస్తున్న తెలుగుకు ఒకమారు మెరుగుపెట్టి తెలుగులో బ్లాగు రాయటానికి సంసిద్ధమవుతున్నారు. ఇట్లు జరిగిన తెలుగుకు తిరిగి పూర్వ వైభవమెక్కడ సంభవించునో అని ఈ ముష్కరులు స్త్రీ పురుష భేదం లేకుండా వారిని తమ రచనలతో వ్యంగ వాఖ్యలతో తూట్లు పొడిచి, గాయబరచి వారిని తెలుగుకు దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముష్కరులు తెలుగు భాషకు, సంస్కృతి కి కి తమ శాయ శక్తులా హాని చేయ తలపెట్టుతున్నారు.

"మొత్తానికి తాలిబానైజేషన్ ఆఫ్ తెలుగు బ్లాగ్‌లోకం అన్నమాట! అందుకనేనా మొన్నటి సభ గురించి ఎవరూ ఇంకా నివేదికని ఇవ్వలేదు. e-తెలుగు వారు కూడ కిమ్మనటం లేదు." -అని కొందరు సభ్యులభిప్రాయపడుతున్నారు.

కడుపు మంట, ఉక్రోషం, అసూయల తో కుట్ర

పేరున్న బ్లాగరులపైనే కవ్వించే వ్యాఖ్యలు, కత్తిపోటు మాటల తూటాలు ఎందుకని?
"అసలు యేమీ అనకున్నా కడుపు మంటతో పేలిపోతారు ఇంకొందరు సన్నాసులు. మడిసి మనసు కుళ్ళిపోనాక సేయగలిగేది ఏముంటుంది సెప్పు?" అని అంటున్నది రత్తి; నేను-లక్ష్మి అనే బ్లాగులోని ఆడోళ్ళు-బ్లాగులు-పెమదావనాలు- యేందియన్నీ? అనే టపాలో. మరి దీనికి ఏమి చెయ్యలి? ఎట్లా చేస్తే పరిష్కారం లభిస్తుంది? క్షోభ పడిన హృదయాలు మరలా తేలికెలా పడతాయన్నదానికి రత్తి మాటలలో జవాబు లభిస్తుంది.
""మంచి బుద్ధికీ, సెడు బుద్ధికీ ఆడా మగా అన్న తేడా లేదు మావా. దేవుడూ, రాచ్చసుడూ ప్రతి మనసులోనూ ఉన్నారు. మనం సేసేది ఒప్పా తప్పా అని లెక్కలేసుకుంటే గొడవలెందుకు ఐతాయి సెప్పు. అందరూ సల్లంగుండాలి, అందరి జీవితాలు మంచిగుండాలి, ఎప్పుడు పేలిపోతుందో తెలియని ఈ బుడగ మీద మమకారంతో సాటి వాళ్ళ జీవితాలను పాడు సేసే పాడు బుద్ధి ఎవరికీ ఉండకూడదు. అలా ఉంటే బుద్ధి మార్చుకుని సంతోషంగుండాలి మావా, సంతోషంగుండాలి"

ముగింపు

ఈ ముష్కరులు తమ లక్ష్యాన్ని సాధించగలిగారా?

మహిళల బ్లాగులు కొన్ని మూతబడ్డాయి. పర్ణశాల బ్లాగు కూడలి, జల్లెడల నుంచి అదృశ్యం కాబోతుంది. సీనియర్ బ్ల్లాగర్లను హేళన చేయటంలో తాత్కాలిక విజయం పొందారు. ఎంతకాల మిలాగా? పిల్లి ఎదురు తిరగ గలదని, ఈ ముష్కరుల ఆటలు కట్టే రోజు త్వరలో రాగలదని ఆశిద్దాము.

14 కామెంట్‌లు:

  1. సాదాగా చెప్పాలంటే, అడ్డమైన రాతలకు అనవసరమైన విలువని ఆపాదించి మన వాళ్ళు దెబ్బతిన్నారు తప్ప మరోకటి కాదు. మేకల దాడిని తట్టుకున్న మొక్కనే వృక్షమవుతుంది!

    రిప్లయితొలగించండి
  2. అద్భుతంగా ధైర్యంగా మీలా ఇలా అందరూ విమర్శిస్తే చాలు. ఈ కుట్రలు,కుళ్ళులు మనలనేమీ చేయలేవు,ధన్యవాదములు రావుొగారూ

    రిప్లయితొలగించండి
  3. మీరు గమనించారో లేదొ కానీ కాగడా మరియు ధూం బ్లాగుల ధోరణిలో చాలా మార్పు వచ్చింది. కాగడా వారు గంతంలో జరిగిన తప్పులను (కొంతవరకు) ఒప్పుకొని తమ బ్లాగులో రాడికల్ మార్పులు తీసుకొని వస్తామని ప్రకటించి పాటించారు. ఇకపై వ్యక్తినింద వుండదని, సిద్ధాంత పరమయిన చర్చ మాత్రమే వుంటుందని ప్రకటించారు. ఆ రకంగా తమ బ్లాగులని క్లీన్ చేయడం నేను గమనించాను. మహిళా బ్లాగర్లపై అసభ్యకరమయిన వ్యాఖ్యలు, టపాలు ఆ బ్లాగుల్లో ఇప్పుడు లేవు.

    ఈ-తెలుగు గురించి మాత్రం విమర్శలు చెలరేగుతూనే వున్నాయి.

    రిప్లయితొలగించండి
  4. అవును నేనూ గమనించాను 'తెలుగు బ్లాగ్స్' బ్లాగులో ఇదే టపా! ఎవరిది ఎవరు కాపీ చేసారు? మాకు నిజం తెలియాలి :))

    రిప్లయితొలగించండి
  5. పాళీ గారు తమ బ్లాగులో ఐడి థెఫ్ట్ అనే టపాకి వ్యాఖ్యలు ప్రచురించము అన్నారు కాబట్టి ఇక్కడ వ్రాయవలసి వస్తోంది.

    http://kottapali.blogspot.com/2009/02/id-theft-in-blogs.html

    ఐడి ఒరిజినలా లేక ఫేకా అన్నది ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఫేక్ ఐడి అయితే ఐడికి ముందు బూడిద రంగులో వుంటుంది బ్లాగర్ ఐకాన్. అయితే ఇంకో బ్లాగర్ ఐడినే తయారుచేసుకొని ఫేక్ పేరు పెడితే ఈ జాగ్రత్త వల్ల లాభం లేదు. ఇదే కారణం వల్ల పాళి గారు తమ టపాలో సూచించిన పరిష్కారం కూడా ఫలించదు అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  6. రావు గారూ - ఒకటే మాట చెప్పదలచుకున్నా....we are making a laughing stock of ourselves ఇలాటివాటికి అనవసరంగా డప్పు కొడుతూ ప్రచారం చేసి అనవసరమయిన " అపోహలు, అపార్థాలూ, అవకాశాలూ " ఇంకా పెంచిన వాళ్ళమవుతున్నాము అని పెద్దవాళ్ళూ, ఆ పైన కొంచెం బుఱ్ఱ ఉన్నవాళ్ళు తెలుసుకోకపోతే ఇక చెప్పేదేమీ లేదు.....తెలివి ఉన్న వారికి మీరు చెప్పే ఈ విషయాలన్నీ ఎలాగూ తెలుసు, ఆ పైన అసలుగా ఏమి అవుతోందో తెలియకనా .... ఎవరికి తగ్గ అర్థం వాళ్ళు తీసుకోవచ్చు....ఇంతకన్నా చెప్పేదేమీ లేదు...ఇంతే సంగతులు చిత్తగించవలెను...

    రిప్లయితొలగించండి
  7. అంటే, నిజంగానే బ్లాగర్లలో సీనియర్, జూనియర్ అనే టైటిల్సున్నాయన్నమాట! బ్లాగుతో బాటు టైటిల్స్ కూడా రాస్తే, పాఠకులకు సౌకర్యంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  8. Sorry. I do not have any blog. I just used my gmail account to post my earlier comment(and this too). I am not hiding my profile.
    If you feel my comment is inappropriate, please delete it.

    రిప్లయితొలగించండి
  9. @Siri: మీకు బ్లాగు లేక పోయినా ఇబ్బంది లేదు. సిరి పేరుతో ఒక ఖాళీ బ్లాగు ప్రారంభించవచ్చు.మీరు enable access to your Profile చెయ్యగలరు. మీ Profile లో మీ పరిచయం రాయవచ్చు. ఇది సులభమే. ఇలా చేస్తే మీరొక వ్యక్తిత్వమున్న వ్యక్తిగా పరిగణింపబడతారు. Enabling Profile అవసరం ఎందుకొస్తుందంటే ప్రస్తుతం బ్లాగింట్లో దొంగలు బడ్డారు. ఎవరు దొంగో దొరో తెలియటం లేదు. Profile Enable చెయ్యనివాళ్లని మంచి వారైనా అనుమానించవలసిన విచిత్ర పరిస్థితిలో మనం ఉన్నాం. అజ్ఞాతలందరూ కాదు కాని, కొందరు ఆలిబాబా 30 దొంగల గుంపులో సభ్యులు. Alibaba & 40 Thieves అంటారా, కాని ఏమి చేస్తాం చెప్పండి Recession -Depression వలన ఆలిబాబా 10 మందిని Lay Off చెయ్యవలసి వచ్చింది.

    రిప్లయితొలగించండి
  10. "..ఇలాటివాటికి అనవసరంగా డప్పు కొడుతూ ప్రచారం చేసి అనవసరమయిన అపోహలు, అపార్థాలూ, అవకాశాలూ " ఇంకా పెంచిన వాళ్ళమవుతున్నాము అని పెద్దవాళ్ళూ, ఆ పైన కొంచెం బుఱ్ఱ ఉన్నవాళ్ళు తెలుసుకోకపోతే ఇక చెప్పేదేమీ లేదు', అన్న వంశీ గారి మాటతో కనీసం వివాదంలోకి లాగబడిన బ్లాగర్లు ఏకిభవించి ఉంటే మొరిగిన/మొరుగుతున్న కుక్కలు అలసి, సొలసి, సొమ్మగిల్లిపడిపొయ్యెవన్న అభిప్రాయం మీద "మీ స్పందన" ?

    రిప్లయితొలగించండి
  11. ఏంటంటే వీళ్ళూ ఈ సంఘం ద్వారా ప్రభుత్వాన్ని బతిమాలో బెదిరించో డబ్బులు దండుకోవడమే కాకుండా ఇళ్ల స్థలాలు కూడా కొట్టేయ్యాలని ప్లాన్ చేస్తున్నారని."

    ఎవరబ్బా ఈ ఆరోపణలు చేసే పిచ్చివాళ్ళు ? ఇళ్ళ స్థలాలూ, డబ్బూ కొట్టెయ్యడానికి తెలుగుని పట్టుకుంటే పనవుతుందా ఈ రోజుల్లో ? ఏమో, మాకా భ్రమల్లేవు.

    రెండోది, వినడానికి కటువుగా ఉన్నా చెప్పక తప్పదు. ఇ-తెలుగులో కుష్ఠుముష్టివాళ్లెవరూ లేరు. అందరూ కాస్తో కూస్తో తాడూ, బొంగరం ఉన్నవాళ్లే. పరధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని ఆశించే ఖర్మ వాళ్ళకి పట్టలేదు.
    మూడోది - ఇ-తెలుగులో ఇప్పటిదాకా సొంత డబ్బు తగలేసుకుని కార్యక్రమాలు నడుపుతున్నవాళ్లే ఉన్నారు. ఇతరుల్ని ఎప్పుడూ దేహి అని చెయ్యిచాచిన పాపాన పోలేదు. ABK ప్రసాద్ గారిని కలిసినప్పుడు ఆయన అడిగితే "మాకు ప్రభుత్వ ఫండింగ్ అవసరం లేదు. ప్రభుత్వం అనుమతిస్తే మా సొంతఖర్చులతో వెళ్ళి జిల్లా కార్యాలయాల్లో తెలుగు ఎనేబుల్ మొదలైన విషయాల గురించి వివరించడానికి సిద్ధంగా ఉన్నాం" అని మొహమాటం లేకుండా చెప్పడం జరిగింది.

    నాలుగోది. ఇ-తెలుగు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఈ దశలో దాని మీద ఏ ఇష్యూ, కారణమూ లేకుండా ఏదో తెలియని అక్కసుతో అభాండాలెయ్యడం అమానుషం. అలా నిందలేసేవాళ్ళూ, ఆ నిందలెయ్యడం కంటే మంచిపనులేమైనా చేస్తే బావుంటుంది. లేదా ఇ-తెలుగు పట్ల అంత అసంతృప్తి ఉంటే తమ సొంత సంస్థ ఏదైనా నెలకొల్పితే శుభమస్తు చెప్పేవాళ్ళలో ి-తెలుగువాళ్ళు ముందుపీటీన ఉంటారు.

    అయినా రావుగారూ ! ఈ ప్రచారాలకి రిఫరెన్సు మాత్రంగా నైనా సరే, మీ బ్లాగులో స్థానం ఇవ్వొద్దని ప్రార్థన.

    రిప్లయితొలగించండి