సోమవారం, ఫిబ్రవరి 22, 2010

కధ: మొదటి అందం



మీరు రైల్లో ప్రయాణం చేస్తుంటే, మీ ఎదురు బెర్త్ లో కూర్చున్న అందమైన అమ్మాయి " హి.నా పేరు సంధ్య" అని తనని తాను పరిచయం చేసుకుని, చెయ్యి ముందుకు చాపితే ఎలా అనుభూతి చెందుతారు? బాటసారి వ్రాసిన ఈ కధలో, కధా నాయకుడికి ప్రయాణంలో ఎప్పుడూ పక్క బెర్త్ లలో పిల్లలో లేక వృద్ధులో తగిలే వారు. మెడిసన్ చేసే సంధ్యతొ రాజమండ్రి నుంచి చెన్నై దాక ఆనుకోకుండా చేసిన ప్రయాణంలో, కబుర్లలో
సంధ్య ఇచ్చిన Parting gift ఏమిటి? ఈ కధలో కొంత భాగం కింద చదవండి.

నా సీటుకి ఎదురుగుండ ఒక అమ్మాయి కుర్చుని వుంది. కిటికి లొంచి బయటకి చూస్తూ ఉండటం వల్ల మొహం పూర్తిగా కనిపించటం లేదు. కిటికి లొంచి బయటకి చూస్తూ, గాలికి ఎగురుతున్న తన కురులను చెవి వెనక్కి తోసేస్తుంది..తదేకంగా తననే చూస్తున్నానని గమనించినట్లు వుంది ఆ అమ్మాయి నా వయిపుకి తిరిగింది.. ఒక చిన్న చిరునవ్వు నవ్వి "హి.నా పేరు సంధ్య" అని తనని తాను పరిచయం చేసుకుని చెయ్యి ముందుకు చాపింది. “ఈ అమ్మాయి మరీ ఫాస్ట్ అనుకుంటా, వెంటనే చెయ్యి ఇచ్చేసింది” ఆనుకున్నాను నాలో నేనే. వయసు 22,23 వుంటుంది. ఇది వరకు నేను ఎప్పుడూ చూడని రూపం ఆమెది. పేరే కాదు, ఆమె రూపం కూడా చాల అద్భుతంగా వుంది. ముఖాన వంకీలు తిరిగిన బొట్టు బిళ్ళ, ముక్కుకి చిన్న ముక్కు పుడక వున్నాయి. చెవికి అందంగా జుంకాలు వేలాడుతున్నాయి.. ఉగాది రోజున మా ఇంటికి వేలాడే మావిడాకుల్లా.,మొహంలొ ఎదో తెలియని ఆకర్షణ, ప్రశాంతత కనపడుతున్నాయి. రైలు గోదావరి బ్రిడ్జి దాటుతోంది. దూరంగా సూర్యుడు అస్తమించటానికి సిద్ధంగా వున్నాడు సూర్య కిరణాలు గోదావరి నీటి మీద పడి పరావర్తనం చెందుతున్నాయి. దూరంగా పడవ మీద ఒక ముసలి వాడు చేపలు పట్టడానికి వల వేస్తున్నాడు. ఆకాశం లొ పక్షులు గుంపుగా గోదావరి దాటుతున్నాయి. చాల అద్భుతంగ వుంది ఆ దృశ్యం. వెంటనే నేను నా కళ్ళల్లో బంధించాను ఆ దృశ్యాన్ని. కళ్ళతో కూడా ఫొటోలు తీయొచ్చని మొదటి సారి అనిపించింది. రైలు గోదావరి బ్రిడ్జి దాటింది. “హల్లొ సర్, మిమ్మల్నే..నా పేరు సంధ్య ఫైనల్ ఇయర్ మెడికోని’ అని మళ్ళీ తన పేరు చెప్పింది నా పేరు ఏమిటన్నట్లుగా. ‘ఓహ్.. Sorry, నా పేరు ఆకాశ్ . Working as a Marketing Executive ’ అని నన్ను పరిచయం చేసుకుని నేను కూడా నా చెయ్యి ముందుకు చాపాను.
‘ఎంత వరకు ప్రయాణం?” అడిగిందామె.
‘నేను చెన్నై వెళ్తున్నానండి. మరి మీరు ?’.
‘నేను కూడ చెన్నై వెళ్తున్నాను. కాని మా College Hostel మాత్రం చెన్నై కి 30 KM దూరం’.
ఆమెతొ మాటలు కలిపిన కొద్ది సేపటి లోనే అర్ధమయ్యింది..ఈ అమ్మాయి extrovert అని. ఆందుకనేమో మిగిలిన అమ్మాయిలకి భిన్నంగా తనని తాను first పరిచయం చేసుకుంది..

కధ ఆసక్తిగా ఉందా? అయితే బాటసారి వ్రాసిన మిగతా కధ ఇక్కడ చదవండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి