సోమవారం, జనవరి 31, 2011

తెలుగు కోకిల అంజనా సౌమ్య

Anjana Sowmya Photo courtesy: Muzigle.com

చక్కటి కంఠస్వరం, వినయం, సౌమ్యం ఆభరణాలుగా  ఉన్న, 1986 లో జన్మించిన, చింతలపూడి అంజనా సౌమ్య  కాకినాడ అమ్మాయి.  'సూపర్ సింగర్స్--4' గ్రాండ్ ఫినాలే లో ఆమెకు మూడు లక్షల రూపాయల బహుమతి వచ్చినా ఎగిరి గంతేయకుండా తన సహ గాయకులను అభినందించే స్థితప్రగ్నత ఉందీ సౌమ్యకు.   పేరుకు తగ్గట్లే  ఆమెలోని నమ్రత ఆమెను శ్రొతలకు మరింత దగ్గరగా చేర్చింది. "కృష్ణా నీ బేగనే బారో" పాటతో ఎందరో సంగీతాభిమానుల గుండెలలో కూర్చుండిపోయింది. 2006-2007 లో కాకినాడ జె.ఎన్.టి.యు లో బి.టెక్ ( ECE) తర్వాత ఎం.బి.ఎ  చేసిన సి.పి.సౌమ్యకు సంగీతమంటే ప్రాణం. తండ్రి (శ్రీ గోపాల కృష్ణ, విశ్రాంత బాంక్ అధికారి) , తల్లి  (శ్రీమతి సుమతి) ల ప్రోత్సాహంతో  మా టి.వి నిర్వహించిన  పాటల పోటీలో విజేతగా నిలిచింది. గురువులైన శ్రీయుతులు కాకరపర్తి వీరభద్ర రావు, పెద్దాడ సూర్యకుమారి వద్ద శాస్త్రీయ సంగీతం అభ్యసిస్తే, లలిత సంగీతాన్ని శ్రీయుతులు ఉమ మరియు వడలిఫణి నారాయణ గార్ల వద్ద  నేర్చుకోవటం జరిగింది. కర్ణాటక సంగీతం లో డిప్లొమా ఉన్న సౌమ్య, ఆల్ ఇండియా రేడియో లో  కళాకారిణిగా ఎంపికయింది. చదువు, సంగీతం, సినీ నేపధ్య గాయని పనులను ఏక సమయంలో చేసిన ధీశాలి. మా టివి సూపర్ సింగర్ పోటీ 1,2 మరియు 3 లలో విజేత కాలేనప్పటికీ  పట్టువిడవకుండా కృషి చేసి 4 వ సారి కృతకృత్యురాలయ్యింది సౌమ్య.

అవరోహణలు

 
2000 లో పాడుతా తీయగా పిల్లల పోటీలో విజేత.
2004 లో ఈ టివి ప్రియా ప్రియతమ రాగాల విజేత.
2005 సింగపూర్ మరియు చెన్నై ల లో కర్ణాటక, భక్తిగీతాల కచ్చేరి
2010 మా టివి సూపర్ సింగర్ పోటీలో విజేత
2010 లో అమెరికా లో  జి ఆనంద్  నవతరం స్వరమాధురి,చక్రి టాలీవుడ్ హంగామా ల లో సహ గాయకులతో కలిసి  పాట కచ్చేరి.
సినిమాలు:ఆలయం, జులాయి, క్లాస్‌మేట్స్, ప్రేమలోకం, న్యాయం కావాలి మొదలగు చిత్రాలలో నేపధ్య గాయని.     

విజేత అయ్యాక చాలా సినిమాలలో పాటలు పాడినా అవి ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. అయితే కోటి సంగీత సారధ్యం వహించిన  క్లాస్‌మేట్స్  లో మల్లికార్జున్ తో కలిసి పాడిన మౌనమెందుకు, దరిచేరవెందుకు అన్న సిరివెన్నెల పాట ఆమెకు తృప్తి, గుర్తింపు తెచ్చాయి. తాజాగా మా పసలపూడి కధలు టి.వి. ధారావాహికకు పాడిన టైటిల్ సాంగ్ ఆమెలోని ప్రతిభను మరోసారి వెలుగులోకి తెచ్చింది. నిస్సందేహంగా సౌమ్య చక్కటి  గాయని. అయితే, తన గాన మాధుర్యాన్ని పూర్తి స్థాయి లో  ఉపయోగించుకునే పాటలు  పాడే అవకాశం కోసం ఈ తెలుగు కోకిల ఎదురు చూస్తూ ఉంది.  ఆ అవకాశం లభిస్తుందని, సౌమ్య మరింత ఎత్తుకు  ఎదుగగలదని ఆశించవచ్చు.  

తాజాగా అంధ్రప్రదేష్  అనే లఘుచిత్రానికి అంజనా సౌమ్య  శ్రావణ భార్గవి, పవన్ ల తో కలిసి నరేష్ సంగీత సారధ్యంలో  పాడిన పాట  చూడండి.  ఈ పాట రచయిత సాహిత్య సాగర్. దర్శకత్వం: వాసు  నిర్మాణం: TEAM WORKS



ఫేస్‌బుక్ లో మీరు  అంజనా సౌమ్య అభిమానులలో చేరాలనుకుంటే ఈ లంకె  ద్వారా  చేరవచ్చు.

గురువారం, జనవరి 27, 2011

దిన చర్య

Sunset in Maui Island, Hawaii Photo: cbrao

దిన చర్య  -పెరుగు రామకృష్ణ

ఒక సాయంత్రం
నల్ల సముద్రమైపోయాక
తన ఉద్యగం లోంచి ఆమె
నా ఉద్యోగంలోంచి నేను
బైటికొచ్చి వొడ్డున పడ్డాక
తీరిగ్గా కలుసుకుంటూ _
చీకటి సముద్ర తీరం మీద
జంట పక్షులమై రెక్కలార్చి కూర్చుంటాం ....
వాళ్ళ ఆఫీసు కబుర్లతో ఆమె
నా దిన చర్య గూర్చి నేను
బతుకు ఫైళ్ళు తెరుచుకుంటాం
అవసరాల గురించి కొంచెం
ఆనందాల గురించి కొంచెం
కొన్ని దిగుల్లై పోతాం
కాసిన్ని చిరునువ్వ్లవుతాం
జారుతున్న చీకటి యవనికలా
ఆలోచనల కెరటాల మై పోతాం
కబుర్ల కలనేత ముగిసాక
ఒక చానల్లో సీరియల్.....
మరో సిడి లోంచి హరిప్రసాద్ చౌరాసియా
అలా గాలిలో ప్రవహించాక
ఆమె కునుకులోంచి
మత్తులోకి జారుకుంటూ
ఆమె శ్వాస
నా ఛాతి పై పాములా పాకుతూ ....
నన్ను గుండెలకు హత్తుకుని
గాడంగా నిద్రిస్తుంది
ఉదయం నుంచి
నా లోపల... లోపల
అల్లరి చేస్తూ
ఆలోచిస్తూ ,ఆక్రోసిస్తూ
ఆవేసిస్తున్న ఓ పద్యం
అప్పుడే మేల్కొని
యిక రాత్రంతా
నిద్ర పోనీకుండా చేస్తుంది...!

బుధవారం, జనవరి 26, 2011

రెండు వ్యంగ ప్రహసనాలు

ఈ నాటి బ్లాగర్లు, పాత్రికేయుల   తీరుతెన్నుల పై  నా దృష్టికి వచ్చిన  రెండు వ్యంగ ప్రహసనాలు మీముందుంచుతున్నాను. చదివి ఆనందించండి.

మొదటిది

"ఆహా ఎంత చక్కగా నను దోచాడే వాడూ!" 


 ఈ వ్యాస రచయిత శరత్ బ్లాగ్లోకంలో  చిరపరిచుతుడే.

http://sarath-kaalam.blogspot.com/2011/01/blog-post_7856.html  

రెండవ వ్యంగ ప్రహసనం

"నా ఆలోచనలు". ఇది వ్రాసినవారు లైలా యెర్నేని. చనిపోయిన వారి గురించి అలవాటుగా వ్రాసే ఒక పాత్రికేయుడు  రామాయణం గురించి ఇలా వ్రాయవచ్చు అని లైలా గారి భావన. పదండి ముందుకు.  

నా ఆలోచనలు

సరయూ నదిలో మునిగి మరణించిన రాముడు దశరధుని పెద్ద కుమారుడు.
దశరధుడెవడు? అతడు మృతిచెందిన అజుని కుమారుడు. అజుడు చనిపోయిన రఘువు కొడుకు.

దశరథుడు వేటకు వెళ్ళినప్పుడు, అతని బాణం పొరపాటున తగిలి మరణించిన ఒక కుర్రవాని పేరు శ్రవణుడు.

శ్రవణుడు ఒక కావిడి తట్టలో అంధులైన ఇద్దరు అమ్మానాన్నలను మోసుకు తిరిగేవాడు. వారిద్దరూ చనిపోతూ దశరథుడుకి నువ్వు కూడా పుత్రశోకంతో చనిపో అని శాపం ఇచ్చారు.

చనిపోయిన దశరథుడికి ముగ్గురు భార్యలు. కౌసల్య. సుమిత్ర, కైకేయి.
కౌసల్యా సుతుడైన రాముడికి సీతతో వియోగం సంభవించింది.

వారు కలిసున్నప్పుడు, అడివిలో సీతారాములు ప్రకృతిని చూస్తూ ఆనందిస్తున్నప్పటి ఈ పాట లింక్ ఇక్కడ ఇస్తున్నాం.

లింకు, యూ ట్యూబు.

ఈ పాటను తెలుగులో జిక్కీ, రాజా పాడారు.

జిక్కీని అనుమానించిన రాజా, రైలు అందుకోటంలో విఫలుడై ఎలా మరణించాడో,

ఆ వివరాలు

ఈ పత్రికలో చూడండి.

వారు పాడిన- ఎంతో మధురమైన "ఆడే పాడే పసివాడ"

ఇక్కడ విని ?ఆనందించవచ్చు.

ఇట్టి రైలు మరణాలను, ఆత్మహత్యలను, తదితర మరణాలను, జర్నలిస్టుగా చూసి, ఆరోగ్యం ఏం బాగుండని ఇతర స్నేహితులనుండి పొందిన మనోవికాసంతో ఒక దశాబ్దం శ్రమించి వెలువరించిన కవితా సంకలనం

ఇక్కడ చదువుకోవచ్చు. వెల $ 10.

అందులో ఒకరి (? :-)నిజంగా) "చివరి" పాట - సాహిత్య పూదోటలో శాశ్వతమైన స్థానాన్ని కల్పించుకున్న ఆ పాటను వారి గొంతులోనే

ఇక్కడ వినండి. లింకు.

హలో! స్వీటీ! రామాయణమంతా చూసి రాముడుకి సీత ఏమవుతుందో తెలియదా?...

తెలుసు. తెలుసు. సీత భూమిలో కలిసి పోతుంది.

అది కాదు నేనడిగిన ప్రశ్న.

ఓ! రాముడికి సీతకు చుట్టరికం ఏమిటీ? అనా?

అదీ కాదు.

నీ ప్రశ్న ఏదైతేనేం, ఎవరికీ తెలియని రామాయణాన్ని దివ్యంగా పరిచయం చేసినందుకు వారిని స్మరించుకుంటూ, ఆ స్మరణలో వసుధైక కుటుంబానికి
...

The "end."

విధిలేని గాడిది:-)

-రచ్చబండ సౌజన్యం తో

మంగళవారం, జనవరి 25, 2011

వికీపీడియా దశాబ్ది వేడుక


Invitation designed by  -Veeven

 విజ్ఞానాన్ని పంచుతున్న  తెలుగువికీ ప్రారంభించి నేటికి 10 ఏళ్లయింది. ఎదైనా సమాచారనిమిత్తం మీరు గూగుల్ చేశారనుకోండి. మొదటి మూడు ఫలితాలలో  వికీపీడియా దాదాపుగా వచ్చితీరుతుంది. మన జీవితంలోకి ఈ విధంగా చొచ్చుకు వచ్చిన వికీ మన పై చెరగనిముద్ర వేస్తుంది. Hello world అంటూ ఎంతో సాదాసీదాగా ప్రారంభమయిన వికీ ప్రయాణాం నేడు వందలకొద్దీ భాషలు, లక్షల వ్యాసాలు దాటి కొత్త పుంతలు తొక్కుతుంది.  ఈ వికీపీడియాలో వున్న ఇన్ని వ్యాసాలు ఎవరు వ్రాశారో తెలుసా?  ఎవరో నిపుణులు, శాస్త్రజ్ఞులు  వ్రాసినవి  కావు. మీలాంటి, నా లాంటి పాఠకులు, జిజ్ఞాసువులు వ్రాసిన వ్యాసాలే వికీ కు పట్టుకొమ్మలు. అయితే వికీ కు వ్యాసాలు వ్రాసే వారిలో డాక్టర్లు, మేధావులు కూడా వున్నారు. కొందరు పాఠకులు తరుచూ మాకు వినిపించే సందేహం "నేను పండితుడిని కాను. ఒకవేళ నేను వ్యాసం లో ఏదైనా పొరబాటు వ్రాస్తే ఎట్లా?"  వికీ లో ఎవరైనా నిర్భయంగా వ్రాయవచ్చు. మీరు వ్రాసే వ్యాసాలు, సవరణలు అన్నీ మీ పై వారిచే సమీక్షింపబడి వారి ఆమోదం పొందుతాయి. ఎక్కడైనా పొరబాట్లు ఉంటే , వికీ లో మీ కంటే ఎక్కువ అనుభవం ఉన్న పెద్ద వారు వాటిని సవరిస్తారు. కావున వికీ లో మీరు నిస్సంకోచంగా వ్రాయవచ్చు.   

వికీకు 10 ఏళ్లు నిండిన సందర్భంలో హైదరాబాదులో వికీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు లో పాల్గొన్న వారికి వికీ తరఫున టీ-షర్ట్ , వికీ చిహ్నం కలిగిన స్టిక్కర్ ఇంకా చొక్కాకు తగిలించే లోహపు వికీ గుర్తింపు చిహ్నం కల బిళ్ల (Badge)   కూడా ఇచ్చారు. విరామ సమయంలో అల్పాహారం, తేనీరు ఇచ్చారు.

ఆహుతులకు శ్రీనివాసకుమార్ వికీపీడియాను పరిచయం చేస్తూ ఈ కార్యక్రమానికి సూత్రధారిగా వ్యవహరించారు.
అర్జునరావు  ఆహుతులకు స్వాగతం చెప్పారు. 


Left to right: Siva Babu, Jyothi Basu and Suneel Mohan. Behind them is Veeven. Click to expand photographs.
తరువాత, వికీపీడియా దశాబ్ది వేడుక  సందర్భంగా  Wiki-10-   కేక్ కోయటానికి వ్యక్తులను ఎంపిక చేయటానికై ఒక ప్రత్యేక పద్ధతి అవలంబించారు.  ఆహుతులకు చిన్న కాగితాలు పంచారు. ప్రతి కాగితం పై ఏదేని అక్షరం లేక సంఖ్య వుంటుంది. W, 1, 0  అని వ్రాసి ఉన్న కాగితాలు వచ్చిన  వారిని కేక్ కోయటానికి ఆహ్వానించారు.  ఈ మూడు చీట్లు కలిస్తే W 10 (Wikipedia -10) అవుతుంది.  కరతాళధ్వనుల మధ్య కేక్ ను  సునీల్ మోహన్, జ్యోతి బాసు మరియు శివబాబు  కోశారు.


 తదుపరి సాఫ్ట్వేర్లు కల ప్రత్యేక C.D. ను వీవెన్ ఆవిష్కరించారు.

తేనీరు విరామ సమయం తర్వాత, రహ్మానుద్దిన్ షేక్  వికీపీడియా  గురించి వివరించారు. వికీమీడియా లోని కేవలం వికీపీడియా మాత్రమే కాకుండా ఇందులోని మిగతా విభాగాల గురించి క్లుప్తంగా పరిచయం చేశారు.
అనుబంధ విభాగాలు  
Wiki Meta - Wikimedia coordination     Wikipedia - Encyclopedia     Wiktionary - Dictionary and thesaurus   Wikibooks - Textbooks and manuals      Wikisource - Library     Wikiquote - Quote compendium Wikispecies - Species directory      Wikinews - News source      Wikiversity - Learning materials

వికి నిఘంటువు, వికి పుస్తకాలు (కాపీరైట్ లేనివి)  వగైరా పైన ఉదహరించిన కార్యక్రమాలలో పాఠకులు పాల్గొనవచ్చును. వికీపిడియా గురించి చెప్తూ ఇందులో 48000 పై చిలుకు వ్యాసాలున్నాయని ప్రతి వారం వికీ మొదటి పేజీలో ఒక ప్రధాన వ్యాసం , బొమ్మ వుంటాయన్నారు. Creative commons లో చిత్రాలు ఉంచవచ్చని, అవి వికీ లోని అన్ని భాగాల వారు ఉపయోగిస్తారన్నారు. పుస్తకాల  కాపీరైట్  గురించిన చర్చ కాలాభావం వలన పూర్తిగా  జరుగలేదు. అయితే  కాపీరైట్ గురించిన సూచనలు వికీ లో ఉంటాయని, ఆహూతులు
వాటిని ఆచరించమని అర్జునరావు సెలవిచ్చారు.Wiki species లో   Taxonomy of all species ఉంటాయన్నారు.

వికీపీడియా దశాబ్ది వేడుక   సందర్భంగా ఈ రోజు విడుదల అయిన  ప్రత్యేక  CD లో ఈ కింది అంశాలున్నాయని రహ్మానుద్దిన్ షేక్   అన్నారు.   

ఫైర్ఫాక్స్ 4.0  బీటా
తెలుగు ఖతులు



వికీపీడియా దశాబ్ది వేడుక  సందర్భంగా వికీ ప్రారంభకులలో ఒకరైన జిమ్మీ వేల్స్ ప్రత్యేక సందేశం.  (ఈ సందేశం దృశ్య శ్రవణాన్ని ఆహుతులకు ప్రదర్శించారు.)
Libre Office
వికీ అభివృద్ధి గురించిన ప్రత్యేక వ్యాసాలు
వికీ ప్రత్యేక వ్యాసాలు
ధ్వనిననుచరించి తెలుగులో టైప్  చేయు సాఫ్ట్వేర్  వగైరాలు


Arjuna Rao C

బెంగలూరు నుంచి ఈ సమావేశానికి ప్రత్యేకంగా వచ్చిన అర్జునరావు  మాట్లాడుతూ కొంతమంది అనుకుంటుంటున్నట్లుగా  Wiki-Leaks కు  Wiki-Media కు ఎలాంటి బాంధవ్యం లేదన్నారు. వికీపీడియా దిన దిన ప్రవర్ధమానమవుతుందని  కొన్ని పట్టికల సహాయం తో గణంకాలు ఇస్తూ వివరించారు. తెలుగు వికీపీడియా కు సంబంధించి 2010 లో విశిష్ట సేవ చేసిన 10 మంది వికీ సంపాదకులగురించి చెప్పారు. వారి పేర్లు దిగువ ఇస్తున్నాను.
1) రవిచంద్ర
2) అర్జునరావు
3) సి.చంద్రకాంత రావు
4) టి.సుజాత
5) ఎన్ రహ్మతుల్లా
6) కాసుబాబు
7) రాజశేఖర్ 1961  
8 నుంచి 10 వరకు విశేష కృషిచేసిన వారి పేర్లు అందుబాట్లో లేనందువలన ఇవ్వలేకపోతున్నాను. వికీ లో వార్తలు విశేషాలతో కూడిన తెవికీ వార్తలు కొత్తగా వికీ లో ప్రచురిస్తున్నట్లు అర్జునరావు అన్నారు.తెలుగు బ్లాగు పాఠకుల సంఖ్య తెలుసుకొన వీలయినట్లే, వికీపీడియా లో కూడా ఏ వ్యాసం ఎంతమంది చదివారన్నారన్న గణంకాలు తెలుసుకొన వీలవుద్దన్నారు.  ఇది ఎలా సాధ్యమవుతుందో తెలిసిన వారు వ్యాఖలలో వివరించి  ఈ వ్యాస ఉపయోగకత పెంచ కోరుతాను.

అర్జునరావు గారి ఉపన్యాసం తరువాత ఆహుతుల పరిచయ కార్యక్రమాలు జరిగాయి. స్వేచ్ఛ  -ఉచిత
సాఫ్ట్వేర్ గురించి దాని బృంద సభ్యుడైన శశిభూషణ్ మాట్లాడారు.  రాజశేఖర్ మాట్లాడుతూ తన పిల్లల కోసం కొరియా గురించిన సమాచారం కోసం వెతికే సమయంలో వికీపీడియా తనకు ఎంతో ఉపయోగపడిందని, ఇది మరింత విస్తృతం చేయటానికై తన వంతు కృషి చేస్తున్నట్లుగా చెప్పారు.   సునీల్ మోహన్  Linux - GNOME తెలుగు స్థానికీకరణలో తను చేసిన పని కంప్యూటర్
లో చూపిస్తూ వివరించారు. స్వేచ్ఛ కార్యదర్శి ఐన భువన్ కూడా ఈ సదస్సుకు వచ్చారు. సి.బి.రావు తనను ఈ-తెలుగు ఉపాధ్యక్షుడిగా పరిచయం చేసుకుంటూ, తమ సభ్యులు తెలుగు వికీలో క్రియాశీలకంగా ఉన్నారనీ,  ఈ -తెలుగు, వికీపీడియా అభివృద్ధికి శాయసక్తులా కృషి చేస్తుందని అన్నారు.  

సభ్యుల పరిచయాల తదుపరి వీవెన్ వికీపీడియాలో వ్యాస ప్రచురణ, సవరణల గురించి సోదాహరణంగా, LCD ప్రొజెక్టర్ సాయంతో పట్టికలు చూపిస్తూ  వివరించారు. 



తదుపరి ఆహూతులు   కంప్యూటర్ పై Hands On experience పొందారు. వారికి ఈ-తెలుగు వాలంటీర్లు, వికీపీడియన్స్ సహకరించారు.  చాలా ఆలస్యమైనా, భోజన వేళ మించినా  ఆహూతులు తుదివరకూ వికీ అవగాహనా సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్నారు. నర్సరావు పేట, నెల్లూరు వంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి  వికీపీడియన్లు,  కాబోయే వ్రాతకారులు, సంపాదకులు  ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇలాంటి సదస్సులు తరచూ నిర్వహించాలని నిర్వాహకులను కోరారు.   

మరిన్ని చిత్రాలకై  ఇక్కడ సందర్శించండి.

Text & Photos: cbrao Camera: Nikon D90

శనివారం, జనవరి 22, 2011

గీతాచార్య -ఈ అబ్బాయి చాలా మంచోడు!

ప్రియ, సృజన పాత్రల సృష్టికర్త  ఐన గీతాచార్య  చాలా మంచోడబ్బా.  ఆ పాత్రలు తన కల్పితమేనని ఎంతో నిజాయితీగా ఒప్పుకొన్న గీతాచార్య కు జెజేలు.

ప్రియ .. we miss you అంటూ  పెక్కుమంది పాఠకులు కంట తడి పెడినప్పటి సందర్భంలో, అసందర్భ ప్రేలాపనగా ఉన్న మలక్పేట్ రౌడీ వ్యాఖ్య   కలవరాన్ని సృష్టించి  టీ కప్ లో పెద్ద తుఫాన్ రేపింది. ప్రమదావనం సభ్యులు నాలుక కరుచుకోక తప్పింది కాదు. నిజానికి ఇది, ప్రమదావనం సభ్యులు గాని, బ్లాగ్ పాఠకులు గాని ఊహించనిది. ఇందులో ప్రమదావనం సభ్యుల తప్పేమి లేదు.   వారిపై కొన్ని బ్లాగులలో వ్రాసిన వ్యాఖ్యలు సభ్యంగా లేవు. వాటిని ఖండిస్తున్నాను.  టపా వ్రాసి పొరపాటు గ్రహించిన జ్యోతక్క టపా తీసివేయటం కూడా సరైనదే. అయితే  టపా తీసివేసిన కారణాలు పేర్కొంటూ తను మరొక టపా వ్రాయటానికి బదులు మౌనంగా ఉండి  పలు ఊహాగానాలకు తెరలేపటం  సమంజసమా?  

ఈ ప్రహసనం లో 33  నెలలుగా  పలు అవతారాలను సమర్ధంగా పోషించిన గీతాచార్య ను చూస్తుంటే దశావతారాలు చిత్రం లో కమల్ హసన్ గురుకొస్తున్నాడు. ప్రతిభావంతమైన ప్రదర్శనే ఇది. ప్రియ, సృజన పాత్రల తో ఎందరో  హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని, ప్రేమను పొందగలిగాడు.  ధన్యవంతుడు. ఇంతటి స్మృజనాత్మక శక్తి  తన చదువులో పెట్టుంటే ఈ సరికి డాక్టరేట్ వచ్చి వుండెడిది.  గీతాచార్య అపూర్వ ప్రతిభ గుర్తించి  ప్రియ, సృజన పాత్రల సృష్టికర్త  ఐన  గీతాచార్యకు అపర బ్రహ్మ  అనే బిరుదు  దీప్తిధార  ప్రదానం చేస్తుంది. చురుకైన మేధతో గీతాచార్య  ను " వాడే వీడు"  అని షెర్లాక్ హోంస్ పద్ధతిలో కనుగొన్న మలక్పేట్ రౌడీ కు టెంపోరావ్ బహుమతిని దీప్తిధార ప్రదానం చేయుటకు సంతసిస్తున్నది.

ఇక చివరగా అభ్యాస కాలపట్టికల   ప్రకారం  అభ్యాసం చేసి అమెరికాలో మరాథన్  విజయవంతంగా పూర్తి చేసిన బహుదూరపు బాటసారి,   భారతీయ గూడచారి విభాగం లో పనిచేసే మేజర్ చంద్రకాంత్ సహకారంతో తెలుగు బ్లాగ్ గేట్ - పెద్ద కుంభకోణం  ఆవిష్కరించినందులకు వారిరువరకు   వీరతాళ్లు వేస్తున్నది దీప్తిధార. మలక్పేట్ రౌడీ, బాటసారి  ఈ కుంభకోణాన్ని కనుగొన్న విధానం వివరిస్తే , ఇలాంటి  పరకాయప్రవేశాలను భవిష్యత్ లో నివారించవచ్చు.  

బ్లాగులు- వ్యాఖ్యలు -10


Bhongir Fort Photo: cbrao
మారేడు మిల్లి - ట్రిప్

"అడవిలో చిన్న వంతెనా దానికింద గల గల పారే యేరు ", "ఆ వంతెన మీదే కూర్చున్నాం అక్కడ నా సెల్లోని ముఖేష్ లతా రఫీ పాటలు విని నా ఫ్రెండ్స్ చాలా ఫార్మల్ గా బిహేవ్ చేసారు "
-రాత్రి 11 గంటల సమయంలో చిరుత,పులి అక్కడి వంతెన కిందగా రోడ్డు దాటుతాయి. వంతెన కింద నీటికై దుప్పులొస్తే, వాటి కోసం పులులొస్తాయి. మీరు పాటలతో అడవి నిశ్శబ్ద సౌందర్యాన్ని భంగం చెయ్యటం వలన అడవి జంతువులు తమ దారి మార్చుకొని వంతెనకు దూరంగా వెళ్లి వుంటాయి. మీరు పులిని చూసే అవకాశం కోల్పోయారు. యాత్రికులను అక్కడి గైడ్ అడవి జంతువులను చూపటానికి భద్రాచలం రోడ్ లోని వంతెన దగ్గరకే తీసుకు వెళ్తాడు సాధారణంగా. అడవిలో రాత్రుళ్లు నిశ్శబ్దంగా ఉంటూ అడవి చప్పుళ్లను, జంతువుల అరుపులను ఆనందించాలి.

http://lipilenibasha.blogspot.com/2010/09/blog-post_5962.html


ఓ రేంజ్ బోర్ కథ ‘ఆరెంజ్’

సినిమాకు కధే ప్రాణమని పలుమార్లు ఋజువయ్యింది గతంలో. ఆరంజ్ సినిమా ప్రొమోలు చూసి భాస్కర్ గొప్ప ప్రేమ కధా చిత్రం ఇస్తాడనుకున్నా. చిత్ర నిర్మాణానికి ముందే కధ ను కొందరు నమ్మకమైన సమీక్షకులకు చెప్పి (వారు కధను ఎక్కడా లీక్ చెయ్యమని వాగ్దానం చేసాక) వారి అభిప్రాయం తీసుకుని మార్పులు చేసి ఉంటే ఇలా నిరాశ కలిగేది కాదు కద. సమీక్షకులు కధను బహిరంగపరుస్తారనే (leak) భయం ఉంటే, హాలివుడ్ లో లాగా మనము కూడా పటిష్ఠమైన కధా శాఖను చిత్ర నిర్మాణం లో ఒక భాగంగా చేసుకుంటే బలమైన కధా వస్తువు చిత్రానికి లభిస్తుంది. చిత్ర విజయానికి ఈ కధా శాఖ తోడ్పడగలదు.

http://navatarangam.com/2010/11/orange-review/

నా సాహితీజీవనంలో జరిగిన కధ -మల్లాది

ప్రసాదరావు గారి కోరికలలో  పెన్ స్కెచెస్  మాత్రమే గాకుండా  తను సంపాదకత్వం వహించిన కళ  లోని ముఖ్య వ్యాసాలు ఒక సంపుటంగా రావాలన్నది మరొకటి. వెనిగెళ్ల  వెంకటరత్నం సహకారంతో  పొట్టిశ్రీరాములు  తెలుగు విశ్వవిద్యాలయం  వారు శిల్ప చిత్ర కళ పరిణామం  -చలసాని ప్రసాద రావు అనే పుస్తకాన్ని అందంగా ప్రచురించారు. ఈ సంపుటం వెలుగు చూడకముందే ప్రసాదరావు మరణించారు. ప్రసాదరావు గారిని మృత్యువుకు దగ్గర చేసింది సిగరెట్లే. ఈ దురలవాటు లేకుంటే మరో పది సంవత్సరాలు జీవించి ఉండేవారు.రామోజీరావు గారు మూసేసిన పత్రిక  తెలుగునాడు ఒక్కటే కాదు. న్యూస్ టైం అనే దిన పత్రిక కూడా వారు మూసివేసిన మరో  ప్రచురణ.

http://www.koumudi.net/Monthly/2010/november/index.html

మృత్యువుతో సైతం పోరాడుతున్న మల్లాది సుబ్బమ్మ 


మల్లాది సుబ్బమ్మ, రామ్మూర్తి గారు కలిసి నడిపిన వికాసం మాసపత్రికకు కొన్ని వ్యాసాలు/కధలు వ్రాశాను గతంలో. సుబ్బమ్మ గారు స్త్రీల సమస్యలపై ఎడతెగని పోరాటం జరిపారు. ఎన్నో వర్ణాంతర వివాహాలు జరిపించారు. ప్రజాహితం కోరి ఒక ట్రస్ట్‌ను స్థాపించారు. జీవిత చరమాంకం లో ఇలా మంచాన పడటం బాధాకరం. వారు కోలుకుంటారని ఆశిస్తాను.  

http://maagodavari.blogspot.com/2010/12/blog-post_08.html


తెలుగు సంజీవనిని మారిషస్ మోసుకుపోయిన ఆంజనేయుడు -సంజీవ నరసింహ అప్పడు

సంజీవ నరసింహ అప్పడు గారికి తెలుగు భాషపై అపరిమిత అభిమానం. మన దేశంలో గాక విదేశాలలో ఉన్నప్పుడు తెలుగు పై అభిమానం పెరుగుతుందని నేను నా అనుభవంలో తెలుసుకొన్నాను.అయితే సంజీవ గారికి ఈ అభిమానం ఒకింత ఎక్కువే. ఇలాంటి వారి వలనే మారిషస్ లో మన తెలుగు జండా రెపరెపలాడుతుంది. మారిషస్ లో వారి అనుభవాలతో కూడిన బ్లాగు ఒకటి సంజీవ గారు మొదలు పెట్టాలని నా అభ్యర్ధన.  

http://naalokam.com/archives/427


హైదరాబాద్ పుస్తక ప్రదర్శన -1వ రోజు

@ఉష : మరువానికి దూరం కావటం అంటే జీవితం లో కొన్నింటికి దగ్గర కావటమే. ఈ మార్పు మీకు ప్రమోదాన్నిచ్చిందని తలంపు. పుస్తకాలు పారిజాతాలు. దూరంగా ఉన్నా వాటి సుగంధం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. 2009 లో అమెరికా మిత్రులను పుస్తక ప్రదర్శనలో కలవటం ఆనందం కలిగించింది. మీరు ఒక మారు డిశంబర్లో  భారతదేశం రాగలరు.

http://deeptidhaara.blogspot.com/2010/12/1_17.html


"విజయవాడ బుక్ ఫెస్టివల్ లో "అనేక" విడుదల!"

వంశీకృష్ణ  బ్లాగు ఇప్పుడే చూశాను. విదేహ పేరుతో లేఖా సాహిత్యం అభినందనీయం. తెలుగులో లేఖా సాహిత్యం తక్కువ.  సంజీవదేవ్ లేఖా సాహిత్యం తో నాకు లేఖా సాహిత్యం పరిచయమయ్యింది. దరిమిలా లేఖల ద్వారా  సంజీవదేవ్ మంచి మిత్రులయ్యారు.

http://afsartelugu.blogspot.com/2011/01/blog-post.html


"నమ్మకం - భండారు శ్రీనివాసరావు"

అమెరికాలో భార్య పుట్టిన రోజు మరిస్తే! ఆ మరుసటి రోజు తనతో ఉంటుందో, ఉండదో, ఎప్పుడు విడాకులో అంతుబట్టదు.  పుట్టిన రోజు మరిచినా భారతదేశం లో భార్య విడాకులివ్వదు.  ఇది మన నమ్మకం.

http://bhandarusrinivasarao.blogspot.com/2010/12/blog-post_17.html


శుక్రవారం, జనవరి 21, 2011

శ్రీరాం పాట - రెహ్ నుమా

మన తెలుగు వాడు  Indian Idol 5 విజేత శ్రీరాం పాట రెహ్‌నుమా విన్నారా మీరు?  అద్భుతమైన కంఠ స్వరం.  Narnia 3 (The Chronicles of Narnia: The Voyage of the Dawn Treader)  సినిమా కోసం ఈ పాట హింది, తమిళ్, తెలుగు భాషలలో  శ్రీరాం పాడాడు.  చూసి ఆనందించండి.



టివి 9 లో శ్రీరాం తో ముఖాముఖి కూడా చూడండి.





గురువారం, జనవరి 20, 2011

ప్రియ అల్లరి ఆగకూడదు


ప్రియ అల్లరి కి (అల్లరి సరాగాలు కూడా....) ఇంతమంది అభిమానులున్నప్పుడు ప్రియ ఎక్కడికి వెళ్తుంది?  ప్రియరాగాలు ఆగకూడదు. వైష్ణవి హరివల్లభా!  నీ శక్తితో,యుక్తితో  ప్రియకు మరల జీవం పోయలేవా?  

వైష్ణవ జనతో తేనే కహియేజే,
పీడ పరాయీ జానే రే
పర దుక్ఖే ఉపకార్ కారే తోయే,
మాన్ అభిమాన న ఆనే రే .... వైష్ణవ జనతో...

వైష్ణవుడికే కదా ఇతరుల బాధ తెలిసేది
దిక్కులేనివారిని ఆదుకునేది
గర్వాన్ని దరిదాపులకు రానీకుండా

సకల్ లోక మ సహునే వందే,
నిందా న కరే కేని రే
వాచ్ కాచ్ మాన్ నిశ్చల్ రాఖే,
ధన ధన జనని తేని రే .... వైష్ణవ జనతో.....

సహిస్తూ, ప్రపంచాన్ని స్తుతిస్తూ
ఎవరిగురించీ చెడుగా చెప్పని
మాటలు,చేతలు,ఆలోచనలు నిర్మలంగా కల  
నిను కన్న మీ అమ్మ ఎంత అదృష్టవంతురాలు!

చావు, పుటక ల కిటుకు  తెలిసిన గీతాచార్యా, ప్రియకు పునర్జన్మ నీయవా? అంతా విష్ణు మాయే కదా! 

ప్రియరాగాల అభిమాని  

బుధవారం, జనవరి 19, 2011

అవి-ఇవి-అన్నీ -1

అవి -ఇవి-అన్నీ: ఇందులో ఏమి ఉంటాయి అంటే ఏమి ఉండవు అని జవాబు. అవునండి -భవదీయుడు చదివిన పుస్తకం, చూసిన సినిమా, నాటకం, చిత్రపటాలు, వార్తలు, విశేషాలు,  యాత్రా స్మృతులు, అనుభూతులు, అనుభవాలు  ఇంకా  అనేక జ్ఞాపకాల దొంతరలు ఇందులో చోటు చేసుకుంటాయి. అవధి ప్రకారం  వ్యాసం అని కాకుండా, నాకు వీలు కుదిరినప్పుడల్లా ఈ కబుర్లు దొర్లగలవు.

అఫ్సర్ నాన్నగారు  గురించి

"“అనుభవమే చివరి వెలుగు. ఈ క్షణమే చివరి క్షణం. ఆ వొక్క క్షణమూ సదామణి సదృశ జ్వాలగా వెలుగు” -ఒక బతకలేని బడి పంతులు, రచయిత, ఉపాధ్యాయుడు, కవి అఫ్సర్   తండ్రి ఐన  షంషుద్దీన్, రచయిత   కౌముదిగా మారిన తీరు గురించిన అఫ్సర్ వ్యాసం "నాన్నగారు...మళ్ళీ వస్తారా?"  మీరు చదివారా?    దారిద్ర్యం నుంచి  ఆస్టిన్ దాకా అఫ్సర్ జీవిత పయనం ఆశ్చర్యం కలిగించక మానదు.

ప్రియ అయ్యంగార్ అకాల మరణం

ప్రసాదం కోసం ఒక గంట ఉపవాసం చేస్తూ, నాన్న గురించిన కబుర్లు చెప్పే ప్రియ ఇక లేదు అంటే  నమ్మటం కష్టం.  అక్కకు వివాహమయి, దూరంగా వెళ్తుందనే బాధ ఎంత ఉన్నా  ఏడుపు నిభాయించుకుని  (ప్రియ మాటలలో తనకు "ఏడుపంటే యాక్" ), "అసలు చిరునవ్వుచూస్తే శత్రువైనా కరిగిపోడా"  అంటూ  అల్లరి చేసే ప్రియ మనకిక లేదు అనుకుంటే బాధ కలగదా!  "అసలు మనం నవ్వుతూ ఏ పనిచేసినా అది ఎప్పుడూ విజయమే కదూ." అనే ప్రియకు నివాళిగా ఏమివ్వగలం?  నవ్వుతూ కన్నీటి వీడ్కోలు తప్ప. ఇది తొలి తెలుగు బ్లాగరు మరణం.  

టివి ధారా వాహికలు

ఈ సోమవారం ( జనవరి 17, 2011) నుంచి, మా టివి లో  మా పసల పూడి కధలు ధారావాహిక మొదలయ్యింది.



అంజనా సౌమ్య, వంశీల పాటతో మొదలయ్యే టైటిల్స్, బాపు రంగుల బొమ్మలతో,  గ్రామీణ వాతావరణంలో కన్నుల పండుగ గా    ఉన్నాయి. నిర్మాణం, దర్శకత్వం శంకు. ఈ పల్లె కధలు చూస్తుంటే  చాలా కాలం క్రితం దూరదర్శన్ లో ప్రసారమైన అమరావతి కధలు, మాల్గుడి  రోజులు  గుర్తుకొచ్చాయి.   గ్రామీణ నేపధ్యమే వీటన్నింటికీ మూలం.  ఆసక్తికరంగా మా పసలపూడి కధలను చిత్రీకరించారు. ఈ ధారావాహిక మొదటి భాగాన్ని ఇక్కడ చూడండి.




మా టివి లోనే సాయంత్రం 7 గంటలకు మరో కొత్త ధారావాహిక చిన్నారి పెళ్లికూతురు మొదలయ్యింది.



ఉత్తర హిందుస్తానం లో ప్రాచుర్యమైన  ఈ ధారావాహిక లో  బాల్య వివాహం కధాంశం గా ఉంది. రాజస్థాన్ ప్రజల రంగుల దుస్తులు, అక్కడి హవేలి ల తో దృశ్యాలు  కంటికింపుగా ఉన్నాయి.  చిన్నారి ఆనంది కు జగదీష్ తో పెళ్ళి, ఆగిన స్కూల్ విద్య, ఆ పై అత్తవారింటికి పయనం.  నవ వధువుగా, భార్యగా, తల్లిగా ఆమె జీవితం లోని బరువు బాధ్యతలను చిన్నతనంలోనే మొయ్యవలసివస్తుంది. బాల్య వివాహాలు చట్టరీత్యా సమ్మతం కానప్పటికీ రాజస్థాన్ లో ఇవి మాములే. బాల్య వివాహాల వలన కలిగే కష్ట నష్టాలను ఈ ధారావాహిక చక్కగా చెప్పగలిగి, విజయవంతమైంది.



జెమిని లో మరో కొత్త ధారావాహిక అడగక ఇచ్చిన మనసు ప్రారంభమయ్యింది.  భైరవమూర్తి  హైదరాబాదులో ఒక ఖరీదైన గేటెడ్ కమ్మ్యునిటీ లో ఉంటూ  దాని సెక్రెటరిగా అందరి పైనా పెత్తనం చెయ్యాలనే తలంపులో ఉంటాడు. భైరవమూర్తి  కొడుకు ప్రసాద్ బెంగలూరు వెళ్లి అక్కడ ఒక పేరు తెలియని (మధుమిత) అమ్మాయిని చూసి పడ్తాడు ప్రేమలో. కధంతా సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఉద్యోగపర్వం లోని ఆఫీస్ వెతలు, ప్రేమలు, అమెరికా వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు తో కూడి  యూత్ ను ఆకర్షించేలా ఉంటుందీ కధ. మధుమిత ఆఫీస్ లో  భార్యా భర్తలైన  సాఫ్త్వేర్ ఉద్యోగులను అమెరికా పంపే పధకం రాబోతుండటం తో పెళ్లి కాని యువతీ యువకులు దొంగ పెళ్లి చేసుకునైనా సరే అమెరికా వెళ్ల్లటానికి చేసే ప్రయత్నాలు నవ్వు , జాలి కలుగ చేస్తాయి.  గుణ్ణం గంగరాజు కధ, చంద్రశేఖర్ ఆజాద్  చిత్రానువాదం, మాటలు, నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.ఈ నాటకం  ప్రారంభ పాట చూడండి.


Adagaka Ichina Manasu Title Song
Uploaded by tvserialsongs. - Watch feature films and entire TV shows.