ఆదివారం, డిసెంబర్ 25, 2011
హైదరాబాదు పుస్తక ప్రదర్శన 2011 -1
ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరమూ హైదరాబాదు పుస్తక ప్రదర్శన ఘనంగా ప్రారంభమయ్యింది. తొలిరోజుల ప్రదర్శన గురించి నేను వ్రాద్దామనుకున్నా, ముందే నిర్ణయించబడిన Bird Watchers Society of Andhra Pradesh వారి అస్సాం వన్యమృగ జాతీయ ఉద్యానవనాల పర్యటన లో పాల్గొన ఉండవలసి రావటంతో, వ్రాయలేకపోయాను. శనివారం 24 డిశంబర్ రోజున ప్రదర్శనకు వెళ్ళే వీలయ్యింది. ఈ రోజు ప్రదర్శన శాలలో విశేషాలు చెప్తాను.
నేను ప్రదర్శన శాల చేరే సరికి మధ్యాహ్నం 2 గంటలయ్యింది. అప్పటికే పుస్తకాల దుకాణాలలో సందర్శకులు నిండి ఉన్నారు. ప్రదర్శన విజయవంతమయ్యిందనటానికి ఇది ఒక దాఖలా. ప్రతివారి చేతిలో కనీసం రెండో, మూడో పుస్తకాలు కనిపించాయి. ఎప్పటివలే మన e-telugu.org వారి అంగడి ప్రవేశద్వారం పక్కనే కనిపించింది. హైదరాబాదు పుస్తక ప్రదర్శన ఈసారి చాలా ఆహ్లాదకరంగా కనిపించింది. ఆకుపచ్చని కార్పెట్ పరచడం వల్ల దుమ్ము లేవకుండా శుభ్రంగా ఉంది.
లేఖిని మహిళా రచయిత్రులంతా కలిసి (డి.కామేశ్వరి, అబ్బూరి ఛాయాదేవి, వారణాసి నాగలక్ష్మి, మంథా భానుమతి,KB లక్ష్మి ,ఇంద్రగంటి జానకీ బాల,తురగా జానకీ రాణి,వాసా ప్రభావతి,శైలజా మిత్ర,శ్రీవల్లి రాధిక,పొత్తూరి విజయలక్ష్మి ,ఉంగుటూరి శ్రీలక్ష్మి) పుస్తక ప్రదర్శన లో తమ రచనలని (నవలలూ,కథా సంపుటాలూ) దుకాణం సంఖ్య:156 మరియు157 లో అమ్మకం కోసం పెట్టారు (గణేష్ అనే పంపిణీదారుడు ద్వారా). సామాన్యంగా పుస్తకాల దుకాణాలలో ప్రదర్శన ఒకే మోస్తరుగా గా ఉండి, ప్రాచుర్యమైన రచయితల పుస్తకాలు మాత్రమే కనిపించేలా ఉంటాయి.
ఇక్కడ లేఖిని రచయిత్రుల పుస్తకాలు బాగా కనిపించేలా పెట్టారు. రచయిత్రుల పుస్తకాలు విశాలాంధ్ర,నవోదయ ,ప్రజాశక్తి వంటి అంగళ్ళ లోనే కాకుండా లేఖిని పుస్తకాల దుకాణం సంఖ్య:157 లో సులభంగా లభిస్తున్నాయి.
Click on photos to enlarge
ఉపన్యసిస్తున్న వారు-నాళేశ్వరం శంకరం ఇంకా ---, మొదలి నాగభూషణ శర్మ, శివారెడ్డి, శశికాంత్ శాతకర్ణి మరియు మహజబీన్
ఈ రోజు ప్రదర్శన శాలలో శశికాంత్ శాతకర్ణి వ్రాసిన జ్వాలాపాతం (కవితలు) పుస్తకావిష్కరణ జరిగింది. శశికాంత్ ప్రఖ్యాత రచయిత అవత్స సోమసుందర్ కుమారుడు. మరో పుస్తకావిష్కరణలో ప్రజాశక్తి ప్రచురణల వారి ఆరు పుస్తకాల (కందుకూరి వీరేశలింగం- హాస్య సంజీవని, శ్రీ శ్రీ జయభేరి -తెలకపల్లి రవి, ప్లాస్టిక్ మనీ, నేటి సామ్రాజ్యవాదం, అమెరికా ప్రజల చరిత్ర, ప్రాచీన ప్రపంచ చరిత్ర) ఆవిష్కరణ జరిగింది. చరిత్రకారుడు వకుళా భరణం రామకృష్ణ మాట్లాడుతూ అమెరికా చరిత్ర తాను కళాశాలలో అప్పటికి లభ్యమయ్యే రచనల సహాయంతో చెప్పేవాడినని, ఈ పుస్తకం అమెరికా ప్రజల చరిత్ర తనకు అప్పుడు లభ్యమయిఉంటే, తను వేరే దృక్పధంలో పిల్లలకు పాఠాలు చెప్పి ఉండేవాడినన్నారు. అమెరికా వలసవాద దోపిడీని ఈ పుస్తకం వివరించింది. ఈ కార్యక్రమంలో రచయిత తెలకపల్లి రవి, ఆలి రాఫత్, ప్రొ||సి.సుబ్బారావు, కవి శివారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.
పోయిన సంవత్సరం ప్రారంభించిన kinige.com అప్పుడు మొగ్గలా ఉంటే ఇపుడు చెట్టయ్యింది. తెలుగు, ఆంగ్ల భాషలలో ఇప్పుడు పలు ఆసక్తికర e- పుస్తకాలు లభ్యమవుతున్నాయి. దుకాణ వీక్షకుల అవగాహనకై e-books గురించిన దృశ్యమాలిక ను ప్రదర్శించారు. ఆసక్తికరమైన Quiz నిర్వహించి కినిగె బహుమతులనిచ్చారు. ప్రదర్శనశాలలో ఎక్కడ పుస్తకాలు కొన్నా ఆ రశీదు చూపెట్టినవారికి కూడా కినిగె పుస్తక బహుమతులిచ్చారు. e-books గురించిన పలు ప్రశ్నలకు కినిగె ప్రతినిధి రహమాన్ ఓపికగా, వివరంగా జవాబిచ్చారు. కినిగె నిర్దేశకులు చావా కిరణ్ , అనిల్ అట్లూరి సందర్శకులకు కినిగె పని తీరు గురించి వివరించారు. e-books వలన ప్రపంచం లో ఎక్కడున్నా, మన అభిమాన పుస్తకాలు మన వెన్నంటే ఉంటాయి. తెలుగులో e-books పంపిణీకి ఆద్యులైన కినిగే కు అభినందనలు. కినిగె నిర్దేశకుడు చావా కిరణ్ తొలి తెలుగు బ్లాగర్ కూడా అవటం మరో విశేషం.
మీరు Coffee Table Books ప్రియులా? అయితే ఈ ప్రదర్శన మీకు పండగే. ఖరీదైన ఎన్నో కాఫీ బల్ల పుస్తకాలు సరసమైన ధరకే లభ్యమవుతున్నాయి. 50 నుంచి 60% దాకా తగ్గింపు ధరలో లభ్యమవుతున్నాయి. నేను చాలా పుస్తకాలు కొన్నాను. నేను కొన్న Coffee Table Books పుస్తకాలివి.
1) An Indian Wildlife Photographers Diary: Sunlight & shadows -M.Y.Ghorpade 2) The Periyar Inheritance -Bittu Sehgal & Anish Andheria 3) A Celebration of Birds -Robert Dougall 4) Tales From The River: Brahmaputra -Tibet, India and Bangladesh -Tiziana & Gianni Baldizzone బ్రహ్మపుత్ర నది కధ ఖరీదు రూ.2500/- ఐతే నేను 50% తగ్గింపులో రూ.1250/- కు కొన్నాను.
పైన ఉదహరించిన మిగతా పుస్తకాలు M.R.Book Centre, Hyderabad అంగడి లో కొన్నాను. ఇక్కడ కూడా మంచి మినహాయింపు ధరలో పుస్తకాలు లభ్యం అవుతున్నాయి. ఇవి కాక చాలా తెలుగు పుస్తకాలు కూడా కొన్నాను. జేబులో 100 రూపాయలుండగా ఇహ ఈ రోజుకి కొనటం ఆపాను. ఈ పుస్తక దాహం ఎన్నటికీ తీరనిది.
నేను ఈరోజు సందర్శించిన మరో దుకాణం Stall No: 207. Asian Educational Services. ఇక్కడ చాలా పురాతనమైన (100 నుంచి 700 సంవత్సరాల పాతవి కూడా) పుస్తకాల పునర్ముద్రణలు చక్కటి అట్టతో లభ్యమవుతున్నాయి. కొన్ని ఉదాహరణలు దిగువన ఇస్తున్నాను.
1) IBN Batuta: Travels in Asia and Africa 1325 to 1354
2) The Travels of Marcopolo: The Venetian - John Masefield
3) Dawn in India: British Purpose and Indian Aspiration
4) A History of British India
5) The ABC of Indian Art
ఇక్కడ మతము, బౌద్ధ, చరిత్ర, ఇస్లాము, సముద్ర యాత్రలు, ప్రయాణాలు -ఆవిష్కరణలు,గోవా, పోర్చ్ గీస్ ఆసియా, శ్రీలంక, విజయనగర సామ్రాజ్యం వగైరా అంశాలపై పలు ప్రామాణిక పుస్తకాలున్నాయి. మరిన్ని వివరాలకు వారి వెబ్సైట్ దర్శించవచ్చు.
Asian Educational Service పక్క స్టాల్ లో తమిళ్ సినిమా లపై కాఫీబల్ల పుస్తకాలు లభ్యమవుతున్నాయి. ఇచ్చటనే Galatta Express అనే సినీ వారపత్రిక లభ్యం. త్వరలో దీని హైదరాబాదు కూర్పు కూడా లభ్యమవగలదని స్టాల్ నిర్వాహకులు చెప్పారు. ఈ మధ్య వెబ్సైట్లకు సెన్సార్సింగ్ కావాలంటున్న కపిల్ సిబాల్ భావాలను నిరసిస్తూ, www.swecha.org అనే సంస్థ వారు Freedom of Expression కావాలంటూ కరపత్రాలు పంచారు.
ఎడమనుంచి కుడి వైపు: క్రాంతి కుమార్, దాట్ల శ్రీనివాసరాజు, కూర్చొన్న వారు:పవిత్రన్, కౌటిల్య, వీవెన్, నుంచొన్నవారు: నాగమురళి ఇంకా శంకర్
తెలుగు కు ఆధునిక హోదా అనే కొత్త ధ్యేయంతో e-telugu కృషి చేస్తూ ఉంది. ప్రముఖ ఐంద్ర జాలికుడు, హితవాది(Counsellor) పట్టాభిరాం ఈ స్టాల్ ను దర్శించారు. ఇ-తెలుగు అంగడిని పలువురు కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ రోజు కార్యకర్తలు 1) కశ్యప్ 2) చక్రవర్తి 3) వీవెన్ 4) బ్రహ్మం కందుకూరి (http://kandukuri.wordpress.com) 5) క్రాంతికుమార్ (కలల బాటసారి కవితా పధం) 5) పవిత్రన్ 6) దాట్ల శ్రీనివాసరాజు (హరివిల్లు) 7) కౌటిల్య (విశ్వనాధుని కౌటిల్యుడు) 8) నాగమురళి ( మురళీగానం) 9) శంకర్ (అంచేత నే చెప్పొచ్చేదేమంటే). స్టాల్ సందర్శుకుల సందేహాలను ఇ-తెలుగు కార్యకర్తలు నివృత్తి చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
indaka velli vacchanu chaala bagunnadi, manchi manchi books teesukunnannu
ivala vella kunte ee samvatsaramlo marokati miss ayyanane feeling migiledemo mee post choosthe
unnadi unnatlu blale chuparu chepparu nice
thanks
?!
కామెంట్‌ను పోస్ట్ చేయండి