మంగళవారం, జనవరి 31, 2012

హైదరాబాదులో వికీ జన్మదిన వేడుక విశేషాలు - జనవరి 2012


                                   మన జ్ఞాన భండాగారం -  మన ఉమ్మడి ఆస్తి

జనవరి 29, 2012న హైదరాబాదులో  వికీపీడియన్ లు వికీ జన్మదిన వేడుక ఉత్సాహంగా జరుపుకున్నారు.  ఈ సమావేశ విశేషాలు సాక్షి, ఆంధ్రజ్యొతి  దినపత్రికలలొ వచ్చాయి.

సాక్షి దినపత్రిక
హైదరాబాదు సంచిక
వికీ లో ఎక్కువ దిద్దుబాట్లు చేసినందుకు విశిష్ట వికీపిడియన్ గా వీవెన్, బహుమతినందుకున్నారు. మొత్తం 13 బహుమతులను కినిగె.కాం వారి సౌజన్యంతో వికిపిడియన్ల కు ఇచ్చారు.
పూర్తి వ్యాసం కింద గొలుసులో చదవండి.

'వికీ' లో తెలుగు లెస్స అనిపిద్దాం
http://epaper.sakshi.com/apnews/Hyderabad-City/31012012/6


Click on the Telugu images to enlarge


సాక్షి సౌజన్యంతో


ఆంధ్రజ్యోతి  దినపత్రిక

హైదరాబాదులో వికీపీడియ  11వ వార్షిక వేడుక

ఆంధ్రజ్యోతి  దినపత్రిక  Main edition లో  ఆంధ్రప్రదేష్, కర్ణాటక ఇంకా తమిళ్‌నాడు  ల లో 21 editions లో హైదరాబాదులో జరిపిన వికీ జన్మదిన వేడుకల వార్త ప్రచురితమయ్యింది.

http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2012/01/31/index.shtml



ఆంధ్రజ్యోతి  సౌజన్యంతో


ఈ సమావేశపు మరిన్ని ఛాయాచిత్రాలు దిగువ  గొలుసులో చూడవచ్చు.

https://picasaweb.google.com/115779731434350218592/WikiBirthdayCelebration2012HyderabadMeeting#



శుక్రవారం, జనవరి 27, 2012

వికీపీడియా: సమావేశం/వికీ జన్మదినం వేడుక 2012


జనవరి 15 వికీపీడియా పుట్టినదినం. 2001 సంవత్సరంలో ఇదే రోజున వికీపీడియా, ప్రజాసేవార్ధము అంతర్జాలమున వెలువడినది. ప్రపంచమంతా, భారత్ తో సహా గత సంవత్సరము 2011లో, వికి 10 వ పుట్టినరోజును, వికీ అభిమానులు ఎంతో ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు. వికీని చదివే పాఠకులు దిన దినానికి పెరుగుతున్నారు. ఇప్పుడు వికీ 11 సంవత్సరములు  పూర్తిచేసుకుని 12 సంవత్సరములో ప్రవేశించింది. ఇది ఆనంద సమయం. రండి, మనమంతా వికీ దినోత్సవాన్ని జరుపుకుందాము.
ఎప్పుడు - 29 జనవరి 2012 సాయంత్రం 4 గంటలకు
 
మిగతా ఇక్కడ చదవండి.

గురువారం, జనవరి 05, 2012

బ్లాగులు- వ్యాఖ్యలు -14




 

 జంగిల్ మె మోర్ నాచా, కిస్నే దేఖా? మైనె దేఖా, యె తస్వీర్ లియా

మానస్ జాతీయ ఉద్యానవనం, అస్సాం లో పురి విప్పి నాట్యం చేస్తున్న నెమలి - వెనుక ఒక అడవి ఏనుగు  

Photo: cbrao 

‘నెంబర్‌ వన్‌ పుడింగు’ కాదు! ‘నెంబర్‌ వన్‌ బెగ్గింగ్‌’!!

 సమీక్షకుడి విమర్శ సహేతుకమే. నామిని బాంక్ పేరు, నంబరు ఇవ్వాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది. నామిని కి ఈ పుస్తకం తనకున్న మంచి పేరును బాగా నష్ట పరిచింది. తుమ్మపూడి -సంజీవదేవ్ ఆత్మకధ (http://deeptidhaara.blogspot.com/2011/04/blog-post_9343.html) పుస్తకానికి నామిని ప్రూఫులు దిద్ది, చెన్నై లో పుస్తక ముద్రణగావించి తనవంతు సహకారిన్నిచ్చారు. ఈ సమీక్షలో నామిని గతం లో చేసిన మంచి పనులనుదహరిస్తే బాగుండేది.

http://pustakam.net/?p=7472



" గుడివాడ వైభవం " పుస్తక ఆవిష్కరణ విశేషాలు


" గుడివాడ వైభవం " పుస్తక ఆవిష్కరణ  విశేషాలు  కళ్లకు కట్టినట్లుగా  తెలియపరచినందులకు ప్రమోదం. తొలుత ఛాయాచిత్రంలో ఒకరి చేతిలోనే పుస్తకం చూసి వైరుధ్యాన్ని గమనించాను. అందుకు  కారణం మీ నివేదికలో  తెలిసింది.  గుడివాడ విశేషాలు  మీ పుస్తకంలో ఆవిష్కృతమయ్యాయని ఆశిస్తాను. ఈ నివేదికలో కొన్ని ముద్రారాక్షసాలున్నాయి. ఉదాహరణకు పత్యంసం, పత్యంశం (పాఠ్యాంశం),  ప్రిసిపాల్ (ప్రిన్సిపాల్), ప్రక్ష్కులను అలా రిమ్చాయి (ప్రేక్షకులను అలరించాయి), కర్స్పందేంట్ (కరస్పాండెంట్)  వగైరా.  సవరించకోరుతాను. ఉపయుక్త  పుస్తకాన్ని వెలువరించినందులకు అభినందనలు.


http://tataramesh.blogspot.com/2011/06/blog-post_25.html



ప్యారిస్ లో నా అనుభవాల గురించి, ఆదివారం సాక్షిలో…


కళలకు కాణాచి ఐన  పారిస్ నగరం ఎన్నో  కళల సంగ్రహాలయాలకు నిలవు. ప్రఖ్యాత చిత్రకారులైన పికాసొ, వాంగాగ్  ల సంగ్రహాలయాలు పారిస్ నగరంలో ఉన్నాయి. Montmartre లోని Place du Tertre వద్ద మరియు Ile de Cité కు దగ్గర లోని వంతెనలపైన వీధి చిత్రకారులు పారిస్ లో మరో ఆకర్షణ.  పారిస్ వీధులలో నడవటమే ఛాయాచిత్రకారులకు ఒక పండగలా ఉంటుంది. డిస్కవరి ఛానెల్ సర్వే ప్రకారం  పారిస్ ప్రపంచంలోనే రసమయ, శృంగార పట్టణాలలో ప్రధమ స్థానాన్ని సంపాదించుకుంది.  దురదృష్టవశాత్తు భారతీయ పర్యాటకుల పారిస్ పర్యటనలో   వర్సాయ్  (Palace of Versailles) రాజభవంతి ఇంకా పక్కనే ఉన్న అందమైన పూల తోటలు ఉండనే ఉండవు. ఈఫిల్ ను ఈ పర్యటనలో,  దగ్గరినుంచి చూడక పోయినా, శ్రీరాం పారిస్ వచ్చినప్పుడు మీ ఇద్దరూ కలిసి ఈఫిల్ పైకెక్కి పారిస్ నగర సౌందర్యాన్ని  వీక్షించకపోతే,   మన్మధుడు సినిమాలో చెప్పినట్లుగా ప్రపంచం మిమ్ములను తలుచుకోగలదు.


నిస్సందేహంగా పారిస్ ఖరీదైన నగరమే. అమెరికా తో పోలిస్తే, రెట్టింపు ఖర్చు చేసినా చిన్న హోటల్ గదితోనే సర్దుకు పోవాలి.


http://vbsowmya.wordpress.com/2011/06/27/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%AD%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%97%E0%B1%81/





బారా చుక్కి మరియు గంగా చుక్కి జలపాతాల అందాలు

కొన్ని చిత్రాలు బాగున్నాయి.  ఫోకస్ లో లేని చిత్రాలు సాధారణంగా ఎవరూ ప్రచురించరు. ఈ చిత్రమాలికలో ఫోకస్ లో లేని కొన్ని చిత్రాలు ఎందుకు ప్రచురించారో తెలియటంలేదు.


http://arkasomayaji.blogspot.com/2011/06/blog-post_29.html



హప్పుడే హారు నిండి హేడులోకొచ్చేసింది...హాచ్చర్యంగా!


తెలుగువారి అభిరుచుల దర్పణమైన మాగంటి. ఆర్గ్ వెబ్ సైట్  Sweet 16 పూర్తి చేసుకున్న శుభ సందర్భపు శుభాకాంక్షలు అందుకోండి.

http://janatenugu.blogspot.com/2011/06/blog-post_28.html



నచ్చిన డ్యూయెట్  


ఎన్నమ్మో నడకిరతే  -చిత్రం సందకొజి  ఈ పాట విడీయో యుట్యూబ్ లింక్  భారత దేశం లో  పనిచేయదు. ఈ పాట ఇక్కడ వినవచ్చు.
http://www.muzigle.com/track/ennamo-nadakkirathe


http://neelimeghaalalao.blogspot.com/2011/07/blog-post.html



పక్షిచూపు

కవిత్వం ఉద్భవించటానికి ఉత్తేజం కావాలి. ఒక ప్రేరకం కావాలి. ఇలాంటి ప్రేరణ పక్షి నుంచి కవికి అందిందని కవితలో చక్కగా వ్యక్తమైంది. ఎం.ఎఫ్.హుస్సేన్ గారి స్మృతిలో వ్రాసిన కవితలో హుస్సేన్ గారి బొమ్మో లేక వారు గీసిన చిత్రమో కూడా ఉంటే బాగుంటుంది.


http://kaviyakoob.blogspot.com/2011/07/blog-post_05.html



ఆ పూట మున్నేరు పాడలేదు!


“అవును, మంచి కవిత్వం రాయాలంటే నువ్వు మంచి ప్రకృతిలో వుండాలి. కాస్త నీళ్లూ, కాసిని చెట్లూ, కొన్ని పక్షులూ...వీటితో నీకు దోస్తీ కుదరాలి.” -దాశరధి  

అవును, కవికి ప్రేరణ కావాలి.  ఇది తెలిసిన వ్యక్తులు, వస్తువుల నుంచైనా లేక అచల పర్వతాలైనా, గల గలా పారే సెలయేరైనా  లేక  మరువరాని స్మృతులు నుంచైనా.  మదిర, మగువ  లతో ఉత్తేజితుడై గాలిబ్ ఎన్నో మధుర గీతాలు వ్రాశాడు. దాశరధి జ్ఞాపకాలు మధురంగా ఉన్నాయి.


http://www.newaavakaaya.com/index.php?option=com_content&view=article&id=372%3Aaa-poota-munneru-paadaledu-dasarathi-rangacharya&catid=58%3Avyasaalu-essays&Itemid=1



తన్నేరు, తరిమేరు
       
“ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నిలవదు. కారణం, కుల పరంగా అవమానిస్తే ఆ చట్టం వర్తిస్తుంది.” -శివరామప్రసాద్ కప్పగంతు
ఆంధ్ర జ్యోతి దినపత్రిక కార్యాలయం పై దాడి తర్వాత, శవ ఊరేగింపు లో పాల్గొన్న కారణంగా ఆ పత్రికా సంపాదకుడు శ్రీనివాస్ (నిజానికి అణగారిన బడుగు వర్గాలపై ఎంతో సానుభూతి ఉన్నవాడు, వారి అభ్యుదయానికి కృషిచేసినవాడు) జైలు పాలయ్యాడు. తను కులపరంగా ఎవరిని తిట్టలేదు. ఊరేగింపులో పాల్గొనటమే ఆ సంపాదకుడి నేరంగా అభియోగం ఆపాదింపబడింది.


http://anilroyal.wordpress.com/2011/07/22/%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b1%81-%e0%b0%a4%e0%b0%b0%e0%b0%bf%e0%b0%ae%e0%b1%87%e0%b0%b0%e0%b1%81/

ఆదివారం, జనవరి 01, 2012

హెలీకాప్టర్ లో బెంగళూరు యాత్ర

నోకియా ఆహ్వానం పై బెంగళూరు ను ఆకాశం నుంచి చిత్రించే అవకాశం ఛాయాచిత్రకారుడు విను థామస్ కు  కలిగింది. ఆ చిత్రాలు మీరూ చూడండిక్కడ.