ఆదివారం, సెప్టెంబర్ 17, 2006

పులిరాజుకి ఐడ్స్ AIDS వస్తుందా?





పులిరాజుకేమిటి వాడిబాబు కైనా వస్తుంది ఐడ్స్, సామాజిక కట్టుబాట్లు తప్పితే, తగిన జాగ్రత్తలు తీసుకొకబొతే. ఇంతకీ మన పులిరాజు ఏమయ్యాడు? చనిపొయాడు. ఎలా? కొంపదీసి AIDS వచ్చిగాని చనిపోలేదు గదా!

ఘనత వహించిన మన ప్రభుత్వం వారే పులిరాజును చంపేసారు. పర్యవసానం ఏమవుతుంది? అమెరికా లో ఆఫ్రికన్ - అమెరికన్ స్త్రీ పురుషులలో ప్రతి ముగ్గురిలో ఒకరికి మరణం ఈ భయంకరమైన ఐడ్స్ ద్వారా సంభవిస్తుంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా 38.6 మిలియన్ ప్రజలు ఈ AIDS వ్యాధితో బాధ పడుతున్నారు. భారత దేశంలో 5.7 మిలియన్ ప్రజలు ఈ వ్యాధితో ఉన్నట్లు అంచన. ఇక రాష్ట్రాల విషయానికొస్తే AIDSలో ఆంధ్ర ప్రదేష్, గొవా, కర్నాటకా రాష్ట్రాలు దేశంలో ప్రధమ, ద్వితీయ మరియు త్రుతీయ స్థానాల్ని కలిగిఉన్నాయి. ప్రపంచ దేశాలకు AIDS మందులు ఎగుమతి చేసే భారతదేశంలో, బీదవారైన, ఈ వ్యాధిగ్రస్తులకు సరైన మందులు అందుబాటులో లేవు.

ఈ వ్యాధి గురించి ప్రజలకే గాదు, చట్టాలు చేసే సర్కారు శాఖలకూ సరైన అవగాహన ఉందా? మీకు తెలుసా? 1999 లో కర్నాటక పోలిస్ వ్యవస్థ లో కె.రమేష్‌రావు ఎంపిక అయినప్పటికి, 1994 లో చేసిన చట్టం వలన, తనకు AIDS ఉన్నందువలన ఉద్యోగార్హత కొల్పోయాడు. అయితే Karnataka Administrative Tribunal ఈ చట్టం చెల్లదని 2005లో తీర్పు చెప్పింది. పోలిస్ అధికారులు చట్టాన్ని గౌరవిస్తామని రమేష్ రావు కి ఉద్యొగం ఇస్తామని చెప్పారు.

ఈ వ్యాధి కి గురైన ఎంతోమంది ప్రజల అనాదరణకు గురౌతున్నారు. చికిత్సాలయా ల్లో కూడ ఈ రొగులపట్ల సరైన అవగాహన ఉన్నట్లు కనిపించదు. AIDS వ్యాధి సోకిన పిల్లలకు ప్రత్యేక అనాధ శర ణాలయాల్లొ ఆశ్రయమిస్తున్నారు. వీరికి విద్యాలయాలు ప్రవేశం నిరాకరిస్తున్నాయి. ప్రజల్లో ఈ వ్యాధిగ్రస్తులపట్ల ఎన్నో భయాందోళన లున్నాయి.



ఫ్రభుత్వం ఈ వ్యాధి చికిత్సకు, నివారణకు ఇంకా ప్రజల్లో AIDS గురించిన అవగాహన కలిగించే పనులు ఎన్నో చెయ్యల్సి ఉంది. మన తెలుగు సీరియల్స్‌లో, చనిపొయిన నాయకుడు, మరల బతికి వచ్చినట్లుగా, పులిరాజును మళ్లా ప్రజల్లోకి తీసుకు రావలసిన అవసరం కనిపిస్తోం ది. లేకుంటే ఈ వ్యాధి విశ్వరూపానికి జాతి నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉంది. పులిరాజా! నీకు స్వాగతం పలుకుతున్నాం.

2 కామెంట్‌లు:

C. Narayana Rao చెప్పారు...

నిజమే,పులిరాజుని బతికించి, AIDS అజ్ఞానాన్ని చంపాలి!

అజ్ఞాత చెప్పారు...

Yeah, rightly said. That campaign should start again.

కామెంట్‌ను పోస్ట్ చేయండి