శుక్రవారం, సెప్టెంబర్ 15, 2006

కవిరాజు త్రిపురనేని పురస్కారము


మిత్రులు, శ్రీ ఐ. మురళీధర్ కు ధర్మనిధి పురస్కార ప్రకటన వెలువడగానే నా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వారికి అభినందనలు తెలిపాను. పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం, హైదరాబాదు వారి 2005 ధర్మనిధి పురస్కారాల ప్రధానొత్సవం 13-09-20006 సాయంకాలం 6 గంటలకు. వేదిక: విశ్వవిద్యాలయ ఆడిటోరియం,పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాదు.

ఈ పురస్కారాలను విభిన్న రంగాలలో కృషి చేసిన పలువురు ప్రముఖలకు అందించబొతున్నారు. ప్రతి బహుమతినీ ఆయా రంగాలలో కృషి చేసి పేర్గాంచిన విశిష్ట వ్యక్తుల పేరు మేదుగా ఇవ్వబొతున్నారు. మిత్రులు మురళీధర్‌కు లభించబొతున్నది కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి స్మారకపురస్కారం. ఈ సందర్భంగా కవిరాజుగారి గురించి నాకు తెలిసింది రాస్తాను.

కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదర గారు హేతువాది, సంఘసంస్కర్త, మాత్రు దేశాభిమా ని, స్వతంత్ర సమర యోధుడు, అవధాని, కవి, రచయిత. కులాభిమానం వలదన్నారు. తన పేరు లోని చౌదరి తీసివేసి, అంటరానితనం తప్పన్నారు.
ఈ కులాలకు ప్రాచీన గ్రంధాలలో ఆధారాలు లేవని ఇవి కేవలం పురోహితవర్గాల కల్పనని వారిపై ధ్వజమెత్తారు. తెనాలి Municipal Chairman గా ఉన్నప్పుడు జంతుబలులు దురాచారమని ఆపించారు. ఈ కారణంగా Municipality లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపొయాక, ఎన్నికలలో మరల పోటీ చేసి గెలిచారు. గాంధిగారు తెనాలి వచ్చినప్పుదు పౌర సన్మానం చేసారు. ఉప్పుసత్యాగ్రహానికి తనవంతుగా ప్రొత్సాహాన్నిస్తూ బహుళ ప్రాచుర్యం పొందిన ఈ గేయం రాసారు.

వీరగంధము తెచ్చినారము
వీరుడెవ్వడొ తెల్పుడీ
పూసిపోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో

ప్రస్తుత వివాహక్రతువు ఖర్చుతో గూడినదని, దాన్ని సరళీకరిస్తూ వివాహ విధి అనే పుస్తకాన్ని రాయటమే కాక తనే స్వయంగా పౌరోహిత్యం వహిస్తూ ఎన్నో వివాహాలు ఆధునికంగా చేసారు. వీరి ముఖ్య రచన సూతపురాణము. ఆయన ఒక Iconoclast. విశ్వనాధ సత్యనారాయణ శంబూక వధను సమర్ధిస్తూ వేన రాజు రాస్తే, కవిరాజు దాన్ని వ్యతిరేకిస్తూ ఖూని రాసారు.
రామస్వామి న్యాయవాది. ఆయన తనకు జస్టిస్ పార్టి తో ఉన్న సంబంధంతో పెద్ద స్థాయి ఉద్యోగం పొందే అవకాశం ఉన్నప్పటికీ వలదన్నారు. రైతు,దీనజన పక్షపాతిగా వారి సేవ నే తన మార్గంగా ఎంచుకొన్నారు. మానవసేవే మాధవసేవ అని నమ్మారు. చూడండి...

మలమల మాడు పొట్ట , తెగమాసిన బట్ట ,కలంతపెట్టగా
విలవిల యేడ్చుచున్న నిఱుపేదకు జాలిని జూపకుండ, ను
త్తలపడిపోయి, జీవరహితంబగు బొమ్మకు నిండ్లు వాకిళుల్
పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధవదాన్యుల నిచ్చమెచ్చెదన్.

మా మతం గొప్పదంటే కాదు మా మతం గొప్పదని వాదులాడే మతొన్మక్తులను ఈసడిస్తూ ....


చం. ఒకరుడు 'వేదమే' భగవ దుక్తమటంచు నుపన్యసించు నిం
కొకరుడు 'బైబిలే' భగవదుక్తమటంచును వక్కణించు, వే
రొంకరుడు మా ' ఖొరాన్ ' భగవదుక్తమటంచును వాదులాడు, నీ
తికమక లేల పెట్టెదవు? తెల్పగరాదె నిజంబు నీశ్వరా.

కవిరాజుకు వారి సేవలకు గుర్తింపుగా, 1940లో గుడివాడ ప్రజానీకము గజారోహణ సన్మానము గావించిరి. వీరికి గోపిచంద్,గోకులచంద్ కుమారులు. వీరు కూడా సాహితీ రంగంలో పేర్గాంచినారు.
కవిరాజు జననం 15 జనవరి 1887.
1943 జనవరి 16న కీర్తిశేషులైనారు.

మరింత సమాచారానికై చూడండి...

http://andhrajyothy.com/editshow.asp?qry=/2006/jan/13edit3
http://tinyurl.com/pnu4l
http://www.freeindia.org/dynamic/modules.php?name=Contentpa=showpagepid=459
http://kaviraju.blogspot.com/


కవిరాజు త్రిపురనేని పురస్కార మహోత్సవము.
చిత్రంలో ఎడమనుండి సినిమా గేయ కవి వేటూరి,ఆర్థిక మంత్రి రోసయ్య, విశ్వవిద్యాలయ ఉపాద్యక్షులు మంజులత ,హేతువాది మురళీధర్. Photo by cbrao


మరి కవిరాజుపేరున సన్మాన గ్రహీత ఐన మిత్రులు మురళిధర్‌గురించి ఇప్పుడు చెప్తాను. 1977లో అబ్రహాం కొవ్వూర్ భారత పర్యటనతో ప్రభావితులై, హేతువాదిగా మారారు. కులం పెరుతో గుర్తించబడటం ఇష్టం లేక తన పేరు లోంచి ' రెడ్డి ' తీసివేశారు. తను నమ్మిన సిద్ధాంతాలకు, తండ్రి చనిపోయిన తరుణంలో జరుపవలసిన కార్యక్రమాలాకు మధ్య వైరుధ్యాలవలన, ఆ కర్మకాండను వారి చిన్నాన్న జరిపారు. వీరి రక్తం అరుదైంది కావటంతో (O -ve) హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తూనే రక్తదానానికై పరుగెడతారు. ఇంతవరకూ 23 సార్లు రక్తదానం చేశారు. వీరి తండ్రిగారి కండ్లను నేత్రదానం చేసారు. వీరి ఇంటిల్లిపాదీ నేత్రదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.


ఆర్ధిక మంత్రి రోసయ్యగారి చేతులమీదుగా సన్మానం. Photo by cbrao.

తెలుగులో హైకూలు రాశారు. పుస్తకాల ముద్రణలో నవ్యతను, అందాన్ని తెచ్చారు. సంజీవదేవ్, యెలవర్తి రోసయ్య ఇంకా ఎం .ఎన్ .రాయ్ చిత్తరువుల పుస్తకాలను ఎంతో అందంగా వెలువరించారు. Rationalist Voice మాస పత్రికకు ఏడు వత్సరాలుగా సహ సంపాదకుడిగా ఉన్నారు. FARA (Federation of Atheist, Rationalist and Humanist associations), CFII (Center for Inquiry India) తరఫున నవ్య మానవతావాద సిద్ధాంతాల ప్రాచుర్యానికై పలు సభలు నిర్వహించారు. హేతువాద పుస్తకాలు ప్రచురించారు. వ్యాపారంలో సమయాభావలేమి ఉన్నా, హేతువాద కార్యక్రమాలకు ఎలాగోలా వీలు చేసుకుంటారు.



సన్మాన పత్రం. Photo by cbrao.

3 కామెంట్‌లు:

Raghu చెప్పారు...

naa blog update chesaanu... with my travel experiecnes...

Naga చెప్పారు...

ఇటువంటి ఉత్తముని గురించి తెలిపినందుకు మీకు వందనాలు.

అజ్ఞాత చెప్పారు...

A well deserved award to a wonderful, accomplished humanist.
Hearty Congratulations!!
Ramaraja Yalavarthi

కామెంట్‌ను పోస్ట్ చేయండి