సోమవారం, నవంబర్ 13, 2006

తెలుగు వికితో తిప్పలు




కొన్ని నెలల క్రితం వికిలో సభ్యత్వం నమోదు చేసుకొన్నా. మరిచిపోయా. చేసిన పని = 0 చెయ్యల్సింది = చాలా
నాలాగా ఎందరో అని తృప్తి పడాలా? అసలు వికిలో ఏం జరుగుతుంది? నాకు తెలియాలి. సభ్యత్వం తీసుకొన్నాక ఒక సభ్యుడికి క్రియా నిర్దేశిక సూత్రాలు ఎలా అంద చేయాలి? ఎలా చేస్తే కొత్త సభ్యులు వికిని మరువక తాము చెయ్యగలిగిన పనిని చేస్తారు అన్న విధంగా మన BUREAUCRATS అలోచిస్తున్నారా అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది.

తెలుగు వికి పటిష్టం కావటానికి మరి ఏమి చెయ్యాలి?
Bureacrats, Administrators కొత్తగా చేరిన సభ్యుల Data Base సమర్ధంగా ఉంచాలి. ఈ Data Base సహాయతం తో కొత్త సభ్యుల e-mail చిరునామాలకు స్వాగత సందేశాలు పంపాలి. కొత్త సభ్యుల Academic Qualifications ఇంకా వారి ప్రత్యెక నిపుణతలు, అభిరుచులు తెలుపమని కోరాలి. ఇలా సేకరించిన విషయాలు మరలా Data Base కి ఎక్కించే ఏర్పాటు చేసుకోవాలి. తెలుగు వికిని Navigation ఎలా చెయ్యాలో చెప్పాలి. వికిలొని Administrative hierarchy గురించి వివరించాలి. వ్యాసాలు ఎలా మొదలుపెట్టాలో కొన్ని ఉదాహరణలు ఇవ్వాలి. కొత్త సభ్యుల సందేహాలకు ఎవరిని సంప్రదించాలో చెప్పాలి. ఇదంతా e-mail రూపంలో జరగాలి. e-mail ఎందుకు అంతా వికిలో చెప్తాం అంటే కొత్త సభ్యుడికి అక్కడ ఆ సాలెగూడులో వెతుక్కునే ఓపిక, సమయంలేక ఎందుకొచ్చిన గొడవని వెరే సాలెగూట్లోకి వెళ్లే అవకాశం ఎక్కువుంటుంది.

సభ్యత్వం తీసుకున్న ఒక నెల తర్వాత సభ్యుడుని పరామర్శిస్తూ మరో జాబు రాయాలి. ఈ జాబులో వికి navigation గాని మరేదైనా ఇబ్బందులు సభ్యులు ఎదుర్కొంటున్నారేమో అని వాకబు చెయ్యాలి. తెలుగు వికి సభ్యులకు ఒక గుంపు ఉందనీ అక్కడ వారు తమ సమస్యలు రాయవచ్చనీ తెలియ చెయ్యాలి. ఒక తెలుగు బ్లాగు ప్రారంభించటానికిముందు చాలా మంది చావా కిరణ్ రాసిన పెద్ద బ్లాగు శిక్ష చదివినంత సులభంగా - తెలుగు వికి లో వ్యాసం రాయండిలా అన్న పెద్ద వికి శిక్ష మార్గ నిర్దేశనం చెయ్యాలి. పెద్ద వికి శిక్ష ను e-mail గా కొత్త సభ్యులకు పంపాలి. మీరు వ్యాసం ప్రారంభించండి, మీ వెంటే మేముంటాము, సహాయం చేస్తాము అనే భరొసా కొత్త సభ్యులకివ్వగలగాలి.

7 కామెంట్‌లు:

C. Narayana Rao చెప్పారు...

నిజమే నాకూ అ అనుభవమే మిగిలింది- ఆ సాలెగూడులో వెతుక్కునే ఓపిక, సమయంలేక ఎందుకొచ్చిన గొడవని వేరే సాలెగూట్లోకి వెళ్ళడం.తెలుగు వికి లో వ్యాసం రాయండిలా అన్న మార్గ నిర్దేశనం చేసే ఒక 'పెద్ద వికి శిక్ష' (చావా కిరణ్ రాసిన పెద్ద బ్లాగు శిక్షంత సులభంగా)అవసరం ఎంతైన ఉందని చక్కగా తెలిపారు.

చదువరి చెప్పారు...

రావుగారూ, మంచి సలహాలిచ్చారు. మీ సలహాలను పాటిస్తాం. ఒక విషయం.. వికీలో సభ్యుల ఈమెయిళ్ళు మనకు అందుబాటులో ఉండవు. వారికి మనం వికీలోని ఫారము ద్వారానే ఈమెయిలు పంపగలం.. అదీ వాళ్ళు దానికి ఇష్టపడితేనే! తమ అభిరుచుల్లో ఈమెయిలు అందుకోవడానికి ఇష్టపడినవారికి మీరన్నట్లు మెయిలు పంపే పనిలో ఉన్నాం.
ఇక వికీపీడియాను ఎలా చదవాలో, అక్కడ ఎలా రాయాలో చెబుతూ "5 నిమిషాల్లో వికీ" అనే ఒక పేజీ తయారుచేసాం.. (http://te.wikipedia.org/wiki/WP:5MIN)
మీరా పేజీ ఒకసారి చూసి అది మీకెంతవరకు ఉపయోగపడిందో రాయగలరు. అలాగే ఇంకా ఏమేం మార్పులు చెయ్యాలో సూచిస్తే చేద్దాం.. లేదూ ఆ మార్పులు మీరే చేసెయ్యవచ్చు. అసలు వికీ సైటుపై ఇలాంటి సద్విమర్శ ఇంతవరకూ లేకపోవడం బహుశా అది అలా కొరకరాని కొయ్యలా ఉండడానికి కారణం కావచ్చు. మీ సహాయంతో దాన్నో దారికి తేవచ్చనుకుంటాను.

అజ్ఞాత చెప్పారు...

రావుగారూ చాలా మంచి సలహా ఇచ్చారండి. ఇంకా ఇలాంటి విమర్శలే వికీ కొత్తవారికి సులభతరము చేయడానికి ఇలాంటి సలహాలే కావాలి. ఇప్పటికే వికిలో పనిచేస్తున్నవాళ్లకు దృష్టికి రాని విషయాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఇదివరకు ఇలాంటి సద్విమర్శల ఫలితంగానే చదువరి 5నిమిషాల్లో వికి అన్న వ్యాసం రాశారు. అయితే అది చదివి కొత్తవళ్లెవరూ తగిన సూచనలివ్వకపోవడముతో ఈ ప్రయత్నము ఎంతవరకు ఫలించిందో తెలుసుకునే అవకాశము లేకపోయింది.

ఇక పేరుకు నిర్వాహకులనే తప్ప వికిలో సభ్యులగురించి పెద్దగా వాళ్లు స్వఛ్ఛందంగా చెబితే తప్ప తెలుసుకునే అవకాశము లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్న కొత్త సభ్యుల జాబితా లాగా ఒక పట్టిక తయారుచేసి అందులో వాళ్ల సమాచారము ఇవ్వమని అడగవచ్చు. ఇంకా దీనిగురించి ఏమొచెయ్యొచ్చొ కొంచెం ఆలోచించి తిరిగి రాస్తాను.

ఇక వికిలో ఏం జరుగుతుందో, ఎక్కడ సహాయము అవసరమో, కొత్త విశేషాలేంటో వివరించడానికి నేనూ, (సమ్మతమైతే చదువరిగారూ) మా బ్లాగులను ఇంకా బాగా ఉపయోగానికి పెడాతాం. ఇతర వికిపీడియన్లు కూడా రాయాలనుకుంటే ఆహ్వానితులే.

cbrao చెప్పారు...

ఇది చక్కటి వ్యాసం.(http://te.wikipedia.org/wiki/WP:5MIN ) కొత్తగా సభ్యులుగా చేరిన వారికి ఈ వ్యాసం e-mail చేస్తున్నారా?

చదువరి చెప్పారు...

మీరన్నపని చేసేందుకు నేను సిద్ధమే, రవీ! చావా కిరణ్ ఈ సరికే మొదలుపెట్టేసారు చూసారు కదా. దాన్నే కొనసాగించి ఆ మొత్తం వ్యాసాలను వికీలోని ట్యుటోరియల్ పేజీలో పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. చావా కిరణ్ కు నేనదే సూచించాను. రవీ, రావు గారు మీరేమంటారు?

cbrao చెప్పారు...

కొత్త సభ్యులకు పంపే స్వాగత సందేశంలో Wiki Tutorial Page Link తప్పనిసరిగా పంపాలి. ఇంకా వికి యహూ గుంపు లో ఎలా సభ్యులుగా చేరవచ్చో వివరించాలి. ఇదంతా e-mail గా కొత్త సభ్యులకు తెలియ చెయ్యాలి.e-mail అంటే సభ్యుడి ఇంటికి మీరు స్వయంగా వెళ్ళటం. అదే మీరు ఇవన్నీ వికిలోనే జరిపేస్తే సభ్యుడిని మీ ఇంటికి వచ్చి వికి నిబంధనలు చదవమనటం. కొత్త సభ్యులతో ఇలా e-mail contacts పెట్టుకోకపోవటం వికి నిర్వహణలోని పెద్ద లోపం.

ఈ-నాడు లో వికిపై వ్యాసం అచ్చయ్యాక చేరిన కొత్త సభ్యుల Data Base ఎవరు నిర్వహిస్తున్నారు? ఎంతమందికి e-mails పంపారు?

అజ్ఞాత చెప్పారు...

అలాగే చదువరీ, మనం వికిపీడియా పాఠంలో పెడదాం. రావుగారూ, ఇప్పటివరకు సభ్యులను అత్యంత అవసర పరిస్థితుల్లో తప్ప ఈ-మైల్ ద్వారా ఎప్పుడూ చేరుకునే ప్రయత్నం చెయ్యలేదు.
కొత్తవారు చేరినప్పుడు ఒకసారి తగిన లింకులతో కూడిన ఈ-మైల్ పంపడం ఆచరణయోగ్యం. సభ్యత్వం తీసుకునేటప్పుడు ఈ-మెయిల్ చిరునామా ఇవ్వడం తప్పనిసరి కాదు. ఇచ్చినా వాళ్లు దాన్ని వాలిడేట్ చెయ్యపోతే వారికి ఈ-మెయిల్ పంపే అవకాశము లేదు. కానీ నెలవారి ee-మెయిళ్లు పంపడం కష్టం ఎందుకంటే మా దగ్గర సభ్యుల ఈ-మెయిల్ డేటాబేసు ఉండదు. వికిపీడియా అధిష్టానాన్ని కోరినా వారిచ్చే సమస్య లేదు (గోప్యతా ఇబ్బందులు). అయితే మనమొకసారి ఈ-మెయిల్ పంపి ఇంకా వికిపీడియా నెలవారి విశేషాలు తెలుసుకోవాలంటే ఫలానా చిరునామాకు తిరిగి టపా పెట్టండి అని కోరే అవకాశం మాత్రం ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి