సోమవారం, జూన్ 23, 2008

అంతర్జాల వీక్షణం -2

జీవిత పరమార్ధం ఏవిటి?
http://kottapali.blogspot.com/2008/04/blog-post_05.html
అంతర్ముఖం
http://gireesh-k.blogspot.com/2008/06/blog-post_18.html

మనము చేసే ప్రతి పనికి కర్త, కర్మ ఇంకా క్రియ దేవుడయితే, మనము ఏమి చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? మరి దీన్నెలా నమ్మడమూ అంటే, అంతా ఆయనే చేస్తాడు కనుక, మనం నమ్మడమూ నమ్మకపోవడమూ... అంతా ఆయన పనే. ఇంకోలా చెప్పాలంటే, ఇది వాస్తవం కనుక, మనం ఒప్పుకోవడమూ, ఒప్పుకోకపోవడమూ అన్నది అర్ధరహితము. నీవు చేసే పని విజయమో/ అపజయమో నీ చేతుల్లో లేదు. అంతా కర్మ అని సరిపెట్టుకొంటే జీవితంలో ముందుకు సాగేది ఎట్లా? ఈ విషయం పై కొత్తపాళి, గిరీష్ ల విచారధార చూడండి.


తెలుగు లిపికి CAPITAL LETTERS
http://www.telugupeople.com/discussion/article.asp?id=24379


“తెలుగు కూడు పెట్టదు కాని తెలుగు లేకుండా మనము ఉండలేము. కోటి విద్యలు కూటి కొరకే? అందుకె మన పిల్లలను ఇంగ్లీషు మీడియమ్‌ లో చదివించాము సంస్కృతము తీసుకుంటే ఎక్కువ మార్కులు వచ్చేయి, భవిష్యత్తు బాగుపడింది. ఇప్పుడు తెలుగు భాష కొరకు మనసు లాగింది, తెలుగు మాట విన్నప్పుడు ప్రాణము లేచొచ్చింది ప్రవాసాంద్రులకు. మన పిల్లలు తెలుగు మాట్లాడతారు కాని చదవటమే రాదు మనం నేర్పబోతే లిపి చాలా కష్టముగా వుంది, ఇంగ్లీషు లిపిలా వుంటే బాగుండును కదా?” - ఆకుల నాగేశ్వర రావు

తెలుగురాని ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు నేర్పటం ఎట్లా? హల్లులు, తలకట్టులు కలిపి 396 అక్షరాలను పిల్లలకు నేర్పటం కష్టం. ఈ సంఖ్యను 45 కు తగ్గిస్తే, 351 అక్షరములు తగ్గుతాయి. తక్కువ అక్షరాలతో తెలుగు నేర్పటం ఒక్కటే, భవిష్యత్లో, పిల్లలకు నేర్పించే మార్గమవుతుందేమో.

ప్రమదావనం లో కిరణాల వెల్లువ…
http://jyothivalaboju.blogspot.com/2008/06/blog-post_17.html

ప్రమదావనం క్రికెట్ లో Yup me వేసిన బంతికి జ్యోతక్క క్లీన్ బౌల్ అయి, పిల్ల కాకి అయిన, సన్నివేశం చూసి, మీరు అవాక్కవుతారు. Yup me వేసిన ప్రశ్నలు, లేవనెత్తిన అంశాలు ఆలోచింపచేస్తాయి. "ఈ బ్లాగులెంతకాలం ఉంటాయో, మీరు ఎంతకాలం జ్యోతక్కగా ఉంటారో ఎవరూ చెప్పలేరు. " - ఆమాటకొస్తే, ఏదీ ఎవరమూ చెప్పలేము. Yup me ఉద్యోగం ఒక వారం తరువాత వుంటుందో లేదో చెప్పగలమా? భూకంపం ఎప్పుడొస్తుందో, కనీసం వాన ఖచ్ఛితంగా ఎప్పుడొస్తుందో ఎవరైన చెప్ప గలరా?
పాఠకులు జ్యోతక్క అనగానే మురిసిపోవటం కాదు అంటూనే Yup me చురకలు, వ్యంగాస్త్ర బాణాలు సంధించారు. యప్ మి చెప్పిన విషయాలలో వాస్తవముండొచ్చు కాని వాటిని అవతలవారు బాధ పడేలా చెప్పనవసరం లేదు. నొప్పింపకనే చక్కగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసుండాల్సింది. అక్కకు ఎవ్వరూ తోడు రాక, ఒంటరిని చేయటం విచారకరం. ఐ.డి దొంగతనం అనేది సర్వ సామాన్యం అంటున్న యప్ మి అవి ఎలా జరుగుతాయో, దొంగిలించిన వారు ఈ ఐ.డి లను ఎలా దుర్వినియోగం చేస్తారో, నివారణ చర్యలు, దొంగతనం కు గురికాబడిన తరువాత ఏమి చెయ్యాలి వగైరాలు వివరించి ఉండాల్సింది.

కరుణశ్రీ కవిత్వం
http://www.aavakaaya.com/showArticle.aspx?a=liarticleId=437

ఆవకాయలో సాహిత్యం చూశారా? ఇందులో కరుణశ్రీ కవిత్వంలోని, పోతనలోని పద్యం పై, సతీష్ టి. యస్, విశ్లేషణ చూడండి.

మనసైన తన కన్నీరు...
http://oohalanni-oosulai.blogspot.com/2008/06/blog-post_20.html

అత్తా కోడళ్ల మధ్య సంబంధం సున్నితమైనది. ఒకే హృదయం కోసం ఇరువురూ తపన పడుతూ,కొండొకచోట ఘర్షణ పడూతూ కనిపిస్తారు. అత్త కోడళ్లు తల్లీ కూతుళ్లలా వుంటే జీవితం ఎంత మధురంగా ఉంటుంది? కాని దురదృష్టం -అత్తా కోడళ్ల మధ్య పొరపొచ్చాలు ఒక్కోసారి జీవితాన్ని దుర్భరం చేస్తాయి, అగ్నితో స్నానం చేయటానికి కోడలిను పురికొల్పుతాయి. ఈ కధలో ఒక భార్య, తన భర్త తో వినిపించే మనో సంవేదన చదవండి."ఎట్టి పరిస్థితుల్లోనూ "నీకు మీ అమ్మకావాలా? నేను కావాలా?" అన్న సమస్య ఇవ్వలేను. ఆ ఆలోచన కూడా నీకు రానివ్వకూడదనే నా తాపత్రయం. భోంచేసేటప్పుడు "జాంగిరీ కావాలా?? జిలేబీ కావాలా" అని అడగచ్చు కానీ, అన్నం కావాలా? కూర కావాలా? అని ఎవ్వరూ అడగరు. We both aren't options for you, we are absolute necessities for your life. ఆవిడ జీవితం ఇస్తే.. నేను దాన్ని పంచుకుంటున్నాను. ఆవిడ నిన్ను తయారు చేస్తే.. నిన్ను కాపాడుకుంటుంది నేను. నీ వల్ల ఆవిడా, నేనూ కూడా సంపూర్ణమైయ్యాము. అందుకే నీకు కష్టం కలగకూడదనే మా వేదన. అన్ని బంధాల్లానే మాకు కొంచెం సమయం కావాలి, ఒకరినొకరం అర్ధం చేసుకోవడానికి."
ఇది పూర్ణిమ తొలి కధ అయినా, కధ చెప్పిన తీరు అట్లా అనిపించదు. పాఠకుల మన్నలను పొందినదీ కధ.


క్ష్ క్ష్ క్ష్ క్ష్ క్ష్ గప్ చుప్...... ఇది రహస్యం
http://chinuku.blogspot.com/2008/04/shhhh-its-secret.html


ఐదేళ్ల సమీరా (ముద్దు పేరు సమ్మి ) స్కూల్ లో ఒక రహస్య కార్యక్రమంలో వుంది. కిరణ్ (తండ్రి) ఫోన్ చేసినప్పుడు, చిన్న గొంతుతో, రహస్యం చెప్తున్నట్లుగా, గుస గుస లాడింది. ఆ కార్యక్రమమేమిటి? దానిని రహస్యంగా ఉంచవలసిన అవసరమేమిటి? తెలుగమ్మాయి అపర్ణ (సమీరా తల్లి) ఆ రహస్యం ఛేదించగలిగింది. ఇంతకూ ఏమిటా రహస్యం? చినుకు బ్లాగు టపాలో తెలుసుకోండి. ఈ బ్లాగ్ Tagline: About Bringing up Baby

4 వ్యాఖ్యలు:

అబ్రకదబ్ర చెప్పారు...

'విపుల' మాస పత్రిక మొదటి పేజీలు చదివినట్లనిపిస్తుంది మీ అంతర్జాల వీక్షణలు చదువుతుంటే. Summaries బ్రహ్మాండంగా రాస్తున్నారు. అభినందనలు.

Gireesh K. చెప్పారు...

మాష్టారూ..నాకు ఏనుగెక్కినంత సంతోషంగా ఉంది. నేను బాగా మనసుపెట్టి రాసిన "సత్యం...శివం...సుందరం", క్రితం నెల మీ బ్లాగ్వీక్షణంలో చోటు చేసుకుంటుందనుకున్నా. కానీ, ఎందువలనో అది మీ కంట పడలేదు.

ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. కృతజ్ఞతలు!!!!

కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

మీ వీక్షణలు బాగునాయ్! కేవలం ఈ బ్లాగుల్నే ఎంచుకోవడం లో, మీ స్వీయానుభూతి ప్రాతిపదికా లేక ఇంకేమైనా ప్రమాణాలున్నాయా?

"అక్కకు ఎవ్వరూ తోడు రాక, ఒంటరిని చేయటం విచారకరం" అన్నారు. నిజంగా ఎవరూ తనని సమర్ధిస్తూ రాయలేదా? అసలు కామెంటు వచ్చిన ‘నిషిగంధ’ గారు కూడా వివరణ యిచ్చి సమర్ధించి నట్టున్నారు, కాస్త గమనించండి.

జ్యోతి చెప్పారు...

రావుగారు,,

ఇక్కడ yup me వేసిన బాల్ కి నేను క్లీన్ బౌల్డ్ అయ్యేంత సీన్ లేదండి. నాకు చాలా కోపం వచ్చింది. కాని కాని సంయమనంతో సమాధానం ఇచ్చాను. దానికి కూడా పెద్ద విశ్లేషణ చెసారు. నేను కూడా తాడేపల్లిగారిలా ఘాటుగా సమాధానం ఇవ్వగలను.కాని సభ్యత కాదు.అని నన్ను నేను కంట్రోల్ చేసుకునేసరికి రెండురోజులు పట్టింది. అసలు జ్యోతక్క అనేది కార్పోరేషన్ పదవా?? అందులో నేను ఎంత నొక్కేస్తున్నానని జనాలు కుళ్ళుకుంటున్నారు. ఎంతకాలం ఉంటానో అని. ఐనా ఇక్కడ మురిసిపోయేవాళ్ళు ఎవరు లేరు. మీరు కూడా నన్ను జ్యోతక్కా అని పిలుస్తారు.అలా పిలవమని నేను అడిగానా? నాకంటే పెద్దవారు వద్దు అన్నా మీరు అలాగే పిలుస్తున్నారు కదా. నేనేమైనా అన్నానా? ఇక్కడ నేను ఒంటరి అని ఎప్పుడు ఫీల్ కాలేదు. ఐనా పక్కింట్లో దొంగలు పడితే ,మనకెందుకు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. మనం జాగ్రత్తగా ఉంటే చాలు అనుకునే లోకం..

మన జన్మ వృత్తాంతం తెలియాలంటే నాకున్న మిడిమిడి జ్ఞానం బట్టి.... yup me, అన్నా, యెంకటలక్ష్మి అన్నా, యెదవ సచ్చినోడా అన్నా . అక్కడ సేవ్ అయ్యేది ఆ సిస్టం కి ఉన్న I.P అడ్రస్ తోనే కదా. విజ్ఞులు తెలపాలి. ఎలాగు నేను ఇంటర్‌నెట్‌లో పిల్లకాకి అని బిరుదిచ్చారు కదా.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి