సోమవారం, జులై 20, 2009

సంపూర్ణ సూర్యగ్రహణం చూద్దాము రండిComplete Solar Eclipse Photo courtesy: Luc Viatour

2009, జులై 22న మనము ఆకాశంలో ఒక అద్భుతాన్ని చూడబోతున్నాము. ఉత్తరభారత దేశంలోని పాట్న పట్టణానికి 25 కి.మీ. దూరంలో ఉన్న తరెగన గ్రామంలో ఈ అద్భుతాన్ని సూర్యగ్రహణం రూపంలో సంపూర్ణంగా చూడవచ్చు. భారతదేశం లోని మిగతా ప్రాంతాలలొ ఈ సూర్యగ్రహణాన్ని పాక్షికంగా చూడవచ్చు. ఆరు నిమిషాల 39 సెకండ్ల కాలం ఉండే, ఈ శతాబ్దపు సుదీర్ఘ సూర్యగ్రహణం జూన్ 13, 2132 దాకా మరలా జరగదు. గ్రహణ సమయంలో, సూర్య చంద్రుల ఆకర్షణ శక్తి వలన, గ్రహణ కక్ష్య మార్గంలోని దక్షిణ జపాన్ వద్ద కల సముద్రపు అంతర్భాగ రాతిపొరలలో కలిగే మార్పు వలన సునామి వస్తుందని కొందరు హెచ్చరిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు ఇంకా పత్రికలు సూర్యగ్రహణానికి, భూకంపాలకి ఎలాంటి సంబంధం లేదని సునామి హెచ్చరికలను తోసిపుచ్చారు. ఈ సూర్య గ్రహణం భారతీయ కాలం ప్రకారం ఉదయం 5.28 నుండి 7.40 దాకా ఉండగలదు. నాలుగు నిమిషాల సంపూర్ణ సూర్యగ్రహణాన్ని భారతదేశంలో ఉదయం 6.26 నుంచి 6.30 దాక వీక్షించవచ్చు. ఆసియా ఖండం తరువాత, పసిఫిక్ సముద్రం లోని జపాన్ దేశపు ఋయుక్యు దీవులలో సుదీర్ఘమైన (6 నిమిషాల 38.8 సెకనులు) సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది.

ఈ గ్రహణం వలన ఏమిటి ముప్పు? గ్రహణ సమయంలో ఆహారం తీసుకొనవచ్చునా? గర్భిణీ స్త్రీలపై ఎలాంటి ప్రభావం వుంటుంది? జనవిజ్ఞాన వేదిక , మానవ వికాస వేదిక, Center for Inquiry India ఇంకా
PLANETARY SOCIETY, INDIA వారి ఆధ్యర్వంలో హైదరాబాదు లో ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించటానికి ప్రత్యేక సౌకర్యం కలిగిస్తున్నారు. ప్రజలలో ఉన్న మూఢ నమ్మకాలను తొలిగించటానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో డా.క్రిష్ణయ్య (Orthopaedician), డా. టి.వి.క్రిష్ణారావు (E.N.T.Specialist), ఇన్నయ్య (Chairman, C.F.I.I.), టి.వి.రావు (State Convener, జనవిజ్ఞాన వేదిక) మొదలగు ప్రముఖులు పాల్గొంటున్నారు.

ప్రత్యేక ఫిల్టర్ కళ్లజోడుతో గ్రహణాన్ని వీక్షింపవచ్చు. ఈ కార్యక్రమాలు ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటలదాకా ఉంటాయి. ఆసక్తి కలవారు నెక్లెస్ వీధి లొని పీపుల్స్ ప్లాజా వద్దకు రావచ్చును. ఆ సమయంలో మీరు ఇంటిలో ఉంటే ప్రత్యేక కళ్లజోడు లేకుండా గ్రహణాన్ని చూడవద్దు. అలాచేస్తే కంటికి తీవ్ర హాని కలగకలదు.

ఈ గ్రహణం గురించి మరింత సమాచారానికై ఇక్కడ నుంచి ప్రత్యేక కరపత్రాన్ని దిగుమతి చేసుకొనవచ్చును.

1 వ్యాఖ్య:

Marxist-Leninist-Feminist Revolutionary చెప్పారు...

చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ గారి ఊరిలో కళ్ళకి కవచం లేకుండానే సూర్య గ్రహణం చూసాను. అప్పట్లో పల్లెటూర్లలో చాలా మందికి ఫిల్టర్ల గురించి తెలియదు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి