బుధవారం, సెప్టెంబర్ 23, 2009

మనకు తెలియని మన త్రిపురనేని గోపీచంద్


Tripuraneni Gopichand

మనకు ఈ రోజున్న ఆశయాలు, భావాలే 15 సంవత్సరాల తరువాత కూడా ఉంటాయా? ఉండవచ్చు లేదా వాటిలో కొన్ని మార్పులు రావచ్చు. జీవితం లో తారసపడే కొందరు వ్యక్తులు, అనుకోని సంఘటనలు మనపై తీవ్ర ప్రభావాన్ని కలుగచేస్తాయి కొన్నిసార్లు. ఈ పరిణామ క్రమంలో కమ్యూనిస్టులు, పెట్టుబడిదారులుగా, నాస్తికులు ఆస్తికులుగా ఇంకా ఆస్తికులు నాస్తికులుగా మారటం కద్దు. ఒక రచయిత రచనలు సంకలనం గా తీసుకువచ్చే సమయంలో, రచనలతోపాటుగా రచనాకాలం కూడా ఇస్తుంటారు సంపాదకులు. ఇది మంచి సంప్రదాయం. దీనివలన కాలంగడిచే కొద్దీ రచయిత ఆలోచనా విధానంలోని ఎదుగుదల లేక పురోగమనం మనకు గోచరించగలవు. గోపీచంద్ శతజయంతి సందర్భంగా , ఆయన రచనలు తాజాగా 10 సంపుటాలుగా వెలువడ్డాయి. వీటిలో గొపీచంద్ లో వచ్చిన ఆలోచనాధొరణిలోని మార్పులను మనము చూడగలమా? గోపీచంద్ తొలుత ఒక హేతువాది. త్రిపురనేని రామస్వామి రచనలు వీరిని తొలినాళ్లలో ప్రభావితం చేస్తే, జీవితపు తుది అధ్యాయంలో అరవిందుని భజనలొ గడిపారు. M.N.Roy అనుచరుడినుంచి అరవిందు భక్తునిగా రూపాంతరం చెందిన గోపీచంద్ జీవిత విశేషాలను మనకు అందిస్తున్నారు ప్రముఖ హేతువాది ఇన్నయ్య.

-రావు

Tripuraneni Gopichand

4 వ్యాఖ్యలు:

శ్రీకర్ చెప్పారు...

వీరి పుస్తకాలు నేను రెండు చదివాను కాని నాకు ఆయన గురించి పెద్దగా తెలియదు కాని ఇతని రచనలు నాకు నచ్చాయి. ఏ సాయిబాబా ? పుట్టపర్తినా లేక షిరిడి సాయిబాబా భక్తుడిగా మారాడా? నేను ఇతను పుట్టపర్తి బాబా కు భక్తుడంటె నమ్మ లేను.

కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

"దిగజారడం"ఏమిటి నాన్సెన్స్!!!

కాలక్రమంలో ఒక alternative జీవనవిధానాన్ని ఎంచుకున్నంతమాత్రానా, మన పద్దతేదో పెద్ద "పైన" ఉన్నట్లు...దాన్ని పాటించని వాళ్ళు ఏదో "దిగజారినట్లూ" అనుకోవడం మత మూర్ఖ్హత్వాన్ని,ఛాంధస భావాన్ని తలపిస్తోంది.

బొల్లోజు బాబా చెప్పారు...

కొన్ని విషయాలు వివాదాస్పదంగా ఉన్నాయి.

చాలా విషయాలు ఇప్పటి తరానికి అనవసరం అనిపిస్తుంది.

గోపీ చంద్ అంటే ఒక అసమర్ధుని జీవితయాత్ర, ఒక తత్వవేత్తలు, ఒక మెరుపులమరకలు,మాకూ ఉన్నాయ్ స్వగతాలు, ఒక పందిత పరమేశ్వరశాస్త్రి వీలునామా. అంతే నావరకూ అయితే అంతే. అంతకు మించి ఆలోచించే ఆశక్తీ లేదు అవసరమూ కనిపించటం లేదు.

రచయితైనా కవైనా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే ప్రతిబింబిస్తాడు.

ఇదీ అంతే.
ఇక ఆ రచనలలోని రాగ ద్వేషాలు ఏ ఏ వ్యక్తులవి అంటూ రంద్రాన్వేషణ కొంతమంది పాఠకులకు ఆశక్తి కలిగించినా, రససిద్దికి ఆటంకం అవుతుందన్న స్పృహ విమర్శకులకుండటం సముచితం.

భవదీయుదు
బొల్లోజు బాబా

Sai Paada Dhooli చెప్పారు...

I strongly suggest not to listen to these hethuvaadis. They are dangerous both to themselves and the society
As to the reason why Gopichand became Sai Baba devotee, below is the reason
http://www.saibharadwaja.org/books/saileelamruthamu/saileelamruthamu.aspx?page=144

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి