గురువారం, జనవరి 14, 2010

హైదరాబాదు అభివృద్ధికి కారణం అది ముఖ్యపట్టణం అవటం అన్నది అర్థరహితం


Photo courtesy: lazylump

అంతర్జాలంలో ఒక మిత్రుడి నుంచి ఈ కింది సందేశం నాకు అందింది.

A city won't develop just because it is made a capital. It's the geographical advantages of the city which makes its destination of choice.For example take New York state, its capital is Albany, a small city some where 200 mile away from New York City. Though Albany made NY's capital 200 years ago it is still a small city now. On average the top 20 big cities in US expanded 600% (population wise) while Albany expanded only 100% and look at the New York City,the worlds greatest city,it is not a capital,why it is developed so much?

It is baseless to say that Hyderabad is developed because it's made AP's capital.

మీరు ఏకీభవిస్తారా?

5 కామెంట్‌లు:

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

అమెరికన్ పెట్టుబడిదారీ వ్యవస్థకీ, ఇండియన్ పెట్టుబడిదారీ వ్యవస్థకీ మధ్య చాలా తేడా ఉంది. ఇండియాలో పారిశ్రామీకరణ కొన్ని ప్రాంతాలలో మాత్రమే జరిగింది. అందుకే ఇక్కడ కొన్ని ప్రాంతాలలో పెద్ద నగరాలు కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాలలో 90% మంది పల్లెటూర్లలోనే కనిపిస్తారు. హైదరాబాద్ నగరం నిజాం కాలంలో కూడా దేశంలో 5వ అతి పెద్ద నగరంగా ఉండేది. నిజాం హైదరాబాద్ ని మాత్రమే అభివృద్ధి చేసి మిగిలిన ప్రాంతాలని నిర్లక్ష్యం చేశాడు. అప్పట్లో హైదరాబాద్ జనాభా నాలుగు లక్షలు (సికందరాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ మునిసిపాలిటీలు కలపకుండా). గ్లోబలైజేషన్ కాలంలో వచ్చిన ఐ.టి. కంపెనీలు హైదరాబాద్, బెంగళూరు లాంటి కొన్ని నగరాలకే పరిమితమవ్వడం వల్ల దేశంలో ఈ నగరాలు తప్ప వేరే నగరాలు అభివృద్ధి చెందలేదు. ఇండియాలోని ఐ.టి. కంపెనీలకి ఎక్కువగా విదేశాల నుంచి ప్రొజెక్ట్స్ వస్తాయి. ఈ కంపెనీలని మహా అయితే విశాఖపట్నంలో పెట్టించొచ్చు కానీ రాజమండ్రి, కర్నూలు లాంటి చిన్న నగరాలలో పెట్టించలేము. ఐ.టి. సెక్టర్ వల్ల వచ్చే పెట్టుబడులు పరిమితమైనవి కాబట్టే ఐ.టి. సెక్టర్ వల్ల హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది. ఇండియాలో స్వదేశీ పరిశ్రమలు పెట్టకుండా విదేశీ దిగుమతుల మీద ఎక్కువ ఆధారపడడం జరుగుతోంది. అందుకే ఇండియా ఇంకా వ్యవసాయం పై ఎక్కువ ఆధారపడుతోంది.

Rao S Lakkaraju చెప్పారు...

Almost all state capitals in US are small towns. How are the state capitals in India?. That will be a good comparison.

అజ్ఞాత చెప్పారు...

ప్రతివిషయంలోను ఇండియానీ, యు.ఎస్.నీ పోల్చడం ఈమధ్య చదువుకున్నవాళ్ళకి ఒక అసంకల్పిత దురభ్యాసంగా పరిణమించింది. మనకి వలసపోవడానికి యు.ఎస్. తప్ప మఱింకేమీ లేకపోవడం వల్లననుకుంటా. అసలు ఏ విషయంలో ఇండియాకీ, యు.ఎస్.కీ పోలిక ఉందో నేను తెలుసుకోగోరుతున్నాను. అక్కడివాళ్ళూ రెండుకాళ్ళమీద నడుస్తారు. ఇక్కడివాళ్లూ రెండుకాళ్ళమీదే నడుస్తారు. అదొక్కటే నాకు గోచరించే పోలిక.

మన అభివృద్ధి నమూనా యు.ఎస్. అభివృద్ధినమూనాతో సరిపోలదు. మనది ప్రధానంగా ప్రభుత్వనిధులతో జఱిగే అభివృద్ధి. యు.ఎస్.ది ప్రధానంగా ప్రైవేట్ నిధులతో జఱిగిన అభివృద్ధి. అందుచేత అక్కడ కొన్ని నగరాలు ప్రభుత్వజోక్యం లేకుండా అభివృద్ధి చెంది ఉండవచ్చు. కానీ ఆ వాస్తవం ఇండియాకి వర్తించదు. ఇది అభివృద్ధికాన్సెప్టు పట్ల ఆయా ప్రజలకీ, ప్రభుత్వానికీ ఉన్న వైఖరుల మీద ఆధారపడినటువంటిది. మనది చాలా దశాబ్దాలపాటు వలసపాలనలోను, ఆ తరువాత సోషలిస్టు తరహా (ప్రభుత్వనియంత్రిత) అభివృద్ధి నమూనాలోను ఉన్న దేశమని మఱువరాదు. కనుక ఇక్కడి నగరీకరణ పూర్తిగా దానంతట అది జఱిగినది కాదు. ఇండియాలో రాష్ట్రరాజధానులు మాత్రమే స్థానికంగా మిహతా అన్నింటికంటే పెద్దనగరాలనేది కాదనరాని సత్యం. ఇది దానంతట అది జఱిగినది కాదు. రాష్ట్రప్రభుత్వాలు రాష్టంలోని మిహతా పట్టణాల కంటే తమ రాజధానుల్ని అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చాయనేది కూడా నిజం.

ఈ సత్యం ఇండియాకే కాదు, యూరప్‌కి కూడా వర్తిస్తుంది. అక్కడ కూడా రాజధానులే స్థానికంగా అన్నింటికంటే పెద్ద నగరాలు. If US stands out as an odd man, maybe it is the only one instance of its kind and therefore, can't be a general rule applicable universally, least of all to India.

--తాడేపల్లి

శివ చెరువు చెప్పారు...

క్షమించండి నాకు పెద్దగా అవగాహన లేదు.. కాని హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయ్యింది అని మీరు చెప్పి ఉంటె పోస్ట్ మరింత బాగుండేది..

అజ్ఞాత చెప్పారు...

మీరు వ్రాసింది శుద్ద తప్పు. ఇది అర్దంలేని పోలిక. అలా అయితే విజయవాడ అన్నిటికి మద్యలో ఉంది. కనీసం రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న వైజాగ్ అంత కూడా అబివృద్ది కాలేదే.....?

కామెంట్‌ను పోస్ట్ చేయండి