గురువారం, ఫిబ్రవరి 11, 2010

ఇది కలకాదు:వారణాసి నాగలక్ష్మి





మీరెప్పుడైనా వంకాయ పులుసు పచ్చడి తిన్నారా? ఒకసారి వంకాయ పచ్చడి రుచికి అలవాటైతే మరల మరల కావాలని మీరు అడిగి వేయించుకుంటారని నేను ఘంటా పధంగా వంకాయ మీద ఒట్టేసి చెప్పగలను. అలాంటి సీత లాంటి వంకాయ ను మొశాంటో రావణాసురుడు వచ్చి చెరబట్టి అపహరిస్తుంటే నా మనసు అతలా కుతలం కావటంలో ఆశ్చర్యమేముంది? వ్యాకులపడిన నా మనసు కుదుటబడేదెలా? ఎప్పుడు?

ప్రఖ్యాత రచయిత్రి వారణాసి నాగలక్ష్మి ఆంధ్రభూమి స్వర్ణోత్సవ కథల పోటీలో ప్రచురణకు ఎంపికైన కథ "ఇది కలకాదు", మిమ్ములను అబ్బుర పరిచే ముగింపుతో, సంపూర్ణ కధ దిగువ గొలుసులో చదవండి.

http://www.andhrabhoomi.net/priyadarshini/not-dream-061

2 కామెంట్‌లు:

Anil Dasari చెప్పారు...

అబ్బుర పరిచే ముగింపా?

అసలు అదో కథలా ఉందా! తెల్లోడు వంకాయ కూరెలా వండుతాడో రాసేస్తే అది కథైపోద్దా?? పైగా ఇది ఏదో పోటీలో ఎంపికైన కథా!!

హథవిధీ.

cbrao చెప్పారు...

@అబ్రకదబ్ర : మీ ఉత్తరం కధలగురించి కొన్ని మౌలిక ప్రశ్నలను రేకెత్తించింది. కధలెందుకు? సామాజిక ప్రయోజనానికా, వినోదానికా లేక అద్భుత కధా వైచిత్రితో అపరూప కధా శిల్పానికా? సామాజిక ప్రయోజనం లేని సాహిత్యం మనజాలగలదా? ఒక కధ చదివాక పాఠకుడు రచయిత ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ కధ రాశారు అన్న ప్రశ్న వేసుకోవాలి? రచయిత తన కధలో సామాజిక ప్రయోజనం కలిగించే కధాంశాన్ని ఎంచుకొని ఆ స్పృహ తో కధ రాస్తే ఆ కధ తన లక్ష్యం చేరకలదు. సత్వరం పరిష్కరించవలసిన సమస్యలపై రాసిన రచనలు, సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సజీవంగా వుంటాయి. రచయిత మనము చర్చిస్తున్న కధ రాసే సమయంలో, భారతదేశానికి రానున్న బిటి వంకాయ, ఆహార పంటల విషయంలో, మన దేశ స్వాతంత్ర్యానికి సంకెళ్లు బిగించేవిధంగా మహమ్మారిలా పొంచి ఉంది. ఏమరుపాటుగా ఉంటే బహుళజాతి వ్యాపార సంస్థల ప్రయోజనాలకు భారత ప్రజలు కొరముట్టు గా తయారయే ప్రమాదపు అంచులో ఉన్నారు. ఈ నేపధ్యంలో వ్రాసిన కధ "ఇది కలకాదు" . కధ వ్రాసే సమయానికి బిటి వంకాయల వ్యాపార సాగుపై మారటోరియం విధించటం అన్నది ఒక కల గానే ఉండి ఉండింది.

బిటి వంకాయ పై రచయిత్రి చంద్రలత ఎన్నో విజ్ఞానదాయకమైన వ్యాసాలను వెలువరించారు. ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి చేసిన రచనలివి. వచ్చే దారెటు పుస్తకావిష్కరణ సభలో ప్రముఖ స్త్రీవాద రచయిత్రి వోల్గా మాట్లాడుతూ "బహుళజాతి సంస్థలతో యుద్ధం అంటే మాటలు కాదు. మహిళలు గొంతువిప్పగలిగితే వీరిని ఆమడ దూరంలో ఉంచవచ్చు. మన రచయితలు ప్రతి ఒక్కరూ బిటి వంకాయను నిరసిస్తూ ఆ నేపధ్యంలో కధలు రాయాలిప్పుడు"అన్నారు.

కధా శిల్పంలో "ఇది కలకాదు" గొప్ప కధకానప్పటికీ, ఈ కధకు సామాజిక ప్రయోజనముందని, కధలు ఎంపిక చేసే న్యాయ నిర్ణేతలు అభిప్రాయపడి, కధను, ప్రచురణకు ఎంపిక చేసి ఉండవచ్చును.

కామెంట్‌ను పోస్ట్ చేయండి