మంగళవారం, ఆగస్టు 30, 2011

స్టాక్ మార్కెట్ల లో ఆటు పోట్లు

స్టాక్ మార్కెట్లు అతిగా అమ్ముడు పోయిన స్థితి నుంచి మెరుగుపర్చుకొందుకై, వచ్చిన ప్రస్తుత రాలీ నిలుస్తుందా? నిలుస్తే ఎన్నాళ్లు? నిఫ్టీ 5225 తాకితే వచ్చే తీవ్ర ప్రతిఘటన వల్ల మార్కెట్లు దక్షిణ పధంగా 4800 కు దిగువగా పయనించవచ్చని నిపుణుల అంచనా. స్టాక్ మార్కెట్లు 2008 లో లాగా మరో సారి పడే అవకాశం ఉందా? మార్కెట్ విశ్లేషకులు అవుననే అంటున్నారు. యూరప్, అమెరికా ల నిరంతరం పెరుగుతున్న అప్పులు, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగానికి, వినిమయ వస్తువుల గిరాకీ తగ్గటానికి కారణభూతమవగలదని అంచనా. BSE Sensex 14000 కు సమీప భవిష్యత్ లోనే రాగలదని అంచనా వేస్తున్నారు. బ్లూ చిప్స్ కొనుగోలుకు ఇది ఒక మంచి తరుణ మవగలదు. ఈ ఆర్థిక మాంద్యం 6 నుంచి -12 నెలల దాకా ఉండవచ్చంటున్నారు. పాశ్చాత్యా దేశాల ఆర్థిక పరిస్థితిలో అభివృద్ధి లేకున్నా, డాలర్ పడి పోయినా, బాంకులు దివాళా ఎత్తినా, BSE Sensex 2008 స్థాయికి 8000 వరకు పడవచ్చని మరో విశ్లేషణ. భారత దేశ పారిశ్రామికాభివృద్ధి మెరుగు పడినా, విదేశీ మదుపుదారులు, భారత మార్కెట్ల నుండి నిష్క్రమించటం వలన ఇలాంటి పరిస్థితి ఉత్పన్న మవగలదు. స్టాక్ మార్కెట్ల తీరు తెన్నుల పై సాంకేతిక విశ్లేషణకై ఈ వీడియో చూడండి. మదుపరుదారులు జాగరూకతో వ్యవహరించవలసి ఉంటుంది. మీ పెట్టుబడుల విషయం పై నిపుణుల సలహా తీసుకోండి.

2 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

బంగారం ధర పెరుగుతుంటారా?

cbrao చెప్పారు...

రాగి ధర పెరిగిన కొంతకాలం తర్వాత స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయి. రాగి వినియోగం పెరిగితే పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని ఒక అంచనా. స్టాక్ మార్కెట్లు పుంజుకుంటే బంగారం ధర తగ్గుతుంది. స్టాక్ మార్కెట్లు పడితే బంగారం ధర పెరుగుతుంది. బంగారం ధర తగ్గినప్పుడు, లేక ప్రతి రూ1000/- తగ్గుదలకు (10గ్రాములు) బంగారం కొంటూ ఉండవచ్చు. మీ స్టాక్ మార్కెట్ పెట్టుబడిలో కనీసం 10-15% బంగారం లో ఉంచండి. బంగారం గురించిన తాజా సమాచారం కొరకు కిట్కొ వెబ్ సైట్ చూడవచ్చును.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి