సోమవారం, ఫిబ్రవరి 06, 2017

పుట్టినరోజు: ఏక్ దిన్ కా సుల్తాన్

        Giant tree, Bhadra wildlife sanctuary, Chikmagalur, Karnataka     Pix: cbrao


ప్రేమతో, స్నేహంతో పలువురు బంధు, మిత్రులు పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు నేనో ముఖ్యమైన వ్యక్తిననే భ్రమలోకి నెట్టాయి. అవును ఈ రోజు నేను సుల్తాన్ ను. ముందుగా శుభాకాంక్షలు పంపిన వారందరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఒకప్పుడు పుట్టినరోజు ఉత్సాహంగా జరుపుకున్నది వాస్తవమే. అయితే వయసు పైపడుతున్నకొలదీ పుట్టినరోజులు జరపటంలేదు. నా షష్టిపూర్తి కూడా ఎంతో నిశ్శబ్దంగా జరిగింది. దీపావళికి టపాసులు కొనటం, కాల్చటం కూడా లేదు. ఉన్న సమయాన్ని మంచి పుస్తకాల సాంగత్యంలో గడుపుతున్నా. పుట్టినరోజు పండగ ఎందుకు జరుపుకోవాలి? జీవితంలో ఏమి సాధించాము? వచ్చే ప్రతి పుట్టినరోజు నన్ను మృత్యువుకు దగ్గరగా తీసుకెళ్తుందనే వాస్తవాన్ని నేను గుర్తించక పోలేదు.

ఈ ప్రపంచం నాకు చాలా ఇచ్చింది. మంచి బంధువులను, చక్కటి స్నేహితులను, సుఖమయ సంసార జీవనాన్ని, చక్కటి సంతానాన్ని ఈ జీవితంలో పొందాను.  కీ.శే. సంజీవదేవ్, దండమూడి మహీధర్, చలసాని ప్రసాదరావు వంటి మిత్రులను పొందగలగటం నా అదృష్టం. సమకాలీకులు ఇంకా వయసులో మాత్రం చిన్నవారైన లబ్ద ప్రతిష్టులైన చిత్రకారులు, ఛాయాగ్రాహకులు, పక్షిప్రేమికులు, రచయిత మిత్రులు ఎందరో నా జీవితంలో చైతన్యాన్ని నింపారు. ఇంత ఇచ్చిన ప్రపంచానికి ఏ విధంగా బదులు తీర్చుకోగలను?

ఈ మధ్య ఒక మిత్రుడు వాట్సప్ లో హృదయాన్ని తాకే కవితనొకటి పంపారు. ఆ కవితను మీతో పంచుకోవాలనిపించింది. చదివి ఆనందించగలరు.

When I will be dead

*"When I'll be dead.....,*
*Your tears will flow,..*
*But I won't know...*
 *Cry for me now instead !*

*You will send flowers,..*
*But I won't see...*
  *Send them now instead !*

*You'll say words of praise,..*
*But I won't hear..*
   *Praise me now instead !*

*You'll forget my faults,..*
*But I won't know...*
    *Forget them now, Instead !*

*You'll miss me then,...*
*But I won't feel...*
    *Miss me now, instead*

Moral......
Spend time with every person you love,
Everyone you care for.
Make them feel special,
For you never know when time will take them away from you......

1971 ముందు నా వ్యాసాలను, కథలను అచ్చుపత్రికలకే పంపే వాడిని. కారణం అంతార్జాల యాహూ గుంపులు, పత్రికలు అప్పట్లో ప్రాచుర్యంలో లేవు. ఉద్యోగ విరమణ తర్వాత కేవలం అంతర్జాలం లోనే నా రచనలు చేసాను. Biosymphony పేరు మీద ఒక యాహూ గుంపు నిర్వహించాను. పుస్తకం, సారంగా ఇంకా నా తెలుగు బ్లాగులు దీప్తిధార, పారదర్శి లో పెక్కు వ్యాసాలు ఉత్సాహంగా వ్రాసాను. సంజీవదేవ్ పుస్తకాలు మిత్రుల సహకారంతో ప్రచురించాను. సంజీవదేవ్ పేరు మీద ఫేస్బుక్ లో ఒక పుట నిర్వహిస్తున్నా. సంజీవదేవ్ వెబ్ సైట్ (http://sanjivadev.tripod.com/) నిర్వహిస్తున్నాను. తెలుగు, ఆంగ్ల వికిపీడియాలో వ్యాసాలు వ్రాసాను. ప్రముఖ హేతువాది ఇన్నయ్యగారి వెబ్సైట్ నిర్మించాను. భారత దేశపు ఇంకా ఆంధ్రప్రదేష్ ల Radical Humanism చరిత్ర తెలుసుకోవటానికి, సంప్రదించు స్థలంగా ఇది రూపుదిద్దు కొన్నది. (http://innaiahn.tripod.com/) నార్ల వెంకటేశ్వరరావు, రావిపూడి వెంకటాద్రి, ఇన్నయ్య గార్ల బ్లాగులు నిర్వహిస్తున్నాను. Birdwatchers Society of Andhra Pradesh (BSAP) లో రెండు సంవత్సరాలు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాను. ప్రకృతి, పక్షుల అధ్యయనం, యాత్ర పై ఆసక్తితో పెక్కు యాత్రలు చేసాను. ఇటీవలనే మిత్రులు దాసరి అమరేంద్ర గారి పుస్తకం "అండమాన్ డైరీ" కి పీఠిక వ్రాసాను. ఇందుకు నా అండమాన్ యాత్రానుభవం తోడ్పడింది.  ప్రస్తుతం సంజీవదేవ్ అముద్రిత రచనలతో ఒక పుస్తకం వెలువరించాలని సంకల్పం. ఈ పుస్తకానికి కావలసిన విషయ సేకరణ చేస్తున్నాను. ఈ పుస్తక ప్రచురణ తెలుగు సాహిత్యానికి మరిన్ని వన్నెలు తీసుకురాగలదని తలుస్తాను.

మీ అందరి శుభాకాంక్షలు నన్ను నేను ఒకసారి నా జీవితంలోకి తిరిగి చూసుకునేలా చేసాయి. అందుకు మీ అందరికి మరోసారి ధన్యవాదాలు.

మీ,
సి.బి.రావు



1 కామెంట్‌:

teluguvision.com చెప్పారు...

baagundhi mee way of writing, ila klupthamga raase vallu chaala rare ga untaaru

visit my telugu website

కామెంట్‌ను పోస్ట్ చేయండి