శుక్రవారం, డిసెంబర్ 24, 2010

హైదరాబాదు పుస్తక ప్రదర్శన -8వ రోజు

ఈ రోజు జరిగిన పిల్లల సాంస్కృతిక, ఇతర పోటీలలో పాల్గొన్న విద్యార్ధులకు చాకలేట్లు పంచుతున్న ఈ తెలుగు వాలంటీర్ భార్గవ రాంఈ రోజు Easyway Learn Mathematics -by రాం, Fun with Maths పుస్తకాలను ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆవిష్కరించారు.

కార్యక్రమాలను ఆసక్తితో తిలకిస్తున్న పుస్తక ప్రియురాలైన ఒక చిన్నారి
ఈ రోజు సందర్శకులు బాగానే వచ్చారు పుస్తక ప్రదర్శనకు. kinige.com ఇప్పుడు పని చేస్తుంది. పలు తెలుగు, ఆంగ్ల పుస్తకాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కినిగె సేవలు లభ్యం. ఆది బ్లాగరు చావా కిరణ్ ఈ కినెగె ప్రాజెక్ట్ వెనుకున్న వారిలో ఒకరు. పుస్తక ప్రియులు దర్శించతగ్గదీ వెబ్ సైట్. ఓ లుక్కేయండి.

ఈ తెలుగు స్టాల్ వద్ద కంప్యుటర్లో తెలుగు గురించి ఆసక్తిగా చూస్తున్న సందర్శకులు

స్టాల్ సందర్శకులలో వరవరరావు (విప్లవ కవి) ఉన్నారు. జె.పి.(ప్రాణహిత) సాయంతో తెలుగు బ్లాగు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఈ తెలుగు స్టాల్ లో వాలంటీర్లు భార్గవ రాం, కౌటిల్య, ప్రవీణ్ శర్మ (శ్రీకాకుళం), లినక్స్ ప్రవీణ్ (telugulinux.blogspot.com).స్టాల్ కు వచ్చిన బ్లాగర్లలో కత్తి మహేష్ కుమార్, సతీష్ యెనమండ్ర (ఆకాశంలో -ningi.wordpress.com), నాగ మురళి, ఇంగ్లీష్ సుజాత (గడ్డిపూలు), క్రిష్ణప్రియ (krishna-diary.blogspot.com).ఉన్నారు.


ఈ తెలుగు స్టాల్ లో (కూర్చున్న ఎడమనుండి కుడి వైపు): ప్రవీణ్ శర్మ (శ్రీకాకుళం) , సి.బి.రావు. నుంచున్న వారు: నాగ మురళి

Photo Credits

Hyderabad Book Fair

and

cbrao -Nikon D90

1 వ్యాఖ్య:

Buchchi Raju చెప్పారు...

please watch
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి