శుక్రవారం, డిసెంబర్ 17, 2010

ప్రారంభమైన హైదరాబాద్ పుస్తక ప్రదర్శన -2010


Hyderabad Book Fair   Photo by: cbrao -Nokia 5800 

హైదరాబాద్, డిసెంబర్ 16 :'ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ముందు మంత్రి పదవి వస్తుందా రాదా అనే ఆందోళనతో చా లా ఒత్తిడికి గురయ్యా. ఈ ఒత్తిడి నుం చి ఎలా బయటపడాలా అని ఆలోచిం చా. వెంటనే ఓ మంచి పుస్తకం చదవాలనిపించింది. దగ్గరలో ఉన్న ప్రజాశక్తి బుక్‌హౌస్‌కి వెళ్లి 'మేకర్స్ ఆఫ్ మోడర న్ ఇండియా' అనే పుస్తకాన్ని రాత్రం తా చదివా. దాంతో ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కలిగింది. ఉదయాన్నే నా కు మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కిందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల య్యా' అన్నారు గ్రామీణాభివృద్ధిశాఖ మాత్యులు డొక్కా మాణిక్య వరప్రసా ద్. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన 25వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పుస్తకాలను చదివే అలవాటును భావితరాలకు నేర్పించాల్సిన అవసరం ఎం తైనా ఉందన్నారు.


 Book fair Inauguration          Photo by: cbrao -Nokia 5800

 ఓ మంచి పుస్తకం చదవడం వల్ల దేశం, కుటుంబం గర్వపడేలా తయారవుతామన్నారు. ఇంటర్నెట్ యుగంలో కూడా పుస్తక పఠనానికి ఇంకా ఆదరణ ఉందనడానికి ఇర వై ఐదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ పుస్తక ప్రదర్శనే నిదర్శనమన్నారు.ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు ఉచితంగా నోట్ పుస్తకాలను ఇవ్వడానికి బుక్‌ఫెయిర్ సొసైటీ ముందుకు రావాలని సూచించారు. హైదరాబాద్ సంస్కృతిని పెంపొందించడంలో ఈ బుక్‌ఫెయిర్ పాత్ర ప్రశంసనీయం అన్నారు. బుక్ ఫెయిర్ అధ్యక్షుడు శ్రీనివాసరా వు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఎంతపెరిగినా బుక్ రీడింగ్‌కి ఆదరణ తగ్గలేదన్నారు. ఇది కొన్ని సర్వేల్లో నిరూపితమైందన్నారు.

కొలువు దీరిన స్టాల్స్..
ఈ పుస్తక ప్రదర్శనలో 250 బుక్ స్టాల్స్ కొలువుదీరాయి. అందులో పది ప్రముఖ దినపత్రికలకు చెందిన స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. కేంద్రసాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇందులో స్టాల్స్‌ని ఏర్పాటు చేశారు. ఇది 25వ పుస్తక ప్రదర్శన కావడంతో సిల్వర్ జూ బ్లీ వేడుకలను నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రదర్శనలో ప్రతి రోజు ఓ కొత్త పుస్తకాన్ని ఆవిష్కరించడం, 19వ తేదీన పుస్తక ప్రియులతో పాదయాత్ర నిర్వహించ డం, రచయిత, రచయిత్రులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తామ ని నిర్వాహకులు తెలిపారు. ఈప్రదర్శ న ఈనెల 26 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. ప్రవేశం రుసుం రూ.5గా నిర్ణయించారు. -సిటీలైఫ్ ప్రతినిధి
-ఆంధ్రజ్యోతి దిన పత్రిక సౌజన్యంతో

5 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...

ఉదయాన్నే నా కు మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కిందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల య్యా' .....

ha ha ha !చోటు దక్కలేదని పొద్దున్నే తెలిసి ఉంటే ఒత్తిడి మళ్ళీ మొదటి స్థాయికి చేరి ఉండేదే పాపం!

ఎనీ వే, పుస్తక ప్రదర్శన ప్రారంభమైనందుకు సంతోషం!

ఎంతైనా డిసెంబర్ ఖర్చు నెల! ఇటుపక్క పుస్తక ప్రదర్శనా, మరో పక్క శిల్పారామంలో క్రాఫ్ట్స్ ఫెస్టివలూ!

సుజాత వేల్పూరి చెప్పారు...

అవునూ, ఈ సారి పార్కింగ్ కూడా లోపలేనా? లోపలేవో సుమో, మరో కారూ కనిపిస్తున్నాయి?

kidding:-))

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

పుస్తక ప్రదర్సన గురించి రాసారు. చాలా సంతోషం. పోతే, తెలుగు బ్లాగర్ల స్టాల్ సంగతి ఏమిటి? బహుశా ఆంద్ర జ్యోతి వార్తను యధాతధంగా ఇవ్వడం వల్ల ఆ ప్రసక్తి రాలేదనుకుంటున్నాను.- భండారు శ్రీనివాసరావు

cbrao చెప్పారు...

@సుజాత: డిసంబర్ మాసంలో డబ్బు ఖర్చయినా, ఇష్టం గా జరిగేదేగా. అది సంతోషాన్నే మిగల్చగలదు. చాయా చిత్రం లో మీకు కనిపిస్తున్న వాహనాలు స్టాల్ వాళ్లవి. వాటిని ప్రదర్శన వేళలకు ముందు రానిస్తారు. వాటిల్లోనే పుస్తకాలు వగైరాలు ప్రదర్శనకు చేరతాయి. సరే! మన ఈ-తెలుగు స్టాల్ కు ఎప్పుడొస్తున్నారు?

cbrao చెప్పారు...

@భండారు శ్రీనివాస రావు: "పోతే, తెలుగు బ్లాగర్ల స్టాల్ సంగతి ఏమిటి? "
-మన ఈ-తెలుగు స్టాల్ గురించి వ్రాయకుంటే ఎట్లా? దానిపై ప్రత్యేక వ్యాసం ఇక్కడ చూడండి. ఒకమారు పుస్తక ప్రదర్శనశాలకు విచ్చేసి మన స్టాల్ లోని మిత్రులను కలువ కోరుతాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి