బుధవారం, మార్చి 30, 2011

బ్లాగులు- వ్యాఖ్యలు -12

Click on photo to enlarge   Photo:cbrao

హాలెబీడు, కర్ణాటక, దేవాలయంలో బూతు బొమ్మలు. దేవాలయాలపై   బూతు బొమ్మలెందుకో తెలుసుకోవాలంటే ఇక్కడ చదవండి.

ఉషా మాధవం...శాన్ అంటోనియో సంక్రాంతి సంబరం!

డెట్రాయిట్, టెక్సాస్ లో సాహితీ చైతన్యం వెల్లివిరుస్తుంది. నిడదవోలు మాలతి గారు కూడా ఇప్పుడు డాలస్ వచ్చేసారని విన్నాను. గోవింద రాజు మాధవరావు గారిని పరిచయం చేసినందుకు ప్రమోదం.

http://afsartelugu.blogspot.com/2011/01/blog-post_27.html

దిన చర్య

@మాగంటి వంశీ మోహన్:  కవితలు నేను వ్రాయటమా?  అంత సీన్ లేదు. ఈ కవిత పెరుగు రామ కృష్ణ (ఫ్లెమింగో  ఫేం)  గారు వ్రాసినది. చదవగానే ఏదో ఆకర్షణ నాకు ఈ కవితలో కనిపించి, రచయిత అనుమతి లేకుండానే ప్రచురించాను. ఫేస్ బుక్ లో సాహిత్యనిధి అనే గుంపులో కొత్తగా సభ్యుడిగా చేరాను. అక్కడ లభించిన రత్నమే ఈ కవిత. దీప్తిధార పాఠకుల సౌలభ్యం కోసం  ఇక్కడ పోస్ట్ చేశాను. ఈ రచయిత గురించి రెండు మాటలు.  రామకృష్ణ పెరుగు కవితలు ఫ్లెమింగో 7 భాషలలో అనువాదమయ్యింది.  దినచర్య కవిత కూడా ఆంగ్లంలో అనువాదమయి ప్రచురించబడింది. కవిత్వం పై ఆసక్తి కలవారు ఫేస్ బుక్ లోని సాహిత్యనిధి లో సభ్యులు కావచ్చును.
@RK :  నైకాన్ డి90 (Nikon D90)  కొన్న కొత్తల్లో, ఇంకా ఆ కెమేరా ను పూర్తిగా అధ్యయనం చేయకముందే  హవాయ్  వెళ్లటం జరిగింది.  మావి, బిగ్ ఐలాండ్ (హవాయ్)  ల లో నేను తీసిన ఛాయాచిత్రాలు తృప్తికరంగా వచ్చాయి.  ఛాయాగ్రహణం, పక్షులను చూడటం (Bird Watching -Ornithology) నాకు ఇష్టమైన విషయాలు.  Big Island (Hawaii)  లోని జ్వాలా ముఖి చిత్రం బ్లాగులు- వ్యాఖ్యలు -6   లో చూడవచ్చును.       

http://deeptidhaara.blogspot.com/2011/01/blog-post_27.html

వీధి పిల్లలు - మహె జబీన్

జాన్ కీట్స్, వర్డ్స్‌వర్త్ వంటి మహనీయుల కవితలను మన విద్యార్థులు 10 వ, ఇంటర్మీడియట్  తరగతులలో చదువుతున్నారు. ఈ Stree Children కవితను 10 వ తరగతి పిల్లలు అర్థం చేసుకోగలరనే తలంపు. వీధి బాలల లను అర్థం చేసుకోవటానికి, వారి సమస్యలపై సానుభూతితో స్పందించటానికి ఈ కవిత దోహద పడగలదని నమ్మే ఈ కవితను పాఠ్యాంశంగా ఉంచారని తలుస్తాను.

http://deeptidhaara.blogspot.com/2011/02/blog-post.html

నాకు దొరికిన అరుదైన పాతపుస్తకాలు

మంచి పుస్తకాల సేకరణ. మీ అభిరుచికి అభినందనలు. బెజవాడ లో  పాత పుస్తకాలు వారాంతంలోనా లేక  ప్రతిరోజూ లభ్యమవుతాయా? ఈ పుస్తకాలకై ఎక్కడ వెదకాలి?

http://pustakam.net/?p=6418

గైడ్ హిందీ సినిమా - ఆకాశమే హద్దు!

తన కధ గైడ్  కు చేసిన మార్పులు, చేర్పులకు వ్యధ చెంది ఆర్.కె.నారాయణ్ ఆ సినిమాను disown  చేశారు. మీ వ్యాసం ద్వారా దెబ్బతిన్న రచయిత మనోభావాలు  తెలిశాయి. నిర్మాతలు రచయితకు ఏమీ ఇవ్వకపోవటం అన్యాయమే. అయితే ఈ సినిమా ద్వారా రచయిత జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి పొందారు.  

http://saahitya-abhimaani.blogspot.com/2011/03/blog-post_17.html

"గొరుమార నేషనల్ పార్క్ లో రెండు రోజులు !"

గోరుమార అడవి సౌందర్యాన్ని మా ముందు నిలిపారు. నీలాకాశం నిండిన చిత్రం ఐతే  మనొహరంగా ఉంది.  అటు అడవి, ఇటు వనవాసి  సాహితీ సొబగులను చక్కగా అందించారు. త్వరలో జల్దా పారా వైల్డ్ లైఫ్ సాన్క్చురీ విశేషాలు కూడా అందించగలరు.

http://paapaai.blogspot.com/2011/03/blog-post_28.html

"ప్రయాణంలో పదనిసలు - 1"
 వా! చిత్రాలతో ఒక కధ చెప్పేసారే! అభినందనలు.
http://4psmlakshmi.blogspot.com/2011/03/1.html

మీరు పక్షులను ప్రేమిస్తారా?

Click on photo to enlarge

ఈ వేసవిలో పక్షులు నీటిని వెతకటానికి తమ శక్తి    అమితంగా  ఖర్చు చేస్తాయి. ప్రస్తుతం 37 సెంటిగ్రేడ్ నుంచి  ఉష్ణొగ్రత  పై పైకి పోతుంది.  పక్షులకు అందుబాటులో  మీ బాల్కనీలలో  నీటిని ఉంచండి. పక్షుల మరణాలను నివారించండి.పర్యావరణాన్ని రక్షించండి.

మంగళవారం, మార్చి 29, 2011

నీడ (లఘు చిత్రం)

ఈ లఘు చిత్ర కధ ఊహించని మలుపులు తిరుగుతూ తుది దాకా ఉత్కంఠగా సాగుతుంది. Suspense  Thriller   వర్గంలో ఈ చిత్రం చేరుతుంది. ఈ చిత్ర దర్శకులు ఈ చిత్రాన్ని హీరో రవితేజ కు చూపిస్తే   ,    వారికి రవితేజ  దర్శకత్వ అవకాశం కల్పించే అవకాశం చాలా ఉంది.
Canon EOS 7 D   కెమేరా కు ధన్యవాదాలు.


శనివారం, మార్చి 26, 2011

హైదరాబాదు లో ఇంట్లో పాక్షిక పనిచేస్తూ $8795/- ల నెలసరి సంపాదన

అవునండీ మీరు ఏ వస్తువులు అమ్మనవసరం లేదు, అవతలివారు ఎలాంటి వస్తువులు కొన అవసరం లేదు. ఇంట్లో       పార్ట్ టైం పని చేస్తూ  నెలకు సుమారు   $8795/- లు సంపాదించటం సాధ్యమే నంటున్నారు ఇక్కడి  కెల్లి రిచర్డ్స్. నమ్మశక్యం గా లేదు కదూ. USA Times daily  వారి వ్యాసంలో ఈ విషయమై మరింత సమాచారం మీరు ఇక్కడ చూడవచ్చు.

మంగళవారం, మార్చి 22, 2011

ఏమి జీవితం! (హాస్య లఘు చిత్రం)

బ్లాగులు చదివి, దెబ్బకు ఠా, దొంగల ముఠా సినిమా చూసి బుర్ర వేడెక్కిందా ?  దాన్ని చల్లపరచటానికే ఈ ప్రయత్నం . Canon 5D Mark II  పుణ్యం తో  మీరు కూడా ఒక సినిమా నిర్మాత, దర్శకుడు  కావచ్చు.  ప్రశాంత్ వర్మ రచన, దర్శకత్వం  లో  వచ్చిన  ఈ హాస్య చిత్రం చూసి కాస్త రిలాక్స్ కండి.  

ఆదివారం, మార్చి 20, 2011

ఛాయాగ్రాహకుడు డి. రవీందర్ రెడ్డి ఫొటో గాలరీ ఆవిష్కరణ

  D Ravinder Reddy  Photo: cbrao

1964 లో, పెద్దపల్లి (కరీంనగర్) లో జన్మించిన రవీంద్రరెడ్డి, ఆంధ్రప్రదేష్ గర్వించతగ్గ ఛాయాచిత్రకారులలో ఒకరు.

Photo courtesy: Ravinder Reddy Click on photographs to enlarge

డిశంబర్  6, 1992  లో అతి ప్రమాదకర పరిస్థితులలో  బాబ్రి మసీదు విధ్వంసం ఛాయాచిత్రాలను తీసి, ప్రాణాలుగ్గపెట్టి, కరసేవకుల నుంచి తప్పించుకొని అయోధ్య రైల్వేస్టేషన్ కు వెళ్లి అక్కడి నుంచి ఫరిదాబాద్, లక్నో ల మీదుగా ఢిల్హి  వెళ్లి ఇండియా టుడే, టైం పత్రికలకు    సకాలంలో చిత్రాలను  అందించే సాహసం చేసినవాడు రవీందర్. లాతూర్(మహారాష్ట్ర) లో  భూకంపం వచ్చినప్పుడు, మృత శిశువు చెయ్యి  శిధిలాల్లోంచి  పైకి  వచ్చి కనిపించే దృశ్యం చూస్తే గుండె ఝల్లుమనకమానదు.  రవీందర్ చిత్రాలలోని మానవీయత  చూపరులను ఆకట్టుకుంటుంది. రవీందర్ జీవితం లో ఇలాంటి ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. వాటికి అందుకున్నపురస్కారాలు ఎన్నో. రవీందర్ జీవిత విశేషాలు, తన ఛాయాచిత్ర పుస్తకాలు వగైరా విశేషాలతో  కూడిన ఈ చిన్న లఘు చిత్రం చూడండి. ఈ చిత్రం చూశాక రవీందర్ ఇంత మంచి పేరు ఎలా సంపాదించాడో మీకే అర్థమవగలదు. 

Video courtesy: Ravi Studios

Goddess Photo courtesy: Ravinder Reddy

ఏప్రిల్ 18 సాయంత్రం 7 గంటలకు సోమాజీగూడా (రాజ్‌భవన్ రోడ్) లోని  ఛాయాచిత్ర ప్రదర్శనశాలకు వెళ్లేసరికి చాలా మంది మిత్రులు, పత్రికా విలేఖరులు, టి.వి.ఛానెల్ వాళ్లు ఇంకా ఎంతో మంది ఛాయాచిత్రకారులు ప్రదర్శనశాలను ఆవిష్కరించే ప్రఖ్యాత కళా విమర్శకుడు, కళాఖండాల సేకరణకర్త  (Jagdish and Kamla Mittal Museum of Indian Art ) జగ్‌దీష్ మిట్టల్ కోసం నిరీక్షిస్తూ కనిపించారు. ఈ నిరీక్షణ సమయంలో  కొత్త మిత్రుల పరిచయం, పాత మిత్రులతో కబుర్లు  చెప్తూ సమకాలీన ఛాయాచిత్ర కళ గురించి  మాట్లాడుతున్న సమయంలో  ముఖ్య అతిధి వచ్చేశారు. మిట్టల్ గారితో మేమూ లోనికి ప్రవేశించి  అక్కడ  చక్కగా  ప్రదర్శించిన  Colours of Hyderabad  ఛాయాచిత్రాలు చూసి ఆనందించాము. ఇది Group Exhibition.   ఈ ప్రదర్శనలో నాకు తెలిసిన, తెలియని   ఛాయాచిత్రకారుల బొమ్మలు ప్రదర్శనలో ఉన్నాయి. 

Jagdish Mittal lighting the lamp  Photo:cbrao

జగ్‌దీష్ మిట్టల్ గారు దీపప్రజ్వలన గావించి ప్రదర్శన ప్రారంభించారు. చిత్రంలో ఎడనుంచి కుడి వైపు: జగదీష్ మిట్టల్ (జ్యోతి  ప్రజ్వలనం చేస్తూ), M.V.రమణారెడ్డి ( Sculptor & Painter),  లక్ష్మణ్ ఏలే (చిత్రకారుడు, ఛాయాగ్రాహకుడు), దీపికా రెడ్డి (కుచిపూడి నర్తకి) మరియు శ్రీధర్ (Portrait Artist) 

 Colors of Hyderabad Photo courtesy: Srinivas

జగ్‌దీష్ మిట్టల్ మాట్లాడుతూ ఇంత చక్కటి ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు, రవీందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.   రవీందర్ రెడ్డి  బదులిస్తూ," పాత చిత్రాల నెగటివ్‌లు సంపాదించి, వాటిని భవిష్యత్లో ప్రదర్శనలో ఉంచుతాము. ఛాయాగ్రహకుడిగా నేను ఎంత పేరు తెచ్చుకున్నా , ఈ రోజు జరుగుతున్న గాలరీ ఆవిష్కరణ తో నా చిరకాల వాంఛ నెరవేరింది. ఛాయాగ్రాహకులు దృశ్య చారిత్రకారులు. ఈ ప్రదర్శన కు సహకరించిన  వారందరికీ ధన్యవాదాలు" అన్నారు.  

Puppets in cage  Photo courtesy: Aelay Laxman

ఈ " హైదరాబాదు రంగులు" ప్రదర్శనలో  సుమారు 35 మంది ఛాయాచిత్రకారులు పాల్గొంటున్నారు. ఈ చిత్రాలు కొన్ని రంగుల ప్రాధాన్యతను కలిగిఉంటే, మరికొన్ని ఆకార, చీకటి వెలుగుల   ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.  రవీందర్ రెడ్డి The Goddess చిత్రం  హైదరాబాదు దేవాలయాలలోని సంస్కృతిని చక్కగా  పొదివిపట్టింది. సంతోష్ తీసిన The Pottery Wheel  చక్రం, దాని కింద ఉన్న ఎన్నో చిన్న ప్రమిదలను ఆకర్షణీయమైన    ఆకృతిలో చూపించింది. జనార్ధన్ Paper Weight చిత్రం తనలో  ఇంద్రధనస్సు రంగులను  నింపుకొంది.శ్రీనివాస్  చిత్రం Crop Protection  ఒక పెయింటింగ్ లా  ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. Urban Landscape  అనే సుశీల్ కపాడియా చిత్రం  నగరం లో మనం చూడని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది.  Puppets in cage అనే చిత్రం ద్వారా  చిత్రకారుడు ఏలే  లక్ష్మణ్  లోని ఛాయాచిత్రకారుడిని చూస్తాము. ఈ ప్రదర్శన లోని చిత్రాలు సందర్శకులను ఆహ్లాదపరుస్తాయి. ఆ చిత్రాలలోని రంగులు, చార్మినార్,  హైదరాబాదు ప్రజలు, పక్షులు, జింక చిత్రాలు  స్మృతిపధంలో ఉండిపోతాయి.
ఈ ప్రదర్శన  ఏప్రిల్ నెల 3 దాకా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. చూడతగ్గ ప్రదర్శన. 

Ravi Photo Gallery
Near YAMAHA SHOW ROOM
Rajbhavan road, Somajiguda,
Hyderabad.
Phone:
040-23411122
040-23404363
9866 332244

శుక్రవారం, మార్చి 18, 2011

Facebook కబుర్లు



Madam: Useless Bai !!!.. Why didn’t you come last week? And that too without informing me??????
Kamwali Bai: O Myadam... I had updated my Facebook status as "Will be out of town for a week..". Saaheb knows.
He even commented "Come soon... Miss U!!"


ఫేస్‌బుక్ ఇప్పుడు అత్యంత ప్రాచుర్యం చెందిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్.  కాలేజ్ విద్యార్ధులకోసం ప్రారంభించినా, నేడు ఇది ఆ బాల గోపాలానికి కబుర్లు, చిత్రాలు, వీడియోలు పరస్పరం పంపుకోవటానికి అనువైన వేదికగా తయారయ్యింది. అంతే కాదు తెలంగాణా ఉద్యమం నుంచి టునీసియా, ఈజిప్ట్ , లిబ్యా వగైరా దేశాల ప్రజా ఉద్యమాలకు కారణభూతమయ్యింది. జపాన్ లాంటి దేశాల్లో జరిగిన ప్రకృతి వైపరీత్యాలు వగైరా వార్తలను ప్రపంచ వ్యాప్తంగా, సత్వరం పంపటానికి దోహదపడుతూంది.


మొన్న మా ఇంటికొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధిని ప్రియాంక తో పిచ్చాపాటి మాట్లాడుతూ, నేనన్నాను ' సగటున వారానికి ఒక Friendship request నాకు వస్తూంటుంది '. ప్రియాంక అన్నది ' అంకుల్, ఇదే ఆడపిల్లలకైతే ఇంకా ఎక్కువగా వస్తాయి ' అని. మీరు కూడా ఇలాగే అసంఖ్యాకమైన అభ్యర్ధనలు అందుకుని ఉండవచ్చును. నాకు అభ్యర్ధన పంపే వారు చాలా సందర్భాలలో,తెలియనివారే. తెలియనివారి అభ్యర్ధన ఎలా మన్నించటం? Yes చెప్పకపోతే అవతలవారు నొచ్చుకొంటారేమోనని సందిగ్ధం మనసులో పీకుతూ ఉంటుంది. కొన్ని పర్యాయాలు, తెలిసినవారిని కూడ వారి వాడుక పేరు భిన్నంగా ఉండటంతో, గుర్తించక అభ్యర్ధనకు బదులివ్వని సందర్భాలు కూడా నాకు అనుభవమే.


అభ్యర్ధనలకు బదులివ్వకపోవటం మర్యాద కాదు. అయితే తెలియనివారిని స్నేహితులుగా అంగీకరించటం మనసుకు నచ్చని పని. అందుకని మధ్యే మార్గంగా, అభ్యర్ధనలు పంపే వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ, వారిని గుర్తించలేకపోయానని, వారి పరిచయం పంపమని అభ్యర్ధిస్తూ ఆంతరంగిక సందేశాలు ఫేస్‌బుక్ ద్వారా పంపేవాడిని. ఇలా పది ఉత్తరాలు వ్రాస్తే ఒక బదులు వచ్చేది. వారిని వెంటనే నా మిత్రులుగా అంగీకరించేవాడిని. అయితే మిగతా తొమ్మిది మందికి ఎన్ని reminders పంపినా జవాబొచ్చేది కాదు. వారి పరిచయం పంపటం ఇష్టం లేని వారు,నా స్నేహితులుగా అనర్హులు అని నిర్ణయం తీసుకుని వారి అభ్యర్ధన hide లో ఉంచటం జరిగింది. అభ్యర్ధన పంపే వారి స్నేహితుల సంఖ్య ఎంతో చూసేవాడిని. కొంతమందికి రెండు వేలు పైచిలుకు మిత్రులుంటే, స్నేహితుల status లను గమనించే స్థితి కాని వారికి బదులిచ్చే వ్యవధి కాని వారికుండదని గమనించి వారి స్నేహపు అభ్యర్ధనలను hide లో ఉంచాను. నాకు ఇంతమంది స్నేహితులున్నారని బడాయిగా చెప్పుకోవటానికి ఆ సంఖ్య వారికి ఉపయోగపడకలదు, అంతే.

అపరిచితులను స్నేహితులుగా అంగీకరిస్తే వచ్చే అనర్ధాలకు గురి కాకుండా తగు జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంది.

గురువారం, మార్చి 17, 2011

ఆనాటి గుంటూరు జిల్లా

Click on image to enlarge

ఆనాటి గుంటూరు జిల్లా (1788 -1848) రచన ఒక నిశిత పరిశీలన.1965 లో ఆక్స్ఫర్డ్ ప్రచురించిన ఈ చారిత్రక గ్రంధం మిగిలిన జిల్లాలకు నమూనాగా పనికి వస్తుంది. అప్పటి గుంటూరు పరిపాలనలో తిరిగిన మలుపులు, జమిందారీల ఒడుదిడుకులు,విలాస పాలకులక్రింద సామాన్య జనజీవితం,కళ్ళకు కట్టినట్లు రచయిత ఆధార సహితంగా పాఠకుల ముందు పెట్టారు. కృష్ణా  బరాజ్ నిర్మాణం ముందు జిల్లా ఎలా వుండేది ,దాత కరువు ప్రజల్ని కుదిపి పారిపోయెట్లు చేసిన దారుణం కళ్ళకు కట్టినట్లు చూపారు.ఆనాడు ధర్మం నాలుగు పాదాల పై నడిచేదనే భ్రమను పటాపంచలు చేశారు. మహారాష్ట్ర నుండి తరలి వచ్చిన బ్రాహ్మణులు పదవులు స్వీకరించి బ్రిటిష్ పాలకులను ముప్పు తిప్పలు పెట్టిన తీరు, నోరు నొక్కుకునేట్లు చేస్తుంది. బ్రిటీష్ పాలకుల పరిపాలనా అసమర్ధత , బంధు పక్ష పాతం, అవినీతి కనువిప్పు కలిగిస్తుంది.

వాసిరెడ్డి జమిందారు, మిగిలినవారు ఎలా వున్నారనేది ఆకర్షణీయంగా రాసారు.16 అధ్యాయాలలో 300 పుటల చరిత్ర చదివించేదిగా సాగింది. జమిందారీలను అతి జాగ్రత్తగా హరించిన బ్రిటీష్ పాలనాతీరు బాగున్నది. గ్రామాలలో కరణాలు, బ్రిటీష్ పాలకులను ఏడిపించిన తీరు అబ్బురంగా వున్నది. గ్రామ పాలన లోతుపాతులను   ఇంత బాగా ఎలా అధ్యయనం చేశారో అనిపిస్తుంది.రెవిన్యూ పాలన లొసుగులను చక్కగా కనబరిచారు. కలక్టర్లను  నిలకడగా వుంచకుండా
తరచూ మార్చడం వలన జరిగిన ప్రమాదాన్ని అవగాహన చేసి చూపారు. ఆనాటి జిల్లా పటాలను , ప్రముఖ కట్టడాలను నమూనాగా ఇచ్చారు . పరిశీలక ప్రమాణ గ్రంధాల పట్టిక గమనార్హం.

ఇదే తీరులో ఇతర జిల్లాల చరిత్ర రాస్తే, రాష్ట్ర చరిత్ర శాస్త్రీయంగా
వుంటుందని రచయిత వెలిబుచ్చిన మాట సబబుగా వున్నది. రచయిత రాబర్ట్  ఎరిక్ ఫ్రికన్ బర్గ్, ఊటీలో పుట్టి,  గుంటూర్ జిల్లాలో, బాల్య దశ లో 12 ఏళ్ళు గడిపారు. తెలుగు మాట్లాడడం  వచ్చు.అమెరికా వెళ్ళి విస్కాన్సిన్ యూనివర్సిటిలో వుంటూ, అనేక పర్యాయాలు ఇండియా పర్యటించి రికార్డులు సేకరించి తన తొలి గ్రంధం గా గుంటూర్ జిల్లా రాశారు . తెలుగులో తన మొదటి రచన రావాలనే రచయిత కోర్కె ను, ఇన్నయ్య, ఈ అనువాదం ద్వారా తీర్చారు.
 
తెలుగులో తొలి ప్రచురణ: మార్చ్ 2011. ఈ పుస్తకం అక్షర,బంజారా హిల్స్, నవోదయ, కాచిగూడ క్రాస్ రోడ్స్, హైదరాబాదు లో లభ్యమవుతుంది. ధర రూ.500/-  

ఈ పుస్తకాన్ని ఇక్కడనుంచి ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు లేదా చదవవొచ్చు.


సోమవారం, మార్చి 14, 2011

నేను కలిసిన ముఖ్యమంత్రులు మానవవాదులు - పుస్తకావిష్కరణ

చిత్రంలో ఎడమనుంచి కుడివైపు: మాజీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్  పద్మాజారెడ్డి, మాజీ మంత్రి పురుషోత్తం రావు, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య  మరియు ఎస్‌వి పంతులు (Indian Peasants Forum)
Photo:cbrao
హైదరాబాద్‌,(కెఎన్‌ఎన్‌): తెలంగాణ అంశం సున్నితమైనదని,దానికి పరిష్కారం హైదరా బాద్‌లో కూర్చుని మాట్లాడికుంటే పరిష్కారం అయ్యేది కాదని,కేంద్రమే అంశాన్ని తేల్చాల్సి ఉందని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని లోతుగా పరిశీలిస్తుందని, అందుకోసమే శ్రీకృష్ట కమిటీ రిపోర్టును సైతం పరిశీలనలో ఉంచుకుందని తెలిపారు. ఇప్పటికే ప్రజల మధ్య రాగద్వేషాలు పెరిగిపోయాయని, సమస్యను పరిష్కరించి,స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పేందుకు కేంద్రం కృషి చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అదివారంబషీర్‌బాగ్‌ ప్రెస్‌కబ్ల్‌లో సీనియర్‌ పాత్రికేయుడు, మానవతావాది నరిశెట్టి ఇన్నయ్య రచించిన 'నేను కలిసిన ముఖ్యమంత్రులు, మానవవాదులు' అనేపుస్తకాన్ని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆవిష్కరించాడు. అంధ్రప్రదేశ్‌ అభివృద్దికి అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని విభజనల పేరిట చెడ గొట్టు కోవద్దని సూచించారు. సాధారణ పౌరుడిగా ఆలోచిస్తే ఎవరి వాదనలను సహే తుకంగా చెప్పాల్సిన అవసరం ఉందని, అప్పుడే సమస్య పరిష్కారానికి ఆస్వారం ఉంటుందని అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం వారికి నచ్చిన విధంగా ఉంటేనే తాము ఒప్పు కుంటామని మెండి పట్టుదలతో ఉన్నందున సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. నాడు విద్యార్ది స్ధాయి నుండి రాజకీయాల్లో పాల్గొన్నవారిమని,తాము రాజకీయ శిక్షణా తరగతులకు హజరయ్యేవారమని గతాన్ని గుర్త చేశారు. నేటి రాజకీయాల్లో డబ్బులు ఉంటే చాలు ఎలాంటి అనుభవం లేకున్న ఇష్టం వచ్చిన పార్టీలోకి చేరి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారంటు కడప ఎంపి జగన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విద్యార్ధి దశనుండి ఇన్నయ్య తనకు దగ్గరగా ఉండేవాడని,తాను గుంటూరు హిందుకాలేజీ విద్యార్ధిగా ఉండగా ఇన్నయ్య ఎసికాలేజీ విద్యార్ధిగా ఉండేవాడని,ఇరువురు కలసి తాజా రాజకీయ పరిస్ధితులపై చర్చించుకునే వారి మని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాము విద్యార్ధి దశలోనే detention విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాలను చేశామని తెలిపారు. మాజీ మంత్రి పురుషోత్తం రావు మాట్లాడుతూ ఇన్నయ్య అప్పటితరం నేతల నుండినేటి తరం నేతల వరకు సన్నిహితంగా ఉండేవాడని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మహిళా కమిషన్‌ చెర్మన్‌ పద్మాజారెడ్డి, ఎస్‌వి పంతులు, వెంకటరత్నం, నాగలక్ష్మి, మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

News courtesy: Andhraprabha Online

గురువారం, మార్చి 10, 2011

హైదరాబాదులో గొడవలతో విసిగి పోయారా?

Photo courtesy: Merinews

కొన్నాళ్లు వేరే రాష్ట్రం వెళ్తే  బాగుంటుందనుకుంటున్నారా?  భారతదేశం లో అన్ని రాష్ట్రాలలో ఏదో ఒక గొడవున్నా,  ఒకటన్నా మీ అభిరుచికి తగ్గట్లు ఉండకపోదు.  మీకు నచ్చిన రాష్ట్రం ఎంచుకోవటానికై అక్కడి ప్రజలను పరిచయం చేస్తున్నా.  చదివాక మీకు ఏ రాష్ట్రం నచ్చిందో తెలియ చేస్తారు కదూ!

HOW TO IDENTIFY DIFFERENT CITIZENS OF
INDIA

Scenario 1

Two guys are fighting and a third guy comes along, sees them and walks on.


That's MUMBAI
------------ --------- --------- --------- -

Scenario 2

Two guys are fighting.
Both of them take time out and call their friends
on their mobiles.
Now 50 guys are fighting.


You are definitely in PUNJAB!!!
------------ --------- --------- --------- -

Scenario 3

Two guys are fighting and a third guy comes along and
tries to make peace.
The first two get together and beat him up.


That's DELHI
------------ --------- --------- --------- -

Scenario 4

Two guys are fighting.
A crowd gathers to watch.
A guy comes along and quietly opens a Chai-stall.

That's AHMEDABAD
------------ --------- --------- --------- -

Scenario 5

Two guys are fighting and a third guy comes.
He writes a software program to stop
the fight.
But the fight doesn't stop because of a virus in
the program.

That's BANGALORE
------------ --------- --------- --------- -

Scenario 6

Two guys are fighting. A crowd gathers to watch.
A guy comes along and quietly says that
"AMMA" doesn't like all this
nonsense.
Peace settles in...

That's CHENNAI
------------ --------- --------- --------- -

Scenario 7

Two guys are fighting and a third guy comes along, then
a fourth and they start arguing about who's right.


You are in KOLKATA
------------ --------- --------- --------- -

Scenario 8

Two guys are fighting.
Third guy comes from nearby house and says,
"don't fight in front of my place,
go zumwhere yelse and kyeep fighting".


That's KERALA !
------------ --------- --------- --------- -


and the best one is ....
Scenario 9

Two guys are fighting.
Third guy comes along with a carton of
beer.
All sit together drinking beer and abusing each other
and all go home as friends.


You are in GOA !!!

Source:Internet